Matthew - మత్తయి సువార్త 15 | View All
Study Bible (Beta)

1. ఆ సమయమున యెరూషలేమునుండి శాస్త్రులును పరిసయ్యులును యేసునొద్దకు వచ్చి

2. నీ శిష్యులు చేతులు కడుగుకొనకుండ భోజనము చేయుచున్నారే, వారెందు నిమిత్తము పెద్దల పారంపర్యాచారమును అతిక్రమించు చున్నారని అడిగిరి

పెద్దల సాంప్రదాయం అంటే మోషే ధర్మశాస్త్రానికి యూదా మత పండితులు ఇచ్చుకున్న వివరణలు, అనుదిన జీవితాలను శాసించే నియమావళి. అవి ఒక తరం నుంచి మరో తరానికి సంక్రమిస్తూ వచ్చాయి. అనుదిన జీవితంలో సాధారణంగా చేసే కార్యకలాపాల మూలంగా మనుషులు మత సంబంధంగా అశుద్ధమౌతారనీ, ఈ అశుద్ధతను వదిలించు కునేందుకు వారు నీటితో కడుక్కోవాలనీ ఈ మత నాయకులు ఎంచారు. శిష్యులు శారీరకంగా మురికిగా ఉన్న విషయం కాదు వారు పట్టించుకుంటున్నది. కడుక్కోవడం అనేది వారు ఒక మత సంబంధమైన తంతుగా ఎంచారు (మార్కు 7:2-4).

3. అందుకాయన మీరును మీపారం పర్యాచారము నిమిత్తమై దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్ర మించుచున్నారు?

పెద్దల సాంప్రదాయాలతో యేసుప్రభువుకు పని లేదు. దేవుని ఆజ్ఞలే ఆయనకు ప్రాముఖ్యం. దేవుని స్పష్టమైన ఆజ్ఞలనుంచి తప్పించుకునేందుకు ఈ మత నాయకులు దొడ్డిదారులు కనిపెట్టారు గానీ తమ సాంప్రదాయాలను మాత్రం అలానే పట్టుకుని వేళ్ళాడేవారు. ఆ ధర్మశాస్త్రాన్ని దేవుడే ఇచ్చాడని యేసు బోధిస్తున్న సంగతి గమనించండి. మోషేద్వారా వచ్చిన ఆజ్ఞలు దేవుని ఆజ్ఞలే.

4. తలిదండ్రులను ఘనపరచుమనియు, తండ్రినైనను తల్లినైనను దూషించువాడు తప్పక మరణము పొందవలెననియు దేవుడు సెలచిచ్చెను.
నిర్గమకాండము 20:12, నిర్గమకాండము 21:17, లేవీయకాండము 20:9, ద్వితీయోపదేశకాండము 5:16

నిర్గమకాండము 20:16; నిర్గమకాండము 21:17.

5. మీరైతే ఒకడు తన తండ్రినైనను తల్లినైనను చూచి నావలన నీకేది ప్రయోజనమగునో అది దేవార్పితమని చెప్పిన యెడల అతడు తన తండ్రినైనను తల్లినైనను ఘనపరచనక్కరలేదని చెప్పుచున్నారు.

వేరే మాటల్లో చెప్పాలంటే దేవుని పేరట, దేవుని కోసమన్నట్టుగా వారు దేవుని ఆజ్ఞలనే భంగం చేస్తున్నారు. దేవుని మార్గాలను వక్రం చేసే మానవుల భ్రష్టమైన కపట స్వభావానికి ఇది మరో ఉదాహరణ.

6. మీరు మీ పారంపర్యాచారము నిమిత్తమై దేవుని వాక్యమును నిరర్థకము చేయుచున్నారు.

7. వేషధారులారా

“కపట భక్తులు”– మత్తయి 6:2; మత్తయి 7:5; మత్తయి 23:13.

8. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది;
యెషయా 29:13

యెషయా 29:13. చాలా ఎక్కువమంది దేవుని మాటకు లోబడడం కంటే మనుషుల కట్టడలను, ఏర్పాట్లును అనుసరించడానికే ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. అయినా అలాంటి వారనేకులు దేవుని పక్షాన ఉన్నట్టు కనిపించడానికి ఇష్టపడతారు. భూమిపై ఇలాంటి వ్యర్థ ఆరాధన నేడు కుప్పలు తెప్పలుగా ఉంది.

9. మనుష్యులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించు చున్నారు అని యెషయా మిమ్మునుగూర్చి ప్రవచించిన మాట సరియే అని వారితో చెప్పి
యెషయా 29:13

10. జనసమూహములను పిలిచి మీరు విని గ్రహించుడి;

11. నోటపడునది మనుష్యుని అపవిత్ర పరచదు గాని నోటనుండి వచ్చున దియే మనుష్యుని అప విత్రపరచునని వారితో చెప్పెను.

నిజమైన “అపవిత్రం” భౌతికం కాదనీ శరీర సంబంధమైనది కాదనీ నీతిన్యాయాల విషయమనీ ఆయన ఉద్దేశం. అది ఆహార పదార్థాలతో, స్నానాలతో ముడిపడి లేదు గానీ హృదయానికీ మనస్సుకూ ఆత్మకూ సంబంధించి ఉంది (వ 17-20). అంతరంగం నిండా కుళ్ళు ఉంచుకుని బయట మడి స్నానాలు చేసి మత సంబంధంగా శుచిగా ఉండడం వల్ల ప్రయోజనమేముంది? మత్తయి 23:25-28 చూడండి. అంతరంగంలో పరిశుభ్రంగా ఉండవలసిన అవసరం ఉంది. మత్తయి 5:8; హెబ్రీయులకు 9:14; 1 పేతురు 1:22; 1 యోహాను 1:9 చూడండి.

12. అంతట ఆయన శిష్యులు వచ్చిపరిసయ్యులు ఆ మాట విని అభ్యంతరపడిరని నీకు తెలియునా అని ఆయనను అడుగగా

13. ఆయన పరలోకమందున్న నా తండ్రి నాటని ప్రతి మొక్కయు పెల్లగింపబడును.

దేవుడు మొక్కలు నాటేవాడూ, పెరికివేసేవాడూను. మత్తయి 13:24-30; యెషయా 60:21; యెషయా 61:3; యిర్మియా 1:9-10 చూడండి. దేవుడు తప్ప నాటగలిగిన వారెవరు? మత్తయి 13:39 చూడండి.

14. వారి జోలికి పోకుడి; వారు గ్రుడ్డివారైయుండి గ్రుడ్డివారికి త్రోవ చూపువారు. గ్రుడ్డివాడు గ్రుడ్డివానికి త్రోవ చూపిన యెడల వారిద్దరు గుంటలో పడుదురు గదా అనెను.

“దారి చూపే గ్రుడ్డివారు”– మత్తయి 23:16, మత్తయి 23:24; రోమీయులకు 2:19. ఏ మాత్రం ఆధ్యాత్మిక జ్ఞానం లేకుండా తామేదో జ్ఞానప్రకాశాలు గలవారం అనుకుంటూ ఇతరులకు మార్గం చూపేందుకు ప్రయత్నించేవారు అనేకమంది ఉన్నారు. అంతేగాక ఇలాంటివారిని అనుసరించి ప్రపంచవ్యాప్తంగా మత కూపాల్లో పడిపోయినవారూ చాలామంది ఉన్నారు.

15. అందుకుపేతురు ఈ ఉపమానభావము మాకు తెలుపుమని ఆయనను అడుగగా

16. ఆయనమీరును ఇంతవరకు అవివేకులైయున్నారా?

మత్తయి 16:9; లూకా 24:25 చూడండి.

17. నోటిలోనికి పోవున దంతయు కడుపులోపడి బహిర్భూమిలో విడువబడును గాని

18. నోటనుండి బయటికి వచ్చునవి హృదయములో నుండి వచ్చును; ఇవే మనుష్యుని అపవిత్రపరచునవని మీరు గ్రహింపరా?

19. దురాలోచనలు నరహత్యలు వ్యభిచారములు వేశ్యాగమనములు దొంగతనములు అబద్ధసాక్ష్య ములు దేవదూషణలు హృదయములో నుండియే వచ్చును

సహజంగా మానవ హృదయం ఏమిటో యేసు ఇక్కడ వెల్లడి చేస్తున్నాడు. మనిషి అన్న ప్రతివాడూ భ్రష్ట స్వభావంతోనే పుడతాడు. దాని సమయం వచ్చినప్పుడు ఇక్కడ ఇచ్చిన జాబితాలోని ఏదో ఒక పాపం లేక అనేక పాపాల రూపంలో అది బయట పడుతుంది. ప్రవాహాలే ఇంత మురికివైతే వాటి ఉత్పత్తి స్థానమైన ఊట ఇంకెంత చెడ్డదో గదా!

20. ఇవే మనుష్యుని అపవిత్రపరచును గాని చేతులు కడుగు కొనక భోజనముచేయుట మనుష్యుని అపవిత్రపరచదని చెప్పెను.

21. యేసు అక్కడనుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్లగా,

మత్తయి 11:21.

22. ఇదిగో ఆ ప్రాంతములనుండి కనాను స్త్రీ యొకతె వచ్చిప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము; నా కుమార్తె దయ్యముపట్టి, బహు బాధపడుచున్నదని కేకలువేసెను.

ఈమె ఆది కనాను నివాసుల సంతానానికి చెందినది. ఆదికాండము 10:18; ఆదికాండము 15:20 చూడండి. దావీదు కుమారుడు గురించి నోట్ మత్తయి 1:1. దయ్యం పట్టడం గురించి నోట్ మత్తయి 4:24.

23. అందుకాయన ఆమెతో ఒక్క మాటయైనను చెప్పలేదు. అప్పుడాయన శిష్యులు వచ్చిఈమె మన వెంబడి వచ్చి కేకలువేయు చున్నది గనుక ఈమెను పంపి వేయుమని ఆయనను వేడుకొనగా

యూదులు కానివారంటే యేసుకు ప్రేమ, కనికరం లోపించడం కాదు ఆయన మౌనానికి కారణం. మత్తయి 28:19; మార్కు 16:15; లూకా 24:46-47; యోహాను 3:16 లో ఆయన చెప్పిన మాటలే చూడండి. అయితే ఆయన తన శుభవార్తను లోకమంతటా పంపించేందుకు సిద్ధం కాక మునుపు ఇస్రాయేల్‌లో ఆయన చెయ్యవలసిన పని ఉంది. ప్రత్యేకించి ఆ పని పూర్తి చేసేందుకే దేవుడాయన్ను పంపించాడు (వ 24). మత్తయి 10:5-6 పోల్చి చూడండి. ఇక ఈ స్త్రీ విషయానికోస్తే ఆమె నమ్మకంలోని శక్తినీ, అందాన్నీ బయటికి తెచ్చేందుకు ఆ నమ్మకాన్ని ఆయన పరీక్షిస్తున్నాడు. ముందునుంచి కూడా ఆమెకు సహాయం చేద్దామనే ఆయన ఉద్దేశం (అసలు ఈ ఉద్దేశం మనసులో ఉంచుకునే ఆయన ఆ ప్రాంతాలకు వెళ్ళాడు). ఆ స్త్రీ అవసరతకన్నా శిష్యులకు తమ స్వంత విషయమే ఎక్కువ కంగారుగా ఉంది.

24. ఆయనఇశ్రాయేలు ఇంటివారై నశించిన గొఱ్ఱెలయొద్దకే గాని మరి ఎవరియొద్దకును నేను పంపబడ లేదనెను

25. అయినను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి ప్రభువా, నాకు సహాయము చేయుమని అడిగెను.
యెహోషువ 5:14-15

26. అందుకాయనపిల్లల రొట్టెతీసికొని కుక్కపిల్లలకువేయుట యుక్తము కాదని చెప్పగా

ఇక్కడ “పిల్లలు” అంటే దేవుడు ఎన్నుకొన్న ఇస్రాయేల్ ప్రజలు. ఇక్కడ కుక్కపిల్లలు అని తర్జుమా చేసిన గ్రీకు పదానికి ఎవరికీ చెందకుండా వీధుల్లో అసహ్యాన్నంతా తింటూ తిరిగే ఊరకుక్కలు అని అర్థం కాదు. బైబిల్లో కొన్ని సార్లు అలాంటి కుక్కలను దుర్మార్గుల్ని సూచించేందుకు వాడడం జరిగింది (కీర్తనల గ్రంథము 22:16; ఫిలిప్పీయులకు 3:2; 2 పేతురు 2:22; ప్రకటన గ్రంథం 22:15). ఇక్కడ కనిపిస్తున్న మాట ఇంట్లో ముద్దుగా పెంచుకునే చిన్న కుక్కపిల్లలు అనే అర్థాన్ని ఇస్తుంది. యేసు తిరస్కారాన్ని కనపరచడం లేదు, ఆ స్త్రీని అవమానించడం లేదు. ఆమెను పరీక్షిస్తున్నాడు. అంతేగాక బహుశా ప్రార్థనకు ఆధారం మనిషి యోగ్యత కాదని ఆమెకు కనపరుస్తున్నాడు. మాట్లాడే వ్యక్తి స్వరం, ముఖకవళికలు మొదలైనవాటికి పలుకుతున్న మాటలకున్నంత ప్రాధాన్యత ఉండవచ్చు. యేసు ప్రవర్తనలో ఆమెకు నిరుత్సాహం కలిగించేదేది లేదు, ప్రోత్సాహం కలిగించేదే కనిపించింది.

27. ఆమెనిజమే ప్రభువా, కుక్కపిల్లలుకూడ తమ యజమానుల బల్లమీదనుండి పడు ముక్కలు తినును గదా అని చెప్పెను.

యూదులు దేవుడు ఎన్నుకొన్న జాతి అనీ, తనకైతే దేవునితో ఎలాంటి ఒడంబడిక సంబంధం గానీ ఆయన కరుణకు హక్కు గానీ లేదనీ ఆమె కొంతవరకు గ్రహించింది (ఎఫెసీయులకు 2:12 పోల్చి చూడండి). జ్ఞానయుక్తంగా వినయంగా ఆమె ఈ స్థితినే తనకు లాభకరంగా మలుచుకుంది. యేసుప్రభువు దగ్గర్నుంచి పడే చిన్న రొట్టె ముక్క ఇతరులెవరి దగ్గరనుంచైనా వచ్చే రొట్టె అంతటికన్నా గొప్ప అని ఆమెకు తెలుసు.

28. అందుకు యేసు అమ్మా, నీ విశ్వాసము గొప్పది; నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పెను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను.

ఆమె విసుగు చెందకుండా పట్టు విడవకుండా అడగడంలో తన నమ్మకం ఎంత గొప్పదో రుజువు చేసింది. మౌనం గానీ (వ 23), శిష్యుల నిరాకరణ గానీ (వ 23), ఆమెకు ఏ హక్కూ లేదన్నట్టు చెప్తున్న సిద్ధాంతం గానీ (వ 24), గర్వాన్ని రేకెత్తించగలిగే ఎలాంటి విషమ పరీక్ష గానీ (వ 26) ఆమెను ఆపలేకపోయాయి. యేసు తనకు సహాయం చేయగలడనీ, చేస్తాడనీ ఆమె గట్టి నమ్మకం. ఆయన అలా చేసేదాకా అడుగుతూనే ఉండాలనీ ఆమె నిశ్చయించుకుంది. లూకా 11:5-10; లూకా 18:1-8 పోల్చి చూడండి. యేసు దృష్టిలో నమ్మకం ఎంత ప్రాముఖ్యమో, దాన్ని ఆయన ఎంతగా మెచ్చుకుని ప్రతిఫలమిస్తాడో గమనించండి (మత్తయి 8:10; మత్తయి 9:22, మత్తయి 9:29; మత్తయి 17:20; మత్తయి 21:21-22. హెబ్రీయులకు 11:6 చూడండి).

29. యేసు అక్కడనుండి వెళ్లి, గలిలయ సముద్రతీరమునకు వచ్చి, కొండెక్కి అక్కడ కూర్చుండగా

30. బహు జనసమూహములు ఆయనయొద్దకు కుంటివారు గ్రుడ్డివారు మూగవారు అంగహీనులు మొదలైన అనేకులను తీసికొనివచ్చి ఆయన పాదములయొద్ద పడవేసిరి; ఆయన వారిని స్వస్థపరచెను.

మత్తయి 4:23-24; మత్తయి 9:35-36.

31. మూగవారు మాటలాడు టయును అంగహీనులు బాగుపడుటయును కుంటివారు నడుచుటయును గ్రుడ్డివారు చూచుటయును జనసమూ హము చూచి ఆశ్చర్యపడి ఇశ్రాయేలు దేవుని మహిమ పరచిరి.
యెషయా 52:14

మత్తయి 9:8. ఇస్రాయేల్‌వారి దేవుడొక్కడే దేవుడు (ద్వితీయోపదేశకాండము 6:4; యెషయా 43:10-11; యెషయా 44:6, యెషయా 44:8; యెషయా 45:5, యెషయా 45:18). యేసు తలపెట్టిన పనులన్నిటి ముఖ్యోద్దేశం ఆయనకు ఘనత కలిగించాలనే (రోమీయులకు 15:8-9 పోల్చి చూడండి).

32. అంతట యేసు తన శిష్యులను పిలిచి ఈ జనులు నేటికి మూడు దినములనుండి నాయొద్ద నున్నారు; వారికి తిన నేమియు లేదు గనుక వారిమీద కనికరపడుచున్నాను; వారు మార్గములో మూర్ఛపోవుదురేమో అని వారిని ఉపవాసముతో పంపివేయుటకు నాకు మనస్సు లేదని వారితో చెప్పగా

మత్తయి 9:36; మత్తయి 14:14. యేసు వారితో ఏమీ చెప్పకమునుపు వారి అవసరతల గురించి ఆలోచించిన సంగతి గమనించండి. మత్తయి 6:8 పోల్చి చూడండి.

33. ఆయన శిష్యులుఇంత గొప్ప జన సమూహమును తృప్తిపరచుటకు కావలసిన రొట్టెలు అరణ్యప్రదేశములో మనకు ఎక్కడనుండి వచ్చునని ఆయనతో అనిరి.

మత్తయి 14:15-21 లోని సంఘటన అసలు జరగనే లేదన్నట్టు మాట్లాడుతున్నారు వీరు. అలా మరో సారి జరగడం అసాధ్యం అనుకున్నారా? కొన్ని సార్లు శిష్యుల మందబుద్ధి, లోపభూయిష్టమైన విశ్వాసం చూచి ఎంతో ఆశ్చర్యం వేస్తుంది – అంటే మనలోని ఈ లక్షణాలనే మనం గుర్తించేవరకూ ఆశ్చర్యపడవచ్చు.

34. యేసుమీయొద్ద ఎన్ని రొట్టెలున్నవని వారి నడుగగా వారుఏడు రొట్టెలును కొన్ని చిన్న చేపలును ఉన్నవని చెప్పిరి.

35. అప్పుడాయన నేలమీద కూర్చుండుడని జనసమూహమునకు ఆజ్ఞాపించి

36. ఆ యేడు రొట్టెలను ఆ చేపలను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వాటిని విరిచి తన శిష్యులకిచ్చెను, శిష్యులు జన సమూహమునకు వడ్డించిరి

మత్తయి 14:19.

37. వారందరు తిని తృప్తి పొందినమీదట మిగిలిన ముక్కలు ఏడు గంపల నిండ ఎత్తిరి.

మనదగ్గర ఉన్నది యేసుప్రభువుకు ఇస్తే మన ఏడు “రొట్టెలు” గొప్ప జనసమూహాన్ని పోషించడమే గాక మనం ఇచ్చినదానికి ఏడంతలు మనకు తిరిగి రావచ్చు. లూకా 6:38 చూడండి.

38. స్త్రీలును పిల్లలును గాక తినినవారు నాలుగువేల మంది పురుషులు.

39. తరువాత ఆయన జనసమూహములను పంపివేసి, దోనెయెక్కి మగదాను ప్రాంతములకు వచ్చెను.

గలలీ సరస్సు పశ్చిమ తీరాన ఉన్న ఊరు మగదాను.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Matthew - మత్తయి సువార్త 15 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

యేసు మానవ సంప్రదాయాల గురించి ప్రసంగించాడు. (1-9) 
దేవుని చట్టాలకు సవరణలు అతని జ్ఞానాన్ని ప్రశ్నించినట్లుగా చూడవచ్చు, ఏదో ఒక ముఖ్యమైన విషయం విస్మరించబడిందని మరియు మానవజాతి అంతరాలను పూరించాలని సూచించింది. ఎల్లప్పుడూ, అలాంటి మార్పులు దేవునికి విధేయత చూపకుండా ప్రజలను దూరం చేస్తాయి. దేవుని వ్రాతపూర్వక వాక్యానికి మనం ప్రగాఢమైన కృతజ్ఞతలు తెలియజేయాలి. బైబిల్‌లో నిర్దేశించబడిన సూత్రాలు మరియు అభ్యాసాలు ఏవైనా మానవ ఆవిష్కరణల ద్వారా మెరుగుపరచబడతాయనే ఆలోచనను మనం ఎన్నడూ అలరించకూడదు. మన ప్రియమైన ప్రభువు కొన్ని సంప్రదాయాలను మానవ ఆవిష్కరణలుగా పేర్కొన్నాడు మరియు ఐదవ ఆజ్ఞను ఉల్లంఘించడంలో స్పష్టమైన ఉదాహరణను సూచించాడు. వారు తమ ఆస్తిని అసలు ఇవ్వనప్పటికీ, వారి తల్లిదండ్రులకు సహాయం చేయకూడదని వారు దేవాలయంపై తమ నిబద్ధతను సాకుగా ఉపయోగించారు. ఈ చర్య దేవుని ఆజ్ఞను అసమర్థంగా మార్చింది. కపటుల విధిని కొన్ని పదాలలో సంగ్రహించవచ్చు: "వారి ఆరాధన వ్యర్థం." అలాంటి ఆరాధన దేవుణ్ణి సంతోషపెట్టదు లేదా ఆరాధకుడికి ప్రయోజనం కలిగించదు. అబద్ధం మీద విశ్వాసం ఉంచిన వారు చివరికి అబద్ధం తప్ప మరేమీ పొందలేరు.

నిజంగా అపవిత్రం చేసే వాటి గురించి ఆయన హెచ్చరించాడు. (10-20) 
ప్రజలు చింతించవలసిన అపవిత్రత వారు తినే ఆహారం నుండి ఉద్భవించదని, వారి నోటి నుండి వెలువడే మాటల నుండి వారి హృదయాలలోని దుష్టత్వాన్ని బహిర్గతం చేస్తుందని యేసు ఉదహరించాడు. పరిశుద్ధాత్మ యొక్క పునరుత్పత్తి కృపలు మాత్రమే ఆత్మలో శాశ్వత నివాసాన్ని కలిగి ఉంటాయి మరియు స్వర్గపు మూలం నుండి ఉద్భవించినవి మాత్రమే చర్చిలో స్థానాన్ని పొందాలి. కాబట్టి, ఎవరైనా సత్యాన్ని సూటిగా మరియు సమయానుకూలంగా ప్రకటించడం పట్ల మనస్తాపం చెందితే, దాని గురించి మనం బాధపడాల్సిన అవసరం లేదు.
ఈ విషయంపై మరింత వివరణ ఇవ్వాలని శిష్యులు అభ్యర్థిస్తున్నారు. బలహీనమైన అవగాహన ఉన్న ఎవరైనా క్రీస్తు బోధనలలో దేనినైనా ప్రశ్నించినప్పుడు, హృదయపూర్వక హృదయం మరియు ఆసక్తిగల ఆత్మ జ్ఞానోదయాన్ని కోరుకుంటాయి. యిర్మియా 17:9 చెప్పినట్లుగా, మానవ హృదయం స్వాభావికంగా భ్రష్టుపట్టింది, ఎందుకంటే హృదయంలో మొదట నివసించని మాటలో లేదా చర్యలో పాపం లేదు. అన్ని అతిక్రమణలు ఒక వ్యక్తిలో ఉద్భవించాయి మరియు వారి హృదయంలో ఉన్న అధర్మం యొక్క ఉత్పత్తులు. క్రీస్తు తన బోధలను అందించినప్పుడు, అతను వ్యక్తుల హృదయాలలోని మోసాన్ని మరియు దుర్మార్గాన్ని ఆవిష్కరిస్తాడు, వారిని వినయం మరియు పాపం మరియు అపవిత్రత కోసం తెరిచిన ఫౌంటెన్ ద్వారా ప్రక్షాళన కోసం మార్గనిర్దేశం చేస్తాడు.

అతను సిరోఫెనిషియన్ మహిళ కుమార్తెను నయం చేస్తాడు. (21-28) 
భూమి యొక్క మారుమూల మరియు నీడ మూలలు క్రీస్తు ప్రభావంలో పాలుపంచుకుంటాయి మరియు చివరికి, భూమి యొక్క సుదూర ప్రాంతాలు అతని మోక్షానికి సాక్ష్యమిస్తాయి. ఒక స్త్రీ తన కుటుంబంలోని కష్టాలు మరియు ఇబ్బందుల కారణంగా క్రీస్తును వెతకడానికి పురికొల్పబడింది. ఆవశ్యకత మనలను క్రీస్తు వైపుకు నడిపించినప్పటికీ, అది మనలను ఆయన నుండి దూరం చేయకూడదు. ఆమె క్రీస్తు నుండి దయ యొక్క నిర్దిష్ట ఉదాహరణను అభ్యర్థించలేదు కానీ దయ కోసం పదేపదే ప్రార్థించింది. ఆమె తన స్వంత యోగ్యతపై ఆధారపడలేదు కానీ దయపై తన నమ్మకాన్ని ఉంచింది.
వారి పిల్లల కోసం, ముఖ్యంగా వారి ఆత్మల మోక్షం కోసం హృదయపూర్వకంగా ప్రార్థించడం తల్లిదండ్రుల విధి. ఈ శక్తులచే బందీగా ఉంచబడిన అహంకార, అపవిత్రమైన లేదా హానికరమైన ప్రభావంతో మీరు తీవ్రంగా బాధపడిన కొడుకు లేదా కుమార్తె ఉన్నారా? ఈ పరిస్థితి భౌతిక స్వాధీనత కంటే దయనీయమైనది, మరియు మీరు వారిని విశ్వాసం మరియు ప్రార్థన ద్వారా క్రీస్తు వద్దకు తీసుకురావాలి, ఎందుకంటే వారిని స్వస్థపరిచే శక్తి ఆయనకు మాత్రమే ఉంది.
ఈ కథ అనేక విధాలుగా క్రీస్తు యొక్క ప్రావిడెన్స్ మరియు దయ, కలవరపరిచే మరియు చీకటి పరిస్థితులలో కూడా అర్థం చేసుకోవచ్చు. క్రీస్తు ముఖంలో కోపము ఉన్నప్పటికీ, ప్రేమ అతని హృదయంలో నివసిస్తుందని ఇది మనకు బోధిస్తుంది. అతను మనలను తిరస్కరించడానికి సిద్ధంగా ఉన్నట్లు అనిపించినప్పుడు కూడా ఆయనపై నమ్మకం ఉంచమని అది మనల్ని ప్రోత్సహిస్తుంది. క్రీస్తు ఎవరిని ఎక్కువగా గౌరవించాలనుకుంటున్నాడో, వారి అనర్హత గురించి వారికి తెలిసేలా చేసి, వారిని మొదట తగ్గించాడు. గర్వించదగిన మరియు పగలని హృదయం దీనిని భరించలేదు, కానీ స్త్రీ తన అభ్యర్థనను బలపర్చడానికి దానిని ఒక వాదనగా ఉపయోగించుకుంది.
ఆ స్త్రీ పరిస్థితి తమ ఆత్మ యొక్క దౌర్భాగ్యం గురించి బాగా తెలిసిన పాపిని ప్రతిబింబిస్తుంది. క్రీస్తు యొక్క అతిచిన్న భాగం కూడా విశ్వాసికి విలువైనది, జీవితపు రొట్టె ముక్కల వలె ఉంటుంది. అన్ని సద్గుణాలలో, విశ్వాసం క్రీస్తును అత్యంత ఉన్నతమైనదిగా చేస్తుంది మరియు తత్ఫలితంగా, క్రీస్తు విశ్వాసాన్ని అత్యంత గౌరవిస్తాడు. అతను ఒక మాటతో ఆమె కుమార్తెకు వైద్యం చేశాడు. కాబట్టి, ప్రభువు సహాయాన్ని కోరేవారు మరియు అనుకూలమైన ప్రతిస్పందనను పొందని వారు తమ అనర్హత మరియు నిరుత్సాహాలను దయ కోసం విన్నపాలుగా మార్చుకోవడం నేర్చుకోవాలి.

యేసు రోగులను స్వస్థపరిచాడు మరియు అద్భుతంగా నాలుగు వేల మందికి ఆహారం ఇస్తాడు. (29-39)
మన పరిస్థితులతో సంబంధం లేకుండా, ఓదార్పు మరియు ఉపశమనాన్ని కనుగొనే ఏకైక మార్గం వారిని క్రీస్తు పాదాల వద్ద ఉంచడం, వారిని ఆయనకు అప్పగించడం మరియు అతని నియంత్రణకు వారిని అప్పగించడం. క్రీస్తు నుండి ఆధ్యాత్మిక స్వస్థతను కోరుకునే వారు ఆయన చిత్తానికి లొంగిపోవాలి. పాపం యొక్క తీవ్ర ప్రభావాన్ని పరిగణించండి; అది మానవ శరీరాలను బాధించే అనేక రకాల రుగ్మతలకు దారితీసింది. ఈ వ్యాధులలో కొన్ని చాలా రహస్యమైనవి, వాటి కారణాలు మరియు నివారణలు మానవ గ్రహణశక్తికి మించినవి, అయినప్పటికీ అవన్నీ క్రీస్తు ఆజ్ఞకు లొంగిపోయాయి. క్రీస్తు చేసిన ఆధ్యాత్మిక స్వస్థతలు నిజంగా విశేషమైనవి. గుడ్డి ఆత్మలు విశ్వాసం ద్వారా దృష్టిని పొందినప్పుడు, మూగవారు ప్రార్థనలో వారి స్వరాన్ని కనుగొంటారు మరియు వికలాంగులు మరియు కుంటివారు పవిత్ర విధేయతతో నడుచుకున్నప్పుడు, ఇది నిజంగా ఆశ్చర్యానికి కారణం.
అంతకుముందు జరిగిన దాని మాదిరిగానే క్రీస్తు వారి కోసం చేసిన సమృద్ధిగా ఏర్పాటు చేయడంలో సమూహానికి కూడా క్రీస్తు శక్తి స్పష్టంగా కనిపించింది. అందరూ భోజనం చేసి తృప్తిగా వెళ్లిపోయారు. క్రీస్తు ఎవరిని పోషించునో వారిని తృప్తిపరచును. క్రీస్తులో, ఒక పుష్కలమైన సరఫరా ఉంది, దానిని కోరుకునే వారికి తగినంత కంటే ఎక్కువ దయ ఉంది మరియు వారి తక్షణ అవసరాలకు మించి వెతుకుతున్న వారికి అదనపు కూడా ఉంది. క్రీస్తు జనసమూహాన్ని రెండుసార్లు తినిపించినప్పటికీ వారిని తొలగించాడు; వారు తమ జీవనోపాధి కోసం రోజువారీ అద్భుతాలను ఆశించరు. బదులుగా, వారు తమ రోజువారీ వృత్తులకు మరియు వారి స్వంత పట్టికలకు తిరిగి రావాలని ప్రోత్సహించబడ్డారు.
ప్రభూ, మా విశ్వాసాన్ని బలపరచి, మా అవిశ్వాసాన్ని క్షమించు, ఈ జీవితంలో మరియు రాబోయే జీవితంలో మా అన్ని అవసరాల కోసం మీ సమృద్ధి మరియు దాతృత్వంపై ఆధారపడాలని మాకు నేర్పండి.



Shortcut Links
మత్తయి - Matthew : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |