Turn Off
21st Century KJV
A Conservative Version
American King James Version (1999)
American Standard Version (1901)
Amplified Bible (1965)
Apostles' Bible Complete (2004)
Bengali Bible
Bible in Basic English (1964)
Bishop's Bible
Complementary English Version (1995)
Coverdale Bible (1535)
Easy to Read Revised Version (2005)
English Jubilee 2000 Bible (2000)
English Lo Parishuddha Grandham
English Standard Version (2001)
Geneva Bible (1599)
Hebrew Names Version
Hindi Bible
Holman Christian Standard Bible (2004)
Holy Bible Revised Version (1885)
Kannada Bible
King James Version (1769)
Literal Translation of Holy Bible (2000)
Malayalam Bible
Modern King James Version (1962)
New American Bible
New American Standard Bible (1995)
New Century Version (1991)
New English Translation (2005)
New International Reader's Version (1998)
New International Version (1984) (US)
New International Version (UK)
New King James Version (1982)
New Life Version (1969)
New Living Translation (1996)
New Revised Standard Version (1989)
Restored Name KJV
Revised Standard Version (1952)
Revised Version (1881-1885)
Revised Webster Update (1995)
Rotherhams Emphasized Bible (1902)
Tamil Bible
Telugu Bible (BSI)
Telugu Bible (WBTC)
The Complete Jewish Bible (1998)
The Darby Bible (1890)
The Douay-Rheims American Bible (1899)
The Message Bible (2002)
The New Jerusalem Bible
The Webster Bible (1833)
Third Millennium Bible (1998)
Today's English Version (Good News Bible) (1992)
Today's New International Version (2005)
Tyndale Bible (1534)
Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537)
Updated Bible (2006)
Voice In Wilderness (2006)
World English Bible
Wycliffe Bible (1395)
Young's Literal Translation (1898)
Telugu Bible Verse by Verse Explanation
పరిశుద్ధ గ్రంథ వివరణ
Telugu Bible Commentary
Telugu Reference Bible
1. అప్పుడు నయమాతీయుడైన జోఫరు ఈలాగున ప్రత్యుత్తరమిచ్చెను
2. ఆలాగున నీవు చెప్పినందుకు నాయందలి ఆతురతతగిన ప్రత్యుత్తరము సిద్ధపరచియున్నది.
3. నాకు అవమానము కలుగజేయు నిందను నేను విన్నందుకు నా మనోవివేకము తగిన ప్రత్యుత్తరము సిద్ధపరచియున్నది.
యోబు స్నేహితులు అతణ్ణి దూషించారు. అతని తలపై అపనిందలు కుమ్మరించారు. వాటితో పోల్చుకుంటే యోబు వారిని గద్దించిన రీతి సున్నితమే (యోబు 19:28-29). కానీ దానికి వారు బాధపడి కోపం తెచ్చుకున్నారు.
4. దుష్టులకు విజయము కొద్దికాలముండును భక్తిహీనులకు సంతోషము ఒక నిమిష మాత్రముండును.
యోబు చెప్పినదేది అతని స్నేహితుల తప్పుడు సిద్ధాంతాన్ని కదిలించలేకపోయింది. ఏ క్రొత్త ఆలోచననూ స్వీకరించేందుకు వారి మనస్సులు సిద్ధంగా లేవు. తాము జ్ఞానులమనీ జీవిత సమస్యలకు తమ దగ్గర జవాబులున్నాయనీ వాళ్ళ గట్టి నమ్మకం. కానీ యోబులాంటి మనిషిని అర్థం చేసుకోవడం కనీసం మొదలు పెట్టడం కూడా వాళ్ళ తరంకాదు. ఈ రెండో సారి మాటల్లో జోఫరు పాత పాటే పాడుతున్నాడు (యోబు 11:6 యోబు 11:10-12). యోబు ఎలాంటివాడని తాను అనుకుంటున్నాడో వర్ణిస్తూ ఉన్న అతని మాటలు ముందటికంటే పదునుగా ఉన్నాయి. మానవ చరిత్ర తన సిద్ధాంతాన్ని రుజువు చేస్తుందట (4,5 వ). దుష్టుడు కొంతకాలం వర్ధిల్లవచ్చు (యోబు లాగా), అయితే అతను తప్పకుండా నాశనమౌతాడు (6-11 వ). అన్యాయంగా అతడు సంపాదించుకొన్నదంతా అతనితోనే పోతుంది (12-22 వ). దేవుడే అతనికి విరోధంగా లేచి అతని దోషాన్ని బయట పెట్టి అతణ్ణి నాశనానికి గురి చేస్తాడు (23-29 వ). ఈ విషపూరితమైన మాటల్లో జోఫరు యోబును పరోక్షంగా దుర్మార్గుడు (5 వ), గర్విష్ఠి (6 వ), దుష్టత్వాన్ని ప్రేమించేవాడు (12,13 వ), పేదలను బాధించేవాడు (19 వ), దురాశపరుడు (20 వ) అని వర్ణిస్తున్నాడు. యోబు ఇలాంటివాడు అనడానికి జోఫరుకు ఎలాంటి ఆధారమూ లేదు. యోబు ఇలాంటివాడై ఉండాలి అని జోఫరును నమ్మించేది అతని సిద్ధాంతమే (యోబు 18:5-21 నోట్ చూడండి).
5. ఆది నుండి నరులు భూమిమీద నుంచబడిన కాలము మొదలుకొని ఈలాగు జరుగుచున్నదని నీకు తెలియదా?
6. వారి ఘనత ఆకాశమంత యెత్తుగా పెరిగినను మేఘములంత యెత్తుగా వారు తలలెత్తినను
7. తమ మలము నశించురీతిగా వారెన్నటికిని నుండకుండ నశించుదురు. వారిని చూచినవారు వారేమైరని యడుగుదురు.
8. కల యెగసిపోవునట్లు వారు గతించి కనబడక పోవుదురు రాత్రి స్వప్నము దాటిపోవునట్లు వారు తరిమి వేయబడుదురు.
9. వారిని చూచిన కన్ను ఇకను వారిని చూడదు వారి స్థలమున వారు మరి ఎప్పుడును కనబడరు
10. వారి సంతతివారు దరిద్రుల దయను వెదకెదరు వారి చేతులు వారి ఆస్తిని తిరిగి అప్పగించును.
11. వారి యెముకలలో ¸యౌవనబలము నిండియుండును గాని అదియు వారితో కూడ మంటిలో పండుకొనును.
12. చెడుతనము వారి నోటికి తియ్యగా నుండెనువారు నాలుకక్రింద దాని దాచిపెట్టిరి.
13. దాని పోనియ్యక భద్రము చేసికొనిరి, నోట దానినుంచుకొనిరి.
14. అయినను వారి కడుపులో వారి ఆహారము పులిసిపోవును అది వారిలోపట నాగుపాముల విషమగును.
15. వారు ధనమును మింగివేసిరి గాని యిప్పుడు దానిని మరల కక్కివేయుదురు.
16. వారి కడుపులోనుండి దేవుడు దాని కక్కించును. వారు కట్లపాముల విషమును పీల్చుదురు నాగుపాము నాలుక వారిని చంపును.
17. ఏరులై పారుచున్న తేనెను వెన్నపూసను చూచివారు సంతోషింపరు.
18. దేని కొరకు వారు ప్రయాసపడి సంపాదించియుండిరో దానిని వారు అనుభవింపక మరల అప్పగించెదరు వారు సంపాదించిన ఆస్తికొలది వారికి సంతోషముండదు
19. వారు బీదలను ముంచి విడిచిపెట్టినవారు వారు బలాత్కారముచేత ఒక యింటిని ఆక్రమించుకొనినను దానిని కట్టి పూర్తిచేయరు.
20. వారు ఎడతెగక ఆశించిన వారు తమ యిష్టవస్తువులలో ఒకదాని చేతనైనను తమ్మును తాము రక్షించుకొనజాలరు.
21. వారు మింగివేయనిది ఒకటియు లేదు గనుక వారిక్షేమస్థితి నిలువదు.
22. వారికి సంపాద్యము పూర్ణముగా కలిగిన సమయమున వారు ఇబ్బందిపడుదురు దురవస్థలోనుండు వారందరి చెయ్యి వారిమీదికివచ్చును.
23. వారు కడుపు నింపుకొననైయుండగా దేవుడు వారిమీద తన కోపాగ్ని కురిపించును వారు తినుచుండగా దాని కురిపించును.
24. ఇనుప ఆయుధము తప్పించుకొనుటకై వారు పారిపోగా ఇత్తడివిల్లు వారి దేహములగుండ బాణములను పోవిడు చును.
25. అది దేహమును చీల్చి వారి శరీరములోనుండి వచ్చును అది బయట తీయగా వారి శరీరములోనుండి పైత్యపు తిత్తి వచ్చును, మరణభయము వారి మీదికి వచ్చును.
26. వారి ధననిధులు అంధకారపూర్ణములగును ఊదనక్కరలేని అగ్ని వారిని మింగివేయును వారి గుడారములో మిగిలిన దానిని అది కాల్చివేయును.
27. ఆకాశము వారి దోషమును బయలుపరచును భూమి వారిమీదికి లేచును.
28. వారి యింటికి వచ్చిన ఆర్జన కనబడకపోవును దేవుని కోపదినమున వారి ఆస్తి నాశనమగును.
29. ఇది దేవుని వలన దుష్టులైన నరులకు ప్రాప్తించుభాగము దేవునివలన వారికి నియమింపబడిన స్వాస్థ్యము ఇదే.