Exodus - నిర్గమకాండము 32 | View All
Study Bible (Beta)

1. మోషే కొండదిగకుండ తడవుచేయుట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోనునొద్దకు కూడి వచ్చి లెమ్ము, మా ముందర నడుచుటకు ఒక దేవతను మాకొరకు చేయుము. ఐగుప్తులోనుండి మమ్మును రప్పించిన ఆ మోషే అనువాడు ఏమాయెనో మాకు తెలియదని అతనితో చెప్పిరి.
అపో. కార్యములు 7:40

1. And when the people saw that Moses delayed to come down out of the mount, the people gathered themselves together unto Aaron, and said unto him, Up, make us gods, which shall go before us; for as for this Moses, the man that brought us up out of the land of Egypt, we wot not what is become of him.

2. అందుకు అహరోను మీ భార్యలకు మీ కుమారులకు మీ కుమార్తెలకు చెవుల నున్న బంగారు పోగులను తీసి నాయొద్దకు తెండని వారితో చెప్పగా

2. And Aaron said unto them, Break off the golden earrings, which are in the ears of your wives, of your sons, and of your daughters, and bring them unto me.

3. ప్రజలందరు తమ చెవులనున్న బంగారు పోగులను తీసి అహరోను నొద్దకు తెచ్చిరి.

3. And all the people brake off the golden earrings which were in their ears, and brought them unto Aaron.

4. అతడు వారియొద్ద వాటిని తీసికొని పోగరతో రూపమును ఏర్పరచి దానిని పోత పోసిన దూడగా చేసెను. అప్పుడు వారు ఓ ఇశ్రాయేలూ, ఐగుప్తుదేశములోనుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అనిరి.
అపో. కార్యములు 7:41

4. And he received them at their hand, and fashioned it with a graving tool, after he had made it a molten calf: and they said, These be thy gods, O Israel, which brought thee up out of the land of Egypt.

5. అహరోను అది చూచి దాని యెదుట ఒక బలిపీఠము కట్టించెను. మరియఅహరోను రేపు యెహోవాకు పండుగ జరుగునని చాటింపగా

5. And when Aaron saw it, he built an altar before it; and Aaron made proclamation, and said, To morrow is a feast to the LORD.

6. మరునాడు వారు ఉదయమున లేచి దహన బలులను సమాధానబలుల నర్పించిరి. అప్పుడు జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి.
2 కోరింథీయులకు 10:7, అపో. కార్యములు 7:41

6. And they rose up early on the morrow, and offered burnt offerings, and brought peace offerings; and the people sat down to eat and to drink, and rose up to play.

7. కాగా యెహోవా మోషేతో ఇట్లనెను నీవు దిగి వెళ్లుము; ఐగుప్తుదేశమునుండి నీవు రప్పించిన నీ ప్రజలు చెడిపోయిరి.

7. And the LORD said unto Moses, Go, get thee down; for thy people, which thou broughtest out of the land of Egypt, have corrupted themselves:

8. నేను వారికి నియమించిన త్రోవనుండి త్వరగా తొలగిపోయి తమకొరకు పోతపోసిన దూడను చేసికొని దానికి సాగిలపడి బలినర్పించి ఓయి ఇశ్రాయేలూ, ఐగుప్తుదేశమునుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అని చెప్పుకొనిరనెను.

8. They have turned aside quickly out of the way which I commanded them: they have made them a molten calf, and have worshipped it, and have sacrificed thereunto, and said, These be thy gods, O Israel, which have brought thee up out of the land of Egypt.

9. మరియయెహోవా ఇట్లనెను నేను ఈ ప్రజలను చూచియున్నాను; ఇదిగో వారు లోబడనొల్లని ప్రజలు.
అపో. కార్యములు 7:51

9. And the LORD said unto Moses, I have seen this people, and, behold, it is a stiffnecked people:

10. కావున నీవు ఊరకుండుము; నా కోపము వారిమీద మండును, నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేసెదనని మోషేతో చెప్పగా

10. Now therefore let me alone, that my wrath may wax hot against them, and that I may consume them: and I will make of thee a great nation.

11. మోషే తన దేవుడైన యెహోవాను బ్రతిమాలుకొని యెహోవా, నీవు మహాశక్తివలన బాహుబలము వలన ఐగుప్తు దేశములోనుండి రప్పించిన నీ ప్రజలమీద నీ కోపము మండనేల?

11. And Moses besought the LORD his God, and said, LORD, why doth thy wrath wax hot against thy people, which thou hast brought forth out of the land of Egypt with great power, and with a mighty hand?

12. ఆయన కొండలలో వారిని చంపునట్లును భూమిమీదనుండి వారిని నశింపచేయునట్లును కీడుకొరకే వారిని తీసికొని పోయెనని ఐగుప్తీయులు ఏల చెప్పుకొనవలెను? నీ కోపాగ్నినుండి మళ్లుకొని నీవు

12. Wherefore should the Egyptians speak, and say, For mischief did he bring them out, to slay them in the mountains, and to consume them from the face of the earth? Turn from thy fierce wrath, and repent of this evil against thy people.

13. నీ సేవకులైన అబ్రాహామును ఇస్సాకును ఇశ్రాయేలును జ్ఞాపకము చేసికొనుము. నీవు వారితో ఆకాశనక్షత్రములవలె మీ సంతానము అభివృద్ధిజేసి నేను చెప్పిన యీ సమస్తభూమిని మీ సంతానమున కిచ్చెదననియు, వారు నిరంతరము దానికి హక్కుదారులగుదురనియు వారితో నీతోడని ప్రమాణముచేసి చెప్పితివనెను.
హెబ్రీయులకు 11:12

13. Remember Abraham, Isaac, and Israel, thy servants, to whom thou swarest by thine own self, and saidst unto them, I will multiply your seed as the stars of heaven, and all this land that I have spoken of will I give unto your seed, and they shall inherit it for ever.

14. అంతట యెహోవా తన ప్రజలకు చేసెదనని చెప్పిన కీడునుగూర్చి సంతాపపడెను.

14. And the LORD repented of the evil which he thought to do unto his people.

15. మోషే శాసనములుగల రెండు పలకలను చేత పట్టుకొని కొండ దిగి వచ్చెను. ఆ పలకలు ఇరు ప్రక్కలను వ్రాయబడినవి; అవి ఈ ప్రక్కను ఆ ప్రక్కను వ్రాయ బడియుండెను.

15. And Moses turned, and went down from the mount, and the two tables of the testimony were in his hand: the tables were written on both their sides; on the one side and on the other were they written.

16. ఆ పలకలు దేవుడు చేసినవి; ఆ పలకల మీద చెక్కబడిన వ్రాత దేవుని చేవ్రాత.

16. And the tables were the work of God, and the writing was the writing of God, graven upon the tables.

17. ఆ ప్రజలు పెద్దకేకలు వేయుచుండగా యెహోషువ ఆ ధ్వని వినిపాళెములో యుద్ధధ్వని అని మోషేతో అనగా

17. And when Joshua heard the noise of the people as they shouted, he said unto Moses, There is a noise of war in the camp.

18. అతడు అది జయధ్వనికాదు, అపజయ ధ్వనికాదు, సంగీత ధ్వని నాకు వినబడుచున్నదనెను.

18. And he said, It is not the voice of them that shout for mastery, neither is it the voice of them that cry for being overcome: but the noise of them that sing do I hear.

19. అతడు పాళెమునకు సమీపింపగా, ఆ దూడను, వారు నాట్యమాడుటను చూచెను. అందుకు మోషే కోపము మండెను; అతడు కొండదిగువను తన చేతులలోనుండి ఆ పలకలను పడవేసి వాటిని పగులగొట్టెను.

19. And it came to pass, as soon as he came nigh unto the camp, that he saw the calf, and the dancing: and Moses' anger waxed hot, and he cast the tables out of his hands, and brake them beneath the mount.

20. మరియు అతడు వారు చేసిన ఆ దూడను తీసికొని అగ్నితో కాల్చి పొడిచేసి నీళ్లమీద చల్లి ఇశ్రాయేలీయులచేత దాని త్రాగించెను.

20. And he took the calf which they had made, and burnt it in the fire, and ground it to powder, and strawed it upon the water, and made the children of Israel drink of it.

21. అప్పుడు మోషేనీవు ఈ ప్రజలమీదికి ఈ గొప్ప పాపము రప్పించునట్లు వారు నిన్ను ఏమిచేసిరని అహరోనును నడుగగా

21. And Moses said unto Aaron, What did this people unto thee, that thou hast brought so great a sin upon them?

22. అహరోను నా యేలినవాడా, నీ కోపము మండనియ్యకుము. ఈ ప్రజలు దుర్మార్గులను మాట నీ వెరుగుదువు.

22. And Aaron said, Let not the anger of my lord wax hot: thou knowest the people, that they are set on mischief.

23. వారు మాకు ముందు నడుచుటకు ఒక దేవతను చేయుము; ఐగుప్తులోనుండి మమ్మును రప్పించినవాడగు ఈ మోషే యేమాయెనో మాకు తెలియదనిరి.
అపో. కార్యములు 7:40

23. For they said unto me, Make us gods, which shall go before us: for as for this Moses, the man that brought us up out of the land of Egypt, we wot not what is become of him.

24. అందుకు నేను ఎవరియొద్ద బంగారము ఉన్నదో వారు దానిని ఊడదీసి తెండని చెప్పితిని. నేను దాని అగ్నిలో వేయగా ఈ దూడ యాయెననెను.

24. And I said unto them, Whosoever hath any gold, let them break it off. So they gave it me: then I cast it into the fire, and there came out this calf.

25. ప్రజలు విచ్చల విడిగా తిరుగుట మోషే చూచెను. వారి విరోధులలో వారికి ఎగతాళి కలుగునట్లు అహరోను విచ్చలవిడిగా తిరుగుటకు వారిని విడిచి పెట్టి యుండెను.

25. And when Moses saw that the people were naked; (for Aaron had made them naked unto their shame among their enemies:)

26. అందుకు మోషే పాళెముయొక్క ద్వారమున నిలిచి యెహోవా పక్షమున నున్న వారందరు నాయొద్దకు రండి అనగా లేవీయులందరును అతని యొద్దకు కూడి వచ్చిరి.

26. Then Moses stood in the gate of the camp, and said, Who is on the LORD'S side? let him come unto me. And all the sons of Levi gathered themselves together unto him.

27. అతడు వారిని చూచి మీలో ప్రతివాడును తన కత్తిని తన నడుమున కట్టుకొని పాళెములో ద్వారము నుండి ద్వారమునకు వెళ్లుచు, ప్రతివాడు తన సహోదరుని ప్రతివాడు తన చెలికానిని ప్రతివాడు తన పొరుగువానిని చంపవలెనని ఇశ్రాయేలీయులదేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నా డనెను.

27. And he said unto them, Thus saith the LORD God of Israel, Put every man his sword by his side, and go in and out from gate to gate throughout the camp, and slay every man his brother, and every man his companion, and every man his neighbour.

28. లేవీయులు మోషే మాటచొప్పున చేయగా, ఆ దినమున ప్రజలలో ఇంచుమించు మూడువేలమంది కూలిరి.

28. And the children of Levi did according to the word of Moses: and there fell of the people that day about three thousand men.

29. ఏలయనగా మోషే వారిని చూచి నేడు యెహోవా మిమ్మును ఆశీర్వదించునట్లు మీలో ప్రతివాడు తన కుమారునిమీద పడియేగాని తన సహోదరునిమీద పడియేగాని యెహోవాకు మిమ్మును మీరే ప్రతిష్ఠ చేసికొనుడనెను.

29. For Moses had said, Consecrate yourselves to day to the LORD, even every man upon his son, and upon his brother; that he may bestow upon you a blessing this day.

30. మరునాడు మోషే ప్రజలతో మీరు గొప్ప పాపము చేసితిరి గనుక యెహోవాయొద్దకు కొండ యెక్కి వెళ్లెదను; ఒకవేళ మీ పాపమునకు ప్రాయశ్చిత్తము చేయగలనేమో అనెను.

30. And it came to pass on the morrow, that Moses said unto the people, Ye have sinned a great sin: and now I will go up unto the LORD; peradventure I shall make an atonement for your sin.

31. అప్పుడు మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్లి అయ్యో యీ ప్రజలు గొప్ప పాపము చేసిరి; వారు బంగారు దేవతను తమకొరకు చేసికొనిరి.

31. And Moses returned unto the LORD, and said, Oh, this people have sinned a great sin, and have made them gods of gold.

32. అయ్యో నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా, లేనియెడల నీవు వ్రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయుమని బ్రతిమాలుకొనుచున్నాననెను.
లూకా 10:20, రోమీయులకు 9:3

32. Yet now, if thou wilt forgive their sin--; and if not, blot me, I pray thee, out of thy book which thou hast written.

33. అందుకు యెహోవా యెవడు నా యెదుట పాపము చేసెనో వాని నా గ్రంథములోనుండి తుడిచి వేయుదును.
ఫిలిప్పీయులకు 4:3, ప్రకటన గ్రంథం 3:5, ప్రకటన గ్రంథం 13:8, ప్రకటన గ్రంథం 17:8, ప్రకటన గ్రంథం 20:12-15

33. And the LORD said unto Moses, Whosoever hath sinned against me, him will I blot out of my book.

34. కాబట్టి నీవు వెళ్లి నేను నీతో చెప్పిన చోటికి ప్రజలను నడిపించుము. ఇదిగో నా దూత నీకు ముందుగా వెళ్లును. నేను వచ్చు దినమున వారి పాపమును వారి మీదికి రప్పించెదనని మోషేతో చెప్పెను.

34. Therefore now go, lead the people unto the place of which I have spoken unto thee: behold, mine Angel shall go before thee: nevertheless in the day when I visit I will visit their sin upon them.

35. అహరోను కల్పించిన దూడను ప్రజలు చేయించినందున యెహోవా వారిని బాధపెట్టెను.

35. And the LORD plagued the people, because they made the calf, which Aaron made.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Exodus - నిర్గమకాండము 32 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible
ప్రజలు అహరోను బంగారు దూడను తయారు చేస్తారు. (1-6) 
మోషే ఒక పర్వతం మీద దేవునితో మాట్లాడుతున్నప్పుడు, ప్రజలు అసహనానికి గురయ్యారు మరియు అహరోనును ఇబ్బంది పెట్టడం ప్రారంభించారు. మోషే తిరిగి వస్తాడని ఎదురుచూసి వారు అలసిపోయారు. వేచి ఉండటం కష్టంగా ఉంటుంది మరియు వ్యక్తులు చేయకూడని పనులను చేయగలదు. మనం ఎల్లవేళలా ఓపికగా ఉండి దేవుని కోసం ఎదురుచూడాలి. విగ్రహాన్ని తయారు చేయడానికి ప్రజలు తమ నగలను కూడా వదులుకున్నారు, ఇది నిజంగా చెడ్డది. మన విశ్వాసం వంటి ముఖ్యమైన విషయాలపై డబ్బు ఖర్చు చేయడానికి మనం సిద్ధంగా ఉండాలి. ఆరోన్ పనిముట్లతో ఆవు విగ్రహాన్ని తయారు చేశాడు, కానీ అది తప్పు. విగ్రహాలు చేయవద్దని దేవుడు చెప్పినా ప్రజలు విగ్రహానికి పూజలు చేసి నైవేద్యాలు సమర్పించారు. వారు దేవునికి విధేయత చూపుతామని వాగ్దానం చేసారు, కానీ వారు చేయకూడని పనిని చేయడం ద్వారా వారు ఆ వాగ్దానాన్ని ఉల్లంఘించారు. దీని అర్థం మనం అనుసరించే నియమాలు మనల్ని పరిపూర్ణంగా చేయలేవు లేదా మన తప్పులను సరిదిద్దలేవు. మేము వారి నుండి నేర్చుకోవచ్చు, కానీ వారు ప్రతిదీ సరిదిద్దలేరు. ప్రత్యేక యాజకునిగా దేవుడు ఎన్నుకున్న ఆరోన్ లాంటి వ్యక్తి కూడా బంగారు దూడను పూజించడం పెద్ద తప్పు. అతను పూజారిగా ఉండటానికి అర్హుడు కాదు, కానీ దేవుడు ఇప్పటికీ అతనికి ఆ గౌరవాన్ని దయతో ఇచ్చాడు. మనం ఎక్కువగా గర్వపడకూడదని లేదా మన గురించి గొప్పగా చెప్పుకోకూడదని ఇది చూపిస్తుంది. 

దేవుని అసంతృప్తి, మోషే మధ్యవర్తిత్వం. (7-14) 
ఇశ్రాయేలీయులు తప్పు చేశారని దేవుడు మోషేతో చెప్పాడు. ఎవరైనా ఏదైనా చెడు చేస్తే అది వారిని చెడ్డ వ్యక్తిని చేసినట్లే. వారు తప్పుగా మారారు మరియు దేవుని గురించి మరచిపోయారు. కానీ దేవునికి ప్రతిదీ తెలుసు, ప్రజలు దాచడానికి ప్రయత్నించే చెడు విషయాలు కూడా. మనం ఊహించలేనంత చెడు విషయాలు ప్రతిరోజు జరుగుతుండటం దేవుడు చూస్తున్నాడు. ప్రజలను శిక్షించకుండా రక్షించమని మోషే దేవుణ్ణి ప్రార్థించాడు మరియు ఇది దేవునితో మాట్లాడటానికి మనకు సహాయపడే యేసు లాంటిది. మోషే దేవుని మహిమ కొరకు ఏది ఉత్తమమైనదో చేయమని అడిగాడు మరియు మనం ప్రార్థించేటప్పుడు ఎల్లప్పుడూ దేవునికి మొదటి స్థానం ఇవ్వాలి. మనం ప్రార్థించేటప్పుడు దేవుడు మనకు చేసిన వాగ్దానాలను కూడా గుర్తు చేయవచ్చు. మోషే ప్రార్ధనలు ఫలించాయి మరియు దేవుడు ప్రజల పట్ల ఆయనకున్న ప్రేమ కారణంగా వారిని శిక్షించకూడదని నిర్ణయించుకున్నాడు. దీనినే దేవుడు తన మనసు మార్చుకోవడం అంటారు. 

మోషే ధర్మశాస్త్ర పట్టికలను పగలగొట్టాడు, అతను బంగారు దూడను నాశనం చేస్తాడు. (15-20) 
దేవునికి దగ్గరైన అనుభూతి నుండి చెడు పనులు చేసే వ్యక్తులతో మాట్లాడడం కష్టం. మనం దేవునితో ఉన్నప్పుడు, ప్రతిదీ మంచిదే, కానీ మనం చెడ్డవారితో ఉన్నప్పుడు, ప్రతిదీ మంచిది కాదు. ప్రజలు విగ్రహాన్ని తయారు చేయడాన్ని మోషే చూసినప్పుడు, అతను దానిని ధ్వంసం చేసి, వారు ఏదో తప్పు చేస్తున్నారని గుర్తుచేసే ప్రత్యేక పానీయం తాగడానికి ఆ ముక్కలను ఉపయోగించాడు. 

ఆరోన్ యొక్క సాకు, విగ్రహారాధకులు చంపబడ్డారు. (21-29) 
ఆరోన్ తప్పు చేసినందుకు నిజంగా వెర్రి మరియు చెడ్డ సాకు చెప్పాడు. వేరొకరు చెప్పినట్లు మనం ఎప్పుడూ తప్పు చేయకూడదు, ఎందుకంటే వారు మనల్ని మాత్రమే ప్రలోభపెడతారు, అలా చేయలేరు. మోషే వచ్చినప్పుడు, ప్రజలు డ్యాన్స్ చేయడం మానేశారు మరియు వారు తప్పు చేసారని భయపడ్డారు. మోషే వారి తప్పును కప్పిపుచ్చలేదు, బదులుగా అతను వాటిని మళ్లీ సరిదిద్దడానికి శిక్షించాడు. లేవీయులు చెడు పనులు చేసిన ప్రధాన వ్యక్తులను శిక్షించవలసి ఉంది, కానీ వారు బహిరంగంగా చేసిన వారిని మాత్రమే శిక్షించారు. మీరు చెడ్డపనులు చేస్తూనే ఉంటే, ఒక నిమిషం ఆనందంగా డ్యాన్స్ చేసి, మరుసటి నిమిషానికి చనిపోయేలా మీరు కూడా పెద్ద ఇబ్బందుల్లో పడతారు. చెడు పనులు చేస్తూ సరదాగా గడిపే వారిని దేవుడు కొన్నిసార్లు శిక్షిస్తాడు. 

మోషే ప్రజల కొరకు ప్రార్థించాడు. (30-35)
నిజంగా చెడ్డ పని చేయడం మహాపాపం అని మోషే చెప్పాడు. ప్రజలు తమ పాపాలు ఎంత ఘోరంగా ఉన్నాయో అర్థం చేసుకోవడానికి మంత్రులు సహాయం చేస్తారు. మనం క్షమాపణ కోరినప్పుడు, మన పాపం ఎంత ఘోరంగా ఉందో చూపిస్తుంది. ప్రజలు నిజంగా చెడు చేసినప్పటికీ వారిని క్షమించమని మోషే దేవుణ్ణి వేడుకున్నాడు. అతను సాకులు చెప్పలేదు, కానీ విషయాలను సరిదిద్దాలని కోరుకున్నాడు. మోషే చనిపోవాలని కోరుకోలేదు, కానీ ప్రజలను రక్షించగలిగితే అతను చాలా కష్టాలను అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాడు. మోషే క్షమాపణ కోరినప్పటికీ, దేవుడు ప్రజలను శిక్షించాడు. మోషే మనకు ఇచ్చిన నియమాలను అనుసరించడం వల్ల మనం దేవునితో స్నేహం చేయలేమని ఇది చూపిస్తుంది. దేవుడు యేసుక్రీస్తు ద్వారా మన పాపాలను క్షమిస్తాడు మరియు వాటిని మరచిపోవాలని ఎంచుకున్నాడు. గర్వం మరియు స్వార్థం ఉన్న వ్యక్తులు దేవుని నియమాలను అనుసరించడం మరియు ఆధ్యాత్మిక మార్గంలో పూజించడం ఇష్టపడరు, కానీ వారు తమ కోరికలకు సరిపోయే మతాన్ని అనుసరిస్తారు. వారికి నచ్చేలా సువార్త సందేశాన్ని కూడా మార్చవచ్చు. అదృష్టవశాత్తూ, యేసు మనలను రక్షించాడు మరియు మన కోసం ప్రార్థిస్తున్నాడు. ఆయన దయకు మనం సంతోషించాలి. 



Shortcut Links
నిర్గమకాండము - Exodus : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |