Turn Off
21st Century KJV
A Conservative Version
American King James Version (1999)
American Standard Version (1901)
Amplified Bible (1965)
Apostles' Bible Complete (2004)
Bengali Bible
Bible in Basic English (1964)
Bishop's Bible
Complementary English Version (1995)
Coverdale Bible (1535)
Easy to Read Revised Version (2005)
English Jubilee 2000 Bible (2000)
English Lo Parishuddha Grandham
English Standard Version (2001)
Geneva Bible (1599)
Hebrew Names Version
Hindi Bible
Holman Christian Standard Bible (2004)
Holy Bible Revised Version (1885)
Kannada Bible
King James Version (1769)
Literal Translation of Holy Bible (2000)
Malayalam Bible
Modern King James Version (1962)
New American Bible
New American Standard Bible (1995)
New Century Version (1991)
New English Translation (2005)
New International Reader's Version (1998)
New International Version (1984) (US)
New International Version (UK)
New King James Version (1982)
New Life Version (1969)
New Living Translation (1996)
New Revised Standard Version (1989)
Restored Name KJV
Revised Standard Version (1952)
Revised Version (1881-1885)
Revised Webster Update (1995)
Rotherhams Emphasized Bible (1902)
Tamil Bible
Telugu Bible (BSI)
Telugu Bible (WBTC)
The Complete Jewish Bible (1998)
The Darby Bible (1890)
The Douay-Rheims American Bible (1899)
The Message Bible (2002)
The New Jerusalem Bible
The Webster Bible (1833)
Third Millennium Bible (1998)
Today's English Version (Good News Bible) (1992)
Today's New International Version (2005)
Tyndale Bible (1534)
Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537)
Updated Bible (2006)
Voice In Wilderness (2006)
World English Bible
Wycliffe Bible (1395)
Young's Literal Translation (1898)
Telugu Bible Verse by Verse Explanation
పరిశుద్ధ గ్రంథ వివరణ
Telugu Bible Commentary
Telugu Reference Bible
1. నా శ్రమలో నేను యెహోవాకు మొఱ్ఱపెట్టితిని ఆయన నాకు ఉత్తరమిచ్చెను.
శీర్షిక – దీనితో ప్రారంభమై రాబోయే పదిహేను కీర్తనలకూ “యాత్రల కీర్తనలు” అని పేరు. ఇలా అనువదించబడిన హీబ్రూ పదానికి ఎక్కివెళ్ళడం అని అర్థం. ఇక్కడ వాడబడినట్టు ఈ పదంలోని అంతరార్థమేమిటోనని పండితులు చాలా తర్జనభర్జనలు జరిపి వివిధ రకాలైన అభిప్రాయాలు చెప్పారు. బహుశా అన్నిటికన్నా మంచి అభిప్రాయం ఇది – నిర్గమకాండము 34:23-24; ద్వితీయోపదేశకాండము 16:16 ప్రకారం, వారి ఆచారాన్ని బట్టి, సంవత్సరంలో మూడు సార్లు వారి పండుగ సమయాల్లో యూదులు యాత్రికులుగా జెరుసలంలో దేవుణ్ణి ఆరాధించేందుకు వెళ్ళారు. యూదా కొండల్లో ఎత్తయిన ప్రదేశంలో జెరుసలం ఉంది. అందువల్ల ఎక్కువమంది అక్కడికి చేరాలంటే ఎక్కివెళ్ళవలసి ఉంది. దారిలో వారు ఈ యాత్రల కీర్తనలను పాడుకొనేవారనుకోవచ్చు. 122 వ కీర్తనలోని వ 1,4 ఈ పదిహేను కీర్తనలన్నిటికీ మూల వాక్యాలుగా ఉండవచ్చు. ఇప్పుడు విశ్వాసులకు ఉండవలసిన ముఖ్యోద్దేశం కూడా ఆధ్యాత్మికంగా ఎక్కిపోయి దేవునికి మరింత చేరువ కావడమే. ఈ యాత్రల కీర్తనల్లోని ఆధ్యాత్మిక ఉపదేశాలను ఆచరణలో పెడితే తప్పక అలా జరుగుతుంది. ఈ కీర్తనలు చాలావరకు చిన్నవి. ప్రార్థనలు గంబీరంగా శక్తివంతంగా ఉండాలంటే సుదీర్ఘంగా ఉండవలసిన అవసరం లేదని ఇవి తెలియజేస్తున్నవి. కీర్తనల గ్రంథము 18:6; కీర్తనల గ్రంథము 31:7; కీర్తనల గ్రంథము 77:2; కీర్తనల గ్రంథము 120:1; కీర్తనల గ్రంథము 118:5.
2. యెహోవా, అబద్ధమాడు పెదవులనుండియు మోసకరమైన నాలుకనుండియు నా ప్రాణమును విడిపించుము.
రచయిత దీనావస్థ అబద్ధాలు, కొండేలు పలికేవారి మూలంగా కలిగింది (కీర్తనల గ్రంథము 5:9; కీర్తనల గ్రంథము 10:7; కీర్తనల గ్రంథము 12:2; కీర్తనల గ్రంథము 28:3; కీర్తనల గ్రంథము 36:3; కీర్తనల గ్రంథము 43:1; కీర్తనల గ్రంథము 144:8). అబద్ధాలు, కపటాలు, అపనిందలు అన్ని వైపులా ఉన్నప్పుడు మనం దేవునికి మాత్రమే మొరపెట్టాలి. మనల్ని మన ఆధ్మాత్మిక జీవితాల్లో ఎత్తుకు తీసుకువెళ్ళేందుకు ఇలాంటి పరిస్థితులను దేవుడు వాడుకుంటాడు.
3. మోసకరమైన నాలుకా, ఆయన నీకేమి చేయును? ఇంతకంటె అధికముగా నీకేమి చేయును?
అబద్ధాలాడేవారి పట్ల, మోసగాళ్ళ పట్ల దేవుడు సరైన సమయంలో తగిన రీతిలో వ్యవహరిస్తాడు. అబద్ధాలాడే నాలుకలు పదునైన బాణాల్లాంటివి (కీర్తనల గ్రంథము 57:4; కీర్తనల గ్రంథము 64:3; సామెతలు 25:18; యిర్మియా 9:8), మండే అగ్నిలాంటివి (సామెతలు 16:27; యాకోబు 3:6). అలాంటివారికి దేవుడు పంపే తగిన శిక్ష బాణాలూ, మంటలే. న్యాయంగా మనుషులకు తీర్పు తీర్చే దేవుని విధానాల గురించి కీర్తనల గ్రంథము 18:25-27; కీర్తనల గ్రంథము 63:9-10; కీర్తనల గ్రంథము 64:7-8 చూడండి. చివరికి ఆయన తన ప్రజలందరినీ అబద్ధికులనుంచీ, కొండేలు చెప్పే వారి నుంచి విడిపించి అలాంటివారు లోకంలో లేకుండా చేస్తాడు (ప్రకటన గ్రంథం 21:8 ప్రకటన గ్రంథం 21:27).
4. తంగేడునిప్పులతో కూడిన బాణములను బలాఢ్యుల వాడిగల బాణములను నీమీద వేయును
5. అయ్యో, నేను మెషెకులో పరదేశినై యున్నాను. కేదారు గుడారములయొద్ద కాపురమున్నాను.
మెషెక్ ఇస్రాయేల్కు ఉత్తరాన చాలా దూరాన ఉంది, కేదార్ దక్షిణాన ఉంది. రచయిత ఒకే సమయంలో రెండు చోట్లా ఉండడం సాధ్యం కాదు. ఇక్కడ ఇతడు అలంకారిక భాషను ఉపయోగిస్తున్నాడు. తన ఇరుగు పొరుగువారు దేవుణ్ణి ఎరుగని ఆ ఆటవిక జనం లాంటివారుగా అతనికి అనిపించింది.
6. కలహప్రియునియొద్ద నేను చిరకాలము నివసించినవాడను.
రోమీయులకు 12:18; రోమీయులకు 14:19; హెబ్రీయులకు 12:14. అందరితోనూ శాంతి సమాధానాలతో జీవించడం అస్తమానమూ కుదరదు. శాంతి కోసమని ఆధ్యాత్మిక సూత్రాలకు నీళ్ళొదలకూడదు లేక మూర్ఖత్వంతో రాజీపడకూడదు.
7. నేను కోరునది సమాధానమే అయినను మాట నా నోట వచ్చినతోడనే వారు యుద్ధమునకు సిద్ధమగుదురు.