Turn Off
21st Century KJV
A Conservative Version
American King James Version (1999)
American Standard Version (1901)
Amplified Bible (1965)
Apostles' Bible Complete (2004)
Bengali Bible
Bible in Basic English (1964)
Bishop's Bible
Complementary English Version (1995)
Coverdale Bible (1535)
Easy to Read Revised Version (2005)
English Jubilee 2000 Bible (2000)
English Lo Parishuddha Grandham
English Standard Version (2001)
Geneva Bible (1599)
Hebrew Names Version
Hindi Bible
Holman Christian Standard Bible (2004)
Holy Bible Revised Version (1885)
Kannada Bible
King James Version (1769)
Literal Translation of Holy Bible (2000)
Malayalam Bible
Modern King James Version (1962)
New American Bible
New American Standard Bible (1995)
New Century Version (1991)
New English Translation (2005)
New International Reader's Version (1998)
New International Version (1984) (US)
New International Version (UK)
New King James Version (1982)
New Life Version (1969)
New Living Translation (1996)
New Revised Standard Version (1989)
Restored Name KJV
Revised Standard Version (1952)
Revised Version (1881-1885)
Revised Webster Update (1995)
Rotherhams Emphasized Bible (1902)
Tamil Bible
Telugu Bible (BSI)
Telugu Bible (WBTC)
The Complete Jewish Bible (1998)
The Darby Bible (1890)
The Douay-Rheims American Bible (1899)
The Message Bible (2002)
The New Jerusalem Bible
The Webster Bible (1833)
Third Millennium Bible (1998)
Today's English Version (Good News Bible) (1992)
Today's New International Version (2005)
Tyndale Bible (1534)
Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537)
Updated Bible (2006)
Voice In Wilderness (2006)
World English Bible
Wycliffe Bible (1395)
Young's Literal Translation (1898)
Telugu Bible Verse by Verse Explanation
పరిశుద్ధ గ్రంథ వివరణ
Telugu Bible Commentary
Telugu Reference Bible
1. గోత్రముల పేరులు ఇవి; దానీయుల కొకభాగము అది ఉత్తరదిక్కు సరిహద్దునుండి హమాతునకుపోవు మార్గమువరకు హెత్లోనునకుపోవు సరిహద్దువరకును హసరే నాను అను దమస్కు సరిహద్దువరకును హమాతు సరిహద్దు మార్గమున తూర్పుగాను పడమరగాను వ్యాపించు భూమి.
1. These are the names of the tribes that lie upon the north side, by the way of Hetlon, till thou comest unto Hemath and Hazar Enam, the borders of Damascus toward the north beside Hamath: Dan shall have his portion from the east quarter unto the west.
2. దానుయొక్క సరిహద్దునానుకొని తూర్పు పడమరలుగా ఆషేరీయులకు ఒక భాగము.
2. Upon the borders of Dan from the east side unto the west, shall Asser have his portion.
3. ఆషేరీయుల సరిహద్దు నానుకొని తూర్పు పడమరలుగా నఫ్తాలీయులకు ఒక భాగము.
3. Upon the borders of Asher from the east part unto the west shall Nephthali have his portion.
4. నఫ్తాలి సరిహద్దును ఆనుకొని తూర్పు పడమరలుగా మనష్షేయులకు ఒకభాగము.
4. Upon the borders of Nephthali from the east quarter unto the west, shall Manasses have his portion.
5. మనష్షేయుల సరిహద్దును ఆనుకొని తూర్పు పడమరలుగా ఎఫ్రాయి మీయులకు ఒక భాగము.
5. Upon the borders of Manasses from the east side unto the west, shall Ephraim have his portion.
6. ఎఫ్రాయిమీయుల సరిహద్దును ఆనుకొని తూర్పు పడమరలుగా రూబేనీయులకు ఒక భాగము.
6. Upon the borders of Ephraim from the east part unto the west, shall Ruben have his portion.
7. రూబేనీయుల సరిహద్దును ఆనుకొని తూర్పు పడమరలుగా యూదావారికి ఒకభాగము.
7. Upon the borders of Reuben from the east quarter unto the west shall Judah have his portion.
8. యూదావారి సరిహద్దును అనుకొని తూర్పు పడమర లుగా మీరు ప్రతిష్టించు ప్రతిష్టిత భూమియుండును. దాని వెడల్పు ఇరువదియైదు వేల కొలకఱ్ఱలు; దాని నిడివి తూర్పునుండి పడమరవరకు తక్కినభాగముల నిడివివలెనే యుండును; పరిశుద్ధస్థలము దాని మధ్య ఉండవలెను.
