Numbers - సంఖ్యాకాండము 8 | View All

1. యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెనునీవు అహరోనుతో

1. And the LORD spoke to Moses, saying:

2. నీవు దీపములను వెలిగించునప్పుడు ఆ యేడు దీపముల వెలుగు దీపవృక్షమునకు ముందు పడునట్లు వాటిని వెలిగింపవలెనని చెప్పుమనెను. అహరోను ఆలాగు చేసెను.

2. 'Speak to Aaron, and say to him, 'When you arrange the lamps, the seven lamps shall give light in front of the lampstand.' '

3. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు దీపవృక్షమునకు ఎదురుగా దాని దీపములను వెలిగించెను.

3. And Aaron did so; he arranged the lamps to face toward the front of the lampstand, as the LORD commanded Moses.

4. ఆ దీపవృక్షము బంగారు నకిషిపనిగలది; అది దాని స్తంభము మొదలు కొని పుష్పములవరకు నకిషిపనిగలది; యెహోవా కనుపరచిన మాదిరినిబట్టి మోషే ఆ దీపవృక్షమును చేయించెను.

4. Now this workmanship of the lampstand [was] hammered gold; from its shaft to its flowers it [was] hammered work. According to the pattern which the LORD had shown Moses, so he made the lampstand.

5. మరియయెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను నీవు ఇశ్రాయేలీయులలో నుండి

5. Then the LORD spoke to Moses, saying:

6. లేవీయులను ప్రత్యే కించి వారిని పవిత్రపరచుము.

6. 'Take the Levites from among the children of Israel and cleanse them [ceremonially.]

7. వారిని పవిత్రపరచుటకు నీవు వారికి చేయవలసినదేమనగా, వారిమీద పాపపరిహారార్థజలమును ప్రోక్షింపుము; అప్పుడు వారు మంగలి కత్తితో తమ శరీరమంతయు గొరిగించుకొని

7. 'Thus you shall do to them to cleanse them: Sprinkle water of purification on them, and let them shave all their body, and let them wash their clothes, and [so] make themselves clean.

8. తమ బట్టలు ఉదుకుకొని పవిత్రపరచు కొనిన తరువాత వారు ఒక కోడెను దాని నైవేద్యమును, అనగా తైలముతో కలిసిన గోధమపిండిని తేవలెను. నీవు పాపపరిహారార్థబలిగా మరియొక కోడెను తీసికొని రావలెను.

8. 'Then let them take a young bull with its grain offering of fine flour mixed with oil, and you shall take another young bull as a sin offering.

9. అప్పుడు నీవు ప్రత్యక్షపు గుడారము ఎదుటికి లేవీయులను తోడుకొని వచ్చి ఇశ్రాయేలీయుల సర్వసమాజమును పోగుచేయ వలెను.

9. 'And you shall bring the Levites before the tabernacle of meeting, and you shall gather together the whole congregation of the children of Israel.

10. నీవు యెహోవా సన్నిధికి లేవీయులను తోడు కొనివచ్చిన తరువాత ఇశ్రాయేలీయులు తమ చేతులను ఆ లేవీయులమీద ఉంచవలెను.

10. 'So you shall bring the Levites before the LORD, and the children of Israel shall lay their hands on the Levites;

11. లేవీయులు యెహోవా సేవచేయు వారవుటకు అహరోనును ఇశ్రాయేలీయులును ప్రతిష్ఠార్పణముగా వారిని యెహోవా సన్నిధిని ప్రతిష్ఠింపవలెను.

11. 'and Aaron shall offer the Levites before the LORD, [like] a wave offering from the children of Israel, that they may perform the work of the LORD.

12. లేవీయులు ఆ కోడెల తలలమీద తమ చేతు లుంచిన తరువాత నీవు లేవీయుల నిమిత్తము ప్రాయశ్చి త్తము చేయునట్లు యెహోవాకు వాటిలో ఒకదానిని పాపపరిహారార్థ బలిగాను రెండవ దానిని దహనబలిగాను అర్పించి

12. 'Then the Levites shall lay their hands on the heads of the young bulls, and you shall offer one as a sin offering and the other as a burnt offering to the LORD, to make atonement for the Levites.

13. అహరోను ఎదుటను అతని కుమారుల యెదుటను లేవీయులను నిలువబెట్టి యెహోవాకు ప్రతిష్ఠార్పణముగా వారిని అర్పింపవలెను.

13. 'And you shall stand the Levites before Aaron and his sons, and then offer them [like] a wave offering to the LORD.

14. అట్లు నీవు ఇశ్రాయేలీయులలో నుండి లేవీయులను వేరుపరచవలెను; లేవీయులు నావారై యుందురు.

14. 'Thus you shall separate the Levites from among the children of Israel, and the Levites shall be Mine.

15. తరువాత నీవు వారిని పవిత్రపరచి ప్రతి ష్ఠార్పణముగా వారిని అర్పించినప్పుడు లేవీయులు ప్రత్యక్షపు గుడారములో సేవచేయుటకై లోపలికి వెళ్లవచ్చును.

15. 'After that the Levites shall go in to service the tabernacle of meeting. So you shall cleanse them and offer them, [like] a wave offering.

16. ఇశ్రాయేలీయులలో వారు నా వశము చేయబడినవారు; తొలిచూలియైన ప్రతివానికిని, అనగా ఇశ్రాయేలీయులలో ప్రథమ సంతానమంతటికిని ప్రతిగా వారిని నేను తీసికొనియున్నాను.

16. For they [are] wholly given to Me from among the children of Israel; I have taken them for Myself instead of all who open the womb, the firstborn of all the children of Israel.

17. ఏలయనగా మనుష్యులలోను పశువులలోను ఇశ్రాయేలీయులలో తొలిచూలియైనది యావత్తును నాది; ఐగుప్తుదేశములో తొలిచూలియైన ప్రతివానిని నేను సంహరించిననాడు వారిని నాకొరకు ప్రతిష్ఠించు కొంటిని.

17. 'For all the firstborn among the children of Israel [are] Mine, [both] man and beast; on the day that I struck all the firstborn in the land of Egypt I sanctified them to Myself.

18. ఇశ్రాయేలీయులలో తొలిచూలియైన ప్రతివానికి మారుగా లేవీయులను తీసికొని యున్నాను.

18. 'I have taken the Levites instead of all the firstborn of the children of Israel.

19. మరియు ప్రత్యక్షపు గుడారములో ఇశ్రాయేలీయుల నిమిత్తము సేవచేయుటకును ఇశ్రాయేలీయుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకును, ఇశ్రాయేలీయులలో లేవీయులను అహరోనుకును అతని కుమారులకును ఇచ్చి అప్పగించియున్నాను. అందువలన ఇశ్రాయేలీయులు పరిశుద్ధమందిరమునకు సమీపించునప్పుడు ఏ తెగులైనను ఇశ్రాయేలీయులకు సంభవింపకపోవును అని చెప్పెను.

19. 'And I have given the Levites as a gift to Aaron and his sons from among the children of Israel, to do the work for the children of Israel in the tabernacle of meeting, and to make atonement for the children of Israel, that there be no plague among the children of Israel when the children of Israel come near the sanctuary.'

20. అప్పుడు మోషే అహరోనులును ఇశ్రాయేలీయుల సర్వసమాజము యెహోవా లేవీయులనుగూర్చి మోషేకు ఆజ్ఞాపించిన సమస్తమునుబట్టి లేవీయులయెడల చేసిరి; ఇశ్రాయేలీయులు వారికి అట్లేచేసిరి.

20. Thus Moses and Aaron and all the congregation of the children of Israel did to the Levites; according to all that the LORD commanded Moses concerning the Levites, so the children of Israel did to them.

21. లేవీయులు తమ్మును పవిత్రపరచుకొని తమ బట్టలు ఉదుకుకొనిన తరువాత అహరోను యెహోవా సన్నిధిని ప్రతిష్ఠార్పణముగా వారిని అర్పించెను. వారిని పవిత్రపరచుటకు అహరోను వారినిమిత్తము ప్రాయశ్చిత్తము చేసెను.

21. And the Levites purified themselves and washed their clothes; then Aaron presented them, [like] a wave offering before the LORD, and Aaron made atonement for them to cleanse them.

22. తరువాత లేవీయులు అహరోను ఎదుటను అతని కుమారుల యెదుటను ప్రత్యక్షపు గుడారములో సేవచేయుటకు లోపలికి వెళ్లిరి. యెహోవా లేవీయులను గూర్చి మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు వారియెడల చేసెను.

22. After that the Levites went in to do their work in the tabernacle of meeting before Aaron and his sons; as the LORD commanded Moses concerning the Levites, so they did to them.

23. మరియయెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను ఇది లేవీయులను గూర్చిన విధి.

23. Then the LORD spoke to Moses, saying,

24. ఇరువది యైదేండ్లు మొదలుకొని పైప్రాయముగల ప్రతివాడును ప్రత్యక్షపు గుడారముయొక్క సేవలో పనిచేయుటకు రావలెను.

24. 'This [is] what [pertains] to the Levites: From twenty-five years old and above one may enter to perform service in the work of the tabernacle of meeting;

25. అయితే ఏబది ఏండ్ల వయస్సు పొందిన పిమ్మట వారు ఆ పని మాని ఊరకుండవలెను.

25. 'and at the age of fifty years they must cease performing this work, and shall work no more.

26. వారు కాపాడవలసిన వాటిని కాపాడుటకు ప్రత్యక్షపు గుడారములో తమ గోత్రపువారితో కూడ పరిచర్యచేయవలెను గాని పనిచేయవలదు. లేవీయులు కాపాడవలసిన వాటివిషయము నీవు వారికి ఆలాగు నియమింపవలెను.

26. 'They may minister with their brethren in the tabernacle of meeting, to attend to needs, but they [themselves] shall do no work. Thus you shall do to the Levites regarding their duties.'



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Numbers - సంఖ్యాకాండము 8 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible
గర్భగుడి దీపాలు. (1-4) 
ఆరోన్ తన ప్రత్యేక యజమానిని సూచించడానికి ముద్దలను వెలిగించాడు, అతను దేవుడిలా ఉన్నాడు. గ్రంథం చీకటి గదిలో ప్రకాశవంతమైన కాంతి వంటిది. 2 Pet 1:19 ఒక స్థలం నిజంగా చీకటిగా ఉంటుంది, కిటికీలు లేని చర్చి కూడా. కానీ పరిచారకులు దేవుని వాక్యాన్ని బోధించడం మరియు మాట్లాడడం ద్వారా దానిని ప్రకాశవంతంగా చేయడానికి సహాయం చేస్తారు. యేసు మన ప్రపంచంలో ఒక పెద్ద వెలుగు లాంటివాడు, మరియు మన తప్పులను క్షమించడం ద్వారా మరియు ఏది సరైనదో అర్థం చేసుకోవడంలో మనకు సహాయం చేయడం ద్వారా విషయాలను మరింత మెరుగ్గా చూసేందుకు ఆయన సహాయం చేస్తాడు. 

లేవీయుల పవిత్రీకరణ మరియు వారి సేవ. (5-26)
కొంతమంది వ్యక్తులు చర్చిలో ప్రత్యేక సహాయకులుగా మారినప్పుడు ఇది సూచనల సమితి. ఈ సహాయకులు కేవలం తమ కోసం ఈ ఉద్యోగాన్ని ఎన్నుకోలేదని, దేవుడిచే ఎన్నుకోబడ్డారని ప్రతి ఒక్కరూ తెలుసుకోవడం ముఖ్యం. ఈ ఉద్యోగం కోసం వారు వేరుగా మరియు దేవునికి అంకితం చేయడం కూడా ముఖ్యం. యేసును అనుసరించే వ్యక్తులు ఎలా బాప్తిస్మం తీసుకుంటారో మరియు చర్చిలో నాయకులుగా మారడానికి పరిచారకులు ప్రత్యేక వేడుకలను ఎలా నిర్వహిస్తారు. మనమందరం దేవునికి సేవ చేయాలంటే ముందుగా మనల్ని మనం ఆయనకు సమర్పించుకోవాలి. లేవీయులు దేవుని ఆరాధనలో ఉపయోగించే ప్రాముఖ్యమైన వస్తువులను తీసుకువెళ్లేందుకు వీలుగా వారిని శుభ్రం చేయాలి. వారు దేవుని సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నారని చూపించడానికి మోషే వారిపై నీళ్లు చల్లాడు. ఇది మనం యేసును ఎలా విశ్వసించాలి మరియు ఆయన క్షమాపణ కోసం అడగాలి కాబట్టి మనం కూడా దేవుణ్ణి సేవించవచ్చు. లేవీయులు శుభ్రం చేయబడిన తర్వాత దేవుడు వారిని అంగీకరించాడు మరియు దేవుణ్ణి ఆరాధించడంలో భాగం కావాలనుకునే ప్రతి ఒక్కరూ సేవ చేయడానికి సిద్ధంగా ఉండాలి. దేవదూతలకు కూడా దేవుడు ఇచ్చిన ఉద్యోగాలు ఉన్నాయి. 



Shortcut Links
సంఖ్యాకాండము - Numbers : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |