Ezra - ఎజ్రా 6 | View All

1. అప్పుడు రాజైన దర్యావేషు ఆజ్ఞ ఇచ్చినందున బబులోనులో ఖజానాలోని దస్తావేజుకొట్టులో వెదకగా

1. Then comaunded kinge Darius, that search shulde be made in ye library of ye kynges treasure house, which laye at Babilon.

2. మాదీయుల ప్రదేశమందు ఎగ్బతానా యను పురములో ఒక గ్రంథము దొరికెను. దానిలో వ్రాయబడియున్న యీ సంగతి కనబడెను.

2. So at Egbathanis in a castell that lyeth in the londe of the Meedes, there was founde a boke, & in it was there an acte wrytten after this maner:

3. రాజైన కోరెషు ఏలుబడిలో మొదటి సంవత్సరమందు అతడు యెరూషలేములో ఉండు దేవుని మందిరమును గూర్చి నిర్ణయించినదిబలులు అర్పింపతగిన స్థలముగామందిరము కట్టింపబడవలెను; దాని పునాదులు గట్టిగా వేయబడవలెను; దాని నిడివి అరువది మూరలును దాని వెడల్పు అరువది మూరలును ఉండవలెను;

3. In the first yeare of kynge Cyrus, comaunded the same kynge Cyrus to buylde ye house of God at Ierusalem, in the place where the sacrifice is made, & to laye the foundacion to beare thre score cubites heyght, & thre score cubites bredth,

4. మూడు వరుసలు గొప్ప రాళ్లచేతను ఒక వరుస క్రొత్త మ్రానుల చేతను కట్టింపబడవలెను; దాని వ్యయమును రాజుయొక్క ఖజానాలోనుండి యియ్యవలెను.

4. & thre walles of all maner of stones, and one wall of tymber, & the expences shalbe geuen of the kynges house.

5. మరియయెరూషలేములోనున్న ఆలయములోనుండి నెబుకద్నెజరు బబు లోనునకు తీసికొని వచ్చిన దేవుని మందిరముయొక్కవెండి బంగారు ఉపకరణములు తిరిగి అప్పగింపబడి, యెరూష లేములోనున్న మందిరమునకు తేబడి, దేవుని మందిరములో వాటి స్థలమందు పెట్టబడవలెను.

5. And the golde and syluer vessell of ye house of God (which Nabuchodonosor toke out of the temple at Ierusalem, and broughte vnto Babilon) shalbe restored agayne, yt they maye be broughte vnto the temple at Ierusale to their place in to the house of God.

6. కావున రాజైన దర్యావేషు ఈలాగు సెలవిచ్చెనునది యవతల అధికారియైన తత్తెనై అను నీవును, షెతర్బోజ్నయి అను నీవును నది యవతల మీతోకూడ నున్న అపర్సెకాయులును యూదులజోలికి పోక

6. Get you farre from them therfore, thou Thathnai Debyte beyonde the water, and Sethar of Bosen, & youre councelers which are beyonde the water.

7. దేవుని మందిరపు పని జరుగనిచ్చి, వారి అధికారిని పెద్దలను దేవుని మందిరమును దాని స్థలమందు కట్టింప నియ్యుడి.

7. Let them worke in ye house of God, that the Debyte of ye Iewes and their Elders maye buylde the house of God in his place.

8. మరియు దేవుని మందిరమును కట్టించునట్లుగా యూదులయొక్క పెద్దలకు మీరు చేయవలసిన సహాయ మునుగూర్చి మేము నిర్ణయించినదేమనగారాజుయొక్క సొమ్ములోనుండి, అనగా నది యవతలనుండి వచ్చిన పన్నులోనుండి వారు చేయు పనినిమిత్తము తడవు ఏమాత్ర మును చేయక వారి వ్యయమునకు కావలసినదాని ఇయ్యవలెను.

8. I haue commaunded also, what shalbe done to ye Elders of Iuda for the buyldinge of the house of God, that there shal diligently be take of the kynges goodes, euen of the rentes beyonde the water, & geuen vnto the men, and that they be not hyndered.

9. మరియు ఆకాశమందలి దేవునికి దహనబలులు అర్పించుటకై కోడెలేగాని గొఱ్ఱెపొట్టేళ్లేగాని గొఱ్ఱె పిల్లలేగాని గోధుమలే గాని ఉప్పే గాని ద్రాక్షారసమే గాని నూనెయేగాని, యెరూషలేములో నున్న యాజకులు ఆకాశమందలి దేవునికి సువాసనయైన అర్పణలను అర్పించి, రాజును అతని కుమారులును జీవించునట్లు ప్రార్థనచేయు నిమిత్తమై వారు చెప్పినదానినిబట్టి ప్రతిదినమును తప్పకుండ

9. And yf they haue nede of calues, lambes, or goates for the burntoffrynge vnto ye God of heauen, wheate, salt, wyne and oyle, after the custome of the prestes at Ierusalem, there shalbe geuen them daylie as is acordinge: and se that this be not done necligetly,

10. వారికి కావలసినదంతయు ఇయ్యవలెను.

10. that they maye offre swete sauoures vnto ye God of heauen, and praye for the kynges lyfe, and for his children.

11. ఇంకను మేము నిర్ణయించినదేమనగా, ఎవడైనను ఈ ఆజ్ఞను భంగపరచినయెడల వాని యింటివెన్నుగాడి ఊడ దీయబడి నిలువనెత్తబడి దానిమీద వాడు ఉరితీయింప బడును, ఆ తప్పునుబట్టి వాని యిల్లు పెంటరాశి చేయ బడును.

11. This commaundement haue I geue. And what man so euer he be that altereth these wordes, there shal a balke be taken from his house, and set vp, and he shalbe hanged theron, and his house shalbe prysed for the dede.

12. ఏ రాజులేగాని యే జనులేగాని యీ ఆజ్ఞను భంగపరచి యెరూషలేములోనున్న దేవుని మందిరమును నశింపజేయుటకై చెయ్యిచాపినయెడల, తన నామమును అక్కడ ఉంచిన దేవుడు వారిని నశింపజేయును. దర్యావేషు అను నేనే యీ ఆజ్ఞ ఇచ్చితిని. మరియు అది అతివేగముగా జరుగవలెనని వ్రాయించి అతడు తాకీదుగా పంపించెను.

12. But the God that dwelleth in heauen, destroye all kynges and people, that put to their hade to alter and to breake downe the house of God at Ierusalem. I Darius haue commaunded, that this be diligently done.

13. అప్పుడు నది యివతల అధికారియైన తత్తెనైయును షెతర్బోజ్నయియును వారి పక్షమున నున్నవారును రాజైన దర్యావేషు ఇచ్చిన ఆజ్ఞచొప్పున వేగముగా పని జరిపించిరి.

13. Then Thathnai ye Debyte beyonde ye water, and Sethar of Bosen with their councelers (to whom kynge Darius had sent) dyd their diligence.

14. యూదుల పెద్దలు కట్టించుచు, ప్రవక్తయైన హగ్గయియు ఇద్దో కుమారుడైన జెకర్యాయు హెచ్చ రించుచున్నందున పని బాగుగా జరిపిరి. ఈ ప్రకారము ఇశ్రాయేలీయుల దేవుని ఆజ్ఞ ననుసరించి వారు కట్టించుచు, కోరెషు దర్యావేషు అర్తహషస్త అను పారసీక దేశపురాజుల ఆజ్ఞచొప్పున ఆ పని సమాప్తి చేసిరి.

14. And ye Elders of the Iewes buylded, and they prospered thorow the prophecienge of Aggeus the prophet and Zachary the sonne of Iddo: and they buylded, and set vp the worke, acordinge to the commaundement of the God of Israel, and after the commaundement of Cyrus, Darius and Artaxerses kynges of Persia.

15. రాజైన దర్యావేషు ఏలుబడి యందు ఆరవ సంవత్సరము అదారు నెల మూడవనాటికి మందిరము సమాప్తి చేయ బడెను.

15. And they perfourmed the house vnto the thirde daye of the moneth Adar, that was the sixte yeare of the reigne of kynge Darius.

16. అప్పుడు ఇశ్రాయేలీయులును యాజకులును లేవీయులును చెరలోనుండి విడుదలనొందిన తక్కినవారును దేవుని మందిరమును ఆనందముతో ప్రతిష్ఠించిరి.

16. And the children of Israel, the prestes, the Leuites, and the other children of ye captyuite helde the dedicacion of the house of God with ioye,

17. దేవుని మందిరమును ప్రతిష్ఠించినప్పుడు నూరు ఎడ్లను రెండు వందల పొట్టేళ్లను నాలుగువందల గొఱ్ఱెపిల్లలను ఇశ్రా యేలీయులకందరికిని పాపపరిహారార్థ బలిగా ఇశ్రాయేలీ యుల గోత్రముల లెక్కచొప్పున పండ్రెండు మేక పోతులను అర్పించిరి.

17. and offred at the dedicacion of the house of God, an hundreth calues, two hundreth lambes, foure hundreth goates: and for the synofferynge for all Israel, twolue he goates, acordinge to the nombre of the trybes of Israel,

18. మరియు వారు యెరూష లేములోనున్న దేవుని సేవ జరిపించుటకై మోషే యొక్క గ్రంథమందు వ్రాసిన దానినిబట్టి తరగతులచొప్పున యాజకులను వరుసలచొప్పున లేవీయులను నిర్ణయించిరి.

18. and set the prestes in their courses, and ye Leuites in their offices, to mynister vnto God which is at Ierusale, as it is wrytten in the boke of Moses.

19. చెరలోనుండి విడుదలనొందినవారు మొదటి నెల పదునాలుగవ దినమున పస్కాపండుగ ఆచరించిరి.

19. And the children of the captyuite helde Passeouer vpon the fourtenth daye of the first moneth:

20. యాజకులును లేవీయులును తమ్మును తాము పవిత్రపరచు కొని పవిత్రులైన తరువాత, చెరలోనుండి విడుదలనొందిన వారందరికొరకును తమ బంధువులైన యాజకులకొరకును తమకొరకును పస్కాపశువును వధించిరి.

20. for ye prestes and Leuites had purified them selues, so yt they were all cleane as one man, and kylled Passeouer for all the children of the captyuite, and for their brethre the prestes, and for them selues.

21. కావున చెరలో నుండి విడుదలనొంది తిరిగివచ్చిన ఇశ్రాయేలీయులును, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను ఆశ్రయించుటకై దేశమందుండు అన్యజనులలో అపవిత్రతనుండి తమ్మును తాము ప్రత్యేకించుకొనిన వారందరును వచ్చి, తిని పులియని రొట్టెల పండుగను ఏడు దినములు ఆనంద ముతో ఆచరించిరి.

21. And the childre of Israel which were come agayne out of captiuyte, and all soch as had separated them selues vnto them from the fylthinesse of the Heythen in the londe, to seke the LORDE God of Israel, ate

22. ఏలయనగా ఇశ్రాయేలీయుల దేవుని మందిరపు పనివిషయమై వారి చేతులను బలపరచుటకు యెహోవా అష్షూరురాజు హృదయమునువారి వైపు త్రిప్పి వారిని సంతోషింపజేసెను.

22. & helde the feast of vnleueded bred seuen dayes with ioye: for the LORDE had made them glad, and turned the hert of the kynge of Assur vnto the, so that their handes were strengthed in the worke of the house of God, which is ye God of Israel.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Ezra - ఎజ్రా 6 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

ఆలయాన్ని పూర్తి చేయడానికి డిక్రీ. (1-12) 
దేవుడు తన చర్చికి సంబంధించి తన దయగల ఉద్దేశాలను నెరవేర్చడానికి నిర్ణీత సమయం వచ్చినప్పుడు, అతను ఊహించని మూలాల నుండి కూడా ఈ పనులను నిర్వహించడానికి వ్యక్తులను లేవనెత్తాడు. ఈ దైవిక సంఘటనను మనం ఎదురు చూస్తున్నప్పుడు, ఉన్నతమైన, మరింత ఆధ్యాత్మిక నిర్మాణంపై దృష్టి పెట్టడానికి జెకర్యా మనకు మార్గనిర్దేశం చేస్తాడు. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దైవిక ఉనికి ఈ పునాదిపై నిర్మించబడుతూనే ఉంది మరియు ఈ అద్భుతమైన ప్రయత్నానికి మనం చురుకుగా సహకరించాలి. సవాళ్లు ఈ పవిత్ర నిర్మాణం యొక్క పురోగతిని క్షణక్షణానికి అడ్డుకోవచ్చు. అయినప్పటికీ, వ్యతిరేకతతో మనం నిరుత్సాహపడకూడదు, ఎందుకంటే అది అతని సమృద్ధిగా ఉన్న మహిమ ప్రకారం పూర్తి అవుతుంది. అతను "దయ, దయ" అని ప్రకటిస్తూ, ఆనందకరమైన ప్రశంసలతో శిఖర రాయిని ఆవిష్కరిస్తాడు.

ఆలయం పూర్తయింది. (13-22)
సువార్త చర్చి ద్వారా ప్రాతినిధ్యం వహించే ఆధ్యాత్మిక ఆలయ నిర్మాణం సుదీర్ఘమైన ప్రక్రియ, అయితే విశ్వాసుల సామూహిక శరీరం పూర్తిగా సమావేశమైనప్పుడు అది పూర్తి అవుతుంది. ప్రతి వ్యక్తి విశ్వాసి పవిత్రతపై వారి స్వంత విశ్వాసాన్ని చురుకుగా పెంపొందించుకుంటూ సజీవ అభయారణ్యంగా పనిచేస్తాడు. ఈ పని సాతాను మరియు మన అంతర్గత పోరాటాల నుండి గణనీయమైన వ్యతిరేకతను ఎదుర్కొంటుంది. మనకు తరచుగా ఎదురుదెబ్బలు మరియు విరామాలు ఎదురవుతాయి, కానీ ఈ సద్గుణ ప్రయత్నాన్ని ప్రారంభించిన వ్యక్తి దాని సాఫల్యతను నిర్ధారిస్తాడు. చివరికి, నీతిమంతుల ఆత్మలు పరిపూర్ణతను పొందుతాయి. తమ పాపాలను తొలగించడం ద్వారా, యూదులు తమ ఇటీవలి కష్టాల బాధల నుండి విముక్తిని కోరుకున్నారు. వారి ఆరాధన ఆనందంతో వర్ణించబడింది. మనం ఉత్సాహంగా పవిత్రమైన ఆచారాలను ఆనందంగా స్వీకరించి, హృదయపూర్వకంగా దేవుని ఆనందంతో సేవిద్దాం.



Shortcut Links
ఎజ్రా - Ezra : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |