Ezekiel - యెహెఙ్కేలు 6 | View All

1. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను

1. The word of the LORD came to me:

2. నరపుత్రుడా, ఇశ్రాయేలీయుల పర్వతములతట్టు చూచి వాటివిషయమై యీ మాటలు ప్రకటించుము

2. 'Son of man, set your face against the mountains of Israel; prophesy against them

3. ఇశ్రాయేలీయుల పర్వతములారా, ప్రభువైన యెహోవా మాట ఆలకించుడి; పర్వతములతోను కొండలతోను వాగులతోను లోయలతోను ప్రభువైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు ఇదిగో నేను నిజముగా మీ మీదికి ఖడ్గమును రప్పించి మీ ఉన్నత స్థల ములను నాశనము చేసెదను.

3. and say:`O mountains of Israel, hear the word of the Sovereign LORD. This is what the Sovereign LORD says to the mountains and hills, to the ravines and valleys: I am about to bring a sword against you, and I will destroy your high places.

4. మీ బలిపీఠములు పాడైపోవును, సూర్యదేవతకు నిలిపిన స్తంభములు ఛిన్నా భిన్నములవును, మీ బొమ్మల యెదుట మీ జనులను నేను హతము చేసెదను.

4. Your altars will be demolished and your incense altars will be smashed; and I will slay your people in front of your idols.

5. ఇశ్రాయేలీయుల కళేబరములను వారి బొమ్మలయెదుట పడవేసి, మీ యెముకలను మీ బలి పీఠములచుట్టు పారవేయుదును.

5. I will lay the dead bodies of the Israelites in front of their idols, and I will scatter your bones around your altars.

6. నేనే యెహోవానై యున్నానని మీరు తెలిసికొనునట్లు మీ బలిపీఠములు విడువబడి పాడైపోవును, మీ విగ్రహములు ఛిన్నా భిన్నములగును, సూర్య దేవతకు మీరు నిలిపిన స్తంభములు పడగొట్టబడును, మీ పనులు నాశనమగును, మీ నివాస స్థలములన్నిటిలో నున్న మీ పట్టణములు పాడైపోవును, మీ ఉన్నత స్థలములు విడువబడును,

6. Wherever you live, the towns will be laid waste and the high places demolished, so that your altars will be laid waste and devastated, your idols smashed and ruined, your incense altars broken down, and what you have made wiped out.

7. మీ జనులు హతులై కూలుదురు.

7. Your people will fall slain among you, and you will know that I am the LORD.

8. అయినను మీరు ఆ యా దేశములలో చెదరిపోవునప్పుడు ఖడ్గమును తప్పించుకొను కొందరిని నేను మీలో శేషముగా అన్యజనులమధ్య ఉండనిచ్చెదను.

8. '`But I will spare some, for some of you will escape the sword when you are scattered among the lands and nations.

9. మరియు నన్ను విసర్జించినవారి విశ్వాస ఘాతకమైన వ్యభిచారమనస్సును, విగ్రహముల ననుసరించిన వ్యభిచారదృష్టిని నేను మార్చి నాతట్టు తిరుగజేయగా, చెరపట్టబడినవారై శేషించినవారు అన్యజనులమధ్య నన్ను జ్ఞాపకము చేసికొని, తామనుసరించిన హేయ కృత్యములన్నిటినిబట్టి తాము చేసిన దుష్క్రియలను కనుగొని తమ్మును తామే అసహ్యించుకొనుచు

9. Then in the nations where they have been carried captive, those who escape will remember me--how I have been grieved by their adulterous hearts, which have turned away from me, and by their eyes, which have lusted after their idols. They will loathe themselves for the evil they have done and for all their detestable practices.

10. నేను యెహోవానై యున్నానని వారు తెలిసికొందురు; ఈ కీడు వారికి చేసెదనని నేను చెప్పినమాట వ్యర్థము కాదు.

10. And they will know that I am the LORD; I did not threaten in vain to bring this calamity on them.

11. ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా నీ చేతులు చరిచి నేల తన్ని ఇశ్రాయేలీయుల దుష్టమైన హేయకృత్యములనుబట్టి అయ్యో అని అంగలార్చుము; ఖడ్గముచేతను క్షామముచేతను తెగులుచేతను వారు కూలుదురు.

11. '`This is what the Sovereign LORD says: Strike your hands together and stamp your feet and cry out 'Alas!' because of all the wicked and detestable practices of the house of Israel, for they will fall by the sword, famine and plague.

12. దూరముననున్న వారు తెగులుచేత చత్తురు, దగ్గర నున్నవారు ఖడ్గముచేత కూలుదురు, శేషించి ముట్టడి వేయబడినవారు క్షామముచేత చత్తురు; ఈ ప్రకారము నేను వారి మీద నా క్రోధము తీర్చుకొందును.

12. He that is far away will die of the plague, and he that is near will fall by the sword, and he that survives and is spared will die of famine. So will I spend my wrath upon them.

13. తమ విగ్రహముల మధ్యను తాము కట్టిన బలిపీఠములచుట్టును ఎత్తయిన కొండలన్నిటిమీదను సకల పర్వతముల నడి కొప్పులమీదను పచ్చని చెట్లన్నిటి క్రిందను, పుష్టిపారిన మస్తకి వృక్షములన్నిటి క్రిందను, తమ విగ్రహములన్నిటికి పరిమళ ధూపమువేసిన చోటులన్నిటిలోను పడి వారి జనులు హతులైయుండు కాలమున నేనే యెహోవానై యున్నానని మీరు తెలిసికొందురు.

13. And they will know that I am the LORD, when their people lie slain among their idols around their altars, on every high hill and on all the mountaintops, under every spreading tree and every leafy oak--places where they offered fragrant incense to all their idols.

14. నేను వారికి విరోధినై వారు నివసించు స్థలములన్నిటిలో వారి దేశమును దిబ్లాతు అరణ్యము కంటె మరి నిర్జనముగాను పాడుగానుచేయగా నేనే యెహోవానై యున్నానని వారు తెలిసికొందురు.

14. And I will stretch out my hand against them and make the land a desolate waste from the desert to Diblah-- wherever they live. Then they will know that I am the LORD.''



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Ezekiel - యెహెఙ్కేలు 6 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

విగ్రహారాధనకు దైవిక తీర్పులు. (1-7) 
యుద్ధం అనేది వ్యక్తులు, స్థానాలు మరియు అత్యున్నత గౌరవాన్ని కలిగి ఉన్న వస్తువులకు వినాశనాన్ని తెస్తుంది. అబద్ధ దేవుళ్లను ఆరాధించే వారి చర్యల ద్వారా కూడా, దేవుడు విగ్రహారాధన ఆచారాలను తగ్గించుకుంటాడు. మనం విగ్రహాల స్థాయికి ఎదిగిన వస్తువులను దేవుడు శిథిలాలుగా మార్చడం న్యాయమైనది మరియు న్యాయమైనది. చాలామంది రక్షణ కోసం ఆధారపడే మూఢ నమ్మకాలు తరచుగా వారి పతనానికి దారితీస్తాయి. యూదు సంఘం నుండి తొలగించబడినట్లే క్రైస్తవ చర్చి నుండి విగ్రహాలు మరియు విగ్రహారాధన నిర్మూలించబడే రోజు ఆసన్నమైంది.

ఒక శేషం రక్షింపబడుతుంది. (8-10) 
ఇజ్రాయెల్ నుండి ఒక చిన్న సమూహం తప్పించుకోబడుతుంది మరియు చివరికి, వారు ప్రభువును, ఆయన పట్ల వారి విధులను మరియు వారి తిరుగుబాటు చర్యలను గుర్తుచేసుకుంటారు. నిజమైన పశ్చాత్తాపం పాపాన్ని అసహ్యకరమైన నేరంగా వెల్లడిస్తుంది, అది ప్రభువు అసహ్యించుకుంటుంది. పాపాన్ని నిజంగా అసహ్యించుకునే వారు దాని కారణంగా తమను తాము అసహ్యించుకుంటారు. వారి పశ్చాత్తాపం దేవునికి ఘనతను తెస్తుంది. వ్యక్తులు ఆయనను స్మరించుకునేలా ప్రేరేపించే ఏదైనా మరియు ఆయనకు వ్యతిరేకంగా వారి అతిక్రమణలను ఆశీర్వాదంగా పరిగణించాలి.

విపత్తులను విచారించవలసి ఉంటుంది. (11-14)
మన బాధ్యత మన స్వంత పాపాలు మరియు దుఃఖాలకు మించి ఉంటుంది; పాపాత్ములైన వ్యక్తుల స్వీయ-కలిగిన బాధల పట్ల కూడా మనం కనికరం చూపాలి. పాపం ఒక విధ్వంసక శక్తి, కాబట్టి జాగ్రత్తగా ఉండటం మరియు దానిని నివారించడం చాలా అవసరం. ఆత్మల విలువను మరియు అవిశ్వాసులు ఎదుర్కొనే ఆపదను మనం అర్థం చేసుకున్నప్పుడు, రాబోయే కోపం నుండి తప్పించుకుని, యేసులో ఓదార్పును పొందే ప్రతి పాపిని మనం ఎదుర్కొనే ఏ అసహ్యమైన లేదా ప్రతిఘటనను అధిగమించే విలువైన బహుమతిగా పరిగణిస్తాము.



Shortcut Links
యెహెఙ్కేలు - Ezekiel : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |