Chronicles II - 2 దినవృత్తాంతములు 9 | View All
Study Bible (Beta)

1. షేబదేశపు రాణి సొలొమోనును గూర్చిన ప్రసిద్ధిని వినినప్పుడు గూఢమైన ప్రశ్నలచేత సొలొమోనును శోధింపవలెనని కోరి, మిక్కిలి గొప్ప పరివారమును వెంట బెట్టుకొని, గంధవర్గములను విస్తారము బంగారమును రత్న ములను ఒంటెలమీద ఎక్కించుకొని యెరూషలేమునకు వచ్చెను. ఆమె సొలొమోనునొద్దకు వచ్చి తన మనస్సులోని విషయములన్నిటిని గురించి అతనితో మాటలాడెను.
మత్తయి 6:29, మత్తయి 12:42, లూకా 11:31

1. shebadheshapu raani solomonunu goorchina prasiddhini vininappudu goodhamaina prashnalachetha solomonunu shodhimpavalenani kori, mikkili goppa parivaaramunu venta bettukoni, gandhavargamulanu visthaaramu bangaaramunu ratna mulanu ontelameeda ekkinchukoni yerooshalemunaku vacchenu. aame solomonunoddhaku vachi thana manassuloni vishayamulannitini gurinchi athanithoo maatalaadenu.

2. సొలొమోను ఆమె ప్రశ్నలన్నియు ఆమెకు విడదీసి చెప్పెను; సొలొమోను ఆమెకు ప్రత్యుత్తరము చెప్పలేని మరుగైన మాట యేదియు లేకపోయెను.

2. solomonu aame prashnalanniyu aameku vidadeesi cheppenu; solomonu aameku pratyuttharamu cheppaleni marugaina maata yediyu lekapoyenu.

3. షేబదేశపురాణి సొలొమోనునకు కలిగిన జ్ఞానమును, అతడు కట్టించిన నగరును,
లూకా 12:27

3. shebadheshapuraani solomonunaku kaligina gnaanamunu, athadu kattinchina nagarunu,

4. అతని బల్లమీది భోజనపదార్థములను, అతని సేవకులు కూర్చుండుటను, అతని యుపచారులు కనిపెట్టుటను వారి వస్త్రములను, అతనికి గిన్నెల నందించువారిని వారి వస్త్రములను, యెహోవా మందిరమందు అతడు అర్పించు దహనబలులను చూచినప్పుడు, ఆమె విస్మయ మొంది రాజుతో ఇట్లనెను

4. athani ballameedi bhojanapadaarthamulanu, athani sevakulu koorchundutanu, athani yupachaarulu kanipettutanu vaari vastramulanu, athaniki ginnela nandinchuvaarini vaari vastramulanu, yehovaa mandiramandu athadu arpinchu dahanabalulanu chuchinappudu, aame vismaya mondi raajuthoo itlanenu

5. నీ కార్యములనుగూర్చియు జ్ఞానమునుగూర్చియు నేను నా దేశమందు వినిన వర్తమానము నిజవర్తమానమే గాని, నేను వచ్చి దాని కన్నులార చూచువరకు వారి మాటలను నమ్మకయుంటిని.

5. nee kaaryamulanugoorchiyu gnaanamunugoorchiyu nenu naa dheshamandu vinina varthamaanamu nijavarthamaaname gaani, nenu vachi daani kannulaara choochuvaraku vaari maatalanu nammakayuntini.

6. నీ యధిక జ్ఞానమును గూర్చి సగమైనను వారు నాకు తెలుపలేదు. నిన్నుగూర్చి నేను వినినదానికంటె నీ కీర్తి యెంతో హెచ్చుగానున్నది.

6. nee yadhika gnaanamunu goorchi sagamainanu vaaru naaku telupaledu. Ninnugoorchi nenu vininadaanikante nee keerthi yenthoo hechugaanunnadhi.

7. నీ సేవకుల భాగ్యము మంచిది, ఎల్లప్పుడును నీ సముఖమున నిలిచి నీ జ్ఞానసంభాషణ వినుచుండు నీ సేవకులైన వీరి భాగ్యము మంచిది.

7. nee sevakula bhaagyamu manchidi, ellappudunu nee samukhamuna nilichi nee gnaanasambhaashana vinuchundu nee sevakulaina veeri bhaagyamu manchidi.

8. నీ దేవుడైన యెహోవా సన్నిధిని నీవు రాజువై ఆయన సింహాసనముమీద ఆసీనుడవై యుండునట్లు నీయందు అనుగ్రహము చూపినందుకు నీ దేవుడైన యెహోవాకు స్తోత్రములు కలుగునుగాక. ఇశ్రా యేలీయులను నిత్యము స్థిరపరచవలెనన్న దయాలోచన నీ దేవునికి కలిగియున్నందున నీతి న్యాయములను జరిగించుటకై ఆయన నిన్ను వారిమీద రాజుగా నియమించెను అని చెప్పెను.

8. nee dhevudaina yehovaa sannidhini neevu raajuvai aayana sinhaasanamumeeda aaseenudavai yundunatlu neeyandu anugrahamu choopinanduku nee dhevudaina yehovaaku sthootramulu kalugunugaaka. ishraayeleeyulanu nityamu sthiraparachavalenanna dayaalochana nee dhevuniki kaligiyunnanduna neethi nyaayamulanu jariginchutakai aayana ninnu vaarimeeda raajugaa niyaminchenu ani cheppenu.

9. ఆమె రాజునకు రెండువందల నలుబది మణుగుల బంగారమును విస్తారమైన గంధవర్గములను రత్న ములను ఇచ్చెను; షేబదేశపు రాణి రాజైన సొలొమోనున కిచ్చిన గంధవర్గములతో సాటియైన దేదియులేదు.

9. aame raajunaku renduvandala nalubadhi manugula bangaaramunu visthaaramaina gandhavargamulanu ratna mulanu icchenu; shebadheshapu raani raajaina solomonuna kichina gandhavargamulathoo saatiyaina dhediyuledu.

10. ఇదియుగాక ఓఫీరునుండి బంగారము తెచ్చిన హీరాము పనివారును సొలొమోను పనివారును చందనపు మ్రానులను ప్రశస్తమైన రత్నములనుకూడ కొనివచ్చిరి.

10. idiyugaaka opheerunundi bangaaramu techina heeraamu panivaarunu solomonu panivaarunu chandhanapu mraanulanu prashasthamaina ratnamulanukooda konivachiri.

11. ఆ చంద నపు మ్రానులచేత రాజు యెహోవా మందిరమునకును రాజనగరునకును సౌపానములను, గాయకులకు తంబురలను సితారాలను చేయించెను, అటువంటి పని అంతకుముందు యూదాదేశమందు ఎవ్వరును చూచియుండలేదు.

11. aa chanda napu mraanulachetha raaju yehovaa mandiramunakunu raajanagarunakunu saupaanamulanu, gaayakulaku thamburalanu sithaaraalanu cheyinchenu, atuvanti pani anthakumundu yoodhaadheshamandu evvarunu chuchiyundaledu.

12. షేబ దేశపు రాణి రాజునకు తీసికొనివచ్చిన వాటికి అతడిచ్చిన ప్రతి బహుమానములుగాక ఆమె మక్కువ పడి అడిగిన దంతయు రాజైన సొలొమోను ఆమె కిచ్చెను; తరువాత ఆమె తన సేవకులను వెంట బెట్టుకొని మరలి తన దేశమునకు వెళ్లిపోయెను.

12. sheba dheshapu raani raajunaku theesikonivachina vaatiki athadichina prathi bahumaanamulugaaka aame makkuva padi adigina danthayu raajaina solomonu aame kicchenu; tharuvaatha aame thana sevakulanu venta bettukoni marali thana dheshamunaku vellipoyenu.

13. గంధవర్గములు అమ్ము వర్తకులును ఇతర వర్తకులును కొని వచ్చు బంగారముగాక సొలొమోనునకు ఏటేట వచ్చు బంగారము వెయ్యిన్ని మూడువందల ముప్పది రెండు మణుగులయెత్తు.

13. gandhavargamulu ammu varthakulunu ithara varthakulunu koni vachu bangaaramugaaka solomonunaku eteta vachu bangaaramu veyyinni mooduvandala muppadhi rendu manugulayetthu.

14. అరబీదేశపు రాజులందరును దేశాధిపతు లును సొలొమోనునొద్దకు బంగారమును వెండియు తీసికొని వచ్చిరి.

14. arabeedheshapu raajulandarunu dheshaadhipathu lunu solomonunoddhaku bangaaramunu vendiyu theesikoni vachiri.

15. రాజైన సొలొమోను సాగగొట్టిన బంగారముతో అలుగులుగల రెండువందల డాళ్లను చేయించెను; ఒక్కొక డాలునకు ఆరువందల తులముల బంగారము పట్టెను.

15. raajaina solomonu saagagottina bangaaramuthoo alugulugala renduvandala daallanu cheyinchenu; okkoka daalunaku aaruvandala thulamula bangaaramu pattenu.

16. మరియు సాగగొట్టిన బంగారముతో మూడువందల కేడెములను చేయించెను; ఒక్కొక కేడెమునకుమూడువందల తులముల బంగారము పట్టెను; వాటిని రాజు లెబానోను అరణ్యపు నగరునందుంచెను.

16. mariyu saagagottina bangaaramuthoo mooduvandala kedemulanu cheyinchenu; okkoka kedemunakumooduvandala thulamula bangaaramu pattenu; vaatini raaju lebaanonu aranyapu nagarunandunchenu.

17. మరియు రాజు దంత ముతో ఒక గొప్ప సింహాసనము చేయించి ప్రశస్త మైన బంగారముతో దాని పొదిగించెను.

17. mariyu raaju dantha muthoo oka goppa sinhaasanamu cheyinchi prashastha maina bangaaramuthoo daani podiginchenu.

18. ఆ సింహాసనమునకు దానితో కలిసియున్న ఆరు బంగారపు సోపానము లును సింహాసనమునకు కట్టి యున్న బంగారపు పాదపీఠమును ఉండెను, కూర్చుండుచోటికి ఇరుప్రక్కల ఊతలుండెను, ఊతలదగ్గర రెండు సింహము లుండెను;

18. aa sinhaasanamunaku daanithoo kalisiyunna aaru bangaarapu sopaanamu lunu sinhaasanamunaku katti yunna bangaarapu paadapeethamunu undenu, koorchunduchootiki iruprakkala oothalundenu, oothaladaggara rendu simhamu lundenu;

19. ఆ యారు సోపానములమీద ఇరుప్రక్కల పండ్రెండు సింహములు నిలిచియుండెను, ఏ రాజ్యమందైనను అటువంటి పని చేయబడలేదు.

19. aa yaaru sopaanamulameeda iruprakkala pandrendu simhamulu nilichiyundenu, e raajyamandainanu atuvanti pani cheyabadaledu.

20. మరియు రాజైన సొలొమోనునకున్న పానపాత్రలన్నియును బంగారపువై యుండెను; లెబానోను అరణ్యపు నగరుననున్న ఉపకరణములన్నియు బంగారముతో చేసినవి; హీరాముయొక్క పనివారితో కూడ రాజు ఓడలు తర్షీషుకు పోయి మూడు సంవత్సరములకు ఒకమారు బంగారము, వెండి, యేనుగుదంతము, కోతులు, నెమళ్లు అను సరకులతో వచ్చుచుండెను గనుక

20. mariyu raajaina solomonunakunna paanapaatralanniyunu bangaarapuvai yundenu; lebaanonu aranyapu nagarunanunna upakaranamulanniyu bangaaramuthoo chesinavi; heeraamuyokka panivaarithoo kooda raaju odalu tharsheeshuku poyi moodu samvatsaramulaku okamaaru bangaaramu, vendi, yenugudanthamu, kothulu, nemallu anu sarakulathoo vachuchundenu ganuka

21. సొలొమోను దినములలో వెండియెన్నికకు రానిదాయెను

21. solomonu dinamulalo vendiyennikaku raanidaayenu

22. రాజైన సొలొమోను భూరాజులందరికంటెను ఐశ్వర్య మందును జ్ఞానమందును అధికుడాయెను.

22. raajaina solomonu bhooraajulandarikantenu aishvarya mandunu gnaanamandunu adhikudaayenu.

23. దేవుడు సొలొ మోనుయొక్క హృదయ మందుంచిన జ్ఞానోక్తులను వినుటకై భూరాజులందరును అతని ముఖదర్శనము చేయగోరిరి.

23. dhevudu solo monuyokka hrudaya mandunchina gnaanokthulanu vinutakai bhooraajulandarunu athani mukhadarshanamu cheyagoriri.

24. మరియు ప్రతివాడును ఏటేట వెండివస్తువులను బంగారు వస్తువులను వస్త్రములను ఆయుధములను గంధవర్గములను గుఱ్ఱములను కంచరగాడిదలను కానుకలుగా తీసికొనివచ్చెను.

24. mariyu prathivaadunu eteta vendivasthuvulanu bangaaru vasthuvulanu vastramulanu aayudhamulanu gandhavargamulanu gurramulanu kancharagaadidalanu kaanukalugaa theesikonivacchenu.

25. రథములు నిలువయుంచు పట్టణములలోను రాజునొద్ద యెరూషలేములోను సొలొమోనునకు నాలుగువేల గుఱ్ఱపు సాలలును రథములును పండ్రెండువేల గుఱ్ఱపు రౌతులును కలిగి యుండెను.

25. rathamulu niluvayunchu pattanamulalonu raajunoddha yerooshalemulonu solomonunaku naaluguvela gurrapu saalalunu rathamulunu pandrenduvela gurrapu rauthulunu kaligi yundenu.

26. యూఫ్రటీసునది మొదలుకొని ఫిలిష్తీ యుల దేశమువరకును ఐగుప్తు సరిహద్దువరకును ఉండు రాజు లందరి పైని అతడు ఏలుబడి చేసెను.

26. yoophrateesunadhi modalukoni philishthee yula dheshamuvarakunu aigupthu sarihadduvarakunu undu raaju landari paini athadu elubadi chesenu.

27. రాజు యెరూషలేము నందు వెండి రాళ్లంత విస్తారముగా నుండునట్లును, దేవదారు మ్రానులు షెఫేలా ప్రదేశ ముననున్న మేడివృక్షములంత విస్తారముగా నుండునట్లును చేసెను.

27. raaju yerooshalemu nandu vendi raallantha visthaaramugaa nundunatlunu, dhevadaaru mraanulu shephelaa pradhesha munanunna medivrukshamulantha visthaaramugaa nundunatlunu chesenu.

28. ఐగుప్తునుండియు సకల దేశములనుండియు సొలొమోనునకు గుఱ్ఱములు తేబడెను.

28. aigupthunundiyu sakala dheshamulanundiyu solomonunaku gurramulu thebadenu.

29. సొలొమోను చేసిన కార్యములన్నిటినిగూర్చి ప్రవక్తయైన నాతాను రచించిన గ్రంథమందును, షిలోనీయుడైన అహీయా రచించిన ప్రవచన గ్రంథమందును, నెబాతు కుమారుడైన యరొబామునుగూర్చి దీర్ఘదర్శి యైన ఇద్దోకు గ్రంథమందును వ్రాయబడి యున్నది.

29. solomonu chesina kaaryamulannitinigoorchi pravakthayaina naathaanu rachinchina granthamandunu, shiloneeyudaina aheeyaa rachinchina pravachana granthamandunu, nebaathu kumaarudaina yarobaamunugoorchi deerghadarshi yaina iddoku granthamandunu vraayabadi yunnadhi.

30. సొలొమోను యెరూషలేమునందు ఇశ్రాయేలీయులందరిమీద నలుబది సంవత్సరములు ఏలుబడి చేసెను.

30. solomonu yerooshalemunandu ishraayeleeyulandarimeeda nalubadhi samvatsaramulu elubadi chesenu.

31. తరువాత సొలొ మోను తన పితరులతో కూడ నిద్రించి తన తండ్రియైన దావీదు పట్టణమందు పాతిపెట్టబడెను; అతనికి బదులుగా అతని కుమారుడైన రెహబాము రాజాయెను.

31. tharuvaatha solo monu thana pitharulathoo kooda nidrinchi thana thandriyaina daaveedu pattanamandu paathipettabadenu; athaniki badulugaa athani kumaarudaina rehabaamu raajaayenu.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Chronicles II - 2 దినవృత్తాంతములు 9 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

షెబా రాణి. (1-12) 
ఈ చారిత్రక వృత్తాంతం యొక్క ప్రాముఖ్యత మత్తయి 12:42 లో హైలైట్ చేయబడింది. జ్ఞానం యొక్క విలువను నిజంగా గుర్తించే వారు దానిని వెంబడించడంలో ఎలాంటి శ్రమను లేదా వ్యయాన్ని విడిచిపెట్టరు అనే వాస్తవాన్ని విస్మరించకుండా ఉండటం చాలా ముఖ్యం. షెబా రాణి ఒక ఉదాహరణగా పనిచేస్తుంది, ఎందుకంటే ఆమె సొలొమోను జ్ఞానాన్ని అనుభవించడానికి చాలా కష్టాలు మరియు ఖర్చులను ఇష్టపూర్వకంగా తీసుకుంది. దేవుణ్ణి సేవించడం గురించి మరియు తన బాధ్యతలను నెరవేర్చడం గురించి అతని నుండి నేర్చుకోవడంలో ఆమె పెట్టిన పెట్టుబడి గొప్ప ప్రతిఫలాన్ని అందించింది, ఆమె ప్రయత్నాలకు సార్థకత చేకూరింది. అమూల్యమైన ముత్యం వంటి స్వర్గపు జ్ఞానం అపారమైన విలువను కలిగి ఉంది - ఒక నిధి చాలా విలువైనది, దాని కోసం మిగతావన్నీ మార్పిడి చేసుకోవడం తెలివైన మరియు ప్రతిఫలదాయకమైన ఎంపిక.

సోలమన్ సంపద మరియు అతని మరణం. (13-31)
శ్రేయస్సు యొక్క ఆకర్షణ సోలమన్ మరియు అతని సబ్జెక్టులను కొత్త మరియు అసాధారణమైన విషయాల పట్ల వాత్సల్యం వైపు ఎలా నడిపించాయో వివరించడానికి ప్రస్తావించబడిన దిగుమతులు ఉపయోగపడతాయి, వాటి అంతర్లీన ఉపయోగం లేకపోయినా. నిజమైన జ్ఞానం మరియు నిజమైన ఆనందం శాశ్వతంగా పెనవేసుకుని ఉంటాయి, అయినప్పటికీ సంపద మరియు ప్రాపంచిక ఆస్తుల తృప్తి మధ్య అలాంటి సామరస్య సంబంధం లేదు.
కాబట్టి, మన ఆత్మలకు సాంత్వన మరియు పునర్ యవ్వనాన్ని కోరుతూ రక్షకునితో పరిచయం పొందడానికి కృషి చేద్దాం. ఈ కథనంలో, అప్పటి నుండి అసమానంగా మిగిలిపోయిన సౌలభ్యం మరియు సమృద్ధి స్థితిలో సోలమన్ ఐశ్వర్యం మరియు అధికారంతో పాలించడాన్ని మనం చూస్తాము. భూమ్మీద ఉన్న ప్రముఖ పాలకులలో, అనేకమంది తమ సైనిక దోపిడీలకు ప్రసిద్ధి చెందారు, అయితే సొలొమోను పాలన ప్రగాఢ శాంతికి నలభై సంవత్సరాల నిదర్శనంగా నిలుస్తుంది.
అతనికి అపూర్వమైన ఐశ్వర్యాన్ని మరియు గౌరవాన్ని ప్రసాదిస్తానని దేవుడు చేసిన వాగ్దానం సక్రమంగా నెరవేరింది, ఇది ఏ గత లేదా భవిష్యత్తు చక్రవర్తుల కంటే మించిపోయింది. సొలొమోను యొక్క వైభవం యొక్క ప్రకాశం మెస్సీయ రాజ్యం యొక్క ఆధ్యాత్మిక వైభవానికి ప్రతీకాత్మక పూర్వగామిగా పనిచేస్తుంది, ఇతరులందరినీ మించిన అతని ఉన్నతమైన సింహాసనంతో పోల్చితే లేతగా ఉంటుంది.
కథనం విప్పుతున్నప్పుడు, ప్రసంగి 2:18-19లో గుర్తించినట్లుగా, సోలమన్ మరణాన్ని మనం ఎదుర్కొంటాము మరియు అతనికి బాగా తెలిసిన వ్యక్తికి అతని సంపద మరియు అధికారాన్ని ఇవ్వడం మూర్ఖత్వం అని రుజువు చేస్తుంది. ఈ ఫలితం అటువంటి ప్రయత్నాల నిష్ఫలతను నొక్కిచెప్పడమే కాకుండా ఆత్మ యొక్క వేదనను రేకెత్తిస్తుంది. ముఖ్యంగా, శక్తి, ఐశ్వర్యం లేదా జ్ఞానం రెండూ మరణం యొక్క రాబోయే పట్టు నుండి రక్షించలేవు లేదా దాని అనివార్యమైన రాక కోసం తగినంతగా సిద్ధం చేయలేవు.
అయినప్పటికీ, మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలము, ఎందుకంటే మన ప్రభువైన యేసుక్రీస్తు కృప ద్వారా మరణానికి సంబంధించిన భయంకరమైన శత్రువుపై కూడా విజయం సాధించి, నమ్మకమైన విశ్వాసికి విజయాన్ని ప్రసాదించేది ఆయనే.



Shortcut Links
2 దినవృత్తాంతములు - 2 Chronicles : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |