Chronicles II - 2 దినవృత్తాంతములు 32 | View All
Study Bible (Beta)

1. రాజు ఇట్టి నమ్మకమైన చర్య చూపిన తరువాత అష్షూరురాజైన సన్హెరీబు వచ్చి, యూదాదేశములో చొరబడి ప్రాకారపురములయెదుట దిగి వాటిని లోపరచుకొన జూచెను.

“సన్‌హెరీబు”– ఈ దాడి హిజ్కియా పాలనలో 14 వ ఏట జరిగింది. అంటే క్రీ.పూ. 701లో (2 రాజులు 18:13; యెషయా 36:1). హిజ్కియా దేవుని నుంచి తొలగిపోలేదు. దేవుడు ఈ దాడిని అనుమతించినది అతణ్ణి శిక్షించడానికి కాదు గాని అతని పక్షంగా తనను తాను సర్వశక్తిమంతునిగా కనపరచుకోవడానికే (వ 22). దేవుడు జెరుసలంను ఇంత అద్భుత రీతిలో సంరక్షించిన వైనం 2 రాజులు 8:13, యెషయా 36:1-22 యెషయా 37:1-37 లోను మరింత వివరంగా ఉంది.

2. సన్హెరీబు దండెత్తి వచ్చి యెరూషలేముమీద యుద్ధము చేయనుద్దేశించి యున్నాడని హిజ్కియాచూచి

3. పట్టణముబయటనున్న ఊటల నీళ్లను అడ్డవలెనని తలచి, తన యధిపతులతోను పరాక్రమశాలులతోను యోచనచేయగా వారతనికి సహాయము చేసిరి.

4. బహుజనులు పోగై అష్షూరు రాజులు రానేల? విస్తారమైనజలము వారికి దొరుక నేల? అనుకొని ఊటలన్నిటిని దేశమధ్యముగుండ పారు చున్న కాలువను అడ్డిరి.

5. మరియు రాజు ధైర్యము తెచ్చు కొని, పాడైన గోడ యావత్తు కట్టించి, గోపురములవరకు దానిని ఎత్తు చేయించి, బయట మరియొక గోడను కట్టించి, దావీదు పట్టణములో మిల్లో దుర్గమును బాగు చేయించెను. మరియు ఈటెలను డాళ్లను విస్తారముగా చేయించెను.

6. జనులమీద సైన్యాధిపతులను నియమించి పట్టణపు గుమ్మములకు పోవు రాజవీధిలోనికి వారిని తన యొద్దకు రప్పించి వారిని ఈలాగు హెచ్చరికచేసెను

7. మీరు దిగులుపడకుడి, ధైర్యము విడువకుడి; అష్షూరు రాజుకైనను అతనితో కూడనున్న సైన్యమంతటికైనను మీరు భయపడవద్దు, విస్మయమొందవద్దు, అతనికి కలిగియున్న సహాయముకంటె ఎక్కువ సహాయము మనకు కలదు.

యెహోషువ 1:7 యెహోషువ 1:9; 1 సమూయేలు 14:6; 2 రాజులు 6:16; 1 దినవృత్తాంతములు 22:13; 1 యోహాను 4:4.

8. మాంససంబంధమైన బాహువే అతనికి అండ, మనకు సహాయము చేయుటకును మన యుద్ధములను జరిగించుట కును మన దేవుడైన యెహోవా మనకు తోడుగా ఉన్నాడని చెప్పగా జనులు యూదారాజైన హిజ్కియా చెప్పిన మాటలయందు నమ్మికయుంచిరి.

యెహోషువ 10:42; యెహోషువ 13:12; 2 దినవృత్తాంతములు 20:17; కీర్తనల గ్రంథము 20:7; రోమీయులకు 8:31 రోమీయులకు 8:37.

9. ఇదియైన తరువాత అష్షూరురాజైన సన్హెరీబు తన బలగ మంతటితో లాకీషును ముట్టడివేయుచుండి, యెరూషలేమునకు యూదారాజైన హిజ్కియా యొద్దకును, యెరూషలేమునందున్న యూదావారందరియొద్దకును తన సేవకులను పంపి ఈలాగు ప్రకటన చేయించెను

2 రాజులు 18:17-37 2 రాజులు 19:1-37 నోట్స్.

10. అష్షూరురాజైన సన్హెరీబు సెలవిచ్చునదేమనగా దేని నమ్మి మీరు ముట్టిడివేయబడియున్న యెరూషలేములో నిలుచు చున్నారు?

11. కరవుచేతను దాహముచేతను మిమ్మును చంపు టకైమన దేవుడైన యెహోవా అష్షూరురాజు చేతిలో నుండి మనలను విడిపించునని చెప్పి హిజ్కియా మిమ్మును ప్రేరేపించుచున్నాడు గదా?

12. ఆ హిజ్కియా, మీరు ఒక్క బలిపీఠము ఎదుట నమస్కరించి దానిమీద ధూపము వేయవలెనని యూదావారికిని యెరూషలేమువారికిని ఆజ్ఞ ఇచ్చి, యెహోవా ఉన్నతస్థలములను బలిపీఠములను తీసి వేసినవాడుకాడా?

13. నేనును నా పితరులును ఇతరదేశముల జనుల కందరికిని ఏమేమి చేసితిమో మీరెరుగరా? ఆ దేశ జనుల దేవతలు వారి దేశములను నా చేతిలోనుండి యేమాత్రమైనను రక్షింప చాలియుండెనా?

14. మీ దేవుడు మిమ్మును నా చేతిలోనుండి విడిపింపగలడనుకొనుటకు, నా పితరులు బొత్తిగా నిర్మూలము చేసిన ఆ యా దేశస్థుల సకల దేవతలలోను తన జనులను నా చేతిలోనుండి విడిపింప గలిగిన దేవుడొకడైన యుండెనా?

15. కాబట్టి యిప్పుడు హిజ్కియాచేత మీరు మోసపోకుడి, మీరు ఇట్టి ప్రేరేపణకు లోబడకుడి, అతని నమ్ముకొనకుడి, యే జనుల దేవు డైనను ఏ రాజ్యపు దేవుడైనను తన జనులను నా చేతిలో నుండి గాని నా పితరుల చేతిలోనుండి గాని విడిపింపలేక పోగా, మీ దేవుడు నా చేతిలోనుండి మిమ్మును మొదలే విడిపింపలేక పోవునుగదా అనెను.

16. అతని సేవకులు దేవు డైన యెహోవామీదను ఆయన సేవకుడైన హిజ్కియా మీదను ఇంకను పేలాపనలు పేలిరి.

17. అదియుగాక ఇతర దేశముల జనుల దేవతలు తమ జనులను నా చేతిలోనుండి యేలాగున విడిపింపలేకపోయిరో ఆలాగున హిజ్కియా సేవించు దేవుడును తన జనులను నా చేతిలోనుండి విడిపింప లేకపోవునని ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను నిందించుటకును, ఆయనమీద అపవాదములు పలుకుటకును అతడు పత్రికలు వ్రాసి పంపెను.

18. అప్పుడు వారు పట్టణమును పట్టుకొనవలెనన్న యోచనతో, ప్రాకారము మీదనున్న యెరూషలేము కాపురస్థులను బెదరించుటకును నొప్పించుటకును, యూదాభాషలో బిగ్గరగా వారితో ఆ మాటలు పలికిరి.

19. మరియు వారు మనుష్యుల చేతిపనియైన భూజనుల దేవతలమీద తాము పలికిన దూషణలను యెరూషలేముయొక్క దేవునిమీద కూడను పలికిరి.

కీర్తనల గ్రంథము 115:2-8. జెరుసలంలో ఉన్న ఇస్రాయేల్ దేవుడు ఇతర దేవుళ్ళవంటివాడే అని భావిస్తున్నవారు బహు భయంకరమైన పొరపాటు చేస్తున్నారన్నమాట. 1 రాజులు 18:21 చూడండి. ఇస్రాయేల్‌వారి దేవుడు నిజ దేవుడైతే (ఈ సంగతిని ఆయన పదే పదే నిరూపించాడు) మిగతా దేవుళ్ళంతా అబద్ధాలూ, వ్యర్థాలే (యెషయా 44:6-9).

20. రాజైన హిజ్కియాయును ఆమోజు కుమారుడైన యెషయా అను ప్రవక్తయును ఇందును గురించి ప్రార్థించి ఆకాశముతట్టు చూచి మొఱ్ఱపెట్టగా

“మొరపెట్టారు”– 2 రాజులు 19:15-19.

21. యెహోవా ఒక దూతను పంపెను. అతడు అష్షూరు రాజు దండులోని పరాక్రమశాలులనందరిని సేనా నాయకులను అధికారులను నాశనముచేయగా అష్షూరురాజు సిగ్గునొందినవాడై తన దేశమునకు తిరిగిపోయెను. అంతట అతడు తన దేవునిగుడిలో చొచ్చినప్పుడు అతని కడుపున పుట్టినవారే అతని అక్కడ కత్తిచేత చంపిరి.

సన్‌హెరీబు చేసిన పొరపాటు (వ 19) వల్ల తన సైన్యాన్నీ, తన ప్రతిష్ఠనూ, చివరికి తన ప్రాణాన్నే కోల్పోయాడు. ఈ దేవదూత మొత్తం లక్ష ఎనభై ఐదు వేలమందిని చంపాడు (యెషయా 37:36).

22. ఈ ప్రకారము యెహోవా హిజ్కియాను యెరూషలేము కాపురస్థులను అష్షూరు రాజైన సన్హెరీబు చేతిలోనుండియు అందరిచేతిలోనుండియు రక్షించి, అన్నివైపులను వారిని కాపాడినందున

23. అనేకులు యెరూషలేములో యెహోవాకు అర్పణలను యూదా రాజైన హిజ్కియాకు కానుకలను తెచ్చి యిచ్చిరి. అందు వలన అతడు అప్పటినుండి సకల జనముల దృష్టికి ఘనత నొందిన వాడాయెను.

24. ఆ దినములలో హిజ్కియా రోగియై మరణదశలో నుండెను. అతడు యెహోవాకు మొఱ్ఱపెట్టగా ఆయన అతనికి తన చిత్తమును తెలియపరచి అతనికి సూచన యొకటి దయచేసెను.

“సూచకమైన”– 2 రాజులు 20:1-11.

25. అయితే హిజ్కియా మనస్సున గర్వించి తనకు చేయబడిన మేలుకు తగినట్లు ప్రవర్తింపనందున అతని మీదికిని యూదా యెరూషలేముల వారిమీదికిని కోపము రాగా

రాజులు, యెషయా గ్రంథాల్లో ఈ వచనాలు లేవు. “గర్వించాడు”– హిజ్కియా గర్వానికి లొంగిపోవడానికి నాలుగు తలంపులు కారణమయ్యాయి. – తన పక్షంగా దేవుడు అంత బలప్రభావాన్ని చూపించడం (వ 22), తన పట్ల పొరుగు దేశాలు చూపుతున్న గౌరవం (వ 23), సూచకమైన అద్భుతం (వ 24,31), తన అంతులేని ఐశ్వర్యం (వ 27-29). అనేకమందికి వీటిల్లో ఒక్కటి చాలు గర్వం పెంచడానికి. వీటిని బట్టి దేవునికి నమ్మకస్థుడైన హిజ్కియా కూడా పతనం అయ్యాడు. “కోపం”– సంఖ్యాకాండము 25:3; కీర్తనల గ్రంథము 90:7-11. దేవునికి ఎక్కువ కోపం తెప్పించే పాపాల్లో గర్వం ఒకటి – సామెతలు 6:6-19; యెషయా 2:10-19.

26. హిజ్కియా హృదయగర్వము విడచి, తానును యెరూషలేము కాపురస్థులును తమ్మును తాము తగ్గించుకొనిరి గనుక హిజ్కియా దినములలో యెహోవా కోపము జనుల మీదికి రాలేదు.

“అణచుకొన్నారు”– 2 దినవృత్తాంతములు 34:27-28; యిర్మియా 26:18-19; యోవేలు 2:13 పోల్చిచూడండి.

27. హిజ్కియాకు అతివిస్తారమైన ఐశ్వర్యమును ఘనతయు కలిగెను. అతడు వెండి బంగార ములను రత్నములను సుగంధద్రవ్యములను డాళ్లను నానా విధములగు శ్రేష్ఠమైన ఉపకరణములను సంపాదించి వాటికి బొక్కసములను కట్టించెను.

28. ధాన్యమును ద్రాక్షా రసమును తైలమును ఉంచుటకు కొట్లను, పలువిధముల పశువులకు శాలలను మందలకు దొడ్లను కట్టించెను.

29. మరియదేవుడు అతనికి అతి విస్తారమైన కలిమి దయచేసినందున పట్టణములను విస్తారమైన గొఱ్ఱెలమందలను పసులమందలను అతడు సంపాదించెను.

30. ఈ హిజ్కియా గిహోను కాలువకు ఎగువను కట్టవేయించి దావీదు పట్టణపు పడమటి వైపునకు దాని తెప్పించెను, హిజ్కియా తాను పూనుకొనిన సర్వప్రయత్నములయందును వృద్ధిపొందెను.

31. అతని దేశము ఆశ్చర్యముగా వృద్ధినొందుటను గూర్చి విచారించి తెలిసికొనుటకై బబులోను అధిపతులు అతనియొద్దకు పంపిన రాయబారుల విషయములో అతని శోధించి, అతని హృద యములోని ఉద్ధేశమంతయు తెలిసికొనవలెనని దేవుడతని విడచిపెట్టెను.

“పరీక్ష”– 1 రాజులు 2:10 నోట్స్.

32. హిజ్కియా చేసిన యితర కార్యములనుగూర్చియు, అతడు చూపిన భక్తినిగూర్చియు, ప్రవక్త యును ఆమోజు కుమారుడునగు యెషయాకు కలిగిన దర్శనముల గ్రంథము నందును యూదా ఇశ్రాయేలుల రాజుల గ్రంథమునందును వ్రాయబడియున్నది.

33. హిజ్కియా తన పితరులతో కూడ నిద్రించగా జనులు దావీదు సంతతివారి శ్మశానభూమి యందు కట్టబడిన పైస్థానమునందు అతని పాతిపెట్టిరి. అతడు మరణ మొందినప్పుడు యూదావారందరును యెరూషలేము కాపురస్థులందరును అతనికి ఉత్తర క్రియలను ఘనముగా జరిగించిరి. అతని కుమారుడైన మనష్షే అతనికి మారుగా రాజాయెను.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Chronicles II - 2 దినవృత్తాంతములు 32 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

సన్హెరీబ్ దండయాత్ర, అతని ఓటమి. (1-23) 
తమ భద్రతను దేవుని చేతిలో ఉంచే వారు కూడా తగిన చర్యలు తీసుకోవాలి, అలా చేయడంలో విఫలమైతే దానిని పరీక్షా ప్రావిడెన్స్‌గా చూడవచ్చు. దేవుడు సదుపాయం కల్పిస్తుండగా, మనం కూడా మన ప్రయత్నాలకు సహకరించాలి. హిజ్కియా తన ప్రజలను సమీకరించి, వారితో ధైర్యంగా మాట్లాడాడు. దేవునిపై మనకు అచంచలమైన విశ్వాసం ఉన్నప్పుడు, అది మానవత్వం పట్ల ప్రబలంగా ఉన్న భయాన్ని మించి మనల్ని ఉద్ధరిస్తుంది. యేసుక్రీస్తు యొక్క నమ్మకమైన అనుచరులు మరియు రక్షకులు ఆయన బోధనలలో ఓదార్పుని పొంది, "దేవుడు మన పక్షాన ఉండగా, మనలను ఎవరు వ్యతిరేకించగలరు?" అని నమ్మకంగా ప్రకటించనివ్వండి. దేవుని దయతో, విరోధులు ఓడిపోతారు మరియు పొత్తులు ఏర్పడతాయి.

హిజ్కియా అనారోగ్యం, అతని సుసంపన్నమైన పాలన మరియు మరణం. (24-33)
హిజ్కియా తన అంతరంగిక ఆలోచనలను బయలుపరచి, అతని ఆత్మీయ పరిపక్వతలోని లోపాలను బహిర్గతం చేస్తూ ఈ పరీక్షను స్వయంగా ఎదుర్కొనేందుకు దేవుడు హిజ్కియాను అనుమతించాడు. మన బలహీనతలను, పాపపు పోకడలను గుర్తిస్తూ, మన స్వంత పాత్రపై అంతర్దృష్టిని పొందడం మనకు ప్రయోజనకరం. ఈ అవగాహన మనల్ని అహంకారం లేదా అతిగా ఆత్మవిశ్వాసం పొందకుండా నిరోధిస్తుంది, దైవిక కృపపై ఆధారపడే స్థితిలో మనం జీవించేలా చేస్తుంది. దేవుని మార్గనిర్దేశనం లేనప్పుడు మన హృదయాల అవినీతి యొక్క లోతులు మరియు మన సంభావ్య చర్యలు మనకు తెలియవు. హిజ్కియా యొక్క అతిక్రమం అతని అహంకార ప్రవర్తనలో ఉంది.
పొట్టితనాన్ని, సద్గుణాన్ని మరియు ప్రాముఖ్యతను కలిగి ఉన్న వ్యక్తులు తమ స్వంత బలహీనతలను మరియు తప్పులను శ్రద్ధగా పరిశీలించాలి, అదే సమయంలో అపరిమిత దయకు వారి రుణాన్ని కూడా గుర్తిస్తారు. అలాంటి స్వీయ-ప్రతిబింబం మితిమీరిన ఆత్మగౌరవాన్ని పెంపొందించకుండా కాపాడుతుంది మరియు వినయాన్ని కొనసాగించమని దేవునికి తీవ్రమైన విన్నపాలను ప్రేరేపిస్తుంది. విచారకరంగా, హిజ్కియా తనకు ప్రసాదించిన ఆశీర్వాదాలను తన అహంకారానికి పోషణగా మార్చుకున్నాడు. పాపానికి దారితీసే పరిస్థితులను మనం చురుకుగా తప్పించుకోవాలి, హానికరమైన సాంగత్యం, మళ్లింపులు, సాహిత్యం మరియు తప్పును ప్రలోభపెట్టే దృశ్యాలను కూడా దూరం చేయాలి.
దేవుని మార్గదర్శకత్వం మరియు ఆశ్రయానికి మనల్ని మనం పట్టుదలతో అప్పగిస్తూ, మన పక్షాన నమ్మకంగా ఉండమని ఆయనను వేడుకుంటున్నాము. కృతజ్ఞతగా, మరణం చివరికి విశ్వాసి యొక్క పోరాటాన్ని తొలగిస్తుంది, అహంకారం మరియు ప్రతి ఇతర పాపాన్ని నిర్మూలిస్తుంది. మోక్షం యొక్క దేవుని నుండి ప్రశంసలను నిలుపుదల చేయాలనే టెంప్టేషన్ నిర్మూలించబడుతుంది మరియు విశ్వాసి రిజర్వేషన్ లేకుండా ప్రశంసలు ఇవ్వడానికి స్వేచ్ఛగా ఉంటాడు.



Shortcut Links
2 దినవృత్తాంతములు - 2 Chronicles : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |