Ezekiel - యెహెఙ్కేలు 12 | View All
Study Bible (Beta)

1. మరియయెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను

1. The word of ADONAI came to me:

2. నరపుత్రుడా, తిరుగుబాటు చేయువారిమధ్య నీవు నివసించుచున్నావు; వారు ద్రోహులై యుండి, చూచుకన్నులు కలిగియు చూడకయున్నారు; విను చెవులు కలిగియు వినకయున్నారు.
మార్కు 8:18, రోమీయులకు 11:8

2. 'Human being, you are living among a rebellious people. They have eyes that can see, but they don't take notice; and they have ears that can hear, but they don't pay attention; because they are a rebellious people.

3. నరపుత్రుడా, దేశాంతరము పోవువానికి తగిన సామగ్రిని మూటకట్టుకొని, పగటివేళ వారు చూచుచుండగా నీవు ప్రయాణమై, నీవున్న స్థలమును విడిచి వారు చూచుచుండగా మరియొక స్థలమునకు పొమ్ము; వారు తిరుగు బాటు చేయువారు, అయినను దీని చూచి విచారించు కొందురేమో

3. So you, human being, prepare supplies for exile; and during the daytime, as they watch, go away as if you were going into exile- leave your place, and go somewhere else as they watch. Perhaps they will take notice, even though they are a rebellious house.

4. దేశాంతరము పోవువాడు తన సామగ్రిని తీసికొనునట్లు వారు చూచుచుండగా నీ సామగ్రిని పగటియందు బయటికి తీసికొనివచ్చి వారు చూచుచుండగా అస్తమానమున ప్రయాణమై పరదేశమునకు పోవువాని వలె నీవు బయలుదేరవలెను

4. Bring out your belongings during the day while they watch, as supplies for exile; and you yourself, while they watch, are to leave as people do who are going into exile.

5. వారు చూచుచుండగా గోడకు కన్నమువేసి నీ సామగ్రిని తీసికొని దాని ద్వారా బయలుదేరుము

5. Dig a hole through the wall while they watch, and carry [[your belongings]] out through it.

6. వారు చూచుచుండగా రాత్రియందు మూట భుజముమీద పెట్టుకొని నేల కనబడకుండ నీ ముఖము కప్పుకొని దానిని కొనిపొమ్ము, నేను ఇశ్రాయేలీయులకు నిన్ను సూచనగా నిర్ణయించితిని.

6. While they watch, you are to shoulder your pack and carry it out into the dark, with your face covered, so that you can't see the ground; for I am making you a sign for the house of Isra'el.'

7. ఆయన నా కాజ్ఞాపించినట్లు నేను చేసితిని, ఎట్లనగా నేను దేశాంతరము పోవువాడనైనట్టుగా పగటియందు నా సామగ్రిని బయటికి తెచ్చి అస్తమయమున నా చేతితో గోడకు కన్నము వేసి వారు చూచుచుండగా సామగ్రిని తీసికొని మూట భుజముమీద పెట్టుకొంటిని

7. So I did as I had been ordered- I brought out my belongings during the day as supplies for exile, and in the evening I dug a hole through the wall with my hand; then I carried my pack out on my shoulder in the dark as they watched.

8. ఉదయమున యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను

8. In the morning the word of ADONAI came to me:

9. నరపుత్రుడా, నీవు చేయునదేమని తిరుగుబాటుచేయు ఇశ్రాయేలీయులు నిన్ను అడుగుదురు గనుక నీవు వారితో ఇట్లనుము

9. 'Human being, the house of Isra'el, that rebellious house, has asked you what you are doing.

10. ప్రభువగు యెహోవా సెలవిచ్చునదేమనగా ఈ దేవోక్తి భావము యెరూషలేములోనున్న ప్రధానికిని దానిలోనున్న ఇశ్రాయేలీయులకందరికిని చెందును

10. Tell them that [Adonai ELOHIM] says this prophecy concerns the prince in Yerushalayim and all the house of Isra'el there.

11. కాబట్టి వారికీమాట చెప్పుము నేను మీకు సూచనగా ఉన్నాను, నేను సూచించినది వారికి కలుగును, వారు చెరలోనికి పోయి దేశాంతర నివాసులగుదురు

11. Say: 'I am a sign for you. As I have done, so will it be done to them- they will go into exile, into captivity.

12. మరియు వారిలో ప్రధానుడగువాడు రాత్రియందు సామగ్రిని భుజముమీద పెట్టుకొని తానే మోసికొని పోవుటకై తన సామగ్రిని బయటికి తెచ్చు కొనవలెనని గోడకు కన్నమువేసి నేల చూడకుండ ముఖము కప్పుకొనిపోవును

12. The prince who is with them will shoulder his pack and leave in the dark. They will dig holes through the wall to carry out their supplies. He will cover his face, so that he won't be able to see the ground with his eyes.

13. అతని పట్టుకొనుటకై నేను నా వలయొగ్గి వాని చిక్కించుకొని కల్దీయుల దేశమైన బబులోనునకు వాని తెప్పించెదను, అయితే ఆ స్థలమును చూడకయే అతడు అక్కడ చచ్చును

13. I will spread my net over him, and he will be caught in my snare. Then I will bring him to Bavel, to the land of the Kasdim. But he will not see it, even though he is going to die there.

14. మరియు వారికి సహాయులై వచ్చినవారినందరిని అతని దండు వారినందరిని నేను నలుదిక్కుల చెదరగొట్టి కత్తిదూసి వారిని తరిమెదను

14. I will scatter to every wind all who are in attendance on him to help him, along with all his troops; and I will pursue them with the sword.

15. నేను వారిని అన్యజనులలో చెదరగొట్టి ఆ యా దేశములలో వారిని వెళ్లగొట్టిన తరువాత నేనే యెహోవానైయున్నానని వారు తెలిసికొందురు

15. They will know that I am ADONAI when I scatter them among the nations and disperse them among the countries.

16. అయితే నేను యెహోవానై యున్నానని అన్యజనులు తెలిసికొనునట్లు తాము చేరిన అన్యజనులలో తమ హేయకృత్యములన్నిటిని వారు వివరించి తెలియజెప్పుటకై ఖడ్గముచేత కూలకుండను క్షామమునకు చావకుండను తెగులు తగులకుండను నేను వారిలో కొందరిని తప్పించెదను.

16. But I will spare a few of them from sword, famine and plague; so that they can tell about all their disgusting practices among the nations where they go; thus they too will know that I am ADONAI.''

17. మరియయెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను

17. The word of ADONAI came to me:

18. నరపుత్రుడా, వణకుచునే ఆహారము తిని తల్లడింపును చింతయు కలిగి నీళ్లుత్రాగి

18. Human being, shake as you eat your food; tremble anxiously as you drink your water;

19. దేశములోని జనులకీలాగు ప్రకటించుము యెరూషలేము నివాసులను గూర్చియు ఇశ్రాయేలు దేశమునుగూర్చియు ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా దానిలో నున్న కాపురస్థులందరును చేసిన బలాత్కారమునుబట్టి దానిలోని సమస్తమును పాడైపోవును గనుక చింతతో వారు ఆహారము తిందురు భయభ్రాంతితో నీళ్లు త్రాగుదురు

19. and say to the people of the land, 'Here is what [Adonai ELOHIM] says concerning those living in Yerushalayim in the land of Isra'el: 'They will eat their bread in anxiety and drink their water in horror; because the land will be desolated from everything that fills it, due to the violence of those living there.

20. నేనే యెహోవానై యున్నానని మీరు తెలిసికొనునట్లు కాపురపు పట్టణములు నిర్జనములుగా ఉండును, దేశమును పాడగును.

20. The inhabited cities will be laid waste, the land will be desolate, and you will know that I am ADONAI.'''

21. మరియయెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను

21. The word of ADONAI came to me:

22. నరపుత్రుడా దినములు జరిగి పోవుచున్నవి, ప్రతి దర్శనము నిరర్థకమగుచున్నది అని ఇశ్రాయేలీయుల దేశములో మీరు చెప్పుకొను సామెతయేమిటి?

22. Human being, don't you have this proverb in the land of Isra'el, 'Time keeps passing, and none of the visions are fulfilled'?

23. కావున నీవు వారికి ఈ మాట తెలియజేయుము ప్రభువగు యెహోవా సెలవిచ్చునదేమనగా ఇకమీదట ఇశ్రాయేలీయులలో ఎవరును ఈ సామెత పలుకకుండ నేను దానిని నిరర్థకము చేసెదను గనుక నీవు వారితో ఇట్లనుము దినములు వచ్చుచున్నవి, ప్రతిదర్శనము నెరవేరును

23. Therefore tell them that [Adonai ELOHIM] says, 'I will put an end to that proverb; never again will they use it as a proverb in Isra'el.' Tell them, 'The time has come for the fulfillment of every vision.

24. వ్యర్థమైన దర్శనమైనను ఇచ్చకములాడు సోదెగాండ్ర మాటలైనను ఇశ్రాయేలీయులలో ఇకను ఉండవు.

24. There will no longer be empty visions or falsely optimistic divinations in the house of Isra'el,

25. యెహోవానైన నేను మాటయిచ్చుచున్నాను, నేనిచ్చు మాట యికను ఆలస్యములేక జరుగును. తిరుగుబాటు చేయువారలారా, మీ దినములలో నేను మాటయిచ్చి దాని నెరవేర్చెదను, ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.

25. because I am ADONAI. I will speak; and whatever statement I make, it will be accomplished. It will no longer be delayed; for in your days, you rebellious house, I will speak the word and accomplish it,' says [Adonai ELOHIM].'

26. మరల యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను

26. Again, the word of ADONAI came to me:

27. నరపుత్రుడా వీనికి కనబడిన దర్శనము నెరవేరుటకు బహుదినములు జరుగవలెననియు బహు కాలము జరిగిన తరువాత కలుగు దానిని వీడు ప్రవచించుచున్నాడనియు ఇశ్రాయేలీయులు చెప్పుకొనుచున్నారు గదా

27. Human being, look! People from the house of Isra'el are saying, 'The vision he sees concerns the distant future; he is prophesying about a time far off.'

28. కాబట్టి నీవు వారితో ఇట్లనుము ఇకను ఆలస్యములేక నేను చెప్పిన మాటలన్నియు జరుగును, నేను చెప్పినమాట తప్పకుండ జరుగును, ఇదే యెహోవా వాక్కు.

28. Therefore, say to them that [Adonai ELOHIM] says, 'None of my words will be delayed any more, but the word that I speak will be accomplished,' says [Adonai ELOHIM].'



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Ezekiel - యెహెఙ్కేలు 12 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

సమీపించే బందిఖానా. (1-16) 
నిష్క్రమణ కోసం అతని సన్నాహాలు మరియు రాత్రిపూట అతని ఇంటి గోడ గుండా అతను నిర్విరామంగా తప్పించుకోవడం ద్వారా, ప్రత్యర్థి నుండి పారిపోతున్నట్లుగా, ప్రవక్త సిద్కియా యొక్క చర్యలు మరియు విధిని సూచిస్తుంది. దేవుడు మనలను విడిపించినప్పుడు, మన లోపాలను గుర్తించడం ద్వారా మనం కృతజ్ఞతలు తెలియజేయాలి మరియు ఇతరులను ప్రేరేపించడానికి మరియు బోధించడానికి ప్రయత్నించాలని ఇది రిమైండర్‌గా పనిచేస్తుంది.
పరీక్షలు మరియు కష్టాల ద్వారా, స్వీయ-అవగాహన యొక్క ఈ స్థాయికి చేరుకున్న వారు దేవుని సార్వభౌమత్వాన్ని గుర్తించేలా చేస్తారు. ఇతరులు ఆయనను కనుగొనడంలో సహాయపడటంలో కూడా వారు పాత్రను పోషించగలరు.

యూదుల దిగ్భ్రాంతి యొక్క చిహ్నం. (17-20) 
జెరూసలేం ముట్టడి సమయంలో ప్రజలు ఎదుర్కొన్న కష్టాలను సూచించడానికి ప్రవక్త ఆహారం మరియు పానీయాలను జాగ్రత్తగా మరియు భక్తి భావంతో తీసుకోవాలి. అదేవిధంగా, పాపం చేసేవారికి రాబోయే వినాశనాన్ని గురించి మంత్రులు చర్చించినప్పుడు, వారు ప్రభువు ఉగ్రత యొక్క విస్మయం కలిగించే స్వభావాన్ని అర్థం చేసుకున్న వ్యక్తులుగా చేయాలి. మన భౌతిక శరీరాలకు బాధాకరంగా ఉన్నప్పటికీ, బాధలు విలువైనవిగా పరిగణించబడతాయి ఎందుకంటే అవి దేవుని గురించి మన అవగాహనను మరింతగా పెంచుకోవడానికి సహాయపడతాయి.దేవుని సహనానికి ప్రతిస్పందనగా పశ్చాత్తాపం చెందడానికి బదులుగా, యూదులు తమ పాపపు మార్గాల్లో మరింత స్థిరపడ్డారు. సాధారణంగా చెప్పేదేదో సాకుతో ఇతరుల గురించి చెడుగా మాట్లాడడాన్ని సమర్థించకూడదు. భయానక శాశ్వతత్వం కేవలం ఒక అడుగు దూరంలోనే ఉందని మనం గుర్తుంచుకోవాలి, కాబట్టి మనము రాబోయే దాని కోసం సిద్ధం కావడం చాలా కీలకం. ప్రభువుతో సయోధ్యను కోరుకోవడం తప్ప మనలో ఎవరూ లెక్కింపు రోజును వాయిదా వేయలేరు.

అపహాస్యం చేసేవారి అభ్యంతరాలకు సమాధానాలు. (21-28)
దేవుని సహనానికి ప్రతిస్పందనగా పశ్చాత్తాపం చెందడానికి బదులుగా, యూదులు తమ పాపపు మార్గాల్లో మరింత స్థిరపడ్డారు. సాధారణంగా చెప్పేదేదో సాకుతో ఇతరుల గురించి చెడుగా మాట్లాడడాన్ని సమర్థించకూడదు. భయానక శాశ్వతత్వం కేవలం ఒక అడుగు దూరంలోనే ఉందని మనం గుర్తుంచుకోవాలి, కాబట్టి మనము రాబోయే దాని కోసం సిద్ధం కావడం చాలా కీలకం. ప్రభువుతో సయోధ్యను కోరుకోవడం తప్ప మనలో ఎవరూ లెక్కింపు రోజును వాయిదా వేయలేరు.



Shortcut Links
యెహెఙ్కేలు - Ezekiel : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |