Ecclesiastes - ప్రసంగి 3 | View All
Study Bible (Beta)

1. ప్రతిదానికి సమయము కలదు. ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు.

తన పనులనూ అనుభవాలనూ అప్పటికి అలా ఉంచి బయటి ప్రపంచం వైపుకు దృష్టి సారించాడు సొలొమోను. జీవితానికి అర్థాన్ని ఇచ్చేది అక్కడ ఏదన్నా ఉందా? లేదు, అక్కడ కూడా తిరిగే చక్రంలాగా ఒకదాని వెంట ఒకటి వచ్చే అర్థం లేని ప్రయత్నాలూ అనుభవాలూ తప్ప వేరేమీ లేదు. ఒక సమయంలో ఏం చేస్తామో, మరో సమయంలో ఇతరులు దానికి విరుద్ధమైనదాన్ని చేస్తారు. ఈ జాబితాలో ఉన్నవాటన్నిటినీ ప్రతి వ్యక్తీ చెయ్యాలని గానీ చేస్తారని గానీ అతడు చెప్పడం లేదు. భూమిపై సహజమైన జీవన గమనం ఇదని అతని ఉద్దేశం. వీటన్నిటినీ కలిపి చూస్తే ఎక్కడా ఏవీ శాశ్వతమైన విలువ ఉన్నవి కనిపించడం లేదు (వ 9).

2. పుట్టుటకు, చచ్చుటకు; నాటుటకు నాటబడినదాని పెరికివేయుటకు,

3. చంపుటకు బాగుచేయుటకు; పడగొట్టుటకు కట్టుటకు;

4. ఏడ్చుటకు నవ్వుటకు; దుఃఖించుటకు నాట్యమాడుటకు;

5. రాళ్లను పారవేయుటకు రాళ్లను కుప్పవేయుటకు; కౌగలించుటకు కౌగలించుట మానుటకు;

6. వెదకుటకు పోగొట్టు కొనుటకు, దాచుకొనుటకు పారవేయుటకు;

7. చింపుటకు కుట్టుటకు; మౌనముగా నుండుటకు మాటలాడుటకు;

8. ప్రేమించుటకు ద్వేషించుటకు; యుద్ధము చేయుటకు సమాధానపడుటకు.

9. కష్టపడినవారికి తమ కష్టమువలన వచ్చిన లాభమేమి?

10. నరులు అభ్యాసము పొందవలెనని దేవుడు వారికి పెట్టియున్న కష్టానుభవమును నేను చూచితిని.

జీవితంలో అనుభవించగల తృప్తి ఏదన్నా ఉంటే అది దేవుని గురించిన ఆలోచనల వల్లే కలుగుతుంది. దేవుని పనులు సుందరమైనవి, మానవుల గ్రహింపుకు మించినవి (వ 11). అవి లోపం లేనివి, శాశ్వతమైనవి (వ 14). అయితే దేవుడు చేసినదేమిటో చేస్తున్నదేమిటో మనిషి అర్థం చేసుకోలేడు. కాబట్టి దాన్ని గురించి ఆందోళన చెందడం మానుకొని తన స్వంత కార్యాల్లో ఏదో సంతోషాన్ని వెతికేందుకు ప్రయత్నించడం మంచిదంటాడు (వ 12,13,22 చూడండి). 11వ వచనంలో అర్థవంతమైన మాటలున్నాయి – “ఆయన అనంత యుగాలను గురించిన ఆలోచన మనుషుల హృదయంలో ఉంచాడు”. ఈ కాలానికి సంబంధించినవి, నిలిచివుండనివి, గతించిపోయేవి అయిన విషయాలు మన హృదయాన్ని సంతృప్తి పరచలేవు.

11. దేనికాలమునందు అది చక్కగా నుండునట్లు సమస్తమును ఆయన నియమించియున్నాడు; ఆయన శాశ్వతకాల జ్ఞానమును నరుల హృదయమందుంచి యున్నాడుగాని దేవుడు చేయుక్రియలను పరిశీలనగా తెలిసికొనుటకు అది చాలదు.

12. కావున సంతోషముగా నుండుటకంటెను తమ బ్రదుకును సుఖముగా వెళ్లబుచ్చుట కంటెను, శ్రేష్ఠమైనదేదియు నరులకు లేదని నేను తెలిసి కొంటిని.

13. మరియు ప్రతివాడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితమువలన సుఖమనుభవించుట దేవుడిచ్చు బహుమానమే అని తెలిసికొంటిని.

14. దేవుడు చేయు పనులన్నియు శాశ్వతములని నేను తెలిసికొంటిని; దానికేదియు చేర్చబడదు దానినుండి ఏదియు తీయబడదు; మనుష్యులు తనయందు భయభక్తులు కలిగియుండునట్లు దేవుడిట్టి నియమము చేసియున్నాడు.

దేవుని పట్ల భయభక్తులు అన్న అంశంపై సొలొమోను అనేక మార్లు రాశాడు (ప్రసంగి 5:7; ప్రసంగి 7:18; ప్రసంగి 8:12-13; ప్రసంగి 12:13; సామెతలు 1:7; సామెతలు 9:10; సామెతలు 15:33). మనుషులకు భయభక్తులు కలగాలనేది ఈ ప్రపంచంలో దేవుడు జరిగించే చర్యలకున్న మూల కారణాలలో ఒకటి. దేవునికి అనుకూలంగా ఉన్న జీవితానికి ఇదెంతో ముఖ్యం (ఆదికాండము 20:11; కీర్తనల గ్రంథము 34:11-14; కీర్తనల గ్రంథము 111:10; కీర్తనల గ్రంథము 130:3-4 నోట్స్‌). సొలొమోను దృష్టిలో అర్థరహితం కాని ఏకైక విషయం ఇదే. ఎందుకంటే ఇది సూర్యునికి పైగా ఉన్నవానికి చెందినది కాబట్టి.

15. ముందు జరిగినదే ఇప్పుడును జరుగును; జరుగబోవునది పూర్వమందు జరిగినదే; జరిగిపోయినదానిని దేవుడు మరలరప్పించును.

16. మరియు లోకమునందు విమర్శస్థానమున దుర్మార్గత జరుగుటయు, న్యాయముండవలసిన స్థానమున దుర్మార్గత జరుగుటయు నాకు కనబడెను.

బైబిల్లో ఆలోచనాపరులైన వ్యక్తులెందరి మనస్సులనో కలవరపెట్టిన విషయం అన్యాయం (యోబు 24:1-12; కీర్తనల గ్రంథము 10:1-12; కీర్తనల గ్రంథము 73:2-12; హబక్కూకు 1:2-4). మనిషి చేసే అన్యాయానికి జవాబు దేవుని న్యాయమైన తీర్పులూ, మనుషుల అక్రమమైన తీర్పులను తలక్రిందులు చేయడమూ అని సొలొమోనుకు తెలుసు. అయితే ఇది ఎప్పుడు, ఎలా జరుగుతుందో గ్రహించలేదు. ఇప్పుడు క్రైస్తవులకైతే ఈ విషయం తెలుసు.

17. ప్రతి ప్రయత్నమునకును ప్రతి క్రియకును తగిన సమయమున్నదనియు, నీతిమంతులకును దుర్మార్గులకును దేవుడే తీర్పు తీర్చుననియు నా హృదయములో నేననుకొంటిని.

18. కాగా తాము మృగములవంటివారని నరులు తెలిసికొనునట్లును, దేవుడు వారిని విమర్శించునట్లును ఈలాగు జరుగుచున్నదని అనుకొంటిని.

వచనం 18లో (ప్రసంగి 2:1, ప్రసంగి 2:15 లో కూడా) సొలొమోను మాటలను జాగ్రత్తగా గమనించండి – “నేను అనుకున్నాను”. ఈ వచనాలు, ఈ పుస్తకంలో మరి కొన్ని వచనాలు, దేవుని నుంచి అతనికి వెల్లడైన సంగతులు కావు. తన మానవ జ్ఞానంతో తాను గమనించిన వాటిని అతను రాస్తున్నాడు. సొలొమోను ఏమనుకున్నాడో దానిలో మనం మన సిద్ధాంతాలను సేకరించుకోరాదు గాని దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా వెల్లడి చేసినదానిలోనుంచి మాత్రమే. చివరికి సొలొమోనుకు 21వ వచనంలోని ప్రశ్నకు జవాబు దొరికింది. దీన్ని ప్రసంగి 12:7 లో వెల్లడి చేశాడు. మనిషి మాత్రం దేవుని సహాయం లేకుండా తన స్వంత తెలివి తేటలతో చావు తరువాత ఏమౌతుంది అనే ప్రశ్నకు జవాబు తెలుసుకోలేడు. దేవుడు తానే ఇది వెల్లడి చేయాలి. దీని గురించి ఆయన వెల్లడించిన సత్యాలు పాత ఒడంబడికలో కొంతవరకు, క్రొత్త ఒడంబడికలో సంపూర్ణంగాను మనకు లభ్యమయ్యాయి (యోబు 10:21-22; కీర్తనల గ్రంథము 16:9-11; కీర్తనల గ్రంథము 49:15; యెషయా 26:19; దానియేలు 12:2-3; 2 తిమోతికి 1:10).

19. నరులకు సంభవించునది యేదో అదే, మృగములకు సంభవించును; వారికిని వాటికిని కలుగుగతి ఒక్కటే; నరులు చచ్చునట్లు మృగములును చచ్చును; సకల జీవులకు ఒక్కటే ప్రాణము; మృగములకంటె నరులకేమియు ఎక్కువలేదు; సమస్తమును వ్యర్థము.

20. సమస్తము ఒక్క స్థలమునకే పోవును; సమస్తము మంటిలోనుండి పుట్టెను, సమస్తము మంటికే తిరిగిపోవును.

21. నరుల ఆత్మ పరమున కెక్కిపోవునో లేదో, మృగముల ప్రాణము భూమికి దిగిపోవునో లేదో యెవరికి తెలియును?

22. కాగా తమకు తరువాత జరుగుదానిని చూచుటకై నరుని తిరిగి లేపికొనిపోవువాడెవడును లేకపోవుట నేను చూడగా వారు తమ క్రియలయందు సంతోషించుటకంటె వారికి మరి ఏ మేలును లేదను సంగతి నేను తెలిసికొంటిని; ఇదే వారి భాగము.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Ecclesiastes - ప్రసంగి 3 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

మానవ వ్యవహారాలలో మార్పులు. (1-10) 
స్థిరమైన మార్పుతో గుర్తించబడిన ప్రపంచంలో శాశ్వతమైన ఆనందాన్ని ఆశించడం భ్రమలకు ఖచ్చితంగా మార్గం. మన ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా మన బాధ్యత మరియు జ్ఞానం ఉంది. ప్రపంచాన్ని పరిపాలించడానికి దేవుని సమగ్ర పథకం కాదనలేనిది తెలివైనది, న్యాయమైనది మరియు దయతో కూడుకున్నది. కాబట్టి, శ్రేష్ఠమైన ప్రయత్నాలకు అనుకూలమైన అవకాశాలను మనం సద్వినియోగం చేసుకోవాలి. మన మరణాల యొక్క అనివార్యత మరింత దగ్గరగా ఉంటుంది, శ్రమ మరియు కష్టాలు మన జీవితాల్లో విస్తృతంగా ఉన్నాయి. ఈ సవాళ్లు మనకు ఎల్లప్పుడూ ఒక ఉద్దేశ్యాన్ని కలిగి ఉండేలా చూడడానికి మాకు అందించబడ్డాయి; పనికిమాలిన జీవితాన్ని గడపడానికి ఎవరూ ఈ ప్రపంచంలోకి తీసుకురాబడలేదు.

దైవిక సలహాలు మారవు. (11-15) 
ప్రతిదీ దేవుడు అనుకున్నట్లుగానే ఉంది, మనకు కనిపించే విధంగా అవసరం లేదు. మన హృదయాలు ప్రాపంచిక చింతలు మరియు శ్రద్ధలతో ఎంతగా మునిగిపోయాయి, వాటిలో దేవుని ప్రభావాన్ని గ్రహించడానికి మనకు సమయం మరియు వంపు లేదు. ప్రపంచం మన హృదయాలను ఆక్రమించడమే కాకుండా దేవుని సృష్టి యొక్క అందం గురించి అపోహలను కూడా పెంచింది. మనం కేవలం మన కోసమే పుట్టామని నమ్మడం ఒక అపోహ; బదులుగా, ఈ సంక్షిప్త మరియు అనిశ్చిత జీవితంలో మంచి చేయడమే మా ఉద్దేశ్యం. దయతో కూడిన చర్యలలో పాల్గొనడానికి మనకు పరిమిత సమయం మాత్రమే ఉంది, కాబట్టి మనం దానిని సద్వినియోగం చేసుకోవాలి. దైవిక ప్రావిడెన్స్‌లో సంతృప్తిని పొందడం అంటే అన్ని సంఘటనలు చివరికి దేవుణ్ణి ప్రేమించే వారి శ్రేయస్సుకు దోహదపడతాయని విశ్వాసం కలిగి ఉంటుంది. ప్రజలు ఆయనను గౌరవించేలా దేవుడు ప్రతిదానిని నిర్దేశిస్తాడు. ప్రపంచం ఉంది, ఉంది, అలాగే ఉంటుంది. మనకు ఎలాంటి ప్రతికూలత ఎదురవ్వలేదు, మానవాళికి ప్రత్యేకమైన ఎలాంటి టెంప్టేషన్‌ను మనం ఎదుర్కోలేదు; మనం అనుభవించేవన్నీ అందరికీ సాధారణం.

ప్రాపంచిక శక్తి యొక్క వ్యర్థం. (16-22)
దేవుని పట్ల గౌరవం లేకుండా, మానవత్వం కేవలం వ్యర్థం; ఇది నిర్లక్ష్యం చేయబడినప్పుడు, అధికార స్థానాల్లో ఉన్నవారు తమ అధికారాన్ని దుర్వినియోగం చేయవచ్చు. ఇంకా, మన జీవితాల గుమ్మం వద్ద వేచి ఉన్న మరొక న్యాయమూర్తి ఉన్నారు. దేవుని దివ్య ప్రణాళికలో, అన్యాయాలను సరిదిద్దడానికి ఒక సమయం ఉంది, అయినప్పటికీ మనం దానిని గ్రహించలేకపోవచ్చు. ఈ ప్రపంచాన్ని తమ ఏకైక దృష్టిగా ఎంచుకోవడం ద్వారా ప్రజలు తమను తాము క్రూరమృగాల స్థాయికి తగ్గించుకుంటారని గ్రహించాలని సోలమన్ తన కోరికను వ్యక్తపరుస్తున్నట్లు కనిపిస్తాడు, ప్రస్తుత సమస్యలతో మరియు భవిష్యత్తులో జవాబుదారీతనం యొక్క అవకాశాలతో భారం పడుతున్నారు. మానవత్వం మరియు జంతువులు రెండూ అవి ఉద్భవించిన ధూళికి తిరిగి వస్తాయి. మన భౌతిక శరీరాలు లేదా వారి సామర్థ్యాలపై గర్వపడటానికి మాకు చాలా తక్కువ కారణం ఉంది. ఏది ఏమైనప్పటికీ, మానవుల యొక్క హేతుబద్ధమైన ఆత్మ మరియు జంతువుల ప్రాణశక్తి మధ్య వ్యత్యాసాన్ని కొంతమంది నిజంగా గ్రహించారు మరియు దానిని సరిగ్గా ఆలోచించేవారు కూడా తక్కువే. మానవ ఆత్మ అధిరోహించి, తీర్పు ఇవ్వబడుతుంది, ఆపై సంతోషం లేదా దుఃఖం యొక్క మార్పులేని స్థితిలో స్థిరపడుతుంది. దీనికి విరుద్ధంగా, జంతువుల ఆత్మ భూమికి దిగిపోతుంది, మరణంతో నశిస్తుంది. క్రూరమైన ఆశలు మరియు కోరికలు మృగాల వలె చనిపోవాలనే ఆలోచన చుట్టూ కేంద్రీకృతమై ఉన్నవారికి ఇది నిజంగా విచారకరం. అస్తిత్వం యొక్క శాశ్వతత్వం నెరవేర్పు యొక్క శాశ్వతత్వంగా ఎలా రూపాంతరం చెందుతుంది అనే దాని గురించి బదులుగా విచారిద్దాం. ఇది ద్యోతకం యొక్క ప్రాథమిక లక్ష్యం. యేసు దేవుని కుమారునిగా మరియు పాపులకు ఆశాజ్యోతిగా ఆవిష్కరించబడ్డాడు.



Shortcut Links
ప్రసంగి - Ecclesiastes : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |