Leviticus - లేవీయకాండము 23 | View All

1. మరియయెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను

2. నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము మీరు చాటింపవలసిన యెహోవా నియామక కాలములు ఇవే; ఈ కాలములయందు మీరు పరిశుద్ధ సంఘములుగా కూడవలెను; నా నియామకకాలములు ఇవి.

3. ఆరు దినములు పనిచేయవలెను; వారము వారము ఏడవ దినము విశ్రాంతి దినము; అది పరిశుద్ధసంఘపు దినము. అందులో మీరు ఏ పనియైనను చేయకూడదు. మీ సమస్త నివాసములయందు అది యెహోవా నియమించిన విశ్రాంతిదినము.

4. ఇవి యెహోవా నియామకకాలములు, నియమించిన కాలములనుబట్టి మీరు చాటింపవలసిన పరిశుద్ధసంఘపు దినములు ఇవి.

5. మొదటి నెల పదునాలుగవ దినమున సాయంకాలమందు యెహోవా పస్కాపండుగ జరుగును.

6. ఆ నెల పదునయిదవ దినమున యెహోవాకు పొంగని రొట్టెల పండుగ జరుగును; ఏడు దినములు మీరు పొంగని వాటినే తినవలెను

7. మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. అందులో మీరు జీవనోపాధి యైన ఏ పనియు చేయకూడదు.

8. ఏడు దినములు మీరు యెహోవాకు హోమార్పణము చేయవలెను. ఏడవ దినమున పరిశుద్ధసంఘముగా కూడవలెను. అందులో మీరు జీవనోపాధియైన ఏ పనియు చేయకూడదని వారితో చెప్పుము.

9. మరియయెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను

10. నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము నేను మీ కిచ్చుచున్న దేశమునకు మీరు వచ్చి దాని పంటను కోయునప్పుడు మీ మొదటి పంటలో ఒక పనను యాజకుని యొద్దకు తేవలెను.

11. యెహోవా మిమ్ము నంగీకరించునట్లు అతడు యెహోవా సన్నిధిని ఆ పనను అల్లాడింపవలెను. విశ్రాంతిదినమునకు మరుదినమున యాజకుడు దానిని అల్లాడింపవలెను.

12. మీరు ఆ పనను అర్పించుదినమున నిర్దోషమైన యేడాది పొట్టేలును యెహోవాకు దహనబలిగా అర్పింపవలెను

13. దాని నైవేద్యము నూనెతో కలిసిన రెండు పదియవ వంతుల గోధుమపిండి. అది యెహోవాకు ఇంపైన సువాసనగల హోమము. దాని పానార్పణము ముప్పావు ద్రాక్షారసము.

14. మీరు మీ దేవునికి అర్పణము తెచ్చువరకు ఆ దినమెల్ల మీరు రొట్టెయేమి పేలాలేమి పచ్చని వెన్నులేమి తినకూడదు. ఇది మీ తర తరములకు మీ నివాసస్థలములన్నిటిలో నిత్యమైన కట్టడ.

15. మీరు విశ్రాంతిదినమునకు మరునాడు మొదలుకొని, అనగా అల్లాడించు పనను మీరు తెచ్చిన దినము మొదలుకొని యేడు వారములు లెక్కింపవలెను; లెక్కకు తక్కువ కాకుండ ఏడు వారములు ఉండవలెను.

అపో 2:1 పెంతెకొస్తను పండుగదినము వచ్చినప్పుడు అందరు ఒకచోట కూడియుండిరి.

1 కోరింథీ 16:8 గనుక ఇప్పుడు మార్గములో మిమ్మును చూచుటకు నాకు మనస్సులేదు.

16. ఏడవ విశ్రాంతి దినపు మరుదినమువరకు మీరు ఏబది దినములు లెక్కించి యెహోవాకు క్రొత్తఫలముతో నైవేద్యము అర్పింపవలెను.

17. మీరు మీ నివాసములలోనుండి తూములో రెండేసి పదియవవంతుల పిండిగల రెండు రొట్టెలను అల్లాడించు అర్పణముగా తేవలెను. వాటిని గోధుమపిండితో చేసి పులియబెట్టి కాల్చవలెను. అవి యెహోవాకు ప్రథమఫలముల అర్పణము.

18. మరియు మీరు ఆ రొట్టెలతో నిర్దోషమైన యేడు ఏడాది మగ గొఱ్ఱెపిల్లలను ఒక కోడెదూడను రెండు పెద్ద పొట్టేళ్లను అర్పింపవలెను. అవి వారి నైవేద్యములతోను వారి పానార్పణములతోను దహనబలియై యెహోవాకు ఇంపైన సువాసనగల హోమమగును.

19. అప్పుడు మీరు మేకలలో ఒక పోతును పాప పరిహారార్థబలిగా అర్పించి రెండు ఏడాది గొఱ్ఱెపిల్లలను సమాధానబలిగా అర్పింపవలెను.

20. యాజకుడు ప్రథమఫలముల రొట్టెలతో వాటిని ఆ రెండు పొట్టేళ్లను యెహోవా సన్నిధిని అల్లాడింపవలెను. అవి యెహోవాకు ప్రతి ష్ఠింపబడినవై యాజకునివగును.

21. ఆనాడే మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెనని చాటింపవలెను. అందులో మీరు జీవనోపాధియైన ఏ పనియు చేయకూడదు. ఇది మీ సమస్తనివాసములలో మీ తరతరములకు నిత్యమైన కట్టడ.

22. మీరు మీ పంటచేను కోయునప్పుడు నీ పొలము యొక్క ఓరలను పూర్తిగా కోయకూడదు, నీ కోతలో రాలిన పరిగెను ఏరుకొనకూడదు, బీదలకును పరదేశులకును వాటిని విడిచిపెట్టవలెను; నేను మీ దేవుడనైన యెహోవాను.

23. మరియయెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను.

24. నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము ఏడవ నెలలో మొదటి దినము మీకు విశ్రాంతిదినము. అందులో జ్ఞాపకార్థశృంగధ్వని వినినప్పుడు మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను.

25. అందులో మీరు జీవనోపాధియైన ఏ పనియు చేయుట మాని యెహోవాకు హోమము చేయవలెను.

26. మరియయెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను.

27. ఈ యేడవ నెల పదియవ దినము పాపము నిమిత్తమైన ప్రాయశ్చిత్తార్థ దినము; అందులో మీరు పరిశుద్ధసంఘముగా కూడవలెను. మిమ్మును మీరు దుఃఖపరచుకొని యెహోవాకు హోమము చేయవలెను.

28. ఆ దినమున మీరు ఏ పనియు చేయకూడదు; మీ దేవుడైన యెహోవా సన్నిధిని మీరు మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసికొనుటకై అది ప్రాయశ్చిత్తార్థ దినము.

29. ఆ దినమున తన్ను తాను దుఃఖపరుచుకొనని ప్రతివాడు తన ప్రజలలోనుండి కొట్టివేయబడును.

అపో 3:23 ఆ ప్రవక్త మాట విననివాడు ప్రజలలో ఉండకుండ సర్వనాశనమగుననెను.

30. ఆ దినమున ఏ పనినైనను చేయు ప్రతివానిని వాని ప్రజలలోనుండకుండ నాశము చేసెదను.

31. అందులో మీరు ఏ పనియు చేయకూడదు. అది మీ సమస్త నివాసములలో మీ తరతరములకు నిత్యమైన కట్టడ.

32. అది మీకు మహా విశ్రాంతిదినము, మిమ్మును మీరు దుఃఖపరచుకొనవలెను. ఆ నెల తొమ్మిదవనాటి సాయం కాలము మొదలుకొని మరుసటి సాయంకాలమువరకు మీరు విశ్రాంతిదినముగా ఆచరింపవలెను.

33. మరియయెహోవా మోషేకు ఈలాగు సెల విచ్చెను

34. నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుముఈ యేడవ నెల పదునయిదవ దినము మొదలుకొని యేడు దినములవరకు యెహోవాకు పర్ణశాలల పండుగను జరుపవలెను.

యోహా 7:2 యూదుల పర్ణశాలల పండుగ సమీపించెను గనుక

35. వాటిలో మొదటి దినమున మీరు పరిశుద్ధసంఘముగా కూడవలెను. అందులో మీరు జీవనోపాధియైన యే పనియు చేయకూడదు.

36. ఏడు దినములు మీరు యెహోవాకు హోమము చేయవలెను. ఎనిమిదవ దినమున మీరు పరిశుద్ధసంఘముగా కూడి యెహోవాకు హోమార్పణము చేయవలెను. అది మీకు వ్రతదినముగా ఉండును. అందులో మీరు జీవనోపాధియైన యే పనియు చేయకూడదు.

యోహా 7:37 ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి ఎవడైనను దప్పిగొనిన యెడల నాయొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను.

37. యెహోవా నియమించిన విశ్రాంతిదినములు గాకయు, మీరు దానములనిచ్చు దినములుగాకయు, మీ మ్రొక్కు బడి దినములుగాకయు, మీరు యెహోవాకు స్వేచ్ఛార్పణములనిచ్చు దినములుగాకయు, యెహోవాకు హోమ ద్రవ్యమునేమి దహనబలి ద్రవ్యము నేమి నైవేద్యమునేమి బలినేమి పానీ యార్పణముల నేమి అర్పించుటకై పరిశుద్ధ సంఘపు దినములుగా మీరు చాటింపవలసిన యెహోవా నియామక కాలములు ఇవి.

38. ఏ అర్పణదినమున ఆ అర్పణమును తీసికొని రావలెను.

39. అయితే ఏడవ నెల పదునయిదవ దినమున మీరు భూమిపంటను కూర్చుకొనగా ఏడు దినములు యెహోవాకు పండుగ ఆచరింపవలెను. మొదటి దినము విశ్రాంతి దినము, ఎనిమిదవ దినము విశ్రాంతిదినము.

40. మొదటి దినమున మీరు దబ్బపండ్లను ఈతమట్టలను గొంజి చెట్లకొమ్మలను కాలువలయొద్దనుండు నిరవంజి చెట్లను పట్టుకొని యేడుదినములు మీ దేవుడైన యెహోవా సన్నిధిని ఉత్సహించుచుండవలెను.

41. అట్లు మీరు ఏటేట ఏడు దినములు యెహోవాకు పండుగగా ఆచరింపవలెను. ఇది మీ తర తరములలో నిత్యమైన కట్టడ. ఏడవ నెలలో దానిని ఆచరింపవలెను.

42. నేను ఐగుప్తుదేశములోనుండి ఇశ్రాయేలీయులను రప్పించినప్పుడు వారిని పర్ణశాలలో నివసింప చేసితినని మీ జనులు ఎరుగునట్లు ఏడు దినములు మీరు పర్ణశాలలలో నివసింపవలెను. ఇశ్రాయేలీయులలో పుట్టిన వారందరు పర్ణశాలలలో నివసింపవలెను.

43. నేను మీ దేవుడనైన యెహోవాను.

44. అట్లు మోషే ఇశ్రాయేలీయులకు యెహోవా నియామక కాలములను తెలియచెప్పెను.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Leviticus - లేవీయకాండము 23 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible
ప్రభువు యొక్క విందులు, సబ్బాత్. (1-3) 
ఈ అధ్యాయం దేవునికి ముఖ్యమైన ప్రత్యేక సమయాల గురించి మాట్లాడుతుంది. వీటిలో కొన్ని ఇంతకు ముందు ప్రస్తావించబడ్డాయి. ప్రజలు ఈ సమయాలలో కొన్నింటికి పవిత్ర స్థలంలో జరిగే ప్రత్యేక కూటాలకు వెళ్ళినప్పటికీ, వారు ఇప్పటికీ వారందరినీ సబ్బాత్ రోజు వలెనే ప్రాముఖ్యంగా పరిగణించాలి. సబ్బాత్ రోజున, ప్రజలు వారి సాధారణ పని నుండి విరామం తీసుకోవాలి మరియు ఆధ్యాత్మిక విశ్రాంతి మరియు దేవునితో కనెక్ట్ అవ్వడంపై దృష్టి పెట్టాలి. ఇంట్లో కుటుంబ సమేతంగా మరియు పవిత్ర సమావేశాలలో ఇతర కుటుంబాలతో కలిసి సబ్బాత్‌ను పాటించడం చాలా ముఖ్యం. అలా చేయడం వల్ల గృహాలు అందంగా, దృఢంగా మరియు సురక్షితంగా ఉంటాయి మరియు ప్రజలు మరింత మెరుగ్గా మారడానికి మరియు దేవుణ్ణి మహిమపరచడానికి సహాయపడతారు. 

పస్కా, ప్రథమ ఫలాల సమర్పణ. (4-14) 
పాస్ ఓవర్ వేడుక ఏడు రోజుల పాటు కొనసాగింది మరియు కొంతమందికి కొన్ని సెలవులు వంటి ఆటలు ఆడటానికి మాత్రమే సమయం కాదు. ప్రజలు దేవునికి బహుమతులు ఇస్తారు మరియు వారి సమయాన్ని ప్రార్థించడం మరియు దేవుని గురించి ఆలోచించడం నేర్పించారు. తమ పంటలో మొదటి భాగాన్ని కూడా దేవునికి నైవేద్యంగా ఇచ్చేవారు. ఇది యేసు మృతులలో నుండి లేచినట్లు సూచిస్తుంది, ఇది మొదటి ఫలాలు ఇవ్వబడిన అదే రోజున జరిగింది. మన డబ్బుతో దేవునికి కృతజ్ఞతలు చెప్పాలని మరియు మనం సంపాదించిన ప్రతిదానిలో మొదటి భాగాన్ని ఆయనకు ఇవ్వాలని దీని నుండి మనం నేర్చుకుంటాము. సామెతలు 3:9 మనం మన బొమ్మలను మన స్నేహితులతో ఎలా పంచుకుంటామో అలాగే మన ఆహారాన్ని దేవునితో కూడా పంచుకుంటాము. మనం తినడానికి ముందు ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతలు చెప్పాలి మరియు మనం చేసే ప్రతి పనిలో సహాయం కోసం అడగాలి. మనం ఎల్లప్పుడూ మన జీవితంలో దేవునికి మొదటి స్థానం ఇవ్వాలి. 

పెంతెకొస్తు పండుగ. (15-22) 
ఈజిప్టును విడిచిపెట్టిన యాభై రోజుల తర్వాత దేవుడు తన ప్రజలకు చట్టాన్ని ఇచ్చినప్పుడు గుర్తుంచుకోవడానికి వారాల విందు ఒక ప్రత్యేక వేడుక. యేసు మన కొరకు మరణించిన యాభై రోజుల తర్వాత, పరిశుద్ధాత్మ ఎప్పుడు వస్తాడో అని ఎదురుచూసే సమయం కూడా ఇది. క్రైస్తవ చర్చి యొక్క మొదటి సభ్యుల కోసం అపొస్తలులు దేవునికి కృతజ్ఞతలు తెలిపారు. పెంతెకొస్తు పండుగ సందర్భంగా, పేదల కోసం ప్రజలు తమ పొలాల్లో కొంత ఆహారాన్ని విడిచిపెట్టాలని గుర్తు చేశారు. దేవుని దయకు కృతజ్ఞత గల వ్యక్తులు కూడా ఫిర్యాదు చేయకుండా అవసరమైన వారి పట్ల దయతో ఉండాలి. 

ట్రంపెట్స్ విందు, ప్రాయశ్చిత్త దినం. (23-32) 
ట్రంపెట్ శబ్దం దేవుని ప్రేమ గురించి మరియు ఎలా మంచిగా ఉండాలనే దాని గురించి వినడానికి ప్రజలకు పిలుపు వంటిది. ఇది వారికి సంతోషంగా మరియు దేవునికి కృతజ్ఞతతో ఉండాలని మరియు వారు ఈ ప్రపంచాన్ని సందర్శిస్తున్నారని గుర్తుంచుకోవాలని గుర్తు చేసింది. సంవత్సరం ప్రారంభంలో, ట్రంపెట్ వారిని మేల్కొలపడానికి మరియు వారి చర్యల గురించి ఆలోచించమని మరియు మంచిగా ఉండటానికి ప్రయత్నించమని గుర్తు చేసింది. అటోన్మెంట్ డే అనేది ఒక ప్రత్యేకమైన రోజు, ప్రజలు క్షమాపణ కోసం అడగాలి మరియు దేవునితో విషయాలను సరిదిద్దాలి. వారు చాలా సీరియస్‌గా ఉండాలి మరియు వారు చేసిన ఏదైనా తప్పు పనులకు క్షమించాలి. ఇది వారి దృష్టిని ఆకర్షించే ముఖ్యమైన పని. ఆ రోజు దేవుడు తన ప్రజలతో మాట్లాడి వారికి శాంతిని ప్రసాదించాడు. కాబట్టి, వారు తమ సాధారణ రోజువారీ పనులను చేయడం మానేయాలి, తద్వారా వారు దేవుడు చెప్పేది జాగ్రత్తగా వినవచ్చు. 

పర్ణశాలల విందు. (33-44)
గుడారాల పండుగ సమయంలో, ప్రజలు తమ పూర్వీకులు అరణ్యంలో ప్రయాణించేటప్పుడు గుడారాలలో నివసించినప్పుడు మరియు వారు మొదట కనానులో స్థిరపడినప్పుడు గుర్తు చేసుకున్నారు. ఇది వారు ఎక్కడ నుండి వచ్చారో మరియు వారు ఎలా రక్షించబడ్డారో వారికి గుర్తు చేసింది. మానవ రూపంలో క్రీస్తు భూమిపై గడిపిన కాలం కూడా ఒక గుడారంలో నివసించినట్లుగా ఉండవచ్చు. ఇది భూమిపై అపరిచితుడు మరియు ప్రయాణికుడు అయిన విశ్వాసి యొక్క జీవితాన్ని సూచిస్తుంది, కానీ వారి ఇల్లు వారి రక్షకునితో స్వర్గంలో ఉంది. ఒక వారం పాటు గుడారాలలో నివసించిన తరువాత, ప్రజలు తమ స్వంత ఇళ్లను మరింత మెచ్చుకున్నారు. కొన్నిసార్లు సులభమైన జీవితాన్ని కలిగి ఉన్న వ్యక్తులు కష్ట సమయాలను అనుభవించడం చాలా ముఖ్యం. మనం మంచి పంటలు పండినప్పుడు, మంచి పంట పండినప్పుడు, మనం దేవునికి కృతజ్ఞతలు చెప్పాలి. మనకు ఉన్నదంతా దేవుని నుండి వచ్చింది, దాని కోసం మనం ఆయనకు క్రెడిట్ ఇవ్వాలి. మనం జరుపుకోవడానికి దేవుడు ప్రత్యేకమైన సెలవుదినాలను సృష్టించాడు, అయితే మనం ప్రతిరోజూ ఆయనను గౌరవించాలని గుర్తుంచుకోవాలి. 




Shortcut Links
లేవీయకాండము - Leviticus : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |