Jeremiah - యిర్మియా 9 | View All
Study Bible (Beta)

1. నా జనులలో హతమైన వారినిగూర్చి నేను దివారాత్రము కన్నీరు విడుచునట్లు నా తల జలమయము గాను నా కన్ను కన్నీళ్ల ఊటగాను ఉండును గాక.

వ 10; యిర్మియా 8:21; యిర్మియా 13:17; యిర్మియా 14:17; కీర్తనల గ్రంథము 119:136. యిర్మీయాను విలపించే ప్రవక్త అన్నారంటే అందుకు తగిన కారణం లేకపోలేదు.

2. నా జనులందరు వ్యభిచారులును ద్రోహుల సమూహమునై యున్నారు. అహహా, అరణ్యములో బాటసారుల బస నాకు దొరికిన ఎంత మేలు? నేను నా జనులను విడిచి వారియొద్దనుండి తొలగిపోవుదును.

అతడు వారికోసం ఏడ్చాడు గాని వారి ప్రవర్తన ఎంతగా భ్రష్టమైపోయిందంటే అతడికి వారిదగ్గర ఉండడం దుర్భరమైపోయింది.

3. విండ్లను త్రొక్కి వంచునట్లు అబద్ధమాడుటకై వారు తమ నాలుకను వంచుదురు; దేశములో తమకున్న బలమును నమ్మకముగా ఉపయోగపరచరు. నన్ను ఎరుగక కీడువెంట కీడు చేయుచు ప్రవర్తించుచున్నారు; ఇదే యెహోవా వాక్కు.

“విల్లు”– వ 8; కీర్తనల గ్రంథము 7:13; కీర్తనల గ్రంథము 58:7; కీర్తనల గ్రంథము 64:3. “ఎరగరు”– వ 6; న్యాయాధిపతులు 2:10; 1 సమూయేలు 2:12; యెషయా 1:3; హోషేయ 4:1.

4. మీలో ప్రతివాడును తన పొరుగు వాని విషయమై జాగ్రత్తగా నుండవలెను; ఏ సహోదరునినైనను నమ్మకుడి, నిజముగా ప్రతి సహోదరుడును తంత్రగొట్టయి తన సహోదరుని కొంపముంచును; ప్రతి పొరుగువాడును కొండెములు చెప్పుటకై తిరుగులాడుచున్నాడు.

కీర్తనల గ్రంథము 12:2; మీకా 7:5-6; మత్తయి 10:35-36. అందరూ అబద్ధాలు చెప్తూ ఉంటే, దగా సర్వత్రా వ్యాపిస్తే, నమ్మకం స్థానంలో అనుమానం చోటు చేసుకుంటుంది. స్నేహితులమధ్య, బంధువులమధ్య బంధాలు తెగిపోయే స్థితికి వస్తాయి. అందరు దేవుని కోపానికి గురి అవుతారు. సత్యవంతుడైన మనిషికి బాధ కలుగుతుంది.

5. సత్యము పలుకక ప్రతివాడును తన పొరుగువానిని వంచించును, అబద్ధములాడుట తమ నాలుకలకు అభ్యాసముచేసియున్నారు, ఎదుటివాని తప్పులు పట్టవలెనని ప్రయాసపడుదురు.

6. నీ నివాసస్థలము కాపట్యము మధ్యనే యున్నది, వారు కపటులై నన్ను తెలిసికొననొల్లకున్నారు; ఇదే యెహోవా వాక్కు.

7. కావున సైన్యములకధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు ఆలకింపుము, వారిని చొక్కము చేయునట్లుగా నేను వారిని కరగించుచున్నాను, నా జనులనుబట్టి నేను మరేమి చేయుదును?

యిర్మియా 6:27-30. శిక్షను, బాధను, నాశనాన్ని కలిగించే బబులోను సైన్యాన్ని రప్పించడం మూలంగా దేవుడు ఈ మాటను జరిగించాడు.

8. వారి నాలుక ఘాతుక బాణము, అది కాపట్యము పలుకుచున్నది; ఒకడు మనస్సులో వంచనాభిప్రాయముంచుకొని, నోట తన పొరుగువానితో సమాధానముగా మాటలాడును.

వ 3; యిర్మియా 5:26; కీర్తనల గ్రంథము 55:21; సామెతలు 29:5.

9. నేను ఈ సంగతులను తెలిసికొని వారిని శిక్షింపకపోదునా? ఇట్టి జనులకు నేను ప్రతిదండన చేయకుందునా? ఇదే యెహోవా వాక్కు.

యిర్మియా 5:9, యిర్మియా 5:29.

10. పర్వతముల విషయమై రోదనమును అంగలార్పును చేయుదును; అరణ్యములోని మేతస్థలములనుబట్టి విలాపము చేయుదును; అవి పాడాయెను. సంచారము చేయువాడెవడును లేడు, పశువుల అరుపులు వినబడవు, ఆకాశ పక్షులును జంతువులును పారిపోయియున్నవి, అవి తొలగిపోయియున్నవి.

వ 1; యిర్మియా 4:23-26. రానున్న వినాశ కాలం వచ్చేసినట్టే మాట్లాడుతున్నాడు యిర్మీయా.

11. యెరూషలేమును పాడు దిబ్బలుగాను నక్కలకు చోటుగాను నేను చేయున్నాను, యూదా పట్టణములను నివాసిలేని పాడు స్థలముగా చేయుచున్నాను.
ప్రకటన గ్రంథం 18:2

యిర్మియా 10:22; యిర్మియా 26:18; కీర్తనల గ్రంథము 44:19; విలాపవాక్యములు 5:18.

12. ఈ సంగతిని గ్రహింపగల జ్ఞానియెవడు? దానిని వాడు తెలియజేయునట్లు యెహోవా నోటి మాట ఎవనికి వచ్చెను? ఎవడును సంచరింపకుండ ఆ దేశము ఎడారివలె ఏల కాలిపోయి పాడాయెను?

మళ్ళీ యెహోవా మాట్లాడుతున్నాడు. దేవుడు తన స్వజనాన్ని, తన స్వంత దేశాన్ని ఎందుకు నాశనం చెయ్యాలి? దీన్ని అర్థం చేసుకోగలిగేదెవరు?

13. అందుకు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు వారు నా మాట వినకయు దానిననుసరింపకయు, నేను వారికి నియమించిన నా ధర్మశాస్త్రమును విసర్జించి

12వ వచనంలోని ప్రశ్నకు జవాబు స్పష్టమే. ప్రజల పాపాల కారణంగా దేవుడు వారిని శిక్షించాడు. వారిని తప్పించుకుపోనివ్వడం న్యాయాన్ని తారుమారు చేసినట్టే ఉంటుంది.

14. తమ హృదయమూర్ఖత చొప్పున జరిగించుటకై తమ పితరులు తమకు నేర్పినట్లు బయలు దేవతలను అనుసరించుచున్నారు గనుకనే వారి దేశము పాడైపోయెను.

“బయల్”– న్యాయాధిపతులు 2:11 నోట్.

15. సైన్యములకధిపతియు ఇశ్రాయేలు దేవుడునగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు నేను ఈ ప్రజలకు చేదుకూరలు తినిపింతును, విషజలము త్రాగింతును.
ప్రకటన గ్రంథం 8:11

16. తామైనను తమ పితరులైనను ఎరుగని జనములలోనికి వారిని చెదరగొట్టుదును, వారిని నిర్మూలముచేయువరకు వారి వెంబడి ఖడ్గమును పంపుదును.

యిర్మియా 13:24; యిర్మియా 18:17; యిర్మియా 30:11; యిర్మియా 46:28; లేవీయకాండము 26:27, లేవీయకాండము 26:33; ద్వితీయోపదేశకాండము 28:64.

17. సైన్యములకధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు ఆలోచింపుడి, రోదనము చేయు స్త్రీలను కనుగొనుడి వారిని పిలువనంపుడి, తెలివిగల స్త్రీలను కనుగొనుడి వారిని పిలువనంపుడి.

ఆ రోజుల్లో ఎవరన్నా చనిపోతే అంత్యక్రియల్లాంటి దుఃఖకరమైన సమయాల్లో ఏడ్చేందుకు డబ్బు ఇచ్చి మనుషులను నియమించే సౌకర్యం ఉండేది. రాబోయే కాలంలో అలా విలపించేందుకు బోలెడన్ని కారణాలు ఉంటాయని దేవుడు చెప్తున్నాడు. బైబిల్లో దేవుడు చాలా చోట్ల ప్రజలు విలపించాలని చెప్పినట్టు చూడగలం – యిర్మియా 4:8; యిర్మియా 25:34; యిర్మియా 48:20; యిర్మియా 49:3; యెషయా 14:31; యెషయా 16:7; యెషయా 23:1, యెషయా 23:6, యెషయా 23:14; జెఫన్యా 1:11; జెకర్యా 11:2; యాకోబు 4:9; యాకోబు 5:1. మరి కొందరిని సంతోషించమని చెప్పాడు – కీర్తనల గ్రంథము 33:1; కీర్తనల గ్రంథము 97:12; జెకర్యా 2:10; జెకర్యా 9:9; మత్తయి 5:12; లూకా 6:23; ఫిలిప్పీయులకు 4:4; 1 థెస్సలొనీకయులకు 5:16; యాకోబు 1:9; 1 పేతురు 4:13; ప్రకటన గ్రంథం 12:12; ప్రకటన గ్రంథం 18:20. ఎవరు విలపించవలసిందీ, ఎవరు ఆనందించవలసిందీ మనం గమనించాలి. విలపించేందుకు కారణాలూ, ఆనందించేందుకు కారణాలూ తెలుసుకోవాలి.

18. మన కన్నులు కన్నీళ్లు విడుచునట్లుగాను మన కనురెప్పలనుండి నీళ్లు ఒలుకునట్లుగాను వారు త్వరపడి మనకు రోదనధ్వని చేయవలెను.

19. మనము వలసబోతిమే సిగ్గునొందితిమే, వారు మన నివాసములను పడగొట్టగా మనము దేశము విడువవలసివచ్చెనే అని సీయోనులో రోదనధ్వని వినబడు చున్నది.

20. స్త్రీలారా, యెహోవా మాట వినుడి మీరు చెవియొగ్గి ఆయన నోటిమాట ఆలకించుడి, మీ కుమార్తెలకు రోదనము చేయనేర్పుడి, ఒకరికొకరు అంగలార్పు విద్య నేర్పుడి.

విలపించేందుకు ఆ కాలంలో ఉన్న కారణం ఎంత బలమైనదంటే అందరూ తమ శక్తికొద్దీ ఏడవడం నేర్చుకోవాలి. మరణం శత్రు సైనికునిలా వారి ఇళ్ళకూ, భవనాలకూ ఉన్న కిటికీల్లోగుండా వస్తుంది. వారి వీధులన్నిటిలో తిరుగుతుంది. అంగలార్చేందుకు చాలా అవకాశం ఉంటుంది గాని చనిపోయినవారిని పాతిపెట్టేందుకు సమయం ఉండదని యిర్మీయా చెప్తున్నాడు.

21. వీధులలో పసిపిల్లలు లేకుండను, రాజ మార్గములలో ¸యౌవనులు లేకుండను, వారిని నాశనము చేయుటకై మరణము మన కిటికీలను ఎక్కుచున్నది, మన నగరులలో ప్రవేశించుచున్నది.

22. యెహోవా వాక్కు ఇదే నీవీమాట చెప్పుము చేలమీద పెంటపడునట్లు పంటకోయు వాని వెనుక పిడికిళ్లు పడునట్లు ఎవడును సమకూర్చకుండ మనుష్యుల శవములు పడును, వాటిని కూర్చువాడెవడును లేకపోవును.

23. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు జ్ఞాని తన జ్ఞానమునుబట్టియు శూరుడు తన శౌర్యమునుబట్టియు అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమునుబట్టి అతిశయింపకూడదు.

సాధారణంగా మనుషులు గొప్పలు చెప్పుకునేది దేన్ని గురించి? కొందరు తమ తెలివితేటల గురించీ, మరి కొందరు తమ కులం, రంగు, మతం, నైపుణ్యం, అందం, లేక బలం గురించీ మాట్లాడుతారు. దేవుని ప్రజలు దేనిగురించి గొప్పలు చెప్పాలి? పై విషయంలో దేని గురించి గానీ తమకు సంబంధించిన ఏ విషయం గురించి గానీ వారు అతిశయించకూడదు గాని దేవుని గురించిన జ్ఞానం విషయంలోనే అతిశయించాలి. ప్రతి వ్యక్తి జీవితంలో ఉండగల విషయాలన్నిటిలో ఈ జ్ఞానం ముఖ్యమైనది. గొప్పగా చెప్పుకునేందుకు కారణాలు – కీర్తనల గ్రంథము 34:2; కీర్తనల గ్రంథము 44:8; రోమీయులకు 5:3; రోమీయులకు 15:17; 2 కోరింథీయులకు 10:17; 2 కోరింథీయులకు 12:9; గలతియులకు 6:14. 24 వచనంలో దేవుడు తన గురించి చెప్పుకుంటూ దేనికి ప్రాధాన్యత ఇచ్చాడో చూడండి – కీర్తనల గ్రంథము 11:7; కీర్తనల గ్రంథము 33:5; కీర్తనల గ్రంథము 89:14; కీర్తనల గ్రంథము 99:4; కీర్తనల గ్రంథము 103:6, కీర్తనల గ్రంథము 103:8; కీర్తనల గ్రంథము 106:1; కీర్తనల గ్రంథము 145:9.

24. అతిశయించువాడు దేనినిబట్టి అతిశయింపవలెననగా, భూమిమీద కృపచూపుచు నీతి న్యాయములు జరిగించుచునున్న యెహోవాను నేనేయని గ్రహించి నన్ను పరిశీలనగా తెలిసికొనుటనుబట్టియే అతి శయింపవలెను; అట్టి వాటిలో నేనానందించువాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు.
1 కోరింథీయులకు 1:31, 2 కోరింథీయులకు 10:17

25. అన్యజనులందరును సున్నతిపొందనివారు గనుక, ఇశ్రాయేలీయులందరు హృదయ సంబంధమైన సున్నతినొందినవారు కారు గనుక, రాబోవుదినములలో సున్నతిపొందియు సున్నతిలేని వారి వలెనుండు
రోమీయులకు 2:25

పాపానికి విరుద్ధంగా తన కోపంలో, పాపులపై తాను ఇచ్చే తీర్పులో దేవుడు ఎలాంటి పక్షపాతం చూపడు. వారి మతం, వారి ఆచారాలు కర్మకాండలు వారికి సహాయపడవు. నిజమైన మతం హృదయ సంబంధమైనది – యిర్మియా 4:4; యోహాను 4:24; రోమీయులకు 2:12, రోమీయులకు 2:25-29.

26. ఐగుప్తీయులను యూదావారిని ఎదోమీయులను అమ్మోనీయులను మోయాబీయులను గడ్డపు ప్రక్కలను కత్తిరించుకొను అరణ్య నివాసులైన వారినందరిని నేను శిక్షించెదను, ఇదే యెహోవా వాక్కు.
అపో. కార్యములు 7:51



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Jeremiah - యిర్మియా 9 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

ప్రజలు సరిదిద్దబడ్డారు, జెరూసలేం నాశనం చేయబడింది. (1-11) 
యిర్మీయా చాలా కన్నీళ్లు కార్చాడు, అయినప్పటికీ తన ఏడుపు దేవుని ఉనికిని గుర్తించడానికి ప్రజలను మేల్కొల్పాలని ఆశతో అతను ఇంకా ఎక్కువ చిందించాలని కోరుకున్నాడు. ఏదేమైనప్పటికీ, క్రీస్తు యేసు ద్వారా దేవునితో సహవాసం మరియు పరిశుద్ధాత్మ యొక్క మార్గదర్శకత్వం లేని నిర్జనమైన అరణ్యం కూడా శోధన మరియు దుష్టత్వానికి సంతానోత్పత్తి ప్రదేశంగా మారుతుంది. మరోవైపు, ఈ దైవిక ఆశీర్వాదాలతో, సందడిగా ఉండే నగరాల్లో కూడా మనం స్వచ్ఛత మరియు ధర్మబద్ధమైన జీవితాన్ని గడపవచ్చు.
తమ్ముడిని కూడా నమ్మలేనంతగా అబద్ధాలు మాట్లాడడం జనం అలవాటు పడ్డారు. వారి వ్యాపారాలు మరియు చర్చలలో, వారు ప్రయోజనం పొందడానికి ఏదైనా మాట్లాడతారు, తెలిసి అబద్ధాలు చెబుతారు. కానీ దేవుడు వారి పాపపు ప్రవర్తనను గమనించాడు. దేవుని గురించిన జ్ఞానం లేని ప్రదేశంలో, మంచితనం వర్ధిల్లుతుందని ఎలా ఆశించవచ్చు? దాని నివాసుల దుష్టత్వం ఫలితంగా సారవంతమైన భూమిని బంజరు భూమిగా మార్చడానికి దేవుడు వివిధ మార్గాలను కలిగి ఉన్నాడు.

బందీలు విదేశీ దేశంలో బాధలు పడుతున్నారు. (12-22) 
సీయోనులో, ప్రజలు దేవునితో సన్నిహిత సంబంధాన్ని కొనసాగించినప్పుడు ఒకప్పుడు ఆనందం మరియు ప్రశంసల యొక్క శక్తివంతమైన శబ్దాలు గాలిని నింపేవి. అయితే, పాపం ఆ రాగాన్ని విలాపంగా మార్చేసింది. పశ్చాత్తాపపడని హృదయాలు తమ దురదృష్టాల గురించి దుఃఖిస్తాయి కానీ తమ బాధలకు మూలకారణమైన తమ పాపాల గురించి విలపించడంలో విఫలమవుతాయి.
తలుపులు ఎంత భద్రంగా మూసివేసినా, మృత్యువు లోపలికి ప్రవేశిస్తుంది. అది వారి బలం మరియు కోటలు ఉన్నప్పటికీ, రాకుమారుల గొప్ప రాజభవనాలలోకి కూడా చొచ్చుకుపోతుంది. బయట వారికి కూడా మినహాయింపు లేదు; మృత్యువు వీధుల్లో పిల్లలు మరియు యువకుల ప్రాణాలను బలిగొంటుంది. ప్రభువు మాట వినండి మరియు ధర్మబద్ధమైన దుఃఖంతో బాధపడండి. దీని ద్వారా మాత్రమే నిజమైన సాంత్వన లభిస్తుంది మరియు తీవ్రమైన బాధలను కూడా విలువైన పాఠాలుగా మరియు ఆశీర్వాదాలుగా మార్చవచ్చు.

దేవుని ప్రేమపూర్వక దయ, ఆయన తన ప్రజల శత్రువులను బెదిరిస్తాడు. (23-26)
పాపం మరియు బాధలతో గుర్తించబడిన ఈ ప్రపంచంలో, చివరికి మరణం మరియు తీర్పుతో ముగుస్తుంది, ప్రజలు తమ జ్ఞానం, ఆరోగ్యం, బలం, సంపద లేదా పాపం యొక్క పట్టులో ఉంచే మరియు బహిర్గతం చేసే ఏదైనా గురించి గొప్పగా చెప్పుకోవడం నిజంగా తెలివితక్కువ పని. దేవుని కోపానికి. ఈ విషయాలన్నీ భవిష్యత్తులో వారికి ఖాతా ఇవ్వవలసి వచ్చినప్పుడు మాత్రమే వారి దుఃఖాన్ని పెంచుతాయి.
నిజమైన "ఇశ్రాయేలీయులు" అంటే దేవుణ్ణి ఆత్మతో ఆరాధించే వారు, క్రీస్తుయేసులో తమ ఆనందాన్ని కనుగొని, ప్రాపంచిక విషయాలపై నమ్మకం ఉంచేవారు. దేవుని నుండి వచ్చే భేదాన్ని, శాశ్వతంగా ఉండే భేదాన్ని మనం విలువైనదిగా పరిగణిద్దాం. మనం దానిని తీవ్రంగా కొనసాగిద్దాం.



Shortcut Links
యిర్మియా - Jeremiah : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |