Matthew - మత్తయి సువార్త 13 | View All

1. ఆ దినమందు యేసు ఇంటనుండి వెళ్లి సముద్రతీరమున కూర్చుండెను.

2. బహు జనసమూహములు తన యొద్దకు కూడివచ్చినందున ఆయన దోనెయెక్కి కూర్చుండెను. ఆ జనులందరు దరిని నిలిచియుండగా

3. ఆయన వారిని చూచి చాల సంగతులను ఉపమాన రీతిగా చెప్పెను. ఎట్లనగా ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్లెను.

“ఉదాహరణ” అని తర్జుమా చేసిన గ్రీకు పదానికి ఒక దానితో మరొకటి పోల్చి చెప్పడం అని అర్థం. దేవుని రాజ్యం యొక్క ఆధ్యాత్మిక విషయాలను ప్రకృతిలోని భౌతిక విషయాలతో పోల్చి చెప్పేందుకు ఉదాహరణలను యేసు ఉపయోగించాడు. ఉదాహరణలు అంటే “పరలోక సత్యాలకు భూసంబంధమైన దృష్టాంతాలు”. ప్రభువు ఇక్కడ తనను తాను విత్తనాలు చల్లేవాడికి పోల్చుకుంటున్నాడు (వ 37 చూడండి). ఆయన చల్లే విత్తనాలు దేవుడు వెల్లడి చేసిన సత్యం (లూకా 8:11. 1 కోరింథీయులకు 3:6; 1 కోరింథీయులకు 9:11; 1 పేతురు 1:23 పోల్చి చూడండి). వ 18-23లో ఈ ఉదాహరణకు ఆయనే ఇచ్చిన వివరణ చూడండి.

4. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవప్రక్కను పడెను; పక్షులు వచ్చివాటిని మింగివేసెను

5. కొన్ని చాల మన్నులేని రాతినేలను పడెను; అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను గాని

ఇక్కడ రాతి స్థలాలు అంటే రాళ్ళు చెల్లాచెదురుగా పడివున్న మంచి నేల అని అర్థం కాదు. కిందంతా రాతిబండ ఉండి పైన కొద్దిగా మట్టి ఉన్న నేలన్నమాట. విత్తనాలు మంచి నేలలో లోతుగా వెళ్ళలేదు. సూర్యరశ్మి ఆ విత్తనాలను త్వరగా మొలకెత్తేలా చేసింది.

6. సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరులేనందున ఎండిపోయెను.

7. కొన్ని ముండ్లపొదలలో పడెను; ముండ్లపొదలు ఎదిగి

రైతులు సాధారణంగా ముళ్ళ మధ్య, దారిలో, రాతి నేలలో విత్తనాలు చల్లరు. అయితే దేవుని వాక్కు అనే విత్తనాలను చల్లేవారు భూలోకమంతటా వాటిని చల్లుతారు (మార్కు 16:15). కొన్ని విత్తనాలు తప్పకుండా సరిగా సిద్ధం కాని మనసుల్లో, హృదయాల్లో పడతాయి.

8. కొన్ని మంచి నేలను పడి, ఒకటి నూరంతలుగాను, ఒకటి అరువదంతలుగాను, ఒకటి ముప్ప దంతలుగాను ఫలించెను.

కొన్ని నేలలు ఇతర నేలలకన్నా సారవంతమైనవి.

9. చెవులుగలవాడు వినునుగాక అని చెప్పెను.

మత్తయి 11:15; మత్తయి 13:43; మార్కు 4:9; లూకా 8:8; లూకా 14:35; ప్రకటన గ్రంథం 2:7, ప్రకటన గ్రంథం 2:11, ప్రకటన గ్రంథం 2:17, ప్రకటన గ్రంథం 2:29; ప్రకటన గ్రంథం 3:6, ప్రకటన గ్రంథం 3:13, ప్రకటన గ్రంథం 3:22; ప్రకటన గ్రంథం 13:9. ఇప్పటివరకు చెప్పినదాని ప్రాముఖ్యతను ఇది మరింత నొక్కి చెప్తున్నది.

10. తరువాత శిష్యులు వచ్చినీవు ఉపమానరీతిగా ఎందుకు వారితో మాటలాడుచున్నావని ఆయనను అడుగగా, ఆయన వారితో ఇట్లనెను

11. పరలోక రాజ్యమర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడియున్నది గాని వారికి అనుగ్రహింప బడలేదు.

యేసు తాను ఉదాహరణలు ఉపయోగించి బోధించడానికి రెండు కారణాలు చెప్తున్నాడు. ఒకటి సత్యాన్ని వెల్లడి చేసేందుకు, రెండోది సత్యాన్ని దాచిపెట్టేందుకు. దేవుని రాజ్యం గురించిన రహస్య సత్యాలు కొన్ని ఉన్నాయి. పశ్చాత్తాపపడి యేసుప్రభువులో నమ్మకం ఉంచి, ఆయన రాజ్యంలో ప్రవేశించినవారు మాత్రమే ఈ రహస్య సత్యాలను అర్థం చేసుకోగలుగుతారు. సత్యానికి వ్యతిరేకంగా తమ హృదయాలు కఠినం చేసుకుని బుద్ధిపూర్వకంగా క్రీస్తును నిరాకరించిన పరిసయ్యులు, సద్దూకయ్యులు లాంటివారికి ఆయన చెప్పిన సత్యాలు అర్థం కావు. నమ్మక ద్రోహం, తిరుగుబాటు చేసిన జాతికి క్రీస్తు మాట్లాడే విధానం ఒక తీర్పులాంటిది (వ 12-15). “పరలోక రాజ్యం”– మత్తయి 4:17. 12వ వచనం ఇహలోక సంపదల గురించి చెప్పడం లేదు. ఆధ్యాత్మిక సత్యాలను అర్థం చేసుకోగలిగే సామర్థ్యత గురించి చెప్తున్నది. క్రీస్తు తీసుకువచ్చే వెలుగును స్వీకరించనివారు అంతకుముందు వారిలో ఏదన్నా వెలుగు ఉన్నా, దాన్ని కోల్పోతారు. ఆ వెలుగును స్వీకరించేవారు మరింత జ్ఞానప్రకాశాల సంపన్నులౌతారు. “లేనివారై”న యూదులు కావాలని కోరలేదు కాబట్టే, దాన్ని నిరాకరించారు కాబట్టి లేనివారయ్యారు (యోహాను 3:19-20; యోహాను 9:39). “రహస్య సత్యాలు”– క్రొత్త ఒడంబడిక గ్రంథంలో రహస్య సత్యం అంటే దేవుడు వెల్లడించే సత్యం, ఆయన వెల్లడిస్తే తప్ప మనం తెలుసుకోలేని సత్యం.

12. కలిగినవానికే యియ్యబడును, వానికి సమృద్ధి కలుగును; లేనివానికి కలిగినదియు వానియొద్దనుండి తీసి వేయబడును. మరియువారు చూచుచుండియు చూడరు, వినుచుండియు వినకయు గ్రహింపకయు నున్నారు.

13. ఇందు నిమిత్తము నేను ఉపమానరీతిగా వారికి బోధించు చున్నాను. ఈ ప్రజలు కన్నులార చూచి, చెవులారా విని, హృదయముతో గ్రహించి

యిర్మియా 5:20-21; యెహెఙ్కేలు 12:2.

14. మనస్సు త్రిప్పుకొని నావలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయము క్రొవ్వినది, వారి చెవులు వినుటకు మందములైనవి, వారు తమ కన్నులు మూసికొనియున్నారు
యెషయా 6:9-10

యెషయా 6:9-10. ప్రజలు బుద్ధిపూర్వకంగా, ప్రయత్నపూర్వకంగా దేవునివైపు తిరగకుండా తమను తాము అడ్డుకున్నారు. ఆత్మసంబంధమైన వెలుగును తృణీకరిస్తే అది తీర్పుకు దారి తీయడం తప్పనిసరి.

15. గనుక మీరు వినుటమట్టుకు విందురుగాని గ్రహింపనే గ్రహంపరు, చూచుటమట్టుకు చూతురుగాని యెంత మాత్రమును తెలిసికొనరు అని యెషయా చెప్పిన ప్రవచనము వీరి విషయమై నెరవేరుచున్నది.
యెషయా 6:9-10

16. అయితే మీ కన్నులు చూచుచున్నవి గనుక అవి ధన్యములైనవి, మీ చెవులు వినుచున్నవి గనుక అవి ధన్యములైనవి.

మత్తయి 16:17; 2 కోరింథీయులకు 4:6; ఎఫెసీయులకు 1:17-18 పోల్చి చూడండి. ఆధ్యాత్మిక సత్యాలను విని అర్థం చేసుకునే సామర్థ్యత దేవుడు ఉచితంగా ఇచ్చేవాటిలో ఒకటి. దానికోసం ఆయన్ను అడుగుదాం.

17. అనేక ప్రవక్తలును నీతిమంతులును మీరు చూచువాటిని చూడగోరియు చూడక పోయిరి, మీరు వినువాటిని వినగోరియు వినకపోయిరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.

క్రీస్తు జన్మించక ముందు జీవించిన ప్రవక్తలు, పవిత్రులు అభిషిక్తుణ్ణి కళ్ళారా చూడాలనీ, ఆయన మాటలు వినాలనీ ఉవ్విళ్ళూరారు (1 పేతురు 1:10-12 పోల్చి చూడండి.)

18. విత్తువాని గూర్చిన ఉపమాన భావము వినుడి.

యేసు తానే వివరించి చెప్పిన ఆయన ఉదాహరణల్లో ఇది మొదటిది. ఆయన చెప్పిన ఉదాహరణలన్నిటినీ ఎలా అర్థం చేసుకోవాలో ఇది కొన్ని సూచనలు ఇస్తున్నది. ఈ ఉదాహరణల్లో ఒకటి లేక ఒకటికంటే ఎక్కువ ముఖ్యమైన అంశాలు లేక ఉద్దేశాలుంటాయి. తరచుగా ఒకటి మాత్రమే ఉంది. ప్రతి ఉదాహరణ చదువుతుండగా దాని ముఖ్యమైన అంశాన్ని, లేక అంశాలను తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. వాటిల్లోని చిన్న చిన్న వివరాలకు కూడా అర్థాలు ఉండవచ్చు. విత్తనాలు చల్లేవాడి ఉదాహరణ గురించి ఆయన ఇస్తున్న వివరణలో ఈ సంగతి మనకు అర్థం అవుతుంది. 37-43 వచనాల్లో గోధుమలు, కలుపు మొక్కలు ఉదాహరణను యేసు వివరించిన సందర్భంలో ఇది మరింత స్పష్టం అవుతున్నది. అయితే ముఖ్యాంశాన్ని విస్మరిస్తూ చిన్న చిన్న వివరాలపై ఎక్కువ దృష్టి నిలపకూడదు. ఆ చిన్న వివరాలకు వ్యాఖ్యానం చెప్పబూనుకుని మన తెలివితేటలు ప్రదర్శించడానికి ప్రయత్నించకూడదు. నిర్గమకాండము 25:9 నోట్ పోల్చి చూడండి. మన వివరణ స్పష్టంగా, సహజంగా, అలంకృతం కానిదిగా ఉండాలి. ఈ ఉదాహరణల నుంచి మన సిద్ధాంతాలను తీసుకోకూడదు గానీ క్రీస్తు, ఆయన రాయబారులు చేసిన తేటతెల్లమైన ఉపదేశాల నుంచే మన సిద్ధాంతాలను తీసుకోవాలి. అయితే సరైన సిద్ధాంతాలకు ఈ ఉదాహరణలు ఎప్పుడూ వ్యతిరేకం కాదని మనం గ్రహించాలి. బైబిలంతటిలో లాగానే ఈ ఉదాహరణల్లోనూ మనం క్రీస్తును చూడాలి (లూకా 24:27, లూకా 24:44 పోల్చి చూడండి). యేసు ప్రతి ఉదాహరణను ప్రారంభించిన విధానం, దాని చివర్లో ఇచ్చిన వివరణ (వివరణ ఏదైనా ఉంటే) వీటిని జాగ్రత్తగా గమనించాలి. ఈ ఉదాహరణలు మనకూ, ఇప్పటి మన పరిస్థితులకూ ఎలా సరిపోతున్నాయో సాధ్యమైనంత వరకు చూడాలి. మనందరి కోసమూ వాటిలో ఆధ్యాత్మిక పాఠాలూ, నైతిక సూత్రాలూ ఉన్నాయి. వాటిలోని సందేశాలను పాటించకపోతే వాటికి లోబడకపోతే ఈ ఉదాహరణల వల్ల మనకేమీ ప్రయోజనం ఉండదు. విత్తనాలు చల్లేవాడి ఉదాహరణలోని ముఖ్యాంశం మనుషుల హృదయాలు వివిధ స్థితుల్లో ఉంటాయన్నదే. విత్తనాలు చల్లేవాడిలోనూ, విత్తనాల్లోనూ ఏ మాత్రమూ మార్పు లేదు.

19. ఎవడైనను రాజ్యమునుగూర్చిన వాక్యము వినియు గ్రహింపక యుండగా, దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబడినదానిని యెత్తికొనిపోవును; త్రోవ ప్రక్కను విత్తబడినవాడు వీడే.

“గ్రహించకపోతే”అనే మాటను గమనించండి. వ 23 పోల్చి చూడండి. ఆత్మ సంబంధమైన గుడ్డితనం, అజ్ఞానం వల్ల ఇలాంటి వ్యక్తి నిర్లక్ష్యంగా దేవుని సత్యాన్ని పట్టించుకోకుండా ఉంటాడు. దుర్మార్గుడు అంటే సైతాను. మనుషుల హృదయాల్లో దేవుని వాక్కు ఉంటే దాన్ని నాశనం చెయ్యాలని వాడు తాపత్రయపడుతూ ఉంటాడు. లూకా 8:12 లో సైతాను ఉద్దేశం ఏమిటో కనిపిస్తున్నది.

20. రాతినేలను విత్తబడినవాడు వాక్యము విని వెంటనే సంతోషముతో దాని నంగీకరించువాడు.

దేవుని వాక్కుపట్ల లోతైన ఆసక్తి లేకపోవడం, ఏదో పైపైన కొద్ది ఆశ చూపడం వంటి లక్షణాలను ఇది కనపరుస్తున్నది. ఇలాంటి వ్యక్తి మతం తనను సంతోషపెట్టినంత కాలమే దానికి కట్టుబడి ఉంటాడు. కష్టాలు వచ్చి అతడి ఆనందాన్ని పోగొడతాయి. అతని భక్తి కూడా దానితోబాటే పోతుంది. ఏది ఎదురైనా అంతం వరకూ కొనసాగాలన్న లోతైన నిశ్చయత వారిలో ఉండదు. క్రీస్తుపట్ల హృదయ పూర్వకమైన శిష్యత్వం, క్రీస్తునుంచి ఆయనకు చెందిన విషయాలను నేర్చుకుని వాటి ప్రకారం నడుచుకుందామన్న ఎడతెగని ప్రయత్నం ఉండదు.

21. అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలము నిలుచును గాని, వాక్యము నిమిత్తము శ్రమయైనను హింసయైనను కలుగగానే అభ్యంతర పడును.

22. ముండ్లపొదలలో విత్త బడినవాడు వాక్యము వినువాడే గాని ఐహికవిచారమును ధనమోహమును ఆ వాక్యమును అణచివేయును గనుక వాడు నిష్ఫలుడవును.

ఇహలోక చింత, ధనం కోసమైన ఆశలు అడ్డుకుని నాశనం చేసే ముళ్ళలాంటివి (మార్కు 4:19 లో “ఇతరమైన వాటి గురించిన ఆశలు” కూడా ఈ జాబితాలో ఉంది. లూకా 8:14 లో సుఖభోగాలు అనేమాట కూడా ఉంది). శిష్యులు తమ అవసరాల నిమిత్తం దేవుణ్ణే నమ్ముకొంటూ, ఆందోళన చెందకుండా, తమ మనసులను ఆత్మ సంబంధమైన, పరలోక విషయాలమీదే తప్ప ఇహలోక విషయాలపై లగ్నం చెయ్యరాదని క్రీస్తు, ఆయన రాయబారులూ నేర్పినది ఇందుకే. మత్తయి 6:19-34; కొలొస్సయులకు 3:1-3; 1 తిమోతికి 6:9-10 చూడండి.

23. మంచినేలను విత్తబడినవాడు వాక్యము విని గ్రహించువాడు; అట్టివారు సఫలులై యొకడు నూరంతలుగాను ఒకడు అరువదంతలుగాను ఒకడు ముప్పదంతలుగాను ఫలించుననెను.

ఇక్కడ కీలకమైన మాట “గ్రహించి”– వ 19 పోల్చి చూడండి. ఈ ఉదాహరణలో ఉన్న ఇతరులు ఎవరైనా తాము విన్నదాన్ని అర్థం చేసుకున్నారని రాసి లేదు. అయితే ఈ వచనంలో ఉన్నవాడి లాంటి వ్యక్తి దేవుని ద్వారా ఉపదేశం పొంది ఆధ్యాత్మిక దృష్టి పొందినవాడు – లూకా 24:45; మొ।।. వ్యత్యాసం అంతా ఇక్కడే ఉంది. దేవుని వాక్కు అయిన బైబిలు ఉపదేశాలను మనం అర్థం చేసుకుంటేనే ఆధ్యాత్మికంగా ఫలించగలం. మనం అర్థం చేసుకోలేని దాన్ని మన జీవితాల్లో అనుసరించలేము. దాన్ని త్వరగా మర్చిపోయే అవకాశం ఉంది. తన సత్యాన్ని మనం పఠించి గ్రహించాలని దేవుడు కోరుతున్నాడు. ద్వితీయోపదేశకాండము 6:6-7; యెహోషువ 1:8; కీర్తనల గ్రంథము 1:1-2; కీర్తనల గ్రంథము 119:1; సామెతలు 2:1-8; అపో. కార్యములు 8:30-35; 1 కోరింథీయులకు 2:12-16; ఎఫెసీయులకు 1:17-18; ఎఫెసీయులకు 4:13-14; కొలొస్సయులకు 1:9; కొలొస్సయులకు 2:2 చూడండి. “ఫలిస్తారు”– ఇది ఆత్మ సంబంధమైన పంట. మనుషుల హృదయాల్లో దేవుడు పని చేస్తున్నాడో లేదో ఇదొక్కటే రుజువు. పంట లేకపోతే అసలు వాస్తవమైన, విలువైన, శాశ్వతమైనదేదన్నా ఆ హృదయంలో జరుగుతున్నదా లేదా అని సందేహించవలసి వస్తుంది. యోహాను 15:1-6; హెబ్రీయులకు 6:7-12 చూడండి. అయితే ఎవరి విషయంలోనూ మనం ఆశలు వదులుకోనక్కరలేదు. ఈ ఉదాహరణలో కొందరిలో కనిపిస్తున్న హృదయాల నిష్ఫలమైన స్థితిగతులు శాశ్వతంగా అలానే ఉండిపోనవసరం లేదు. బండబారిపోయిన హృదయాలను బ్రద్దలు చేయవచ్చు, ముళ్ళను వేళ్ళతో సహా పెళ్లగించి పారవేయవచ్చు. యేసుప్రభువు ఇచ్చిన ఆజ్ఞకు లోబడి దేవుని వాక్కును వెదజల్లే వారందరికీ ఈ ఉదాహరణలో గొప్ప ప్రోత్సాహం లభిస్తున్నది. దేవుడు దున్ని పదును చేసిన సారవంతమైన నేల ఉంది. తగిన కాలంలో పంట కోతకు వస్తుంది. మత్తయి 9:37; కీర్తనల గ్రంథము 126:5-6; యోహాను 4:35 పోల్చి చూడండి. ఈ ఉదాహరణలో ఒక హెచ్చరిక కూడా ఉంది. మన హృదయ స్థితి గురించి మనం జాగ్రత్తగా ఉండాలి. ఎలాంటి స్థితికి – అది దున్నకుండా, మన్ను లోతు లేకుండా, రాళ్ళతో, ముళ్ళతో నిండి వుంటే – దానికి బాధ్యులం మనమే. హోషేయ 10:12; యిర్మియా 4:3; యెహెఙ్కేలు 18:31; యోవేలు 2:13; సామెతలు 4:23 పోల్చి చూడండి.

24. ఆయన మరియొక ఉపమానము వారితో చెప్పెను, ఏమనగాపరలోకరాజ్యము, తన పొలములో మంచి విత్తనము విత్తిన యొక మనుష్యుని పోలియున్నది.

వ 37-43లో ప్రభువు తానే ఈ ఉదాహరణను వివరించి చెప్పాడు. పొలం అంటే ఈ లోకం పోకడలకు గుర్తుగా ఉంది. లోకం దేవునిది. దానంతటి పైనా నలుమూలలా తన రాజ్య స్థాపన జరగాలని ఆయన ఉద్దేశం. విత్తనాలు చల్లేవాడి ఉదాహరణలో లాగా విత్తనం అంటే ఇక్కడ దేవుని వాక్కు కాదు గానీ దేవుని ఆత్మ మూలంగా తన రాజ్యంలోకి జన్మించిన ఆయన సంతానం (యోహాను 1:12-13; యోహాను 3:3-8). ప్రస్తుతం ఈ లోకంలో, సంఘంలో మంచి చెడులు కలిసి ఉన్నాయి. “కలుపు మొక్కలు” అని తర్జుమా చేసిన గ్రీకు పదానికి మొలకెత్తే దశలో సరిగ్గా గోధుమ పైరులాగానే కనిపించే ఒక విధమైన పిచ్చి మొక్క అని అర్థం (2 కోరింథీయులకు 11:13-15 పోల్చి చూడండి). ఇవి సైతాను సంతానానికి గుర్తు (వ 38; యోహాను 8:44; 1 యోహాను 3:8 పోల్చి చూడండి). దేవుని శత్రువు ఈ లోకంలో చెడ్డవాళ్ళను వెదజల్లిపోయే సైతాను. స్థూలంగా చెప్పాలంటే ఈ భూమిపై రెండు రకాల మనుషులు మాత్రమే ఉన్నారు – దేవుని రాజ్యంలో ఉన్న ఆయన పిల్లలు, దానిలో లేనివారు.

25. మనుష్యులు నిద్రించుచుండగా, అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయెను.

26. మొలకలు పెరిగి గింజపట్టినప్పుడు గురుగులు కూడ అగపడెను.

27. అప్పుడు ఇంటి యజమానుని దాసులు అతనియొద్దకు వచ్చి అయ్యా, నీవు నీ పొలములో మంచి విత్తనము విత్తితివి గదా, అందులో గురుగు లెక్కడనుండి వచ్చినవని అడిగిరి.

28. ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా, ఆ దాసులు మేము వెళ్లి వాటిని పెరికి కూర్చుట నీకిష్టమా? అని అతనిని అడిగిరి.

29. అందుకతడు వద్దు; గురుగులను పెరుకుచుండగా, వాటితోకూడ ఒకవేళ గోధుమలను పెల్లగింతురు.

లోకంలోనుంచి దుర్మార్గుల్ని ఏరివేసే సమయంలో కొందరు మంచివారిని కూడా నాశనం చెయ్యకుండా ఆ విధంగా చెయ్యగలగడం దేవుని సేవకులకు అసాధ్యం. ఇందుకు ఒక కారణం ఏమిటంటే కలుపు మొక్కలకూ, గోధుమ మొక్కలకూ మధ్య ఉన్న తేడాను ఆరంభ దశలో గుర్తించడం అంత తేలిక కాదు. ఒకవేళ అలా చెయ్యగలిగినా అలా వేరు చేసి నాశనం చేసే పనికి ఎవరు తగినవారు? అలా చేయడానికి దేవునికి తప్ప చాలినంత జ్ఞానం, బలప్రభావాలు మరింకెవరికి ఉన్నాయి? మరో సంగతి మనం ఎప్పుడూ గుర్తుంచుకోవాలి – తగిన కాలంలో సైతాను పిల్లలు దేవుని పిల్లలుగా మారే అవకాశం ఉంది (రోమీయులకు 3:9; ఎఫెసీయులకు 2:1-4; తీతుకు 3:3-7).

30. కోతకాలమువరకు రెంటినికలిసి యెదుగ నియ్యుడి; కోతకాలమందు గురుగులను ముందుగాకూర్చి వాటిని కాల్చివేయుటకు కట్టలు కట్టి, గోధుమలను నా కొట్టులో చేర్చి పెట్టుడని కోతగాండ్రతో చెప్పుదుననెను.

ఈ యుగాంతంలో జరగబోయే గొప్ప పంటకోత సమయాన దేవుడు సైతాను సంతానంనుంచి తన సంతానమంతటినీ వేరు చేస్తాడు. మత్తయి 25:31-46 పోల్చి చూడండి. సైతాను సంతానాన్ని మొదట పోగు చేస్తున్న విషయాన్ని గమనించండి. పంటకోతలో ఫలితార్థం మత్తయి 3:12 లో ఉన్నదే.

31. ఆయన మరియొక ఉపమానము వారితో చెప్పెను పరలోకరాజ్యము, ఒకడు తీసికొని తన పొలములో విత్తిన ఆవగింజను పోలియున్నది.

ఈ ఉదాహరణలోని ముఖ్యాంశం స్పష్టమే. దేవుని రాజ్యం ఆరంభంలో చిన్నదిగా ఉన్నా అది పెరిగి చాలా పెద్దదౌతుంది. ఈ యుగంలో ఆ రాజ్యం క్రీస్తుతో, కొద్దిమంది శిష్యులతో తన పనిని ఆరంభించింది. ఇప్పుడది లోకమంతా వ్యాపించింది. విత్తనం నాటింది క్రీస్తే. గోధుమలు, కలుపుమొక్కల ఉదాహరణలో లాగా ఆయన పొలం అంటే ఈ లోకమంతా. రైతులు నాటే విత్తనాలన్నిటిలోకీ ఆవగింజ చిన్నది (యేసుప్రభువు ఉద్దేశం ఇక్కడ ఇదే. మార్కు 4:31 చూడండి). ఇక్కడ చెప్పిన ఆవమొక్క మూడు మీటర్ల ఎత్తువరకు పెరగవచ్చు. పాత ఒడంబడిక గ్రంథంలో చెట్టును కొన్ని సార్లు ఒక గొప్ప సామ్రాజ్యానికి సంకేతంగా వాడడం జరిగింది (యెహెఙ్కేలు 31:6; దానియేలు 4:20-22). చివరికి, రాబోయే యుగంలో క్రీస్తు రాజ్యం లోకమంతటినీ నింపి మిగతా రాజ్యాలన్నిటినీ భూమిపై లేకుండా చేస్తుంది (దానియేలు 2:44-45 నోట్స్ చూడండి). పాత ఒడంబడిక గ్రంథంలో జాతులను, ప్రజలను సూచించడానికి కొన్ని సార్లు పక్షులను ఉపయోగించడం ఉంది. (యెషయా 46:11; యిర్మియా 12:9; యెహెఙ్కేలు 17:22-24. యెహెఙ్కేలు 31:3-6 చూడండి). ఇక్కడ పక్షులు క్రైస్తవాన్ని అలవరచుకున్న జాతులకూ ప్రజలకూ సూచనగా ఉన్నాయని భావించడానికి అవకాశం ఉంది. అంటే నిజంగా క్రైస్తవులు కాకుండానే క్రైస్తవ ఆదర్శాల చేత కొన్ని మార్పులు చెందిన జాతులన్నమాట. పక్షులు, చెట్టు కొమ్మలూ ఒకటి కాదు. అయితే విత్తనాలు చల్లేవాడి ఉదాహరణలో పక్షులు సైతానుకు, దయ్యాలకు సూచనగా ఉన్నాయని గుర్తుంచుకోవాలి (వ 4,19). ఇక్కడ కూడా దేవుని రాజ్యాన్ని చెడగొట్టే సైతాను ప్రయత్నాలకు ఈ పక్షులు సూచనగా ఉన్నాయని కొందరు పండితుల అభిప్రాయం.

32. అది విత్తనములన్నిటిలో చిన్నదేగాని పెరిగినప్పుడు కూర మొక్కలన్నిటిలో పెద్దదై ఆకాశపక్షులు వచ్చి దాని కొమ్మలయందు నివసించు నంత చెట్టగును.
కీర్తనల గ్రంథము 104:12, యెహెఙ్కేలు 17:22-23, యెహెఙ్కేలు 31:6, దానియేలు 4:12

33. ఆయన మరియొక ఉపమానము వారితో చెప్పెను పరలోకరాజ్యము, ఒక స్త్రీ తీసికొని పిండి అంతయు పులిసి పొంగువరకు మూడు కుంచముల పిండిలో దాచి పెట్టిన పుల్లని పిండిని పోలియున్నది.

ఈ చిన్న ఉదాహరణ భావం గురించి పండితుల మధ్య పెద్ద వివాదాలున్నాయి. ఇది లోకంలో దేవుని రాజ్య వ్యాప్తిని సూచించే దృష్టాంతం అని కొందరన్నారు. వ్యక్తిలోను, క్రీస్తు సంఘంలోను లోలోపల దేవుని వాక్కు చేసే పనిని సూచిస్తూ చెప్పిన ఉదాహరణ అని మరి కొందరు అన్నారు. మరి కొందరైతే ఇది సంఘంలో రహస్యంగా వ్యాపించే చెడుతనం అని చెప్తూ 2 థెస్సలొనీకయులకు 2:1-7 మొదలైన వచనాలతో దీన్ని సరిపోల్చారు. పొంగజేసే పదార్థం బైబిల్లో తరచుగా చెడుతనానికి గుర్తుగా ఉందని వారు వాదిస్తున్నారు (మత్తయి 16:12; నిర్గమకాండము 12:8; 1 కోరింథీయులకు 5:6-8; గలతియులకు 5:9 చూడండి). అలాగే బైబిలు సిద్ధాంత సంబంధమైన విషయాల్లో “స్త్రీ” కూడా దుర్బోధకు, లేక నమ్మక ద్రోహానికి సూచన అని వీరు అంటారు (ప్రకటన గ్రంథం 2:20; ప్రకటన గ్రంథం 17:3; యిర్మియా 51:2-3, యిర్మియా 51:7). పరలోక రాజ్యం దానంతట అది చెడ్డది కాదని వేరే చెప్పనవసరం లేదు. అయితే ఈ యుగంలో భూమిపై ఉన్న దృశ్యమైన సంఘంలో వ్యాపించే నమ్మక ద్రోహాన్ని, భ్రష్టత్వాన్ని గురించి ఈ ఉదాహరణ వివరిస్తూ ఉండవచ్చు. యేసుప్రభువు “పరిసయ్యులకూ సద్దూకయ్యులకూ సంబంధించిన పొంగజేసే పదార్థం గురించి జాగ్రత్త” అని తన శిష్యులను హెచ్చరించాడు (మత్తయి 16:6, మత్తయి 16:12 నోట్స్ చూడండి). ఈ ఉదాహరణ బహుశా క్రీస్తుసంఘం నిర్లక్ష్యంలో పడిపోతుందనీ, కర్మకాండలు, సంప్రదాయ రీతులు, కపటం, బైబిలు సత్యాలను కాదనడం, శరీర సంబంధమైన తర్కాలు, అపనమ్మకం మొదలైనవి క్రైస్తవం అన్ని శాఖల్లోనూ విస్తరిస్తాయనీ తెలియజేసే భవిష్యద్వాక్కు కావచ్చు.

34. నేను నా నోరు తెరచి ఉపమానరీతిగా బోధించెదను, లోకము పుట్టినది మొదలుకొని మరుగుచేయబడిన సంగతులను తెలియజెప్పెదను

ప్రత్యేకించి ఈ సమయంలో ఈ సందర్భంలో క్రీస్తు ఉదాహరణలను మాత్రమే ఉపయోగించాడు. ఇతర కొన్ని సమయాల్లో మామూలు భాషను ఉపయోగించాడు.

35. అని ప్రవక్త చెప్పినమాట నెరవేరునట్లు యేసు ఈ సంగతులనన్నిటిని జనసమూహములకు ఉపమానరీతిగా బోధిం చెను; ఉపమానము లేక వారికేమియు బోధింపలేదు.
కీర్తనల గ్రంథము 78:2

కీర్తనల గ్రంథము 78:2. ఈ గూఢ సత్యాలు దేవుని రాజ్యం గురించిన రహస్య విషయాలు.

36. అప్పుడాయన జనసమూహములను పంపివేసి, యింటి లోనికి వెళ్లగా ఆయన శిష్యులాయనయొద్దకు వచ్చిపొలము లోని గురుగులను గూర్చిన ఉపమానభావము మాకు తెలియజెప్పుమనిరి.

37. అందుకాయన ఇట్లనెను మంచి విత్తనము విత్తువాడు మనుష్యకుమారుడు;

ఉదాహరణలను యేసుప్రభువు వివరించేటప్పుడు చిన్న అంశాలకు కూడా అర్థాలు ఉన్నాయని కనపరచిన సంగతి గమనించండి.

38. పొలము లోకము; మంచి విత్తనములు రాజ్యసంబంధులు; గురుగులు దుష్టుని సంబంధులు;

పరలోక రాజ్యానికి చెందినవారంటే దేవుని ఆత్మమూలంగా కొత్తగా జన్మించిన క్రైస్తవులు అని అర్థం (యోహాను 1:12-13; యోహాను 3:3-8).

39. వాటిని విత్తిన శత్రువు అపవాది; కోత యుగసమాప్తి; కోతకోయువారు దేవదూతలు.

40. గురుగులు ఏలాగు కూర్చబడి అగ్నిలో కాల్చివేయబడునో ఆలాగే యుగ సమాప్తియందు జరుగును.

41. మనుష్యకుమారుడు తన దూతలను పంపును; వారాయన రాజ్యములోనుండి ఆటంకములగు సకలమైనవాటిని దుర్నీతిపరులను సమకూర్చి అగ్నిగుండములో పడవేయుదురు.
జెఫన్యా 1:3

తన రాజ్యం ఈ భూమంతటా పూర్తిగా ఉండాలని దేవుని ఉద్దేశం (యెషయా 11:1-9; దానియేలు 2:35, దానియేలు 2:44-45; దానియేలు 7:27; ప్రకటన గ్రంథం 11:15; ప్రకటన గ్రంథం 19:15-16).

42. అక్కడ ఏడ్పును పండ్లుకొరుకుటయును ఉండును.
దానియేలు 3:6

మత్తయి 3:10; మత్తయి 5:22 నోట్స్.

43. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యునివలె తేజరిల్లుదురు. చెవులుగలవాడు వినునుగాక.
దానియేలు 12:3

సామెతలు 4:18; దానియేలు 12:3; 1 కోరింథీయులకు 15:40-44. ఈ మాటలు ఎలాంటి మహిమను సూచిస్తున్నాయో ఇప్పుడు మనం ఊహించలేము – 1 యోహాను 3:1-3.

44. పరలోకరాజ్యము, పొలములో దాచబడిన ధనమును పోలియున్నది. ఒక మనుష్యుడు దాని కనుగొని దాచి పెట్టి, అది దొరికిన సంతోషముతో వెళ్లి, తనకు కలిగిన దంతయు అమ్మి ఆ పొలమును కొనును.
సామెతలు 2:4

ఈ ఉదాహరణల్లోని “నిధి”, “ముత్యం” క్రీస్తుసంఘానికి సాదృశ్యమనీ, వాటిని కనుకొన్నవాడు క్రీస్తు అనీ కొందరు భావించారు. ఇది సరైన వివరణ అయ్యే అవకాశం స్వల్పం. మొదటి ఉదాహరణలో స్పష్టంగా కనిపిస్తున్న అంశం ఒకటి ఏమిటంటే నిధిని కనుక్కోవడం అనుకోకుండా అకస్మాత్తుగా జరిగింది. క్రీస్తు అయితే మనుషుల కోసం ఉద్దేశపూర్వకంగా వెదుకుతూ ఉన్నాడు (లూకా 19:10). ఏదో తెలియని రీతిలో సంఘం అకస్మాత్తుగా ఆయన కంటబడిందని ఎవరు అనుకోగలరు? “ఒక పొలం”– వ 24లో “తన పొలం” అని రాసి ఉంది. ఇక్కడ అలా లేదు. నిధిని కనుగొనేవాడు ఈ పొలాన్ని కొనుక్కోవలసి వచ్చింది. వ 24లోని పొలం అయితే ఇదివరకే దేవునిది, క్రీస్తుది. ఇక్కడి “పొలం” వేరేదాన్ని సూచిస్తున్నట్టుందన్న మాట. ఈ రెండో ఉదాహరణలోని వ్యక్తి అనేక ముత్యాల కోసం వెతకుతున్నాడు. అతనిది ముత్యాల వ్యాపారం. క్రీస్తు విషయం అలా కాదు. ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు తనకేది కావాలో ఆయనకు బాగా తెలుసు. ఒకే ఒక శ్రేష్ఠమైనదాని కోసం, అంటే తన సంఘం కోసం ఆయన వచ్చాడు, తన సమయాన్నంతా వెచ్చించాడు. ఈ వివరణ కన్నా మరొకటి మరింత అనుకూలం అనిపిస్తున్నది. అదేమంటే, దేవుని రాజ్యాన్ని కనుగొన్న వ్యక్తులను ఈ రెండు ఉదాహరణలూ సూచిస్తున్నాయి. మొదటి ఉదాహరణలోని వాడు కావాలని వెదకకపోయినా దాన్ని కనుగొన్నాడు. రోమీయులకు 10:20 (యెషయా 65:1); మత్తయి 9:30-31 పోల్చి చూడండి. దేవుని రాజ్యం ఈ లోకంలో ఉంది గానీ స్పష్టంగా కళ్ళకు కట్టినట్టు బయటికి కనిపించడం లేదు. మనుషుల్లో అధిక సంఖ్యాకుల చూపుకు అందకుండా మరుగై ఉంది. అయితే మనుషులకు తెలియని రీతిలో దేవుడు వారిని నడిపిస్తాడు. తెలియకుండానే హఠాత్తుగా ఈ గొప్ప నిధి వారి కంటబడుతుంది. ముత్యాలను వెదికేవాడు మరో రకం. అతడు ఆలోచనా శక్తిగలవాడు. వస్తువుల విలువలు కొంతవరకైనా అతనికి తెలుసు. దేవుడు అతణ్ణి సత్యం, న్యాయం, సౌందర్యం, జ్ఞానం, పాపవిముక్తి గురించి వెదికేలా చేశాడు. దేవుని రాజ్యం గురించి అతనికి తెలిసినప్పుడు, జ్ఞాన ప్రకాశాలు కలిగిన ఆత్మ నేత్రాలతో దాన్ని అతడు చూచినప్పుడు దానితో సరిపోల్చదగినది వేరేది లేదని గ్రహిస్తాడు. రెండు ఉదాహరణల్లోని వ్యక్తులు కూడా తాము కనుగొన్నదాన్ని కొనేందుకు తమకున్నదంతా అమ్మిన విషయం గమనించండి. అలాగైతే దేవుని రాజ్యాన్ని డబ్బిచ్చి కొనుక్కోవచ్చా? అలా కాదు (అపో. కార్యములు 8:20; రోమీయులకు 6:23; ఎఫెసీయులకు 2:8-9). అయినా కొనుక్కోదగినదిగా దాన్ని వర్ణించడం కనిపిస్తున్నది బైబిల్లో (యెషయా 55:1-2; ప్రకటన గ్రంథం 3:18). అంటే అది కావాలనుకున్నవాడు చెల్లించవలసిన వెల ఒకటుంది. తనకున్నదంతా ఇచ్చేయడమే ఆ వెల (మత్తయి 10:37-39; లూకా 14:26-27, లూకా 14:33; మార్కు 10:28 పోల్చి చూడండి). ఆ రాజ్యం విలువ, సౌందర్యం చూచినవారెవరికైనా దాని వెల ఎక్కువగా ఉన్నట్టు అనిపించదు (ఫిలిప్పీయులకు 3:7-8)

45. మరియు పరలోకరాజ్యము, మంచి ముత్యములను కొన వెదకుచున్న వర్తకుని పోలియున్నది.

46. అతడు అమూల్యమైన యొక ముత్యమును కనుగొని, పోయి తనకు కలిగిన దంతయు అమ్మి దాని కొనును.

47. మరియు పరలోకరాజ్యము, సముద్రములో వేయబడి నానావిధములైన చేపలను పట్టిన వలను పోలియున్నది.

ఇది గోధుమలు, కలుపుమొక్కలు ఉదాహరణను పోలి ఉంది. అయితే కొన్ని తేడాలు కూడా ఉన్నాయి. ఈ కాలంలో పరిస్థితులు ఏవిధంగా క్రమక్రమంగా చివరిదాకా మారుతూ వస్తాయో ఆ ఉదాహరణలో ఉంది. ఈ ఉదాహరణైతే ఎలాగో తెలియకుండా శుభవార్త వలలో పడి క్రైస్తవంలోకి ఈడ్వబడిన వారి గురించి చెప్తున్నది. ఇక్కడ కూడా ఈ కాలంలో మంచివారిని, చెడ్డవారిని వేరు చేయడం మనుషులకు సాధ్యం కాదని గమనిస్తున్నాం. సంఘంలో నాయకులు, విశ్వాసులు తమ స్థానిక సంఘాల్లో భయభక్తులు లేనివారు, దుర్మార్గులు సభ్యులుగా ఉండకుండా ప్రయత్నాలు చేయాలి (1 కోరింథీయులకు 5:1-2, 1 కోరింథీయులకు 5:11-13; 2 తిమోతికి 3:1-5). అయితే మొత్తానికి ఏ తప్పూ లేకుండా ఇలాంటిది పూర్తి చెయ్యడం అసాధ్యం అవుతుంది. పన్నెండు మంది శిష్యుల్లో ఒక యూదా ఇస్కరియోతు ఉన్నాడు. ఆ తరువాత క్రీస్తురాయబారులు చివరి రోజుల్లో సంఘాల్లోకి దుర్మార్గులు ప్రవేశిస్తారని హెచ్చరించారు (అపో. కార్యములు 20:23-30; 2 తిమోతికి 4:3-4; 2 పేతురు 2:1-2). మంచినుండి చెడును (నిజ క్రైస్తవుల నుంచి కపట క్రైస్తవులను) చివరికి పూర్తిగా వేరు చేయడం అనేది ఈ యుగాంతంలోనే జరుగుతుంది. వ 40-43 పోల్చి చూడండి. మత్తయి 13:47 వల అని తర్జుమా చేసిన గ్రీకు పదానికి చేతితో విసిరే చిన్న వల అని అర్థం కాదు. సరస్సునంతటినీ దేవినట్టు లాక్కువెళ్ళే పెద్ద వల అని గ్రహించాలి. ఇందులో చాలా పెద్ద మొత్తం చేపలు పడతాయి.

48. అది నిండినప్పుడు దానిని దరికి లాగి, కూర్చుండి, మంచి వాటిని గంపలలో చేర్చి చెడ్డవాటిని బయట పారవేయు దురు.

49. ఆలాగే యుగసమాప్తియందు జరుగును. దేవదూతలు వచ్చి నీతిమంతులలోనుండి దుష్టులను వేరుపరచి,

50. వీరిని అగ్ని గుండములో పడవేయుదురు. అక్కడ ఏడ్పును పండ్లుకొరుకుటయును ఉండును.
దానియేలు 3:6

51. వీటినన్నిటిని మీరు గ్రహించితిరా అని వారిని అడుగగా వారుగ్రహించితి మనిరి.

క్రీస్తు వారి మనోనేత్రాలను తెరిచి, తన ఉదాహరణను వివరించాడు కూడా, కాబట్టి వారు అర్థం చేసుకున్నారు. మార్కు 4:34 చూడండి. అందువల్ల వారు “అవును” అనగలిగారు. ఒకవేళ గ్రహించకపోయినట్టయితే గోధుమలు, కలుపుమొక్కలు ఉదాహరణ విషయంలో అడిగినట్టుగానే అదనంగా మరింత వివరణ కోసం అడిగి ఉండేవారే కదా (వ 36)?

52. ఆయన అందువలన పరలోకరాజ్యములో శిష్యుడుగాచేరిన ప్రతిశాస్త్రియు తన ధననిధిలోనుండి క్రొత్త పదార్థములను పాత పదార్థములను వెలుపలికి తెచ్చు ఇంటి యజమానుని పోలియున్నాడని వారితో చెప్పెను.

తన శిష్యులు ఉపదేశకులై ఉండాలని యేసుప్రభువు సూచిస్తున్నాడు. యేసుప్రభువు ఆ సమయంలో చేస్తున్నట్టే వారు దేవుని వాక్కు అనే విశాలమైన గిడ్డంగుల నుంచి పాత ఒడంబడిక గ్రంథంలోని పాత నిధులను, క్రొత్త ఒడంబడికలోనుంచి కొత్త నిధులను ప్రజలకు అందించాలి.

53. యేసు ఈ ఉపమానములు చెప్పి చాలించిన తరువాత, ఆయన అక్కడ నుండి వెళ్లి స్వదేశమునకు వచ్చి, సమాజ మందిరములలో వారికి బోధించుచుండెను.

54. అందువలన వారాశ్చర్యపడి ఈ జ్ఞానమును ఈ అద్భుతములును ఇతని కెక్కడనుండి వచ్చినవి?
యెషయా 52:14

“స్వగ్రామం”– నజరేతు. యేసు ఈ ఉదాహరణలు గలలీ సరస్సు దగ్గర కపెర్‌నహూం ప్రాంతాల్లో చెప్పాడు. నజరేతులో యేసుకు తిరస్కారం, శంకలు ఎదురయ్యాయి.

55. ఇతడు వడ్లవాని కుమారుడు కాడా? ఇతని తల్లిపేరు మరియ కాదా? యాకోబు యోసేపు సీమోను యూదాయనువారు ఇతని సోదరులు కారా?

యేసు జన్మించిన తరువాత యోసేపు మరియలకు పిల్లలు కలిగారు అని ఈ వచనాలు సూచిస్తున్నాయి.

56. ఇతని సోదరీమణులందరు మనతోనే యున్నారు కారా? ఇతనికి ఈ కార్యములన్నియు ఎక్కడనుండి వచ్చెనని చెప్పుకొని ఆయన విషయమై అభ్యంతరపడిరి.

57. అయితే యేసుప్రవక్త తన దేశము లోను తన ఇంటను తప్ప, మరి ఎక్కడనైనను ఘనహీనుడు కాడని వారితో చెప్పెను.

లూకా 4:24-30 పోల్చి చూడండి. చూడ్డానికి అంత సామాన్య కుటుంబానికి చెంది సాంఘికంగా అంత తక్కువ స్థితిలోనుంచి వచ్చిన మనిషి గొప్పవాడు కావడం వారు నమ్మలేకపోయారు. మనుషులు ఇప్పటికే తరచుగా ఇలాంటి పొరపాటు చేస్తుంటారు.

58. వారి అవిశ్వాసమునుబట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చేయలేదు.

మార్కు 6:4-5 చూడండి. వారి అపనమ్మకం మూలంగా వారికి ఆయన చెయ్యాలని కోరిన మేలు కూడా చెయ్యడం అసాధ్యం అయిపోయింది. ఎప్పుడైనా అపనమ్మకం ఇలాంటి ఫలితాన్నే కలిగిస్తుంది.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Matthew - మత్తయి సువార్త 13 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

విత్తువాడు ఉపమానం. (1-23) 
గుంపు యొక్క ఒత్తిడిని తగ్గించడానికి మాత్రమే కాకుండా, తన సందేశం ప్రజలకు స్పష్టంగా చేరేలా చేయడానికి కూడా యేసు పడవ ఎక్కేందుకు ఎంచుకున్నాడు. ఇది ఆరాధన విషయాలలో మనకు ఒక పాఠంగా ఉపయోగపడుతుంది - మనం బాహ్య పరిస్థితులలో గొప్పతనాన్ని కోరుకోకూడదు, కానీ దేవుడు తన ప్రావిడెన్స్‌లో అందించే వనరులను ఎక్కువగా ఉపయోగించుకోవాలి. క్రీస్తు ఉపమానాలను బోధనా పద్ధతిగా ఉపయోగించాడు. ఇది నేర్చుకోవాలనే ఆసక్తి ఉన్నవారికి దేవుని సందేశాన్ని మరింత అందుబాటులోకి తెచ్చింది, అయినప్పటికీ అజ్ఞానాన్ని ఎంచుకున్న వారికి ఇది మరింత సవాలుగా మరియు అస్పష్టంగా మారింది.
విత్తువాడు ఉపమానం ఈ బోధనా విధానానికి స్పష్టమైన ఉదాహరణ. ఈ ఉపమానంలో, విత్తనం దేవుని వాక్యాన్ని సూచిస్తుంది మరియు విత్తేవాడు మన ప్రభువైన యేసుక్రీస్తును సూచిస్తాడు, అతను స్వయంగా లేదా అతని సేవకుల ద్వారా పదాన్ని విత్తాడు. సమూహానికి బోధించడం విత్తనాలు విత్తడం లాంటిది; అవి ఎక్కడ పాతుకుపోతాయో మనం ఊహించలేము. మన ప్రయత్నాలు ఉన్నప్పటికీ, కొన్ని హృదయాలు అర్థవంతమైన ఫలాలను ఇవ్వవు, మరికొన్ని మంచి నేలలా సమృద్ధిగా ఉత్పత్తి చేస్తాయి. ఈ సారూప్యత నాలుగు రకాల నేలల ద్వారా వివరించబడిన వ్యక్తుల యొక్క విభిన్న స్వభావానికి వర్తిస్తుంది.
అజాగ్రత్తగా మరియు ఉదాసీనంగా శ్రోతలు సాతాను ప్రభావానికి గురవుతారు, అతను ఆత్మలను దొంగిలించడమే కాకుండా ప్రసంగాలను కూడా దొంగిలించడానికి ప్రయత్నిస్తాడు. మనం మాటను కాపాడుకోవడంలో విఫలమైతే ఆయన ఖచ్చితంగా మనల్ని దోచుకుంటాడు. కపటవాదులు, రాతి నేలను పోలి ఉంటారు, నిజమైన క్రైస్తవుల కంటే వారి వృత్తిలో మరింత ఉత్సాహంగా కనిపిస్తారు. చాలా మంది స్ఫూర్తిదాయకమైన ఉపన్యాసాలను వాటి నుండి ప్రయోజనం పొందకుండా ఆనందంగా వింటారు. వారు మోక్షం, విశ్వాసుల ఆశీర్వాదాలు మరియు స్వర్గపు ఆనందం గురించి వినవచ్చు, కానీ మనసు మార్చుకోకుండా, వారి స్వంత పాపపు నమ్మకం, రక్షకుని అవసరం లేదా పవిత్రత పట్ల ప్రశంసలు లేకుండా, వారు త్వరగా తప్పుడు హామీని ప్రకటిస్తారు. అయినప్పటికీ పరీక్షలు లేదా పాపం యొక్క ఎరను ఎదుర్కొన్నప్పుడు, వారు తమ విశ్వాసాన్ని విడిచిపెట్టడం లేదా మారువేషం వేయడం లేదా మరింత అనుకూలమైన నమ్మక వ్యవస్థ వైపు మొగ్గు చూపడం.
ప్రాపంచిక శ్రద్ధలు, ముళ్ళతో పోల్చబడినవి, పాపం యొక్క పురాతన పర్యవసానంగా ఉంటాయి, అంతరాలను అడ్డుకోవడానికి తగినవి కానీ వాటితో విస్తృతంగా వ్యవహరించే వారికి ద్రోహం. వారు వలలు, బాధలు మరియు గీతలు, చివరికి వినియోగించబడతారు. దేవుని వాక్యం నుండి ప్రయోజనం పొందే మన సామర్థ్యానికి ప్రాపంచిక ఆందోళనలు గణనీయంగా ఆటంకం కలిగిస్తాయి. ఐశ్వర్యం యొక్క మోసం చాలా హాని చేస్తుంది, కానీ మనం వాటిపై నమ్మకం ఉంచితే అవి మనల్ని మోసం చేస్తాయి. అలాంటి సందర్భాలలో, వారు మంచి విత్తనాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తారు. మంచి నేల యొక్క ప్రత్యేక లక్షణం దాని ఫలవంతమైనది, ఇది నిజ క్రైస్తవులను వేషధారుల నుండి వేరు చేస్తుంది. ఈ మంచి నేలలో రాళ్లు లేదా ముళ్ళు లేవని క్రీస్తు చెప్పలేదు, కానీ దాని ఫలవంతానికి ఆటంకాలు లేకుండా ఉన్నాయి. అన్నీ ఒకేలా లేనప్పటికీ, సాధ్యమైనంత ఎక్కువ ఫలాలను అందించడానికి మనం ప్రయత్నించాలి.
దేవుని మాట వినడం అనేది మన వినికిడి జ్ఞానానికి ఒక గొప్ప అన్వయం. కాబట్టి, మనం ఎలాంటి శ్రోతలమో తెలుసుకోవడానికి మనల్ని మనం పరీక్షించుకోవాలి.

టేర్స్ యొక్క ఉపమానం. (24-30; 36-43) 
ఈ ఉపమానంలో, సువార్త చర్చి యొక్క ప్రస్తుత మరియు భవిష్యత్తు స్థితి యొక్క వర్ణనను మనం చూస్తాము. ఇది చర్చి పట్ల క్రీస్తు యొక్క శ్రద్ధ, దాని పట్ల దెయ్యం యొక్క శత్రుత్వం, ఈ ప్రపంచంలో మంచి మరియు చెడు రెండింటి సహజీవనం మరియు మరణానంతర జీవితంలో ఈ మూలకాలను చివరికి వేరుచేయడాన్ని వివరిస్తుంది. ఇది పాపం వైపు పడిపోయిన మానవత్వం యొక్క వంపుని నొక్కి చెబుతుంది, శత్రువు అసమ్మతిని విత్తినప్పుడు, అది వృద్ధి చెందుతుంది మరియు హాని కలిగిస్తుంది. దానికి విరుద్ధంగా, మంచి సూత్రాలు ప్రవేశపెట్టబడినప్పుడు, వాటికి నిరంతరం శ్రద్ధ, పోషణ మరియు రక్షణ అవసరం.
సేవకులు, అవాంఛనీయ మూలకాల ఉనికిని చూసి కలవరపడి, వారి యజమానిని ఒక ప్రశ్నతో సంప్రదించారు: "అయ్యా, మీరు మీ పొలంలో మంచి విత్తనాలు విత్తలేదా?" సమాధానం నిస్సందేహంగా అవును. చర్చిలో ఏవైనా లోపాలు క్రీస్తుకు ఆపాదించబడకూడదు. కఠోరమైన అతిక్రమణదారులను మరియు సువార్తను బహిరంగంగా వ్యతిరేకించే వారిని విశ్వాసుల సహవాసం నుండి తొలగించడం చాలా అవసరం అయితే, మానవ వివేచనకు పరిపూర్ణమైన విభజనను సాధించడం దాదాపు అసాధ్యం. వ్యతిరేకించే వారిని వెంటనే నరికివేయకూడదు; బదులుగా, వారు ఓర్పు మరియు వినయంతో విద్యావంతులను చేయాలి.
ఈ లోకంలో నీతిమంతులు మరియు దుర్మార్గులు సహజీవనం చేసినప్పటికీ, ప్రత్యేకించి గణన యొక్క గొప్ప రోజున వారు నిస్సందేహంగా గుర్తించబడే సమయం వస్తుంది. ఇక్కడ, భూమిపై, వాటి మధ్య తేడాను గుర్తించడం సవాలుగా ఉంటుంది. కావున రాబోయే పర్యవసానాలను తెలుసుకొని అధర్మాలకు పాల్పడటం మానుకుందాం.
మరణం తరువాత, విశ్వాసులు వారి స్వంత అవగాహనలో అద్భుతంగా ప్రకాశిస్తారు మరియు గొప్ప రోజున, వారు మొత్తం ప్రపంచం ముందు ప్రకాశిస్తారు. వారి ప్రకాశం ఒక ప్రతిబింబం, అన్ని కాంతి మూలం నుండి దాని ప్రకాశాన్ని పొందింది. వారి పవిత్రీకరణ పరిపూర్ణమవుతుంది, మరియు వారి సమర్థన అందరికీ స్పష్టంగా కనిపిస్తుంది. మనం ఈ అదృష్ట సమూహంలో ఒకరిగా ఉండేందుకు కృషి చేద్దాం.

ఆవాలు-విత్తనం మరియు పులియబెట్టిన ఉపమానాలు. (31-35) 
విత్తిన విత్తనం యొక్క ఉపమానం యొక్క సారాంశం ఏమిటంటే, సువార్త యొక్క ప్రారంభ దశలు నిరాడంబరంగా కనిపించవచ్చు, కానీ దాని అంతిమ ప్రభావం గణనీయంగా ఉంటుంది. ఇది వ్యక్తిలోని దయ యొక్క పురోగతిని, మనలోని దేవుని రాజ్యం యొక్క అభివృద్ధిని ప్రతిబింబిస్తుంది. నిజమైన దయ ఒక ఆత్మలో నివసిస్తుంటే, అది వెంటనే స్పష్టంగా కనిపించకపోయినప్పటికీ, అది యథార్థంగా పెరుగుతుంది; అది చివరికి వర్ధిల్లుతుంది, శక్తివంతంగా మరియు ప్రయోజనకరంగా మారుతుంది.
సువార్త యొక్క ప్రకటన దానిని స్వీకరించిన వారి హృదయాలలో పులిసిన మాదిరిగానే పనిచేస్తుంది. పులిసిన పిండి నిశ్చయంగా పనిచేసినట్లే, క్రమంగా దేవుని వాక్యం కూడా పనిచేస్తుంది. ఇది తరచుగా బాహ్య సంకేతాలు లేకుండా నిశ్శబ్దంగా పనిచేస్తుంది రోమీయులకు 6:13. ఈ ఉపమానాలు క్రమంగా పురోగతిని అంచనా వేయడానికి మనకు బోధిస్తాయి. కాబట్టి, మనల్ని మనం ప్రశ్నించుకోవడం విలువైనదే: మనం దయతో మరియు సద్గుణ సూత్రాలు మరియు అలవాట్లను అనుసరించడంలో ముందుకు సాగుతున్నామా?

దాచిన నిధి, గొప్ప విలువైన ముత్యం, సముద్రంలో విసిరిన వల మరియు గృహస్థుని యొక్క ఉపమానాలు. (44-52) 
ఇక్కడ నాలుగు ఉపమానాలు ఉన్నాయి:
1. ఫీల్డ్‌లో దాచిన నిధి యొక్క ఉపమానం:
    చాలా మంది ప్రజలు సువార్త విలువను తక్కువగా అంచనా వేస్తారు ఎందుకంటే వారు దాని ఉపరితలం మాత్రమే చూస్తారు. అయితే, క్రీస్తును మరియు నిత్యజీవాన్ని కనుగొనే ఉద్దేశ్యంతో లేఖనాలను లోతుగా పరిశోధించే వారు యోహాను 5:39లో పేర్కొన్నట్లు సువార్తలో అపరిమితమైన నిధిని కనుగొంటారు. దాన్ని తమ సొంతం చేసుకోవడానికి ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతారు. మోక్షాన్ని కొనలేనప్పటికీ, దాని సాధనలో చాలా లొంగిపోవాలి.
2. ది పేరబుల్ ఆఫ్ ది పెర్ల్ ఆఫ్ గ్రేట్ ప్రైస్:
    ప్రజలు తరచుగా సంపద, గౌరవం లేదా జ్ఞానం వంటి వివిధ సాధనలతో నిమగ్నమై ఉంటారు. దురదృష్టవశాత్తు, చాలామంది తమ ఆనందాన్ని వెంబడించడంలో నకిలీ ముత్యాల కోసం స్థిరపడతారు. యేసు క్రీస్తు గొప్ప ధర యొక్క అంతిమ ముత్యం; అతనిని కలిగి ఉండటం ఆనందాన్ని భరించడానికి సరిపోతుంది. బంగారాన్ని కొనుగోలు చేయడం చాలా ఎక్కువ ఖర్చుతో కూడుకున్నది కావచ్చు, కానీ గొప్ప ధర కలిగిన ముత్యం ఏ త్యాగానికైనా విలువైనదే. పశ్చాత్తాపపడిన పాపాత్ముడు క్రీస్తును దయగల రక్షకునిగా గుర్తించినప్పుడు, మిగతావన్నీ దాని విలువను కోల్పోతాయి.
3. ఫిషింగ్ నెట్ యొక్క ఉపమానం:
    ప్రపంచాన్ని విస్తారమైన సముద్రంతో పోల్చారు, ప్రజలతో, వారి సహజ స్థితిలో, చేపలను పోలి ఉంటుంది. సువార్త ప్రకటించడమంటే దేవుడు ఎన్నుకున్న వారిని కూడగట్టేందుకు ఈ సముద్రంలో వల వేయడంతో సమానం. కపటవాదులు మరియు నిజమైన క్రైస్తవులు ఇద్దరూ వేరు చేయబడతారు మరియు దూరంగా ఉన్నవారికి ఇది ఒక దయనీయమైన విధి.
4. నమ్మకమైన మంత్రి యొక్క ఉపమానం:
    జ్ఞానవంతుడు మరియు నమ్మకమైన సువార్త పరిచారకుడు సువార్త బోధలలో బాగా ప్రావీణ్యం కలవాడు మరియు వాటిని అందించగల సామర్థ్యం ఉన్న లేఖకుడితో పోల్చబడ్డాడు. క్రీస్తు తన అతిథులకు గొప్ప విందును అందించే బాధ్యతగల హోస్ట్‌గా ఈ మంత్రిని చిత్రీకరిస్తాడు, గత అనుభవాలు మరియు కొత్త పరిశీలనల నుండి అనేక రకాల అంతర్దృష్టులను అందిస్తాడు. మనకు సరైన స్థలం క్రీస్తు పాదాల వద్ద ఉంది, ఇక్కడ మనం నిరంతరంగా కాలానుగుణ పాఠాలు మరియు కొత్తగా వెల్లడించిన సత్యాలు రెండింటినీ నేర్చుకుంటాము.

యేసు మళ్లీ నజరేతులో తిరస్కరించబడ్డాడు. (53-58)
గతంలో తనను తిరస్కరించిన వారికి క్రీస్తు తన ఆహ్వానాన్ని పునరుద్ఘాటించాడు. ‘ఈ వడ్రంగి కొడుకు కాదా’ అని విమర్శిస్తున్నారు. నిజమే, అతను వడ్రంగి కొడుకుగా పిలువబడ్డాడు మరియు గౌరవప్రదమైన వ్యాపారి యొక్క బిడ్డగా ఉండటానికి అవమానం లేదు. నిజానికి, అతను వారి స్వంత వ్యక్తి కాబట్టి వారు అతనికి మరింత గౌరవం చూపించవలసి ఉంటుంది, కానీ బదులుగా, వారు అతనిని చిన్నచూపు చూశారు. ఆ స్థలంలో, వారి విశ్వాసం లేకపోవడం వల్ల అతను కొన్ని అద్భుత కార్యాలు చేశాడు. క్రీస్తు ఆశీర్వాదాలను పొందేందుకు అవిశ్వాసం ప్రధాన అడ్డంకిగా నిలుస్తుంది. మనలను దేవునితో సమాధానపరచిన రక్షకునిగా ఆయన పట్ల మన భక్తిలో స్థిరంగా నిలుద్దాము.



Shortcut Links
మత్తయి - Matthew : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |