Matthew - మత్తయి సువార్త 16 | View All
Study Bible (Beta)

1. అప్పుడు పరిసయ్యులును సద్దూకయ్యులును వచ్చి ఆయనను శోధించుటకు ఆకాశమునుండి యొక సూచక క్రియను తమకు చూపుమని ఆయనను అడుగగా ఆయన ఇట్లనెను

పరిసయ్యులకు, సద్దూకయ్యులకు మధ్య అనేక విభేదాలున్నాయి. అయితే ఒక విషయంలో వారికి పొత్తు కుదిరింది – యేసును వ్యతిరేకించే విషయంలో. మంచి ఉద్దేశం లాగానే ఒక చెడు ఉద్దేశం కూడా మనుషులను ఒక త్రాటిపై నడిపించగలదు. లూకా 23:12 చూడండి. సద్దూకయ్యుల గురించి నోట్ మత్తయి 3:7.

2. సాయంకాలమున మీరు ఆకాశము ఎఱ్ఱగా ఉన్నది గనుక వర్షము కురియదనియు,

3. ఉదయమున ఆకాశము ఎఱ్ఱగాను మబ్బుగాను ఉన్నది గనుక నేడు గాలివాన వచ్చుననియు చెప్పుదురు గదా. మీరు ఆకాశ వైఖరి వివేచింప నెరుగుదురు గాని యీ కాలముల సూచనలను వివేచింపలేరు.

అంగీకరించే మనస్సే గనుక ఉంటే సూచనకోసమైన అద్భుతాలు ఇప్పటికే బోలెడన్ని ఉన్నాయి. పాత ఒడంబడిక గ్రంథంలోని భవిష్యద్వాక్కులూ, బాప్తిసం ఇచ్చే యోహాను, యేసుప్రభువుల పరిచర్యా ఇవన్నీ అభిషిక్తుని రోజులు వచ్చాయని ఎలుగెత్తి చాటుతున్నాయి. యేసు చేసిన అనేక అద్భుతాలు మానవ శక్తికి మించిన బలప్రభావాలు ఆయనకు ఉన్నాయని వెల్లడి చేశాయి – మత్తయి 8:1. అపనమ్మకాన్ని ఎన్నుకున్న ఆ పాపులకోసం ఎలాంటి ప్రత్యేకమైన అద్భుతమూ చేయనక్కరలేదు. అలాంటి అద్భుతం వారికివ్వడానికి ఆయనకు ఇష్టం లేదు. దేవుడు అప్పటికే వారికి ఇచ్చిన సత్యం విషయంలో వారు ఏమీ చేయలేదు.

4. వ్యభిచారులైన చెడ్డతరము వారు సూచక క్రియ నడుగుచున్నారు, అయితే యోనాను గూర్చిన సూచకక్రియయేగాని మరి ఏ సూచక క్రియయైన వారి కనుగ్రహింపబడదని వారితో చెప్పి వారిని విడిచి వెళ్లిపోయెను.

మత్తయి 12:39.

5. ఆయన శిష్యులు అద్దరికి వచ్చి రొట్టెలు తెచ్చుటకు మరచిరి.

6. అప్పుడు యేసు చూచుకొనుడి, పరిసయ్యులు సద్దూకయ్యులు అను వారి పులిసిన పిండినిగూర్చి జాగ్రత్త పడుడని వారితో చెప్పెను.

ఇక్కడ దుర్మార్గతకు సాదృశ్యంగా “పొంగజేసే పదార్థాన్ని” (యీస్టు) వాడడం చూస్తున్నాం. మత్తయి 13:33; నిర్గమకాండము 12:8; 1 కోరింథీయులకు 5:6-8; గలతియులకు 5:9 చూడండి. ఈ సందర్భంలో మరోసారి శిష్యుల మందబుద్ధి వెల్లడి అయింది. శిష్యులు అర్థం చేసుకోగలిగిన అలంకారిక భాషను యేసుప్రభువు ఉపయోగించాడు. అయితే వారి మనస్సులు అక్షరాలా రొట్టెల మీద ఎక్కువగా లగ్నమై ఉన్నట్టుంది. భౌతిక అవసరాలు, కోరికల గురించిన ఆందోళనల్లో ఉండడం మనందరినీ కూడా దేవుని వాక్కు విషయంలో మందబుద్ధులుగా చేసేయవచ్చు.

7. కాగా వారు మనము రొట్టెలు తేనందున గదా (యీ మాట చెప్పెనని) తమలో తాము ఆలోచించుకొనుచుండిరి.

8. యేసు అది యెరిగి అల్పవిశ్వాసులారా మనయొద్ద రొట్టెలు లేవని మీలో మీరెందుకు ఆలోచించుకొనుచున్నారు?

మత్తయి 6:30; మత్తయి 8:26; మత్తయి 14:31. వారు రొట్టెలు తేవడం మర్చిపోయినప్పటికీ ఆహారం గురించి ఆందోళన, అపనమ్మకం కలిగి ఉండవలసిన పని లేదని తరువాతి రెండు వచనాల్లో యేసు వారికి విశదపరుస్తున్నాడు. రెండు సార్లు గొప్ప జనసమూహాలకు అద్భుత రీతిలో ఆయన ఆహారం ఇవ్వలేదా? శిష్యుల్లాగానే మనం కూడా ఇదే ఆందోళన, అపనమ్మకాల్లో పడిపోతుంటాం? సంవత్సరాల తరబడి క్రైస్తవ అనుభవం ఉన్నప్పటికీ కొన్ని సార్లు మనకు నమ్మకం, గ్రహింపు లేకపోవడం కారణంగా మనల్ని దేవుడు మందలించవలసిన అవసరం వస్తుంటుంది గదా.

9. మీరింకను గ్రహింపలేదా? అయిదు రొట్టెలు అయిదువేలమందికి పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపెళ్లు ఎత్తితిరో అదియైనను

10. ఏడు రొట్టెలు నాలుగు వేలమందికి పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపెళ్లు ఎత్తితిరో అదియైనను మీకు జ్ఞాపకము లేదా?

11. నేను రొట్టెలనుగూర్చి మీతో చెప్పలేదని మీరెందుకు గ్రహింపరు? పరిసయ్యులు సద్దూకయ్యులు అనువారి పులిసిన పిండినిగూర్చియే జాగ్రత్తపడుడని చెప్పెను.

12. అప్పుడు రొట్టెల పులిసిన పిండినిగూర్చి కాదుగాని పరిసయ్యులు సద్దూకయ్యులు అనువారి బోధను గూర్చియే జాగ్రత్తపడవలెనని ఆయన తమతో చెప్పెనని వారు గ్రహించిరి.

పొంగజేసే పదార్థం అంటే తప్పుడు మత బోధనలని యేసు ఉద్దేశం. అలాంటిది క్రైస్తవ స్థానిక సంఘం లేక డినామినేషన్ అంతట్లో వ్యాపించగలదు కాబట్టి అది పొంగజేసే పదార్థాన్ని పోలి ఉంది. పరిసయ్యులు, సద్దూకయ్యులు కూడా దేవుడు తెలియజేసిన నిజమైన మార్గాన్ని అనుసరిస్తున్నామని చెప్పుకున్నారు గానీ అందులోని వాస్తవికతను, ఆధ్మాత్మిక జీవనాన్ని అనుభవించేవారు కాదు. నేడు కూడా క్రీస్తుసంఘం ఇలాంటి పొంగజేసే పదార్థం ఎక్కడ కనిపించినా దాని విషయం జాగ్రత్తగా ఉండాలి (రోమీయులకు 16:17-18; 1 తిమోతికి 4:1-2; 2 తిమోతికి 4:3-4; 2 పేతురు 2:1-3 చూడండి). మత్తయి 13:33 పోల్చి చూడండి. మత్తయి 3:7-9; మత్తయి 5:20; మత్తయి 9:11; మత్తయి 12:2, మత్తయి 12:24, మత్తయి 12:28; మత్తయి 15:1-2; మత్తయి 23:2-36 లో పరిసయ్యుల దుర్భోధ, దాని ఫలితాలు కొంతవరకు చూడవచ్చు. బైబిలు దేవుని వాక్కు అనీ నిజ దేవుడొక్కడేననీ తాము నమ్ముతున్నామన్నారు. అయితే కర్మకాండలకూ, సాంప్రదాయాలకూ, దేవుని శాసనాలకు చెందిన బాహ్య ఆచారాలకూ, మనుషులు పెట్టిన కట్టుబాట్లకూ ప్రాధాన్యతనిచ్చారు. తామే నీతిమంతులమని భావించుకోవడానికీ కపటబుద్ధికీ ఇదంతా దారి తీసింది – లూకా 12:1; లూకా 18:10-12. దేవుని వాక్కులో తేటగా వెల్లడైన సత్యాన్ని సద్దూకయ్యులు సమ్మతించలేదు (అపో. కార్యములు 23:8). వారి విధానాలు ఇహలోక సంబంధమై, శరీర సంబంధమైన ఆలోచనలకు దారి తీశాయి. ఈ రెండు గుంపులు కూడా అపనమ్మకంలో కపటంలో మునిగి ఉన్నారు. నేడు ఇలాంటివారు మన సంఘాల్లో కనిపించడం లేదా?

13. యేసు ఫిలిప్పుదైన కైసరయ ప్రాంతములకు వచ్చిమనుష్యకుమారుడెవడని జనులు చెప్పకొనుచున్నారని తన శిష్యులను అడుగగా

సీజరియ ఫిలిప్పీ గలలీ సరస్సుకు 40 కిలోమీటర్లు ఉత్తరాన ఆ ప్రాంతానికెల్లా ఎత్తైన పర్వతం హెర్మోను దగ్గర ఉంది. “మానవ పుత్రుడు” గురించి నోట్ మత్తయి 8:20.

14. వారుకొందరు బాప్తిస్మమిచ్చు యోహాననియు, కొందరు ఏలీయా అనియు, కొందరు యిర్మీయా అనియు లేక ప్రవక్త లలో ఒకడనియు చెప్పుకొనుచున్నారనిరి.

క్రీస్తు కాలంలోని యూదులు ఆయన యోహాననీ లేక మరణించిన ప్రవక్తల్లో ఒకడనీ చెప్పుకుంటున్నప్పుడు వారికి పునర్జన్మపై నమ్మకం ఉన్నట్టు కాదు. చనిపోయినవారు తిరిగి సజీవంగా లేస్తారన్న నమ్మకాన్నే వారు బయట పెడతున్నారు. పునర్జన్మ సిద్ధాంతం గురించి యోబు 11:12; యోబు 9:2-3 నోట్స్ చూడండి.

15. అందుకాయన మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నా రని వారి నడిగెను.

మనందరిలో ఇప్పటికీ కలిగే ప్రశ్నే ఇది. మనం దీనికిచ్చే జవాబుకు అత్యంత ప్రాధాన్యత ఉంది.

16. అందుకు సీమోను పేతురు నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తువని చెప్పెను.
దానియేలు 9:25

“అభిషిక్తుడు” గురించి నోట్ మత్తయి 1:1. “దేవుని కుమారుడు” గురించి నోట్ మత్తయి 3:16-17; యోహాను 3:16; యోహాను 5:18-23. కేవలం మనుషుల ఊహల్లో మాత్రమే ఉండే దేవుళ్ళకూ మృత విగ్రహాలకూ భిన్నంగా దేవుణ్ణి “సజీవుడైన దేవుడు” అని చెప్పడం చూస్తున్నాం. కీర్తనల గ్రంథము 115:3-8 మొ।। నోట్స్ చూడండి.

17. అందుకు యేసు సీమోను బర్‌యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచెనేకాని నరులు నీకు బయలు పరచలేదు.

“ధన్యుడవు”– ధన్యత గురించి మత్తయి 11:6 నోట్‌లో రిఫరెన్సులు చూడండి. యేసును గురించి ఆయన అభిషిక్తుడూ దేవుని ఏకైక కుమారుడూ అన్న ఈ గొప్ప సత్యాన్ని అర్థం చేసుకునే విధంగా దేవుడు పేతురుకు జ్ఞానోదయం కలిగించాడు. ఈ కారణంగా యేసు పేతురును “ధన్యుడు” అన్నాడు. పేతురుకు ఈ సత్యం తెలిసినది సొంత బుద్ధి, ఆలోచనలవల్ల గానీ మానవ ఉపదేశాలవల్ల గానీ కాదు. దేవుని నుంచి ఈ సత్యం నేరుగా అతనికి వెల్లడి అయింది. మత్తయి 11:27 మొదలైనవి పోల్చి చూడండి. యేసుప్రభువు గురించిన సత్యాన్ని తెలుసుకునే జ్ఞానం దేవునినుంచి నేరుగా లభించినవారందరికీ ఈ ధన్యత ఉంటుంది. 1 యోహాను 2:23; 1 యోహాను 5:1, 1 యోహాను 5:5 పోల్చి చూడండి.

18. మరియు నీవు పేతురువు; ఈ బండమీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని యెదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను.
ఆదికాండము 22:17, యోబు 38:17, యెషయా 38:10

పేతురు అనే పేరుకు గ్రీకులో (పెట్రొస్‌) “చిన్న రాయి” అని అర్థం. క్రీస్తు తన సంఘాన్ని నిర్మించబోయేది అనే అర్థం ఇచ్చేందుకు వాడిన మాట “పెట్ర”కు బండ అని అర్థం. అందువల్ల సంఘాన్ని పేతురుపై నిర్మిస్తానని ప్రభువు అనలేదు. ఈ అంశంపై ఇతర రిఫరెన్సులను పరిశీలిస్తే ఇది మరింత స్పష్టం అవుతుంది. 1 కోరింథీయులకు 3:11; ఎఫెసీయులకు 2:19-21 చూడండి. ఇతర రాయబారులు, ప్రవక్తలతో కలిసి పేతురు కూడా సంఘం పునాదిలో ఒక భాగం. క్రీస్తు స్వయంగా పునాదిలో అతి ప్రాముఖ్యమైన రాయి. బహుశా ఇక్కడ ఈ వచనంలో “బండ” అనే మాట ఉపయోగించడం యేసే అభిషిక్తుడూ దేవుని ఏకైక కుమారుడూ అని పేతురు విశ్వాసంతో ఒప్పుకున్న సంగతిని మాత్రమే సూచించవచ్చు. దేవుని ప్రజల సహవాసంలో ప్రవేశించేందుకు ఎవరికైనా సరే ఆ ఒప్పుదల పునాదివంటి సత్యం. క్రొత్త ఒడంబడిక గ్రంథంలో మొట్టమొదటి సారి ఈ వచనంలో “సంఘం” అనే మాట కనిపిస్తున్నది. దీనికి గ్రీకు పదం “ఎక్లెసియ”. దీనికి అర్థం “బయటికి పిలువబడిన” అని. దేవుని ప్రజల కూటమిని సూచించేందుకు క్రొత్త ఒడంబడిక గ్రంథంలో సామాన్యంగా వాడిన పదం ఇదే. వారు ప్రత్యేకమైన పవిత్ర ప్రజగా ఉండేందుకు లోకంలోనుంచి బయటికి పిలవబడ్డారు – 1 పేతురు 2:9; 2 కోరింథీయులకు 6:17-18; రోమీయులకు 8:30; యోహాను 17:6. “పాతాళం”– లూకా 16:23 నోట్. పాత ఒడంబడిక గ్రంథంలో “ద్వారం” తరచుగా నాయకులు, పాలకులు, న్యాయాధిపతులు సమకూడి తమ ఊరి వ్యవహారాల గురించి నిర్ణయాలు చేసే స్థలం (ఆదికాండము 34:20). ఇక్కడ పాతాళ ద్వారాలు అంటే మరణ సంబంధమైన శక్తులు, జీవులన్నీ, ముఖ్యంగా మరణశక్తి ఉన్న సైతాను, వాడు చేసిన తంత్రాలన్నీ (హెబ్రీయులకు 2:14) అని అర్థం. వాళ్ళు క్రీస్తుతో, ఆయన సంఘంతో జరిగిస్తున్న యుద్ధంలో జయించలేరు.

19. పరలోకరాజ్యముయొక్క తాళపుచెవులు నీ కిచ్చెదను, నీవు భూలోకమందు దేని బంధించుదువో అది పరలోక మందును బంధింపబడును, భూలోకమందు దేని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పెను.

పన్నెండుమంది రాయబారుల నాయకుడుగా పేతురుకు యేసు తాళం చెవులు ఇచ్చాడు. దేవుని రాజ్య ద్వారాలను ఇతరులకోసం తెరిచే ప్రత్యేకమైన పనికి అతణ్ణి ఎన్నుకొన్నాడు. యూదులమధ్య (అపో. కార్యములు 2:14-41), సమరయ దేశస్థులమధ్య (అపో. కార్యములు 8:14-17), ఇతర జనాలమధ్య (అపో. కార్యములు 10:1-48) పరిచర్యలో పేతురు ఈ తాళం చెవులను ఉపయోగించడం చూడవచ్చు. ఉనికిలో ఉన్న మూడు రకాల ప్రజలు వీరే. దీన్నిబట్టి ఈ సంగతి నేర్చుకుందాం: దేవుని రాజ్యానికి ద్వారాలు ఇప్పుడు బార్లా తెరిచి ఉన్నాయి. ఇష్టమున్న వారెవరైనా ప్రవేశించవచ్చు. తలుపు తెరిచిన తరువాత ఇక తాళాలతో పనిలేదు. యేసు తాళాలను పేతురుకే ఇచ్చాడు గానీ అతని తరువాత వచ్చినవారెవరికీ కాదు. తన రాజ్య ద్వారాలను అందరికోసమూ తెరిచేందుకు దేవుడు పేతురును తన పనిముట్టుగా వాడుకున్నాడు. పేతురు ఆ పనిని ఒక్కసారే చేసి ముగించాడు. ఇప్పుడిక ద్వారాలు తెరవడం, మూయడం లాంటివేమన్నా ఉంటే యేసుప్రభువు తానే అలా చేస్తాడు. ప్రకటన గ్రంథం 1:18; ప్రకటన గ్రంథం 3:7 చూడండి. పేతురు పని కేవలం దేవుని రాజ్య ద్వారాలను తెరవడం మాత్రమే కాదు. బంధించవలసినవీ విడుదల చేయవలసినవీ ఉన్నాయి. పరిష్కరించవలసిన రాజ్య వ్యవహారాలు ఉన్నాయి. అనుమతి ఇవ్వడమా నిషేధించడమా అని నిర్ణయాలు తీసుకోవలసిన విషయాలు ఉన్నాయి. ఈ పనిలో ఇతర శిష్యులకు కూడా పేతురుకున్నంత అధికారం ఉందని గ్రహించడం ప్రాముఖ్యం. మత్తయి 18:18; యోహాను 20:23 చూడండి. వ 19ను బట్టి శిష్యులు భూమిమీద దేన్ని బంధిస్తే అది అంతకుముందే పరలోకంలో బంధితమై ఉంది అని అర్థం చేసుకోవచ్చు. అంటే పేతురు, ఇతర శిష్యులు పరలోకంలో తీసుకోబడిన నిర్ణయాలను అమలుపరిచే ఉద్యోగులన్నమాట.

20. అటుపిమ్మట తాను క్రీస్తు అని యెవనితోను చెప్పవద్దని ఆయన తన శిష్యులకు ఖండితముగా ఆజ్ఞాపించెను.

పేతురు నేర్చుకున్నదాన్ని ప్రకటించే సమయం ఇంకా రాలేదు. అప్పుడు అలా చేయడంవల్ల క్రీస్తు పరిచర్యకు మరిన్ని ఆటంకాలు, ఆయన శత్రువులనుంచి మరింత వ్యతిరేకత కలిగేవి, సరైన సమయం రాకుండానే పరిస్థితులు విషమించేవి.

21. అప్పటినుండి తాను యెరూషలేమునకు వెళ్లిపెద్దలచేతను ప్రధాన యాజకులచేతను శాస్త్రులచేతను అనేక హింసలు పొంది, చంపబడి, మూడవదినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలుపెట్టగా

మొట్టమొదటి సారి యేసు తన శిష్యులకు తాను చేయవలసిన ముఖ్యమైన పని ఏమిటో నేర్పుతున్నాడు. ఆయన ఈ లోకంలోకి రావడానికి ముఖ్య కారణం పెద్ద గుంపుల్ని పోగుచేసి, తన దేవత్వాన్ని ప్రకటించి, పేరు ప్రఖ్యాతులు సంపాదించి, సింహాసనాన్ని ఎక్కడం కాదు. పాపులకోసం మరణించి తిరిగి సజీవంగా లేచేందుకు ఆయన వచ్చాడు (మత్తయి 20:28; లూకా 24:46-47; యోహాను 1:29; యోహాను 3:14; యోహాను 10:11; 1 కోరింథీయులకు 15:1-4). చనిపోయినవారు తిరిగి సజీవంగా లేవడం గురించి నోట్ యోహాను 5:28-29.

22. పేతురు ఆయన చేయి పట్టుకొనిప్రభువా, అది నీకు దూరమగుగాక, అది నీ కెన్నడును కలుగదని ఆయనను గద్దింపసాగెను.

క్రీస్తు ఈ లోకానికి వచ్చిన కారణం గురించి ఆ సమయంలో శిష్యులు అర్థం చేసుకున్నది ఎంత తక్కువో దీన్నిబట్టి తెలుస్తున్నది. ఆయన తమ శత్రువులను ఓడించే పరాక్రమశాలిగా ప్రత్యక్షం అవుతాడని అనుకున్నారే గాని బాధలను అనుభవించే రక్షకుడుగా వస్తాడని అనుకోలేదు. పాపం పేతురు! క్రీస్తుకు సలహాదారుడుగా ఉండాలనుకున్నాడు. అభిషిక్తుడు, దేవుని కుమారుడు అని అంతకుముందే తాను ఎవరినైతే అన్నాడో ఆ యేసునే మందలిస్తున్నాడు. ఇదే పేతురు నైజం. ఈ క్షణంలో ఉన్నత శిఖరాలెక్కిపోవడం, మరు క్షణంలో లోతైన అగాధానికి జారిపోవడం. క్రీస్తు ఏం చెయ్యాలో ఆయనకంటే తనకే బాగా తెలుసనుకున్నాడా? ఇలాంటి పొరపాటులో పడింది అతడొక్కడే కాదు. ఈనాడు కూడా దేవుడు ఏమేమి చేయాలో ఆయనకంటే తమకే బాగా తెలుసుననుకుంటూ ఆయనపై సణుక్కునేవారు అనేకమంది ఉన్నారు.

23. అయితే ఆయన పేతురువైపు తిరిగి సాతానా, నా వెనుకకు పొమ్ము; నీవు నాకు అభ్యంతర కారణమైయున్నావు; నీవు మనుష్యుల సంగతులనే తలంచుచున్నావు గాని దేవుని సంగతులను తలంపక యున్నావని పేతురుతో చెప్పెను.

మత్తయి 4:10. సైతాను గురించి నోట్ 1 దినవృత్తాంతములు 21:1. ఈ పేరుకు “ఎదిరించేవాడు” లేక “విరోధి” అని అర్థం. ఇక్కడ పేతురు క్రీస్తును సిలువకు వెళ్ళనీయకుండా ప్రయత్నించడంలో ఆయనను ఎదిరిస్తూ మాట్లాడాడు. అందువల్ల యేసు అతణ్ణి మందలించాడు. ఇది న్యాయమే. ఏ శిష్యుడితో మాట్లాడేటప్పుడూ ఇంత కఠినమైన మాటలు ఆయన ఎన్నడూ ఉపయోగించలేదు. పేతురు కేవలం మానవ విధానాల గురించే ఆలోచిస్తున్నాడు. మనుషులు సుఖ సౌఖ్యాలను, భద్రతను, సౌభాగ్యాన్ని తమకూ తమవారికీ కోరుతారు. దేవుని మార్గాలనూ, ఉద్దేశాలనూ వారు అర్థం చేసుకోరు. మనుషుల సంగతుల మీద మనసు నిలుపుకోవడం మనల్ని దేవుని సంగతులకు విరోధులుగా చేయవచ్చు. యెషయా 55:8-9; రోమీయులకు 8:5-8; రోమీయులకు 11:33-34; ఫిలిప్పీయులకు 3:19; కొలొస్సయులకు 3:1-3; యాకోబు 4:4; 1 యోహాను 2:16-17 చూడండి. దేవుడు ఏం చెయ్యాలో ఆయనకు బోధించడానికి బదులు ఆయననుంచి మనం నేర్చుకుందాం. క్రీస్తు గనుక పేతురు మాట విని ఉంటే పాపాలకు పరిహార బలి, చనిపోయినవారు సజీవంగా లేవడం, రక్షణ శుభవార్త, ఆశాభావం మొదలైన వాటికి ఎవరికీ ఆస్కారం ఉండేది కాదు.

24. అప్పుడు యేసు తన శిష్యులను చూచిఎవడైనను నన్ను వెంబడింపగోరిన యెడల, తన్నుతాను ఉపేక్షించుకొని, తన సిలువనెత్తికొని నన్ను వెంబడింపవలెను.

మత్తయి 10:38; మార్కు 8:34; లూకా 9:23 నోట్స్. స్వార్థత్యాగం, తనను పరిత్యజించుకోవడం నిజమైన క్రైస్తవంలో ప్రధానమైన భాగం. తనను హెచ్చించుకోవడం, తనను తాను గుర్తించి గొప్పగా ప్రవర్తించడం మొదలైన వాటిని బోధించే అన్ని వేదాంతాలకూ ఇది వ్యతిరేకం. బైబిలు ప్రకారం మనుషులందరి విషయంలో “నేను” (అహం) అనేది భ్రష్టమూ, పాపభరితమూ, మరణానికి పాత్రమూ అయినదే (మత్తయి 15:19; కీర్తనల గ్రంథము 51:5; యిర్మియా 17:9; రోమీయులకు 8:7-8, రోమీయులకు 8:12-13; గలతియులకు 5:17, గలతియులకు 5:24; ఎఫెసీయులకు 4:22; కొలొస్సయులకు 3:5). ఇది కేవలం శరీరమొక్కటే కాదు. స్వభావ సిద్ధంగా వ్యక్తి మొత్తంగా – అంటే అతని ఆలోచనలు, కోరికలు, చర్యలు అన్నీ “నేను” క్రిందికే వస్తాయి. తనకోసమే జీవించే వ్యక్తి దేవునికోసం జీవించడం అసాధ్యం. అయితే దేవునికోసం జీవించడం అన్నది మనుషులకున్న ముఖ్య విధి, ఆధిక్యత (1 కోరింథీయులకు 10:31; 2 కోరింథీయులకు 5:15).

25. తన ప్రాణమును రక్షించు కొనగోరువాడు దాని పోగొట్టుకొనును; నా నిమిత్తముతన ప్రాణమును పోగొట్టుకొనువాడు దాని దక్కించు కొనును.

మత్తయి 10:39 నోట్. క్రీస్తుకోసం మనలను మనం త్యాగం చెయ్యాలి. ఇతర విషయాల్లో, ఇతర కారణాలవల్ల మనుషులు తమ జీవాన్ని పోగొట్టుకోవచ్చు. మనం క్రీస్తుకోసం మన బ్రతుకంతటినీ ఇచ్చేసినప్పుడే మనం నిజమైన, సమృద్ధి జీవనాన్ని అనుభవిస్తాం.

26. ఒక మనుష్యుడు లోకమంతయు సంపాదించు కొని తన ప్రాణమును పోగొట్టుకొంటే అతనికేమి ప్రయో జనము? ఒక మనుష్యుడు తన ప్రాణమునకు ప్రతిగా నేమి యియ్యగలడు?

ఈ లోకం గతించిపోయే ఊరేగింపులాంటిది (1 యోహాను 2:16-17). మనం ఇక్కడ ఉండేది కొద్దికాలమే (కీర్తనల గ్రంథము 90:10; హెబ్రీయులకు 9:27). మనం లోకాన్నంతా సంపాదించుకోగలిగినా, క్రీస్తుతోబాటు వారసత్వం అనే ఎన్నో రెట్లు శ్రేష్ఠమైన దాన్ని మనం శాశ్వతంగా అనుభవించగలిగే అవకాశం ఉన్నప్పుడు, లోకాన్ని కోరుకోవడం చెప్పరానంత తెలివితక్కువతనం (రోమీయులకు 8:17; 1 కోరింథీయులకు 3:21-23; 1 పేతురు 1:4; ప్రకటన గ్రంథం 21:7). అయితే ఒక చిన్న ఇళ్ళ స్థలం కోసం లేక కొద్దిపాటి సుఖాలకోసం శాశ్వత జీవాన్ని విసిరికొట్టేవారు అనేకమంది ఉన్నారు. క్రీస్తు ప్రథమ శిష్యుల్లో కూడా ఒకడు శాశ్వత జీవానికి బదులు ఒక డబ్బు సంచిని కోరుకున్నాడు (మత్తయి 26:14, మత్తయి 26:16; యోహాను 12:6).

27. మనుష్యకుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడ రాబోవుచున్నాడు. అప్పు డాయన ఎవని క్రియలచొప్పున వానికి ఫలమిచ్చును.
కీర్తనల గ్రంథము 28:4, కీర్తనల గ్రంథము 62:12, సామెతలు 24:12, యెషయా 63:1

ఇక్కడ భవిష్యత్తులో తప్పనిసరిగా జరగబోయే రెండు సంభవాలున్నాయి. అవేమంటే క్రీస్తు రాక (మత్తయి 19:28; మత్తయి 24:27, మత్తయి 24:30; యోహాను 14:3; అపో. కార్యములు 1:11; 1 థెస్సలొనీకయులకు 4:16; హెబ్రీయులకు 9:28), ఆయన మనుషులకు తీర్పు తీర్చడం (మత్తయి 25:31-32; అపో. కార్యములు 17:31; రోమీయులకు 2:16; 2 కోరింథీయులకు 5:10; ప్రకటన గ్రంథం 22:12). మన ఇష్టాలు, కార్యకలాపాలు అన్నీ ఈ రెండు వాస్తవాలకు అనుగుణంగానే ఉండాలి.

28. ఇక్కడ నిలిచియున్న వారిలోకొందరు, మనుష్యకుమారుడు తన రాజ్యముతో వచ్చుట చూచువరకు మరణము రుచి చూడరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాననెను.

మానవ పుత్రుడు గురించి నోట్ మత్తయి 8:20. “తన రాజ్యంతో రావడం” అంటే భూమిని పరిపాలించేందుకు ఆయన రెండోసారి రావడం కాదు. క్రీస్తు ఇక్కడ మాట్లాడుతున్నది తన మరణం, తిరిగి సజీవంగా లేవడం, పరలోకానికి వెళ్ళిపోవడం, పెంతెకొస్తు దినాన పవిత్రాత్మను పంపించడం, అపొ కా గ్రంథంలో రాసి ఉన్నట్టు ఆయన రాజ్యం వ్యాపించడం మొదలైన వాటి మూలంగా జరిగే ఆయన రాజ్యస్థాపన గురించే అనిపిస్తున్నది. ఈ మాటలకు మనం చెప్పుకోగలిగిన వివరణల్లో ఇదే అన్నిటికన్నా సరైనదని అనిపిస్తుంది. తరువాతి అధ్యాయంలో రాసి ఉన్న రీతిగా పర్వతంపై ఆయన రూపం దివ్యంగా మారిపోయిన సందర్భంతో కూడా ఈ వచనానికి సంబంధం ఉన్నట్టుంది. 2 పేతురు 1:16-18 పోల్చి చూడండి.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Matthew - మత్తయి సువార్త 16 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

పరిసయ్యులు మరియు సద్దూకయ్యులు ఒక సూచన అడుగుతారు. (1-4) 
పరిసయ్యులు మరియు సద్దూకయ్యులు వ్యతిరేక సూత్రాలు మరియు ప్రవర్తనలను కలిగి ఉన్నారు, కానీ వారు క్రీస్తుకు వ్యతిరేకంగా ఏకమయ్యారు. అయినప్పటికీ, వారు తమ ప్రాధాన్యతలకు అనుగుణంగా ఒక నిర్దిష్ట సంకేతాన్ని కోరుకున్నారు, బాధలకు మరియు బాధలకు ఉపశమనాన్ని అందించే సంకేతాల పట్ల అసహ్యం చూపారు. బదులుగా, వారు అహంకారి యొక్క ఉత్సుకతను సంతృప్తిపరిచేదాన్ని డిమాండ్ చేశారు. దేవుడు స్థాపించిన సంకేతాలను మనం విస్మరించి, బదులుగా మన స్వంత సృష్టి యొక్క సంకేతాలను వెతకడం కపటత్వం యొక్క ముఖ్యమైన చర్య.

యేసు పరిసయ్యుల సిద్ధాంతానికి వ్యతిరేకంగా హెచ్చరించాడు. (5-12) 
క్రీస్తు ఆధ్యాత్మిక విషయాలను చర్చించడానికి ఒక రూపకాన్ని ఉపయోగిస్తాడు, కానీ శిష్యులు అతని మాటలను భౌతిక విషయాలకు సంబంధించినదిగా తప్పుగా అర్థం చేసుకుంటారు. అతను వారిలాగే శారీరక పోషణలో నిమగ్నమై ఉన్నాడని మరియు అతని బోధనా శైలి తమకు తెలియదని వారు భావించడం పట్ల అతను అసంతృప్తి చెందాడు. చివరికి, వారు ఉద్దేశించిన అర్థాన్ని గ్రహించారు. క్రీస్తు అంతర్గత ఆత్మ ద్వారా జ్ఞానాన్ని అందజేస్తాడు, తన బోధనలలోని ద్యోతకం యొక్క ఆత్మ ద్వారా అవగాహనను ప్రకాశింపజేస్తాడు.

యేసు క్రీస్తు అని పేతురు సాక్ష్యం. (13-20) 
పీటర్, తన తరపున మరియు తన తోటి శిష్యుల తరపున మాట్లాడుతూ, యేసు చాలా కాలంగా ఎదురుచూస్తున్న మెస్సీయ అని, సజీవ దేవుని కుమారుడని వారి నిశ్చయతను ధృవీకరించాడు. ఈ ప్రకటన యేసుపై వారి నమ్మకాన్ని కేవలం మర్త్యుడు కంటే ఎక్కువ అని వెల్లడించింది. ప్రతిస్పందనగా, మన ప్రభువు పీటర్ యొక్క ఆశీర్వాదాన్ని అంగీకరించాడు, ఎందుకంటే ఇది దైవిక సూచనల నుండి ఉద్భవించింది, అది అతని అవిశ్వాస స్వదేశీయుల నుండి అతనిని వేరు చేసింది.
సత్యాన్ని ప్రకటించడంలో పీటర్ యొక్క అచంచలమైన దృఢత్వాన్ని సూచిస్తూ, అతను పీటర్ అని పేరు పెట్టాడని కూడా క్రీస్తు పేర్కొన్నాడు. ఇక్కడ ఉపయోగించిన "రాక్" అనే పదం "పీటర్" వలె అదే పదం కాదు, కానీ ఇదే అర్థాన్ని కలిగి ఉందని గమనించడం ముఖ్యం. క్రీస్తు అంటే పేతురు తానే పునాది శిల అని భావించడం పూర్తిగా తప్పు. నిస్సందేహంగా, క్రీస్తు స్వయంగా రాక్, చర్చి యొక్క పరీక్షించబడిన మరియు నిజమైన పునాది. మరేదైనా పునాదిని స్థాపించడానికి ప్రయత్నించే ఎవరికైనా అయ్యో! పీటర్ యొక్క ఒప్పుకోలు సిద్ధాంతం యొక్క శిలగా పనిచేస్తుంది. యేసు క్రీస్తు కాకపోతే, ఆయనను అంగీకరించేవారు చర్చికి చెందినవారు కారు; వారు మోసగాళ్ళు లేదా మోసపోయినవారు.
ఇంకా, మన ప్రభువు పేతురుకు అధికారం ఇచ్చాడు. అతను తన తోటి శిష్యుల తరపున మాట్లాడాడు మరియు ఈ అధికారం వారికి కూడా విస్తరించింది. వారు వ్యక్తుల పాత్రల గురించి పూర్తి జ్ఞానం కలిగి ఉండకపోవచ్చు మరియు వారి వ్యక్తిగత జీవితంలో తప్పులు మరియు పాపాలకు గురికావచ్చు, అంగీకారం మరియు మోక్షానికి సంబంధించిన మార్గాన్ని వివరించడం, ప్రవర్తనా నియమావళిని నిర్వచించడం, విశ్వాసి యొక్క స్వభావాన్ని వివరించడం మరియు అనుభవాలు, మరియు అవిశ్వాసులు మరియు కపటుల తుది విధిని విశదీకరించడం. ఈ విషయాలలో, వారి తీర్పులు స్వర్గంలో మంచివి మరియు ఆమోదించబడ్డాయి.
ఏది ఏమైనప్పటికీ, ఇతరుల పాపాలను విమోచించడం లేదా నిలుపుకోవడం కోసం వ్యక్తులు చేసే ఏవైనా వాదనలు దైవదూషణ మరియు అశాస్త్రీయమైనవి. దేవుడు మాత్రమే పాపాలను క్షమించగలడు మరియు సాధారణ యూదు పరిభాషల ప్రకారం బైండింగ్ మరియు లూసింగ్ అనే భావన చట్టబద్ధమైన లేదా చట్టవిరుద్ధమైన వాటిని అనుమతించడం లేదా నిషేధించడం లేదా సూచించడాన్ని సూచిస్తుంది.

క్రీస్తు తన బాధలను ముందే చెప్పాడు మరియు పేతురును మందలించాడు. (21-23) 
క్రీస్తు క్రమంగా తన అంతర్దృష్టిని తన అనుచరులకు అందజేస్తాడు. అపొస్తలులు దేవుని కుమారునిగా క్రీస్తుపై తమ విశ్వాసాన్ని ప్రకటించిన తర్వాత, అతను తన రాబోయే బాధలను గురించి వారికి తెలియజేయడం ప్రారంభించాడు. ఇది అతని శిష్యులకు అతని రాజ్యం యొక్క బాహ్య వైభవం మరియు ఆధిపత్యం గురించి ఉన్న అపార్థాలను సరిదిద్దడం. క్రీస్తును అనుసరించాలని ఎంచుకునే వారు ముఖ్యమైన ప్రాపంచిక విజయాన్ని లేదా ప్రతిష్టను ఆశించకూడదు.
పీటర్, క్రీస్తు పట్ల తన శ్రద్ధలో, అతను కోరుకున్నట్లుగానే బాధలను నివారించాలని కోరుకున్నాడు. అయితే, మన స్వంతదానిపై ఆధారపడి క్రీస్తు ప్రేమ మరియు సహనాన్ని అంచనా వేయడం తప్పు. ఈ సూచనకు క్రీస్తు స్పందించినంత తీవ్రంగా ప్రతిస్పందించిన సందర్భం లేఖనాలలో ఎక్కడా కనిపించదు. మనల్ని నీతి నుండి దూరం చేసి, దేవుని కోసం ఎక్కువ చేయడం గురించి మనలో భయాన్ని కలిగించడానికి ప్రయత్నించే ఎవరైనా సాతాను భాష మాట్లాడుతున్నారు. పాపం చేయడానికి ప్రలోభాలకు గురిచేసే ఏదైనా దానిని అసహ్యంగా తిప్పికొట్టాలి మరియు చర్చలో వినోదం పొందకూడదు. క్రీస్తు కోసం బాధలకు దూరంగా ఉండేవారు దైవభక్తి గలవారి కంటే మానవ చింతల వైపు ఎక్కువ మొగ్గు చూపుతారు.

స్వీయ-తిరస్కరణ యొక్క ఆవశ్యకత. (24-28)
క్రీస్తు యొక్క నిజమైన శిష్యుడు తన విధులను నిర్వర్తించడమే కాకుండా ఆయన అడుగుజాడల్లో శాశ్వతమైన కీర్తి వైపు ప్రయాణించేవాడు. అటువంటి శిష్యుడు తన ఆత్మచే మార్గనిర్దేశం చేయబడిన క్రీస్తు వలె అదే మార్గంలో నడుస్తాడు మరియు అతను ఎక్కడికి నడిపించినా అతని మాదిరిని అనుసరిస్తాడు. "అతను తనను తాను తిరస్కరించుకోనివ్వండి." స్వీయ-తిరస్కరణ ఒక సవాలుగా ఉన్న పాఠం అయినప్పటికీ, అది మనలను విమోచించడానికి మరియు మాకు నేర్పించడానికి మా మాస్టర్ నేర్చుకున్న మరియు ఆచరించిన దాని కంటే ఎక్కువ కాదు.
"అతను తన శిలువను తీసుకోనివ్వండి." ఇక్కడ, క్రాస్ మనం ఎదుర్కొనే ప్రతి విచారణను సూచిస్తుంది. మన స్వంత భారం కంటే వేరొకరి భారాన్ని మనం బాగా భరించగలమని మేము తరచుగా నమ్ముతాము, కానీ మనకు కేటాయించబడినది మనకు ఉత్తమమైన భారం, మరియు మనం దానిని ఎక్కువగా ఉపయోగించుకోవాలి. మనం నిర్లక్ష్యంగా బాధలను మనపైకి తెచ్చుకోకూడదు, కానీ అది మన మార్గాన్ని దాటినప్పుడు దానిని భరించాలి.
ఎవరైనా శిష్యులుగా గుర్తించబడాలని కోరుకుంటే, వారు క్రీస్తు పనిని మరియు బాధ్యతలను స్వీకరించనివ్వండి. శారీరక జీవితంతో పోల్చినప్పుడు ప్రాపంచిక ఆస్తుల విలువను పరిగణనలోకి తీసుకున్నప్పుడు, ఆత్మ యొక్క శాశ్వతమైన ఆనందం లేదా శాపానికి సంబంధించి అదే వాదన ఎంత శక్తివంతమైనది! చాలా మంది అల్పమైన లాభాలు, పనికిరాని భోగాల కోసం మరియు కొన్నిసార్లు పూర్తి సోమరితనం మరియు నిర్లక్ష్యం కారణంగా తమ ఆత్మలను కోల్పోతారు.
ప్రజలు క్రీస్తును విడిచిపెట్టడానికి కారణమయ్యేది సాతాను వారి ఆత్మలను పొందే ధర అవుతుంది. అయితే ప్రపంచం మొత్తం కంటే ఒక్క ఆత్మ విలువైనది. ఈ విషయంపై క్రీస్తు దృక్పథం, ఎందుకంటే అతను వాటిని విమోచించినప్పటి నుండి ఆత్మల విలువ అతనికి తెలుసు. అతను ప్రపంచాన్ని తక్కువ అంచనా వేయడు, ఎందుకంటే అతను దాని సృష్టికర్త. చనిపోతున్న అతిక్రమికుడు తమ నశించిపోతున్న ఆత్మ కోసం దయ కోసం క్షణం ఆలస్యాన్ని కొనుగోలు చేయలేడు. కాబట్టి, మన ఆత్మలకు సరైన విలువ ఇవ్వడం నేర్చుకుందాం మరియు క్రీస్తును వారి ఏకైక రక్షకునిగా గుర్తించండి.



Shortcut Links
మత్తయి - Matthew : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |