Ezekiel - యెహెఙ్కేలు 26 | View All
Study Bible (Beta)

1. మరియు పదకొండవ సంవత్సరము నెల మొదటి దినమున యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను

1. And it came to passe in the eleuenth yere, the first day of the moneth, the word of the Lorde came vnto me, saying:

2. నరపుత్రుడా, యెరూషలేమునుగూర్చి - ఆహా జనములకు ద్వారముగానున్న పట్టణము పడగొట్టబడెను, అది నావశమాయెను, అది పాడైపోయినందున నేను పరిపూర్ణము నొందితిని అని తూరు చెప్పెను గనుక

2. Thou sonne of man, because that Tyre hath spoken vpon Hierusalem, Haha, the gates of the people is broken, it is turned vnto me, for now that she is destroyed, I shalbe filled:

3. ప్రభువైన యెహోవా సెలవిచ్చున దేమనగా తూరుపట్టణమా, నేను నీకు విరోధినైతిని, సముద్రము దాని తరంగములను పొంగజేయు రీతిగా నేను అనేకజనములను నీ మీదికి రప్పించెదను.

3. Therfore thus sayth the Lord God, Behold O Tyre, I will vpon thee, I wil raise vp many nations against thee, like as whe the sea ariseth with his waues.

4. వారు వచ్చి తూరుయొక్క ప్రాకారములను కూల్చి దాని కోటలను పడగొట్టుదురు, నేను దానిమీదనున్న మంటిని తుడిచి వేయుదును, దానిని వట్టిబండగా చేసెదను.

4. They shal breake the walles of Tyre, & cast downe her towres, I will scrape her dust fro her, & make her a drie rocke.

5. సముద్రము దాని నావరించును, అది వలలు పరచుటకు చోటగును, నేనేమాట యిచ్చితిని, ఇదే ప్రభువగు యెహోవా వాక్కు అది జనములకు దోపుడుసొమ్మగును.

5. She shalbe for a spreading of nettes in the sea, for I haue spoken it, sayth the Lord God, and she shalbe for a spoyle to the nations.

6. బయటి పొలములోనున్న దాని కుమార్తెలు కత్తిపాలగుదురు, అప్పుడు నేను యెహోవానై యున్నానని వారు తెలిసికొందురు.

6. Her daughters that are in the fielde shalbe slayne with the sworde, that they may knowe how that I am the Lorde.

7. ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా రారాజగు బబులోనురాజైన నెబుకద్రెజరును నేను తూరుపట్టణము మీదికి రప్పించుచున్నాను, అతడు గుఱ్ఱములతోను రథములతోను రౌతులతోను గుంపులు గుంపులుగానున్న సైన్యముతోను ఉత్తరదిక్కునుండివచ్చి

7. For thus sayth the Lord God: Behold, I will bring vpon Tyrus, Nabuchodonozor king of Babylon from the north, a king of kinges, with horses, charets, horsemen, with a multitude, and much people.

8. బయటిపొలము లోని నీ కుమార్తెలను ఖడ్గముతో చంపి, నీ కెదురుగా బురుజులు కట్టించి దిబ్బవేయించి నీ కెదురుగా డాలునెత్తును.

8. Thy daughters that are in the field shal he slay with the sword: but against thee he shal make bulwarkes, & cast a mount against thee, and lift vp his speare against thee.

9. మరియు అతడు నీ ప్రాకారములను పడగొట్టుటకై యంత్రములు సంధించి గొడ్డండ్రతో నీ కోటలను పడగొట్టును.

9. He shall set engins of warre before hym against thy walles, & with his weapons breake downe thy towres.

10. అతనికి గుఱ్ఱములు బహు విస్తారముగా ఉన్నవి, అవి ధూళి యెగరగొట్టగా అది నిన్ను కమ్మును, బీటసందులుగల పట్టణములోనికి సైనికులు చొరబడినట్లు అతడు నీ కోటలలో ప్రవేశించునప్పుడు రౌతుల యొక్కయు చక్రములయొక్కయు రథములయొక్కయు ధ్వనిచేత నీ ప్రాకారములు కంపించును.

10. The dust of his horses shall couer thee they shalbe so many: thy walles shall shake at the noyse of the horsemen, wheeles & chariots, when he shal enter into thy gates, as into the entry of a citie broken downe.

11. అతడు తన గుఱ్ఱముల డెక్కలచేత నీ వీధులన్నియు అణగద్రొక్కించును, నీ జనులను ఖడ్గముతో హతము చేయును, నీ ప్రభావము నకు చిహ్నములైన స్తంభములు నేలను కూలును.

11. With the hoofes of his horses shall he treade downe al thy streetes, he shall slay the people with the sworde, dna the pillers of thy strength shall fall downe to the grounde.

12. వారు నీ ఐశ్వర్యమును దోచుకొందురు, నీ వర్తకమును అపహరింతురు, నీ ప్రాకారములను పడగొట్టుదురు, నీ విలాస మందిరములను పాడుచేయుదురు, నీ రాళ్లను నీ కలపను నీ మంటిని నీళ్లలో ముంచివేయుదురు.

12. They shall rob thy riches, and spoyle thy marchaundise, thy walles shall they breake downe, and destroy thy houses of pleasure, thy stones, thy timber, and dust shall they cast into the mids of the water.

13. ఇట్లు నేను నీ సంగీతనాదమును మాన్పించెదను, నీ సితారా నాదమికను వినబడదు,
ప్రకటన గ్రంథం 18:22

13. Thus will I cause the sounde of thy songues to ceasse, and the noyse of thy harpes shall no more be hearde.

14. నిన్ను వట్టిబండగా చేయుదును, వలలు పరచుకొనుటకు చోటగుదువు నీవికను కట్టబడక యుందువు. నేనే మాట యిచ్చియున్నాను; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.

14. I wil bring thee into a drie rocke, thou shalt be for a spreading of nettes, thou shalt neuer be buylt againe: for euen I the Lord haue spoken it, saith the Lord God.

15. తూరునుగూర్చి ప్రభువగు యెహోవా సెలవిచ్చునదేమనగా నీవు కూలునప్పుడు కలుగు ధ్వనియు, హతులగుచున్నవారి కేకలును, నీలో జరుగు గొప్పవధయు ద్వీపములు విని కంపించును.

15. Thus hath the Lord God spoken concerning Tyre: Shall not the iles tremble at the noyse of thy fall, and at the crie of the wounded, when they shalbe slaine & murthered in the mids of thee?

16. సముద్రపు అధిపతులందరును తమ సింహాసనములమీదనుండి దిగి, తమ చొక్కాయిలను విచిత్రమైన వస్త్రములను తీసివేసి, దిగులుపడిన వారై నేలను కూర్చుండి గడగడ వణకుచు నిన్ను చూచి విస్మయపడుదురు.
ప్రకటన గ్రంథం 18:9

16. All princes of the sea shal come downe from their thrones, they shall lay away their robes, & put of their broidred garmentes, yea with trembling shall they be clothed, they shal sit vpon the ground, they shalbe astonished at euery moment, and be amased at thee.

17. వారు నిన్నుగూర్చి అంగలార్పు వచనమెత్తి ఈలాగున అందురు సముద్ర నివాసమైనదానా, ఖ్యాతినొందిన పట్ణణమా, నీవెట్లు నాశనమైతివి? సముద్ర ప్రయాణము చేయుటవలన దానికిని దాని నివాసులకును బలము కలిగెను, సముద్రవాసులందరిని భీతిల్లచేసినది ఇదే.
ప్రకటన గ్రంథం 18:10, ప్రకటన గ్రంథం 18:9

17. They shall mourne for thee, and say vnto thee: How art thou destroyed that wast inhabited of the seas, the renowmed citie, whiche was strong in the sea, she and her inhabitauntes, whiche caused their feare to be on all that haunted therin?

18. ఇప్పుడు నీవు కూలినందున ద్వీపములు కంపించుచున్నవి, నీవు వెళ్లిపోవుట చూచి సముద్రద్వీపములు కదలుచున్నవి.

18. Now shall the inhabitours of the iles be astonished in the day of thy fall: yea the iles that are in the sea shalbe troubled at thy departure.

19. ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా నివాసులులేని పట్టణములవలెనే నేను నిన్ను పాడుచేయునప్పుడు మహా సముద్రము నిన్ను ముంచునట్లుగా నీ మీదికి నేను అగాధజలములను రప్పించెదను, పురాతన కాలమందు పాతాళములోనికి దిగిపోయినవారియొద్ద నీ వుండునట్లు నేను నిన్ను పడవేసి, నీవు జనములేని దాన వగుటకై పురాతనకాలములో పాడైన జనులయొద్ద భూమి క్రిందనున్న స్థలములలో నీకు నివాసము నిర్ణయింతును, పాతాళములోనికి దిగి పోవువారితో కూడ నిన్ను నివసింప జేసెదను.
ప్రకటన గ్రంథం 18:19

19. For thus sayth the Lord God: when I make thee a desolate citie, as other cities be that no man dwell in, and when I bring vp the deepe vpon thee, that great waters may couer thee:

20. మరియు సజీవులు నివసించు భూమిమీద నేను మహాఘనకార్యము కలుగజేతును;

20. Then wil I cast thee downe vnto them that descend into the pit, vnto a people of olde time, and set thee in a lande that is beneath, like the olde ruynes, with them which go downe to the graue, so that no man shall dwell more in thee: but I wil reserue honour for the land of the liuing:

21. నిన్ను భీతికి కారణముగా జేతును, నీవు లేకపోవుదువు, ఎంత వెదకినను నీవెన్నటికిని కనబడక యుందువు; ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.
ప్రకటన గ్రంథం 18:21

21. I will make thee terrors, and thou shalt be no more: though thou be sought for, yet shalt thou not be founde for euermore, sayth the Lorde God.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Ezekiel - యెహెఙ్కేలు 26 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

టైర్‌కు వ్యతిరేకంగా ఒక జోస్యం.

1-14
ఇతరుల దురదృష్టం, మరణం లేదా పతనాలలో రహస్య ఆనందాన్ని పొందడం, ప్రత్యేకించి మనం దాని నుండి లాభం పొందుతున్నప్పుడు, మనల్ని తరచుగా ప్రలోభపెట్టే పాపం. విచారకరంగా, ఇది నిజంగా ఉన్నంత తీవ్రంగా పరిగణించబడలేదు. ఈ వంపు స్వార్థపూరితమైన మరియు అత్యాశతో కూడిన మనస్తత్వం నుండి పుడుతుంది, ఇది దేవుని బోధల ప్రేమ కంటే ప్రాపంచిక లాభాలకు ప్రాధాన్యత ఇవ్వడంలో పాతుకుపోయింది. తరచుగా, ఇతరులను పణంగా పెట్టి తమను తాము ఉన్నతీకరించుకోవాలని కోరుకునే వారి ప్రణాళికలను దేవుడు నిరాశపరుస్తాడు. వ్యాపార ప్రపంచంలో ప్రబలంగా ఉన్న సూత్రాలు తరచుగా దేవుని చట్టానికి విరుద్ధంగా ఉంటాయి. ఏది ఏమైనప్పటికీ, దేవుడు తమ వ్యాపారంలో డబ్బు మరియు స్వార్థానికి ప్రాధాన్యతనిచ్చేవారికి వ్యతిరేకంగా ఉంటాడు, అతను ధనాన్ని ప్రేమించి వారి హృదయాలను కఠినతరం చేసిన టైరు వ్యాపారులతో చేసినట్లుగా. ఇతరులలో అసూయ మరియు దురాశను ప్రేరేపించే ఆస్తుల గురించి ప్రజలు గొప్పగా చెప్పుకోకూడదు, ఎందుకంటే ఈ ఆస్తులు నిరంతరం ఒక చేతి నుండి మరొక చేతికి మారుతూ ఉంటాయి. అటువంటి సంపదను వెంబడించడం, స్వాధీనం చేసుకోవడం మరియు ఖర్చు చేయడంలో, ప్రజలు దేవుని కోపాన్ని రేకెత్తిస్తారు, ఇది సంపన్న నగరాలను నిర్జన శిథిలాలుగా మార్చగలదు.

15-21
ఒకప్పుడు అత్యున్నతమైన టైర్ గొప్పతనాన్ని గమనించండి మరియు ఇప్పుడు దాని తీవ్ర పతనానికి సాక్ష్యమివ్వండి. ఇతరుల పతనం మన ఆత్మసంతృప్తి నుండి మనలను కదిలించడానికి మేల్కొలుపు పిలుపుగా ఉపయోగపడాలి. స్క్రిప్చర్ నుండి ఒక ప్రవచన నెరవేర్పు యొక్క ప్రతి ద్యోతకం మన విశ్వాసానికి అద్భుత నిర్ధారణగా పనిచేస్తుంది. భూసంబంధమైన ప్రతిదీ నశ్వరమైనది మరియు ఇబ్బందులతో నిండి ఉంది. ప్రస్తుతం అత్యంత శాశ్వతమైన శ్రేయస్సును అనుభవిస్తున్న వారు కూడా చివరికి మరుగున పడిపోతారు మరియు మరచిపోతారు.


Shortcut Links
యెహెఙ్కేలు - Ezekiel : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |