Turn Off
21st Century KJV
A Conservative Version
American King James Version (1999)
American Standard Version (1901)
Amplified Bible (1965)
Apostles' Bible Complete (2004)
Bengali Bible
Bible in Basic English (1964)
Bishop's Bible
Complementary English Version (1995)
Coverdale Bible (1535)
Easy to Read Revised Version (2005)
English Jubilee 2000 Bible (2000)
English Lo Parishuddha Grandham
English Standard Version (2001)
Geneva Bible (1599)
Hebrew Names Version
Hindi Bible
Holman Christian Standard Bible (2004)
Holy Bible Revised Version (1885)
Kannada Bible
King James Version (1769)
Literal Translation of Holy Bible (2000)
Malayalam Bible
Modern King James Version (1962)
New American Bible
New American Standard Bible (1995)
New Century Version (1991)
New English Translation (2005)
New International Reader's Version (1998)
New International Version (1984) (US)
New International Version (UK)
New King James Version (1982)
New Life Version (1969)
New Living Translation (1996)
New Revised Standard Version (1989)
Restored Name KJV
Revised Standard Version (1952)
Revised Version (1881-1885)
Revised Webster Update (1995)
Rotherhams Emphasized Bible (1902)
Tamil Bible
Telugu Bible (BSI)
Telugu Bible (WBTC)
The Complete Jewish Bible (1998)
The Darby Bible (1890)
The Douay-Rheims American Bible (1899)
The Message Bible (2002)
The New Jerusalem Bible
The Webster Bible (1833)
Third Millennium Bible (1998)
Today's English Version (Good News Bible) (1992)
Today's New International Version (2005)
Tyndale Bible (1534)
Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537)
Updated Bible (2006)
Voice In Wilderness (2006)
World English Bible
Wycliffe Bible (1395)
Young's Literal Translation (1898)
Telugu Bible Verse by Verse Explanation
పరిశుద్ధ గ్రంథ వివరణ
Telugu Bible Commentary
Telugu Reference Bible
1. మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము
1. And the Lorde talked with Moses saynge:
2. ఇశ్రాయేలీయులలోనేగాని ఇశ్రాయేలు ప్రజలలో నివసించు పరదేశులలోనేగాని యొకడు ఏమాత్రమును తన సంతానమును మోలెకుకు ఇచ్చినయెడల వానికి మరణ శిక్షవిధింపవలెను; మీ దేశప్రజలు రాళ్లతో వాని కొట్టవలెను.
2. tell the childern of Israel, whosoeuer he be of the childern of Israel or of the straungers that dwel in Israel, that geueth of his seed vnto Moloch he shall dye for it: the people off the lande shall stone hi with stones.
3. ఆ మనుష్యుడు నా పరిశుద్ధస్థలమును అపవిత్రపరచి నా పరిశుద్ధనామమును అపవిత్రపరచుటకు తన సంతానమును మోలెకుకు ఇచ్చెను గనుక నేను వానికి విరోధినై ప్రజలలోనుండి వాని కొట్టివేతును.
3. And I wil sett my face apon that felowe, and will destroye him from amonge his people: because he hath geuen of his seed vnto Moloch, for to defile my sanctuary and to polute myne holy name.
4. మరియు ఆ మనుష్యుడు తన సంతానమును మోలెకుకు ఇచ్చుచుండగా మీ దేశ ప్రజలు వాని చంపక,
4. And though that the people of the lande hyde their eyes from that felowe, when he geueth of his seed vnto Moloch, so that they kyll him not:
5. చూచి చూడనట్లు తమ కన్నులు మూసికొనినయెడల నేను వానికిని వాని కుటుంబమునకును విరోధినై వానిని మోలెకుతో వ్యభిచరించుటకు వాని తరిమి వ్యభిచారముచేయు వారినందరిని ప్రజలలోనుండి కొట్టివేతును.
5. yet I will put my face apon that man and apon his houssholde, and will destroy him and all that goo a whooringe with him and comytt hoordome with Moloch from amonge their people.
6. మరియు కర్ణపిశాచి గలవారితోను సోదెగాండ్ర తోను వ్యభిచరించుటకు వారితట్టు తిరుగువాడెవడో నేను వానికి విరోధినై ప్రజలలోనుండి వాని కొట్టి వేతును.
6. Yf any soule turne vnto them that worke with spirites or makers of dysemall dayes and goo a whoorynge after them, I wilt put my face apon that soule and will destroye him from amonge his people.
7. కావున మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొని పరిశుద్ధులై యుండుడి; నేను మీ దేవుడనైన యెహోవాను.1 పేతురు 1:16
7. Sanctifie youre selues therfore and be holye, for I am the Lorde youre God.
8. మీరు నా కట్టడలను ఆచరించి వాటిని అనుసరింపవలెను, నేను మిమ్మును పరిశుద్ధపరచు యెహోవాను
8. And se that ye kepe myne ordinaunces and doo them. For I am the Lorde which sanctifie you.
9. ఎవడు తన తండ్రినైనను తన తల్లినైనను దూషించునో వానికి మరణశిక్ష విధింపవలెను. వాడు తన తండ్రినో తల్లినో దూషించెను గనుక తన శిక్షకు తానే కారకుడు.మత్తయి 15:4, మార్కు 7:10
9. Whosoeuer curseth his father or mother, shall dye for it, his bloude on his heed, because he hath cursed his father or mother.
10. పరుని భార్యతో వ్యభిచరించిన వానికి, అనగా తన పొరుగు వాని భార్యతో వ్యభిచరించినవానికిని ఆ వ్యభిచారిణికిని మరణశిక్ష విధింపవలెను.యోహాను 8:5
10. He that breaketh wedlocke with another mans wife shall dye for it: because he hath broke wedlocke with his neghbours wife, and so shall she likewise.
11. తన తండ్రి భార్యతో శయనించిన వాడు తన తండ్రి మానాచ్ఛాదనమును తీసెను; వారిద్దరికిని మరణశిక్ష విధింపవలెను; తమ శిక్షకు తామే కారకులు.
11. Yf a man lye with his fathers wife ad vncouer his fathers secrettes, they shall both dye for it, their bloude be apon their heedes.
12. ఒకడు తన కోడలితో శయనించినయెడల వారిద్దరికిని మరణశిక్ష విధింపవలెను. వారు వారి వరసలు తప్పిరి; వారి ప్రాణాపరాధము వారిమీదనుండును.
12. Yf a man lye with his doughter in lawe thei shall dye both of them: they haue wrought abhominacion, their bloud vpon their heedes.
13. ఒకడు స్త్రీతో శయనించినట్టు పురుషునితో శయనించిన యెడల వారిద్దరు హేయక్రియనుచేసిరి గనుక వారికి మరణశిక్ష విధింపవలెను; తమ శిక్షకు తామే కారకులు.రోమీయులకు 1:27
13. Yf a man lye with the mankynde after the maner as with woma kynd, they haue both comitted an abhominacion and shall dye for it. Their bloude be apon their heed.
14. ఒకడు స్త్రీని ఆమె తల్లిని పెండ్లిచేసికొనినయెడల అది దుష్కామ ప్రవర్తన. దుష్కామప్రవర్తన మీ మధ్య నుండకుండ వానిని వారిని అగ్నితో కాల్చవలెను.
14. Yf a man take a wife ad hir mother thereto, it is wekednesse. Me shall burne with fire both him and them, that there be no wekednesse amonge you.
15. జంతు శయనము చేయువానికి మరణశిక్ష విధింపవలెను; ఆ జంతువును చంపవలెను.
15. Yf a man lye with a beest he shall dye, and ye shall slee the beest.
16. స్త్రీ తన్ను జంతువు పొందునట్లు దాని సమీపించినయెడల ఆ స్త్రీకిని ఆ జంతువునకును మరణమే విధి; ఆమెను దానిని చంపవలెను; తమశిక్షకు తామే కారకులు.
16. Yf a woma go vnto a beest ad lye doune thereto: thou shalt kyll the woma ad the beest also they shal dye, ad their bloud be apo their hedes
17. ఒకడు తన సహోదరిని, అనగా తన తండ్రి కుమార్తెనే గాని తన తల్లి కుమార్తెనేగాని చేర్చుకొని ఆమె దిసమొలను వాడును వాని దిసమొలను ఆమెయు చూచిన యెడల అది దురనురాగము. వారికిని తమ జనులయెదుట మరణశిక్ష విధింపవలెను. వాడు తన సహోదరిని మానా చ్ఛాదనమును తీసెను; తన దోష శిక్షను తాను భరించును.
17. Yf a ma take his syster his fathers doughter or his mothers doughter, ad se hir secrettes, and she se his secrettes also: it is a weked thinge. Therfore let them perish in the syghte of their people, he hath sene his systers secretnesse, he shall therfore bere his synne.
18. కడగానున్న స్త్రీతో శయనించి ఆమె మానాచ్ఛాదనమును తీసినవాడు ఆమె రక్తధారాచ్ఛాదనమును తీసెను; ఆమె తన రక్త ధారాచ్ఛాదనమును తీసివేసెను; వారి ప్రజలలోనుండి వారిద్దరిని కొట్టివేయవలెను.
18. Yf a man lye with a woman in tyme of hyr naturall disease and unheale hir secrettes and vncouer hir fountayne, ad she also open the fountayne of hir bloude, they shall both perishe from amonge their people.
19. నీ తల్లి సహోదరి మానాచ్ఛాదనమునేగాని నీ తండ్రి సహోదరి మానాచ్ఛాదనమునేగాని తీయకూడదు; తీసినవాడు తన రక్త సంబంధియొక్క మానాచ్ఛాదనమును తీసెను; వారు తమ దోషశిక్షను భరించెదరు.
19. Thou shalt not vncouer the secrettes of thy mothers syster nor of thy fathers systers, for he that doth so, vncouereth his nexte kyn: ad thei shall bere their mysdoynge.
20. పినతల్లితోనేగాని పెత్తల్లితోనే గాని శయనించినవాడు తన తలిదండ్రుల సహోదరుల మానాచ్ఛాదనమును తీసెను, వారు తమ పాపశిక్షను భరించెదరు; సంతానహీనులై మరణమగుదురు.
20. Yf a ma lye with his vncles wife, he hath vncouered his vncles secrettes: they shall bere their synne, and shall dye childlesse.
21. ఒకడు తన సహోదరుని భార్యను చేర్చుకొనినయెడల అది హేయము. వాడు తన సహోదరుని మానాచ్ఛాదనమును తీసెను; వారు సంతానహీనులై యుందురు.మత్తయి 14:3-4
21. Yf a ma take his brothers wife, it is an vnclene thinge, he hath vncouered his brothers secrettes, they shalbe childlesse therfore.
22. కాబట్టి మీరు నివసించునట్లు నేను ఏ దేశమునకు మిమ్మును తీసికొని పోవుచున్నానో ఆ దేశము మిమ్మును కక్కివేయకుండునట్లు మీరు నా కట్టడలన్నిటిని నా విధులన్నిటిని అనుసరించి నడుచుకొనవలెను.
22. Se that ye kepe therfore all myne ordinaunces and all my iudgementes, and that ye doo them: that the londe whether I brynge you to dwell therein, spewe you not oute.
23. నేను మీ యెదుటనుండి వెళ్లగొట్టుచున్న జనముల ఆచారములను బట్టి నడుచుకొనకూడదు. వారు అట్టి క్రియలన్నియు చేసిరి గనుక నేను వారియందు అసహ్య పడితిని.
23. And se that ye walke not in the maners of the nacyons whiche I cast oute before you: For they commytted all these thinges, and I abhorred them.
24. నేను మీతో చెప్పిన మాట యిదేమీరు వారి భూమిని స్వాస్థ్యముగా పొందుదురు; అది, అనగా పాలు తేనెలు ప్రవహించు ఆ దేశము, మీకు స్వాస్థ్యముగా ఉండునట్లు దాని మీకిచ్చెదను. జనములలోనుండి మిమ్మును వేరుపరచిన మీ దేవుడనైన యెహోవాను నేనే.
24. But I haue sayde vnto you that ye shall enioye their londe, and that I will geue it vnto you to possesse it: eue a londe that floweth with milke and honye. I am the Lord youre God, whiche haue separated you from other nacions:
25. కావున మీరు పవిత్ర జంతువులకును అపవిత్ర జంతువులకును పవిత్ర పక్షులకును అపవిత్ర పక్షులకును విభజన చేయవలెను. అపవిత్రమైనదని నేను మీకు వేరుచేసిన యే జంతువువలననేగాని, యే పక్షివలననేగాని, నేల మీద ప్రాకు దేనివల ననేగాని మిమ్మును మీరు అపవిత్రపరచుకొనకూడదు.
25. that ye shulde put difference betwene cleane beestes add vncleane, and betwene vncleane foules and them that are cleane. Make not youre soules therfore abhominable with beestes ad foules, and with all maner thinge that crepeth apon the grounde, which I haue separated vnto you to holde them vncleane.
26. మీరు నాకు పరిశుద్ధులై యుండవలెను. యెహోవా అను నేను పరిశుద్ధుడను. మీరు నావారై యుండునట్లు అన్య జనులలోనుండి మిమ్మును వేరుపరచితిని.
26. Be holy vnto me, for I the Lorde am holy and haue seuered you from other nacyons: that ye shulde be myne.
27. పురుషునియందేమి స్త్రీయందేమి కర్ణపిశాచియైనను సోదెయైనను ఉండినయెడల వారికి మరణ శిక్ష విధింప వలెను, వారిని రాళ్లతో కొట్టవలెను. తమ శిక్షకు తామే కారకులు.
27. Yf there be ma or woma that worketh with a sprite or a maker of dysemall dayes, thei shall dye for it. Me shall stone them with stones, ad their bloude shalbe apon them.