Turn Off
21st Century KJV
A Conservative Version
American King James Version (1999)
American Standard Version (1901)
Amplified Bible (1965)
Apostles' Bible Complete (2004)
Bengali Bible
Bible in Basic English (1964)
Bishop's Bible
Complementary English Version (1995)
Coverdale Bible (1535)
Easy to Read Revised Version (2005)
English Jubilee 2000 Bible (2000)
English Lo Parishuddha Grandham
English Standard Version (2001)
Geneva Bible (1599)
Hebrew Names Version
Hindi Bible
Holman Christian Standard Bible (2004)
Holy Bible Revised Version (1885)
Kannada Bible
King James Version (1769)
Literal Translation of Holy Bible (2000)
Malayalam Bible
Modern King James Version (1962)
New American Bible
New American Standard Bible (1995)
New Century Version (1991)
New English Translation (2005)
New International Reader's Version (1998)
New International Version (1984) (US)
New International Version (UK)
New King James Version (1982)
New Life Version (1969)
New Living Translation (1996)
New Revised Standard Version (1989)
Restored Name KJV
Revised Standard Version (1952)
Revised Version (1881-1885)
Revised Webster Update (1995)
Rotherhams Emphasized Bible (1902)
Tamil Bible
Telugu Bible (BSI)
Telugu Bible (WBTC)
The Complete Jewish Bible (1998)
The Darby Bible (1890)
The Douay-Rheims American Bible (1899)
The Message Bible (2002)
The New Jerusalem Bible
The Webster Bible (1833)
Third Millennium Bible (1998)
Today's English Version (Good News Bible) (1992)
Today's New International Version (2005)
Tyndale Bible (1534)
Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537)
Updated Bible (2006)
Voice In Wilderness (2006)
World English Bible
Wycliffe Bible (1395)
Young's Literal Translation (1898)
Telugu Bible Verse by Verse Explanation
పరిశుద్ధ గ్రంథ వివరణ
Telugu Bible Commentary
Telugu Reference Bible
1. ఒకడు యెహోవాకు నైవేద్యము చేయునప్పుడు అతడు అర్పించునది గోధుమపిండిదై యుండవలెను. అతడు దానిమీద నూనెపోసి సాంబ్రాణి వేసి
(4,5,7,14) – ధాన్య నైవేద్యం తననూ తన జీవన ఫలాన్నీ దేవునికి తన ప్రజలకూ భక్ష్యంగా తినేందుకు ఇచ్చిన క్రీస్తును సూచిస్తున్నది. పవిత్రులు తమ నమ్మకం మూలంగా హృదయాల్లో ఆయనను తింటారు. క్రీస్తు తనను తాను గోధుమ అనీ (యోహాను 12:24) రొట్టె అనీ (యోహాను 6:35 – గ్రీకు భాషలో ఈ మాటకు రొట్టె అని అర్థం ఉంది) చెప్పుకున్నాడు. ధాన్యాన్ని దంచి నలగగొట్టి నూరి పిండిగా చేసి రొట్టెగా చేస్తారు యెషయా 53:10 మత్తయి 26:67-68 మత్తయి 27:26-30 లూకా 12:50 హెబ్రీయులకు 2:10 హెబ్రీయులకు 2:18.
2. యాజకులగు అహరోను కుమారులయొద్దకు దానిని తేవలెను. అందులో నుండి యాజకుడు తన చేరతో చేరెడు నూనెయు చేరెడు గోధుమపిండియు దాని సాంబ్రాణి అంతయు తీసికొని యెహోవాకు ఇంపైన సువాసనగల హోమముగా బలి పీఠముమీద అందులో ఒక భాగమును జ్ఞాపకార్థముగా దహింపవలెను.
“పిడికెడు”– కొంత భాగాన్ని దేవునికి స్మృతి చిహ్నంగా కాల్చి వేయాలి. ఈ విధంగా బలిపీఠం మీద కాలిపోయినది పూర్తిగా దేవునిదే. తన ప్రజలకు ఆహారంగా అర్పితమైన క్రీస్తు దేవునికి కూడా సంతృప్తి కలిగించాడు. “నూనె”– నూనె పవిత్రాత్మకు గుర్తు (నిర్గమకాండము 27:20) పవిత్రాత్మ యేసుప్రభువును ఆయన చెయ్యవలసిన సేవకోసం అభిషేకించాడు (లూకా 3:22 లూకా 4:17-20 అపో. కార్యములు 10:38). “సాంబ్రాణి”– ఆ రోజుల్లో సుగంధ ద్రవ్యాలన్నిటిలోకీ ఇది విలువైనది. దీన్ని సన్నిధి గుడారంలో పవిత్ర ధూపం వెయ్యడానికి వాడేవారు (నిర్గమకాండము 30:34-35). యేసు పుట్టినప్పుడు జ్ఞానులు ఆయనకు తెచ్చిన కానుకల్లో ఇది ఒకటి (మత్తయి 2:11). ఇది ఆయన జీవితాన్నీ ఆయన చేసిన ప్రార్థనలనూ గుర్తుకు తెస్తున్నది గదా.
3. ఆ నైవేద్య శేషము అహరోనుకును అతని కుమారులకును ఉండును. యెహోవాకు అర్పించు హోమములలో అది అతిపరిశుద్ధము.
యోహాను 6:33. క్రీస్తును సూచించేవి అన్నీ అతి పవిత్రంగా ఉన్నాయి. పవిత్రత గురించి లేవీయకాండము 20:7 నోట్ చూడండి. “అతడి కొడుకులకూ”– దేవుని ప్రజల అర్పణల్లో కొంత భాగం దేవుని సేవకుల పోషణార్థం ఉంటుంది - వ 10; లేవీయకాండము 5:13 లేవీయకాండము 6:26 లేవీయకాండము 7:6-10.
4. నీవు పొయ్యిలో కాల్చిన నైవేద్యము చేయునప్పుడు అది నూనె కలిసినదియు, పొంగనిదియునైన గోధుమపిండి అప్పడములే గాని నూనె రాచినదియు పొంగనిదియునైన పూరీలేగాని కావలెను.
పొయ్యిలో కాల్చడం బహుశా క్రీస్తు భరించిన ఘోరశ్రమలను సూచిస్తున్నది (1 పేతురు 4:1 1 పేతురు 4:12-13). “పొంగజేసే పదార్థం”– నిర్గమకాండము 12:8 నోట్స్.
5. నీ అర్పణము పెనముమీద కాల్చిన నైవేద్యమైనయెడల అది నూనె కలిసినదియు పొంగనిదియునైన గోధుమపిండిదై యుండవలెను.
“నూనె కలిపి” – అంటే క్రీస్తు ఆత్మమూలంగా జన్మించడమే కాక ఆత్మాభిషేకాన్ని కూడా పొందాడు అన్న విషయానికి సూచన కావచ్చు (మత్తయి 1:18 మత్తయి 1:20 లూకా 1:35).
6. అది నైవేద్యము గనుక నీవు దాని ముక్కలుగా త్రుంచి వాటి మీద నూనె పోయవలెను.
మత్తయి 26:26.
7. నీవు అర్పించునది కుండలో వండిన నైవేద్యమైన యెడల నూనె కలిసిన గోధుమపిండితో దానిని చేయవలెను.
8. వాటితో చేయబడిన నైవేద్యమును యెహోవాయొద్దకు తేవలెను. యాజకునియొద్దకు దానిని తెచ్చిన తరువాత అతడు బలిపీఠము దగ్గరకు దానిని తేవలెను
9. అప్పుడు యాజకుడు ఆ నైవేద్యములో ఒక భాగమును జ్ఞాపకార్థముగా తీసి బలిపీఠముమీద యెహోవాకు ఇంపైన సువాసనగల హోమముగా దాని దహింపవలెను.
10. ఆ నైవేద్యశేషము అహరోనుకును అతని కుమారులకును జెందును. యెహోవాకు అర్పించు హోమములలో అది అతిపరిశుద్ధము.
11. మీరు యెహోవాకు చేయు నైవేద్యమేదియు పులిసి పొంగినదానితో చేయకూడదు. ఏలయనగా పులిసినదైనను తేనెయైనను యెహోవాకు హోమముగా దహింపవలదు.
తేనె చెడిపోయే పదార్థం. అది పులిసి పొంగవచ్చు. క్రీస్తులో ఇలాంటి లక్షణమేది లేదు.
12. ప్రథమఫలముగా యెహోవాకు వాటిని అర్పింపవచ్చును గాని బలిపీఠముమీద ఇంపైన సువాసనగా వాటి నర్పింప వలదు.
పొంగజేసే పదార్థం, తేనె కీడునూ చెడునూ సూచిస్తాయి. వీటిని ప్రథమ ఫలాలతో అర్పించడానికి ఏ అభ్యంతరమూ లేదు. ఎందుకంటే ప్రథమఫలాలు పాపాలనుంచి విముక్తి పొందిన మనుషులకు సూచన. ఇలాంటి వారిలో ఇంకా కొంత పాపం ఉంది. రోమీయులకు 16:5 1 కోరింథీయులకు 16:15 యాకోబు 1:18 1 యోహాను 1:8-10.
13. నీవు అర్పించు ప్రతి నైవేద్యమునకు ఉప్పు చేర్చవలెను. నీ దేవుని నిబంధనయొక్క ఉప్పు నీ నైవేద్యము మీద ఉండవలెను, నీ అర్పణములన్నిటితోను ఉప్పు అర్పింపవలెను.
యెహోషువ 43:24 మార్కు 9:49-50 లూకా 14:33-34 కొలొస్సయులకు 4:6. ఉప్పు పొంగజేసే పదార్థానికి వ్యతిరేక గుణం కలది. ఇది చెడిపోకుండా ఉంచుతుంది. సంఖ్యాకాండము 18:19 2 దినవృత్తాంతములు 13:5 వాక్యభాగాల్లో హీబ్రూ భాషలో “ఉప్పు ఒడంబడిక” అనేమాట ఉంది. అంటే ఇది శాశ్వతమైన ఒడంబడిక, దీనికి మార్పు లేదు, కల్తీ లేదు.
14. నీవు యెహోవాకు ప్రథమఫలముల నైవేద్యమును చేయునప్పుడు సారమైన భూమిలో పుట్టిన పచ్చని వెన్నులలోని ఊచబియ్యమును వేయించి విసిరి నీ ప్రథమఫలముల నైవేద్యముగా అర్పింపవలెను.
క్రీస్తును మనకోసం నలగ్గొట్టి నిప్పుల్లో ఉంచినట్టుంది.
15. అది నైవేద్యరూపమైనది, నీవు దానిమీద నూనెపోసి దాని పైని సాంబ్రాణి వేయవలెను.
ధాన్య నైవేద్యాలు క్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాయి గాని నేటి విశ్వాసులు ఏమై ఉండాలో ఏమి చెయ్యాలోకూడా దీన్లో కనిపిస్తున్నది. వారు పూర్తిగా దేవునికి ప్రతిష్ఠితులై పొంగజేసే పదార్థం లేకుండా (1 కోరింథీయులకు 5:7-8), చెడిపోయిన ప్రతి దాన్నీ విసర్జించి, ఉప్పువల్ల రుచి పొందినవారై పవిత్రాత్మ అభిషేకం పొంది పవిత్రమైన తమ సేవ వల్ల దేవునికి పరిమళంగా ఉండాలి.
16. అందులో జ్ఞాపకార్థమైన భాగమును, అనగా విసిరిన ధాన్యములో కొంతయు, నూనెలో కొంతయు, దాని సాంబ్రాణి అంతయు యాజకుడు దహింపవలెను. అది యెహోవాకు హోమము.