1. And the LORDE talked with Moses, & sayde:
2. నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము మీరు చాటింపవలసిన యెహోవా నియామక కాలములు ఇవే; ఈ కాలములయందు మీరు పరిశుద్ధ సంఘములుగా కూడవలెను; నా నియామకకాలములు ఇవి.
2. Speake vnto ye children of Israel, and saye vnto them: These are ye feastes of the LORDE, which ye shal call holy dayes.
3. ఆరు దినములు పనిచేయవలెను; వారము వారము ఏడవ దినము విశ్రాంతి దినము; అది పరిశుద్ధసంఘపు దినము. అందులో మీరు ఏ పనియైనను చేయకూడదు. మీ సమస్త నివాసములయందు అది యెహోవా నియమించిన విశ్రాంతిదినము.
3. Sixe dayes shalt thou worke, but the seuenth daie is the rest of the Sabbath, and shalbe called holy. Ye shal do no worke therin, for it is the Sabbath of the LORDE, where so euer ye dwell.
4. ఇవి యెహోవా నియామకకాలములు, నియమించిన కాలములనుబట్టి మీరు చాటింపవలసిన పరిశుద్ధసంఘపు దినములు ఇవి.
4. These are the feastes of the LORDE, yt are called holy, which ye shal call youre feastes:
5. మొదటి నెల పదునాలుగవ దినమున సాయంకాలమందు యెహోవా పస్కాపండుగ జరుగును.
5. Upon ye fourtene daye of ye first moneth at euen, is the LORDES Easter.
6. ఆ నెల పదునయిదవ దినమున యెహోవాకు పొంగని రొట్టెల పండుగ జరుగును; ఏడు దినములు మీరు పొంగని వాటినే తినవలెను
6. And vpon ye fiftene daye of the same moneth is the feast of vnleueded bred of the LORDE. Then shall ye eate vnleuended bred seuen dayes.
7. మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. అందులో మీరు జీవనోపాధి యైన ఏ పనియు చేయకూడదు.
7. The first daie shalbe called holy amonge you, ye shal do no worke of bodage therin,
8. ఏడు దినములు మీరు యెహోవాకు హోమార్పణము చేయవలెను. ఏడవ దినమున పరిశుద్ధసంఘముగా కూడవలెను. అందులో మీరు జీవనోపాధియైన ఏ పనియు చేయకూడదని వారితో చెప్పుము.
8. seue daies shal ye offre vnto ye LORDE. The seueth daie shalbe called holy likewise, wherin ye shal do no worke of bondage also.
9. And ye LORDE talked wt Moses, & sayde:
10. నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము నేను మీ కిచ్చుచున్న దేశమునకు మీరు వచ్చి దాని పంటను కోయునప్పుడు మీ మొదటి పంటలో ఒక పనను యాజకుని యొద్దకు తేవలెను.
10. Speake to the childre of Israel, & saye vnto them: Whan ye come into the lande yt I shall geue you, and reape downe youre haruest, ye shal brynge a shefe of the first frutes of youre haruest vnto the prest,
11. యెహోవా మిమ్ము నంగీకరించునట్లు అతడు యెహోవా సన్నిధిని ఆ పనను అల్లాడింపవలెను. విశ్రాంతిదినమునకు మరుదినమున యాజకుడు దానిని అల్లాడింపవలెను.
11. the shall the shefe be waued before the LORDE, that ye maye be accepted: but this shal the prest do the nexte daye after the Sabbath.
12. మీరు ఆ పనను అర్పించుదినమున నిర్దోషమైన యేడాది పొట్టేలును యెహోవాకు దహనబలిగా అర్పింపవలెను
12. And ye same daie that yor shefe is waued, shal ye offre a burntofferinge vnto the LORDE, of a lambe which is without blemysh and of one yeare olde,
13. దాని నైవేద్యము నూనెతో కలిసిన రెండు పదియవ వంతుల గోధుమపిండి. అది యెహోవాకు ఇంపైన సువాసనగల హోమము. దాని పానార్పణము ముప్పావు ద్రాక్షారసము.
13. wt the meatofferynge, two tenth deales of fyne floure mengled with oyle, for an offerynge of a swete sauoure vnto the LORDE: & the drynk offerynge also, eue the fourth parte of an Hin of wyne.
14. మీరు మీ దేవునికి అర్పణము తెచ్చువరకు ఆ దినమెల్ల మీరు రొట్టెయేమి పేలాలేమి పచ్చని వెన్నులేమి తినకూడదు. ఇది మీ తర తరములకు మీ నివాసస్థలములన్నిటిలో నిత్యమైన కట్టడ.
14. And ye shall eate nether bred, nor cakes, ner furmentye (of new corne) tyll the same daye that ye brynge an offerynge vnto youre God. This shalbe a lawe vnto youre posterities, where so euer ye dwell.
15. మీరు విశ్రాంతిదినమునకు మరునాడు మొదలుకొని, అనగా అల్లాడించు పనను మీరు తెచ్చిన దినము మొదలుకొని యేడు వారములు లెక్కింపవలెను; లెక్కకు తక్కువ కాకుండ ఏడు వారములు ఉండవలెను.
అపో. కార్యములు 2:1, 1 కోరింథీయులకు 16:8
15. Then shal ye nombre (from the nexte daye after the Sabbath, whan ye brought ye Waueshefe) seuen whole wekes,
16. ఏడవ విశ్రాంతి దినపు మరుదినమువరకు మీరు ఏబది దినములు లెక్కించి యెహోవాకు క్రొత్తఫలముతో నైవేద్యము అర్పింపవలెను.
16. vntyll the nexte daie after ye seueth weke, namely, fiftie daies, shal ye nombre, and offre new meatofferynges vnto the LORDE.
17. మీరు మీ నివాసములలోనుండి తూములో రెండేసి పదియవవంతుల పిండిగల రెండు రొట్టెలను అల్లాడించు అర్పణముగా తేవలెను. వాటిని గోధుమపిండితో చేసి పులియబెట్టి కాల్చవలెను. అవి యెహోవాకు ప్రథమఫలముల అర్పణము.
17. And out of all youre dwellinges shal ye offre, namely, two Waue loaues of two tenth deales of fyne floure leueded, and baken for the first frutes vnto ye LORDE.
18. మరియు మీరు ఆ రొట్టెలతో నిర్దోషమైన యేడు ఏడాది మగ గొఱ్ఱెపిల్లలను ఒక కోడెదూడను రెండు పెద్ద పొట్టేళ్లను అర్పింపవలెను. అవి వారి నైవేద్యములతోను వారి పానార్పణములతోను దహనబలియై యెహోవాకు ఇంపైన సువాసనగల హోమమగును.
18. And with youre bred ye shal brynge seuen lambes of one yeare olde without blemysh, and a yonge bullocke, and two rammes: this shalbe the LORDES burntofferynge, meatofferynge, and drynkoffrynge. This is a sacrifice of a swete sauoure vnto the LORDE.
19. అప్పుడు మీరు మేకలలో ఒక పోతును పాప పరిహారార్థబలిగా అర్పించి రెండు ఏడాది గొఱ్ఱెపిల్లలను సమాధానబలిగా అర్పింపవలెను.
19. Morouer ye shal offre an he goate for a synofferynge, and two lambes of a yeare olde for an healthofferynge.
20. యాజకుడు ప్రథమఫలముల రొట్టెలతో వాటిని ఆ రెండు పొట్టేళ్లను యెహోవా సన్నిధిని అల్లాడింపవలెను. అవి యెహోవాకు ప్రతి ష్ఠింపబడినవై యాజకునివగును.
20. And ye prest shal waue it vpon the bred of the first frutes before the LORDE with the two lambes: And they shalbe holy vnto the LORDE, and shalbe the prestes.
21. ఆనాడే మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెనని చాటింపవలెను. అందులో మీరు జీవనోపాధియైన ఏ పనియు చేయకూడదు. ఇది మీ సమస్తనివాసములలో మీ తరతరములకు నిత్యమైన కట్టడ.
21. And this daye shal ye proclame, for it shalbe called holy amonge you: no seruyle worke shal ye do therin. A perpetuall lawe shall it be amonge yor posterities, where so euer ye dwell.
22. మీరు మీ పంటచేను కోయునప్పుడు నీ పొలము యొక్క ఓరలను పూర్తిగా కోయకూడదు, నీ కోతలో రాలిన పరిగెను ఏరుకొనకూడదు, బీదలకును పరదేశులకును వాటిని విడిచిపెట్టవలెను; నేను మీ దేవుడనైన యెహోవాను.
22. Whan ye reape downe ye haruest of youre londe, ye shal not cut it cleane downe vpo the felde, ner gather vp all, but shal leaue it for the poore and straungers. I am the LORDE youre God.
23. And ye LORDE talked with Moses, and sayde:
24. నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము ఏడవ నెలలో మొదటి దినము మీకు విశ్రాంతిదినము. అందులో జ్ఞాపకార్థశృంగధ్వని వినినప్పుడు మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను.
24. Speake vnto the children of Israel, & saye: Vpon the first daye of the seuenth moneth shal ye haue the holy rest of the remembraunce of blowinge,
25. అందులో మీరు జీవనోపాధియైన ఏ పనియు చేయుట మాని యెహోవాకు హోమము చేయవలెను.
25. wherin ye shal do no seruyle worke, and ye shal offre sacrifice vnto the LORDE.
26. And the LORDE spake vnto Moses, and sayde:
27. ఈ యేడవ నెల పదియవ దినము పాపము నిమిత్తమైన ప్రాయశ్చిత్తార్థ దినము; అందులో మీరు పరిశుద్ధసంఘముగా కూడవలెను. మిమ్మును మీరు దుఃఖపరచుకొని యెహోవాకు హోమము చేయవలెను.
27. Vpon the tenth daye in this seuenth moneth is the daye of reconcylinge, which shalbe an holy conuocacion wt you. Ye shal humble youre soules therin, and offre vnto the LORDE,
28. ఆ దినమున మీరు ఏ పనియు చేయకూడదు; మీ దేవుడైన యెహోవా సన్నిధిని మీరు మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసికొనుటకై అది ప్రాయశ్చిత్తార్థ దినము.
28. and shal do no seruyle worke in this daye: for it is the daye of attonement, that ye maye be reconcyled before the LORDE youre God.
29. ఆ దినమున తన్ను తాను దుఃఖపరుచుకొనని ప్రతివాడు తన ప్రజలలోనుండి కొట్టివేయబడును.
అపో. కార్యములు 3:23
29. For what soule so euer humbleth not him self vpon this daye, the same shalbe roted out from amonge his people.
30. ఆ దినమున ఏ పనినైనను చేయు ప్రతివానిని వాని ప్రజలలోనుండకుండ నాశము చేసెదను.
30. And what soule so euer doth eny worke this daye, the same wil I destroye from amonge his people:
31. అందులో మీరు ఏ పనియు చేయకూడదు. అది మీ సమస్త నివాసములలో మీ తరతరములకు నిత్యమైన కట్టడ.
31. therfore shall ye do no worke. This shalbe a perpetuall lawe vnto youre posterities, where so euer ye dwell.
32. అది మీకు మహా విశ్రాంతిదినము, మిమ్మును మీరు దుఃఖపరచుకొనవలెను. ఆ నెల తొమ్మిదవనాటి సాయం కాలము మొదలుకొని మరుసటి సాయంకాలమువరకు మీరు విశ్రాంతిదినముగా ఆచరింపవలెను.
32. It is the rest of youre Sabbath, that ye maye humble youre soules. Vpon the nyenth daye of ye moneth at euen, shal ye kepe this holy daye from the euen forth vntyll the eue agayne.
33. And the LORDE talked with Moses, & sayde:
34. నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుముఈ యేడవ నెల పదునయిదవ దినము మొదలుకొని యేడు దినములవరకు యెహోవాకు పర్ణశాలల పండుగను జరుపవలెను.
యోహాను 7:2
34. Vpon the fiftene daye of the seuenth moneth, is the feast of Tabernacles seuen dayes vnto the LORDE.
35. వాటిలో మొదటి దినమున మీరు పరిశుద్ధసంఘముగా కూడవలెను. అందులో మీరు జీవనోపాధియైన యే పనియు చేయకూడదు.
35. The first daye shalbe an holy couocacion: no seruyle worke shal ye do therin.
36. ఏడు దినములు మీరు యెహోవాకు హోమము చేయవలెను. ఎనిమిదవ దినమున మీరు పరిశుద్ధసంఘముగా కూడి యెహోవాకు హోమార్పణము చేయవలెను. అది మీకు వ్రతదినముగా ఉండును. అందులో మీరు జీవనోపాధియైన యే పనియు చేయకూడదు.
యోహాను 7:37
36. Seuen dayes shal ye offre vnto the LORDE. The eight daye shalbe an holy conuocacion vnto you also, and ye shal offre vnto the LORDE: for it is the daye of gatheringe together: No seruyle worke shall ye do therin.
37. యెహోవా నియమించిన విశ్రాంతిదినములు గాకయు, మీరు దానములనిచ్చు దినములుగాకయు, మీ మ్రొక్కు బడి దినములుగాకయు, మీరు యెహోవాకు స్వేచ్ఛార్పణములనిచ్చు దినములుగాకయు, యెహోవాకు హోమ ద్రవ్యమునేమి దహనబలి ద్రవ్యము నేమి నైవేద్యమునేమి బలినేమి పానీ యార్పణముల నేమి అర్పించుటకై పరిశుద్ధ సంఘపు దినములుగా మీరు చాటింపవలసిన యెహోవా నియామక కాలములు ఇవి.
37. These are the holy daies of the LORDE, which ye shall proclame and holde for holy conuocacions, that ye maye offre vnto the LORDE burntofferynges, meatofferynges, drynkofferynges and other offerynges, euery one acordinge to his daye,
38. ఏ అర్పణదినమున ఆ అర్పణమును తీసికొని రావలెను.
38. besyde ye Sabbathes of ye LORDE, and youre giftes, and vowes, and frewylofferynges, that ye offre vnto the LORDE.
39. అయితే ఏడవ నెల పదునయిదవ దినమున మీరు భూమిపంటను కూర్చుకొనగా ఏడు దినములు యెహోవాకు పండుగ ఆచరింపవలెను. మొదటి దినము విశ్రాంతి దినము, ఎనిమిదవ దినము విశ్రాంతిదినము.
39. So vpon the fiftene daye of the seuenth moneth, whan ye haue brought in the increase of the londe, ye shall kepe the LORDES feast seuen dayes longe. The first daye shalbe kepte holy daye, and the eight daye shalbe kepte holy daye also.
40. మొదటి దినమున మీరు దబ్బపండ్లను ఈతమట్టలను గొంజి చెట్లకొమ్మలను కాలువలయొద్దనుండు నిరవంజి చెట్లను పట్టుకొని యేడుదినములు మీ దేవుడైన యెహోవా సన్నిధిని ఉత్సహించుచుండవలెను.
40. And vpon the first daie ye shal take of ye goodly frutefull trees, braunches of palme trees, & bowes of thicke trees, and Wyllies of the broke, and seue dayes shal ye be mery before ye LORDE youre God:
41. అట్లు మీరు ఏటేట ఏడు దినములు యెహోవాకు పండుగగా ఆచరింపవలెను. ఇది మీ తర తరములలో నిత్యమైన కట్టడ. ఏడవ నెలలో దానిని ఆచరింపవలెను.
41. and thus shal ye kepe the feast vnto the LORDE seuen dayes in the yeare. This shalbe a perpetuall lawe amonge youre posterities, that they kepe holy daye thus in ye seuenth moneth.
42. నేను ఐగుప్తుదేశములోనుండి ఇశ్రాయేలీయులను రప్పించినప్పుడు వారిని పర్ణశాలలో నివసింప చేసితినని మీ జనులు ఎరుగునట్లు ఏడు దినములు మీరు పర్ణశాలలలో నివసింపవలెను. ఇశ్రాయేలీయులలో పుట్టిన వారందరు పర్ణశాలలలో నివసింపవలెను.
42. Seuen dayes shal ye dwell in bothes. Who so euer is an Israelite borne, shal dwell in bothes,
43. నేను మీ దేవుడనైన యెహోవాను.
43. that they which come after you, maye knowe, how that I made ye children of Israel to dwell in bothes, whan I brought them out of the lode of Egipte. I am the LORDE youre God.
44. అట్లు మోషే ఇశ్రాయేలీయులకు యెహోవా నియామక కాలములను తెలియచెప్పెను.
44. And Moses tolde the children of Israel these holy daies of the LORDE.
Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Leviticus - లేవీయకాండము 23 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible
ప్రభువు యొక్క విందులు, సబ్బాత్. (1-3)
ఈ అధ్యాయం దేవునికి ముఖ్యమైన ప్రత్యేక సమయాల గురించి మాట్లాడుతుంది. వీటిలో కొన్ని ఇంతకు ముందు ప్రస్తావించబడ్డాయి. ప్రజలు ఈ సమయాలలో కొన్నింటికి పవిత్ర స్థలంలో జరిగే ప్రత్యేక కూటాలకు వెళ్ళినప్పటికీ, వారు ఇప్పటికీ వారందరినీ సబ్బాత్ రోజు వలెనే ప్రాముఖ్యంగా పరిగణించాలి. సబ్బాత్ రోజున, ప్రజలు వారి సాధారణ పని నుండి విరామం తీసుకోవాలి మరియు ఆధ్యాత్మిక విశ్రాంతి మరియు దేవునితో కనెక్ట్ అవ్వడంపై దృష్టి పెట్టాలి. ఇంట్లో కుటుంబ సమేతంగా మరియు పవిత్ర సమావేశాలలో ఇతర కుటుంబాలతో కలిసి సబ్బాత్‌ను పాటించడం చాలా ముఖ్యం. అలా చేయడం వల్ల గృహాలు అందంగా, దృఢంగా మరియు సురక్షితంగా ఉంటాయి మరియు ప్రజలు మరింత మెరుగ్గా మారడానికి మరియు దేవుణ్ణి మహిమపరచడానికి సహాయపడతారు.
పస్కా, ప్రథమ ఫలాల సమర్పణ. (4-14)
పాస్ ఓవర్ వేడుక ఏడు రోజుల పాటు కొనసాగింది మరియు కొంతమందికి కొన్ని సెలవులు వంటి ఆటలు ఆడటానికి మాత్రమే సమయం కాదు. ప్రజలు దేవునికి బహుమతులు ఇస్తారు మరియు వారి సమయాన్ని ప్రార్థించడం మరియు దేవుని గురించి ఆలోచించడం నేర్పించారు. తమ పంటలో మొదటి భాగాన్ని కూడా దేవునికి నైవేద్యంగా ఇచ్చేవారు. ఇది యేసు మృతులలో నుండి లేచినట్లు సూచిస్తుంది, ఇది మొదటి ఫలాలు ఇవ్వబడిన అదే రోజున జరిగింది. మన డబ్బుతో దేవునికి కృతజ్ఞతలు చెప్పాలని మరియు మనం సంపాదించిన ప్రతిదానిలో మొదటి భాగాన్ని ఆయనకు ఇవ్వాలని దీని నుండి మనం నేర్చుకుంటాము.
సామెతలు 3:9 మనం మన బొమ్మలను మన స్నేహితులతో ఎలా పంచుకుంటామో అలాగే మన ఆహారాన్ని దేవునితో కూడా పంచుకుంటాము. మనం తినడానికి ముందు ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతలు చెప్పాలి మరియు మనం చేసే ప్రతి పనిలో సహాయం కోసం అడగాలి. మనం ఎల్లప్పుడూ మన జీవితంలో దేవునికి మొదటి స్థానం ఇవ్వాలి.
పెంతెకొస్తు పండుగ. (15-22)
ఈజిప్టును విడిచిపెట్టిన యాభై రోజుల తర్వాత దేవుడు తన ప్రజలకు చట్టాన్ని ఇచ్చినప్పుడు గుర్తుంచుకోవడానికి వారాల విందు ఒక ప్రత్యేక వేడుక. యేసు మన కొరకు మరణించిన యాభై రోజుల తర్వాత, పరిశుద్ధాత్మ ఎప్పుడు వస్తాడో అని ఎదురుచూసే సమయం కూడా ఇది. క్రైస్తవ చర్చి యొక్క మొదటి సభ్యుల కోసం అపొస్తలులు దేవునికి కృతజ్ఞతలు తెలిపారు. పెంతెకొస్తు పండుగ సందర్భంగా, పేదల కోసం ప్రజలు తమ పొలాల్లో కొంత ఆహారాన్ని విడిచిపెట్టాలని గుర్తు చేశారు. దేవుని దయకు కృతజ్ఞత గల వ్యక్తులు కూడా ఫిర్యాదు చేయకుండా అవసరమైన వారి పట్ల దయతో ఉండాలి.
ట్రంపెట్స్ విందు, ప్రాయశ్చిత్త దినం. (23-32)
ట్రంపెట్ శబ్దం దేవుని ప్రేమ గురించి మరియు ఎలా మంచిగా ఉండాలనే దాని గురించి వినడానికి ప్రజలకు పిలుపు వంటిది. ఇది వారికి సంతోషంగా మరియు దేవునికి కృతజ్ఞతతో ఉండాలని మరియు వారు ఈ ప్రపంచాన్ని సందర్శిస్తున్నారని గుర్తుంచుకోవాలని గుర్తు చేసింది. సంవత్సరం ప్రారంభంలో, ట్రంపెట్ వారిని మేల్కొలపడానికి మరియు వారి చర్యల గురించి ఆలోచించమని మరియు మంచిగా ఉండటానికి ప్రయత్నించమని గుర్తు చేసింది. అటోన్మెంట్ డే అనేది ఒక ప్రత్యేకమైన రోజు, ప్రజలు క్షమాపణ కోసం అడగాలి మరియు దేవునితో విషయాలను సరిదిద్దాలి. వారు చాలా సీరియస్‌గా ఉండాలి మరియు వారు చేసిన ఏదైనా తప్పు పనులకు క్షమించాలి. ఇది వారి దృష్టిని ఆకర్షించే ముఖ్యమైన పని. ఆ రోజు దేవుడు తన ప్రజలతో మాట్లాడి వారికి శాంతిని ప్రసాదించాడు. కాబట్టి, వారు తమ సాధారణ రోజువారీ పనులను చేయడం మానేయాలి, తద్వారా వారు దేవుడు చెప్పేది జాగ్రత్తగా వినవచ్చు.
పర్ణశాలల విందు. (33-44)
గుడారాల పండుగ సమయంలో, ప్రజలు తమ పూర్వీకులు అరణ్యంలో ప్రయాణించేటప్పుడు గుడారాలలో నివసించినప్పుడు మరియు వారు మొదట కనానులో స్థిరపడినప్పుడు గుర్తు చేసుకున్నారు. ఇది వారు ఎక్కడ నుండి వచ్చారో మరియు వారు ఎలా రక్షించబడ్డారో వారికి గుర్తు చేసింది. మానవ రూపంలో క్రీస్తు భూమిపై గడిపిన కాలం కూడా ఒక గుడారంలో నివసించినట్లుగా ఉండవచ్చు. ఇది భూమిపై అపరిచితుడు మరియు ప్రయాణికుడు అయిన విశ్వాసి యొక్క జీవితాన్ని సూచిస్తుంది, కానీ వారి ఇల్లు వారి రక్షకునితో స్వర్గంలో ఉంది. ఒక వారం పాటు గుడారాలలో నివసించిన తరువాత, ప్రజలు తమ స్వంత ఇళ్లను మరింత మెచ్చుకున్నారు. కొన్నిసార్లు సులభమైన జీవితాన్ని కలిగి ఉన్న వ్యక్తులు కష్ట సమయాలను అనుభవించడం చాలా ముఖ్యం. మనం మంచి పంటలు పండినప్పుడు, మంచి పంట పండినప్పుడు, మనం దేవునికి కృతజ్ఞతలు చెప్పాలి. మనకు ఉన్నదంతా దేవుని నుండి వచ్చింది, దాని కోసం మనం ఆయనకు క్రెడిట్ ఇవ్వాలి. మనం జరుపుకోవడానికి దేవుడు ప్రత్యేకమైన సెలవుదినాలను సృష్టించాడు, అయితే మనం ప్రతిరోజూ ఆయనను గౌరవించాలని గుర్తుంచుకోవాలి.
Shortcut Links
Explore Parallel Bibles
21st Century KJV |
A Conservative Version |
American King James Version (1999) |
American Standard Version (1901) |
Amplified Bible (1965) |
Apostles' Bible Complete (2004) |
Bengali Bible |
Bible in Basic English (1964) |
Bishop's Bible |
Complementary English Version (1995) |
Coverdale Bible (1535) |
Easy to Read Revised Version (2005) |
English Jubilee 2000 Bible (2000) |
English Lo Parishuddha Grandham |
English Standard Version (2001) |
Geneva Bible (1599) |
Hebrew Names Version |
Hindi Bible |
Holman Christian Standard Bible (2004) |
Holy Bible Revised Version (1885) |
Kannada Bible |
King James Version (1769) |
Literal Translation of Holy Bible (2000) |
Malayalam Bible |
Modern King James Version (1962) |
New American Bible |
New American Standard Bible (1995) |
New Century Version (1991) |
New English Translation (2005) |
New International Reader's Version (1998) |
New International Version (1984) (US) |
New International Version (UK) |
New King James Version (1982) |
New Life Version (1969) |
New Living Translation (1996) |
New Revised Standard Version (1989) |
Restored Name KJV |
Revised Standard Version (1952) |
Revised Version (1881-1885) |
Revised Webster Update (1995) |
Rotherhams Emphasized Bible (1902) |
Tamil Bible |
Telugu Bible (BSI) |
Telugu Bible (WBTC) |
The Complete Jewish Bible (1998) |
The Darby Bible (1890) |
The Douay-Rheims American Bible (1899) |
The Message Bible (2002) |
The New Jerusalem Bible |
The Webster Bible (1833) |
Third Millennium Bible (1998) |
Today's English Version (Good News Bible) (1992) |
Today's New International Version (2005) |
Tyndale Bible (1534) |
Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) |
Updated Bible (2006) |
Voice In Wilderness (2006) |
World English Bible |
Wycliffe Bible (1395) |
Young's Literal Translation (1898) |
Telugu Bible Verse by Verse Explanation |
పరిశుద్ధ గ్రంథ వివరణ |
Telugu Bible Commentary |
Telugu Reference Bible |