8. Upon the borders of Judah from the east part unto the west, ye shall set a side one portion of twenty five thousand meterods long and broad (like as another portion from the east side unto the west) wherein the Sanctuary shall stand.(stode)
9. యెహోవాకు మీరు ప్రతిష్టించు ప్రదేశము ఇరువదియైదు వేల కొలకఱ్ఱల నిడివియు పదివేల కొలకఱ్ఱల వెడుల్పునై యుండవలెను.
9. As for the portion, that ye shall separate out for the LORD, it shall be twenty five thousand meterods long, and ten thousand broad.
10. ఈ ప్రతిష్ఠితభూమి యాజకులదగును. అది ఉత్తరదిక్కున ఇరువదియైదువేల కొలకఱ్ఱల నిడివియు పడమటి దిక్కున పదివేల కొలకఱ్ఱల వెడల్పును తూర్పుదిక్కున పదివేల కొలకఱ్ఱల వెడల్పును దక్షిణ దిక్కున ఇరువదియైదువేల కొలకఱ్ఱల నిడివియు ఉండవలెను. యెహోవా పరిశుద్ధస్థలము దాని మధ్య ఉండును.
10. Which separated holy portion shall belong unto these: namely to the priests, toward the north twenty five thousand and toward the west ten thousand broad, toward the east ten thousand broad also, and toward south twenty five thousand long, wherein the Sanctuary of the LORD shall stand.
11. ఇది సాదోకు సంతతివారై నాకు ప్రతిష్టింపబడి నేను వారి కప్పగించిన దానిని కాపాడు యాజకులదగును; ఏలయనగా ఇశ్రాయేలీయులు నన్ను విడిచిపోగా మిగిలిన లేవీయులు విడిచిపోయినట్లె వారు నన్ను విడిచిపోలేదు.
11. Yea this same place shall be the priests, that are of the children of Sadock, and have kept my holy ordinance: which went not astray in the error of the children of Israel, like as the Levites are gone astray:
12. ప్రతిష్ఠిత భూమియందు లేవీయుల సరిహద్దుదగ్గర వారికొక చోటు ఏర్పాటగును; అది అతి పరిశుద్ధముగా ఎంచబడును.
12. and this separated piece that they have of the land, shall be the most holy, hard upon the borders of the Levites.
13. యాజకుల సరిహద్దును ఆనుకొని లేవీయులకొకచోటు నేర్పాటుచేయవలెను; అది ఇరువది యయిదు వేల కొలకఱ్ఱల నిడివియు పదివేల కొలకఱ్ఱల వెడల్పునైయుండును. దాని నిడివియంతయు ఇరువది యయిదు వేల కొలకఱ్ఱలును వెడల్పంతయు పది వేల కొలకఱ్ఱలును ఉండును.
13. And next unto the priests, shall the Levites have twenty five thousand long, and ten thousand broad. This shall be on every side twenty five thousand long, and ten thousand broad.
14. అది యెహోవాకు ప్రతి ష్ఠితమైన భూమి గనుక దానిలో ఏమాత్రపు భాగమైనను వారు అమ్మకూడదు, బదులుగా ఇయ్యకూడదు, ఆ భూమి యొక్క ప్రథమ ఫలములను ఇతరులను అనుభవింపనియ్యకూడదు.
14. Of this portion they shall sell nothing, nor make any permutation there of, lest the chief of the land fall unto other, for it is hallowed unto the LORD.
15. ఇరువది యయిదువేల కొలకఱ్ఱల భూమిని ఆనుకొని వెడల్పున మిగిలిన అయిదువేల కొలకఱ్ఱలుగల చోటు గ్రామకంఠముగా ఏర్పరచబడినదై, పట్టణములోని నివేశములకును మైదానములకును అక్కరకువచ్చును; దాని మధ్య పట్టణము కట్టబడును.
15. The other five thousand after the breadth that lieth by the twenty five thousand shall be common: it shall belong to the city and to the suburbs for habitations, and the city shall stand in the middest thereof.
16. దాని పరిమాణ వివరమేదనగా, ఉత్తరదిక్కువ నాలుగువేలఐదువందల కొలకఱ్ఱలు, దక్షిణ దిక్కున నాలుగువేల ఐదువందల కొలకఱ్ఱలు, తూర్పు దిక్కున నాలుగువేల ఐదువందల కొలకఱ్ఱలు, పడమటి దిక్కున నాలుగువేల ఐదువందల కొలకఱ్ఱలు.ప్రకటన గ్రంథం 21:16-17
16. Let this be the measure: toward the north part five hundredth and four thousand toward the south part five hundredth and four thousand, toward the east part five hundredth and four thousand, toward the west part five hundredth and four thousand.
17. పట్టణము నకు చేరిన ఖాళీస్థలము ఉత్తరపుతట్టున రెండువందల యేబది కొలకఱ్ఱలు, దక్షిణపుతట్టున రెండువందల ఏబది కొలకఱ్ఱలు, తూర్పుతట్టున రెండువందల ఏబది కొలకఱ్ఱలు, పడమటి తట్టున రెండువందల ఏబది కొలకఱ్ఱలు ఉండవలెను.ప్రకటన గ్రంథం 21:16-17
17. The suburbs hard upon the city, shall have toward the north fifty and two hundredth, and toward the south fifty and two hundredth, and toward the east fifty and two hundredth, and toward the west also fifty and two hundredth.
18. ప్రతిష్ఠిత భూమిని ఆనుకొని మిగిలిన భూమి ఫలము పట్టణములో కష్టముచేత జీవించువారికి ఆధారముగా ఉండును. అది ప్రతిష్ఠితభూమిని యానుకొని తూర్పు తట్టున పదివేల కొలకఱ్ఱలును పడమటితట్టున పదివేల కొలకఱ్ఱలును ఉండును.
18. As for the residue of the length, that lieth hard upon the separated holy ground: namely ten thousand toward the east, and ten thousand toward the west, next unto the holy portion: it and the increase thereof shall serve for their meat, that labour in the city.
19. ఏ గోత్రపువారైనను పట్టణములో కష్టముచేసి జీవించువారు దానిని సాగుబడిచేయుదురు.
19. They that labour for the wealth of the city, shall maintain this also, out of what tribe soever they be in Israel.
20. ప్రతిష్ఠిత భూమియంతయు ఇరువది యయిదు వేల కొలకఱ్ఱల చచ్చౌకముగా ఉండును; దానిలో నాలుగవ భాగము పట్టణమునకు ఏర్పాటు చేయవలెను.
20. All that is separated of the twenty five thousand long and twenty five thousand broad on the four parts, that shall ye put aside for the separated portion of the Sanctuary, and for the possession of the city.
21. ప్రతిష్ఠితస్థానమునకును పట్టణమునకు ఏర్పాటు చేయబడిన భాగమునకును ఇరు ప్రక్కలనున్న భూమిని, అనగా తూర్పుదిశను ప్రతిష్ఠితస్థానముగా ఏర్పడిన యిరువది యయిదువేల కొలకఱ్ఱలును పడ మటి దిశను గోత్రస్థాన ములుగా ఏర్పడిన యిరువది యయిదు వేల కొలకఱ్ఱలును గల భూమిని యానుకొనుస్థానము అధిపతిదగును. ప్రతి ష్ఠిత స్థానమును, మందిరమునకు ప్రతిష్ఠింపబడిన స్థానమును దానికి మధ్యగా ఉండును.
21. The residue upon both the sides of the Sanctuary and possession of the city, shall belong to the prince, before the place of the twenty five thousand unto the east end, and before the place of the twenty five thousand westward, unto the borders of the city: this shall be the princes portion. This shall be the holy place, and the house of the Sanctuary shall stand in the middest.
22. యూదావారి సరిహద్దునకును బెన్యామీనీయుల సరిహద్దునకును మధ్యగానున్న లేవీయుల స్వాస్థ్యమును పట్టణమునకు ఏర్పాటైన స్థానమును ఆనుకొను భూమిలో అధిపతి భూమికిలోగా ఉన్నది అధిపతిదగును.
22. Moreover, from the Levites and the cities possession, that lie in the middest of the princes part: look what remaineth betwixt the border of Judah and the border of Benjamin, it shall be the prince's.
23. తూర్పునుండి పడమటివరకు కొలువగా మిగిలిన గోత్రములకు భాగములు ఏర్పాటగును. బెన్యామీనీయులకు ఒక భాగము,
23. Now of the other tribes. From the east part unto the west, shall Benjamin have his portion.
24. బెన్యామీ నీయుల సరిహద్దును ఆనుకొని తూర్పు పడమరలుగా షిమ్యోనీయులకు ఒకభాగము;
24. Upon the borders of Benjamin from the east side unto the west, shall Simeon have his portion.
25. షిమ్యోనీయుల సరిహద్దును ఆనుకొని తూర్పు పడమరలుగా ఇశ్శాఖారీయులకు ఒకభాగము
25. Upon the borders of Simeon from the east part unto the west, shall Izakar have his portion.
26. ఇశ్శాఖారీయుల సరిహద్దును ఆనుకొని తూర్పుపడమరలుగా జెబూలూనీయులకు ఒకభాగము,
26. Upon the borders of Izakar from the east side unto the west, shall Sabulon have his portion.
27. జెబూలూనీయుల సరిహద్దును ఆనుకొని తూర్పు పడ మరలుగా గాదీయులకు ఒకభాగము;
27. Upon the borders of Sabulon from the east part unto the west, shall Gad have his portion.
28. దక్షిణదిక్కున తామారునుండి కాదేషులోనున్న మెరీబా ఊటలవరకు నదివెంబడి మహాసముద్రమువరకు గాదీయులకు సరిహద్దు ఏర్పడును.
28. Upon the borders of Gad southward, the coasts shall reach from Thamar forth unto the waters of strife to Cades, and to the flood, even to the main sea.
29. మీరు చీట్లువేసి ఇశ్రాయేలీయుల గోత్రములకు విభాగింపవలసిన దేశము ఇదే. వారివారి భాగములు ఇవే. యిదే యెహోవా యిచ్చిన ఆజ్ఞ.
29. This is the land with his portions, which ye shall distribute unto the tribes of Israel, sayeth the Lord GOD.(LORDE God)
30. పట్టణస్థాన వైశాల్యత ఎంతనగా, ఉత్తరమున నాలుగు వేల ఐదువందల కొలకఱ్ఱల పరిమాణము.
30. Thus wide shall the city reach: upon the north part five hundredth and four thousand measures.
31. ఇశ్రాయేలీయుల గోత్రపు పేళ్లనుబట్టి పట్టణపు గుమ్మములకు పేళ్లు పెట్టవలెను. ఉత్తరపుతట్టున రూబేనుదనియు, యూదాదనియు, లేవిదనియు మూడు గుమ్మములుండవలెను.ప్రకటన గ్రంథం 21:12-13
31. The ports of the city, shall have the names of the tribes of Israel. Three ports of the north side: one Ruben, another Judah, the third Levi.
32. తూర్పుతట్టు నాలుగువేల ఐదువందల కొలకఱ్ఱల పరిమాణము గలది. ఆ తట్టున యోసేపుదనియు బెన్యామీను దనియు దానుదనియు మూడు గుమ్మములుండవలెను.
32. Upon the east side five hundredth and four thousand measures, with three ports: the one Joseph, another Benjamin, the third Dan.
33. దక్షిణపుతట్టు నాలుగు వేల ఐదువందల కొలకఱ్ఱల పరిమాణము గలది. ఆ తట్టున షిమ్యోనుదనియు ఇశ్శాఖారుదనియు జెబూలూనుదనియు మూడు గుమ్మములుండవలెను.
33. Upon the south side five hundredth and four thousand measures, with three ports: the one Simeon, another Izakar, the third Sabulon.
34. పడమటితట్టు నాలుగువేల ఐదువందల కొలకఱ్ఱల పరిమాణ ముగలది. ఆ తట్టున గాదుదనియు ఆషేరుదనియు నఫ్తాలిదనియు మూడు గుమ్మములుండవలెను.
34. And upon the west side five hundredth and four thousand measures, with three ports also, the one Gad, another Asser, the third Nephthali.
35. దాని కైవారము పదునెనిమిదివేల కొలకఱ్ఱల పరిమాణము. యెహోవా యుండు స్థలమని నాటనుండి ఆ పట్టణమునకు పేరు.ప్రకటన గ్రంథం 3:12
35. Thus shall it have eighteen thousand measures round about. And from that time forth, the name of the city shall be: the LORD is there. [The end of the Prophecye of Ezechiel.]