Ezekiel - యెహెఙ్కేలు 27 | View All
Study Bible (Beta)

1. మరియయెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను.

1. And the word of the Lord was maad to me,

2. నరపుత్రుడా, తూరు పట్టణముగూర్చి అంగలార్పు వచనమెత్తి దానికీలాగు ప్రకటన చేయుము

2. and he seide, Therfor thou, sone of man, take weilyng on Tire.

3. సముద్రపు రేవులమీద నివసించుదానా, అనేక ద్వీపములకు ప్రయాణముచేయు వర్తకజనమా, ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా తూరు పట్టణమా నేను సంపూర్ణ సౌందర్యము కలదాననని నీవను కొనుచున్నావే;

3. And thou schalt seie to Tire, that dwellith in the entryng of the see, to the marchaundie of puplis to many ilis, The Lord God seith these thingis, O! Tire, thou seidist, Y am of perfit fairnesse,

4. నీ సరిహద్దులు సముద్రములమధ్య ఏర్పడెను, నీ శిల్పకారులు నిన్ను సంపూర్ణ సౌందర్యము గలదానిగా చేసియున్నారు.

4. and Y am set in the herte of the see. Thei that ben in thi coostis that bildiden thee, filliden thi fairnesse;

5. నీ ఓడలను శెనీరుదేశపు సరళవృక్షపు మ్రానుతో కట్టుదురు, లెబానోను దేవదారు మ్రాను తెప్పించి నీ ఓడకొయ్యలు చేయుదురు.

5. thei bildiden thee with fir trees of Sanyr, with alle werkis of boordis of the see; thei token a cedre of the Liban, to make a mast to thee.

6. బాషానుయొక్క సింధూరమ్రానుచేత నీ కోలలు చేయుదురు, కిత్తీయుల ద్వీపములనుండి వచ్చిన గుంజుమ్రానునకు దంతపు చెక్కడపుపని పొదిగి నీకు పీటలు చేయుదురు.

6. Thei hewiden ookis of Bala in to thin ooris, thei maden to thee thi seetis of roweris of yuer of Ynde, and cabans of the ilis of Italie.

7. నీకు జెండాగా ఉండుటకై నీ తెరచాపలు ఐగుప్తునుండి వచ్చిన విచిత్రపు పనిగల అవిసెనార బట్టతో చేయబడును; ఎలీషాద్వీపములనుండి వచ్చిన నీలధూమ్ర వర్ణములు గల బట్ట నీవు చాందినిగా కప్పుకొందువు

7. Dyuerse biys, `ether whijt silk, of Egipt, was wouun to thee in to a veil, that it schulde be set in the mast; iacynct and purpur of the ilis of Elisa weren maad thin hiling.

8. తూరుపట్టణమా, సీదోను నివాసులును అర్వదు నివాసులును నీకు ఓడకళాసులుగా ఉన్నారు, నీ స్వజనులకు చేరిన ప్రజ్ఞావంతులు నీకు ఓడ నాయకులుగా ఉన్నారు.

8. The dwelleris of Sidon and Aradians weren thi roweris; Tire, thi wise men weren maad thi gouernouris.

9. గెబలు పనివారిలో పనితెలిసిన పెద్దలు నీ ఓడలను బాగుచేయు వారుగా నున్నారు, సముద్రమందు నీ సరకులు కొనుటకై సముద్రప్రయాణముచేయు నావికుల యోడలన్నియు నీ రేవులలో ఉన్నవి.
ప్రకటన గ్రంథం 18:19

9. The elde men of Biblos, and the prudent men therof, hadden schipmen to the seruyse of thi dyuerse araye of houshold; alle the schippis of the see, and the schip men of tho, weren in the puple of thi marchaundie.

10. పారసీక దేశపువారును లూదువారును పూతువారును నీ సైన్యములలో చేరి నీకు సిపాయిలుగా ఉన్నారు, వారు నీ డాళ్లను శిరస్త్రాణములను ధరించువారు, వారిచేత నీకు తేజస్సు కలిగెను.

10. Perseis, and Lidians, and Libians weren in thin oost; thi men werriours hangiden in thee a scheeld and helm, for thin ournyng.

11. అర్వదువారు నీ సైన్యములో చేరి చుట్టు నీ ప్రాకారములకు డాళ్లు తగిలించి చుట్టు నీ ప్రాకారములమీద కావలి కాచి నీ సౌందర్యమును సంపూర్ణ పరచెదరు.

11. Sones Aradians with thin oost weren on thi wallis in thi cumpas; but also Pigmeis, that weren in thi touris, hangiden her arowe casis in thi wallis bi cumpas; thei filliden thi fairnesse.

12. నానా విధమైన సరకులు నీలో విస్తారముగా నున్నందున తర్షీషు వారు నీతో వర్తకము చేయుచు, వెండియు ఇనుమును తగరమును సీసమును ఇచ్చి నీ సరకులు కొనుక్కొందురు.

12. Cartagynensis, thi marchauntis, of the multitude of alle richessis filliden thi feiris, with siluer, and irun, with tyn, and leed.

13. గ్రేకేయులును తుబాలువారును మెషెకువారును నీలో వర్తకవ్యాపారము చేయుచు, నరులను ఇత్తడి వస్తువులను ఇచ్చి నీ సరకులు కొనుక్కొందురు,
ప్రకటన గ్రంథం 18:13

13. Greece, and Tubal, and Mosoch, thei weren thi marchauntis, and brouyten boonde men and brasun vessels to thi puple.

14. తోగర్మావారు గుఱ్ఱములను యుద్ధాశ్వములను కంచరగాడిదలను ఇచ్చి నీ సరకులు కొనుక్కొందురు;

14. Fro the hous of Thogorma thei brouyten horsis, and horse men, and mulis, to thi chepyng.

15. దదానువారును నీతో వర్తక వ్యాపారము చేయుదురు, చాల ద్వీపముల వర్తకములు నీ వశమున నున్నవి; వర్తకులు దంతమును కోవిదారు మ్రానును ఇచ్చి నీ సరకులు కొనుక్కొందురు.

15. The sones of Dedan weren thi marchauntis; many ilis the marchaundie of thin hond, chaungiden teeth of yuer, and of hebennus, in thi prijs.

16. నీచేత చేయబడిన వివిధ వస్తువులను కొనుక్కొనుటకై సిరియనులు నీతో వర్తకవ్యాపారము చేయుదురు, వారు పచ్చరాళ్లను ఊదారంగు నూలుతో కుట్టబడిన చీరలను అవిసెనార బట్టలను పగడములను రత్నములను ఇచ్చి నీ సరకులు కొనుక్కొందురు.

16. Sirie was thi marchaunt, for the multitude of thi werkis thei settiden forth in thi marcat gemme, and purpur, and clothis wouun dyuersli at the maner of scheeldis, and bijs, and seelk, and cochod, ether auer de peis.

17. మరియయూదావారును ఇశ్రాయేలు దేశస్థులును నీలో వర్తక వ్యాపారము చేయుచు, మిన్నీతు గోధుమలును మిఠాయిలును తేనెయు తైలమును గుగ్గిలమును ఇచ్చి నీ సరకులు కొనుక్కొందురు.
అపో. కార్యములు 12:20

17. Juda and the lond of Israel weren thi marchauntis in the beste wheete, and settiden forth in thi feiris bawme, and hony, and oile, and resyn.

18. దమస్కు వారు హెల్బోను ద్రాక్షారసమును తెల్లబొచ్చును ఇచ్చి విస్తారమైన నీ సరకులును దినుసులును కొనుక్కొందురు.

18. Damassen was thi marchaunt, in the multitude of thi werkis, in the multitude of dyuerse richessis, in fat wyn, in wollis of best colour.

19. దదాను వారును గ్రేకేయులును నూలు ఇచ్చి నీ సరకులు కొనుక్కొందురు. ఇనుప పనిముట్టును కత్సీయా కెనయా అను సుగంధద్రవ్యములును నీ సరకులకు బదులియ్యబడును.

19. Dan, and Greece, and Mosel, settiden forth in thi fairis irun maad suteli, gumme of myrre, and calamus, that is, a spice swete smellynge, in thi marchaundie.

20. దదాను వారు విచిత్రమైన పనిగల చౌకపు తుండ్లు తీసికొని అమ్ముదురు.
ప్రకటన గ్రంథం 18:9

20. Dedan weren thi marchauntis, in tapitis to sitte.

21. అరబీయులును కేదారు అధిపతులందరును నీతో వర్తకము చేయుదురు, వారు గొఱ్ఱెపిల్లలను పొట్టేళ్లను మేకలను ఇచ్చి నీ సరకులు కొనుక్కొందురు, వీటి నిచ్చి వారు నీతో వర్తకము చేయుదురు.

21. Arabie and alle the princes of Cedar, thei weren the marchauntis of thin hond; with lambren, and wetheris, and kidis thi marchauntis camen to thee.

22. షేబ వర్తకులును రామా వర్తకులును నీతో వర్తకము చేయుదురు. వారు అతి ప్రశస్తమైన గంధవర్గములను విలువగల నానా విధమైన రత్నములను బంగారమును ఇచ్చి నీ సరకులు కొనుక్కొందురు.
ప్రకటన గ్రంథం 18:12-13

22. The silleris of Saba and of Rema, thei weren thi marchauntis, with alle the beste swete smellynge spices, and preciouse stoon, and gold, which thei settiden forth in thi marcat.

23. హారానువారును కన్నేవారును ఏదెను వారును షేబ వర్తకులును అష్షూరు వర్తకులును కిల్మదు వర్తకులును నీతో వర్తకము చేయుదురు.

23. Aran, and Chenne, and Eden, weren thi marchauntis; Sabba, and Assur, and Chelmath, weren thi silleris.

24. వీరు నీలో వర్తకులై సొగసైన వస్త్రములను ధూమ్రవర్ణముగలవియు కుట్టుపనితో చేయబడినవియునగు బట్టలను విలువగల నూలును బాగుగా చేయబడిన గట్టి త్రాళ్లను ఇచ్చి నీ సరకులు కొనుక్కొందురు.

24. Thei weren thi marchaundis in many maneres, in fardels of iacinct and of clothis of many colours, and of preciouse richessis, that weren wlappid and boundun with coordis.

25. తర్షీషు ఓడలు నీకు బండ్లుగా ఉన్నవి. నీవు పరిపూర్ణమైనదానవై మహాఘనముగా సముద్రముమీద కూర్చున్నావు.

25. Also schippis of the see hadden cedris in her marchaundies; thi princes weren in thi marchaundie; and thou were fillid, and were glorified greetli in the herte of the see.

26. నీ కోలలు వేయువారు మహాసముద్రములోనికి నిన్ను త్రోయగా తూర్పు గాలి సముద్రమధ్యమందు నిన్ను బద్దలుచేయును.

26. Thi rowers brouyten thee in many watris, the south wynd al to-brak thee; in the herte of the see weren thi richessis,

27. అప్పుడు నీ ధనమును నీ సరకులును నీవు బదులిచ్చు వస్తువులును నీ నావి కులును నీ ఓడనాయకులును నీ ఓడలు బాగుచేయువారును నీతో వర్తకము చేయువారును నీలో నున్న సిపాయిలందరును నీలోనున్న జనసమూహములన్నియు నీవు కూలు దినమందే సముద్రమధ్యమందు కూలుదురు.

27. and thi tresours, and thi many fold instrument. Thi schip men, and thi gouernouris that helden thi purtenaunce of houshold, and weren souereyns of thi puple, and thi men werriours that weren in thee, with al thi multitude which is in the myddis of thee, schulen falle doun in the herte of the see, in the dai of thi fallyng.

28. నీ ఓడనాయకులు వేసిన కేకలవలన నీ ఉపగ్రామములు కంపించును;
ప్రకటన గ్రంథం 18:17

28. Schippis schulen be disturblid of the sown of the cry of thi gouernours;

29. కోలలు పట్టుకొను వారందరును నావికులును ఓడనాయకులును తమ ఓడల మీదనుండి దిగి తీరమున నిలిచి
ప్రకటన గ్రంథం 18:17

29. and alle men that helden oore, schulen go doun of her shippis. Shipmen and alle gouernouris of the see shulen stonde in the lond;

30. నిన్నుగూర్చి మహా శోకమెత్తి ప్రలాపించుచు, తమ తలలమీద బుగ్గి పోసికొనుచు, బూడిదెలో పొర్లుచు
ప్రకటన గ్రంథం 18:19

30. and schulen yelle on thee with greet vois. And thei shulen cry bitterli, and thei schulen caste poudur on her heedis, and schulen be spreynt with aische.

31. నీకొరకు తలలు బోడి చేసికొని మొలలకు గోనెలు కట్టుకొని మనశ్చింతగలవారై నిన్నుగూర్చి బహుగా అంగలార్చుదురు.
ప్రకటన గ్రంథం 18:15

31. And thei schulen shaue ballidnesse on thee, and schulen be gird with hairis, and thei schulen biwepe thee in bitternesse of soule, with most bittir wepyng.

32. వారు నిన్ను గూర్చి ప్రలాపవచనమెత్తి తూరు పట్టణమా, నీతో సాటియైన పట్టణమేది? సముద్రములో మునిగిలయమై పోయిన పట్టణమా, నీకు సమమైన పట్టణమేది?
ప్రకటన గ్రంథం 18:18, ప్రకటన గ్రంథం 18:15

32. And thei schulen take on thee a song of mourenyng, and thei schulen biweile thee, Who is as Tire, that was doumb in the myddis of the see?

33. సముద్రముమీద వచ్చిన నీ సరకులను పంపించి చాల జనములను తృప్తిపరచితివి, విస్తారమైన నీ పదార్థములచేతను నీ వర్తకముచేతను భూపతులను ఐశ్వర్యవంతులుగా చేసితివి.
ప్రకటన గ్రంథం 18:19

33. And thou, Tire, fillidist many puplis in the goyng out of thi marchaundies of the see; in the multitude of thi richessis, and of thi puplis, thou madist riche the kingis of erthe.

34. ఇప్పుడు అగాధజలములలో మునిగి సముద్రబలము చేత బద్దలైతివే, నీ వర్తకమును నీ యావత్సమూహమును నీతోకూడ కూలెనేయని చెప్పుకొనుచు బహుగా ఏడ్చుదురు.

34. Now thou art al to-brokun of the see, in the depthis of watris. Thi richessis and al thi multitude that was in the myddis of thee fellen doun;

35. నిన్ను బట్టి ద్వీపనివాసులందరు విభ్రాంతి నొందుదురు, వారి రాజులు వణకుదురు, వారి ముఖములు చిన్నబోవును.

35. alle the dwelleris of ilis and the kyngis of tho weren astonyed on thee. Alle thei weren smytun with tempest, and chaungiden cheris;

36. జనులలోని వర్తకులు నిన్ను అపహసించుదురు భీతికి హేతువగుదువు, నీవు బొత్తిగా నాశనమగుదువు.
ప్రకటన గ్రంథం 18:11-15-1

36. the marchauntis of puplis hissiden on thee. Thou art brouyt to nouyt, and thou schalt not be til `in to with outen ende.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Ezekiel - యెహెఙ్కేలు 27 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

టైర్ యొక్క సరుకు. (1-25) 
సుఖవంతమైన జీవితాలను గడుపుతున్న వారు కష్టాలకు సిద్ధపడకపోతే జాలిపడాలి. వారు కూడా నైతికంగా శుద్ధి చేయబడితే తప్ప ఎవరూ తమను తాము ఆశీర్వదించరు. ప్రజలు ప్రార్థనా స్థలాల్లో ప్రార్థనలు చేస్తూ, వింటూనే కాకుండా, వారు ప్రాపంచిక విషయాలలో నిమగ్నమైనప్పుడు కూడా దేవుడు వారిపై నిఘా ఉంచుతాడని టైర్ వ్యాపార కథ వివరిస్తుంది. కొనుగోలు మరియు అమ్మకాలు జరిగే మార్కెట్‌ప్లేస్‌లు మరియు ఫెయిర్‌ల వరకు ఈ నిఘా విస్తరించింది. మన లావాదేవీలన్నింటిలో, తప్పు చేయకుండా మనస్సాక్షిని కాపాడుకోవడం చాలా అవసరం. దేవుడు, మానవాళి యొక్క సాధారణ తండ్రిగా, వివిధ ప్రాంతాలకు ప్రత్యేకమైన వనరులను ప్రసాదించాడు, ప్రతి ఒక్కటి మానవ జీవితానికి అవసరాలు, సౌకర్యాలు లేదా అలంకారాలను అందిస్తోంది. దేవుని పట్ల భక్తితో నిర్వహించబడినప్పుడు వాణిజ్యం మరియు వాణిజ్యం మానవాళికి ఎంత ఆశీర్వాదం కాగలదో స్పష్టంగా తెలుస్తుంది. అవసరమైన వస్తువులకు మించి, అనేక ఆస్తులు సంప్రదాయం నుండి మాత్రమే విలువను పొందుతాయి మరియు వాటిని ఆస్వాదించడానికి దేవుడు మనలను అనుమతిస్తాడు. అయితే, సంపద పేరుకుపోతున్న కొద్దీ, వ్యక్తులు దానిపై స్థిరపడతారు మరియు వారి శ్రేయస్సుకు మూలమైన దేవుడిని మరచిపోతారు.

దాని పతనం మరియు నాశనం. (26-36)
అత్యంత శక్తివంతమైన మరియు అద్భుతమైన రాజ్యాలు మరియు దేశాలు కూడా చివరికి క్షీణిస్తాయి. ప్రాపంచిక సృష్టిపై నమ్మకం ఉంచి, వాటిపై ఆశలు పెట్టుకునే వారు అనివార్యంగా వారి వెంట పడతారు. సహాయం కోసం యాకోబు దేవునిపై ఆధారపడేవారు మరియు తమ దేవుడైన శాశ్వతమైన ప్రభువుపై నిరీక్షించే వారు అదృష్టవంతులు. వాణిజ్యంలో నిమగ్నమైన వారు దేవుని బోధనలకు అనుగుణంగా తమ వ్యాపారాన్ని నిర్వహించడానికి కృషి చేయాలి. సంపదను కలిగి ఉన్నవారు దేవుని వనరులకు తాము నిర్వాహకులని ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి మరియు వారు ఈ వనరులను అందరి గొప్ప ప్రయోజనం కోసం ఉపయోగించాలి. అందరికంటే ముందు దేవుని రాజ్యాన్ని వెదకడం, ధర్మబద్ధంగా జీవించడం వంటి వాటికే ప్రాధాన్యత ఇద్దాం.



Shortcut Links
యెహెఙ్కేలు - Ezekiel : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |