Numbers - సంఖ్యాకాండము 16 | View All

1. లేవికి మునిమనుమడును కహాతుకు మనుమడును ఇస్హారు కుమారుడునగు కోరహు, రూబేనీయులలో ఏలీయాబు కుమారులైన దాతాను అబీరాములును, పేలెతు కుమారుడైన ఓనును యోచించుకొని

1. Now Korach the son of Yitz'har, the son of K'hat, the son of Levi, along with Datan and Aviram, the sons of Eli'av, and On, the son of Pelet, descendants of Re'uven, took men and

2. ఇశ్రాయేలీయులలో పేరుపొందిన సభికులును సమాజప్రధానులునైన రెండువందలయేబది మందితో మోషేకు ఎదురుగాలేచి

2. rebelled against Moshe. Siding with them were 250 men of Isra'el, leaders of the community, key members of the council, men of reputation.

3. మోషే అహరోనులకు విరోధముగా పోగుపడి మీతో మాకిక పనిలేదు; ఈ సర్వసమాజములోని ప్రతివాడును పరిశుద్ధుడే యెహోవా వారి మధ్యనున్నాడు; యెహోవా సంఘముమీద మిమ్మును మీరేల హెచ్చించుకొనుచున్నారనగా,

3. They assembled themselves against Moshe and Aharon and said to them, 'You take too much on yourselves! After all, the entire community is holy, every one of them, and ADONAI is among them. So why do you lift yourselves up above ADONAI's assembly?'

4. మోషే ఆ మాట విని సాగిలపడెను. అటు తరువాత అతడు కోరహుతోను వాని సమాజముతోను ఇట్లనెను

4. When Moshe heard this he fell on his face.

5. తనవాడు ఎవడో పరిశుద్ధుడు ఎవడో రేపు యెహోవా తెలియజేసి వానిని తన సన్నిధికి రానిచ్చును. ఆయన తాను ఏర్పరచుకొనినవానిని తనయొద్దకు చేర్చు కొనును.
2 తిమోతికి 2:19

5. Then he said to Korach and his whole group, 'In the morning, ADONAI will show who are his and who is the holy person he will allow to approach him. Yes, he will bring whomever he chooses near to himself.

6. ఈలాగు చేయుడి; కోరహును అతని సమస్త సమూహమునైన మీరును ధూపార్తులను తీసికొని వాటిలో అగ్నియుంచి రేపు యెహోవా సన్నిధిని వాటిమీద ధూపద్రవ్యము వేయుడి.

6. Do this: take censers, Korach and all your group;

7. అప్పుడు యెహోవా యే మనుష్యుని యేర్పరచుకొనునో వాడే పరిశుద్ధుడు. లేవి కుమారులారా, మీతో నాకిక పనిలేదు.

7. put fire in them; and put incense in them before ADONAI tomorrow. The one whom ADONAI chooses will be the one who is holy! It is you, you sons of Levi, who are taking too much on yourselves!'

8. మరియమోషే కోరహుతో ఇట్లనెను లేవి కుమారులారా వినుడి.

8. Then Moshe said to Korach, 'Listen here, you sons of Levi!

9. తన మందిర సేవచేయుటకు యెహోవా మిమ్మును తనయొద్దకు చేర్చుకొనుటయు, మీరు సమాజము ఎదుట నిలిచి వారు చేయవలసిన సేవ చేయునట్లు ఇశ్రాయేలీయుల దేవుడు ఇశ్రాయేలీయుల సమాజములోనుండి మిమ్మును వేరు పరచుటయు మీకు అల్పముగా కనబడునా?

9. Is it for you a mere trifle that the God of Isra'el has separated you from the community of Isra'el to bring you close to himself, so that you can do the work in the tabernacle of ADONAI and stand before the community serving them?

10. ఆయన నిన్నును నీతో లేవీయులైన నీ గోత్రపువారి నందరిని చేర్చుకొనెను గదా. అయితే మీరు యాజకత్వముకూడ కోరుచున్నారు.

10. He has brought you close and all your brothers the sons of Levi with you. Now you want the office of [cohen] too!

11. ఇందు నిమిత్తము నీవును నీ సమస్తసమాజమును యెహోవాకు విరోధముగా పోగైయున్నారు. అహరోను ఎవడు? అతనికి విరోధముగా మీరు సణుగనేల అనెను.

11. That's why you and your group have gathered together against ADONAI! After all, what is Aharon that you complain against him?'

12. అప్పుడు మోషే ఏలీయాబు కుమారులైన దాతాను అబీరాములను పిలువనంపించెను.

12. Then Moshe sent to summon Datan and Aviram, the sons of Eli'av. But they replied, 'We won't come up!

13. అయితే వారు మేము రాము; ఈ అరణ్యములో మమ్మును చంపవలెనని పాలు తేనెలు ప్రవహించు దేశములోనుండి మమ్మును తీసికొనివచ్చుట చాలనట్టు, మామీద ప్రభుత్వము చేయుటకును నీకధికారము కావలెనా?

13. Is it such a mere trifle, bringing us up from a land flowing with milk and honey to kill us in the desert, that now you arrogate to yourself the role of dictator over us?

14. అంతేకాదు, నీవు పాలు తేనెలు ప్రవహించు దేశములోనికి మమ్మును తీసికొని రాలేదు; పొలములు ద్రాక్షతోటలుగల స్వాస్థ్యము మాకియ్యలేదు; ఈ మనుష్యుల కన్నులను ఊడదీయుదువా? మేము రాము అనిరి.

14. You haven't at all brought us into a land flowing with milk and honey, and you haven't put us in possession of fields and vineyards. Do you think you can gouge out these men's eyes and blind them? We won't come up!'

15. అందుకు మోషే మిక్కిలి కోపించి నీవు వారి నైవేద్యమును లక్ష్యపెట్టకుము. ఒక్క గాడిదనైనను వారియొద్ద నేను తీసికొన లేదు; వారిలో ఎవనికిని నేను హాని చేయలేదని యెహోవా యొద్ద మనవిచేసెను.

15. Moshe was very angry and said to ADONAI, 'Don't accept their grain offering! I haven't taken one donkey from them, I've done nothing wrong to any of them.'

16. మరియమోషే కోరహుతొ నీవును నీ సర్వసమూహమును, అనగా నీవును వారును అహరోనును రేపు యెహోవా సన్నిధిని నిలువవలెను.

16. Moshe said to Korach, 'You and your group, be there before ADONAI tomorrow- you, they and Aharon.

17. మీలో ప్రతివాడును తన తన ధూపార్తిని తీసికొని వాటి మీద ధూపద్రవ్యము వేసి, ఒక్కొక్కడు తన ధూపార్తిని పట్టుకొని రెండువందల ఏబది ధూపార్తులను యెహోవా సన్నిధికి తేవలెను, నీవును అహరోనును ఒక్కొక్కడు తన ధూపార్తిని తేవలెనని చెప్పెను.

17. Each of you take his fire pan and put incense in it; every one of you, bring before ADONAI his fire pan, 250 fire pans, you too, and Aharon- each one his fire pan.'

18. కాబట్టి వారిలో ప్రతివాడును తన ధూపార్తిని తీసికొని వాటిలో అగ్ని యుంచి వాటిమీద ధూప ద్రవ్యము వేసినప్పుడు, వారును మోషే అహరోనులును ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారమునొద్ద నిలిచిరి.

18. Each man took his fire pan, put fire in it, laid incense on it and stood at the entrance to the tent of meeting with Moshe and Aharon.

19. కోరహు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్దకు సర్వసమాజమును వారికి విరోధముగా పోగుచేయగా యెహోవా మహిమ సర్వసమాజమునకు కనబడెను.
యూదా 1:11

19. Korach assembled all the group who were against them at the entrance to the tent of meeting. Then the glory of ADONAI appeared to the whole assembly.

20. అప్పుడు యెహోవా మీరు ఈ సమాజములోనుండి అవతలికి వెళ్లుడి.

20. ADONAI said to Moshe and Aharon,

21. క్షణములో నేను వారిని కాల్చివేయుదునని మోషే అహరోనులతో చెప్పగా

21. 'Separate yourselves from this assembly; I'm going to destroy them right now!'

22. వారు సాగిలపడి సమస్త శరీరాత్మలకు దేవుడవైన దేవా, యీ యొక్కడు పాపముచేసినందున ఈ సమస్త సమాజము మీద నీవు కోపపడుదువా? అని వేడుకొనిరి.
హెబ్రీయులకు 12:9

22. They fell on their faces and said, 'Oh God, God of the spirits of all humankind, if one person sins, are you going to be angry with the entire assembly?'

23. అప్పుడు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను

23. ADONAI answered Moshe,

24. కోరహు దాతాను అబీరాములయొక్క నివాసముల చుట్టుపట్లనుండి తొలగిపోవుడని జనసమాజముతో చెప్పుము.

24. 'Tell the assembly to move away from the homes of Korach, Datan and Aviram.'

25. అప్పుడు మోషే లేచి దాతాను అబీరాముల యొద్దకు వెళ్లగా ఇశ్రాయేలీయుల పెద్దలు అతని వెంట వెళ్లిరి.

25. Moshe got up and went to Datan and Aviram, and the leaders of Isra'el followed him.

26. అతడు ఈ దుష్టుల గుడారముల యొద్ద నుండి తొలగి పోవుడి; మీరు వారి పాపములన్నిటిలో పాలివారై నశింపక యుండునట్లు వారికి కలిగినదేదియు ముట్టకుడి అని ఆ సమాజముతో అనెను.
2 తిమోతికి 2:19

26. There he said to the assembly, 'Leave the tents of these wicked men! Don't touch anything that belongs to them, or you may be swept away in all their sins.'

27. కాబట్టి వారు కోరహు దాతాను అబీరాముల నివాసముల యొద్దనుండి ఇటు అటు లేచిపోగా, దాతాను అబీరాములును వారి భార్యలును వారి కుమారులును వారి పసిపిల్లలును తమ గుడారముల ద్వారమున నిలిచిరి.

27. So they moved away from all around the area where Korach, Datan and Aviram lived. Then Datan and Aviram came out and stood at the entrance to their tents with their wives, sons and little ones.

28. మోషే ఈ సమస్త కార్యములను చేయుటకు యెహోవా నన్ను పంపెననియు, నా అంతట నేనే వాటిని చేయలేదనియు దీనివలన మీరు తెలిసికొందురు.

28. Moshe said, 'Here is how you will know that ADONAI has sent me to do all these things and that I haven't done them out of my own ambition:

29. మనుష్యులందరికి వచ్చు మరణమువంటి మరణము వీరు పొందిన యెడలను, సమస్త మనుష్యులకు కలుగునదే వీరికి కలిగినయెడలను, యెహోవా నన్నుపంప లేదు.

29. if these men die a natural death like other people, only sharing the fate common to all humanity, then ADONAI has not sent me.

30. అయితే యెహోవా గొప్ప వింత పుట్టించుటవలన వారు ప్రాణములతో పాతాళములో కూలునట్లు భూమి తన నోరుతెరచి వారిని వారికి కలిగిన సమస్తమును మింగి వేసినయెడల వారు యెహోవాను అలక్ష్యము చేసిరని మీకు తెలియుననెను.

30. But if ADONAI does something new- if the ground opens up and swallows them with everything they own, and they go down alive to Sh'ol- then you will understand that these men have had contempt for ADONAI.'

31. అతడు ఆ మాటలన్నియు చెప్పి చాలించగానే వారి క్రింది నేల నెరవిడిచెను.

31. The moment he finished speaking, the ground under them split apart-

32. భూమి తన నోరు తెరచి వారిని వారి కుటుంబములను కోరహు సంబంధులందరిని వారి సమస్త సంపాద్యమును మింగివేసెను.

32. the earth opened its mouth and swallowed them up with their households, all the people who had sided with Korach and everything they owned.

33. వారును వారి సంబంధులందరును ప్రాణముతో పాతాళములో కూలిరి; భూమి వారిని మింగివేసెను; వారు సమాజములో ఉండకుండ నశించిరి.

33. So they and everything they owned went down alive into Sh'ol, the earth closed over them and their existence in the community ceased.

34. వారి చుట్టునున్న ఇశ్రాయేలీయులందరు వారి ఘోష విని భూమి మనలను మింగివేయునేమో అనుకొనుచు పారిపోయిరి.

34. All Isra'el around them fled at their shrieks, shouting, 'The earth might swallow us too!'

35. మరియయెహోవా యొద్దనుండి అగ్ని బయలుదేరి ధూపార్పణమును తెచ్చిన ఆ రెండువందల ఏబదిమందిని కాల్చివేసెను.

35. Then fire came out from ADONAI and destroyed the 250 men who had offered the incense.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Numbers - సంఖ్యాకాండము 16 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible
కోరహు, దాతాన్ మరియు అబిరామ్ కోరహుల తిరుగుబాటు యాజకత్వం కోసం పోరాడుతుంది. (1-11) 
ప్రజలు చాలా గర్వంగా మరియు ఇతరుల కంటే మెరుగ్గా ఉండాలని కోరుకున్నప్పుడు, వారు సమస్యలను కలిగిస్తారు. ఇశ్రాయేలీయులు అని పిలువబడే దేవుణ్ణి అనుసరించే వ్యక్తుల సమూహంలో ఇది జరిగింది. దేవుడు అహరోను మరియు అతని కుటుంబాన్ని తమ నాయకులుగా ఎన్నుకోవడం వారిలో కొందరికి నచ్చలేదు. ప్రజలు తప్పులు చేసారు మరియు దేవుడు వారి పట్ల సంతోషించలేదు కాబట్టి ఫిర్యాదు చేయడానికి వారికి సరైన కారణం లేదు. కానీ మోషే మరియు అహరోనులు తమను నడిపించడానికి దేవునిచే ఎన్నుకోబడినప్పటికీ, వారు ముఖ్యులుగా ఉండాలని కోరుకుంటున్నారని వారు ఆరోపించారు. 1. స్పిరిట్ లెవలర్స్ అంటే దేవుడు తమ కోసం ఎన్నుకున్న నాయకుల మాట వినని వ్యక్తులు. 2. చాలా కాలం క్రితం, మోషే అనే వ్యక్తి దేవుని సహాయం కోసం అడిగాడు. అతను చాలా తెలివైనవాడు మరియు అతనికి అవసరమైనప్పుడు సలహా అడగడం తెలుసు. దేవుడి ఇంట్లో ప్రత్యేక సహాయకులుగా ఉన్న మరికొంతమందితో మాట్లాడి ఇంత ముఖ్యమైన ఉద్యోగం చేయడం ఎంత అదృష్టమో వారికి గుర్తు చేశారు. తమకంటే ముఖ్యమైన ఉద్యోగాలు ఉన్నవారిని చూసి అసూయపడవద్దని, ఎందుకంటే వారి కంటే తక్కువ ముఖ్యమైన ఉద్యోగాలు ఉన్నవారు చాలా మంది ఉన్నారని ఆయన గుర్తు చేశారు. 

దాతాన్ మరియు అబిరామ్ యొక్క అవిధేయత. (12-15) 
మోషే దాతాన్ మరియు అబీరామ్ అనే ఇద్దరు వ్యక్తులను వారి సమస్యల గురించి తనతో మాట్లాడమని అడిగాడు, కానీ వారు వినలేదు. వారు మోషే గురించి చెడు మాటలు చెప్పారు, అవి నిజం కాదు. కొన్నిసార్లు, ప్రశంసలకు అర్హమైన వ్యక్తులు వారు చేయని పనులకు నిందించబడతారు. మోషే సాధారణంగా చాలా ప్రశాంతంగా ఉన్నప్పటికీ, ప్రజలు అతని ద్వారా దేవుని గురించి నీచమైన మాటలు చెప్పడం వల్ల అతనికి చాలా కోపం వచ్చింది. మరుసటి రోజు తమ సహోదరుడు అహరోనుతో కలిసి ప్రత్యేక ధూపం వెలిగించడానికి వెళ్లాలని వారిని కోరాడు. కోరహు అనే మరొక వ్యక్తి కూడా రావాలనుకున్నాడు, కానీ అతను చాలా గర్వంగా మరియు ప్రతిష్టాత్మకంగా ఉన్నాడు. కొన్నిసార్లు, తమకు తాము మాత్రమే సహాయం చేయాలనుకునే వ్యక్తులు తమను తాము మరింత దిగజార్చుకుంటారు. 

మోషే మరియు ఆరోనుల మధ్యవర్తిత్వం లార్డ్ యొక్క మహిమ కనిపిస్తుంది. (16-22) 
ఆరోన్ మొదట నాయకుడిగా మారినప్పుడు, అతను ఉద్యోగం కోసం ఎంపిక చేయబడినట్లు చూపించడానికి దేవుని ప్రత్యేక ప్రకాశం కనిపించింది. Lev 9:23 మోషే మరియు అహరోను వారు సరైనదని భావించారు, మరియు దేవుడు వారికి మద్దతుగా మరియు వారి శత్రువులను గందరగోళానికి గురిచేసినట్లు అనిపించింది. ప్రజలు అపరాధ భావంతో ఉన్నప్పుడు, వారు దేవుని శక్తికి భయపడతారు. చెడ్డవారితో కాలక్షేపం చేయడం, వారితో చెడు పనులు చేయడం మంచిది కాదు. ఇతర వ్యక్తులు వారు చేయవలసిన పనిని చేయకపోయినా, మేము వారికి సహాయం చేయడానికి ప్రయత్నించాలి. మోషే మరియు ఆరోన్ చాలా కష్టపడి ప్రార్థించారు మరియు అది పనిచేసింది. 

భూమి దాతాన్ మరియు అబిరామ్‌లను మింగేస్తుంది. (23-34) 
చాలా కాలం క్రితం, ఇజ్రాయెల్‌లో మోషే అనే వ్యక్తిని కలుసుకున్న ముఖ్యమైన నాయకులు ఉన్నారు. ఇతరులకు నచ్చకపోయినా, నిబంధనలను పాటించే నాయకులను వినడం మరియు వారికి సహాయం చేయడం మాకు ముఖ్యం. మనం కూడా చెడు వ్యక్తులకు దూరంగా ఉండి మంచిగా ఉండేందుకు ప్రయత్నించాలి. మోషే సహాయం కోసం దేవుణ్ణి అడిగాడు మరియు ప్రజలు సురక్షితంగా ఉండడానికి అతనిని అనుసరించారు. మనం మంచిగా ఉండాలని మరియు చెడు విషయాలకు దూరంగా ఉండాలని ఎంచుకున్నప్పుడు, మనం సరైన పని చేస్తున్నామని చూపిస్తుంది. కానీ మనం చెడుగా ఉండాలని ఎంచుకుంటే, మనం ఇబ్బందుల్లో పడవచ్చు మరియు దేవుడు మనకు సహాయం చేయకపోవచ్చు. దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్న వ్యక్తులు ప్రత్యేకంగా చనిపోకపోతే, తాను అబద్ధం చెబుతున్నానని ఒప్పుకుంటానని మోషే చెప్పాడు. అప్పుడు, దేవుడు భూమిని తెరిచి, తిరుగుబాటుదారులను మరియు వారి పిల్లలందరినీ మింగేశాడు. వారు చాలా చెడ్డవారో లేదా దేవుడు ఇతర మార్గాల్లో వారికి మంచిగా ఉన్నారో మాకు తెలియదు, కానీ వారు అర్హులైన వాటిని పొందారని మాకు తెలుసు. ఇది చాలా విచిత్రమైన విషయం మరియు అసాధారణమైన మార్గాల్లో చెడు పనులు చేసే వ్యక్తులను దేవుడు శిక్షిస్తాడని చూపించాడు. నిజంగా ముఖ్యమైనది జరిగింది. ప్రజలు చాలా చెడ్డ పనులు చేస్తారు మరియు భూమి ఇప్పటికీ వాటన్నింటిని నిర్వహించగలగడం ఆశ్చర్యంగా ఉంది. ఇతరుల తప్పుల నుండి మనం పాఠాలు నేర్చుకోవాలి. నిజంగా చెడ్డ ప్రదేశానికి వెళ్లిన వ్యక్తుల రోదనలు మనం వినగలిగితే, అదే తప్పులు చేయకుండా మరియు ఇబ్బందుల్లో పడకుండా ఉండటానికి మేము మరింత కష్టపడతాము. 

కోరహ్ యొక్క సంస్థ వినియోగించింది. (35-40) 
కొంతమంది తన నియమాలను పాటించకుండా ధూపం సమర్పించినప్పుడు దేవుడు కోపంగా ఉన్నాడు, కాబట్టి అతను వారిని కాల్చివేసాడు. వారితో పాటు ఉన్న అహరోను తప్పించుకున్నారు. దేవుడు తన నియమాల పట్ల శ్రద్ధ వహిస్తాడు మరియు వాటిని విస్మరించకూడదని కోరుకోడు. దుష్టులు బలులు అర్పిస్తే అది దేవునికి ఇష్టం ఉండదు. ఆరాధనలో ఉపయోగించే వస్తువులు దేవునికి చెందినవి మరియు అతని మహిమ కోసం ఉపయోగించాలి. బలిపీఠం మీద కప్పి ఉంచడం వల్ల ప్రజలకు ఏమి జరిగిందో గుర్తుచేస్తుంది, కాబట్టి వారు అదే తప్పు చేయరు. నియమాలను ఉల్లంఘించి, దేవుని సందేశాన్ని అనుసరించని వారు మరణానికి దారితీసే మార్గాన్ని ఎంచుకుంటారు. 

ప్రజలు గొణుగుతున్నారు ఒక ప్లేగు పంపబడింది. (41-50)
ప్రజలు వారి చెడు ప్రవర్తనకు నేల తెరిచి శిక్షించినప్పటికీ, వారు మళ్లీ అదే పనులను కొనసాగించారు. వారు మంచి వ్యక్తులు అని కూడా పేర్కొన్నారు, కానీ ఇప్పటికీ శిక్షించబడటం గురించి ఫిర్యాదు చేశారు. ప్రజలు తమ హృదయాలను మార్చుకోవడానికి మరియు సరైన పని చేయడానికి దేవుని సహాయం అవసరమని ఇది చూపిస్తుంది. ప్రేమ ప్రజలను మంచి పనులు చేయగలదు, కానీ భయం మాత్రమే కాదు. ఒకప్పుడు, మోషే మరియు ఆరోన్ అనే ఇద్దరు సోదరులు ఉన్నారు, ప్రజలు తప్పు చేసారు కాబట్టి క్షమించమని దేవుణ్ణి అడిగారు. దేవుణ్ణి మళ్లీ సంతోషపెట్టడానికి మరియు ప్రజల ప్రాణాలను రక్షించడానికి ఆరోన్ ప్రత్యేకంగా ఏదో చేశాడు. అందరినీ రక్షించాలని కోరుకునే హీరోలా ఉండేవాడు. ఇతరులు మనతో చెడుగా ప్రవర్తించినప్పటికీ మనం ఎల్లప్పుడూ దయతో ఉండటానికి ప్రయత్నించాలి. లోకంలోని చెడు విషయాల నుండి మనల్ని రక్షించే యేసులా అహరోను ఉన్నాడు. అతను మనకు సహాయం చేయడానికి మరియు చెడు నుండి మనల్ని రక్షించడానికి వచ్చాడు. దేవుడు మనం మంచివా చెడ్డవా అని నిర్ణయించే న్యాయమూర్తి లాంటివాడు. మనం చెడ్డవారైతే, క్షమించబడటానికి మనకు సహాయం కావాలి. యేసు తన ప్రాణాన్ని మనకోసం ఇచ్చి మనకు సహాయం చేసాడు. మనం తప్పులు చేసినా దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో ఇది తెలియజేస్తుంది. రోమీయులకు 5:8 



Shortcut Links
సంఖ్యాకాండము - Numbers : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |