Exodus - నిర్గమకాండము 20 | View All
Study Bible (Beta)

1. దేవుడు ఈ ఆజ్ఞలన్నియు వివరించి చెప్పెను.
అపో. కార్యములు 7:38

ఇది బైబిలు గ్రంథంలోని కీలకమైన అధ్యాయాలలో ఒకటి. బైబిలుకే కాదు ప్రపంచ సాహిత్యమంతటికీ ఆణిముత్యం. ఇందులో రాసి ఉన్న ఆజ్ఞలు మనుషులు కల్పించినవి కాదు. సాక్షాత్తూ దేవుని ఆజ్ఞలే, పవిత్రతకూ న్యాయానికీ దేవుని కొలబద్దలు. దేవుడు వీటిని ఇస్రాయేల్ క్షేమం కోసం, అన్ని చోట్లా ప్రజలందరి క్షేమం కోసం ఇచ్చాడు.

2. నీ దేవుడనైన యెహోవాను నేనే; నేనే దాసుల గృహమైన ఐగుప్తుదేశములోనుండి నిన్ను వెలుపలికి రప్పించితిని;

పొరపాటు ఏదీ రాకుండేలా ముందుగా దేవుడు తానెవరో చెప్తున్నాడు. ఆయన యెహోవా. అనంత కాలం వేరొకరి మూలంగా కాక తనకు తానే ఉన్నవాడు. మనుషులను చేసినవాడు (గలతియులకు 2:7). ఇస్రాయేల్‌వారిని ఈజిప్ట్‌నుంచి తేవడంలో తన అద్భుత శక్తిని కనుపరచినవాడు (యెహోవా – నిర్గమకాండము 3:14-15 నోట్ చూడండి).

3. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు.

ఈ మొదటి ఆజ్ఞ బైబిల్లో చాలా సార్లు కనిపిస్తుంది (ద్వితీయోపదేశకాండము 6:14 2 రాజులు 17:35 యిర్మియా 25:6 యిర్మియా 35:15 మత్తయి 4:10). సృష్టికర్త అయిన దేవుడే అన్నిటికీ మూలాధారమని బైబిలు బోధిస్తున్నది. ఇది ఆయన విధించిన చట్టాలన్నిటిలోకి ప్రాముఖ్యమైనది. ప్రజలు ఇతర దేవుళ్ళను అనుసరిస్తే, నిజ దేవుణ్ణి నిరాకరించి ఆయన ఇతర ఆజ్ఞలను నిర్లక్ష్యం చేసి ఆయన ఏర్పరచిన రక్షణ మార్గాన్ని పట్టించుకోక తమ మీదికి తామే నాశనాన్ని తెచ్చుకుంటారు. చాలామంది దేవుళ్ళున్నారనీ, వారందరూ పైచెయ్యికోసం ఒకరితో ఒకరు పెనుగులాడుతున్నారనీ కాదు. నిజ దేవుడొక్కడే ఉన్నాడు, ఆయన మనుషులను ప్రేమిస్తున్నాడు. మనుషుల ప్రేమను కోరుతున్నాడు (ద్వితీయోపదేశకాండము 6:5). ఎవరైనా దేవుని ఇతర ఆజ్ఞలన్నిటినీ పాటించినా ఈ ఒక్క ఆజ్ఞను మీరారంటే అతడు దేవునికి విరోధంగా భయంకరమైన పాపం చేశాడన్నమాట. ఈ పాపానికి తగిన ఘోర శిక్ష అతనికి కలగాలి (ద్వితీయోపదేశకాండము 13:6-18 ద్వితీయోపదేశకాండము 17:2-7 మొ।।).

4. పైన ఆకాశమందేగాని క్రింది భూమియందేగాని భూమిక్రింద నీళ్లయందేగాని యుండు దేని రూపము నయినను విగ్రహమునయినను నీవు చేసికొనకూడదు; వాటికి సాగిలపడకూడదు వాటిని పూజింపకూడదు.

విశ్వాన్నీ మానవకోటినీ సృష్టించిన దేవుడు అన్ని రకాల విగ్రహ పూజలను నిషేధించాడు. ఈ ఆజ్ఞ కూడా బైబిల్లో చాలా సార్లు కనిపిస్తుంది (లేవీయకాండము 19:4 లేవీయకాండము 26:1 ద్వితీయోపదేశకాండము 4:15-19 ద్వితీయోపదేశకాండము 5:8-9 ద్వితీయోపదేశకాండము 27:15 1 యోహాను 5:21). ఈ నిషేధానికి దేవుడు ఎలాంటి కారణమూ ఇవ్వవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన దేవుడు. మంచీ చెడూ ఆయనకు తెలుసు. అయితే ఈ ఆజ్ఞ ఎందుకిచ్చాడో సముచితమైన కారణాలు బైబిల్లో తరువాతి భాగంలో బయటపడుతున్నాయి. మొదటగా విగ్రహాలు దేవుణ్ణి గురించి పొరపాటు ఊహను కలుగజేస్తాయి (యెషయా 40:18-26 అపో. కార్యములు 17:29 రోమీయులకు 1:20-23). అవి దేవుణ్ణి అవమానపరుస్తాయి. దేవుణ్ణి అపనిందల పాలు చేస్తాయి. మనిషి తన చేతులతో చేయగల ఏ ఆకారమూ దేవుని అనంతమైన ఉనికిని కనపరచలేదు. ఆయన పవిత్రతనూ వైభవాన్నీ మహిమాన్వితమైన ఆయన నిష్కళంక స్వభావాన్నీ చూపించడానికి ఎంతమాత్రమూ సరిపోదు. దేవుని మహిమాప్రకాశంతో పోల్చుకుంటే మనిషి చేసేదేదైనా వికారంగా జుగుప్సాకరంగా ఉంటుంది. ఒకవేళ వీటన్నిటినీ కళ్ళకు కట్టినట్టు చూపించే విగ్రహాలున్నప్పటికీ వాటిని పెట్టుకుని వాటిని పూజించడం మంచిది కాదు. వాటివల్ల మనకు దేవుని పోలిక మాత్రమే తెలుస్తుంది. గాని దేవుడు తెలియడు. దేవుణ్ణి ఆత్మద్వారా మాత్రమే తెలుసుకోవడం సాధ్యం. ఆయనతో వ్యక్తిగతంగా అనుభవం ఉంటే తప్ప ఆయనను తెలుసుకోలేము. దేవుడు ఆత్మ స్వరూపి అని యేసుప్రభువు చెప్పాడు. ఆయన్ను ఆత్మతో సత్యంతో ఆరాధించాలి (యోహాను 4:24). రెండోది, విగ్రహాలు వ్యర్థమైనవనీ పనికి మాలినవనీ బైబిలు చెప్తున్నది. (కీర్తనల గ్రంథము 135:13-18 యెషయా 44:9-20 యిర్మియా 10:5 హబక్కూకు 2:18-19 1 కోరింథీయులకు 12:2 ప్రకటన గ్రంథం 9:20). మూడోది, విగ్రహారాధన జాతి అంతటినీ పాడుచేసి ఏకైక నిజ దేవునినుంచి దూరం చేస్తుంది (కీర్తనల గ్రంథము 106:36-39 యెహోషువ 6:9 యెహోషువ 44:10 హోషేయ 4:12). ఇందువల్ల దేవుడు ప్రజలపై తనకు ఉన్న ప్రేమ కారణంగా విగ్రహ పూజ తగదని గట్టిగా చెప్తున్నాడు.

5. ఏలయనగా నీ దేవుడనైన యెహోవానగు నేను రోషముగల దేవుడను; నన్ను ద్వేషించువారి విషయములో మూడు నాలుగు తరముల వరకు, తండ్రుల దోషమును కుమారులమీదికి రప్పించుచు
యోహాను 9:2

“రోషం”– ఈ మాటకూ ప్రేమకూ ఇక్కడ సంబంధం ఉంది. దేవుని ప్రేమ శాశ్వతమైనది (యిర్మియా 31:3). ఆయన లోకాన్ని ఎంతగా ప్రేమించాడంటే తన ఏకైక కుమారుణ్ణి ఇచ్చేశాడు (యోహాను 3:16). ఆయన ప్రేమ స్వరూపి (1 యోహాను 4:8). ఆయన ప్రేమకు ప్రతిగా ప్రేమనే ఆశిస్తున్నాడు. ఆయన ప్రజలు అబద్ధ దేవుళ్ళను, విగ్రహాలను ప్రేమిస్తే ఆయన కోపం రగులుకుంటుంది. ఆయన తనవారిని ఎంతగా ప్రేమిస్తున్నాడంటే తనకు బదులు మరెవ్వరిని ప్రేమించినా ఆయన సహించలేడు (నిర్గమకాండము 34:14 ద్వితీయోపదేశకాండము 4:24 ద్వితీయోపదేశకాండము 5:9 ద్వితీయోపదేశకాండము 6:15 యెహోషువ 24:19). “కొడుకులమీదికి”– దేవుడు తల్లిదండ్రుల పాపాలకు పిల్లలను శిక్షించడు (ద్వితీయోపదేశకాండము 24:16 యెహోషువ 18:20 నోట్స్ చూడండి). అయితే వారి పాపాలవల్ల కలిగే చెడు ఫలితాలు పిల్లలను భాదిస్తాయి. ఇలా జరిగేలా మనుషుల జీవిత విధానాన్ని దేవుడు ఏర్పరచాడు. పెద్దల ప్రవర్తన పిల్లలపై చాలా ప్రభావం చూపుతుంది. పెద్దలు చూపిన మార్గాలపైనే పిల్లలు మొగ్గు చూపుతారు. తల్లిదండ్రులు నిజ దేవుణ్ణి అసహ్యించుకుంటే పిల్లలు కూడా అసహ్యించుకోవడంలో ఆశ్చర్యం లేదు. అలాంటి పాపంవల్ల కలిగే ఫలితాలు, పరిణామాలు మూడు, నాలుగు తరాలవరకే ఉంటుంది. దేవుడు శిక్షించడం కంటే ప్రేమించడానికి మరి ఎక్కువ సంసిద్ధుడు (కీర్తనల గ్రంథము 30:5 యెహోషువ 18:23 యెహోషువ 18:30-32 హోషేయ 14:1-4). హోషేయ గ్రంథమంతా ఈ సత్యాన్నే తెలియజేస్తూ ఉంది. మనుషుల్ని శిక్షించకుండా ఉండగలిగేందుకు దేవుడు మానవ పాపాల శిక్ష తన మీద వేసుకున్నాడని యేసు ప్రభువు సిలువ చెప్తున్నది. తన పవిత్ర ధర్మశాస్త్రాన్ని వెల్లడి చేసే ఈ సందర్భంలో ప్రేమామయుడైన దేవుడు మాట్లాడుతున్నాడు. పాత ఒడంబడిక కాలమంతట్లోనూ దేవుడు తమవైపుకు మనఃపూర్వకంగా తిరిగి తన ఆజ్ఞలను పాటించేందుకు నిజంగా ప్రయత్నించినవారి పట్ల ప్రేమతో, కరుణతో, కృపతో వ్యవహరించాడు. ఇప్పటికీ అలానే చేస్తున్నాడు.

6. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొనువారిని వెయ్యి తరములవరకు కరుణించు వాడనైయున్నాను.

7. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా నుచ్చరింపకూడదు; యెహోవా తన నామమును వ్యర్థముగా నుచ్చరింపు వానిని నిర్దోషిగా ఎంచడు.
మత్తయి 5:33

లేవీయకాండము 19:12 ద్వితీయోపదేశకాండము 6:13 ద్వితీయోపదేశకాండము 10:20. దేవుడు పవిత్రుడు. ఆయన నామం పవిత్రం. మనుషులు దాన్ని పవిత్రంగా ఎంచాలి. ఆయన నామాన్ని మనస్ఫూర్తిగా యథార్థ హృదయంతో, ప్రేమ పూర్వకంగా మాత్రమే ఉచ్చరించాలి. ఈ ఆజ్ఞను ఉల్లంఘిస్తే వచ్చే శిక్ష బహు కఠినం (ద్వితీయోపదేశకాండము 28:58-59).

8. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపక ముంచుకొనుము.
మార్కు 2:27

ఆదికాండము 2:2-3 నిర్గమకాండము 23:12 నిర్గమకాండము 31:13-17 నిర్గమకాండము 34:21 నిర్గమకాండము 35:2-3 ద్వితీయోపదేశకాండము 5:12-15 యెషయా 58:12-13. విశ్రాంతి దినం నెమ్మదిగా, ప్రశాంతంగా, విశ్రాంతిగా గడపవలసిన రోజు. ఇస్రాయేల్‌ప్రజ సమకూడి దేవుణ్ణి ఆరాధించే రోజు కూడా ఇదే (లేవీయకాండము 23:3). ఆరు రోజులు పని చేసిన తరువాత ఇలాంటి రోజు ఒకటి మనిషికి అవసరమని దేవునికి తెలుసు. ధర్మశాస్త్రం క్రింద ఉన్న యూదులకు శనివారం విశ్రాంతి దినంగా ఉంది. ఇప్పుడు ధర్మశాస్త్రం క్రింద క్రైస్తవులు లేరు (రోమీయులకు 6:14). సాధారణంగా వారు ఆదివారాన్ని విశ్రాంతిదినంగా ఆచరిస్తున్నారు (అపో. కార్యములు 20:7 1 కోరింథీయులకు 16:2). ఏ రోజు అన్నది ముఖ్యం కాదు. ఆ రోజును విశ్రాంతికీ ఆరాధనకూ ఉపయోగించుకోవాలన్నది ముఖ్యం. క్రొత్త ఒడంబడిక గ్రంథమంతటిలోనూ ఎక్కడా శనివారాన్ని విశ్రాంతి దినంగా ఆచరించాలన్న ఆజ్ఞ క్రైస్తవులకు ఇవ్వడం కనిపించదు.

9. ఆరు దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను
లూకా 13:14

10. ఏడవ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతిదినము. దానిలో నీవైనను నీ కుమారుడైనను నీ కుమార్తెయైనను నీ దాసుడైనను నీ దాసియైనను నీ పశువైనను నీ యిండ్లలో నున్న పరదేశి యైనను ఏపనియు చేయ కూడదు.
మత్తయి 12:2, లూకా 23:56, లూకా 13:14

11. ఆరు దినములలో యెహోవా ఆకాశమును భూమియు సముద్రమును వాటిలోని సమస్తమును సృజించి, యేడవ దినమున విశ్రమించెను; అందుచేత యెహోవా విశ్రాంతిదినమును ఆశీర్వదించి దాని పరిశుద్ధపరచెను.
అపో. కార్యములు 4:24, అపో. కార్యములు 14:15, ప్రకటన గ్రంథం 10:6, ప్రకటన గ్రంథం 14:7

12. నీ దేవుడైన యెహోవా నీకనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము.
మత్తయి 15:4, మత్తయి 19:19, మార్కు 7:10, మార్కు 10:19, ఎఫెసీయులకు 6:2-3, లూకా 18:20

లేవీయకాండము 19:3 ద్వితీయోపదేశకాండము 27:16 మత్తయి 15:4 మత్తయి 19:19 ఎఫెసీయులకు 6:2-3.

16. నీ పొరుగువానిమీద అబద్ధసాక్ష్యము పలుకకూడదు.

నిర్గమకాండము 23:1 నిర్గమకాండము 23:7 ద్వితీయోపదేశకాండము 5:20 సామెతలు 6:16-19 సామెతలు 12:22 మత్తయి 19:18 కొలొస్సయులకు 3:9. దేవుడు సత్యవంతుడు గనుక అన్ని రకాల అబద్ధాలనూ మోసాన్నీ ఆయన ద్వేషిస్తాడు. బైబిలు చివరి పుస్తకంలో అబద్ధాలాడితే వచ్చే శిక్షను గురించి దేవుడు మూడు సార్లు వెల్లడి చేశాడు (ప్రకటన గ్రంథం 21:8 ప్రకటన గ్రంథం 21:27 ప్రకటన గ్రంథం 22:15).

17. నీ పొరుగువాని యిల్లు ఆశింపకూడదు. నీ పొరుగువాని భార్యనైనను అతని దాసునైనను అతని దాసినైనను అతని యెద్దునైనను అతని గాడిదనైనను నీ పొరుగువానిదగు దేనినైనను ఆశింపకూడదు అని చెప్పెను.

ద్వితీయోపదేశకాండము 5:21 రోమీయులకు 7:7 రోమీయులకు 13:9 ఎఫెసీయులకు 5:3 ఎఫెసీయులకు 5:5. ఈ అధ్యాయంలో మిగిలిన ఆజ్ఞలన్నీ ప్రత్యక్షంగా మనుషుల చర్యలకు సంబంధించినవి. ఈ ఆజ్ఞ హృదయంలోని రహస్యమైన కోరికలకు సంబంధించినది. దేవుని రాయబారి పౌలు తాను ధర్మశాస్త్రంలోని ఆజ్ఞలన్నిటినీ అనుసరించ గలననుకున్నాడు. అయితే ఈ ఆజ్ఞ అతని భ్రష్ట స్వభావంలో పాతుకుపోయిన అదుపులేని కోరికలను అతనికి వెల్లడించి తాను పాపినని ఒప్పించింది (రోమీయులకు 7:7-8). మనుషులు దేవుడు ఇచ్చే మహిమను అందుకోలేకపోతున్నారని అన్ని ఇతర ఆజ్ఞలకంటే ఈ ఆజ్ఞ సుస్పష్టంగా చూపెడుతూ ఉంది (రోమీయులకు 3:23). పాపం అనేది మనిషి చేసే పాప కార్యమే గాక లోపలి కోరికలలో కూడా ఉంటుందని ప్రభువైన యేసు వెల్లడించాడు (మత్తయి 5:27-28 మత్తయి 15:19-20).

18. ప్రజలందరు ఆ ఉరుములు ఆ మెరుపులు ఆ బూర ధ్వనియు ఆ పర్వత ధూమమును చూచి, భయపడి తొలగి దూరముగా నిలిచి మోషేతో ఇట్లనిరి.
హెబ్రీయులకు 12:18-19

నిర్గమకాండము 19:16 నిర్గమకాండము 19:18 హెబ్రీయులకు 12:18-19. ధర్మశాస్త్రం మనిషిని దేవునికి దూరంగానే నిలబెట్టి ఉంచుతుంది. కృప అయితే అతన్ని దేవునికి చేరువ చేస్తుంది.

19. నీవు మాతో మాటలాడుము మేము విందుము; దేవుడు మాతో మాటలాడిన యెడల మేము చనిపోవుదుము

ద్వితీయోపదేశకాండము 5:5 Deut5 23-27:1 హెబ్రీయులకు 12:19.

20. అందుకు మోషే - భయపడకుడి; మిమ్ము పరీక్షించుటకును, మీరు పాపము చేయకుండునట్లు ఆయన భయము మీకు కలుగుటకును, దేవుడు వేంచేసెనని ప్రజలతో చెప్పెను.

ద్వితీయోపదేశకాండము 4:10 ద్వితీయోపదేశకాండము 6:24 సామెతలు 3:7 సామెతలు 16:6 యెషయా 8:13. దేవునికి కోపం తెప్పించి ఆయన ఇచ్చే శిక్షకు గురి అవుతానన్న భయాన్ని మనిషిలో ధర్మశాస్త్రం కలుగజేయాలి. ఈ భయం పాపం చెయ్యకుండా అడ్డుకట్టగా పని చేస్తుంది. ఆదికాండము 20:11 కీర్తనల గ్రంథము 34:11-14 మొ।। నోట్స్ చూడండి.

21. ప్రజలు దూరముగా నిలిచిరి. మోషే దేవుడున్న ఆ గాఢాంధకారమునకు సమీపింపగా

నిర్గమకాండము 19:16 ద్వితీయోపదేశకాండము 5:22 చూడండి.

22. యెహోవా మోషేతో ఇట్లనెను - ఇశ్రాయేలీయులతో ఈలాగు చెప్పుము నేను ఆకాశమునుండి మీతో మాటలాడితినని మీరు గ్రహించితిరి.

ద్వితీయోపదేశకాండము 4:36 ద్వితీయోపదేశకాండము 5:24 ద్వితీయోపదేశకాండము 5:26 నెహెమ్యా 9:13 హెబ్రీయులకు 12:25.

23. మీరు నన్ను కొలుచుచు, వెండి దేవతలనైనను బంగారు దేవతలనైనను చేసి కొనకూడదు.

దేవుడు ఈ అధ్యాయంలో రెండోసారి ఇచ్చిన ఆజ్ఞ పర దేవతలను పూజించకూడదని నిషేధిస్తున్నది. దీన్నిబట్టి ఈ ఆజ్ఞ ఎంత ప్రాముఖ్యమైనదో అర్థమౌతున్నది. ఆ మాటకొస్తే ఇతర ఆజ్ఞలన్నిటికీ ఆధారం ఇదే.

24. మంటి బలిపీఠమును నాకొరకు చేసి, దానిమీద నీ దహన బలులను సమాధానబలులను నీ గొఱ్ఱెలను నీ యెద్దులను అర్పింపవలెను. నేను నా నామమును జ్ఞాపకార్థముగానుంచు ప్రతి స్థలములోను నీయొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించెదను.

ఇక్కడ వెల్లడి అవుతున్న ధర్మశాస్త్రం తెచ్చేశాపం నుంచి పాపులను విడిపించేందుకు బలి అయిన క్రీస్తుకే ఈ హోమబలులు, శాంతిబలులు సూచనలు (గలతియులకు 3:13-14). ఈ అర్పణల గురించి నోట్స్ లేవీ 1,3 అధ్యాయాల్లో చూడండి. “దీవిస్తాను”– దీవెనెల గురించి నోట్స్ ఆదికాండము 12:2-3 సంఖ్యాకాండము 6:22-27 ద్వితీయోపదేశకాండము 28:1-14 కీర్తనల గ్రంథము 1:1-2 కీర్తనల గ్రంథము 119:1 మత్తయి 5:3-12 లూకా 11:28 అపో. కార్యములు 3:26 గలతియులకు 3:9 గలతియులకు 3:15 ఎఫెసీయులకు 1:3.

25. నీవు నాకు రాళ్లతో బలిపీఠమును చేయునప్పుడు మలిచిన రాళ్లతో దాని కట్టకూడదు; దానికి నీ పనిముట్టు తగలనిచ్చిన యెడల అది అపవిత్రమగును.

26. మరియు నా బలిపీఠముమీద నీ దిగంబరత్వము కనబడక యుండునట్లు మెట్లమీదుగా దానిని ఎక్కకూడదు.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Exodus - నిర్గమకాండము 20 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible
పది ఆజ్ఞలకు ముందుమాట. (1,2) 
దేవుడు వారి మనస్సాక్షి ద్వారా లేదా వారి జీవితంలో జరిగే విషయాల ద్వారా అనేక రకాలుగా ప్రజలతో మాట్లాడతాడు. కానీ దేవుడు పది ఆజ్ఞలను మాట్లాడినప్పుడు, అది చాలా ప్రత్యేకమైనది మరియు ముఖ్యమైనది. ప్రజలు అనుసరించడానికి దేవుడు ఇప్పటికే నియమాలను ఇచ్చాడు, కాని వారు పాపం కారణంగా వాటిని మరచిపోయారు. పది ఆజ్ఞలు చాలా ముఖ్యమైనవి ఎందుకంటే దేవుడు మనం ఏమి చేయాలనుకుంటున్నామో అవి మనకు చూపుతాయి. వారు దేవుణ్ణి మరియు ఇతరులను ప్రేమించాలని మరియు ఎల్లప్పుడూ లోబడాలని చెబుతారు. మనం చాలా నియమాలను పాటించినా, ఒక్కటి మాత్రమే ఉల్లంఘించినా, మనం వాటన్నింటినీ ఉల్లంఘించినట్లే. jam 2:10 ఏదైనా తప్పు చేయడం, అది మన ఆలోచనలలో, మాటలలో లేదా చర్యలలో ఏదైనా సరే, దానిని పాపం అంటారు మరియు అది చెడు పరిణామాలకు దారి తీస్తుంది. ఈ పర్యవసానాలు మనకు మంచి వాటి నుండి వేరుగా అనిపించేలా చేస్తాయి మరియు నొప్పిని కలిగిస్తాయి. 

మొదటి పట్టిక యొక్క ఆజ్ఞలు. (3-11) 
పది నియమాలలో మొదటి నాలుగు, మనం మొదటి పట్టిక అని పిలుస్తాము, దేవుని పట్ల మనం ఎలా ప్రవర్తించాలో తెలియజేస్తుంది. అవి ముఖ్యమైనవి ఎందుకంటే మనం ఇతరులను ప్రేమించే మరియు గౌరవించే ముందు మనం దేవుణ్ణి ప్రేమించాలి మరియు గౌరవించాలి. మనం దేవుణ్ణి ప్రేమించి గౌరవించకపోతే ఇతరులను ప్రేమించడం, గౌరవించడం కష్టం. మొదటి నియమం మనం దేవుడిని మాత్రమే పూజించాలని చెబుతుంది మరియు మరేదైనా కాదు. మనము మన పూర్ణ హృదయముతో దేవుణ్ణి ప్రేమించాలి, కృతజ్ఞతతో, ​​గౌరవించాలి మరియు ఆరాధించాలి. మనం చేసే ప్రతి పని దేవుడిని గౌరవించాలి. మనం దేవుణ్ణి ఎలా ఆరాధించాలో రెండవ ఆజ్ఞ చెబుతుంది. మనం దేవుడి బొమ్మలు లేదా విగ్రహాలు చేయకూడదు మరియు దేవునికి తప్ప మరేదైనా పూజించకూడదు. మూఢనమ్మకాలను విశ్వసించకూడదని లేదా దేవుని ఆరాధనలో ప్రజలు సృష్టించిన వస్తువులను ఉపయోగించకూడదని కూడా ఈ ఆజ్ఞ చెబుతోంది. దేవుడిని పూజించేటప్పుడు మనం ఎలా ప్రవర్తించాలి అనేది మూడవ ఆజ్ఞ. మనం గౌరవంగా మరియు గంభీరంగా ఉండాలి. మనం అవాస్తవాలను మాట్లాడకూడదు మరియు దేవుని పేరును అగౌరవపరిచే విధంగా ఉపయోగించకూడదు. నాల్గవ ఆజ్ఞ, వారంలోని ఏడవ రోజున విశ్రాంతి తీసుకోవాలని గుర్తుంచుకోవాలని మనకు గుర్తుచేస్తుంది, ఇది ఇంతకు ముందు ప్రజలచే తెలిసినది. ప్రతి వారం విశ్రాంతి తీసుకోవడానికి మరియు అతని గురించి ఆలోచించడానికి మనం ఒక రోజు కేటాయించాలని దేవుడు కోరుకుంటున్నాడు. మా సాధారణ కార్యకలాపాలను చేయడానికి మనకు మరో ఆరు రోజులు ఉన్నాయి, కానీ మన ఆత్మలను జాగ్రత్తగా చూసుకోవడం మరియు దేవుని కోసం పనులు చేయడం గురించి మనం మరచిపోకూడదు. ప్రత్యేక రోజుకి ముందే మన పని అంతా పూర్తి చేయాలి మరియు నిజంగా ముఖ్యమైన లేదా ఇతరులకు ఉపయోగపడే పనులను మాత్రమే చేయాలి. ఈ రోజున మన విశ్వాసానికి అవసరమైన, దయగల లేదా మంచి పనులను చేయడం సరైందేనని యేసు చెప్పాడు, ఎందుకంటే ఇది మన జీవితాలను కష్టతరం చేయడానికి కాదు, మనకు సహాయం చేయడానికి ఉద్దేశించబడింది. మత్తయి 2:27 దేవునికి పవిత్రంగా ఉండాల్సిన రోజున, మనల్ని మనం ప్రదర్శించుకోవడానికి లేదా సంతోషపెట్టడానికి మాత్రమే పనులు చేయకూడదు. మేము వ్యాపారం చేయడం, డబ్బు కోసం పని చేయడం లేదా అప్రధానమైన సంభాషణలు చేయడం వంటివి చేయకూడదు. బదులుగా, మనం మన సాధారణ పని నుండి విరామం తీసుకొని దేవుని సేవ చేయడంపై దృష్టి పెట్టాలి. ఇది మన ఆరోగ్యం మరియు ఆనందానికి మరియు మన ఆత్మను జాగ్రత్తగా చూసుకోవడానికి చాలా ముఖ్యం. రోజు ప్రత్యేకమైనది మరియు మనకు ఆశీర్వాదాలను తెస్తుంది. ఈ నియమం కేవలం ఒక రోజు కోసం కాదు, మనం పవిత్రంగా ఉంచిన అన్ని రోజులకు. 

రెండవ పట్టిక. (12-17)
చివరి ఆరు ఆజ్ఞలు మనతో మరియు ఇతర వ్యక్తులతో ఎలా ప్రవర్తించాలో తెలియజేస్తాయి. మనల్ని మనం ప్రేమించుకున్నట్లే ఇతరులను కూడా ప్రేమించాలని అర్థం చేసుకోవడానికి అవి సహాయపడతాయి. మత్తయి 15:4-6 పిల్లలు మంచిగా మరియు నియమాలను పాటించినప్పుడు, మంచి ఆరోగ్యం మరియు భద్రత వంటి మంచి విషయాలు వారికి జరుగుతాయని ప్రజలు గమనించారు. కానీ పిల్లలు అవిధేయత మరియు నిబంధనలను ఉల్లంఘించినప్పుడు, వారికి చెడు విషయాలు జరగవచ్చు. ఇతర వ్యక్తుల జీవితాలు మరియు భద్రతను మన స్వంతంగా పరిగణించడం నియమాలలో ఒకటి. మనల్ని మనం రక్షించుకోవడం ఫర్వాలేదు, కానీ సరైన కారణం లేకుండా ఎవరినైనా బాధపెట్టడం లేదా చంపడం తప్పు. మనం కోపంగా ఉన్నందున లేదా ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటున్నందున ఎవరితోనైనా పోరాడటం లేదా బాధపెట్టడం ముఖ్యంగా తప్పు. డబ్బు లేదా కీర్తి కోసం పోరాడటం కూడా తప్పు మరియు ఈ నియమాన్ని ఉల్లంఘిస్తుంది. ఆ రకమైన పోరాటం ప్రజలను గాయపరచవచ్చు లేదా చంపవచ్చు మరియు అది హత్య చేయడం లాంటిది. ఈ నియమం మనకు లేదా ఇతరులకు హాని కలిగించే పనులు చేయకూడదని చెబుతుంది, అంటే నీచంగా ప్రవర్తించడం లేదా ప్రజలను బాధపెట్టడం వంటివి. తగని విషయాలను చూడకుండా లేదా చదవకుండా లేదా మనల్ని బాధపెట్టకుండా జాగ్రత్తపడాలి. ఇతరుల పట్ల దయ మరియు క్షమించడం ముఖ్యం. మనం కూడా మన శరీరాలను గౌరవించేలా చూసుకోవాలి మరియు చెడు చిత్రాలను చూడటం లేదా చెడు పుస్తకాలు చదవడం వంటి వాటికి హాని కలిగించే పనులను చేయకూడదు. ఎనిమిదవ ఆజ్ఞ ఇతరుల వస్తువులను ప్రేమించాలని మరియు గౌరవించాలని చెబుతుంది. మన దగ్గర ఉన్నదానికి మనం కృతజ్ఞతతో ఉండాలి మరియు దానిని నిజాయితీగా ఉపయోగించాలి. బాగా తెలియని లేదా కఠినమైన పరిస్థితుల్లో ఉన్న వ్యక్తుల నుండి మనం ప్రయోజనం పొందకూడదు. ఇతరుల నుండి దొంగిలించే శక్తివంతమైన వ్యక్తులు కూడా శిక్షించబడతారు. ఈ ఆజ్ఞను ఉల్లంఘించడంలో మోసం చేయడం, అప్పులు చెల్లించకపోవడం, వ్యర్థం చేయడం, అవసరం లేనప్పుడు దాతృత్వంతో జీవించడం మరియు వారి పనికి తగిన విధంగా చెల్లించకపోవడం. బదులుగా, మనం కష్టపడి పనిచేయాలి, మన డబ్బుతో జాగ్రత్తగా ఉండాలి మరియు ఇతరుల ఆస్తిని వారు మనతో ఎలా చూసుకోవాలనుకుంటున్నారో అలాగే చూడాలి. తొమ్మిదవ ఆజ్ఞ మనకు సత్యంగా ఉండాలని మరియు ఇతరుల గురించి నిజం కాని చెడు మాటలు చెప్పకూడదని చెబుతుంది. మన పొరుగువారిని చెడుగా చూపించడానికి లేదా వారి గురించి అబద్ధాలు చెప్పడానికి మనం ప్రయత్నించకూడదు. మనం కూడా వారి వెనుక కబుర్లు చెప్పకూడదు లేదా నీచమైన విషయాలు చెప్పకూడదు. పదవ ఆజ్ఞ ఇతరులకు చెందిన వస్తువులను కోరుకోవద్దని చెబుతుంది, ఎందుకంటే మరొకరికి హాని కలిగించే వాటిని కోరుకోవడం సరైనది కాదు. 

ప్రజల భయం. (18-21) 
దేవుడు చేసిన చాలా ప్రాముఖ్యమైన చట్టం మనం పాటించాలి. ఇది చాలా శక్తివంతమైనది, మనం దాని నుండి తప్పించుకోలేము మరియు ఇది చాలా అర్ధమే. ఇప్పుడు మనం ఎలా జీవించాలో చెప్పినట్లే, భవిష్యత్తులో మనల్ని తీర్పు తీర్చడానికి ఈ చట్టం ఉపయోగపడుతుంది. మన జీవితాలను పరిశీలిస్తే, మనం ఎల్లప్పుడూ ఈ చట్టాన్ని అనుసరించలేదని మనం చూస్తాము. కానీ, ఈ చట్టం మరియు దానితో వచ్చే తీర్పు కారణంగా, మనం యేసు గురించిన శుభవార్తను అభినందించాలి. ఈ చట్టాన్ని తెలుసుకోవడం వల్ల మనం చేసే చెడు పనులకు క్షమించాలి. ఎవరైనా యేసును విశ్వసించినప్పుడు, వారు పాపంచే నియంత్రించబడటం మానేసి, దేవుని చట్టాన్ని అనుసరించడం ప్రారంభిస్తారు. పాపాన్ని ద్వేషించడానికి మరియు సరైనది చేయడానికి పరిశుద్ధాత్మ వారికి సహాయం చేస్తుంది. వారు చేసే తప్పుడు పనులకు ఎప్పుడూ పశ్చాత్తాపపడతారు. 

విగ్రహారాధన మళ్లీ నిషేధించబడింది. (22-26)
మోషే చీకటి ప్రదేశానికి వెళ్ళాడు మరియు దేవుడు అతనితో మాట్లాడాడు. తనను ఎలా ఆరాధించాలో దేవుడు మోషేకు నియమాలు చెప్పాడు. ఇశ్రాయేలీయులు తనను ప్రార్థించినప్పుడు వారితో సంతోషంగా ఉంటానని వాగ్దానం చేశాడు. ఇప్పుడు, ప్రజలు ఎక్కడ ఉన్నా దేవుణ్ణి ప్రార్థించవచ్చు మరియు వారు కలిసి ఆయనను ఆరాధించినప్పుడు, అతను వారితో ఉండి వారిని ఆశీర్వదిస్తాడు. 


Shortcut Links
నిర్గమకాండము - Exodus : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |