Ezekiel - యెహెఙ్కేలు 4 | View All
Study Bible (Beta)

1. నరపుత్రుడా, పెంకు ఒకటి తీసికొనివచ్చి నీ ముందర ఉంచుకొని యెరూషలేము పట్టణపు రూపమును దాని మీద వ్రాయుము.

1. God said, 'Mortal man, get a brick, put it in front of you, and scratch lines on it to represent the city of Jerusalem.

2. మరియు అది ముట్టడి వేయబడినట్లును దానియెదుట బురుజులను కట్టినట్లును దిబ్బ వేసినట్లును దాని చుట్టునున్న ప్రాకారములను కూలగొట్టు యంత్రములున్నట్లును నీవు వ్రాయుము.

2. Then, to represent a siege, put trenches, earthworks, camps, and battering rams all around it.

3. మరియు ఇనుపరేకొకటి తెచ్చి, నీకును పట్టణమునకును మధ్య ఇనుప గోడగా దానిని నిలువబెట్టి, నీ ముఖ దృష్టిని పట్టణము మీద ఉంచుకొనుము; పట్టణము ముట్టడి వేయబడినట్లుగా ఉండును, నీవు దానిని ముట్టడివేయువాడవుగా ఉందువు; అది ఇశ్రాయేలీయులకు సూచనగా ఉండును.

3. Take an iron pan and set it up like a wall between you and the city. Face the city. It is under siege, and you are the one besieging it. This will be a sign to the nation of Israel.

4. మరియు నీ యెడమప్రక్కను పండుకొనియుండి ఇశ్రాయేలువారి దోషమును దానిమీద మోపవలెను; ఎన్ని దినములు నీవు ఆ తట్టు పండుకొందువో అన్ని దినములు నీవు వారి దోషమును భరింతువు.

4. 'Then lie down on your left side, and I will place on you the guilt of the nation of Israel. For 390 days you will stay there and suffer because of their guilt. I have sentenced you to one day for each year their punishment will last.

5. ఇశ్రాయేలు వారి దోషమును నీవు భరించునట్లుగా వారు దోషము చేసిన సంవత్సరముల లెక్కచొప్పున నీకు మూడువందల తొంబది దినములు నిర్ణయించియున్నాను.

5. (SEE 4:4)

6. ఆ దినములు గడచిన తరువాత కుడిప్రక్కను పండుకొనియుండి నలువది దినములు యూదావారి దోషమును భరింపవలెను, సంవత్సర మొకటింటికి ఒక దినము చొప్పున నేను నిర్ణయించి యున్నాను.

6. When you finish that, turn over on your right side and suffer for the guilt of Judah for forty days---one day for each year of their punishment.

7. ఈలాగు నీవుండగా యెరూషలేము ముట్టడివేయబడినట్లు తేరిచూచుచు, చొక్కాయిని తీసివేసిన బాహువు చాపి దానినిగూర్చి ప్రకటింపవలెను.

7. 'Fix your eyes on the siege of Jerusalem. Shake your fist at the city and prophesy against it.

8. పట్టణము ముట్టడివేయబడినట్లుండు దినములు నీవు రెండవ ప్రక్కను తిరుగక అదేపాటున ఉండునట్లు నిన్నుకట్లతో బంధింతును.

8. I will tie you up so that you cannot turn from one side to the other until the siege is over.

9. మరియు నీవు గోధుమలును యవలును కాయధాన్యములును చోళ్లును సజ్జలును తెల్ల జిలకరను తెచ్చుకొని, యొక పాత్రలో ఉంచి, నీవు ఆ ప్రక్కమీద పండుకొను దినముల లెక్కచొప్పున రొట్టెలు కాల్చుకొనవలెను, మూడువందల తొంబది దినములు నీవు ఈలాగున భోజనము చేయుచు రావలెను;

9. 'Now take some wheat, barley, beans, peas, millet, and spelt. Mix them all together and make bread. That is what you are to eat during the 390 days you are lying on your left side.

10. నీవు తూనికె ప్రకారము, అనగా దినమొకటింటికి ఇరువది తులముల యెత్తుచొప్పున భుజింపవలెను, వేళవేళకు తినవలెను,

10. You will be allowed eight ounces of bread a day, and it will have to last until the next day.

11. నీళ్లు కొలప్రకారము అరపడిచొప్పున ప్రతిదినము త్రాగవలెను, వేళవేళకు త్రాగవలెను;

11. You will also have a limited amount of water to drink, two cups a day.

12. యవల అప్పములు చేసి వారు చూచుచుండగా దానిని మనుష్యమలముతో కాల్చి భుజింపవలెను;

12. You are to build a fire out of dried human excrement, bake bread on the fire, and eat it where everyone can see you.'

13. నేను వారిని తోలివేయు జనములలో ఇశ్రాయేలీయులు ఈ ప్రకారము అపవిత్రమైన ఆహారమును భుజింతురని యెహోవా నాకు సెలవిచ్చెను.

13. The LORD said, 'This represents the way the Israelites will have to eat food which the Law forbids, when I scatter them to foreign countries.'

14. అందుకు అయ్యో, ప్రభువా, యెహోవా, నేనెన్నడును అపవిత్రత నొందినవాడను కానే, బాల్యమునుండి నేటి వరకును చచ్చినదానినైనను మృగములు చీల్చినదానినైనను నేను తినినవాడను కానే, నిషిద్ధమైన మాంసము నా నోట ఎన్నడును పడలేదే అని నేననగా
అపో. కార్యములు 10:14

14. But I replied, 'No, Sovereign LORD! I have never defiled myself. From childhood on I have never eaten meat from any animal that died a natural death or was killed by wild animals. I have never eaten any food considered unclean.'

15. ఆయన చూడుము, మనుష్యమలమునకు మారుగా నీకు గోమలము నేను నిర్ణయించియున్నాను; దీనితో నీవు నీ భోజనము సిద్ధ పరుచుకొనుమని సెలవిచ్చి

15. So God said, 'Very well. I will let you use cow dung instead, and you can bake your bread on that.'

16. నరపుత్రుడా, ఇదిగో యెరూషలేములో రొట్టెయను ఆధారమును నేను లేకుండ చేసినందున వారు తూనికె ప్రకారముగా బహు చింతతో రొట్టె భుజింతురు, నీళ్లు కొలచొప్పున త్రాగుచు విస్మయ మొందుదురు.

16. And he added, 'Mortal man, I am going to cut off the supply of bread for Jerusalem. The people there will be distressed and anxious as they measure out the food they eat and the water they drink.

17. అన్నపానములు లేకపోయినందున వారు శ్రమనొంది విభ్రాంతిపడి యొకనినొకడు చూచుచు తాము కలుగజేసికొనిన దోషమువలన నశించిపోవుదురు.

17. They will run out of bread and water; they will be in despair, and they will waste away because of their sins.'



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Ezekiel - యెహెఙ్కేలు 4 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

జెరూసలేం ముట్టడి. (1-8) 
సింబాలిక్ చర్యల ద్వారా జెరూసలేం ముట్టడిని తెలియజేయడానికి ప్రవక్త పని చేయబడ్డాడు. విగ్రహారాధనను ప్రవేశపెట్టినప్పటి నుండి సంవత్సరాలకు ప్రతీకగా భావించబడేంత వరకు ఎడమ వైపుకు ఆనుకుని ఉండమని అతనికి సూచించబడింది. జెరూసలేం యొక్క రాబోయే విధ్వంసం గురించి ప్రవక్త తన ప్రజలకు తెలియజేసిన సందేశం, ఒకప్పుడు సంపన్నమైన నగరం యొక్క పతనానికి పాపం ప్రధాన ఉత్ప్రేరకం అని నొక్కి చెప్పడం లక్ష్యంగా పెట్టుకుంది.

కరవు నివాసులు బాధపడతారు. (9-17)
ఎజెకిల్ యొక్క జీవనోపాధి ధాన్యం మరియు పప్పుల ముతక మిశ్రమం నుండి రూపొందించబడిన రొట్టెని కలిగి ఉంటుంది, ఇది తీవ్రమైన కొరత సమయంలో తప్ప అరుదుగా వినియోగించబడే ఒక రకమైన జీవనోపాధి. దీని నుండి, ముట్టడి మరియు బందిఖానాలో యూదులు అనుభవించే తీవ్ర కష్టాలను ఇది సూచిస్తుంది. యెహెజ్కేలు, "ప్రభూ, నేను సుఖకరమైన జీవితానికి అలవాటు పడ్డాను మరియు అలాంటి పరిస్థితులను ఎప్పుడూ భరించాల్సిన అవసరం లేదు" అని ఫిర్యాదు చేయలేదు. బదులుగా, అతను తోరా యొక్క ఆహార నియమాలకు ఖచ్చితంగా కట్టుబడి, మనస్సాక్షికి అనుగుణంగా జీవించాడని అతను ధృవీకరించాడు.
కష్టాలను ఎదుర్కొన్నప్పుడు, మనం తప్పు చేయడం యొక్క సారూప్యతను కూడా నిలకడగా మానుకున్నామని మన హృదయాలు సాక్ష్యమివ్వగలిగితే అది నిజంగా భరోసా ఇస్తుంది. ఇది పాపం యొక్క విధ్వంసక పరిణామాలను నొక్కి చెబుతుంది మరియు అతని తీర్పులలో దేవుని నీతిని ధృవీకరిస్తుంది. వారి సమృద్ధి విలాసాలు మరియు అదనపు ఖర్చుతో వృధా చేయబడింది మరియు న్యాయమైన పర్యవసానంగా, వారు ఇప్పుడు కరువుతో బాధపడుతున్నారు. ప్రజలు సమృద్ధిగా ఉన్న సమయాల్లో కృతజ్ఞతతో దేవుణ్ణి సేవించడంలో విఫలమైనప్పుడు, దేవుడు వారిని బానిసత్వానికి గురి చేయవచ్చు మరియు కష్టాలను ఎదుర్కొంటాడు.



Shortcut Links
యెహెఙ్కేలు - Ezekiel : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |