Jeremiah - యిర్మియా 41 | View All

1. ఏడవ మాసమున ఎలీషామా మనుమడును నెతన్యా కుమారుడును రాజవంశస్థుడును రాజుయొక్క ప్రధానులలో నొకడునగు ఇష్మాయేలనువాడును, అతనితో పది మంది మనుష్యులును, మిస్పాలోనున్న అహీకాము కుమారుడైన గెదల్యాయొద్దకు వచ్చి అక్కడ అతనితోకూడ మిస్పాలో భోజనముచేసిరి.

1. But in the seventh month Ishmael, the son of Nethaniah and grandson of Elishama who was a member of the royal family and had been one of Zedekiah's chief officers, came with ten of his men to Gedaliah son of Ahikam at Mizpah. While they were eating a meal together with him there at Mizpah,

2. అప్పుడు నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు అతనితో కూడనున్న ఆ పదిమంది మనుష్యులును లేచి షాఫాను మనుమడును అహీకాము కుమారుడైన గెదల్యాను ఖడ్గముచేత హతముచేసిరి; బబులోనురాజు ఆ దేశముమీద అతని అధికారినిగా నియమించినందున అతని చంపిరి.

2. Ishmael son of Nethaniah and the ten men who were with him stood up, pulled out their swords, and killed Gedaliah, the son of Ahikam and grandson of Shaphan. Thus Ishmael killed the man that the king of Babylon had appointed to govern the country.

3. మరియు మిస్పాలో గెదల్యా యొద్ద ఉండిన యూదులనందరిని, అక్కడ దొరికిన యోధులగు కల్దీయులను ఇష్మాయేలు చంపెను.

3. Ishmael also killed all the Judeans who were with Gedaliah at Mizpah and the Babylonian soldiers who happened to be there.

4. అతడు గెదల్యాను చంపిన రెండవనాడు అది ఎవరికిని తెలియబడక మునుపు

4. On the day after Gedaliah had been murdered, before anyone even knew about it,

5. గడ్డములు క్షౌరము చేయించుకొని వస్త్రములు చింపుకొని దేహములు గాయపరచుకొనిన యెనుబదిమంది పురుషులు యెహోవా మందిరమునకు తీసికొని పోవుటకై నైవేద్యములను ధూపద్రవ్యములను చేతపట్టుకొని షెకెము నుండియు షిలోహు నుండియు షోమ్రోనునుండియు రాగా

5. eighty men arrived from Shechem, Shiloh, and Samaria. They had shaved off their beards, torn their clothes, and cut themselves to show they were mourning. They were carrying grain offerings and incense to present at the temple of the LORD in Jerusalem.

6. నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు దారి పొడుగున ఏడ్చుచు, వారిని ఎదుర్కొనుటకు మిస్పాలోనుండి బయలు వెళ్లి వారిని కలిసికొని వారితో అహీకాము కుమారుడైన గెదల్యా యొద్దకు రండనెను.

6. Ishmael son of Nethaniah went out from Mizpah to meet them. He was pretending to cry as he walked along. When he met them, he said to them, 'Come with me to meet Gedaliah son of Ahikam.'

7. అయితే వారు ఆ పట్టణము మధ్యను ప్రవేశించినప్పుడు నెతన్యా కుమారుడైన ఇష్మాయేలును అతనితోకూడ ఉన్నవారును వారిని చంపి గోతిలో పడవేసిరి.

7. But as soon as they were inside the city, Ishmael son of Nethaniah and the men who were with him slaughtered them and threw their bodies in a cistern.

8. అయితే వారిలో పదిమంది మనుష్యులు ఇష్మాయేలుతో పొలములలో దాచబడిన గోధుమలు యవలు తైలము తేనె మొదలైన ద్రవ్యములు మాకు కలవు, మమ్మును చంపకుమని చెప్పుకొనగా అతడు వారి సహోదరులతో కూడ వారిని చంపక మానెను.

8. But there were ten men among them who said to Ishmael, 'Do not kill us. For we will give you the stores of wheat, barley, olive oil, and honey we have hidden in a field. So he spared their lives and did not kill them along with the rest.

9. ఇష్మాయేలు గెదల్యాతోకూడ చంపిన మనుష్యుల శవములన్నిటిని పడవేసిన గోయి రాజైన ఆసా ఇశ్రాయేలు రాజైన బయషాకు భయపడి త్రవ్వించిన గొయ్యియే; నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు చంపబడినవారి శవములతో దాని నింపెను.

9. Now the cistern where Ishmael threw all the dead bodies of those he had killed was a large one that King Asa had constructed as part of his defenses against King Baasha of Israel. Ishmael son of Nethaniah filled it with dead bodies.

10. అప్పుడు ఇష్మాయేలు మిస్పాలోనున్న జనశేష మంతటిని రాజ కుమార్తెలనందరిని అనగా రాజదేహసంరక్షకుల కధిపతియైన నెబూజరదాను అహీకాము కుమారుడైన గెదల్యాకు అప్పగించిన జనులందరిని, చెరతీసికొనిపోయెను. నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు వారిని చెరతీసికొనిపోయి అమ్మోనీయులయొద్దకు చేరవలెనని ప్రయత్నపడుచుండగా

10. Then Ishmael took captive all the people who were still left alive in Mizpah. This included the royal princesses and all the rest of the people in Mizpah that Nebuzaradan, the captain of the royal guard, had put under the authority of Gedaliah son of Ahikam. Ishmael son of Nethaniah took all these people captive and set out to cross over to the Ammonites.

11. కారేహ కుమారుడైన యోహానానును అతనితోకూడనున్న సేనాధిపతులందరును నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు చేసిన సమస్త దుష్కార్యములను గూర్చిన వార్త విని

11. Johanan son of Kareah and all the army officers who were with him heard about all the atrocities that Ishmael son of Nethaniah had committed.

12. పురుషులనందరిని పిలుచుకొని, నెతన్యా కుమారుడైన ఇష్మాయేలుతో యుద్ధము చేయబోయి, గిబియోనులోనున్న మహా జలముల దగ్గర అతని కలిసికొనిరి.

12. So they took all their troops and went to fight against Ishmael son of Nethaniah. They caught up with him near the large pool at Gibeon.

13. ఇష్మాయేలుతో కూడనున్న ప్రజలందరు కారేహ కుమారుడైన యోహానానును, అతనితో కూడనున్న సేనాధిపతులనందరిని చూచినప్పుడు వారు సంతోషించి

13. When all the people that Ishmael had taken captive saw Johanan son of Kareah and all the army officers with him, they were glad.

14. ఇష్మాయేలు మిస్పాలో నుండి చెరగొనిపోయిన ప్రజలందరు అతని విడిచి కారేహ కుమారుడైన యెహానానుతో కలిసిరి.

14. All those people that Ishmael had taken captive from Mizpah turned and went over to Johanan son of Kareah.

15. అయినను, నెతన్యా కుమారుడైన ఇష్మాయేలును ఎనమండుగురు మనుష్యులును యోహానాను చేతిలోనుండి తప్పించుకొని అమ్మోనీయుల యొద్దకు పారిపోయిరి.

15. But Ishmael son of Nethaniah managed to escape from Johanan along with eight of his men, and he went on over to Ammon.

16. అప్పుడు నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు అహీకాము కుమారుడైన గెదల్యాను చంపిన తరువాత,

16. Johanan son of Kareah and all the army officers who were with him led off all the people who had been left alive at Mizpah. They had rescued them from Ishmael son of Nethaniah after he killed Gedaliah son of Ahikam. They led off the men, women, children, soldiers, and court officials whom they had brought away from Gibeon.

17. కారేహ కుమారుడైన యోహానానును అతనితో కూడనున్న సేనల యధిపతులందరును మిస్పా దగ్గరనుండి ఇష్మాయేలు నొద్దనుండి జనశేషమంతటిని, అనగా గిబియోను దగ్గరనుండి ఇష్మాయేలు కొనిపోయిన యోధులను స్త్రీలను పిల్లలను, రాజపరివారమును మరల రప్పించిరి;

17. They set out to go to Egypt to get away from the Babylonians, but stopped at Geruth Kimham near Bethlehem.

18. అయితే వారు బబులోనురాజు దేశముమీద అధికారినిగా నియమించిన అహీకాము కుమారుడైన గెదల్యాను నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు చంపినందున వారు కల్దీయులకు భయపడి ఐగుప్తునకు వెళ్లుదమనుకొని బేత్లెహేముదగ్గరనున్న గెరూతు కింహాములో దిగిరి.

18. They were afraid of what the Babylonians might do because Ishmael son of Nethaniah had killed Gedaliah son of Ahikam, whom the king of Babylon had appointed to govern the country.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Jeremiah - యిర్మియా 41 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

ఇష్మాయేలు గెదలియాను హత్య చేశాడు. (1-10) 
దైవభక్తిగల ఆరాధకుల పట్ల ద్వేషం పెంచుకునే వారు, వారిని బాగా అణగదొక్కేందుకు తరచూ భక్తిని ప్రదర్శిస్తారు. మరణం తరచుగా ఊహించని విధంగా తాకినట్లే, మన న్యాయమూర్తిని ఎదుర్కొనేందుకు పిలిచినప్పుడు మనం కోరుకునే ఆధ్యాత్మిక స్థితిలో మరియు మనస్తత్వంలో మనం ఉన్నామా లేదా అని స్థిరంగా పరిశీలించాలి. అప్పుడప్పుడు, ఒక వ్యక్తి యొక్క సంపద వారి జీవితానికి వెల అవుతుంది. అయినప్పటికీ, "మమ్మల్ని చంపవద్దు, మా పొలాల్లో మాకు నిధులు ఉన్నాయి" అని చెప్పడం ద్వారా మరణాన్ని కొనుగోలు చేయగలమని నమ్మే వారు తమ భ్రమను బాధాకరమైనదిగా కనుగొంటారు. ఈ నిరాడంబరమైన ఖాతా పూర్తిగా రిమైండర్‌గా పనిచేస్తుంది.

జోహానాన్ బందీలను తిరిగి పొందాడు మరియు ఈజిప్ట్‌కు పదవీ విరమణ చేయాలనుకున్నాడు. (11-18)
చెడు పనులు నశ్వరమైన విజయాన్ని ఆస్వాదించవచ్చు, కానీ పట్టుదలతో తమ హృదయాలను దేవునికి మూసుకునే వారు అభివృద్ధి చెందలేరు. బూటకపు భయాల ద్వారా తమ పాపాలను సమర్థించుకోవాలని కోరుకునే వారు తమ మనశ్శాంతిని కోల్పోతారు. తెలివైన మరియు శాంతి-ప్రేమగల నాయకుడిని హఠాత్తుగా మరియు అధికార దాహంతో భర్తీ చేయడం చాలా మంది శ్రేయస్సు కోసం పరిణామాలను కలిగిస్తుంది. నిజమైన ఆనందం మరియు స్థిరత్వం దేవుని పట్ల భక్తిని కలిగి ఉండి, ఆయన మార్గాన్ని నమ్మకంగా అనుసరించే వారికే కేటాయించబడతాయి.



Shortcut Links
యిర్మియా - Jeremiah : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |