Turn Off
21st Century KJV
A Conservative Version
American King James Version (1999)
American Standard Version (1901)
Amplified Bible (1965)
Apostles' Bible Complete (2004)
Bengali Bible
Bible in Basic English (1964)
Bishop's Bible
Complementary English Version (1995)
Coverdale Bible (1535)
Easy to Read Revised Version (2005)
English Jubilee 2000 Bible (2000)
English Lo Parishuddha Grandham
English Standard Version (2001)
Geneva Bible (1599)
Hebrew Names Version
Hindi Bible
Holman Christian Standard Bible (2004)
Holy Bible Revised Version (1885)
Kannada Bible
King James Version (1769)
Literal Translation of Holy Bible (2000)
Malayalam Bible
Modern King James Version (1962)
New American Bible
New American Standard Bible (1995)
New Century Version (1991)
New English Translation (2005)
New International Reader's Version (1998)
New International Version (1984) (US)
New International Version (UK)
New King James Version (1982)
New Life Version (1969)
New Living Translation (1996)
New Revised Standard Version (1989)
Restored Name KJV
Revised Standard Version (1952)
Revised Version (1881-1885)
Revised Webster Update (1995)
Rotherhams Emphasized Bible (1902)
Tamil Bible
Telugu Bible (BSI)
Telugu Bible (WBTC)
The Complete Jewish Bible (1998)
The Darby Bible (1890)
The Douay-Rheims American Bible (1899)
The Message Bible (2002)
The New Jerusalem Bible
The Webster Bible (1833)
Third Millennium Bible (1998)
Today's English Version (Good News Bible) (1992)
Today's New International Version (2005)
Tyndale Bible (1534)
Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537)
Updated Bible (2006)
Voice In Wilderness (2006)
World English Bible
Wycliffe Bible (1395)
Young's Literal Translation (1898)
Telugu Bible Verse by Verse Explanation
పరిశుద్ధ గ్రంథ వివరణ
Telugu Bible Commentary
Telugu Reference Bible
1. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను
38,39 అధ్యాయాల్లో ఒకే విషయం ఉంది – శక్తివంతమైన ఉత్తర రాజ్యాలు ఇస్రాయేల్ పై చేసే దాడి. ఈ దాడి “చాలా రోజుల తరువాత”, అంటే ఇస్రాయేల్‌వారు తమ స్వదేశంలో తిరిగి సమకూడిన తరువాత వస్తుంది. (యెహెఙ్కేలు 38:8). 37వ అధ్యాయం వెల్లడించిన రీతిగా ఇస్రాయేల్‌వారంతా తిరిగి వచ్చాక ఇది జరుగుతుందని అర్థం అవుతున్నది. ఏయే జాతులు దాడి చేస్తాయో, ఈ దాడి ఎప్పుడు జరుగుతుందో ఖచ్చితంగా నిశ్చయించుకోవడం కష్టంగా ఉంది. ఈ రచయిత కేవలం ఇదంతా ఎలా జరగవచ్చునో అభిప్రాయపడి మాత్రమే చెప్పగలడు.
2. నరపుత్రుడా, మాగోగు దేశపువాడగు గోగు, అనగా రోషునకును మెషెకునకును తుబాలునకును అధిపతియైన వానితట్టు అభిముఖుడవై అతని గూర్చి ఈ మాట యెత్తి ప్రవచింపుముప్రకటన గ్రంథం 20:8
“మాగోగు”– గోగు అధిపతిగా గల దేశం. ఆదికాండము 10:2 లో మాగోగుకు మెషెకు, తుబాల్‌లతో సంబంధం ఉన్నట్టు కనిపిస్తున్నది. ఈ ప్రజలంతా యాపెతు సంతతి. కనానుకు బాగా ఉత్తరాన స్థిరపడ్డారు. దాదాపు 2000 సంవత్సరాల క్రితం చరిత్రకారుడు జోసిఫస్ మాగోగు అంటే నల్ల సముద్రానికి ఉత్తరంగా కొన్ని భాగాల్లో నివసించే సిథియ జాతివారనే అనాగరిక ప్రజలు అని నిశ్చయించి రాశాడు. “రోష్”– అంటే గోగు ప్రజలు నివసించే ప్రాంతం అని అర్థం (బైబిల్లో మరెక్కడా ఈ పేరు కనిపించదు). రోష్ అనే శబ్దం రష్యాలాగా ధ్వనిస్తూ ఉందని వేరే చెప్పనక్కర్లేదు. అయితే ఇక్కడ చెప్పబడినది రష్యా గురించే అని స్పష్టమైన రుజువు లేకపోయినా ఇది రష్యా కాదు అని చెప్పవీలు లేదు. “మెషెకు, తుబాల్”– ఆదికాండము 10:2. ఇవి ప్రస్తుతం టర్కీ దేశంగా పిలవబడుతున్న భూభాగం తూర్పున నివసించిన తెగలు. ఇవి ఉత్తర దిక్కుకు వలసపోయి ఉండవచ్చు. “గోగు”– దేశాల కూటమికి ఇతడు నాయకత్వం వహిస్తున్నాడు. ప్రకటన 20:8లో గోగు, మాగోగు మొత్తంమీద తిరుగుబాటు చేసిన ప్రపంచ దేశాలన్నిటికీ ప్రతినిధులుగా ఉన్నట్టు కనిపిస్తున్నాయి. కానీ ఇక్కడ అలా కానట్టు ఉంది.
3. ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా రోషునకును మెషెకు నకును తుబాలునకును అధిపతియగు గోగూ, నేను నీకు విరోధినై యున్నాను.
“నీకు వ్యతిరేకిని”– వారి ప్రవర్తన దేవునికీ ఆయన ప్రజలకూ వ్యతిరేకంగా ఉంది. అందువల్ల ఆయన వారికి వ్యతిరేకం అయ్యాడు. వారి గుణానికీ ఉద్దేశాలకూ క్రియలకూ ఆయన వ్యతిరేకి.
4. నేను నిన్ను వెనుకకు త్రిప్పి నీ దవుడలకు గాలములు తగిలించి, నిన్నును నీ సైన్యమంతటిని గుఱ్ఱములను నానావిధములైన ఆయుధములు ధరించు నీ రౌతులనందరిని, కవచములును డాళ్లును ధరించి ఖడ్గములు చేతపట్టుకొను వారినందరిని, మహాసైన్యముగా బయలు దేరదీసెదను.
“గాలాలు”– వ 16; యెహెఙ్కేలు 39:2. ఇది ఆ దేశాలపై దేవుని తిరుగులేని ఆధిపత్యాన్ని సూచిస్తూవుంది. దానియేలు 4:35 పోల్చి చూడండి.
5. నీతో కూడిన పారసీకదేశపు వారిని కూషీయులను పూతువారినందరిని, డాళ్లను శిరస్త్రాణములను ధరించు వారినందరిని నేను బయలుదేర దీసెదను.
పర్షియా అంటే నేటి ఇరాన్. బైబిల్లో రెండు కూషు దేశాలు కనిపిస్తాయి – ఇప్పటి ఇరాక్ ప్రాంతంలో ఉన్న పురాతన కూషు, రెండోది సాధారణంగా ఇతియోపియాతో సంబంధమైన ప్రాంతం. పూత్‌లు కూడా రెండు ఉన్నట్టున్నాయి. ఒకటి ఇప్పటి లిబియా దేశం; రెండోది ఆసియాలోని పురాతన కూషు దగ్గర ఉన్న పూత్.
6. గోమెరును అతని సైన్యమంతయును ఉత్తర దిక్కులలోనుండు తోగర్మాయును అతని సైన్యమును జనములనేకములు నీతోకూడ వచ్చును.
“గోమెర్”– ఆదికాండము 10:3. నల్ల సముద్రానికి ఉత్తరాన (ఇప్పటి రష్యా దేశంలో లేక దగ్గర ఉన్న భాగంలో) నివసించే ప్రజలు. “ఉత్తర దిక్కున దూరంగా”– యెహెఙ్కేలు 38:15; యెహెఙ్కేలు 39:2. అంటే ఇస్రాయేల్‌కు ఉత్తరాన దూరంగా ఉన్న ప్రాంతాలు. యెహెజ్కేలు కాలంలో తెలిసిన జాతుల పేర్లు ఉపయోగిస్తూ రష్యా నాయకత్వంలో ఉత్తర ప్రాంతం దేశాల కూటమిని దేవుడు సూచించదలచుకుంటే ఇంతకన్నా స్పష్టంగా చెప్పడం సాధ్యంగా ఉందా? “బేత్ తోగర్మా”– దీన్ని ఇప్పుడు ఆర్మీనియా అంటారు (ఇప్పటి రష్యా దేశానికి దక్షిణంగా ఉన్నది).
7. నీవు సిధ్దముగా ఉండుము, నీవు సిద్ధపడి నీతోకూడ కలిసిన సమూహమంతటిని సిద్ధపరచుము, వారికి నీవు కావలియై యుండవలెను.
ఉత్తర ప్రజల బ్రహ్మాండమైన కూటమికి నాయకుడైన గోగును ఉద్దేశించి చెప్పిన మాటలు.
8. చాలదినములైన తరువాత నీవు శిక్షనొందుదువు; సంవత్సరముల అంతములో నీవు ఖడ్గమునుండి తప్పించుకొని, ఆ యా జనములలో చెదరిపోయి యెడతెగక పాడుగా ఉన్న ఇశ్రాయేలీయుల పర్వతములమీద నివసించుటకై మరల సమకూర్చబడిన జనులయొద్దకును, ఆ యా జనులలోనుండి రప్పించబడి నిర్భయముగా నివసించు జనులందరియొద్దకును నీవు వచ్చెదవు.
“అనేక రోజుల తరువాత”– ఇవన్నీ ఎంతకాలం తరువాత సంభవిస్తాయో చెప్పలేము. 3,5,6 వచనాల్లో కనిపించే జనాలు ఇంతవరకు ఇస్రాయేల్ పై దాడి చెయ్యలేదు. ఇది ఈ యుగాంతంలోనో, వెయ్యేళ్ళ పరిపాలన అంతంలోనో జరుగుతుంది (ప్రకటన గ్రంథం 20:8). ఇవన్నీ ఈ యుగాంతంలో జరుగుతాయని ఈ రచయిత అభిప్రాయం.
9. గాలి వాన వచ్చినట్లును మేఘము కమ్మినట్లును నీవు దేశము మీదికి వచ్చెదవు, నీవును నీ సైన్యమును నీతోకూడిన బహు జనమును దేశముమీద వ్యాపింతురు.
10. ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా ఆ కాలమందు నీ మనస్సులో అభిప్రాయములు పుట్టును,
“మనసు”– గోగు మనసులో పుట్టే ఆలోచనలే దేవుడు అతణ్ణి ఇస్రాయేల్‌కు ఈడ్చుకువచ్చే గాలం (వ 4). సామెతలు 21:1 పోల్చి చూడండి.
11. నీవు దురాలోచనచేసి ఇట్లను కొందువు నేను ప్రాకారములులేని గ్రామములుగల దేశముమీదికి పోయెదను, ప్రాకారములును అడ్డగడియలును గవునులునులేని దేశము మీదికి పోయెదను, నిమ్మళముగాను నిర్భయముగాను నివసించువారి మీదికి పోయెదను.
ఈ వచనం, 8,14 వచనాలు ఇస్రాయేల్‌వారు ఇప్పుడు అనుభవిస్తున్న దానికంటే మరింత శాంతి భద్రతలు ఉండే కాలాన్ని సూచిస్తున్నాయి.
12. వారిని దోచుకొని కొల్లసొమ్ముగా పట్టుకొనుటకై, పూర్వము పాడై మరల నివసింపబడిన స్థలములమీదికి తిరిగి పోయెదను, ఆ యా జనములలోనుండి సమకూర్చబడి, పశువులును సరకులును గలిగి, భూమి నట్టనడుమ నివసించు జనుల మీదికి తిరిగి పోయెదను.
ఇస్రాయేల్ ధనిక దేశం కాదు. గొప్పగొప్ప దేశాలు ఆశపడి కొల్లగొట్టేందుకు వారు బయలుదేరేలా చేసేవేవీ దానిలో ఎక్కడా ఉన్నట్టు లేదు. ఇస్రాయేల్ దేశంలోని ఎక్కువ భాగ్యం మృత సముద్రంలో ఉంది. ఎందుకంటే కోటాను కోట్ల రూపాయల విలువ చేసే ఖనిజాలూ ఇతర పదార్థాలూ దాన్లో ఉన్నాయి. మరి ముఖ్యంగా ఇప్పుడు ప్రపంచంలోని చమురు నిల్వలు అత్యధికంగా ఉన్న ప్రాంతం దగ్గర ఇస్రాయేల్ ఒక ప్రధానమైన దేశం. ఈ వచనాల్లో “కొల్లసొమ్ము” అనే పదం యెహెజ్కేలు కాలానికి సంబంధించినది. అయితే ఈ కాలానికి తగినట్టు, ఇస్రాయేల్‌ను పట్టుకోవడం మూలంగా పశువులూ సరుకులూ కాక వేరు రకం ప్రయోజనం ఉంటుందనీ అది పశ్చిమ ఆసియాను వశపరచుకోవడమనీ చెప్పవచ్చునేమో.
13. సెబావారును దదానువారును తర్షీషు వర్తకులును కొదమసింహముల వంటివారైన దానివారందరును నిన్ను చూచిసొమ్ము దోచుకొనుటకు వచ్చితివా? దోపు దోచుకొనుటకు సైన్యము సమకూర్చితివా? బహుగా దోపు దోచుకొని, వెండి బంగారములను పశువులను సరకులను పట్టుకొని పోవుటకు చాల దోపుడు దోచుకొనుటకు వచ్చితివా? అని నిన్నడుగుదురు.
గోగు ఇస్రాయేల్‌దేశం పైకి వచ్చేటప్పుడు అతణ్ణి ప్రశ్నించేవారు లేకపోరు. షెబా, దదాను అరేబియా ప్రాంతంలోనివి. “తర్షీషు”– బహుశా స్పెయిన్ దక్షిణ తీరాన ఉన్న ప్రాంతం కావచ్చు. బైబిల్లో తర్షీషుకన్న పశ్చిమ దిశలో ఉన్న ప్రాంతం ఏదీ పేర్కొనబడలేదు. అది, కొదమ సింహాలవంటివాళ్ళు అంటే బహుశా పశ్చిమ దేశాలు కావచ్చు. అయితే ఇలా అనుకొనేందుకు ఈ వచనాల్లో స్పష్టమైన రుజువు లేదు.
14. కాగా నరపుత్రుడా, ప్రవచనమెత్తి గోగుతో ఇట్లనుము ప్రభువగు యెహోవా సెలవిచ్చునదేమనగా నా జనులగు ఇశ్రాయేలీయులు నిర్భయముగా నివసించు కాలమున నీవు తెలిసికొందువుగదా?
“గమనిస్తావు”– ఇస్రాయేల్‌ను ఆక్రమించు కునేందుకు ఇదే అదను అనుకుంటాడు గోగు.
15. ఉత్తర దిక్కున దూర ముననున్న నీ స్థలములలోనుండి నీవును నీతోకూడ జనములనేకములును గుఱ్రములెక్కి బహు విస్తారమైన సైన్యముగా కూడి వచ్చి
16. మేఘము భూమిని కమ్మినట్లు ఇశ్రాయేలీయులగు నా జనులమీద పడెదరు; అంత్య దినములందు అది సంభవించును, అన్యజనులు నన్ను తెలిసికొనునట్లు నిన్నుబట్టి వారి యెదుట నన్ను నేను పరిశుద్ధ పరచుకొను సమయమున, గోగూ, నేను నా దేశము మీదికి నిన్ను రప్పించెదను.
గోగును ఇస్రాయేల్‌కు తెచ్చేది దేవుడే అని మరో సారి గమనించండి.
17. ప్రభువగు యెహోవా సెలవిచ్చునదేమనగా నిన్ను వారిమీదికి రప్పించెదనని పూర్వమందు ఏటేట ప్రవచించుచు వచ్చిన ఇశ్రాయేలీయుల ప్రవక్తలైన నా సేవకులద్వారా నేను సెలవిచ్చినమాట నిన్నుగూర్చినదే గదా?
యెహెజ్కేలు కాలం వరకు బైబిల్లోని మరి ఏ పుస్తకంలోనూ గోగు అనే పేరు కనబడలేదు. ఒకవేళ ప్రవక్తలు ఇతణ్ణి వేరే పేరుతో (అష్షూరువాడు అనో, ఉత్తర రాజు అనో) పిలిచారేమో. అయితే దీన్ని ఖచ్చితంగా చెప్పలేము. ఈ వచనం బైబిల్లో అంతకుముందు రాసివుండని భవిష్యద్వాక్కును గురించి ఉండవచ్చు. దీన్ని గురించి యెహెజ్కేలు తెలుసుకొని ఉండవచ్చు.
18. ఆ దినమున, గోగు ఇశ్రాయేలీయుల దేశము మీదికి రాబోవు ఆ దినమున, నా కోపము బహుగా రగులుకొనును; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు
“కోపాగ్ని”– సంఖ్యాకాండము 25:3; కీర్తనల గ్రంథము 90:7-11 నోట్స్.
19. కాబట్టి నేను రోషమును మహా రౌద్రమును గలిగిన వాడనై యీలాగు ప్రమాణముచేసితిని. ఇశ్రాయేలీయుల దేశములో మహాకంపము పుట్టును.ప్రకటన గ్రంథం 11:13
గోగు సైన్యాల వినాశనం కొంత భాగం దేవుని శక్తిమూలంగా జరిగేదీ, మిగిలిన భాగం ఖడ్గం, రక్తపాతం వల్ల జరిగేది (21,22వ). ఖడ్గం రప్పించడమంటే ఎదురు నిలిచి పోరాడే సైన్యాలను తీసుకురావడం అనవచ్చు. వ 13; యెషయా 34:5-6; యిర్మియా 9:16; యిర్మియా 12:12; యిర్మియా 25:29 పోల్చిచూడండి.
20. సముద్రపు చేపలును ఆకాశపక్షులును భూజంతువులును భూమిమీద ప్రాకు పురుగులన్నియు భూమిమీదనుండు నరులందరును నాకు భయపడి వణకుదురు, పర్వతములు నాశనమగును, కొండపేటులు పడును, గోడలన్నియు నేలపడును
21. నా పర్వతములన్నిటిలో అతని మీదికి ఖడ్గము రప్పించెదను, ప్రతివాని ఖడ్గము వాని సహోదరునిమీద పడును; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.
22. తెగులు పంపి హత్యకలుగజేసి అతనిమీదను అతని సైన్యపు వారి మీదను అతనితో కూడిన జనములనేకముల మీదను ప్రళయమైన వానను పెద్ద వడగండ్లను అగ్నిగంధకములను కురిపించి నేను అతనితో వ్యాజ్యెమాడుదును.ప్రకటన గ్రంథం 8:7, ప్రకటన గ్రంథం 14:10, ప్రకటన గ్రంథం 20:10, ప్రకటన గ్రంథం 21:8
23. నేను యెహోవానై యున్నానని అన్యజనులు అనేకులు తెలిసికొనునట్లు నేను ఘనత వహించి నన్ను పరిశుద్ధపరచుకొని వారి యెదుట నన్ను తెలియపరచుకొందును.
ఇది ఆ ఘోర వినాశనంలో దేవుడు నెరవేర్చుకునే మంచి ఉద్దేశాలలో ఒకటి. యెహెఙ్కేలు 39:7 మొ।। చూడండి.