Ezekiel - యెహెఙ్కేలు 18 | View All
Study Bible (Beta)

1. మరల యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను

యిర్మియా 31:29. ప్రవాసులు తమ పైకి వచ్చిన విపత్తులు తమ పాపాల కారణంగా కాదనీ, తమ తండ్రుల పాపాల వల్లేననీ భావించారు. ఎప్పుడూ తాము చేసిన పాపాలకు బాధ్యత మరొకరి మీదికి నెట్టెయ్యడం, లేదా పరిస్థితుల ప్రభావం అనో, కర్మ అనో సరిపెట్టెయ్యడమే మానవ స్వభావం. ఆదికాండము 3:12-13 పోల్చి చూడండి.

2. తండ్రులు ద్రాక్షకాయలు తినగా పిల్లల పళ్లు పులిసెనని మీరు చెప్పుచు వచ్చెదరే; ఇశ్రాయేలీయుల దేశమునుగూర్చి ఈ సామెత మీ రెందుకు పలికెదరు?

3. నా జీవముతోడు ఈ సామెత ఇశ్రాయేలీయులలో మీరిక పలుకరు; ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.

4. మనుష్యులందరు నా వశములో ఉన్నారు, తండ్రులేమి కుమారులేమి అందరును నా వశములో ఉన్నారు; పాపముచేయువాడెవడో వాడే మరణము నొందును.

దేవుని వాక్కులో కనిపించే ఒక గొప్ప నియమం ఇది. దేవుడు ప్రతి మనిషినీ వ్యక్తిగతంగా చూస్తాడు. అందరూ ఆయన సొత్తు. జీవన్మరణాలనే కీలకమైన విషయాలు న్యాయమైన ఆయన చేతుల్లోనే ఉన్నాయి. తమ తండ్రుల పాపాల మూలంగా పిల్లలు బాధలను అనుభవిస్తారన్నది నిజమే (నిర్గమకాండము 34:6, నిర్గమకాండము 34:8). ఏదో విధంగా కొంతవరకైనా పిల్లలు కూడా తండ్రుల అపరాధంలో భాగస్థులే (రోమీయులకు 5:12-18) అయితే వ్యక్తిగతంగా వారు హఠాత్తుగా నాశనమైపోవడం, లేదా తండ్రుల పాపాలవల్ల నరకానికి పోవడం అనే తీర్పుకు గురి కారు. మనుషులకు తీర్పు తీర్చడంలో దేవుడు ఒక వ్యక్తి ఏం చేశాడు లేక ఏం చెయ్యలేదు అన్న విషయాన్నే లెక్కలోకి తీసుకుంటాడు (వ 30).

5. ఒకడు నీతిపరుడై నీతిన్యాయములను అనుసరించువాడైయుండి

దేవుడు ప్రతి మనిషిపట్ల వ్యక్తిగతంగా వ్యవహరిస్తాడనీ మరొకడి అపరాధాలకు అతణ్ణి హఠాత్తుగా నాశనం చెయ్యడనీ తెలియజేసే ఉదాహరణలు.

6. పర్వతములమీద భోజనము చేయకయు, ఇశ్రాయేలీయులు పెట్టుకొనిన విగ్రహములతట్టు చూడకయు, తన పొరుగువాని భార్యను చెరపకయు, బహిష్టయైనదానిని కూడకయు,

ధర్మశాస్త్రం కింద దేవుడు తన కృప చొప్పున వ్యక్తుల న్యాయ క్రియలను అంగీకరించాడు. ఎందుకంటే అలాంటి క్రియలు దేవుని దృష్టిలో సరిగ్గా ఉండాలన్న వారి హృదయాభిలాషను వెల్లడించాయి. దేవుని పట్లా ఆయన వాక్కు పట్లా వారి సరైన ధోరణినీ ఆయనలో వారి నమ్మకాన్నీ తెలియజేశాయి. ఇక్కడ న్యాయసమ్మతమైన జీవితం ఒక వ్యక్తి చేసే పనుల్లోనూ, చెయ్యని పనుల్లోనూ వెల్లడవుతున్నది. “కొండల మీద”– ప్రజలు ధర్మశాస్త్ర విరుద్ధమైన బలులు అర్పించే ఎత్తయిన స్థలాలు.

7. ఎవనినైనను భాదపెట్టకయు, ఋణస్థునికి అతని తాకట్టును చెల్లించి బలాత్కారముచేత ఎవనికైనను నష్టము కలుగజేయకయునుండువాడై, ఆకలిగల వానికి ఆహారమిచ్చి దిగంబరికి బట్టయిచ్చి

నిర్గమకాండము 20:15; నిర్గమకాండము 22:21, నిర్గమకాండము 22:26; ద్వితీయోపదేశకాండము 15:7-11; ద్వితీయోపదేశకాండము 24:12-13. మత్తయి 25:31-46 పోల్చి చూడండి.

8. వడ్డికి అప్పియ్యకయు, లాభము చేపట్టకయు, అన్యాయము చేయకయు, నిష్పక్షపాతముగా న్యాయము తీర్చి

కీర్తనల గ్రంథము 15:5.

9. యథార్థపరుడై నా కట్టడలను గైకొనుచు నా విధులనను సరించుచుండినయెడల వాడే నిర్దోషియగును, నిజముగా వాడు బ్రదుకును; ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.

యెహెఙ్కేలు 20:11; లేవీయకాండము 18:5; లేవీయకాండము 19:37; ద్వితీయోపదేశకాండము 4:1.

10. అయితే ఆ నీతిపరునికి కుమారుడు పుట్టగా వాడు బలాత్కారము చేయువాడై ప్రాణహానికరుడై, చేయరాని క్రియలలో దేనినైనను చేసి

కొడుకు తన తండ్రి నీతిన్యాయాలను వారసత్వంగా పొందడు. అతడు పాపంలో జీవిస్తే ఆ దోషం వ్యక్తిగతంగా అతనిదే. దాన్ని బట్టి అతనే చనిపోతాడు.

11. చేయవలసిన మంచి క్రియలలో దేనినైనను చేయకయుండినయెడల, అనగా పర్వతములమీద భోజనము చేయుటయు, తన పొరుగువాని భార్యను చెరుపుటయు,

12. దీనులను దరిద్రులను భాదపెట్టి బలాత్కారముచేత నష్టము కలుగజేయుటయు, తాకట్టు చెల్లింపకపోవుటయు, విగ్రహముల తట్టు చూచి హేయకృత్యములు జరిగించుటయు,

13. అప్పిచ్చి వడ్డి పుచ్చుకొనుటయు, లాభము చేపట్టుటయు ఈ మొదలగు క్రియలు చేసినయెడల వాడు బ్రదుకునా? బ్రదుకడు, ఈ హేయక్రియలన్ని చేసెను గనుక అవశ్యముగా వానికి మరణశిక్ష విధింపబడును, వాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాదియగును.

14. అయితే అతనికి కుమారుడు పుట్టగా ఆ కుమారుడు తన తండ్రిచేసిన పాపములన్నిటిని చూచి, ఆలోచించుకొని అట్టి క్రియలు చేయకయుండినయెడల, అనగా

ఇప్పుడు మూడో తరం గురించిన విషయం. నిర్గమకాండము 20:5; నిర్గమకాండము 34:7 పోల్చి చూడండి. నాలుగు తరాల పిల్లలు వాళ్ళ పూర్వీకుల పాపాలు చేస్తేనే వాళ్ళ పూర్వీకులలాగా శిక్షకు గురి అవుతారు. వారలా చెయ్యకుంటే దేవుని తీర్పునుండి తప్పించుకుంటారు (వ 20).

15. పర్వతములమీద భోజనము చేయకయు, ఇశ్రాయేలీయులు పెట్టుకొనిన విగ్రహములతట్టు చూడకయు, తన పొరుగువాని భార్యను చెరపకయు,

16. ఎవనినైనను బాధపెట్టకయు, తాకట్టు ఉంచుకొనకయు, బలాత్కారముచేత నష్టపరచకయు, ఆకలి గలవానికి ఆహారమిచ్చి దిగంబరికి బట్టయిచ్చి

17. బీదవాని మీద అన్యాయముగా చెయ్యి వేయక లాభముకొరకు అప్పియ్యకయు, వడ్డి పుచ్చుకొనకయు నుండినవాడై, నా విధుల నాచరించుచు నా కట్టడల ననుసరించుచు నుండిన యెడల అతడు తన తండ్రిచేసిన దోషమునుబట్టి చావడు, అతడు అవశ్యముగా బ్రదుకును.

18. అతని తండ్రి క్రూరుడై పరులను బాధపెట్టి బలాత్కారముచేత తన సహోదరులను నష్టపరచి తన జనులలో తగని క్రియలు చేసెను గనుక అతడే తన దోషమునుబట్టి మరణము నొందును.

19. అయితే మీరు కుమారుడు తన తండ్రి యొక్క దోష శిక్షను ఏల మోయుటలేదని చెప్పుకొనుచున్నారు. కుమారుడు నీతిన్యాయముల ననుసరించి నా కట్టడలన్నిటిని అనుసరించి గైకొనెను గనుక అతడు అవశ్యముగా బ్రదుకును.

20. పాపము చేయువాడే మరణము నొందును; తండ్రియొక్క దోష శిక్షను కుమారుడు మోయుటలేదని కుమారుని దోష శిక్షను తండ్రిమోయడు, నీతిపరుని నీతి ఆ నీతిపరునికే చెందును, దుష్టుని దుష్టత్వము ఆ దుష్టునికే చెందును.
యోహాను 9:2

21. అయితే దుష్టుడు తాను చేసిన పాపములన్నిటిని విడిచి, నా కట్టడలన్నిటిని అనుసరించి నీతిని అనుసరించి న్యాయము జరిగించినయెడల అతడు మరణము నొందడు, అవశ్యముగా అతడు బ్రదుకును.

14-20 వచనాల ప్రకారం ఒక తరంలోని పాపాలను మరో తరంలో జయించేందుకు అవకాశం ఉంది. ఈ వచనంలో అయితే ఏ తరంలోని పాపాలను ఆ తరంలో వారే విసర్జించడానికి అవకాశం ఉందని తెలుసుకుంటున్నాం. ఒక మనిషి కర్మ అని పిలిచేదానికీ, దీనికి ఏ సంబంధమూ లేదు. 21వ వచనం సంపూర్ణ పశ్చాత్తాపాన్ని గురించి చెప్తున్నది. యెషయా 55:7 పోల్చి చూడండి. 22వ వచనంలో పాపక్షమాపణ ఒక వ్యక్తి పాపాలను పూర్తిగా తుడిచి పెట్టివెయ్యడం కనిపిస్తున్నది. కీర్తనల గ్రంథము 103:12; యెషయా 44:22; మీకా 7:18-19 చూడండి.

22. అతడు చేసిన అపరాధములలో ఒకటియు జ్ఞాపకములోనికి రాదు, అతని నీతినిబట్టి అతడు బ్రదుకును.

23. దుష్టులు మరణము నొందుటచేత నా కేమాత్రమైన సంతోషము కలుగునా? వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రదుకుటయే నాకు సంతోషము; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.
1 తిమోతికి 2:4

వ 32; యెహెఙ్కేలు 33:11. దేవుడు ప్రేమ స్వరూపి. శిక్షించడంలో ఆయనకు ఆసక్తి లేదు. క్షమించడమే ఆయనకు ఇష్టం (యోవేలు 2:13; 2 పేతురు 3:9). మనుషులపట్ల ఆయన జాలి లేకుండా అకారణంగా మరణం గానీ శాశ్వత శిక్ష గానీ ఎవరికీ విధించడు. పశ్చాత్తాపంతో మనుషులు తనవైపు తిరగడంకంటే మరేదైనా ఆయనకు ఎక్కువ ఆనందం కలిగిస్తుందా (లూకా 15:7, లూకా 15:10)? ఆయనవైపు తిరిగి, విముక్తీ క్షమాపణా పొందినవారిని బట్టి ఆయన ఉల్లాసంతో ఉప్పొంగిపోతాడు (జెఫన్యా 3:17; కీర్తనల గ్రంథము 147:11).

24. అయితే నీతిపరుడు తన నీతిని విడిచి పాపము చేసి, దుష్టులు చేయు హేయక్రియలన్నిటి ప్రకారము జరిగించినయెడల అతడు బ్రదుకునా? అతడు చేసిన నీతి కార్యములు ఏమాత్రమును జ్ఞాపకములోనికి రావు, అతడు విశ్వాసఘాతకుడై చేసిన పాపమునుబట్టి మరణము నొందును.

ఇక్కడి అర్థం దేవుని బిడ్డ ఆయన కృపమూలంగా పాపవిముక్తీ శాశ్వత జీవాన్నీ పొందిన తరువాత ఆ శాశ్వత జీవాన్ని పోగొట్టుకొని నరకానికి పోతాడని కాదు. అలా అనుకోవడం యోహాను 10:28, తదితర వచనాలకు వ్యతిరేకం అవుతుంది. ఇక్కడ యెహెజ్కేలు గ్రంథంలో రాసివున్నది శాశ్వత జీవం లేక శాశ్వత శిక్షలను గురించి కాదు. అవి పాత ఒడంబడిక అంతట్లో కనబడడం అరుదు. ఇక్కడి సందర్భం ఇస్రాయేల్ పై దేవుని తీర్పు, జెరుసలం నాశనం, అందులోని అనేకమంది వధ, మరి కొందరి ప్రవాసం. ఆ పరిస్థితుల దృష్ట్యా మరణం దేవుని శిక్ష, బ్రతికి ఉండడం దేవుని అనుగ్రహం.

25. అయితే యెహోవా మార్గము న్యాయము కాదని మీరు చెప్పుచున్నారు. ఇశ్రాయేలీయులారా, నా మాట ఆలకించుడి, నా మార్గము న్యాయమే మీ మార్గమే గదా అన్యాయమైనది?

యిర్మియా 2:29. భ్రష్టమైన మానవాళి స్వభావాన్ని ఇది చూపుతున్నది. మనుషులు తాము అన్యాయం చేసేవారై ఉండి దేవుడు అన్యాయం చేశాడంటారు.

26. నీతిపరుడు తన నీతిని విడిచి పాపము చేసినయెడల అతడు దానినిబట్టి మరణము నొందును; తాను పాపము చేయుటనుబట్టియే గదా అతడు మరణమునొందును?

వ 21-25; యెహెఙ్కేలు 33:12-20.

27. మరియు దుష్టుడు తాను చేయుచు వచ్చిన దుష్టత్వమునుండి మరలి నీతి న్యాయములను జరిగించిన యెడల తన ప్రాణము రక్షించుకొనును.

28. అతడు ఆలోచించుకొని తాను చేయుచువచ్చిన అతిక్రమక్రియలన్నిటిని చేయక మానెను గనుక అతడు మరణమునొందక అవశ్యముగా బ్రదుకును.

29. అయితే ఇశ్రాయేలీయులు యెహోవా మార్గము న్యాయముకాదని చెప్పుచున్నారు. ఇశ్రాయేలీయులారా, నా మార్గము న్యాయమేగాని మీ మార్గము న్యాయము కాదు.

30. కాబట్టి ఇశ్రాయేలీయులారా, యెవని ప్రవర్తననుబట్టి వానికి శిక్ష విధింతును. మనస్సు త్రిప్పుకొని మీ అక్రమములు మీకు శిక్షాకారణములు కాకుండునట్లు వాటినన్నిటిని విడిచిపెట్టుడి.

ఇస్రాయేల్, ఆ జాతిలోని ప్రతి వ్యక్తీ పశ్చాత్తాపపడాలని దేవుడు గట్టిగా, హృదయాన్ని కదిలించేంతగా చెప్తున్నమాట. యెషయా 1:16-19; యెషయా 19:22; యిర్మియా 8:1; యిర్మియా 35:15; హోషేయ 12:6-14; యోవేలు 2:12; మత్తయి 3:2; అపో. కార్యములు 17:30 పోల్చి చూడండి. “పడిపోరు”– హోషేయ 5:5; హోషేయ 13:9; హోషేయ 14:1.

31. మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటిని విడిచి నూతన హృదయమును నూతన బుద్దియు తెచ్చుకొనుడి. ఇశ్రాయేలీయులారా, మీరెందుకు మరణము నొందుదురు? ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.

కొత్త హృదయం, కొత్త మనస్సు కేవలం పశ్చాత్తాపం వల్ల, వాటిని ఇవ్వగలిగిన ఏకైక దేవుని దగ్గరికి రావడం వల్లే కలుగుతాయి (యెహెఙ్కేలు 36:26; కీర్తనల గ్రంథము 51:10).

32. మరణమునొందువాడు మరణము నొందుటనుబట్టి నేను సంతోషించువాడను కాను. కావున మీరు మనస్సు త్రిప్పుకొనుడి అప్పుడు మీరు బ్రదుకుదురు; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.

వ 23. యెహెజ్కేలు గ్రంథంలోనూ, బైబిలు అంతటిలోనూ ఒక గొప్ప ముఖ్యాంశం.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Ezekiel - యెహెఙ్కేలు 18 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

దేవునికి వ్యక్తుల పట్ల గౌరవం లేదు. (1-20) 
"పాపం చేసిన ఆత్మ దాని స్వంత పర్యవసానాలను భరిస్తుంది. శాశ్వతత్వం యొక్క రాజ్యంలో, ప్రతి వ్యక్తి వారి చర్యల ఆధారంగా తీర్పు ఇవ్వబడతారు, వారు పాత పనుల యొక్క పాత ఒడంబడికతో లేదా దయ యొక్క కొత్త ఒడంబడికకు అనుగుణంగా ఉంటారు. తప్పుల ఫలితంగా బాహ్య కష్టాలతో సంబంధం లేకుండా. ఇతరులలో, వ్యక్తులు వారి స్వంత పాపాలకు బాధ్యత వహిస్తారు మరియు విశ్వాసుల శాశ్వత ప్రయోజనం కోసం ప్రభువు అన్ని సంఘటనలను నిర్వహిస్తాడు. అన్ని ఆత్మలు గొప్ప సృష్టికర్త చేతుల్లో విశ్రాంతి తీసుకుంటాయి, అతను న్యాయాన్ని మరియు దయను న్యాయమైన విధంగా నిర్వహించేవాడు. మరొకరి పాపాలకు ఎవరూ నశించరు వారు తమ స్వంత అతిక్రమణలకు శిక్షకు అర్హులు కాకపోతే, మనమందరం పాపం చేసాము, మరియు దేవుడు తన పవిత్ర చట్టం ద్వారా మాత్రమే మనలను తీర్పు తీర్చినట్లయితే మన ఆత్మలు పోతాయి, అయితే క్రీస్తు వైపు తిరగమని మాకు ఆహ్వానం అందించబడింది. ఇక్కడ ఒక దృశ్యాన్ని పరిశీలించండి. ఒక వ్యక్తి తన ధర్మబద్ధమైన చర్యల ద్వారా తన విశ్వాసాన్ని ప్రదర్శించాడు, అయినప్పటికీ అతని ప్రవర్తన తన తండ్రికి భిన్నంగా ఉండే దుష్ట కొడుకును కలిగి ఉన్నాడు.తండ్రి భక్తి కారణంగా కుమారుడు దైవిక ప్రతీకారం నుండి తప్పించుకుంటాడని అనుకోవచ్చా? ససేమిరా. దీనికి విరుద్ధంగా, ఒక దుష్టుడికి దేవుని దృష్టిలో నీతిమంతమైన జీవితాన్ని గడుపుతున్న కుమారుడు ఉంటే, తండ్రి తన స్వంత పాపాలకు శిక్షించబడడు. కొడుకు ఈ జన్మలో పరీక్షలను అనుభవించినా, చివరికి మోక్షంలో పాలుపంచుకుంటాడు. ప్రస్తుత ప్రశ్న సమర్థనకు సంబంధించినది కాదు కానీ నీతిమంతులు మరియు దుర్మార్గులతో ప్రభువు వ్యవహారాలకు సంబంధించినది."

దైవ ప్రావిడెన్స్ నిరూపించబడింది. (21-29) 
"దుష్టుడు తన పాపపు మార్గాలను విడనాడడం ద్వారా మోక్షాన్ని పొందగలడు. నిజమైన పశ్చాత్తాపపరుడు కూడా నిజమైన విశ్వాసి. అతని గత అతిక్రమణలలో ఏదీ అతనికి వ్యతిరేకంగా జరగదు; బదులుగా, అతను ఫలితంగా ప్రదర్శించిన ధర్మాన్ని బట్టి అతను తీర్పు తీర్చబడతాడు. అతని విశ్వాసం మరియు మతమార్పిడి అతని జీవితానికి భరోసానిస్తుంది.నిజంగా నీతిమంతులు ఎప్పటికైనా మతభ్రష్టులుగా మారగలరా అనేది సమస్య కాదు.ఒకప్పుడు నీతిమంతులని నమ్మిన కొందరు కుంగిపోవచ్చు, కానీ నిజమైన పశ్చాత్తాపం ప్రారంభాన్ని సూచిస్తుంది మరియు వారి పునరుద్ధరణ యొక్క పురోగమనం.నిజమైన విశ్వాసులు అప్రమత్తంగా మరియు ప్రార్థనాపూర్వకంగా ఉంటారు, చివరి వరకు పట్టుదలతో ఉంటారు, తద్వారా వారి మోక్షాన్ని భద్రపరుస్తారు. దేవునితో మనకున్న అన్ని విభేదాలలో, అతను ధర్మం వైపు నిలుస్తాడు మరియు మనమే తప్పులో ఉన్నాము."

పశ్చాత్తాపానికి దయగల ఆహ్వానం. (30-32)
"ప్రభువు ప్రతి ఇశ్రాయేలీయుని ప్రవర్తనను బట్టి వారి చర్యలను అంచనా వేస్తాడు. ఇది పశ్చాత్తాపపడటానికి, నూతన హృదయాన్ని మరియు ఆత్మను వెదకడానికి ప్రోత్సాహానికి ఆధారం. దేవుడు మన సామర్థ్యానికి మించిన ఆజ్ఞలను జారీ చేయడు, కానీ దానిని చేపట్టమని మనలను ప్రోత్సహిస్తాడు. మన సామర్థ్యానికి లోబడి మరియు లేని వాటి కోసం పిటిషన్ వేయడానికి. అతను శాసనాలను స్థాపించాడు మరియు మార్గాలను అందించాడు, ఈ పరివర్తనను కోరుకునే వారికి మార్గదర్శకత్వం మరియు వాగ్దానాలను అందిస్తాడు, కాబట్టి వారు దాని కోసం ఆయనను ఆశ్రయించవచ్చు."



Shortcut Links
యెహెఙ్కేలు - Ezekiel : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |