Chronicles II - 2 దినవృత్తాంతములు 3 | View All
Study Bible (Beta)

1. తరువాత సొలొమోను యెరూషలేములో తన తండ్రి యైన దావీదునకు యెహోవా ప్రత్యక్షమైనప్పుడు మోరీయా పర్వతమందు దావీదు సిద్ధపరచిన స్థలమున యెబూసీయుడైన ఒర్నాను కళ్లమందు దావీదు ఏర్పరచిన స్థలమున యెహోవాకు ఒక మందిరమును కట్టనారం భించెను.
అపో. కార్యములు 7:47

1. And Solomon began to build the house of Jehovah at Jerusalem, in Mount Moriah, where He appeared to his father David, in the place that David had prepared, in the grain floor of Ornan the Jebusite.

2. తన యేలుబడిలో నాలుగవ సంవత్సరము రెండవ నెల రెండవ దినమందు దాని కట్టనారంభించెను.

2. And he began to build on the second, in the second month, in the fourth year of his reign.

3. దేవుని మందిరమునకు సొలొమోను పునాదులు ఏర్పరచెను, పూర్వపు కొలల ప్రకారము పొడవు అరువది మూరలు, వెడల్పు ఇరువది మూరలు.

3. And these are the foundations Solomon laid, to build the house of God: the length by cubits according to the ancient measure, sixty cubits; and the breadth twenty cubits.

4. మందిరపు ముఖమంటపము మందిరపు పొడుగునుబట్టి యిరువది మూరలు వెడల్పు, నూట ఇరువది మూరలు ఎత్తు, దాని లోపలిభాగమును ప్రసశ్తమైన బంగారముతో అతడు పొదిగించెను.

4. As to the porch on the front, the length, according to the breadth of the house in front, was twenty cubits, and the height a hundred and twenty; and he overlaid it inside with pure gold.

5. మందిరపు పెద్ద గదిని దేవదారుపలకలతో కప్పి వాటిపైన మేలిమి బంగారమును పొదిగించి పైభాగమున ఖర్జూరపుచెట్లవంటి పనియు గొలుసులవంటి పనియు చెక్కించి

5. And the greater house he covered with cypress wood, and he covered it with good gold, and caused to go on it palms and chains.

6. ప్రశస్తమైన రత్నములతో దానిని అలంకరించెను. ఆ బంగారము పర్వయీమునుండి వచ్చినది.

6. And he overlaid the house with precious stones for beauty, and the gold was gold from Parvaim.

7. మందిరపు దూలములను స్తంభములను దాని గోడలను దాని తలుపులను బంగారముతో పొదిగించి గోడలమీద కెరూబులను చెక్కించెను.

7. And he covered the house, the beams, the threshold, and the walls, and its doors with gold; and engraved cherubs on the walls.

8. మరియు అతడు పరిశుద్ధ స్థలమొకటి కట్టించెను; దాని పొడవు మందిరపు వెడల్పును బట్టి యిరువది మూరలు, దాని వెడల్పు ఇరువది మూరలు, వెయ్యిన్ని రెండు వందల మణుగుల మేలిమి బంగారుతో అతడు దాని పొదిగించెను.

8. And he built the Most Holy House, its length was the same as the front, as of the breadth of the house, twenty cubits, and its breadth twenty cubits; and he covered it with good gold, to six hundred talents;

9. మేకుల యెత్తు ఏబది తులముల బంగారు; మీదిగదులను బంగారముతో పొదిగించెను.

9. and the weight of the nails was fifty shekels of gold, and he covered the upper rooms with gold.

10. అతిపరిశుద్ధ స్థలమునందు చెక్కడపు పనిగల రెండు కెరూబులను చేయించి వాటిని బంగారుతో పొదిగించెను.

10. And in the Most Holy House he made two cherubs of image work, and he overlaid them with gold.

11. ఆ కెరూబుల రెక్కల పొడవు ఇరువది మూరలు,

11. And the wings of the cherubs, their length was twenty cubits: the wing of the one was five cubits, touching the wall of the house, and the other wing was five cubits, touching the wing of the other cherub;

12. ఒక్కొక్క రెక్క అయిదు మూరల పొడుగు, అది మందిరపు గోడకు తగులుచుండెను, రెండవది జతగానున్న కెరూబు రెక్కకు తగులుచుండెను.

12. and the wing of the other cherub was five cubits, touching the wall of the house, and the other wing was five cubits, touching the wing of the other cherub.

13. ఈ ప్రకారము చాచుకొనిన ఈ కెరూబుల రెక్కలు ఇరువది మూరలు వ్యాపించెను, కెరూబులు పాదములమీద నిలువబడెను, వాటి ముఖములు మందిరపు లోతట్టు తిరిగి యుండెను.

13. The wings of these cherubs spread out twenty cubits, and they were standing on their feet, and their faces were inward.

14. అతడు నీలి నూలుతోను ఊదా నూలుతోను ఎఱ్ఱ నూలుతోను సన్నపు నారనూలుతోను ఒక తెరను చేయించి దానిమీద కెరూబులను కుట్టించెను.

14. And he made the veil of violet, and purple, and crimson, and fine linen, and caused to go on it cherubs.

15. ఇదియు గాక మందిరము ముందర ఉండుటకై ముప్పదియయిదు మూరల యెత్తుగల రెండు స్తంభములను వాటిమీదికి అయిదు మూరల యెత్తుగల పీటలను చేయించెను.

15. And at the front of the house, he made two pillars thirty five cubits high, and the capital on their tops was five cubits.

16. గర్భాలయము నందు చేసినట్టు గొలుసు పని చేయించి, స్తంభముల పైభాగమున దాని ఉంచి, నూరు దానిమ్మపండ్లను చేయించి ఆ గొలుసు పనిమీద తగిలించెను.

16. And he made chains, as in the oracle, and put them on the capitals of the pillars; and made a hundred pomegranates and put them on the chains.

17. ఆ రెండు స్థంభములను దేవాలయము ఎదుట కుడితట్టున ఒకటియు ఎడమతట్టున ఒకటియు నిలువబెట్టించి, కుడితట్టు దానికి యాకీను అనియు, ఎడమతట్టు దానికి బోయజు అనియు పేళ్లు పెట్టెను.

17. And he set up the pillars before the temple, one on the right, and one on the left, and called the name of that on the right Jachin, and the name of that on the left Boaz.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Chronicles II - 2 దినవృత్తాంతములు 3 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

ఆలయ భవనం.

ఆలయ నిర్మాణం గురించి మరింత వివరణాత్మక వర్ణన 1 రాజులు 6లో కనుగొనబడింది. దావీదు సిద్ధం చేసిన స్థలంలో ఆలయాన్ని నిర్మించడం అత్యవసరం, ఇది కొనుగోలు ద్వారా మాత్రమే కాకుండా దైవిక మార్గదర్శకత్వం ద్వారా నియమించబడిన ప్రదేశం. సమగ్ర సూచనలను కలిగి ఉండటం వలన మన పనులను నమ్మకంగా చేరుకోవడానికి మరియు వాటిని సౌకర్యవంతంగా అమలు చేయడానికి అనుమతిస్తుంది. దేవునికి అంకితమైన వ్యక్తిని ప్రతి ధర్మబద్ధమైన పనికి సన్నద్ధం చేయడానికి లేఖనాలు సరిపోతాయి కాబట్టి, దేవునికి స్తోత్రం. మనం ప్రతిరోజూ లేఖనాలను శ్రద్ధగా అన్వేషిద్దాం, మనకు గ్రహణశక్తి, విశ్వాసం మరియు విధేయతను మంజూరు చేయమని ప్రభువును వేడుకుందాము, తద్వారా మన ప్రయత్నాలను మరియు మార్గాన్ని ప్రకాశవంతం చేద్దాం. మనం ప్రారంభించే, కొనసాగించే మరియు ముగించే ప్రతిదీ ఆయనలో కేంద్రీకృతమై ఉండాలి. మనము క్రీస్తులో దేవుణ్ణి ధ్యానిస్తున్నప్పుడు, సోలమన్ యొక్క వైభవాన్ని కూడా అధిగమిస్తున్న అతని నిజమైన ఆలయం, మనం ఆధ్యాత్మిక నివాసంగా, పరిశుద్ధాత్మ ద్వారా దేవుని నివాస స్థలంగా రూపాంతరం చెందుతాము.


Shortcut Links
2 దినవృత్తాంతములు - 2 Chronicles : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |