Exodus - నిర్గమకాండము 12 | View All
Study Bible (Beta)

1. మోషే అహరోనులు ఐగుప్తుదేశములో ఉండగా యెహోవా వారితో ఈలాగు సెలవిచ్చెను
మత్తయి 26:2

1. And the Lorde spake vnto Moyses and Aaron in the lande of Egypt, saying:

2. నెలలలో ఈ నెల మీకు మొదటిది, యిది మీ సంవత్సరమునకు మొదటి నెల.

2. This moneth shalbe vnto you ye begynnyng of monethes, and the first moneth of the yere shall it be vnto you.

3. మీరు ఇశ్రాయేలీయుల సర్వ సమాజముతో - ఈ నెల దశమినాడు వారు తమ తమ కుటుంబముల లెక్కచొప్పున ఒక్కొక్కడు గొఱ్ఱెపిల్లనైనను, మేకపిల్లనైనను, అనగా ప్రతి యింటికిని ఒక గొఱ్ఱెపిల్లనైనను ఒక మేకపిల్లనైనను తీసికొనవలెను.
1 కోరింథీయులకు 5:8

3. Speake ye vnto all the congregation of Israel, saying: In the tenth daye of this moneth, euery man take vnto hym a lambe according to ye house of the fathers, a lambe throughout euery house.

4. ఆ పిల్లను తినుటకు ఒక కుటుంబము చాలక పోయినయెడల వాడును వాని పొరుగువాడును తమ లెక్క చొప్పున దాని తీసికొనవలెను.

4. If the houshold be to litle for ye lambe, let hym take his neyghbour whiche is next vnto his house, accordyng to the number of the soules, euery one of you accordyng to his eatyng shal make your compt for a lambe.

5. ఆ గొఱ్ఱెపిల్లను భుజించుటకు ప్రతివాని భోజనము పరిమితినిబట్టి వారిని లెక్కింపవలెను.

5. And let the lambe of yours be without blemishe, a male of a yere olde [whiche] ye shal take out from among the sheepe, and from among the goates.

6. నిర్దోషమైన యేడాది మగపిల్లను తీసికొనవలెను. గొఱ్ఱెలలో నుండి యైనను మేకలలో నుండియైనను దాని తీసికొనవచ్చును.
మార్కు 14:12, లూకా 22:7

6. And ye shall kepe hym in vntyll the fourteenth day of the same moneth: and euery assemble of the congregation of Israel shall kyll hym about euen.

7. ఈ నెల పదునాలుగవ దినమువరకు మీరు దాని నుంచు కొనవలెను; తరువాత ఇశ్రాయేలీయుల సమాజపు వారందరు తమ తమ కూటములలో సాయంకాలమందు దాని చంపి దాని రక్తము కొంచెము తీసి, తాము దాని తిని యిండ్లద్వారబంధపు రెండు నిలువు కమ్ములమీదను పై కమ్మి మీదను చల్లి

7. And they shall take of the blood and stryke it on the two [syde] postes, and on the vpper doore post, euen in the houses where they shall eate hym.

8. ఆ రాత్రియే వారు అగ్నిచేత కాల్చబడిన ఆ మాంసమును పొంగని రొట్టెలను తినవలెను. చేదుకూరలతో దాని తినవలెను
లూకా 22:8

8. And they shall eate the fleshe the same nyght, rost with fire, and with vnleauened bread: and with sowre hearbes they shall eate it.

9. దాని తలను దాని కాళ్లను దాని ఆంత్రములను అగ్నితో కాల్చి దాని తినవలెను;

9. See that ye eate not therof rawe, nor sodden with water, but roste with fire: the head, feete, and purtenaunce therof.

10. దానిలో ఉడికి ఉడకనిదైనను నీళ్లతో వండబడినదైనను తిననే తినకూడదు; ఉదయకాలమువరకు దానిలోనిదేదియు మిగిలింపకూడదు. ఉదయకాలమువరకు దానిలో మిగిలినది అగ్నితో కాల్చి వేయవలెను.

10. And ye shall let nothyng of it remayne vnto the morning: That which remayneth of it vntyll the morowe, shall ye burne with fire.

11. మీరు దానిని తినవలసిన విధమేదనగా, మీ నడుము కట్టుకొని మీ చెప్పులు తొడుగుకొని మీ కఱ్ఱలు చేత పట్టుకొని, త్వరపడుచుదాని తినవలెను; అది యెహోవాకు పస్కాబలి.
లూకా 12:35

11. Of this maner shall ye eate it: with your loynes girded, and your shooes on your feete, and your staffe in your hand, and ye shall eate it in haste: for it is the Lordes passouer.

12. ఆ రాత్రి నేను ఐగుప్తుదేశమందు సంచరించి, ఐగుప్తుదేశమందలి మనుష్యులలోనేగాని జంతువులలోనేగాని తొలి సంతతియంతయు హతముచేసి, ఐగుప్తు దేవతలకందరికిని తీర్పు తీర్చెదను; నేను యెహో వాను.

12. For I wyll passe through the lande of Egypt this same nyght, and wyll smyte all the first borne of Egypt from man to beast, and vpon all the gods of Egypt I wyll execute iudgement: I [am] the Lorde.

13. మీరున్న యిండ్లమీద ఆ రక్తము మీకు గురుతుగా ఉండును. నేను ఆ రక్తమును చూచి మిమ్మును నశింప చేయక దాటిపోయెదను. నేను ఐగుప్తుదేశమును పాడు చేయుచుండగా మిమ్ము సంహరించుటకు తెగులు మీ మీదికి రాదు.

13. And the blood shalbe vnto you a token in the houses wherin you are: and whe I see the blood, I wyll passe ouer you, and the plague shall not be vpon you to destroy you when I smyte the lande of Egypt.

14. కాబట్టి యీ దినము మీకు జ్ఞాపకార్థమైన దగును. మీరు యెహోవాకు పండుగగా దాని నాచరింపవలెను; తరతరములకు నిత్యమైనకట్టడగా దాని నాచరింపవలెను.
లూకా 22:7, మత్తయి 26:17

14. And this day shalbe vnto you a remebraunce: and you shall kepe it an holy feast vnto the Lorde throughout your generations, ye shall kepe it holy for an ordinaunce for euer.

15. ఏడుదినములు పులియని రొట్టెలను తినవలెను. మొదటిదినమున మీ యిండ్ల లోనుండి పొంగినది పార వేయవలెను. మొదటి దినము మొదలుకొని యేడవ దినము వరకు పులిసిన దానిని తిను ప్రతిమనుష్యుడు ఇశ్రాయేలీయులలోనుండి కొట్టివేయబడును.
మార్కు 14:12, లూకా 22:7

15. Seuen dayes shal ye eate vnleauened bread, so that euen the first day ye put away leauen out of your house: For who so euer eateth leauened bread from the first daye vntyll the seuenth daye, that soule shalbe rooted out of Israel.

16. ఆ మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగాను, ఏడవ దినమున పరిశుద్ధ సంఘముగాను కూడుకొనవలెను. ఆ దినములయందు ప్రతివాడు తినవలసినది మాత్రమే మీరు సిద్ధపరచవచ్చును; అదియు గాక మరి ఏ పనియు చేయకూడదు.
లూకా 23:56

16. The first day shalbe a holy conuocation, and the seuenth day shalbe an holy conuocation vnto you: there shalbe no maner of worke done in the, saue about that only which euery man must eate, that only may ye do.

17. పులియని రొట్టెల పండుగను మీరు ఆచరింపవలెను. ఈ దినమందే నేను మీ సమూహములను ఐగుప్తు దేశములోనుండి వెలుపలికి రప్పించితిని గనుక మీరు మీ తరములన్నిటిలో ఈ దినము నాచరింపవలెను; ఇది మీకు నిత్యమైన కట్టడగా ఉండును.

17. And ye shal obserue the feast of vnleauened bread: for this same day haue I brought your armies out of the lande of Egypt, therefore ye shall obserue this day and all your chyldren after you, by an euerlastyng decree.

18. మొదటి నెల పదునాలుగవదినము సాయంకాలము మొదలుకొని ఆ నెల యిరువది యొకటవదినము సాయంకాలమువరకు మీరు పులియనిరొట్టెలను తినవలెను.

18. The first moneth, and the fourteenth daye of the moneth, at euen ye shall eate vnleauened bread, vnto the 21 day of the same moneth at euen againe.

19. ఏడు దినములు మీ యిండ్లలో పొంగిన దేదియును ఉండకూడదు, పులిసిన దానిని తినువాడు అన్యుడేగాని దేశములో పుట్టిన వాడేగాని ఇశ్రాయేలీయుల సమాజములో నుండక కొట్టివేయబడును.

19. Seuen dayes shal ther be no leauened bread founde in your houses: and whosoeuer eateth leauened bread, that soule shalbe rooted out from the congregatio of Israel, whether he be straunger or borne in the lande.

20. మీరు పులిసినదేదియు తినక మీ నివాసములన్నిటిలోను పులియని వాటినే తినవలెనని చెప్పుమనెను.

20. Ye shall eate nothyng leauened: but in all your habitations shall ye eate vnleauened bread.

21. కాబట్టి మోషే ఇశ్రాయేలీయుల పెద్దల నందరిని పిలిపించి వారితో ఇట్లనెను - మీరు మీ కుటుంబముల చొప్పున మందలోనుండి పిల్లను తీసికొని పస్కా పశువును వధించుడి.
1 కోరింథీయులకు 5:7, హెబ్రీయులకు 11:28

21. Moyses called for the elders of Israel, and sayde vnto them: Choose out, and take you to euery housholde of you a lambe, and kyll the passouer.

22. మరియు హిస్సోపు కుంచె తీసికొని పళ్లెములో నున్న రక్తములో దాని ముంచి, ద్వారబంధపు పైకమ్మికిని రెండు నిలువు కమ్ములకును పళ్లెములోని రక్తమును తాకింపవలెను. తరువాత మీలో నెవరును ఉదయమువరకు తన యింటి ద్వారమునుండి బయలు వెళ్లకూడదు.

22. And take a bunche of Isope and dip it in the blood that is in the bason, & strike the vpper post of the doore, and the two syde postes, with the blood that is in the bason: & none of you go out at the doore of his house vntyll the mornyng.

23. యెహోవా ఐగుప్తీయులను హతము చేయుటకు దేశ సంచారము చేయుచు, ద్వారబంధపు పైకమ్మిమీదను రెండు నిలువు కమ్ములమీదను ఉన్న రక్తమును చూచి యెహోవా ఆ తలుపును దాటిపోవును; మిమ్ము హతము చేయుటకు మీ యిండ్లలోనికి సంహారకుని చొరనియ్యడు.

23. For the Lord wyll passe ouer to smyte the Egyptians: and when he seeth the blood vpon the vpper doore post and the two syde postes, he wyll passe ouer the doore, and wyll not suffer the destroyer to come into your house to plague you.

24. కాబట్టి మీరు నిరంతరము మీకును మీ కుమారులకును దీనిని కట్టడగా ఆచరింపవలెను.
లూకా 2:41

24. Therfore shall ye obserue this thyng for an ordinaunce to thee & thy sonnes for euer.

25. యెహోవా తాను సెలవిచ్చినట్లు మీ కిచ్చుచున్న దేశమందు మీరు ప్రవేశించిన తరువాత మీరు దీని నాచరింపవలెను.

25. And when ye be come to the lande whiche the Lorde wyll geue you, accordyng as he hath promised, ye shall kepe this seruice.

26. మరియు మీకుమారులు మీరు ఆచరించు ఈ ఆచారమేమిటని మిమ్ము నడుగునప్పుడు

26. And when your chyldren aske you, what maner of seruice is this ye do?

27. మీరు ఇది యెహోవాకు పస్కాబలి; ఆయన ఐగుప్తీయులను హతము చేయుచు మన యిండ్లను కాచినప్పుడు ఆయన ఐగుప్తులోనున్న ఇశ్రాయేలీయుల యిండ్లను విడిచి పెట్టెను అనవలెనని చెప్పెను. అప్పుడు ప్రజలు తలలు వంచి నమస్కారముచేసిరి.

27. Ye shall saye, it is the sacrifice of the Lordes passouer, whiche passed ouer the houses of the chyldren of Israel in Egypt, and he smote the Egyptians, and saued our houses. And the people bowed them selues, and worshipped.

28. అప్పుడు ఇశ్రాయేలీయులు వెళ్లి ఆలాగుచేసిరి; యెహోవా మోషే అహరోనులకు ఆజ్ఞాపించినట్లే చేసిరి.

28. And the chyldren of Israel went and dyd as the Lorde hadde commaunded Moyses and Aaron, euen so dyd they.

29. అర్ధరాత్రివేళ జరిగినదేమనగా, సింహాసనముమీద కూర్చున్న ఫరో మొదలుకొని చెరసాలలోనున్న ఖైదీ యొక్క తొలిపిల్ల వరకు ఐగుప్తుదేశమందలి తొలిపిల్లల నందరిని పశువుల తొలిపిల్లలనన్నిటిని యెహోవా హతము చేసెను.

29. And at mydnyght the Lorde smote the first borne in the lande of Egypt, fro the first borne of Pharao that sate on his seate, vntyl the first borne of the captiue that was in prison, and all the firste gendred of cattell.

30. ఆ రాత్రి ఫరోయు అతని సేవకులందరును ఐగుప్తీయులందరును లేచినప్పుడు శవములేని ఇల్లు ఒకటైన లేకపోయినందున ఐగుప్తులో మహాఘోష పుట్టెను.

30. And Pharao rose in the nyght, he and his seruauntes, and all the Egyptians, and there was a great crye in Egypt: for there was not a house where there was not one dead.

31. ఆ రాత్రివేళ ఫరో మోషే అహరోనులను పిలిపించి వారితో - మీరును ఇశ్రాయేలీయులును లేచి నా ప్రజల మధ్యనుండి బయలు వెళ్లుడి, మీరు చెప్పినట్లు పోయి యెహోవాను సేవించుడి.

31. And he called vnto Moyses and Aaro by nyght, saying: Ryse vp, and get you out from amongst my people, both you and also the chyldren of Israel: and go, and serue the Lorde as ye haue sayde.

32. మీరు చెప్పినట్లు మీ మందలను మీ పశువులను తీసికొని పోవుడి; నన్ను దీవించుడని చెప్పెను.

32. And take your sheepe and your droues with you as ye haue sayde: and depart, and blesse me.

33. ఐగుప్తీయులు మనమందరము చచ్చిన వారమనుకొని, తమ దేశములోనుండి ప్రజలను పంపుటకు త్వరపడి వారిని బలవంతముచేసిరి.

33. And the Egyptians were fierce vpon the people, that they myght sende them out of the lande in haste: for they sayde, we be all [but] dead men.

34. కాబట్టి ప్రజలు తమ పిండిముద్దను తీసికొని, అది పులియక మునుపే పిండి పిసుకు తొట్లతో దానిని మూటకట్టు కొని, తమ భుజములమీద పెట్టుకొని పోయిరి.

34. And the people toke there dowgh before it was sowred, whiche they had in store, being bounde in clothes vpon their shoulders.

35. ఇశ్రాయేలీయులు మోషే మాట చొప్పున చేసి ఐగుప్తీయులయొద్ద వెండి నగలను బంగారు నగలను వస్త్రములను అడిగి తీసికొనిరి.

35. And the chyldren of Israel dyd accordyng to the saying of Moyses: and they borowed of the Egyptians iewels of siluer, and iewels of golde, and rayment.

36. యెహోవా ప్రజల యెడల ఐగుప్తీయులకు కటాక్షము కలుగజేసెను గనుక వారు వారికి కావలసిన వాటిని ఇచ్చిరి. అట్లు వారు ఐగుప్తీయులను దోచుకొనిరి.

36. And the Lord gaue the people fauour in the syght of the Egyptians, so that they graunted such thynges as they required: And they robbed the Egyptians.

37. అప్పుడు ఇశ్రాయేలీయులు రామసేసునుండి సుక్కోతుకు ప్రయాణమైపోయిరి వారు పిల్లలు గాక కాల్బలము ఆరులక్షల వీరులు.

37. And the children of Israel toke their iourney from Rameses to Suchoth, sixe hundred thousand men of foote, besyde chyldren.

38. అనేకులైన అన్యజనుల సమూహమును, గొఱ్ఱెలు ఎద్దులు మొదలైన పశువుల గొప్పమందయును వారితోకూడ బయలుదేరెను.

38. And a great multitude of sundry other nations wet also with them, and sheepe and oxen, and exceedyng much cattell.

39. వారు ఐగుప్తులో నుండి తెచ్చిన పిండి ముద్దతో పొంగని రొట్టెలుచేసి కాల్చిరి. వారు ఐగుప్తులోనుండి వెళ్లగొట్టబడి తడవుచేయ లేకపోయిరి గనుక అది పులిసి యుండలేదు, వారు తమ కొరకు వేరొక ఆహారమును సిద్ధపరచుకొని యుండలేదు.

39. And they baked vnleauened cakes of the dowgh whiche they brought out of Egypt, for it was not sowred: For they were thrust out of Egypt, and could not tary, nether had they prepared for them selues any prouision of meate.

40. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నివసించిన కాలము నాలుగు వందల ముప్పది సంవత్సరములు.
గలతియులకు 3:17

40. The dwellyng of the chyldren of Israel which they dwelled in Egypt, was foure hundred and thirtie yeres.

41. ఆ నాలుగు వందల ముప్పది సంవత్సరములు గడచిన తరువాత జరిగిన దేమనగా, ఆ దినమందే యెహోవా సేనలన్నియు ఐగుప్తుదేశములో నుండి బయలుదేరిపోయెను.

41. And when the foure hundred & thirtie yeres were expired, euen the selfe same day departed al the hoastes of the Lord out of the lande of Egypt.

42. ఆయన ఐగుప్తుదేశములో నుండి వారిని బయటికి రప్పించినందుకు ఇది యెహోవాకు ఆచరింపదగిన రాత్రి. ఇశ్రాయేలీయులందరు తమ తమ తరములలో యెహోవాకు ఆచరింపదగిన రాత్రి యిదే.

42. It is a nyght to be obserued vnto the Lorde, in the whiche he brought them out of the lande of Egypt: This is that nyght of the Lorde, whiche all the chyldren of Israel must kepe throughout their generations.

43. మరియయెహోవా మోషే అహరోనులతో ఇట్లనెను - ఇది పస్కాపండుగను గూర్చిన కట్టడ; అన్యుడెవడును దాని తినకూడదు గాని

43. And the Lorde sayde vnto Moyses and Aaron, This is the lawe of passouer: there shall no straunger eate thereof.

44. వెండితో కొనబడిన దాసుడు సున్నతి పొందినవాడైతే దాని తినవచ్చును.

44. But euery seruaunt that is bought for money, after that thou hast circumcised hym, shall eate therof.

45. పరదేశియు కూలికివచ్చిన దాసుడును దాని తినకూడదు.

45. A straunger & an hired seruaunt shall not eate therof.

46. మీరు ఒక్క యింటిలోనే దాని తినవలెను దాని మాంసములో కొంచెమైనను ఇంటిలో నుండి బయటికి తీసికొని పోకూడదు, దానిలో ఒక్క యెముకనైనను మీరు విరువ కూడదు.
యోహాను 19:36

46. In one house shall it be eaten, thou shalt carry none of the flesshe out of the house, neither shall ye breake a bone therof.

47. ఇశ్రాయేలీయుల సర్వసమాజము ఈ పండుగను ఆచరింపవలెను.

47. All the congregation of Israel shall obserue it.

48. నీయొద్ద నివసించు పరదేశి యెహోవా పస్కాను ఆచరింప గోరినయెడల అతనికి కలిగిన ప్రతి మగవాడు సున్నతి పొందవలెను; తరువాత అతడు సమాజములో చేరి దానిని ఆచరింపవచ్చును. అట్టి వాడు మీ దేశములో పుట్టినవానితో సముడగును. సున్నతి పొందనివాడు దానిని తినకూడదు.

48. If a straunger also dwell among you, and wyl holde passouer vnto the Lord, let him circumcise all that be males, and then let him come and obserue it, and he shalbe as one that is borne in the lande: for no vncircumcised person shall eate therof.

49. దేశస్థునికిని మీలో నివసించు పరదేశికిని దీనిగూర్చి ఒకటే విధి యుండవలెననెను.

49. One maner of lawe shalbe vnto hym that is borne in the lande, and vnto the straunger that dwelleth among you.

50. ఇశ్రాయేలీయులందరు ఆలాగు చేసిరి; యెహోవా మోషే అహరోనులకు ఆజ్ఞాపించినట్లు చేసిరి.

50. And all the chyldren of Israel dyd as the Lorde commaunded Moyses and Aaron, euen so dyd they.

51. యెహోవా ఇశ్రాయేలీయులను వారివారి సమూహముల చొప్పున ఆనాడే ఐగుప్తు దేశములోనుండి వెలుపలికి రప్పించెను.
అపో. కార్యములు 13:17, హెబ్రీయులకు 11:27, యూదా 1:5

51. And the selfe same day, dyd the Lorde bryng the chyldren of Israel out of the lande of Egypt with their armies.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Exodus - నిర్గమకాండము 12 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible
సంవత్సరం ప్రారంభం మార్చబడింది, పాస్ ఓవర్ స్థాపించబడింది. (1-20) 
సాతాను నియంత్రణ నుండి రక్షింపబడి, దేవుని ప్రజలుగా మారిన వారికి దేవుడు ప్రతిదానిని క్రొత్తగా చేస్తాడు. ఇది కొత్త జీవితాన్ని ప్రారంభించడం లాంటిది. దేవుడు ఇశ్రాయేలీయులను ఈజిప్టు నుండి రక్షించినప్పుడు, ఒక గొర్రెపిల్లను చంపి ఒక నిర్దిష్ట పద్ధతిలో తినమని చెప్పాడు. ఏ ఇళ్లను రక్షించాలో దేవునికి తెలుసు కాబట్టి వారు కూడా తమ తలుపు మీద గొర్రె రక్తాన్ని వేయవలసి వచ్చింది. చాలా కాలం క్రితం, ఇశ్రాయేలు ప్రజలు ఈజిప్టులో బానిసలుగా ఉన్నప్పుడు, ఈజిప్షియన్లను శిక్షించడానికి దేవుడు ఒక దేవదూతను పంపి వారి మొదటి బిడ్డల ప్రాణాలను తీసివేసాడు. కానీ దేవుడు ఇశ్రాయేలీయులకు గొర్రెపిల్ల రక్తంతో వారి తలుపులను గుర్తించమని చెప్పాడు, మరియు దేవదూత ఆ ఇళ్లను దాటి వారి మొదటి బిడ్డను కాపాడతాడు. ఇది పాస్ ఓవర్ అని పిలువబడే ఒక ప్రత్యేక సెలవుదినంగా మారింది, దేవుడు వారిని ప్రమాదం నుండి ఎలా రక్షించాడో మరియు ఈజిప్టును విడిచిపెట్టడానికి వారికి ఎలా సహాయం చేసాడో గుర్తుంచుకోవడానికి వారు ప్రతి సంవత్సరం జరుపుకుంటారు. సిలువపై తన రక్తాన్ని చిందించి మన పాపాల నుండి మనలను రక్షించిన యేసును కూడా పాస్ ఓవర్ మనకు గుర్తు చేస్తుంది. అన్ని మంచి విషయాలు దేవుని దయ మరియు ప్రేమ నుండి వచ్చాయని ఇది మనకు బోధిస్తుంది. 1. పాస్చల్ లాంబ్ ఒక చిహ్నం వంటిది. యేసు మన ప్రత్యేక పస్కా పండుగ వంటివాడు. 1Cor 5:7-8 మనం యేసును అనుసరించాలని నిర్ణయించుకున్నప్పుడు, మనం ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి మరియు ఆయనపై దృష్టి పెట్టాలి. మనకు సంతోషాన్ని కలిగించే లేదా అతనిలోని మన ఆనందాన్ని దూరం చేసే ఏదీ మనం చేయకూడదు. యూదుల పస్కా పండుగలాగే, మనం ప్రేమ మరియు దయతో జరుపుకోవాలి మరియు మన వేడుకలో నిజాయితీగా మరియు నిజమైనదిగా ఉండాలి. యేసు మన కోసం చేసిన అద్భుతమైన పనులన్నింటికీ కృతజ్ఞతతో ఉండాలని మనం ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి మరియు మన జీవితమంతా ఆయనను అనుసరిస్తూనే ఉండాలి. 

పస్కాను ఎలా ఆచరించాలో ప్రజలు నిర్దేశించారు. (21-28) 
ఆ రాత్రి, మొదటి సంతానం చంపబడబోతున్నప్పుడు, ఇశ్రాయేలీయులు తాము విడిచిపెట్టి ఈజిప్టుకు వెళ్లవచ్చని చెప్పే వరకు వారి ఇళ్లలోనే ఉండవలసి వచ్చింది. వారు తమ తలుపులపై రక్తాన్ని ఉంచినందున వారు సురక్షితంగా ఉన్నారు. వారు తమ ఇళ్లను విడిచిపెట్టినట్లయితే, వారు ప్రమాదంలో పడవచ్చు. దేవుడు తమను రక్షించే వరకు వారు లోపల వేచి ఉండాలి. తరువాత, వారు తమ పిల్లలకు ఈ ప్రత్యేక రాత్రి గురించి మరియు దాని అర్థం గురించి బోధించాలి. పిల్లలు దేవుని గురించి మరియు ఆయన చేసే పనుల గురించి ప్రశ్నలు అడగడం చాలా ముఖ్యం. వారు ప్రతి సంవత్సరం ఈ రాత్రి జరుపుకుంటారు. 1. దేవుడు మనకు మరియు మన పూర్వీకుల కోసం చేసిన అన్ని అద్భుతమైన పనులను గుర్తుంచుకోవడం ముఖ్యం. ఈ మంచి విషయాలను మనం ఎప్పటికీ మరచిపోకూడదు, తద్వారా మనం దేవునికి కృతజ్ఞతలు తెలుపుతాము మరియు ఆయనను మరింత ఎక్కువగా విశ్వసించగలము. 2. మనకోసం తనను తాను త్యాగం చేసిన దేవుని గొర్రెపిల్లను గుర్తుచేసేందుకు ఇది చేయబడింది. అతని మరణం మాకు జీవితాన్ని ఇచ్చింది. 

ఈజిప్షియన్లలో మొదటి సంతానం మరణం ఇశ్రాయేలీయులు ఈజిప్టు దేశాన్ని విడిచిపెట్టమని కోరారు. (29-36) 
మూడు పగలు మరియు రాత్రులు చీకటిగా ఉన్నందున ఈజిప్షియన్లు భయపడ్డారు. అప్పుడు మరింత భయంకరమైనది జరిగింది - వారి పెద్ద బిడ్డను మాత్రమే ప్రభావితం చేసే అనారోగ్యం. హెబ్రీయుల పిల్లలను చంపడం వంటి వారు చేసిన చెడ్డ పనులకు ఇది దేవుడు విధించిన శిక్ష. ధనిక, పేద అనే తేడా లేకుండా ఈ వ్యాధి ప్రతి ఒక్కరినీ ప్రభావితం చేసింది. ఒక దేవదూత ప్రతి ఇంటికి వెళ్లి తలుపు మీద రక్తం లేకపోతే, ఆ ఇంట్లో ఎవరైనా చనిపోతారని నిర్ధారించుకున్నాడు. ఇది చాలా విచారకరమైన సమయం ఎందుకంటే ప్రతి ఇంట్లో కనీసం ఒకరు మరణించారు.  ఈజిప్టులో ఏదైనా చెడు జరిగినప్పుడు ఎంత విచారంగా మరియు బిగ్గరగా ఏడుపు వచ్చిందో ఊహించండి. చెడు పనులు చేసే వ్యక్తులను తీర్పు తీర్చడానికి మనుష్యకుమారుడు వచ్చినప్పుడు కూడా అంతే విచారంగా మరియు బిగ్గరగా ఉంటుంది. దేవుని ప్రత్యేక పిల్లలు చివరకు ఈజిప్టును విడిచి వెళ్ళడానికి అనుమతించబడ్డారు. మొదటి నుండి దేవుడు చెప్పేది వినడం మంచిది, ఎందుకంటే అతను మనతో ఏకీభవించేలా తన మనసు మార్చుకోడు. దేవునికి వ్యతిరేకంగా తాను గెలవలేనని గ్రహించిన ఫరో చివరకు వదులుకున్నాడు. దేవుని ప్రణాళికలు ఎల్లప్పుడూ నిజమవుతాయి, కాబట్టి వాదించడం లేదా అతనిని అనుసరించడానికి వేచి ఉండటం ఉపయోగకరంగా ఉండదు. ఈజిప్షియన్లు భయపడ్డారు మరియు ఇజ్రాయెల్ త్వరగా వెళ్లిపోవాలని కోరుకున్నారు, కాబట్టి వారు వారి ప్రయాణానికి డబ్బు మరియు వస్తువులను ఇచ్చారు. ఇశ్రాయేలీయులు తమ కష్టార్జితానికి అర్హులైన వాటిని దేవుడు పొందేలా చేశాడు. 

ఇశ్రాయేలీయుల మొదటి ప్రయాణం సుక్కోత్. (37-42) 
ఇశ్రాయేలు ప్రజలు తమ ప్రయాణంలో వేగంగా కదలడం ప్రారంభించారు. ఇశ్రాయేలీయులు కాని మరికొందరు వారితోపాటు వెళ్లారు. వారిలో కొందరు తమ సొంత భూమిని విడిచిపెట్టాలని కోరుకున్నారు, ఎందుకంటే అది వ్యాధులతో దెబ్బతింది, కొందరు ఆసక్తిగా ఉన్నారు, మరికొందరు ఇశ్రాయేలీయులను మరియు వారి మతాన్ని ప్రేమిస్తారు. కానీ ఇశ్రాయేలీయులలో కూడా, తమ మతాన్ని నిజంగా అనుసరించని వ్యక్తులు ఉన్నారు. దేవుడు అబ్రాహాముకు వాగ్దానం చేసిన 430 సంవత్సరాల తర్వాత ఈ ముఖ్యమైన సంఘటన జరిగింది. గలతియులకు 3:17 దేవుడు వాగ్దానం చేసాడు, కానీ అది నెరవేరడానికి చాలా సమయం పట్టింది. కొంత సమయం తీసుకున్నప్పటికీ, దేవుడు తన వాగ్దానాలను ఎల్లప్పుడూ నిలబెట్టుకుంటాడు. ఈ ప్రత్యేక రాత్రి ముఖ్యమైనది ఎందుకంటే ఇది దేవుడు మన కోసం చేసే గొప్ప పనులను గుర్తుచేస్తుంది, మనలను రక్షించడానికి యేసును పంపడం వంటివి. మొదటి పాస్ ఓవర్ రాత్రి చాలా ముఖ్యమైనది మరియు ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి. యేసు అరెస్టు చేయబడటానికి ముందు రోజు రాత్రి, నిజంగా ముఖ్యమైనది జరిగింది. ఇది నిజంగా భారీ భారం నుండి విముక్తి పొందడం వంటిది మరియు దాని స్థానంలో నిజంగా మంచిదేదో ఇవ్వబడింది. ఇది చాలా ప్రత్యేకమైనది, ఇది స్వర్గంలో కూడా ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి. 

పాస్ ఓవర్కు సంబంధించి ఆర్డినెన్స్. (43-51)
భవిష్యత్తులో, ఇజ్రాయెల్‌లోని ప్రతి ఒక్కరూ పాస్ ఓవర్ అనే ప్రత్యేక సెలవుదినాన్ని జరుపుకుంటారు. దేవుడు మన కోసం చేసిన అన్ని మంచి పనులకు ఆయనకు కృతజ్ఞతలు చెప్పడం ముఖ్యం. మనం గుర్తుంచుకోవలసిన మరియు మరచిపోకూడని ప్రభువు భోజనం అనే ప్రత్యేక భోజనం కూడా ఉంది. ఇజ్రాయెల్ నుండి రాని వ్యక్తులు కూడా కొన్ని నియమాలను పాటిస్తే పాస్ ఓవర్ జరుపుకోవచ్చు. దేవుడు యూదులనే కాకుండా ప్రజలందరినీ ప్రేమిస్తున్నాడని ఇది చూపిస్తుంది. యేసు మన కోసం తనను తాను త్యాగం చేసిన మన పస్కా గొర్రెపిల్లలాంటివాడు. (1Cor,5,7} యేసు రక్తం చాలా ముఖ్యమైనది ఎందుకంటే అది మన ఆత్మలను శిక్షించకుండా కాపాడింది. అది లేకుండా, మేము క్షమించబడము. మనం యేసుపై నమ్మకం ఉంచాలి మరియు ఎల్లప్పుడూ ఆయనపై ఆధారపడాలి. మనం యేసును విశ్వసిస్తున్నామని మరియు ఆయన బోధనలను అనుసరిస్తామని ఇతరులకు చెప్పాలి. మనం ఆయనకు సేవ చేయడానికి సిద్ధంగా ఉండాలి మరియు అతనిని ఇష్టపడని వారికి దూరంగా ఉండాలి. ఇవి ఆలోచించడానికి చాలా ముఖ్యమైన విషయాలు, వాటికి సత్యంగా సమాధానం చెప్పడానికి సహాయం చేయమని మనం దేవుడిని అడగాలి. 



Shortcut Links
నిర్గమకాండము - Exodus : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |