Ezekiel - యెహెఙ్కేలు 33 | View All
Study Bible (Beta)

1. మరియయెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను.

1. The word of the LORD came to me:

2. నరపుత్రుడా, నీవు నీ జనులకు సమాచారము ప్రకటించి వారితో ఇట్లనుము నేను ఒకానొక దేశముమీదికి ఖడ్గమును రప్పింపగా ఆ జనులు తమలో ఒకనిని ఏర్పరచుకొని కావలిగా నిర్ణయించిన యెడల

2. 'Son of man, speak to your people, and say to them, 'Suppose I bring a sword against the land, and the people of the land take one man from their borders and make him their watchman.

3. అతడు దేశముమీదికి ఖడ్గము వచ్చుట చూచి, బాకా ఊది జనులను హెచ్చరిక చేసిన సమయమున

3. He sees the sword coming against the land, blows the trumpet, and warns the people,

4. ఎవడైనను బాకానాదము వినియును జాగ్రత్తపడనందున ఖడ్గమువచ్చి వాని ప్రాణము తీసినయెడల వాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది

4. but there is one who hears the sound of the trumpet yet does not heed the warning. Then the sword comes and sweeps him away. He will be responsible for his own death.

5. బాకానాదము వినియును వాడు జాగ్రత్తపడకపోయెను గనుక తన ప్రాణమునకు తానే ఉత్తరవాది; ఏలయనగా వాడు జాగ్రత్తపడిన యెడల తనప్రాణమును రక్షించుకొనును.
మత్తయి 27:25

5. He heard the sound of the trumpet but did not heed the warning, so he is responsible for himself. If he had heeded the warning, he would have saved his life.

6. అయితే కావలివాడు ఖడ్గము వచ్చుట చూచియు, బాకా ఊదనందు చేత జనులు అజాగ్రత్తగా ఉండుటయు, ఖడ్గము వచ్చి వారిలో ఒకని ప్రాణము తీయుటయు తటస్థించిన యెడల వాడు తన దోషమును బట్టి పట్టబడినను, నేను కావలివానియొద్ద వాని ప్రాణమునుగూర్చి విచారణ చేయుదును.

6. But suppose the watchman sees the sword coming and does not blow the trumpet to warn the people. Then the sword comes and takes one of their lives. He is swept away for his iniquity, but I will hold the watchman accountable for that person's death.'

7. నరపుత్రుడా, నేను నిన్ను ఇశ్రాయేలీయులకు కావలివానిగా నియమించియున్నాను గనుక నీవు నా నోటిమాటను విని నాకు ప్రతిగా వారిని హెచ్చరిక చేయవలెను.

7. 'As for you, son of man, I have made you a watchman for the house of Israel. Whenever you hear a word from my mouth, you must warn them on my behalf.

8. దుర్మార్గుడా, నీవు నిశ్చయముగా మరణము నొందుదువు అని దుర్మార్గునికి నేను సెలవియ్యగా, అతడు తన దుర్మార్గతను విడిచి జాగ్రత్తపడునట్లు నీవు ఆ దుర్మార్గునికి నా మాట తెలియజేయని యెడల ఆ దుర్మార్గుడు తన దోషమునుబట్టి మరణము నొందును గాని అతని ప్రాణమునుగూర్చి నిన్ను విచారణచేయుదును.

8. When I say to the wicked, 'O wicked man, you must certainly die,' and you do not warn the wicked about his behavior, the wicked man will die for his iniquity, but I will hold you accountable for his death.

9. అయితే ఆ దుర్మార్గుడు తన దుర్మార్గతను విడువవలెనని నీవు అతనిని హెచ్చరిక చేయగా అతడు తన దుర్మార్గతను విడువనియెడల అతడు తన దోషమునుబట్టి మరణము నొందును గాని నీవు నీ ప్రాణము దక్కించుకొందువు.

9. But if you warn the wicked man to change his behavior, and he refuses to change, he will die for his iniquity, but you have saved your own life.

10. నరపుత్రుడా, ఇశ్రాయేలీయులకు ఈ మాట ప్రకటింపుము మా పాపదోషములు మామీద పడియున్నవి, వాటివలన మేము క్షీణించుచున్నాము, మనమెట్లు బ్రదకుదుమని మీరు చెప్పుకొనుమాట నిజమే.

10. 'And you, son of man, say to the house of Israel, 'This is what you have said: 'Our rebellious acts and our sins have caught up with us, and we are wasting away because of them. How then can we live?''

11. కాగా వారితో ఇట్లనుము నా జీవముతోడు దుర్మార్గుడు మరణము నొందుటవలన నాకు సంతోషములేదు; దుర్మార్గుడు తన దుర్మార్గతనుండి మరలి బ్రదుకుటవలన నాకు సంతోషము కలుగును. కాబట్టి ఇశ్రాయేలీయులారా, మనస్సు త్రిప్పుకొనుడి, మీ దుర్మార్గతనుండి మరలి మనస్సు త్రిప్పుకొనుడి, మీరెందుకు మరణము నొందుదురు? ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.

11. Say to them, 'As surely as I live, declares the sovereign LORD, I take no pleasure in the death of the wicked, but prefer that the wicked change his behavior and live. Turn back, turn back from your evil deeds! Why should you die, O house of Israel?'

12. మరియు నరపుత్రుడా, నీవు నీ జనులకు ఈ మాట తెలియజేయుము నీతిమంతుడు పాపము చేసిన దినమున అదివరకు అతడు అనుసరించిన నీతి అతని విడిపింపదు. దుష్టుడు చెడుతనము విడిచి మనస్సు త్రిప్పుకొనిన దినమున తాను చేసియున్న చెడు తనమునుబట్టి వాడు పడిపోడు, ఆలాగుననే నీతిమంతుడు పాపముచేసిన దినమున తన నీతినిబట్టి అతడు బ్రదుకజాలడు.

12. 'And you, son of man, say to your people, 'The righteousness of the righteous will not deliver him if he rebels. As for the wicked, his wickedness will not make him stumble if he turns from it. The righteous will not be able to live by his righteousness if he sins.'

13. నీతిమంతుడు నిజముగా బ్రదుకునని నేను చెప్పినందున అతడు తన నీతిని ఆధారముచేసికొని పాపము చేసినయెడల అతని నీతి క్రియలన్నిటిలో ఏదియు జ్ఞాపకమునకు తేబడదు, తాను చేసిన పాపమునుబట్టి యతడు మరణము నొందును.

13. Suppose I tell the righteous that he will certainly live, but he becomes confident in his righteousness and commits iniquity. None of his righteous deeds will be remembered; because of the iniquity he has committed he will die.

14. మరియు నిజముగా మరణము నొందుదువని దుర్మార్గునికి నేను సెలవియ్యగా అతడు తన పాపము విడిచి, నీతి న్యాయములను అనుసరించుచు

14. Suppose I say to the wicked, 'You must certainly die,' but he turns from his sin and does what is just and right.

15. కుదువసొమ్మును మరల అప్పగించుచు, తాను దొంగిలినదానిని మరల ఇచ్చివేసి పాపము జరిగింపకయుండి, జీవాధారములగు కట్టడలను అనుసరించినయెడల అతడు మరణము నొందక అవశ్యముగా బ్రదుకును.

15. He returns what was taken in pledge, pays back what he has stolen, and follows the statutes that give life, committing no iniquity. He will certainly live he will not die.

16. అతడు చేసిన పాపములలో ఏదియు అతని విషయమై జ్ఞాపకమునకు తేబడదు, అతడు నీతిన్యాయములను అనుసరించెను గనుక నిశ్చయముగా అతడు బ్రదుకును.

16. None of the sins he has committed will be counted against him. He has done what is just and right; he will certainly live.

17. అయినను నీ జనులు యెహోవా మార్గము న్యాయము కాదని యనుకొందురు; అయితే వారి ప్రవర్తనయే గదా అన్యాయమైనది?

17. 'Yet your people say, 'The behavior of the Lord is not right,' when it is their behavior that is not right.

18. నీతిమంతుడు తన నీతిని విడిచి, పాపము చేసిన యెడల ఆ పాపమునుబట్టి అతడు మరణము నొందును.

18. When a righteous man turns from his godliness and commits iniquity, he will die for it.

19. మరియు దుర్మార్గుడు తన దుర్మార్గతను విడిచి నీతిన్యాయములను అనుసరించినయెడల వాటినిబట్టి అతడు బ్రదుకును.

19. When the wicked turns from his sin and does what is just and right, he will live because of it.

20. యెహోవా మార్గము న్యాయము కాదని మీరనుకొనుచున్నారే; ఇశ్రాయేలీయులారా, మీలో ఎవని ప్రవర్తననుబట్టి వానికి శిక్ష విధించెదను.

20. Yet you say, 'The behavior of the Lord is not right.' House of Israel, I will judge each of you according to his behavior.'

21. మనము చెరలోనికి వచ్చిన పండ్రెండవ సంవత్సరము పదియవ నెల అయిదవ దినమున ఒకడు యెరూషలేములో నుండి తప్పించుకొని నాయొద్దకు వచ్చి పట్టణము కొల్ల పెట్టబడెనని తెలియజేసెను.

21. In the twelfth year of our exile, in the tenth month, on the fifth of the month, a refugee came to me from Jerusalem saying, 'The city has been defeated!'

22. తప్పించుకొనినవాడు వచ్చిన వెనుకటి సాయంత్రమున యెహోవా హస్తము నామీదికి వచ్చెను; ఉదయమున అతడు నాయొద్దకు రాకమునుపే యెహోవా నా నోరు తెరవగా పలుకుటకు నాకు శక్తి కలిగెను, అప్పటినుండి నేను మౌనిని కాకయుంటిని.

22. Now the hand of the LORD had been on me the evening before the refugee reached me, but the LORD opened my mouth by the time the refugee arrived in the morning; he opened my mouth and I was no longer unable to speak.

23. మరియయెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను

23. The word of the LORD came to me:

24. నరపుత్రుడా, ఇశ్రాయేలు దేశములో పాడైపోయిన ఆ యా చోట్లను కాపురమున్న వారు అబ్రాహాము ఒంటరియై యీ దేశమును స్వాస్థ్యముగా పొందెను గదా; అనేకులమైన మనకును ఈ దేశము స్వాస్థ్యముగా ఇయ్యబడదా అని అనుకొనుచున్నారు.

24. 'Son of man, the ones living in these ruins in the land of Israel are saying, 'Abraham was only one man, yet he possessed the land, but we are many; surely the land has been given to us for a possession.'

25. కాబట్టి వారికీ మాట ప్రకటనచేయుము ప్రభువగు యెహోవా సెలవిచ్చునదేమనగా రక్తము ఓడ్చి వేయక మాంసము భుజించు మీరు, మీ విగ్రహముల వైపు దృష్టియుంచు మీరు, నరహత్యచేయు మీరు, ఈ దేశమును స్వతంత్రించుకొందురా?

25. Therefore say to them, 'This is what the sovereign LORD says: You eat the meat with the blood still in it, pray to your idols, and shed blood. Do you really think you will possess the land?

26. మీరు ఖడ్గము నాధారము చేసికొను వారు, హేయక్రియలు జరిగించు వారు, పొరుగువాని భార్యను చెరుపువారు; మీవంటి వారు దేశమును స్వతంత్రించుకొందురా? నీవీలాగున వారికి చెప్పుము ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా

26. You rely on your swords and commit abominable deeds; each of you defiles his neighbor's wife. Will you possess the land?'

27. నా జీవముతోడు పాడైపోయిన స్థలములలో ఉండువారు ఖడ్గముచేత కూలుదురు, బయట పొలములో ఉండు వారిని నేను మృగములకు ఆహారముగా ఇచ్చెదను, కోటలలోనివారును గుహలలోనివారును తెగులుచేత చచ్చెదరు.
ప్రకటన గ్రంథం 6:8

27. 'This is what you must say to them, 'This is what the sovereign LORD says: As surely as I live, those living in the ruins will die by the sword, those in the open field I will give to the wild beasts for food, and those who are in the strongholds and caves will die of disease.

28. ఆ దేశమును నిర్జనముగాను పాడుగానుచేసి దాని బలాతిశయమును మాన్పించెదను, ఎవరును వాటిలో సంచరింపకుండ ఇశ్రాయేలీయుల మన్యములు పాడవును.

28. I will turn the land into a desolate ruin; her confident pride will come to an end. The mountains of Israel will be so desolate no one will pass through them.

29. వారు చేసిన హేయక్రియలన్నిటినిబట్టి వారి దేశమును పాడుగాను నిర్జనముగాను నేను చేయగా నేనే యెహోవానై యున్నానని వారు తెలిసికొందురు.

29. Then they will know that I am the LORD when I turn the land into a desolate ruin because of all the abominable deeds they have committed.'

30. మరియు నరపుత్రుడా; నీ జనుల గోడదగ్గరను ఇంటి ద్వారములందును నిలువబడి నిన్ను గూర్చి మాటలాడుదురు, ఒకరి నొకరు చూచిపోదము రండి, యెహోవాయొద్దనుండి బయలుదేరు మాట యెట్టిదో చూతము రండి అని చెప్పుకొనుచున్నారు.

30. 'But as for you, son of man, your people (who are talking about you by the walls and at the doors of the houses) say to one another, 'Come hear the word that comes from the LORD.'

31. నా జనులు రాదగిన విధముగా వారు నీయొద్దకు వచ్చి, నా జనులైనట్టుగా నీ యెదుట కూర్చుండి నీ మాటలు విందురు గాని వాటి ననుసరించి ప్రవర్తింపరు, వారు నోటితో ఎంతో ప్రేమ కనుపరచుదురు గాని వారి హృదయము లాభమును అపేక్షించుచున్నది.

31. They come to you in crowds, and they sit in front of you as my people. They hear your words, but do not obey them. For they talk lustfully, and their heart is set on their own advantage.

32. నీవు వారికి వాద్యము బాగుగా వాయించుచు మంచి స్వరము కలిగిన గాయకుడవుగా ఉన్నావు, వారు నీ మాటలు విందురు గాని వాటిని అనుసరించి నడుచుకొనరు.

32. Realize that to them you are like a sensual song, a beautiful voice and skilled musician. They hear your words, but they do not obey them.

33. అయినను ఆ మాట నెరవేరును, అది నెరవేరగా ప్రవక్త యొకడు తమ మధ్యనుండెనని వారు తెలిసికొందురు.

33. When all this comes true and it certainly will then they will know that a prophet was among them.'



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Ezekiel - యెహెఙ్కేలు 33 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

కాపలాదారుగా యెహెజ్కేలు విధి. (1-9) 
ప్రవక్త ఇజ్రాయెల్ ఇంటి కోసం అప్రమత్తమైన సంరక్షకుడిగా పనిచేస్తాడు. పాపులు ఎదుర్కొనే కష్టాలు మరియు ప్రమాదాల గురించి వారిని అప్రమత్తం చేయడం అతని ప్రాథమిక బాధ్యత. అతని కర్తవ్యం అతనిని జీవితాన్ని పొందేందుకు తమ మార్గాలను మార్చుకోమని దుష్టులను పురికొల్పుతుంది. ఈ కర్తవ్యాన్ని నిర్వర్తించడంలో విఫలమైనందున ఆత్మలు వారి మరణాన్ని ఎదుర్కొంటే, అతను అపరాధ భారాన్ని మోస్తాడు. పాపాన్ని సమర్థించే వారి జవాబుదారీతనం, పాపులను పొగిడి మరియు వారి ప్రస్తుత మార్గంలో వారు శాంతిని పొందుతారనే నమ్మకాన్ని పెంపొందించుకోండి. ప్రజలు తమ ఆధ్యాత్మిక విషయాలలో కంటే వారి ప్రాపంచిక వ్యవహారాలలో ఎంత ఎక్కువ జ్ఞానాన్ని ప్రదర్శిస్తారనేది ఆసక్తికరం. రాబోయే శత్రువుల గురించి హెచ్చరించడానికి వారు తమ ఇళ్లను మరియు సెంటినెల్స్‌ను రక్షించుకోవడానికి వాచ్‌మెన్‌లను నియమిస్తారు, అయినప్పటికీ శాశ్వతమైన ఆనందం లేదా ఆత్మకు బాధ కలిగించే విషయాల విషయానికి వస్తే, మంత్రులు తమ మాస్టర్ ఆజ్ఞకు కట్టుబడి మరియు సత్యమైన హెచ్చరికను అందించినప్పుడు వారు కోపం తెచ్చుకుంటారు. మెత్తగాపాడిన మాటల్లో మునిగితేలుతూ కొందరు నాశనాన్ని ఎదుర్కొంటారు.

అతను దైవిక ప్రభుత్వాన్ని సమర్థించవలసి ఉంటుంది. (10-20) 
దేవుని దయను కనుగొనడంలో ఆశ కోల్పోయిన వారికి, తన దయను విస్తరించడానికి దేవుని సంసిద్ధతను ధృవీకరిస్తూ గంభీరమైన ప్రకటన ఇవ్వబడింది. నగరం మరియు రాష్ట్రం యొక్క విధి మూసివేయబడి ఉండవచ్చు, కానీ ఇది వ్యక్తుల యొక్క అంతిమ విధిని నిర్ణయించదు. నీతిమంతులు నిజంగా జీవిస్తారని దేవుడు వారికి భరోసా ఇస్తాడు. ఏది ఏమైనప్పటికీ, నీతిమంతులుగా చెప్పుకునే అనేకులు తమ గర్వంతో కూడిన ఆత్మవిశ్వాసం కారణంగా నాశనానికి దారితీశారు. వారు తమ సొంత మంచితనంపై నమ్మకం ఉంచారు, మరియు వారి ఊహలో, వారు పాపంలో పడతారు. అయినప్పటికీ, పాపభరితమైన జీవితాన్ని గడిపిన వారు పశ్చాత్తాపపడి, తమ దుష్టమార్గాలను విడిచిపెట్టినట్లయితే, వారు మోక్షాన్ని పొందుతారు. దైవిక దయ యొక్క శక్తి ద్వారా లెక్కలేనన్ని విశేషమైన మరియు ఆశీర్వాద పరివర్తనలు తీసుకురాబడ్డాయి. ఒక వ్యక్తికి మరియు వారి పాపభరితమైన గతానికి మధ్య స్పష్టమైన విభజన ఉన్నప్పుడు, వారికి మరియు దేవునికి మధ్య విభజన ఉండదు.

యూదయ నిర్జనమైపోవడం. (21-29) 
ప్రాపంచిక సుఖాలన్నీ మాయమైనప్పుడు దేవునిపై ఆధారపడటాన్ని గుర్తించడంలో విఫలమైన వారు నిజంగా బోధించబడరు. కొందరు నిజమైన విశ్వాసుల కోసం ప్రత్యేకించబడిన ప్రత్యేక ఆశీర్వాదాలతో తమ సంబంధాన్ని నొక్కిచెప్పారు, అయినప్పటికీ వారి చర్యలు వారిని దేవుని విరోధులుగా వెల్లడిస్తున్నాయి. వారు అతని హెచ్చరికలకు లోబడి ఉన్నారని మరియు అంతకు మించి ఏమీ లేదని దేవుని సాక్ష్యం పేర్కొన్నప్పటికీ, వారు ఈ అసమంజసమైన ఊహను బలమైన విశ్వాసంగా లేబుల్ చేస్తారు.

ప్రవక్తలను అపహాస్యం చేసేవారిపై తీర్పులు. (30-33)
అనర్హమైన మరియు కళంకిత ఉద్దేశాలు తరచుగా ప్రజలను దేవుని వాక్యం విశ్వసనీయంగా ప్రకటించబడే సమావేశాలకు ఆకర్షిస్తాయి. కొందరు విమర్శించడానికి ఏదైనా కనుగొనాలనే ఉద్దేశ్యంతో వస్తారు, అయితే ఎక్కువ సంఖ్యలో ఉత్సుకతతో లేదా అలవాటు నుండి బయటపడతారు. వ్యక్తులు తమ హృదయాల పరివర్తనను అనుభవించడం సాధ్యమవుతుంది. అయితే, ప్రజలు సందేశాన్ని వినడానికి లేదా విస్మరించడానికి ఎంచుకున్నా, వారి మధ్య దేవుని సేవకుడు ఉన్నాడని ఫలితం వెల్లడిస్తుంది. తమ దరఖాస్తు ద్వారా ఆశీర్వాదాల విలువను గుర్తించడంలో విఫలమైన వారు వారు లేకపోవడం ద్వారా వారి విలువను సరిగ్గా అర్థం చేసుకోవచ్చు.



Shortcut Links
యెహెఙ్కేలు - Ezekiel : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |