Turn Off
21st Century KJV
A Conservative Version
American King James Version (1999)
American Standard Version (1901)
Amplified Bible (1965)
Apostles' Bible Complete (2004)
Bengali Bible
Bible in Basic English (1964)
Bishop's Bible
Complementary English Version (1995)
Coverdale Bible (1535)
Easy to Read Revised Version (2005)
English Jubilee 2000 Bible (2000)
English Lo Parishuddha Grandham
English Standard Version (2001)
Geneva Bible (1599)
Hebrew Names Version
Hindi Bible
Holman Christian Standard Bible (2004)
Holy Bible Revised Version (1885)
Kannada Bible
King James Version (1769)
Literal Translation of Holy Bible (2000)
Malayalam Bible
Modern King James Version (1962)
New American Bible
New American Standard Bible (1995)
New Century Version (1991)
New English Translation (2005)
New International Reader's Version (1998)
New International Version (1984) (US)
New International Version (UK)
New King James Version (1982)
New Life Version (1969)
New Living Translation (1996)
New Revised Standard Version (1989)
Restored Name KJV
Revised Standard Version (1952)
Revised Version (1881-1885)
Revised Webster Update (1995)
Rotherhams Emphasized Bible (1902)
Tamil Bible
Telugu Bible (BSI)
Telugu Bible (WBTC)
The Complete Jewish Bible (1998)
The Darby Bible (1890)
The Douay-Rheims American Bible (1899)
The Message Bible (2002)
The New Jerusalem Bible
The Webster Bible (1833)
Third Millennium Bible (1998)
Today's English Version (Good News Bible) (1992)
Today's New International Version (2005)
Tyndale Bible (1534)
Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537)
Updated Bible (2006)
Voice In Wilderness (2006)
World English Bible
Wycliffe Bible (1395)
Young's Literal Translation (1898)
Telugu Bible Verse by Verse Explanation
పరిశుద్ధ గ్రంథ వివరణ
Telugu Bible Commentary
Telugu Reference Bible
1. అంతలో సేనాధిపతులందరును కారేహ కుమారుడైన యోహానానును హోషేయా కుమారుడైన యెజన్యాయును, అల్పులేమి ఘనులేమి ప్రజలందరును ప్రవక్తయైన యిర్మీయా యొద్దకు వచ్చి అతనితో ఈలాగు మనవి చేసిరి
ఈ అధ్యాయం మొత్తం, తరువాతి అధ్యాయంలో మొదటి మూడు వచనాలు, దేవుని సంకల్పం తెలుసుకునేందుకు ప్రార్థించడంలో మనుషులు చేసుకునే ఆత్మవంచన గురించి తెలియజేస్తున్నాయి. ప్రజలందరూ, వారి నాయకులతో సహా ఈ విచారకరమైన సంగతిలో భాగస్వాములే. వారు తమకు దైవ సంకల్పమే కావాలి అనుకొన్నారు (వ 2). అదేమిటో తెలుసుకునేందుకు ప్రార్థన చేయించారు (వ 3). దానికి లోబడేందుకు తాము సిద్ధంగా ఉన్నామని రూఢిగా నమ్ముతున్నట్టున్నారు (వ 6). అయితే దేవుడు తన సంకల్పాన్ని వెల్లడించినప్పుడు ఆయన చెప్పినట్టు చేయక ఆయన మాటలను తిరస్కరించారు.
2. మేము ఎంత కొంచెము మంది మిగిలియున్నామో నీవు చూచుచున్నావు గదా? చిత్తగించి మా విన్నపమును నీ సన్నిధికి రానిచ్చి, శేషించియున్న మా యందరి నిమిత్తము నీ దేవుడైన యెహోవాకు ప్రార్థనచేయుము.
3. మేము నడవవలసిన మార్గమును చేయవలసిన కార్యమును నీ దేవుడగు యెహోవా మాకు తెలియజేయునుగాక.
4. కాగా ప్రవక్తయైన యిర్మీయా వారికుత్తరమిచ్చినదేమనగా మీరు చేసిన మనవి నేనంగీకరించుచున్నాను, మీ మాటలనుబట్టి మన దేవుడైన యెహోవాను నేను ప్రార్థించుదును, ఏమియు మీకు మరుగుచేయక యెహోవా మిమ్మునుగూర్చి సెలవిచ్చునదంతయు మీకు తెలియజేతును.
“చెప్పినది”– యిర్మియా 1:17; కీర్తనల గ్రంథము 40:10; అపో. కార్యములు 20:20, అపో. కార్యములు 20:27. దేవుని నిజమైన సేవకుడు చేయవలసినది ఇదే. భయంవల్ల గాని, తన పేరుప్రతిష్ఠలకు భంగం కలుగుతుందని గాని ఇతరులనుండి సత్యాన్ని దాచిపెడితే తద్వారా వారికీ, తనకూ కూడా హాని చేస్తున్నవాడౌతాడు.
5. అప్పుడు వారు యిర్మీయాతో ఇట్లనిరి నిన్ను మా యొద్దకు పంపి, నీ దేవుడగు యెహోవా సెలవిచ్చిన ఆ మాటలనుబట్టి మరుమాట లేకుండ మేము జరిగించని యెడల యెహోవా మామీద నమ్మకమైన సత్యసాక్షిగా ఉండును గాక.
ఈ మాటల్లో వినయం, విధేయత ఉట్టిపడు తున్నట్టుంది. అయితే వీటిని నిర్గమకాండము 19:8; నిర్గమకాండము 24:3, నిర్గమకాండము 24:7 తో పోల్చి చూసుకుందాం. యిర్మియా 17:9 గుర్తు చేసుకుని ఈ అధ్యాయంలోని పాఠాన్ని మనకు అన్వయించుకొందాం.
6. మాకు మేలు కలుగునట్లు మేము మన దేవుడైన యెహోవా మాట వినువారమై, అది మేలేగాని కీడేగాని మేము ఆయనయొద్దకు నిన్ను పంపువిషయములో మన దేవుడైన యెహోవా సెలవిచ్చు మాటకు విధేయుల మగుదుము.
7. పది దినములైన తరువాత యెహోవా వాక్కు యిర్మీయాకు ప్రత్యక్షమాయెను గనుక
దేవుని సందేశం తనకు అందేవరకు యిర్మీయా ఏమీ మాట్లాడలేదు. దేవుని వాక్కు రావడానికి 10 రోజులు పట్టింది. కొన్ని ప్రార్థనలకు దేవుడు జవాబివ్వడానికి కొన్ని ఏళ్ళు గడిచిపోవచ్చు.
8. అతడు కారేహ కుమారుడైన యోహానానును అతనితో కూడనున్న సేనల యదిఫతులనందరిని, అల్పులనేమి ఘనులనేమి ప్రజలనందరిని పిలిపించి వారితో ఇట్లనెను
ఇంతకంటే స్పష్టమైన, గంబీరమైన సందేశం మరేదీ ఉండదు.
9. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సన్నిధిని మనవి చేయుటకై మీరు నన్ను పంపితిరి గదా? ఆయన సెలవిచ్చునదేమనగా
10. నేను మీకు చేసిన కీడునుగూర్చి సంతాపమొందియున్నాను, మీరు తొందరపడక యీ దేశములో కాపురమున్న యెడల, పడగొట్టక నేను మిమ్మును స్థాపింతును, పెల్లగింపక నాటెదను.
“నొచ్చుకుంటూ”– యిర్మియా 4:19-26 నోట్ చూడండి.
11. మీరు బబులోనురాజునకు భయపడుచున్నారే; అతనికి భయపడకుడి, అతని చేతిలోనుండి మిమ్మును తప్పించి మిమ్మును రక్షించుటకు నేను మీకు తోడైయున్నాను, అతనికి భయపడకుడి,
12. మరియు అతడు మీయెడల జాలిపడి మీ స్వదేశమునకు మిమ్మును పంపునట్లు మీయెడల నేనతనికి జాలి పుట్టించెదను.
1 రాజులు 8:50. దేవునికి మనపై జాలి ఉన్నప్పుడు, మనుషులు మనపై జాలి చూపేలా ఆయన చెయ్యగలడు, చేస్తాడు. ఆ విధంగా మనుషులు మనపై చూపే జాలి, మనం దేవుని జాలిని గుర్తించేలా చేయాలి.
13. అయితే మీరు మీ దేవుడైన యెహోవా మాట విననివారై యీ దేశమందు కాపురముండక మనము ఐగుప్తు దేశమునకు వెళ్లుదము,
14. అక్కడ యుద్ధము చూడకయు బూరధ్వని వినకయు ఆహారపు లేమిచేత ఆకలిగొనకయు నుందుము గనుక అక్కడనే కాపురముందమని మీరనుకొనిన యెడల
15. యూదావారిలో శేషించిన వారలారా, యెహోవా మాట ఆలకించుడి; ఇశ్రాయేలు దేవుడును సైన్యములకధిపతియునగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు ఐగుప్తునకు వెళ్లవలెనని నిశ్చయించుకొని అక్కడనే కాపురముండుటకు మీరు వెళ్లినయెడల
16. మీరు భయపడుచున్న ఖడ్గము అక్కడను ఐగుప్తు దేశముననే మిమ్మును తరిమి పట్టుకొనును; మీకు భయము కలుగజేయు క్షామము ఐగుప్తులోనే మిమ్మును తరిమి కలిసికొనును, అక్కడనే మీరు చత్తురు,
17. నేను వారిమీదికి రప్పించు కీడునుండి వారిలో శేషించువాడైనను తప్పించుకొనువాడైనను ఉండడు, ఐగుప్తులో నివసింపవలెనని అక్కడికి వెళ్ల నిశ్చయించుకొను మనుష్యులందరు ఖడ్గముచేతను క్షామముచేతను తెగులు చేతను నిశ్శేషముగా చత్తురు.
18. ఇశ్రాయేలు దేవుడగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు నా కోపమును నా ఉగ్రతయు యెరూషలేము నివాసుల మీదికి వచ్చినట్లు, మీరు ఐగుప్తునకు వెళ్లినయెడల నా ఉగ్రత మీమీదికిని వచ్చును, మీరు శాపాస్పదముగాను భీతి పుట్టించువారుగాను దూషణాస్పదముగాను తిరస్కరింప బడువారుగాను ఉందురు, ఈ స్థలమును మరి యెప్పుడును చూడరు.
19. యూదా శేషులారా, ఐగుప్తునకు వెళ్లకూడదని యెహోవా మీకాజ్ఞనిచ్చినట్టు నేడు నేను మీకు సాక్ష్యమిచ్చితినని మీరే నిశ్చయముగా తెలిసికొనుచున్నారు.
ప్రజలకు యిర్మీయా తన ప్రేమ పూర్వకమైన వ్యక్తిగత హెచ్చరికను ఇస్తున్నాడు. అతడు వారి హృదయ స్థితిని గ్రహించగలిగేలా దేవుడు చేశాడు (వ 20). దేవుడు యిర్మీయాకు తన సంకల్పాన్ని వెల్లడించేందుకు వారు ఎదురు చూస్తున్నంత కాలం తమ ఇష్టప్రకారమే చేద్దామని నిర్ణయించుకున్నారు. బహుశా తమ గురించిన ఈ విషయం వారికి తెలియదు. మనుషులు ఎలాంటివారో బైబిల్లోని అనేక ఉదాహరణలున్నాయి. వాటిలో ఇది ఒకటి.
20. మన దేవుడైన యెహోవాకు మా నిమిత్తము ప్రార్థనచేసి మన దేవుడైన యెహోవా చెప్పునదంతయు మాకు తెలియ జెప్పినయెడల మేమాలాగు చేయుదుమని చెప్పుచు మిమ్మును మీరే మోసపుచ్చుకొనుచున్నారు.
21. నేడు నేను మీకు దాని తెలియజెప్పుచున్నాను గాని మీ దేవుడైన యెహోవా మీయొద్దకు నాచేత పంపిన వర్తమానమును మీరు ఆలకింపకపోతిరి.
22. కాబట్టి కాపురముండవలెనని మీరు కోరు స్థలములోనే మీరు ఖడ్గముచేతను క్షామము చేతను తెగులుచేతను చత్తురని నిశ్చయముగా తెలిసికొనుడి.