Matthew - మత్తయి సువార్త 17 | View All

1. ఆరు దినములైన తరువాత యేసు పేతురును యాకోబును అతని సహోదరుడైన యోహానును వెంట బెట్టుకొని యెత్తయిన యొక కొండమీదికి ఏకాంతముగా పోయి వారి యెదుట రూపాంతరము పొందెను.

ఈ ఎత్తయిన పర్వతం బహుశా హెర్మోను పర్వతం.

2. ఆయన ముఖము సూర్యునివలె ప్రకాశించెను; ఆయన వస్త్రములు వెలుగువలె తెల్లనివాయెను.
కీర్తనల గ్రంథము 45:2, యెషయా 33:17

క్రీస్తు మహిమ దృశ్యాన్ని స్వల్పకాలం చూడగలిగారు శిష్యులు (మార్కు 9:23; లూకా 9:28-29; యోహాను 1:14; 2 పేతురు 1:16-18. ప్రకటన గ్రంథం 1:14-16 పోల్చి చూడండి). క్రీస్తు మత్తయి 16:27 లో చేసిన వాగ్దానాన్ని నెరవేరుస్తాడనేందుకు ఇది సాక్ష్యం. “రూపం మారిపోయింది” అని అనువదించిన గ్రీకు మాటకు అర్థం అంతరంగంలో ఉన్నదాన్ని బట్టి బయటి రూపం మారిపోవడం. ఇదే మాట రోమీయులకు 12:2; 2 కోరింథీయులకు 3:18 లో ఉంది.

3. ఇదిగో మోషేయు ఏలీయాయు వారికి కనబడి ఆయనతో మాట లాడుచుండిరి.

ధర్మశాస్త్రానికి, అంటే పాపవిముక్తి గురించిన సాదృశ్యాలూ, సూచనలతో నిండి ఉన్న పాత ఒడంబడికకు ప్రతినిధి మోషే. ప్రవక్తలకూ దేవుని రాజ్యం గురించి వారికి వచ్చిన దర్శనాలకూ, వాగ్దానాలకూ ప్రతినిధి ఏలీయా. ఈ సంఘటనకు 1400 సంవత్సరాల క్రితమే మోషే మరణించాడు. 900 సంవత్సరాల క్రితం ఏలీయా పరలోకానికి ఆరోహణమయ్యాడు. మరణం తరువాత కూడా మనుషులు సమసిపోకుండా ఉంటారనే బైబిలు సిద్ధాంతాన్ని వీరు ఇలా ప్రత్యక్షం కావడం రుజువు చేస్తున్నది. లూకా 9:31 వారు యేసుతో ఏం మాట్లాడినది మనకు తెలుపుతున్నది. రాబోయే ఆయన మరణాన్ని గురించి మాట్లాడారు.

4. అప్పుడు పేతురు ప్రభువా, మమిక్కడ ఉండుట మంచిది; నీకిష్టమైతే ఇక్కడ నీకు ఒకటియు మోషేకు ఒకటియు ఏలీయాకు ఒకటియు మూడు పర్ణశాలలు కట్టుదునని యేసుతో చెప్పెను.

పర్వతంపైన ఆ ధన్యకరమైన అనుభవాన్ని కొంతకాలం పొడిగించాలని బహుశా పేతురు కోరిక. మైదానప్రాంతంలో పనికీ, ఒత్తిడులకూ, జీవిత సమస్యలకూ దూరంగా ఆ శోభ వాతావరణంలో ఎంతకాలం వీలయితే అంతకాలం ఉందామని అతడు తలంచి ఉండవచ్చు. కానీ మార్కు 9:6 చూడండి. మరోసారి అతడు మనుషుల విషయాలపైన మనసుంచుతున్నాడు (మత్తయి 16:23). యేసు ఆ కొండమీదే ఉండిపోయినట్టయితే మనుషులకు పాపవిముక్తి కలిగేది కాదు.

5. అతడు ఇంకను మాటలాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన యొక మేఘము వారిని కమ్ముకొనెను; ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయనయందు నేనానందించుచున్నాను, ఈయన మాట వినుడని యొక శబ్దము ఆ మేఘములోనుండి పుట్టెను.
ద్వితీయోపదేశకాండము 18:15, కీర్తనల గ్రంథము 2:7, యెషయా 42:1

అపో. కార్యములు 1:9 దగ్గర “మేఘం” గురించి రిఫరెన్సులు చూడండి. ఇక్కడ తండ్రి అయిన దేవుడు మోషేకంటే, ఏలీయా కంటే ఉన్నతంగా, అంటే పాత ఒడంబడిక గ్రంథంలోని గొప్పవారందరికంటే, ఎప్పుడైనా భూమిపై జీవించిన వారందరికంటే పైగా యేసుప్రభువును ఘనపరచాడు. యేసు ఎవరితోనూ సరిపోల్చదగని దేవకుమారుడు. మత్తయి 3:17 మొ।। చూడండి. శాశ్వత సజీవ దేవుడూ, విశ్వాన్ని సృజించినవాడూ బైబిల్లో యేసు పలికిన మాటలపట్ల అమితమైన శ్రద్ధాసక్తులు కనపరచవలసిందని కోరుతున్నాడు. “ఈయన మాట వినండి”– ఈ మాటలకు ఈ లోకంలో మాటలు చెప్పినవారందరికన్నా యేసుప్రభువొక్కడే యోగ్యుడు. యోహాను 7:16-17; యోహాను 12:49-50; హెబ్రీయులకు 1:1-2 పోల్చి చూడండి. ఈ లోకంలో మన బ్రతుకంతా, మన శాశ్వత జీవితమంతా మనం ఆయన మాటలు విన్నామా లేదా అన్న దానిపైనే ఆధారపడి ఉంది – యోహాను 10:3, యోహాను 10:16, యోహాను 10:27; అపో. కార్యములు 3:23. చాలామందైతే ఇతర మనుషుల మాట వింటారు గానీ దేవుని ఏకైక కుమారుని స్వరం మాత్రం వినరు, ఎంత విచారకరం!

6. శిష్యులు ఈ మాట విని బోర్లబడి మిక్కిలి భయపడగా

నిర్గమకాండము 3:6; యెషయా 6:5; యెహెఙ్కేలు 1:28; దానియేలు 10:7-9; ప్రకటన గ్రంథం 1:17.

7. యేసు వారియొద్దకు వచ్చి వారిని ముట్టిలెండి, భయపడకుడని చెప్పెను.

మత్తయి 8:3, మత్తయి 8:15; మత్తయి 9:29; మత్తయి 20:34; దానియేలు 10:10; ప్రకటన గ్రంథం 1:17. లోకమంతా ఇవ్వగలిగినదానికంటే యేసుప్రభువు ఒక్క స్పర్శ ఎక్కువ ధన్యత ఇవ్వగలదు.

8. వారు కన్నులెత్తి చూడగా, యేసు తప్ప మరి ఎవరును వారికి కనబడలేదు.

ఇక్కడ వీరికి అక్షరాలా జరిగినది మనకు ఆధ్యాత్మికంగా జరగాలి. సూర్యోదయమైనప్పుడు నక్షత్రాలు కనిపించకుండా పోతాయి. మనం ఆయన్ను ఒక్కసారి చూస్తే చాలు, మరిక ఎవరికైనా సరే అదే స్థానం ఇవ్వడం అసాధ్యం.

9. వారు కొండ దిగి వచ్చుచుండగా మనుష్యకుమారుడు మృతులలోనుండి లేచువరకు ఈ దర్శనము మీరు ఎవరి తోను చెప్పకుడని యేసు వారి కాజ్ఞాపించెను.

అప్పుడు యేసుప్రభువును గురించిన సత్యాన్నంతటినీ ప్రకటించవలసిన సమయం ఇంకా రాలేదు, అయితే అది తరువాత వస్తుంది.

10. అప్పుడాయన శిష్యులు ఈలాగైతే ఏలీయా ముందుగా రావలె నని శాస్త్రులెందుకు చెప్పుచున్నారని ఆయన నడిగిరి.

“మొదట”– అంటే రక్షకుడైన అభిషిక్తుడికి ముందుగా, ఈ ఉపదేశం మలాకీ 4:5-6 ను ఆధారం చేసుకున్నది. యేసే అభిషిక్తుడని శిష్యులు నమ్మారు గాని ఆయన దారిని సిద్ధపరచేందుకు ఏలీయా ఎందుకు రాలేదో వారికి అర్థం కాలేదు.

11. అందుకాయన ఏలీయా వచ్చి సమస్తమును చక్కపెట్టు నను మాట నిజమే;
మలాకీ 4:5

మలాకీ 4:5-6 భవిష్యత్తులో నెరవేరుతుందనీ, యెహోవా దినానికి ముందు ఏలీయా వస్తాడనీ యేసుప్రభువు చెప్తున్నాడు.

12. అయినను ఏలీయా యిదివరకే వచ్చెను; వారతనిని ఎరుగక తమ కిష్టము వచ్చినట్టు అతని యెడల చేసిరి. మనుష్యకుమారుడు కూడ ఆలాగే వారి చేత శ్రమలు పొందబోవుచున్నాడని మీతో చెప్పు చున్నాననెను.

మత్తయి 11:14 నోట్.

13. అప్పుడాయన బాప్తిస్మమిచ్చు యోహానునుగూర్చి తమతో చెప్పెనని శిష్యులు గ్రహించిరి.

“యోహాను”– మత్తయి 3:1-12; మత్తయి 11:2-15; మత్తయి 14:1-12.

14. వారు జనసమూహమునొద్దకు వచ్చినప్పుడు ఒకడు ఆయనయొద్దకు వచ్చి ఆయనయెదుట మోకాళ్లూని

15. ప్రభువా, నా కుమారుని కరుణింపుము; వాడు చాంద్ర రోగియై మిక్కిలి బాధపడుచున్నాడు; ఏలాగనగా అగ్ని లోను నీళ్లలోను తరుచుగా పడుచున్నాడు;

ఈ మూర్ఛలు దయ్యం మూలంగా వస్తున్నాయి (వ 18). అయితే దయ్యాల చర్యలతో నిమిత్తం లేకుండా కూడా ఇలాంటివి రావచ్చు.

16. నీ శిష్యుల యొద్దకు వానిని తీసికొని వచ్చితిని గాని వారు వానిని స్వస్థపరచలేకపోయిరని చెప్పెను.

17. అందుకు యేసువిశ్వాసములేని మూర్ఖతరమువారలారా, మీతో నేనెంత కాలము ఉందును? ఎంతవరకు మిమ్మును సహింతును? వానిని నాయొద్దకు తీసికొనిరండని చెప్పెను.
ద్వితీయోపదేశకాండము 32:5, ద్వితీయోపదేశకాండము 32:20

విశ్వాసం లేకుండా వక్రమార్గం పట్టిన ఆ తరం ఇస్రాయేల్ వారి సుదీర్ఘ చరిత్రలోకెల్లా అతి చెడ్డ తరాల్లో ఒకటి – మత్తయి 12:39; మత్తయి 23:33-36; అపో. కార్యములు 2:40. యేసుప్రభువు ఈ లోకంలో గడిపిన రోజులన్నీ ప్రజల అపనమ్మకాన్నీ, అవిధేయతనూ ఎదుర్కొంటూ బాధపడుతూనే గడిపాడని ఈ వచనం సూచిస్తున్నది. “ఎందాక”– అనే మాటను ఆయన పెదవులపైకి తెప్పించినది ఆయనకు కలిగిన బాధే. ఇదే కారణంతో మనం ఇప్పటికీ ఆయనకు బాధ కలిగిస్తున్నామా?

18. అంతట యేసు ఆ దయ్యమును గద్దింపగా అది వానిని వదలి పోయెను; ఆ గడియనుండి ఆ చిన్నవాడు స్వస్థత నొందెను.

మత్తయి 4:24; మత్తయి 8:29-34; మత్తయి 9:32-33.

19. తరువాత శిష్యులు ఏకాంతముగా యేసు నొద్దకు వచ్చిమేమెందుచేత దానిని వెళ్లగొట్టలేక పోతి మని అడిగిరి.

వ 17; మత్తయి 6:30; మత్తయి 8:26; మత్తయి 14:31. దయ్యాలను వెళ్ళగొట్టేందుకు యేసు తన శిష్యులకు అధికారమిచ్చాడు (మత్తయి 10:1). బహుశా ఇక్కడ మొదటిసారి వారు ప్రయత్నం చేసి విఫలమయ్యారు. ఇందుకు కారణం బహుశా వారికి క్రీస్తులోను ఆయన మాటల్లోను మునుపటి సమయాల్లో ఉన్నంత నమ్మకం లేకపోయింది. ఒకవేళ ఈసారి వారు తమమీద, దయ్యాలను వెళ్ళగొట్టడానికి అనుసరించవలసిన పద్ధతి మీద మాత్రమే నమ్మకం పెట్టుకున్నారేమో. దయ్యాలన్నీ ఒక రకంగా ఉండవు. కొన్ని దయ్యాలు మిగతా వాటికన్నా బలమైనవి, మొండివని కనిపిస్తున్నది. అలాంటి వాటిని వెళ్ళగొట్టడానికి మామూలు కంటే మరింత బలమైన నమ్మకం అవసరం. ప్రార్థన, ఉపవాసం నమ్మకానికి పుష్ఠిని చేకూర్చగలవు. కొండను గురించి యేసు ఇచ్చిన ఉదాహరణ నమ్మకానికి ఉన్న మహా ప్రభావాన్ని తెలియజేస్తున్నది. నిజానికి కదిలించవలసింది ప్రకృతిలో కనిపించే కొండలను కాదు గాని కొండల్లాగా ఎదురు నిలిచే ఆటంకాలు, అడ్డుబండలనే. క్రీస్తులో నమ్మకం బలంగా ఉంటే ఇవన్నీ తలవంచుతాయి. మార్కు 11:24; రోమీయులకు 4:19-21; హీబ్రూ 11 అధ్యాయం కూడా చూడండి.

20. అందుకాయనమీ అల్పవిశ్వాసము చేతనే; మీకు ఆవగింజంత విశ్వాసముండినయెడల ఈ కొండను చూచి ఇక్కడనుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును;

21. మీకు అసాధ్యమైనది ఏదియు నుండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను.

22. వారు గలిలయలో సంచరించుచుండగా యేసుమనుష్యకుమారుడు మనుష్యులచేతికి అప్పగింపబడబోవు చున్నాడు,

మత్తయి 16:21. ఆయన మాటలు వారికి అర్థం కాలేదు గానీ భయానకమైనదేదో జరగనున్నదని మాత్రం గ్రహించారు. ఆయన సజీవంగా లేవడం ఏమిటో వారికి తెలియదు (మార్కు 9:10, మార్కు 9:32; లూకా 18:34). దేవుని ప్రజలకు అర్థం చేసుకునే శక్తి గనుక కొంచెం మెరుగ్గా ఉంటే, వారు విచారపడుతున్న కొన్ని విషయాలను బట్టి ఆనందించగలిగే వారుగా మారిపోతారు. దీనికి ఒక ఉదాహరణ ఆదికాండము 50:20 చూడండి.

23. వారాయనను చంపుదురు; మూడవదినమున ఆయన లేచునని వారితో చెప్పగా వారు బహుగా దుఃఖపడిరి.

24. వారు కపెర్నహూమునకు వచ్చినప్పుడు అరషెకెలు అను పన్ను వసూలుచేయువారు పేతురునొద్దకువచ్చి మీ బోధకుడు ఈ అరషెకెలు చెల్లింపడా అని యడు గగాచెల్లించుననెను.
నిర్గమకాండము 30:13, నిర్గమకాండము 38:26

నిర్గమకాండము 30:13; 2 దినవృత్తాంతములు 24:9. ఈ పన్ను ఆలయ మరమ్మత్తులు, పరిచర్య ధర్మం జరిగించేందుకు.

25. అతడు ఇంటిలోనికి వచ్చి మాట లాడకమునుపే యేసు ఆ సంగతి యెత్తిసీమోనా, నీకేమి తోచుచున్నది? భూరాజులు సుంకమును పన్నును ఎవరి యొద్ద వసూలుచేయుదురు? కుమారులయొద్దనా అన

ము ఓడించిన ప్రజల దగ్గర్నుంచి రోమ్ పరిపాలకులు పన్నులు వసూలు చేసేవారు. రోమ్ పౌరులు మాత్రం ఈ పన్ను చెల్లించనక్కర్లేదు.

26. అతడు అన్యులయొద్దనే అని చెప్పగా యేసు అలాగైతే కుమారులు స్వతంత్రులే.

క్రీస్తు దేవుని కుమారుడు, ఆలయంకన్నా అధికుడు (మత్తయి 12:6). ఆయన గానీ ఆయన శిష్యులు గానీ ఆలయం పన్ను చెల్లించవలసిన అవసరం లేదు. దేవుని పిల్లలు స్వతంత్రులు. వారిచ్చే చందాలు స్వేచ్ఛార్పణలుగా ఉండాలి. 2 కోరింథీయులకు 9:7 చూడండి. వారు మోషే ధర్మశాస్త్రానికి గానీ మత నాయకులు చేసిన శాసనాలకు గానీ దాసులుగా ఉండరాదు (గలతియులకు 5:1, గలతియులకు 5:13). అయితే ఈ వచనాలు క్రైస్తవులు ప్రభుత్వానికి చెల్లించవలసిన పన్నులకు వర్తించవు. మత్తయి 22:21; రోమీయులకు 13:5-7 చూడండి.

27. అయినను మనము వారికి అభ్యంతరము కలుగజేయకుండునట్లు నీవు సముద్రమునకు పోయి, గాలము వేసి, మొదట పైకివచ్చు చేపను పట్టుకొని, దాని నోరు తెరచినయెడల ఒక షెకెలు దొరకును; దానిని తీసికొని నా కొరకును నీకొరకును వారికిమ్మని అతనితో చెప్పెను.

దేవుని పిల్లలకు వర్తించే మరో ప్రాముఖ్యమైన సూత్రం. వారు తమ స్వతంత్రతను ఇతరులకు అనవసరంగా బాధ కలిగించే రీతిలో ఉపయోగించకూడదు (రోమీయులకు 14:13, రోమీయులకు 14:15, రోమీయులకు 14:19-21). ఈ వచనాన్ని బట్టి ఆ పన్ను చెల్లించేందుకు పేతురు దగ్గర గానీ యేసు దగ్గర గానీ డబ్బు లేదని అర్థం అవుతున్నది. ఇద్దరికీ కలిపి కావలసిన మొత్తం ఒక కూలివాడు నాలుగు రోజుల్లో సంపాదించ గలిగినంత. యేసుప్రభువు ఇష్టపూర్వకంగా పేదరికంలో జీవించాడు (మత్తయి 8:20). తన ప్రజల అవసరాలు తీర్చేందుకు దేవుడు ప్రతి విషయాన్నీ తన అదుపులో ఎలా ఉంచుకుంటాడో ఇక్కడ మనం చూడగలం. ఎవరో ఎప్పుడో ఆ సరస్సులోకి ఒక నాణెం జారవిడిచారు. సరిగ్గా ఈ క్షణం దాకా అది అక్కడే ఉంది. ఆ చేప కూడా దేవుని ఆదేశాల క్రిందే ఉంది (యోనా 1:17; యోనా 2:10 పోల్చి చూడండి). తన ప్రజల అవసరాలు తీర్చడానికి దేవునికి అనేక మార్గాలున్నాయి. 1 రాజులు 17:4, 1 రాజులు 17:9 కూడా చూడండి. లోకమంతా ఆయన స్వాధీనంలో ఉంది. ఆయనపై నమ్మకం ఉంచి ఆందోళనకు దూరంగా ఉందాం (మత్తయి 6:25-34).



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Matthew - మత్తయి సువార్త 17 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

క్రీస్తు రూపాంతరం. (1-13) 
శిష్యులకు క్రీస్తు మహిమ యొక్క సంగ్రహావలోకనం ఇవ్వబడింది, ఇది తండ్రి యొక్క ఏకైక సంతానం యొక్క ప్రత్యేకమైన ప్రకాశాన్ని పోలి ఉంటుంది. ఈ ద్యోతకం వారి విశ్వాసాన్ని బలపరచడానికి ఉపయోగపడింది, ముఖ్యంగా క్రీస్తు రాబోయే సిలువ మరణానికి ఎదురుచూస్తూ. ఇది అతని దైవిక శక్తి ద్వారా అతనిలా మారినప్పుడు వారి కోసం ఎదురుచూస్తున్న అద్భుతమైన భవిష్యత్తు యొక్క సంగ్రహావలోకనం కూడా అందించింది. ఈ అద్భుతమైన దర్శనంతో ఉప్పొంగిపోయిన అపొస్తలులు, ముఖ్యంగా పేతురు, ఆ మహిమాన్వితమైన క్షణంలో ఉండాలని మరియు వారు ఎదుర్కొనేందుకు ఇష్టపడని బాధలను ఎదుర్కోవడానికి దిగకుండా ఉండాలని కోరుకున్నారు. భూలోక పరదైసు కోసం వారి కోరికలో, వారు క్రీస్తు మార్గదర్శకత్వాన్ని వెతకడం మర్చిపోయారు, నిజమైన స్వర్గపు ఆనందం ఈ ప్రపంచంలో కనుగొనబడదని గ్రహించలేదు.
అంతిమ త్యాగం ఇంకా చేయలేదని, పాపాత్ముల మోక్షానికి అవసరమైన త్యాగం మరియు పీటర్ మరియు అతని తోటి శిష్యులు తమ ముందు ముఖ్యమైన పనులు ఉన్నాయని వారు గుర్తు చేసుకున్నారు. పీటర్ తన ఆలోచనలను వ్యక్తం చేస్తున్నప్పుడు, ఒక ప్రకాశవంతమైన మేఘం వారిని ఆవరించింది, ఇది దైవిక ఉనికిని మరియు మహిమను సూచిస్తుంది. చరిత్ర అంతటా, దేవుని ఉనికి యొక్క అసాధారణ వ్యక్తీకరణలు తరచుగా మానవాళిని విస్మయం మరియు భయాందోళనలతో నింపాయి, మనిషి మొదటిసారి పాపం చేసి తోటలో దేవుని స్వరాన్ని విన్నప్పటి నుండి. ప్రతిస్పందనగా, శిష్యులు నేలపై సాష్టాంగపడ్డారు, కానీ యేసు వారికి భరోసా ఇచ్చాడు. వారి ప్రశాంతతను తిరిగి పొందిన తరువాత, వారు యేసును ఆయన సుపరిచితమైన రూపంలో చూశారు.
కీర్తి కోసం మన ప్రయాణం తరచుగా విభిన్నమైన మరియు సవాలుతో కూడిన అనుభవాలను కలిగి ఉంటుందని ఈ అనుభవం వివరిస్తుంది. పవిత్రమైన ఎన్‌కౌంటర్ తర్వాత మనం తిరిగి ప్రపంచంలోకి ప్రవేశించినప్పుడు, ఆయన మనతో ఉన్నాడని తెలుసుకోవడం ద్వారా ఓదార్పుని పొందడం ద్వారా మనలో క్రీస్తును మోయడం చాలా అవసరం.

యేసు మూగ మరియు చెవిటి ఆత్మను వెళ్లగొట్టాడు. (14-21) 
తల్లిదండ్రులు తమ బాధిత పిల్లల కేసులను శ్రద్ధగా మరియు నమ్మకంగా ప్రార్థన ద్వారా దేవుని ముందుంచాలి. క్రీస్తు బాధలో ఉన్న బిడ్డను స్వస్థపరచినట్లే, ప్రజల మొండితనం మరియు అతని స్వంత చికాకుల నేపథ్యంలో కూడా, పిల్లల శ్రేయస్సు ఇప్పటికీ ప్రాధాన్యతనిస్తుంది. సహాయం మరియు మద్దతు అన్ని ఇతర రూపాలు క్షీణించినప్పుడు, మేము ఎల్లప్పుడూ క్రీస్తు వైపు తిరిగి స్వాగతం. ఆయన శక్తి మరియు మంచితనంపై మన నమ్మకాన్ని ఉంచవచ్చు. ఈ ఎపిసోడ్ మన విమోచకునిగా క్రీస్తు పాత్రకు చిహ్నంగా పనిచేస్తుంది. ఇది తల్లిదండ్రులను వారి పిల్లలను క్రీస్తుకు పరిచయం చేయమని ప్రోత్సహిస్తుంది, ప్రత్యేకించి వారి ఆత్మలు సాతాను పట్టులో ఉంటే; అతను వాటిని నయం చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాడు మరియు అతను చేయగలిగినంత ఇష్టపడతాడు.
ఇంకా, మీ పిల్లల కోసం ప్రార్థిస్తే సరిపోదు; మీరు వారిని క్రీస్తు బోధనలకు కూడా బహిర్గతం చేయాలి, దీని ద్వారా వారి ఆత్మలలోని సాతాను కోటలు కూల్చివేయబడతాయి. మన స్వంత పరిమితులు మరియు బలహీనతల గురించి మనం జాగ్రత్తగా ఉండటం తెలివైన పని, కానీ క్రీస్తు నుండి వచ్చిన లేదా ఆయన ద్వారా మంజూరు చేయబడిన ఏదైనా శక్తిని మనం అనుమానించినప్పుడు అది అతనికి అసంతృప్తిని కలిగిస్తుంది. అదనంగా, ఈ సందర్భంలో అనారోగ్యం యొక్క స్వభావం వైద్యం ప్రక్రియను ముఖ్యంగా సవాలుగా చేసింది. సాతాను యొక్క అసాధారణ శక్తి మన విశ్వాసాన్ని తగ్గించకూడదు; బదులుగా, దాని పెరుగుదల కోసం మన ప్రార్థనలలో మరింత ఉత్సాహంగా ఉండేలా అది మనల్ని నడిపిస్తుంది.
పతనం నుండి ఆడమ్ యొక్క ప్రతి వారసుడిపై సాతాను యొక్క ఆధ్యాత్మిక పట్టును మనం స్పష్టంగా గమనించగలిగినప్పుడు, చిన్న వయస్సు నుండి ఈ యువకుడిని సాతాను భౌతికంగా స్వాధీనం చేసుకున్నందుకు మనం ఆశ్చర్యపోవాలా?

అతను మళ్ళీ తన బాధలను ముందే చెప్పాడు. (22,23) 
క్రీస్తు తనకు జరగబోయే అన్ని విషయాల గురించి సంపూర్ణ ముందస్తు జ్ఞానాన్ని కలిగి ఉన్నప్పటికీ, అతను మన పట్ల తనకున్న ప్రగాఢమైన ప్రేమను ప్రదర్శిస్తూ మన విమోచన మిషన్‌ను ఇష్టపూర్వకంగా ప్రారంభించాడు. విమోచకుని జీవితాన్ని వర్ణించే బాహ్య వినయానికి మరియు దైవిక మహిమకు మధ్య ఉన్న పూర్తి వ్యత్యాసాన్ని పరిగణించండి. అవమానంతో కూడిన అతని మొత్తం ప్రయాణం అతని అంతిమ ఔన్నత్యంలో ముగిసింది. ఇది మన స్వంత శిలువలను ధరించడం, సంపద మరియు ప్రాపంచిక ప్రశంసల ఆకర్షణను విస్మరించడం మరియు అతని దైవిక సంకల్పంలో సంతృప్తిని పొందడం యొక్క ప్రాముఖ్యతను మనకు బోధిస్తుంది.

నివాళి డబ్బు చెల్లించడానికి అతను ఒక అద్భుతం చేస్తాడు. (24-27)
సరైనది చేయగల తన యజమాని సామర్థ్యంపై పీటర్‌కు గట్టి నమ్మకం ఉంది. క్రీస్తు, తన ప్రారంభ మాటలలో, తన నుండి ఏ ఆలోచన దాగి లేదని ప్రదర్శించడానికి లక్ష్యంగా పెట్టుకున్నాడు. నేరం జరుగుతుందనే భయంతో మనం మన బాధ్యతలను ఎప్పటికీ వదులుకోకుండా ఉండటం చాలా అవసరం. కొన్నిసార్లు, నేరం చేయకుండా ఉండేందుకు ప్రాపంచిక ప్రయోజనాల కంటే మన కర్తవ్యానికి ప్రాధాన్యత ఇవ్వాల్సి రావచ్చు. చేపలో డబ్బు దొరికిందనే వాస్తవం, సమస్త జ్ఞానాన్ని కలిగి ఉన్న వ్యక్తి మాత్రమే దాని స్థానాన్ని తెలుసుకోగలడని మరియు సర్వశక్తిమంతుడైన శక్తి మాత్రమే దానిని పీటర్ యొక్క హుక్కి నడిపించగలదని వెల్లడిస్తుంది. క్రీస్తు శక్తి మరియు ఆయన వినయం యొక్క సమ్మేళనాన్ని మనం ఎల్లప్పుడూ గుర్తించాలి.
మన ప్రభువు చేసినట్లుగా, పేదరికంతో కూడిన జీవితాన్ని గడపడానికి దైవిక ప్రావిడెన్స్ ద్వారా మనల్ని మనం పిలిచినట్లయితే, మనం అతని శక్తిపై నమ్మకం ఉంచాలి. క్రీస్తు యేసు ద్వారా తన మహిమాన్వితమైన సంపదకు అనుగుణంగా మన దేవుడు మన అవసరాలన్నింటినీ తీరుస్తాడని నిశ్చయించుకోండి. విధేయత మరియు అతని సాధారణ పనిలో పేతురుకు క్రీస్తు సహాయం చేసినట్లే, ఆయన మనకు కూడా అలాగే సహాయం చేస్తాడు. మనం సిద్ధపడని ఒక అనుకోని పరిస్థితి ఎదురైతే, సహాయం కోసం ఇతరుల వైపు తిరిగే ముందు క్రీస్తును వెతకాలని గుర్తుంచుకోండి.



Shortcut Links
మత్తయి - Matthew : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |