Turn Off
21st Century KJV
A Conservative Version
American King James Version (1999)
American Standard Version (1901)
Amplified Bible (1965)
Apostles' Bible Complete (2004)
Bengali Bible
Bible in Basic English (1964)
Bishop's Bible
Complementary English Version (1995)
Coverdale Bible (1535)
Easy to Read Revised Version (2005)
English Jubilee 2000 Bible (2000)
English Lo Parishuddha Grandham
English Standard Version (2001)
Geneva Bible (1599)
Hebrew Names Version
Hindi Bible
Holman Christian Standard Bible (2004)
Holy Bible Revised Version (1885)
Kannada Bible
King James Version (1769)
Literal Translation of Holy Bible (2000)
Malayalam Bible
Modern King James Version (1962)
New American Bible
New American Standard Bible (1995)
New Century Version (1991)
New English Translation (2005)
New International Reader's Version (1998)
New International Version (1984) (US)
New International Version (UK)
New King James Version (1982)
New Life Version (1969)
New Living Translation (1996)
New Revised Standard Version (1989)
Restored Name KJV
Revised Standard Version (1952)
Revised Version (1881-1885)
Revised Webster Update (1995)
Rotherhams Emphasized Bible (1902)
Tamil Bible
Telugu Bible (BSI)
Telugu Bible (WBTC)
The Complete Jewish Bible (1998)
The Darby Bible (1890)
The Douay-Rheims American Bible (1899)
The Message Bible (2002)
The New Jerusalem Bible
The Webster Bible (1833)
Third Millennium Bible (1998)
Today's English Version (Good News Bible) (1992)
Today's New International Version (2005)
Tyndale Bible (1534)
Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537)
Updated Bible (2006)
Voice In Wilderness (2006)
World English Bible
Wycliffe Bible (1395)
Young's Literal Translation (1898)
Telugu Bible Verse by Verse Explanation
పరిశుద్ధ గ్రంథ వివరణ
Telugu Bible Commentary
Telugu Reference Bible
1. మనము చెరలోనికి వచ్చిన యిరువదియైదవ సంవత్సరము మొదటి నెల పదియవ దినమున, అనగా పట్టణము కొల్లపోయిన పదునాలుగవ సంవత్సరమున ఆ దినముననే యెహోవా హస్తము నా మీదికి రాగా ఆయన నన్ను పట్టణమునకు తోడుకొని పోయెను.
ఇక్కడినుంచి 48వ అధ్యాయంవరకు ఒక భాగం. ఇందులో రాసి ఉన్నదంతా క్రీ.పూ. 573లో వచ్చిన దర్శనంలోని విషయాలు. యూదాప్రజలు కొందరు పాతికేళ్ళనుంచి ప్రవాసంలో ఉన్నారు. జెరుసలంలోని దేవాలయం పదమూడేళ్ళ క్రితం ధ్వంసం అయింది. ఇప్పుడు తన దర్శనంలో యెహెజ్కేలు ఒక క్రొత్త ఆలయాన్ని చూస్తున్నాడు. అప్పటినుంచి ఇప్పటిదాకా ఈ అధ్యాయాలు యూద, క్రైస్తవ వ్యాఖ్యాతలను తబ్బిబ్బు చేశాయి. వీటిని అర్థం చేసుకునేందుకు వేరువేరు వివరణలను పండితులు ఇచ్చారు. (1) ఈ అధ్యాయాల్లోని వర్ణన అంతా క్రొత్త ఒడంబడిక సంఘానికి దృష్టాంతమనీ, ఇందులో కేవలం ఆధ్యాత్మికమైన పాఠాలు మాత్రమే ఉన్నాయనీ కొందరి అభిప్రాయం. (2) ఇస్రాయేల్‌వారు తమ స్వదేశం చేరుకున్న తరువాత దేవాలయాన్నీ, నగరాన్నీ ఎలా కట్టాలో ఆదేశాలు ఇందులో ఉన్నాయనీ, అయితే వారింకా దీనికి పూనుకోలేదనీ మరి కొందరి అభిప్రాయం. (3) ఈ అధ్యాయాలు భావికాలంలో ఈ భూమిమీద క్రీస్తు పరిపాలనను సూచిస్తున్నాయనీ, ఆయన తిరిగి వచ్చి తన రాజ్యాన్ని స్థాపించిన తరువాత తన ప్రజలు కట్టబోయే నగరం, ఆలయం గురించి ఇక్కడ వివరించబడిందని మరి కొందరి అభిప్రాయం. (4) ఈ అధ్యాయాలు భావికాలంలో క్రీస్తు తిరిగి వచ్చాక ప్రత్యక్షం కాబోయే దేవుని రాజ్యాన్ని సూచిస్తున్నాయనీ, యూదులకు, చిరపరిచితం అయిన ఆరాధన క్రమాలు మొదలైన వాటిని విశదీకరించే మాటలు ఉపయోగిస్తున్నాయనీ అయితే ప్రస్తుతం మనం చెప్పలేని విధానాల్లో ఇదంతా నెరవేరుతుందనీ మరికొందరి అభిప్రాయం. ఈ భవిష్యద్వాక్కులను వివరంగా పరిశీలించి చూస్తే పై వివరణలన్నిటిలోనూ చిక్కులు ఉన్నాయి. ఈ రచయిత అభిప్రాయమేమంటే ఈ అధ్యాయాల్లో రాసి ఉన్నదంతా భవిష్యత్తులో అక్షరాలా నెరవేరుతుంది. అయితే అక్షరాలా జరుగుతుందను కున్నాం కాబట్టి ఆధ్యాత్మికంగా దీన్లో ఏమీ పాఠాలు లేవు అనుకోకూడదు. నిర్గమ 25–30 అధ్యాయాల్లో ఆరాధన గుడారం గురించిన వివరాలు పోల్చిచూడండి. ఆ కాలంలో అక్షరాలా అలాంటి గుడారాన్ని నిర్మించడం జరిగింది. అయితే దాని భాగాలన్నీ క్రీస్తునూ ఆధ్యాత్మికమైన ఆరాధననూ తెలియజేస్తూ ఉన్నాయి. ఈ భూమిమీద క్రీస్తు రాబోయే పరిపాలన కాలంతో కూడా ఇలాంటిదే మరొకటి ఉండడం అసాధ్యం అనుకోకూడదు. “యెహోవా చెయ్యి”– యెహెఙ్కేలు 1:3; యెహెఙ్కేలు 3:14, యెహెఙ్కేలు 3:22; యెహెఙ్కేలు 8:1; యెహెఙ్కేలు 33:22; యెహెఙ్కేలు 37:1. “తీసుకుపోయాడు”– యెహెఙ్కేలు 3:14; యెహెఙ్కేలు 8:3; యెహెఙ్కేలు 11:24.
2. దేవుని దర్శనవశుడనైన నన్ను ఇశ్రాయేలీయుల దేశములోనికి తోడుకొని వచ్చి, మిగుల ఉన్నతమైన పర్వతముమీద ఉంచెను. దానిపైన దక్షిణపుతట్టున పట్టణమువంటి దొకటి నాకగుపడెను.ప్రకటన గ్రంథం 21:10
“దర్శానాలలో”– యెహెఙ్కేలు 1:1; యెహెఙ్కేలు 8:3. ఆదికాండము 15:1 దగ్గర దర్శనాల గురించి నోట్. “పర్వతం”– జెరుసలంలోని సీయోను పర్వతం (యెహెఙ్కేలు 17:22; యెషయా 2:2; మీకా 4:1; జెకర్యా 14:10). సీయోను భౌగోళికంగా చూస్తే ఎత్తయిన పర్వతమేమీ కాదు. అయితే భూమిపట్ల దేవుడు జరిగించే చర్యలను బట్టి చూస్తే అది అత్యున్నతమైనది.
3. అక్కడికి ఆయన నన్ను తోడుకొని రాగా ఒక మనుష్యుడుండెను. ఆయన మెరయుచున్న యిత్తడివలె కనబడెను, దారమును కొలకఱ్ఱయు చేత పట్టుకొని ద్వారములో ఆయన నిలువబడియుండెను.ప్రకటన గ్రంథం 11:1, ప్రకటన గ్రంథం 21:15
“కంచు”– బహుశా “మనిషి” అనే పదాన్ని అక్షరార్థంగా తీసుకోకూడదని సూచిస్తూ ఉండవచ్చు. బైబిల్లో దేవదూతలు కొన్ని సార్లు మానవ రూపంలో కనిపించేవారు అని రాసివుంది (ఆదికాండము 19:1). పెద్ద కొలతలకు తాడు, చిన్న కొలతలకు కొలబద్ద వాడబడ్డాయి.
4. ఆ మనుష్యుడు నాతో ఇట్లనెను నరపుత్రుడా, నేను నీకు చూపుచున్న వాటినన్నిటిని కన్నులార చూచి చెవులార విని మనస్సులో ఉంచుకొనుము; నేను వాటిని నీకు చూపుటకై నీవిచ్చటికి తేబడితివి, నీకు కనబడు వాటినన్నిటిని ఇశ్రాయేలీయులకు తెలియజేయుము.
“తెలియజెయ్యి”– యెహెజ్కేలు గ్రంథం చివరి అధ్యాయాలు యూదులకు ఒక ప్రత్యేక సందేశం. ఆ జాతి చితికిపోయి చెదిరిపోయింది. ఆలయం, నగరం శిథిలాలై పోయాయి. దేశమంతా త్వరగా పాడుబడిపోతూ ఉంది. ఈ అధ్యాయాలు ఆ ప్రజ స్వదేశానికి తిరిగి వస్తారనీ, దేశానికీ నగరానికీ ఆలయానికి వాటి పూర్వ క్షేమస్థితి చేకూరుతుందనీ తెలియజేస్తున్నాయి.
5. నేను చూడగా నలుదిశల మందిరముచుట్టు ప్రాకారముండెను, మరియు ఆ మనుష్యునిచేతిలో ఆరు మూరల కొలకఱ్ఱయుండెను, ప్రతిమూర మూరెడు బెత్తెడు నిడివి గలది, ఆయన ఆ కట్టడమును కొలువగా దాని వెడల్పును దాని యెత్తును బారన్నర తేలెను.ప్రకటన గ్రంథం 21:15
ఈ అధ్యాయాల్లో కొంత భాగం గోడలు, ద్వారాలు, ఆవరణలు, కట్టడాలు మొదలైనవాటి కొలతలు కనిపిస్తున్నాయి. దీన్లో ఆధ్యాత్మిక భావాలేవీ చూడలేము. ఇప్పటి మనకంటే ఆ నాటి యూదులకు ఈ కొలతలు మరింత అర్థవంతంగా కనిపించి ఉండవచ్చునేమో. భౌతికంగా పనివారు రాళ్ళతో దిట్టంగా కట్టవలసిన నిర్మాణాలను సూచించేందుకే ఈ కొలతలన్నీ ఇవ్వబడ్డాయి అనుకోక తప్పడం లేదు. “గోడ”– రాకూడనివారిని లోపలికి రాకుండా చేయడానికే గోడలు కట్టేది.
6. అతడు తూర్పుతట్టున నున్న గుమ్మమునకు వచ్చి దాని సోపానములమీది కెక్కి గుమ్మపు గడపను కొలువగా దాని వెడల్పు, అనగా మొదటి గడప వెడల్పు బారన్నర తేలెను.
7. మరియు కావలిగది నిడివియు వెడల్పును బారన్నర, కావలి గదులకు మధ్య అయిదేసి మూరల యెడముండెను. గుమ్మముయొక్క ద్వారపు ప్రక్కకును మందిరమునకు బారన్నర యెడము.
“కావలివారు”– అంటే ఈ దర్శనాలు నెరవేరే కాలం ఇంకా కావలివారు అవసరం అయిన కాలమేనన్నమాట. అంటే కొందర్ని లోపలికి రాకుండా అడ్డగించే అవసరం కూడా ఉంటుందన్నమాట.
8. గుమ్మపు ద్వారమునకును మందిరమునకును మధ్య కొలువగా బారన్నర తేలెను.
9. గుమ్మపు ద్వారము కొలువగా అది యెనిమిది మూరలై యుండెను, దానిస్తంభములు రెండేసి మూరలు; అవి గుమ్మపు ద్వారము మందిరపు దిక్కుగా చూచుచుండెను.
10. తూర్పు గుమ్మపు ద్వారముయొక్క కావలి గదులు ఇటు మూడును, అటు మూడును ఉండెను, మూడు గదులకు కొలత యొకటే. మరియు రెండు ప్రక్కలనున్న స్తంభములకు కొలత యొకటే.
11. ఆయా గుమ్మముల వాకిండ్లు కొలువగా వాటి వెడల్పు పది మూరలును నిడివి పదుమూడు మూరలును తేలెను.
12. కావలి గదులముందర మూరెడు ఎత్తుగల గోడ ఇరుప్రక్కల నుండెను, ఆ ప్రక్కను ఈ ప్రక్కను మూరెడు ఎత్తుగల గోడ యుండెను; గదులైతే ఇరుప్రక్కలను ఆరుమూరల ఎత్తుగలవి.
13. ఒకగది కప్పునుండి రెండవదాని కప్పువరకు గుమ్మమును కొలువగా ఇరువది యయిదు మూరల వెడల్పు తేలెను, రెండు వాకిండ్లమధ్య గోడను అదే కొలత.
14. అరువదేసి మూరలు ఎడముగా ఒక్కొక్క స్తంభము నిలువబెట్టబడెను. గుమ్మము చుట్టునున్న ఆవరణము స్తంభములవరకు వ్యాపించెను.
15. బయటి గుమ్మమునొద్దనుండి లోపటి గుమ్మపుద్వారమువరకు ఏబదిమూరలు.
16. కావలి గదులకును గుమ్మములకు లోపల వాటికి మధ్యగా చుట్టునున్న గోడలకును ప్రక్కగదులకును కమ్ములు పెట్టబడిన కిటికీలుండెను, గోడలోని స్తంభములకును కిటికీలుండెను; ప్రతి స్తంభముమీదను ఖర్జూరపు చెట్లు రూపింపబడి యుండెను.
17. అతడు బయటి ఆవరణములోనికి నన్ను తీసికొనిరాగా అచ్చట గదులును చప్టాయు కనబడెను. చప్టామీద ముప్పది చిన్నగదులు ఏర్పడియుండెను.
“బయటి ఆవరణ”– అంటే బలిపీఠం ఉన్న ఆలయ ఆవరణం బయటే గాని బయటి గోడకు లోపలి భాగంలోనే ఉంది.
18. ఈ చప్టా గుమ్మములవరకుండి వాటి వెడల్పున సాగియుండెను. అది క్రింది చప్టా ఆయెను.
19. క్రింది గుమ్మము మొదలుకొని లోపలి ఆవరణమువరకు ఆయన వెడల్పు కొలువగా ఇది తూర్పునను ఉత్తరమునను నూరు మూరలాయెను.
20. మరియు ఉత్తరపువైపున బయటి ఆవరణము చూచుచుండు గుమ్మపు నిడివిని వెడల్పును
21. దాని ఇరుప్రక్కలనున్న మూడేసి కావలి గదులను వాటి స్తంభములను వాటి మధ్యగోడలను అతడు కొలువగా వాటి కొలత మొదటి గుమ్మపు కొలత ప్రకారముగా కనబడెను, అనగా నిడివి ఏబదిమూరలు వెడల్పు ఇరువదియైదుమూరలు కనబడెను.
22. వాటి కిటికీ లును వాటి మధ్యగోడలును ఖర్జూరపుచెట్లవలె రూపింప బడిన వాటి అలంకారమును తూర్పుద్వారముయొక్క కొలత ప్రకారముగా కనబడెను మరియు ఎక్కుటకై యేడు మెట్లుండెను, ఎదుటనుండి దాని మధ్యగోడలు కనబడుచుండెను.
23. ఉత్తరద్వారమున కెదురుగా ఒకటియు, తూర్పుద్వారమున కెదురుగా ఒకటియు, లోపటి ఆవరణమునకు పోవు రెండు గుమ్మములుండెను. ఈ గుమ్మమునకు ఆ గుమ్మమునకు ఎంతైనది అతడు కొలువగా నూరుమూరల యెడము కనబడెను.
24. అతడు నన్ను దక్షిణపుతట్టునకు తోడుకొని పోగా దక్షిణపుతట్టున గుమ్మమొకటి కనబడెను. దాని స్తంభములను మధ్యగోడలను కొలువగా అదే కొలత కనబడెను.
25. మరియు వాటి కున్నట్టుగా దీనికిని దీని మధ్యగోడలకును చుట్టు కిటికీలుండెను, దాని నిడివి ఏబది మూరలు దాని వెడల్పు ఇరవదియైదు మూరలు.
26. ఎక్కుటకు ఏడు మెట్లును ఎదురుగా కనబడు మధ్యగోడలును ఉండెను. మరియు దాని స్తంభముల ఇరుప్రక్కలను ఖర్జూరపు చెట్లను పోలిన అలంకారముండెను
27. లోపటి ఆవరణమునకు దక్షిణపు తట్టున గుమ్మమొకటి యుండెను, దక్షిణపు తట్టును గుమ్మమునుండి గుమ్మమువరకు ఆయన కొలువగా నూరు మూరలాయెను.
28. అతడు దక్షిణమార్గమున లోపటి ఆవరణములోనికి నన్ను తోడుకొనిపోయి దక్షిణపు గుమ్మమును కొలిచెను; దాని కొలత అదే.
29. మరియు దాని కావలిగదులును స్తంభములును మధ్య గోడలును పైచెప్పిన కొలతకు సరిపడెను; దానికిని దాని చుట్టు ఉన్న మధ్యగోడలకును కిటికీలుండెను, దాని నిడివి ఏబది మూరలు దాని వెడల్పు ఇరువదియైదు మూరలు
30. చుట్టు మధ్యగోడల నిడివి ఇరువదియైదు మూరలు, వెడల్పు అయిదు మూరలు.
31. దాని మధ్య గోడలు బయటి ఆవరణముతట్టు చూచుచుండెను; దాని స్తంభములమీద ఖర్జూరపుచెట్లను పోలిన అలంకారముండెను; ఎక్కుటకు ఎనిమిది మెట్లుండెను.
32. తూర్పుతట్టు లోపటి ఆవరణములోనికి నన్ను తోడుకొనిపోయి దాని గుమ్మమును ఆయన కొలువగా పైచెప్పిన కొలత తేలెను.
33. దాని కావలిగదులకును స్తంభములకును మధ్యగోడలకును కొలత అదే; దానికిని దాని చుట్టునున్న మధ్యగోడలకును కిటికీలుండెను; నిడివి యేబది మూరలు, వెడల్పు ఇరువది యైదు మూరలు.
34. దాని మధ్యగోడలు బయటి ఆవరణము తట్టు చూచుచుండెను. ఈ ప్రక్కను ఆ ప్రక్కను దాని స్తంభములమీద ఖర్జూరపుచెట్లను పోలిన అలంకారముండెను, ఎక్కుటకు ఎనిమిది మెట్లుండెను.
35. ఉత్తరపు గుమ్మమునకు అతడు నన్ను తోడుకొనిపోయి దాని కొలువగా అదే కొలతయాయెను.
36. దాని కావలిగదులకును స్తంభములకును దాని మధ్యగోడలకును అదే కొలత; దానికిని దాని చుట్టునున్న మధ్యగోడలకును కీటికీలుండెను; దాని నిడివి యేబది మూరలు దాని వెడల్పు ఇరువదియైదు మూరలు.
37. దాని స్తంభములు బయటి ఆవరణముతట్టు చూచుచుండెను; ఆ స్తంభములమీద ఈ ప్రక్కను ఆ ప్రక్కను ఖర్జూరపు చెట్లనుపోలిన అలంకారముండెను; ఎక్కుటకు ఎనిమిది మెట్లుండెను.
38. గుమ్మముల స్తంభములయొద్ద వాకిలిగల గదియుండెను; అక్కడ దహనబలి పశువుల మాంసము కడుగుదురు.
ఇక్కడ మూడు రకాల అర్పణలు కనిపిస్తున్నాయి – హోమబలి, పాపాలకోసమైన బలి, అపరాధబలి. ఇవి గాక శాంతి బలులు, ధాన్య నైవేద్యాలు తరువాతి అధ్యాయాల్లో కనిపిస్తున్నాయి (ఉదా।। యెహెఙ్కేలు 43:27; యెహెఙ్కేలు 45:17; యెహెఙ్కేలు 46:2, యెహెఙ్కేలు 46:12). ఈ బలుల అంతరార్థాలు తెలుసుకోవాలంటే లేవీ 1-7 అధ్యాయాలు చూడండి. బలుల గురించి ఇక్కడ రాసి ఉండడం వ్యాఖ్యాతలను తబ్బిబ్బు చేసింది. ఇది బలులను ఇంకా అర్పిస్తూనే ఉండే కాలాన్ని సూచిస్తున్నది. యెహెజ్కేలు 40-48 అధ్యాయాలు క్రీస్తు వెయ్యేళ్ళ పరిపాలన గురించి అయితే జంతు బలులు అర్పించడం అప్పుడు జరుగుతుందని అర్థమా? అలా కాక ఈ బలులన్నిటినీ క్రీస్తు చేసిన ఒక్క బలికీ దృష్టాంతంగా అర్థం చేసుకోవాలా? ఈ బలులు సాదృశ్యాలైతే ఈ దర్శనంలోని ఇతర విషయాలు కూడా సాదృశ్యంగా తెలుసుకోవాలా? ఆలయం, నగరం, యాజులు మొదలైనవన్నీ కేవలం సూచనలేనా? అక్షరాలా వాస్తవంగా ఇవి ఉండవా? లేక బైబిల్లో చాలా చోట్ల ఉన్నట్టుగా ఇక్కడి వృత్తాంతం సూచనలూ అక్షరార్థమైన వివరాలూ కలిసి ఉన్నాయా? ఇక్కడ చెప్పిన ప్రతి విషయమూ అక్షరాలా నెరవేరవలసిన అవసరం లేకపోతే కొంతమట్టుకు ఏదో ఒక విధంగా అక్షరాలా నెరవేరే అవకాశం ఉందా? ఇలాంటి ప్రశ్నలు అడగడం తేలికే. అయితే బైబిలు గురించి ప్రస్తుతం మనకు తెలిసినదాని పై ఆధారపడి వీటికి జవాబులివ్వడం అసాధ్యం కావచ్చు. ఒకటి మాత్రం నిజం – వెయ్యేళ్ళ పరిపాలనలలో జంతు బలులు కొనసాగడం గనుక జరిగితే అవి క్రీస్తు ఇప్పటికీ అర్పించి ముగించిన ఒకే బలియాగానికి స్మారక చిహ్నాలు మాత్రమే (ఇప్పటి ప్రభువు బల్లలాగా నన్నమాట). అవి పాపాలను తీసివేసేందుకు చేసే బలులుగా ఉండవు. ఎందుకంటే క్రీస్తు తన మరణం ద్వారా ఒకేసారి శాశ్వతంగా తన ప్రజలందరి పాపాలను కొట్టివేశాడు (హెబ్రీయులకు 10:5-14). భవిష్యత్తులో ఉండే దేవాలయం, అర్పణల గురించి ఇతర ప్రవక్తలు కూడా ఇలాంటిది ఉంటుందని పలికినట్టు కనిపిస్తున్నది. యెషయా 19:21 (20-25 వచనాలను బట్టి చూస్తే ఈ సందర్భం భవిష్యత్కాలం గురించి ఉంది); యెషయా 60:7 (సందర్భాన్ని బట్టి); యెషయా 66:20-23; యిర్మియా 33:14-18; హగ్గయి 2:6-9; జెకర్యా 14:16-21; మలాకీ 3:2-4.
39. మరియు గుమ్మపు మంటపములో ఇరుప్రక్కల రెండేసి బల్లలుంచబడెను; వీటిమీద దహనబలి పశువులును పాప పరిహారార్థ బలిపశువులును అపరాధపరిహారార్థ బలిపశువులును వధింపబడును.
40. గుమ్మముయొక్క వాకిలిదగ్గర ఉత్తరపుదిక్కున మెట్లు ఎక్కుచోటున ఇరుప్రక్కల రెండేసి బల్లలుండెను. అనగా గుమ్మపు రెండుప్రక్కల నాలుగేసి బల్లలుండెను. ఇవి పశువులను వధించుటకై ఉంచబడి యుండెను.
41. దహనబలి పశువులు మొదలగు బలిపశువులను వధించుటకై వినియోగించు ఉపకరణములుంచదగిన యెనిమిది బల్లలు ఈ తట్టు నాలుగు ఆ తట్టు నాలుగు మెట్లదగ్గర నుండెను.
42. అవి మూరెడున్నర నిడివియు మూరెడున్నర వెడల్పును మూరెడు ఎత్తును గలిగి మలిచిన రాతితో చేయబడి యుండెను.
43. చుట్టుగోడకు అడుగడుగు పొడుగుగల మేకులు నాటబడియుండెను; అర్పణ సంబంధమైన మాంసము బల్లలమీద ఉంచుదురు.
44. లోపటి గుమ్మము బయట లోపటి ఆవరణములో ఉత్తరపు గుమ్మము దగ్గరనుండి దక్షిణముగా చూచు నొకటియు, తూర్పు గుమ్మము దగ్గరనుండి ఉత్తరముగా చూచు నొకటియు రెండు గదులుండెను.
యెహెఙ్కేలు 44:15-31 ఇక్కడ ప్రత్యేకించి సాదోకు (2 సమూయేలు 8:17) సంతతివారైన యాజుల గుంపును ఇతర లేవీ గోత్రికులతో కాకుండా, సామాన్య ప్రజలతో కాకుండా వేరు చేసి చెప్పడం గమనించండి. ఇదంతా క్రైస్తవ శకం కాక మరేదో కాలాన్ని సూచిస్తున్నది. ఎందుకంటే ఇప్పటి క్రైస్తవ శకంలో ప్రభువును ఆరాధించేందుకు యాజులే గాక విశ్వాసులు ఎవరైనా ఆయన్ను సమీపించవచ్చు (రోమీయులకు 5:1-2; హెబ్రీయులకు 10:19-22).
45. అప్పుడతడు నాతో ఇట్లనెను దక్షిణపుతట్టు చూచు గది మందిరమునకు కావలి వారగు యాజకులది.
46. ఉత్తరపుతట్టు చూచు గది బలిపీఠమునకు కావలివారగు యాజకులది. వీరు లేవీయులలో సాదోకు సంతతివారై సేవచేయుటకై యెహోవా సన్నిధికి వచ్చువారు.
47. అతడు ఆ ఆవరణమును కొలువగా నిడివియు వెడల్పును నూరుమూరలై చచ్చౌకముగా ఉండెను. మందిరమునకు ఎదురుగా బలిపీఠముంచబడెను.ప్రకటన గ్రంథం 11:1
“బలిపీఠం”– యెహెఙ్కేలు 43:13-17.
48. అతడు మందిరముయొక్క మంటపములోనికి నన్ను తోడుకొని వచ్చి మంటపస్తంభములను ఒక్కొక్కదాని కొలువగా అది ఇరుప్రక్కల అయిదేసి మూరలుండెను, గుమ్మము ఇరుప్రక్కల మూడేసి మూరల వెడల్పు.
“వసారా”– ఆలయంలో మొదటి ముఖ్య భాగం. 1 రాజులు 6:3 పోల్చి చూడండి.
49. మంటపమునకు నిడివి యిరువది మూరలు; ఎక్కుటకై యుంచబడిన మెట్లదగ్గర దాని వెడల్పు పదకొండు మూరలు, స్తంభములదగ్గర ఇరుప్రక్కల ఒక్కొక్కటిగా కంబములుంచబడెను.