Chronicles II - 2 దినవృత్తాంతములు 14 | View All

1. అబీయా తన పితరులతో కూడ నిద్రింపగా జనులు అతనిని దావీదు పట్టణమందు పాతిపెట్టిరి; అతనికి బదులుగా అతని కుమారుడైన ఆసా రాజాయెను. ఇతని దినములలో దేశము పది సంవత్సరములు నెమ్మది పొందెను.

1. Abijah slept with his fathers, and they buried him in the city of David. And Asa his son reigned in his place. In his days the land had rest for ten years.

2. ఆసాతన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నడచినవాడై

2. And Asa did what was good and right in the eyes of the LORD his God.

3. అన్యదేవతల బలిపీఠములను పడగొట్టి ఉన్నతస్థలములను పాడుచేసి ప్రతిమలను పగులగొట్టి దేవతా స్తంభములను కొట్టివేయించి

3. He took away the foreign altars and the high places and broke down the pillars and cut down the Asherim

4. వారి పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించుటకును, ధర్మశాస్త్రమునుబట్టియు విధినిబట్టియు క్రియలు జరిగించుటకును, యూదావారికి ఆజ్ఞాపించి

4. and commanded Judah to seek the LORD, the God of their fathers, and to keep the law and the commandment.

5. ఉన్నత స్థలములను సూర్య దేవతాస్తంభములను యూదావారి పట్టణములన్నిటిలోనుండి తీసివేసెను. అతనియేలు బడియందు రాజ్యము నెమ్మదిగా ఉండెను.

5. He also took out of all the cities of Judah the high places and the incense altars. And the kingdom had rest under him.

6. ఆ సంవత్సరములలో అతనికి యుద్ధములు లేక పోవుటచేత దేశములో నెమ్మదికలిగియుండెను; యెహోవా అతనికి విశ్రాంతి దయచేసియుండగా అతడు యూదా దేశమున ప్రాకారములుగల పట్టణములను కట్టించెను.

6. He built fortified cities in Judah, for the land had rest. He had no war in those years, for the LORD gave him peace.

7. అతడు యూదావారికి ఈలాగు ప్రకటనచేసెనుమన దేవుడైన యెహోవాను మనము ఆశ్రయించితివిు, ఆశ్ర యించినందున ఆయన మన చుట్టును నెమ్మది కలుగజేసి యున్నాడు; దేశమందు మనము నిరభ్యంతరముగా తిరుగ వచ్చును, మనము ఈ పట్టణములను కట్టించి, వాటికి ప్రాకారములను గోపురములను గుమ్మములను ద్వారబంధ ములను అమర్చుదము. కాగావారు పట్టణములను కట్టి వృద్ధినొందిరి.

7. And he said to Judah, 'Let us build these cities and surround them with walls and towers, gates and bars. The land is still ours, because we have sought the LORD our God. We have sought him, and he has given us peace on every side.' So they built and prospered.

8. ఆ కాలమున డాళ్లను ఈటెలను పట్టుకొను మూడు లక్షలమంది యూదావారును, కేడెములు ధరించివిల్లువేయు రెండు లక్షల ఎనుబది వేలమంది బెన్యామీనీ యులును కూడిన సైన్యము ఆసాకు ఉండెను; వీరందరును పరాక్రమశాలులై యుండిరి.

8. And Asa had an army of 300,000 from Judah, armed with large shields and spears, and 280,000 men from Benjamin that carried shields and drew bows. All these were mighty men of valor.

9. కూషీయుడైన జెరహు వారిమీద దండెత్తి వేయి వేల సైన్యమును మూడువందల రథములను కూర్చుకొని బయలుదేరి మారేషావరకు రాగా ఆసా అతనికి ఎదురుబోయెను.

9. Zerah the Ethiopian came out against them with an army of a million men and 300 chariots, and came as far as Mareshah.

10. వారు మారేషానొద్ద జెపాతా అను పల్లపుస్థలమందు పంక్తులు తీర్చి యుద్ధము కలుపగా

10. And Asa went out to meet him, and they drew up their lines of battle in the Valley of Zephathah at Mareshah.

11. ఆసా తన దేవుడైన యెహోవాకు మొఱ్ఱపెట్టి యెహోవా, విస్తారమైన సైన్యముచేతిలో ఓడిపోకుండ బలములేనివారికి సహాయము చేయుటకు నీకన్న ఎవరును లేరు; మా దేవా యెహోవా, మాకు సహాయముచేయుము, నిన్నే నమ్ముకొని యున్నాము, నీ నామమునుబట్టియే యీ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరియున్నాము. యెహోవా నీవే మా దేవుడవు, నరమాత్రులను నీ పైని జయమొందనియ్యకుము అని ప్రార్థింపగా

11. And Asa cried to the LORD his God, 'O LORD, there is none like you to help, between the mighty and the weak. Help us, O LORD our God, for we rely on you, and in your name we have come against this multitude. O LORD, you are our God; let not man prevail against you.'

12. యెహోవాకూషీయులను ఆసాయెదుటను యూదావారి యెదుటను నిలువనియ్యక వారిని మొత్తినందున వారు పారిపోయిరి.

12. So the LORD defeated the Ethiopians before Asa and before Judah, and the Ethiopians fled.

13. ఆసాయును అతనితో కూడనున్న వారును గెరారువరకు వారిని తరుమగా కూషీయులు మరల పంక్తులు తీర్చ లేక యెహోవా భయముచేతను ఆయన సైన్యపు భయముచేతను పారిపోయిరి. యూదావారు విశేషమైన కొల్లసొమ్ము పట్టుకొనిరి.

13. Asa and the people who were with him pursued them as far as Gerar, and the Ethiopians fell until none remained alive, for they were broken before the LORD and his army. The men of Judah carried away very much spoil.

14. గెరారు చుట్టునున్న పట్టణములలోని వారందరి మీదికి యెహోవా భయము వచ్చెను గనుక ఆ పట్టణములన్నిటిని కొల్లపెట్టి, వాటిలోనున్న మిక్కుటమైన కొల్లసొమ్మంతయు దోచుకొనిరి.

14. And they attacked all the cities around Gerar, for the fear of the LORD was upon them. They plundered all the cities, for there was much plunder in them.

15. మరియు వారు పసుల సాలలను పడగొట్టి విస్తారమైన గొఱ్ఱెలను ఒంటెలను సమ కూర్చుకొని యెరూషలేమునకు తిరిగి వచ్చిరి.

15. And they struck down the tents of those who had livestock and carried away sheep in abundance and camels. Then they returned to Jerusalem.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Chronicles II - 2 దినవృత్తాంతములు 14 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

ఆసా యొక్క భక్తి, అతను తన రాజ్యాన్ని బలపరుస్తాడు.

ఆసా యొక్క ప్రధాన లక్ష్యం దేవుడిని సంతోషపెట్టడం, ఆయన ఆమోదం పొందేందుకు తనను తాను అంకితం చేసుకోవడం. ఈ సూత్రానికి కట్టుబడి, వారి స్వంత కోరికలు లేదా ప్రపంచ ప్రమాణాలను అనుసరించకూడదని ఎంచుకునే వారు అదృష్టవంతులు, కానీ దేవుని దృక్పథంతో సరిపోయే వాటిని. అనుభవం మనకు దేవుని అన్వేషణ విలువను బోధిస్తుంది; ఇది మనకు ప్రశాంతతను తెస్తుంది, అయితే ప్రాపంచిక విషయాలను అనుసరించడం తరచుగా నిరాశకు దారితీస్తుంది. ప్రబలంగా ఉన్న శాంతిని తెలివిగా ఎలా ఉపయోగించుకోవాలో ఆసా తన ప్రజలతో చర్చలు జరిపాడు. నిష్క్రియ మరియు ఆత్మసంతృప్తి ఆమోదయోగ్యం కాదని వారు ఏకాభిప్రాయానికి వచ్చారు. అకస్మాత్తుగా, బలీయమైన ఇథియోపియన్ సైన్యం ఆసా రాజ్యంపై దాడి చేసింది. బహుశా దేవునిపై వారికి ఉన్న అచంచలమైన విశ్వాసాన్ని పరీక్షించేందుకే వారికి ఈ కష్టాలు ఎదురయ్యాయి. ఆసా ప్రార్థన క్లుప్తంగా ఉన్నప్పటికీ, అది నిజమైన విశ్వాసంతో మరియు దేవుని ప్రతిస్పందనలో ఆశాజనకమైన నిరీక్షణతో ప్రతిధ్వనిస్తుంది. ఎప్పుడైతే మనం దేవుని పేరు మీద ప్రయత్నాలను ప్రారంభించామో, ఆయన ఆశీర్వదించిన వారి అభ్యున్నతి కోసం అన్ని పరిస్థితులు సహకరిస్తాయి కాబట్టి, శ్రేయస్సు అనివార్యం.


Shortcut Links
2 దినవృత్తాంతములు - 2 Chronicles : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |