Chronicles II - 2 దినవృత్తాంతములు 13 | View All
Study Bible (Beta)

1. రాజైన యరొబాము ఏలుబడిలో పదునెనిమిదవ సంవత్సరమందు అబీయా యూదావారిమీద ఏలనారం భించెను.

1. In the eighteenth year of king Yarov`am began Aviyah to reign over Yehudah.

2. అతడు మూడు సంవత్సరములు యెరూష లేమునందు ఏలెను; అతని తల్లిపేరు మీకాయా, ఆమె గిబియా ఊరివాడైన ఊరియేలు కుమార్తె.

2. Three years reigned he in Yerushalayim: and his mother's name was Mikhayahu the daughter of Uri'el of Gevah. There was war between Aviyah and Yarov`am.

3. అబీయాకును యరొబామునకును యుద్ధము కలుగగా అబీయా నాలుగు లక్షలమంది పరాక్రమ శాలుల సైన్యము ఏర్పరచుకొని యుద్ధమునకు సిద్ధముచేసెను; యరొబామును ఎనిమిది లక్షలమంది పరాక్రమశాలులను ఏర్పరచుకొని అతనికి ఎదురుగా వారిని యుద్ధమునకు వ్యూహపరచెను.

3. Aviyah joined battle with an army of valiant men of war, even four hundred thousand chosen men: and Yarov`am set the battle in array against him with eight hundred thousand chosen men, who were mighty men of valor.

4. అప్పుడు అబీయా ఎఫ్రాయిము మన్యమందుండు సెమరాయిము కొండమీద నిలిచి ప్రకటించినదేమనగాయరొబామా, ఇశ్రాయేలువారలారా, మీరందరును నాకు చెవియొగ్గుడి.

4. Aviyah stood up on Mount Tzemaryim, which is in the hill-country of Efrayim, and said, Hear me, Yarov`am and all Yisra'el:

5. ఇశ్రాయేలు రాజ్యమును ఎల్లప్పుడును ఏలునట్లుగా ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా దావీదుతోను అతని సంతతివారితోను భంగము కాజాలని నిబంధన చేసి దానిని వారికిచ్చెనని మీరు తెలిసికొందురు గదా.

5. Ought you not to know that the LORD, the God of Yisra'el, gave the kingdom over Yisra'el to David forever, even to him and to his sons by a covenant of salt?

6. అయినను దావీదు కుమారుడైన సొలొమోనుకు దాసుడును నెబాతు కుమారుడునగు యరొబాము పనికి మాలిన దుష్టులతో కలిసి లేచి తన యజమానునిమీద తిరుగుబాటు చేసెను.

6. Yet Yarov`am the son of Nevat, the servant of Shlomo the son of David, rose up, and rebelled against his lord.

7. సొలొమోను కుమారుడైన రెహబాము ఇంకను బాల్యదశలోనుండి ధైర్యము లేనివాడై వారిని ఎదిరించుటకు తగిన శక్తిలేకున్నప్పుడు వారు అతనితో యుద్ధము చేయుటకు సిద్ధమైరి.

7. There were gathered to him worthless men, base fellows, who strengthened themselves against Rechav`am the son of Shlomo, when Rechav`am was young and tender-hearted, and could not withstand them.

8. ఇప్పుడు దావీదు సంతతి వారి వశముననున్న యెహోవా రాజ్యముతో మీరు యుద్ధముచేయ తెగించెదమని తలంచుచున్నారు. మీరు గొప్ప సైన్యముగా ఉన్నారు; యరొబాము మీకు దేవతలుగా చేయించిన బంగారు దూడలును మీయొద్ద ఉన్నవి.

8. Now you think to withstand the kingdom of the LORD in the hand of the sons of David; and you are a great multitude, and there are with you the golden calves which Yarov`am made you for gods.

9. మీరు అహరోను సంతతివారైన యెహోవా యాజకులను, లేవీయులను త్రోసివేసి, అన్యదేశముల జనులు చేయునట్లు మీకొరకు యాజకులను నియమించు కొంటిరిగదా? ఒక కోడెతోను ఏడు గొఱ్ఱె పొట్టేళ్లతోను తన్ను ప్రతిష్ఠించుటకైవచ్చు ప్రతివాడు, దైవములు కాని వాటికి యాజకుడగుచున్నాడు.
గలతియులకు 4:8

9. Haven't you driven out the Kohanim of the LORD, the sons of Aharon, and the Levites, and made you Kohanim after the manner of the peoples of other lands? so that whoever comes to consecrate himself with a young bull and seven rams, the same may be a Kohen of those who are no gods.

10. అయితే యెహోవా మాకు దేవుడైయున్నాడు; మేము ఆయనను విసర్జించిన వారము కాము; అహరోను సంతతివారు యెహోవాకు సేవచేయు యాజకులై యున్నారు; లేవీయులు చేయవలసిన పనులను లేవీయులే చేయుచున్నారు.

10. But as for us, the LORD is our God, and we have not forsaken him; and we have Kohanim ministering to the LORD, the sons of Aharon, and the Levites in their work:

11. వారు ఉదయాస్తమయములయందు యెహోవాకు దహనబలులు అర్పించుచు, సుగంధద్రవ్యములతో ధూపము వేయుచు, పవిత్రమైన బల్లమీద సన్నిధిరొట్టెలు ఉంచుచు, బంగారు దీపస్తంభమును ప్రమిదెలను ప్రతి సాయంత్రము ముట్టించుచు వచ్చుచున్నారు; మేము మా దేవుడైన యెహోవా యేర్పరచిన విధినిబట్టి సమస్తము జరిగించుచున్నాము గాని మీరు ఆయనను విసర్జించిన వారైతిరి.

11. and they burn to the LORD every morning and every evening burnt offerings and sweet incense: the show bread also set they in order on the pure table; and the menorah of gold with the lamps of it, to burn every evening: for we keep the charge of the LORD our God; but you have forsaken him.

12. ఆలోచించుడి, దేవుడే మాకు తోడై మాకు అధిపతిగానున్నాడు, మీ మీద ఆర్భాటము చేయుటకై బూరలు పట్టుకొని ఊదునట్టి ఆయన యాజకులు మా పక్షమున ఉన్నారు; ఇశ్రాయేలువారలారా, మీ పితరుల దేవుడైన యెహోవాతో యుద్ధముచేయకుడి, చేసినను మీరు జయమొందరు.

12. Behold, God is with us at our head, and his Kohanim with the trumpets of alarm to sound an alarm against you. Children of Yisra'el, don't you fight against the LORD, the God of your fathers; for you shall not prosper.

13. యరొబాము వారి వెనుకటి భాగమందు మాటు గాండ్రను కొందరిని ఉంచి, సైన్యము యూదావారికి ముందును మాటుగాండ్ర వారికి వెనుకను ఉండునట్లు చేసెను.

13. But Yarov`am caused an ambush to come about behind them: so they were before Yehudah, and the ambush was behind them.

14. యూదావారు తిరిగి చూచి యోధులు తమకు ముందును వెనుకను ఉన్నట్టు తెలిసికొని యెహోవాకు ప్రార్థన చేసిరి, యాజకులును బూరలు ఊదిరి.

14. When Yehudah looked back, behold, the battle was before and behind them; and they cried to the LORD, and the Kohanim sounded with the trumpets.

15. అప్పుడు యూదావారు ఆర్భటించిరి; యూదావారు ఆర్భటించి నప్పుడు యరొబామును ఇశ్రాయేలువారందరును అబీయా యెదుటను యూదావారి యెదుటను నిలువలేకుండునట్లు దేవుడు వారిని మొత్తినందున

15. Then the men of Yehudah gave a shout: and as the men of Yehudah shouted, it happened, that God struck Yarov`am and all Yisra'el before Aviyah and Yehudah.

16. ఇశ్రాయేలువారు యూదా వారి యెదుటనుండి పారిపోయిరి. దేవుడు వారిని యూదా వారిచేతికి అప్పగించినందున

16. The children of Yisra'el fled before Yehudah; and God delivered them into their hand.

17. అబీయాయును అతని జనులును వారిని ఘోరముగా సంహరించిరి. ఇశ్రా యేలు వారిలో అయిదు లక్షలమంది పరాక్రమశాలులు హతులైరి.

17. Aviyah and his people killed them with a great slaughter: so there fell down slain of Yisra'el five hundred thousand chosen men.

18. ఈ ప్రకారము ఇశ్రాయేలువారు ఆ కాలమందు తగ్గింపబడిరి గాని యూదావారు తమ పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించిన హేతువుచేత జయ మొందిరి.

18. Thus the children of Yisra'el were brought under at that time, and the children of Yehudah prevailed, because they relied on the LORD, the God of their fathers.

19. అబీయా యరొబామును తరిమి, బేతేలును దాని గ్రామములను యెషానాను దాని గ్రామములను ఎఫ్రోనును దాని గ్రామములను పట్టుకొనెను.

19. Aviyah pursued after Yarov`am, and took cities from him, Beit-El with the towns of it, and Yeshanah with the towns of it, and `Efron with the towns of it.

20. అబీయా బ్రదికిన కాలమున యరొబాము మరల బలము పొందలేదు, యెహోవా అతని మొత్తినందుచేత అతడు మరణ మొందెను.

20. Neither did Yarov`am recover strength again in the days of Aviyah: and the LORD struck him, and he died.

21. అబీయా వృద్ధినొందెను, అతడు పదునాలుగు మంది భార్యలను వివా హము చేసికొని యిరువది యిద్దరు కుమారులను పదునారుగురు కుమార్తెలను కనెను.

21. But Aviyah grew mighty, and took to himself fourteen wives, and became the father of twenty-two sons, and sixteen daughters.

22. అబీయా చేసిన యితర కార్యములను గూర్చియు, అతని చర్యను గూర్చియు, అతని కాలమున జరిగిన సంగతులను గూర్చియు ప్రవక్తయైన ఇద్దో రచించిన సటీక గ్రంథమునందు వ్రాయబడియున్నది.

22. The rest of the acts of Aviyah, and his ways, and his sayings, are written in the commentary of the prophet `Iddo.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Chronicles II - 2 దినవృత్తాంతములు 13 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

అబీయా యరొబామును జయించాడు.

జెరోబాము మరియు అతని అనుచరులు, తమ విశ్వాసాన్ని విడిచిపెట్టి, విగ్రహారాధనలో నిమగ్నమవ్వడం ద్వారా, అబీయా తమపై విధించే అధికారం పొందిన కఠినమైన పరిణామాలను తమపైకి తెచ్చుకున్నారు. అబీయాకు నిజమైన మతపరమైన భక్తి లేకపోయినా, అతను తన ప్రజల విశ్వాసం నుండి బలాన్ని పొందాడు. ఆధ్యాత్మిక విలువలను నిజంగా స్వీకరించని వారు దాని బాహ్య రూపాల్లో గర్వపడటం సాధారణ సంఘటన. పరిమిత వ్యక్తిగత మతపరమైన నిబద్ధత ఉన్న చాలా మంది వ్యక్తులు ఇప్పటికీ ఇతరులు ఆచరించినప్పుడు దానిని ఉన్నతంగా భావిస్తారు.
ఏది ఏమైనప్పటికీ, యూదాలో గణనీయ సంఖ్యలో భక్తులు ఉన్నారనేది వాస్తవం, మరియు వారి కారణం మరింత ధర్మబద్ధమైనది. కష్టాలను ఎదుర్కొన్నప్పుడు మరియు బెదిరింపులు చుట్టుముట్టబడినప్పుడు, వారు పైకి తప్ప విముక్తి కోసం ఎక్కడా తిరగలేదు. ఓదార్పునిచ్చే వాస్తవం ఏమిటంటే, దైవిక జోక్యాన్ని కోరుకునే మార్గం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది. వారు తమ హృదయపూర్వక ప్రార్థనలను వ్యక్తం చేస్తూ ప్రభువుకు తీవ్రంగా మొరపెట్టారు. వారి ప్రార్థనల కేకలు దృఢమైన విశ్వాసంతో కూడి ఉన్నాయి, వాటిని కొలవడానికి మించి విజయం సాధించాయి.
యరొబాము అబీయా కత్తి నుండి తప్పించుకోగలిగినప్పటికీ, అతడు దేవుని దైవిక తీర్పును తప్పించుకోలేకపోయాడు. మానవ ప్రతీకారం నుండి అతను తప్పించుకోవడం అతని చర్యల యొక్క పరిణామాల నుండి అతన్ని విడిచిపెట్టలేదు.



Shortcut Links
2 దినవృత్తాంతములు - 2 Chronicles : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |