Ezra - ఎజ్రా 8 | View All
Study Bible (Beta)

1. రాజైన అర్తహషస్త ఏలుబడి కాలమందు బబులోను దేశమునుండి నాతోకూడ వచ్చిన యింటి పెద్దల వంశావళి.

1. These are the leaders of the family groups and those who were listed with them who came back with me from Babylon during the rule of King Artaxerxes.

2. ఫీనెహాసు వంశములో గెర్షోమును, ఈతామారు వంశములో దానియేలును, దావీదు వంశములో హట్టూషును,

2. From the descendants of Phinehas: Gershom. From the descendants of Ithamar: Daniel. From the descendants of David: Hattush

3. షెకన్యా పరోషుల వంశములలో జెకర్యాయు వంశావళికి నూట ఏబదిమంది పురుషులును లెక్కింపబడిరి.

3. of the descendants of Shecaniah. From the descendants of Parosh: Zechariah, with one hundred fifty men.

4. పహత్మోయాబు వంశములో జెరహ్య కుమారుడైన ఎల్యో యేనైయు రెండు వందలమంది పురుషులును

4. From the descendants of Pahath-Moab: Eliehoenai son of Zerahiah, with two hundred men.

5. షెకన్యా వంశములో యహజీయేలు కుమారుడును మూడువందల మంది పురుషులును

5. From the descendants of Zattu: Shecaniah son of Jahaziel, with three hundred men.

6. ఆదీను వంశములో యోనాతాను కుమారుడైన ఎబెదును ఏబదిమంది పురుషులును

6. From the descendants of Adin: Ebed son of Jonathan, with fifty men.

7. ఏలాము వంశములో అతల్యా కుమారుడైన యెషయాయు డెబ్బది మంది పురుషులును

7. From the descendants of Elam: Jeshaiah son of Athaliah, with seventy men.

8. షెఫట్య వంశములో మిఖాయేలు కుమారుడైన జెబద్యాయు ఎనుబదిమంది పురుషులును

8. From the descendants of Shephatiah: Zebadiah son of Michael, with eighty men.

9. యోవాబు వంశములో యెహీయేలు కుమారుడైన ఓబ ద్యాయు రెండువందల పదునెనిమిదిమంది పురుషులును

9. From the descendants of Joab: Obadiah son of Jehiel, with two hundred eighteen men.

10. షెలోమీతు వంశములో యోసిప్యా కుమారుడును నూట అరువదిమంది పురుషులును

10. From the descendants of Bani: Shelomith son of Josiphiah, with one hundred sixty men.

11. బేబై వంశములో బేబై కుమారుడైన జెకర్యాయు ఇరువది ఎనిమిదిమంది పురుషు లును

11. From the descendants of Bebai: Zechariah son of Bebai, with twenty-eight men.

12. అజ్గాదు వంశములో హక్కాటాను కుమారుడైన యోహానానును నూట పదిమంది పురుషులును

12. From the descendants of Azgad: Johanan son of Hakkatan, with one hundred ten men.

13. అదోనీ కాముయొక్క చిన్న కుమారులలో ఎలీపేలెటును యెహీ యేలును షెమయాయు అరువదిమంది పురుషులును

13. From the descendants of Adonikam, these were the last ones: Eliphelet, Jeuel, and Shemaiah, with sixty men.

14. బిగ్వయి వంశములో ఊతైయును జబ్బూదును డెబ్బది మంది పురుషులును.

14. From the descendants of Bigvai: Uthai and Zaccur, with seventy men.

15. వీరిని నేను అహవా వైపునకు పారు నదియొద్దకు సమకూర్చితిని. అచ్చట మేము మూడు దిన ములు గుడార ములలో ఉంటిమి. అంతలో నేను జనులను యాజకులను తనికీ చూడగా లేవీయుడొకడును నాకు కనబడలేదు.

15. I called all those people together at the canal that flows toward Ahava, where we camped for three days. I checked all the people and the priests, but I did not find any Levites.

16. అప్పుడు నేను పెద్దలైన ఎలీయెజెరు అరీయేలు షెమయా ఎల్నాతాను యారీబు ఎల్నాతాను నాతాను జెకర్యా మెషుల్లాము అను వారిని, ఉపదేశకులగు యోయారీబు ఎల్నాతానులను పిలువనంపించి

16. So I called these leaders: Eliezer, Ariel, Shemaiah, Elnathan, Jarib, Elnathan, Nathan, Zechariah, and Meshullam. And I called Joiarib and Elnathan, who were teachers.

17. కాసిప్యా అను స్థల మందుండు అధికారియైన ఇద్దోయొద్దకు వారిని పంపి, మా దేవుని మందిరమునకు పరిచారకులను మాయొద్దకు తీసికొని వచ్చునట్లుగా కాసిప్యా అను స్థలమందుండు ఇద్దోతోను అతని బంధువులైన నెతీనీయులతోను చెప్పవలసిన మాటలను వారికి తెలియజెప్పితిని.

17. I sent these men to Iddo, the leader at Casiphia, and told them what to say to Iddo and his relatives, who are the Temple servants in Casiphia. I sent them to bring servants to us for the Temple of our God.

18. మా దేవుని కరుణా హస్తము మాకు తోడుగా ఉన్నందున వారు ప్రజ్ఞావంతుడైన ఒకనిని షేరేబ్యాను అతని కుమారులను సహోదరులను, పదు నెనిమిదిమందిని తోడుకొని వచ్చిరి. ఆ ప్రజ్ఞావంతుడు మహలి కుమారులలో ఒకడు; ఈ మహలి ఇశ్రాయేలునకు పుట్టిన లేవి వంశస్థుడు.

18. Our God was helping us, so Iddo's relatives gave us Sherebiah, a wise man from the descendants of Mahli son of Levi, who was the son of Israel. And they brought Sherebiah's sons and brothers, for a total of eighteen men.

19. హషబ్యాను అతనితోకూడ మెరారీయుడగు యెషయాను అతని బంధువులును వారి కుమారులునైన యిరువదిమందిని వారు తోడుకొని వచ్చిరి.

19. And they brought to us Hashabiah and Jeshaiah from the descendants of Merari, and his brothers and nephews. In all there were twenty men.

20. మరియలేవీయులు చేయవలసిన సేవలో తోడ్పడుటకై దావీదును అధిపతులును నిర్ణయించిన నెతీనీయులలో రెండువందల ఇరువదిమంది వచ్చిరి. వీరందరును పేర్లు ఉదాహరింపబడి నియమింపబడినవారు.

20. They also brought two hundred twenty of the Temple servants, a group David and the officers had set up to help the Levites. All of those men were listed by name.

21. అప్పుడు దేవుని సన్నిధిని మమ్మును మేము దుఃఖపరచుకొని, మాకును మా చిన్న వారికిని మా ఆస్తికిని శుభ ప్రయాణము కలుగునట్లుగా ఆయనను వేడుకొనుటకు అహవా నదిదగ్గర ఉప వాసముండుడని ప్రకటించితిని.

21. There by the Ahava Canal, I announced we would all give up eating and humble ourselves before our God. We would ask God for a safe trip for ourselves, our children, and all our possessions.

22. మేలు కలుగజేయుటకై ఆయనను ఆశ్రయించు వారికందరికిని మా దేవుని హస్తము తోడుగా ఉండునుగాని, ఆయన హస్తమును ఆయన ఉగ్రతయు ఆయనను విసర్జించు వారందరిమీదికి వచ్చునని మేము రాజుతో చెప్పియుంటిమి గనుక మార్గ మందున్న శత్రువుల విషయమై మాకు సహాయము చేయునట్లు కాల్బలమును రౌతులును రాజునొద్ద కావలెనని మనవి చేయుటకు సిగ్గు నాకు తోచెను.

22. I was ashamed to ask the king for soldiers and horsemen to protect us from enemies on the road. We had said to the king, 'Our God helps everyone who obeys him, but he is very angry with all who reject him.'

23. మేముఉపవాసముండి ఆ సంగతినిబట్టి మా దేవుని వేడుకొనగా ఆయన మా మనవిని అంగీకరించెను

23. So we gave up eating and prayed to our God about our trip, and he answered our prayers.

24. గనుక నేను యాజ కులలోనుండి ప్రధానులైన పండ్రెండు మందిని, అనగా షేరేబ్యాను హషబ్యాను వీరి బంధువులలో పదిమందిని ఏర్పరచి

24. Then I chose twelve of the priests who were leaders, Sherebiah, Hashabiah, and ten of their relatives.

25. మా దేవుని మందిరమును ప్రతిష్ఠించుట విషయ ములో రాజును అతని మంత్రులును అధిపతులును అక్కడ నున్న ఇశ్రాయేలీయులందరును ప్రతిష్ఠించిన వెండిబంగార ములను ఉపకరణములను తూచి వారికి అప్పగించితిని.

25. I weighed the offering of silver and gold and the utensils given for the Temple of our God, and I gave them to the twelve priests I had chosen. The king, the people who advised him, his officers, and all the Israelites there with us had given these things for the Temple.

26. వెయ్యిన్ని మూడువందల మణుగుల వెండిని రెండువందల మణుగుల వెండి ఉపకరణములను, రెండువందల మణుగుల బంగారమును,

26. I weighed out and gave them about fifty thousand pounds of silver, about seventy-five hundred pounds of silver objects, and about seventy-five hundred pounds of gold.

27. ఏడువేల తులములుగల యిరువది బంగా రపు గిన్నెలను, బంగారమంత వెలగల పరిశుద్ధమైన రెండు రాగి పాత్రలను తూచి

27. I gave them twenty gold bowls that weighed about nineteen pounds and two fine pieces of polished bronze that were as valuable as gold.

28. వారిచేతికి అప్పగించిమీరు యెహోవాకు ప్రతిష్ఠింపబడినవారు, పాత్రలును ప్రతి ష్ఠితములైనవి. ఈ వెండి బంగారములును మీ పితరుల దేవుడైన యెహోవాకు స్వేచ్ఛార్పణలై యున్నవి.

28. Then I said to the priests, 'You and these utensils belong to the Lord for his service. The silver and gold are gifts to the Lord, the God of your ancestors.

29. కాబట్టి మీరు యెరూషలేములో యెహోవా మందిరపు ఖజానా గదులలో, యాజకులయొక్కయు లేవీయుల యొక్కయు ఇశ్రాయేలు పెద్దలయొక్కయు ప్రధానులైన వారి యెదుట, వాటిని తూచి అప్పగించు వరకు వాటిని భద్రముగా ఉంచుడని వారితో చెప్పితిని.

29. Guard these things carefully. In Jerusalem, weigh them in front of the leading priests, Levites, and the leaders of the family groups of Israel in the rooms of the Temple of the Lord.'

30. కాబట్టి యాజకులును లేవీయులును వాటి యెత్తు ఎంతో తెలిసికొని, యెరూషలేములోనున్న మన దేవుని మందిరమునకు కొనిపోవుటకై ఆ వెండి బంగారములను పాత్రలను తీసికొనిరి.

30. So the priests and Levites accepted the silver, the gold, and the utensils that had been weighed to take them to the Temple of our God in Jerusalem.

31. మేము మొదటి నెల పండ్రెండవ దినమందు యెరూష లేమునకు వచ్చుటకై అహవా నదినుండి బయలుదేరగా, మా దేవుని హస్తము మాకు తోడుగా నుండి, శత్రువుల చేతిలోనుండియు మార్గమందు పొంచియున్నవారి చేతిలో నుండియు మమ్మును తప్పించినందున

31. On the twelfth day of the first month we left the Ahava Canal and started toward Jerusalem. Our God helped us and protected us from enemies and robbers along the way.

32. మేము యెరూష లేమునకు వచ్చి మూడుదినములు అక్కడ బసచేసితివిు.

32. Finally we arrived in Jerusalem where we rested three days.

33. నాలుగవ దినమున వెండి బంగారములును పాత్రలును మా దేవుని మందిరమందు యాజకుడైన ఊరియా కుమారుడైన మెరేమోతుచేత తూనిక వేయబడెను. అతనితో కూడ ఫీనెహాసు కుమారుడైన ఎలియాజరు ఉండెను; వీరితో లేవీయులైన యేషూవ కుమారుడైన యోజాబాదును బిన్నూయి కుమారుడైన నోవద్యాయును కూడనుండిరి.

33. On the fourth day we weighed out the silver, the gold, and the utensils in the Temple of our God. We handed them to the priest Meremoth son of Uriah. Eleazar son of Phinehas was with him, as were the Levites Jozabad son of Jeshua and Noadiah son of Binnui.

34. సంఖ్యచొప్పునను ఎత్తుచొప్పునను అన్నిటిని సరిచూచిన తరువాత వాటి యెత్తు ఎంతైనది లెక్కలలో వ్రాసిరి.

34. We checked everything by number and by weight, and the total weight was written down.

35. మరియు చెరలోనికి కొనిపోబడిన వారికి పుట్టి చెరనుండి విడుదలనొంది తిరిగి వచ్చినవారు ఇశ్రాయేలీయుల దేవునికి దహన బలులు అర్పించిరి. ఇశ్రాయేలీయులందరికొరకు పండ్రెండు ఎడ్లను తొంబది యారు పొట్టేళ్లను డెబ్బది యేడు గొఱ్ఱెపిల్లలను, పాపపరిహారార్థబలిగా పండ్రెండు మేకపోతులను తెచ్చి అన్నిటిని దహనబలిగా యెహోవాకు అర్పించిరి.

35. Then the captives who returned made burnt offerings to the God of Israel. They sacrificed twelve bulls for all Israel, ninety-six male sheep, and seventy-seven lambs. For a sin offering there were twelve male goats. All this was a burnt offering to the Lord.

36. వారు రాజుయొక్క నిర్ణయములను రాజుయొక్క సేనాధిపతులకును నది యివతలనున్న అధికారులకును అప్పగించిన తరువాత వీరు జనులకును దేవుని మందిరపు పనికిని సహాయము చేసిరి.

36. They took King Artaxerxes' orders to the royal officers and to the governors of Trans-Euphrates. Then these men gave help to the people and the Temple of God.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Ezra - ఎజ్రా 8 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

ఎజ్రా సహచరులు. (1-20) 
ఎజ్రా ఇజ్రాయెల్ నుండి అట్టడుగు వ్యక్తులను మరియు యూదా నుండి చెల్లాచెదురుగా ఉన్న వ్యక్తులను సేకరిస్తాడు. దైవిక ప్రభావం అతనితో చేరడానికి నిరాడంబరమైన కొద్దిమంది హృదయాలను కదిలిస్తుంది. గౌరవప్రదమైన వ్యక్తులు దాని గురించి సంప్రదించనందున ఒక సద్గుణ ప్రయత్నాన్ని నిర్లక్ష్యం చేయడం విచారకరం.

ఎజ్రా దేవుని ఆశీర్వాదాన్ని వేడుకున్నాడు. (21-23)
ఎజ్రా తనతో పాటు లేవీయులను చేర్చుకున్నాడు, అయినప్పటికీ అతనికి దేవుని దైవిక మార్గదర్శకత్వం లేకపోతే వారి ఉనికికి పెద్దగా ప్రాముఖ్యత ఉండదు. దేవునితో సంబంధాన్ని ఆసక్తిగా కొనసాగించేవారు, అత్యంత ప్రమాదకరమైన క్షణాల్లో కూడా, అతని రక్షిత ఆలింగనం క్రింద ఆశ్రయం పొందుతారు. దీనికి విరుద్ధంగా, ఆయనను విడిచిపెట్టిన వారు శాశ్వతంగా దుర్బలమైన స్థితిలో ఉంటారు. జీవితం యొక్క కొత్త దశను ప్రారంభించినప్పుడల్లా, మన మునుపటి స్థితి నుండి ఎటువంటి అతిక్రమణలు తాజా ప్రారంభాన్ని కలుషితం చేయకుండా చూసుకోవడం చాలా ముఖ్యం.
ఆసన్నమైన ప్రమాదాన్ని ఎదుర్కొన్నప్పుడు, మన ప్రాధాన్యత దేవునితో రాజీపడాలి, తద్వారా మనకు వ్యతిరేకంగా ఏదైనా నిజమైన హానిని శక్తిహీనంగా మారుస్తుంది. మన గురించి, మన కుటుంబాలు మరియు మన ఆస్తుల గురించి మన ఆందోళనలన్నీ ప్రార్థన ద్వారా దేవునికి అప్పగించబడాలి, వాటిపై ఆయన సార్వభౌమాధికారాన్ని అంగీకరించాలి. అదనంగా, కొన్ని సందర్భాల్లో, మనకు అందుబాటులో ఉన్న ప్రయోజనకరమైన అవకాశాలను వదులుకోవడం, ఇతరులకు అభ్యంతరం కలిగించకుండా నిరోధించడం మరియు తద్వారా మన దేవునికి ఎలాంటి అవమానం జరగకుండా చేయడం తెలివైన పని. న్యాయబద్ధమైన అవకాశాలను సముచితంగా స్వీకరించడం లేదా తిరస్కరించడం ఎలాగో వివేచించగలిగేలా మనం జ్ఞానం కోసం దేవుణ్ణి ప్రార్థిద్దాం. దేవుని పట్ల మనకున్న భక్తిలో, రిస్క్‌లు తీసుకోవడం, కష్టాలను భరించడం లేదా ఆయన కోసం వస్తువులను విడిచిపెట్టడం ద్వారా మనం ఎలాంటి లోటును ఎదుర్కోకూడదు.
వారి తీవ్రమైన ప్రార్థనలకు దైవిక సమాధానాలు లభించాయి మరియు తదుపరి సంఘటనలు ఈ సత్యానికి సాక్ష్యమిచ్చాయి. యథార్థంగా దేవుణ్ణి వెదకేవారు తమ అన్వేషణ ఫలించలేదు. సంక్లిష్టత మరియు ప్రమాదం యొక్క క్షణాలలో, ప్రైవేట్ లేదా మతపరమైన ప్రార్థనల కోసం అంకితమైన సమయాన్ని కేటాయించడం అనేది ఓదార్పు మరియు విముక్తి కోసం మనం ఉపయోగించగల అత్యంత ప్రభావవంతమైన పరిష్కారం.

పూజారులకు కట్టబడిన నిధులు. (24-30) 
దేవుడు తన ప్రావిడెన్స్ ద్వారా మన ఆస్తులను రక్షిస్తాడని మనం ఎదురుచూడాలి, అప్పుడు మనం, ఆయన దయ ద్వారా, ఆయనకు సంబంధించిన వాటిని కాపాడుకుందాం. దేవుని గౌరవం మరియు పురోగమనాన్ని కాపాడటానికి ప్రాధాన్యత ఇవ్వండి మరియు క్రమంగా, మన శ్రేయస్సు మరియు ఆనందాలు ఆయన ఉద్దేశాలకు అనుగుణంగా ఉంటాయని మనం ఊహించవచ్చు.

ఎజ్రా జెరూసలేంకు వచ్చాడు. (31-36)
ప్రత్యర్థులు యూదుల కోసం ఆకస్మికంగా ఉన్నారు, అయినప్పటికీ దేవుడు వారిని హాని నుండి రక్షించాడు. ప్రయాణాలలో ఎదురయ్యే సాధారణ ప్రమాదాలు కూడా ప్రార్థనలతో బయలుదేరాలని మరియు ప్రశంసలు మరియు కృతజ్ఞతా వ్యక్తీకరణలతో తిరిగి రావాలని మనకు గుర్తు చేస్తాయి. అయితే, దేవుడు మన జీవిత ప్రయాణంలో, మృత్యువు యొక్క నీడలో ఉన్న మార్గం ద్వారా, మన శత్రువులందరి పట్టును దాటి, శాశ్వతమైన ఆనందానికి సురక్షితంగా నడిపించినప్పుడు మనం మన కృతజ్ఞతా భావాన్ని ఎలా సమర్పించాలి!
వారి అర్పణల మధ్య, వారు పాపపరిహారార్థబలిని చేర్చారు. ఈ సయోధ్య చర్య మనకు అందించబడిన ప్రతి ఆశీర్వాదాన్ని మెరుగుపరుస్తుంది మరియు రక్షిస్తుంది, ఎందుకంటే పాపం తొలగించబడి దేవునితో మన సయోధ్య ఏర్పడితే తప్ప నిజమైన ఓదార్పును పొందలేము. ఫలితంగా చర్చిలో ప్రశాంతత నెలకొంది. ఇక్కడ ఉపయోగించిన పదబంధాలు పాపులను ఆధ్యాత్మిక బంధం నుండి విముక్తి చేయడం మరియు ఖగోళ జెరూసలేం వైపు వారి తీర్థయాత్రల వైపు మనల్ని సూచిస్తాయి, అన్నీ వారి దైవిక విమోచకుని జాగ్రత్తగా మరియు రక్షణలో ఉన్నాయి.



Shortcut Links
ఎజ్రా - Ezra : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |