Mark - మార్కు సువార్త 12 | View All

1. ఆయన ఉపమానరీతిగా వారికి బోధింపనారంభించెను; ఎట్లనగాఒక మనుష్యుడు ద్రాక్షతోట నాటించి, దానిచుట్టు కంచె వేయించి, ద్రాక్షలతొట్టి తొలిపించి గోపురము కట్టించి, కాపులకు దానిని గుత్తకిచ్చి దేశాంతరముపోయెను.
యెషయా 5:1-7

1. And he began to speak unto them in similitudes. A certain man planted a vineyard, and compassed it with an hedge, and ordained a winepress, and built a tower in it, and let it out to hire unto husbandmen, and went into a strange country.

2. పంటకాలమందు ఆ కాపుల నుండి ద్రాక్షతోట పండ్లలో తన భాగము తీసికొని వచ్చుటకు, కాపులయొద్దకు అతడు ఒక దాసునిపంపగా

2. And when the time was come he sent to the tenants a servant that he might receive of the tenants of the fruit of the vineyard.

3. వారు వాని పట్టుకొని కొట్టి, వట్టిచేతులతో పంపివేసిరి.
యెహోషువ 22:5

3. And they caught him and beat him and sent him again empty.

4. మరల అతడు మరియొక దాసుని వారియొద్దకు పంపగా, వారు వాని తల గాయముచేసి అవమానపరచిరి.

4. And moreover he sent unto them another servant, and at him they cast stones and brake his head, and sent him again all too reviled.(sent him away shamefully dealt withall)

5. అతడు మరియొకని పంపగా వానిని చంపిరి. అతడింక అనేకులను పంపగా, వారు కొందరిని కొట్టిరి, కొందరిని చంపిరి.

5. And again he sent another, and him they killed: and many other, beating some, and killing some.

6. ఇంకను అతనికి ప్రియ కుమారుడు ఒకడుండెను గనుకవారు తన కుమారుని సన్మానించెదరనుకొని తుదకు వారి యొద్దకు అతనిని పంపెను.

6. Yet had he one son whom he loved tenderly, him also sent he at the last unto them, saying: they will fear my son.(stand in awe of my son)

7. అయితే ఆ కాపులు ఇతడు వారసుడు; ఇతని చంపుదము రండి, అప్పుడు స్వాస్థ్యము మనదగునని తమలోతాము చెప్పుకొని

7. But the tenants said within(amongst) themselves: This is the heir, come let us kill him and the inheritance shall be ours.

8. అతనిని పట్టుకొని చంపి, ద్రాక్షతోట వెలుపల పారవేసిరి.

8. And they took him and killed him, and cast him out of the vineyard.

9. కావున ఆ ద్రాక్షతోట యజమానుడేమి చేయును? అతడు వచ్చి, ఆ కాపులను సంహరించి, యితరులకు ఆ ద్రాక్షతోట ఇచ్చును గదా. మరియ

9. What shall then the lord of the vineyard do? He will come and destroy the tenants, and let out the vineyard to other.

10. ఇల్లు కట్టువారు నిరాకరించిన రాయి మూలకు తలరాయి ఆయెను
కీర్తనల గ్రంథము 118:22-23

10. Have ye not read this scripture? the stone which the builders did refuse, is made the chief stone(headstone) in the corner:

11. ఇది ప్రభువువలననే కలిగెను ఇది మన కన్నులకు ఆశ్చర్యము అను లేఖనము మీరు చదువలేదా? అని అడుగగా
కీర్తనల గ్రంథము 118:22-23

11. This was done of the Lord, and is marvelous in our eyes.

12. తమ్మును గూర్చి ఆ ఉపమానము చెప్పెనని వారు గ్రహించి ఆయనను పట్టుకొనుటకు సమయము చూచుచుండిరి గాని జన సమూహమునకు భయపడి ఆయనను విడిచిపోయిరి.

12. And they went about to take him, but they feared the people. For they perceived that he spake that similitude against them. And they left him and went their way.

13. వారు మాటలలో ఆయనను చిక్కుపరచవలెనని, పరిసయ్యులను హేరోదీయులను కొందరిని ఆయన యొద్దకు పంపిరి.

13. And they sent unto him certain of the pharisees with Herod's servants, to take him in his words.

14. వారు వచ్చి బోధకుడా, నీవు సత్యవంతుడవు; నీవు ఎవనిని లక్ష్యపెట్టనివాడవని మేమెరుగుదుము; నీవు మోమోటములేనివాడవై దేవుని మార్గము సత్యముగా బోధించువాడవు. కైసరుకు పన్నిచ్చుట న్యాయమా కాదా?

14. And as soon as they were come, they said unto him: master, we know that thou art true, and carest for no man: For thou considerest not the degree of men, but teachest the way of God truly: Is it lawful to pay tribute to Cesar, or not?

15. ఇచ్చెదమా ఇయ్యకుందుమా? అని ఆయన నడిగిరి. ఆయన వారి వేషధారణను ఎరిగిమీరు నన్ను ఎందుకు శోధించుచున్నారు? ఒక దేనారము నా యొద్దకు తెచ్చి చూపుడని వారితో చెప్పెను.

15. ought we to give, or ought we not to give? He knew(understood) their dissimulation,(perceived their hypocracy) and said unto them: Why tempt ye me? Bring me a penny, that I may see it.

16. వారు తెచ్చిరి, ఆయన ఈ రూపమును, పై వ్రాతయు, ఎవరివని వారి నడుగగా వారు కైసరువి అనిరి.

16. And they brought him one. And he said unto them: Whose is this image and superscription? And they said unto him, Cesar's.

17. అందుకు యేసు కైసరువి కైసరునకును దేవునివి దేవునికిని చెల్లించుడని వారితో చెప్పగా వారాయననుగూర్చి బహుగా ఆశ్చర్యపడిరి.

17. And Jesus answered, and said unto them: Then give to Cesar that which belongeth to Cesar: and give(to) God that which pertaineth to God. And they marveled at him.

18. పునరుత్థానము లేదని చెప్పెడి సద్దూకయ్యులు ఆయన యొద్దకువచ్చి

18. And(Then came) the sadducees came unto him, which say, there is no resurrection. And they asked him saying:

19. బోధకుడా, తనభార్య బ్రదికియుండగా ఒకడు పిల్లలు లేక చనిపోయినయెడల వాని సహోదరుడు వాని భార్యను పెండ్లిచేసికొని తన సహోదరునికి సంతానము కలుగజేయవలెనని మోషే మాకు వ్రాసియిచ్చెను.
ఆదికాండము 38:8, ద్వితీయోపదేశకాండము 25:5

19. Master, Moses wrote unto us, if any man's brother die, and leave his wife, behind him, and leave no children: that then his brother should take his wife, and raise up seed unto his brother.

20. ఏడుగురు సహోదరులుండిరి. మొదటివాడు ఒక స్త్రీని పెండ్లిచేసికొని సంతానములేక చనిపోయెను

20. There were seven brethren and the first took a wife, and when he died left no seed behind him.

21. గనుక రెండవవాడు ఆమెను పెండ్లి చేసికొనెను, వాడును సంతానము లేక చనిపోయెను; అటువలెనే మూడవవాడును చనిపోయెను.

21. And the second took her, and died: neither left he any seed, and the third likewise.

22. ఇట్లు ఏడుగురును సంతానము లేకయే చనిపోయిరి. అందరివెనుక ఆ స్త్రీయు చనిపోయెను.

22. And seven had her, and left no seed behind them. Last of all the wife died also.

23. పునరుత్థానమందు వారిలో ఎవనికి ఆమె భార్యగా ఉండును? ఆమె ఆ యేడుగురికిని భార్య ఆయెను గదా అని అడిగిరి.

23. In the resurrection then, when they shall rise again: whose wife shall she be of them? For seven had her to wife.

24. అందుకు యేసుమీరు లేఖనములనుగాని దేవుని శక్తినిగాని యెరుగక పోవుటవలననే పొరబడుచున్నారు.

24. Jesus answered, and said unto them: Are ye not therefore deceived(Do not ye err?) because ye know not(deceived and understand not) the scriptures? Neither the power of God?

25. వారు మృతులలోనుండి లేచునప్పుడు పెండ్లిచేసికొనరు, పెండ్లికియ్యబడరు గాని పరలోక మందున్న దూతలవలె నుందురు.

25. For when they shall rise again from death, they neither marry, nor are married: but are as the angels which are in heaven.

26. వారు లేచెదరని మృతులను గూర్చిన సంగతి మోషే గ్రంథమందలి పొదను గురించిన భాగములో మీరు చదువలేదా? ఆ భాగములో దేవుడునేను అబ్రాహాము దేవుడను ఇస్సాకు దేవుడను యాకోబు దేవుడనని అతనితో చెప్పెను.
నిర్గమకాండము 3:2, నిర్గమకాండము 3:6, నిర్గమకాండము 3:16

26. As touching the dead, that they shall rise again: have ye not read in the book of Moses, how in the bush God spake unto him saying: I am the God of Abraham, and the God of Isaac, and the God of Jacob?

27. ఆయన సజీవుల దేవుడు గాని మృతుల దేవుడు కాడు. కావున మీరు బహుగా పొరబడుచున్నారని వారితో చెప్పెను.

27. He is not the God of the dead, but the God of the living, ye are therefore greatly deceived.

28. శాస్త్రులలో ఒకడు వచ్చి, వారు తర్కించుట విని, ఆయన వారికి బాగుగా ఉత్తరమిచ్చెనని గ్రహించి ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైనదేదని ఆయన నడిగెను.

28. And there came one of the scribes, and when he(that) had heard them disputing together, and perceived that he had answered them well, he(and) asked him: Which is the first of all the commandments?

29. అందుకు యేసు ప్రధానమైనది ఏదనగా ఓ ఇశ్రాయేలూ, వినుము; మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు.
ద్వితీయోపదేశకాండము 6:4-5, యెహోషువ 22:5

29. Jesus answered him: the first of all the commandments is. Hear Israel, our(The) Lord God, is one Lord.

30. నీవు నీ పూర్ణహృదయముతోను, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణవివేకముతోను, నీ పూర్ణబలముతోను, నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలె ననునది ప్రధానమైన ఆజ్ఞ.
యెహోషువ 22:5

30. And thou shalt love thy Lord God(the LORD thy God) with all thy heart, and with all thy soul, and with all thy mind, and with all thy strength. This is the first commandment.

31. రెండవది, నీవు నిన్నువలె నీ పొరుగువానిని ప్రేమింపవలె ననునది రెండవ ఆజ్ఞ; వీటికంటె ముఖ్యమైన ఆజ్ఞ మరే దియు లేదని అతనితో చెప్పెను
లేవీయకాండము 19:18

31. And the second is like unto this. Thou shalt love thy neighbor, as thy self. There is none other commandment greater than these.

32. ఆ శాస్త్రి బోధకుడా, బాగుగా చెప్పితివి; ఆయన అద్వితీయుడనియు, ఆయన తప్ప వేరొకడు లేడనియు నీవు చెప్పిన మాట సత్యమే.
ద్వితీయోపదేశకాండము 4:35, 1 సమూయేలు 15:22, యెషయా 45:21

32. And the scribe said unto him: well master, thou hast said the truth,(said right) that there is one God, and that there is none but he.

33. పూర్ణ హృదయముతోను, పూర్ణవివేకముతోను, పూర్ణ బలముతోను, ఆయనను ప్రేమించుటయు ఒకడు తన్నువలె తన పొరుగువాని ప్రేమించుటయు సర్వాంగ హోమములన్నిటికంటెను బలులకంటెను అధికమని ఆయనతో చెప్పెను.
హోషేయ 6:6, ద్వితీయోపదేశకాండము 4:35, 1 సమూయేలు 15:22, యెషయా 45:21

33. And to love him with all the heart, and with all the mind, and with all the soul, and with all the strength. And to love a man's neighbor as himself, is a greater thing than all holocausts(burnt offerings) and sacrifices.

34. అతడు వివేకముగా నుత్తరమిచ్చెనని యేసు గ్రహించి నీవు దేవుని రాజ్యమునకు దూరముగ లేవని అతనితో చెప్పెను. ఆ తరువాత ఎవడును ఆయనను ఏ ప్రశ్నయు అడుగ తెగింపలేదు.

34. And when Jesus saw that he answered discreetly, he said unto him: Thou art not far from the kingdom of God. And no man after that durst ask him any question.

35. ఒకప్పుడు యేసు దేవాలయములో బోధించుచుండగా క్రీస్తు, దావీదు కుమారుడని శాస్త్రులు చెప్పుచున్నారేమి?

35. And Jesus answered, and said teaching in the temple: how say the scribes, that Christ is the son of David?

36. నేను నీ శత్రువులను నీకు పాదపీఠముగా ఉంచువరకు నీవు నా కుడివైపున కూర్చుండుమని ప్రభువు నా ప్రభువుతో చెప్పెను అని దావీదే పరిశుద్ధాత్మవలన చెప్పెను.
కీర్తనల గ్రంథము 110:1

36. for David himself inspired with the holy ghost said: The Lord said to my Lord, sit on my right hand till I make thine enemies thy foot stool.

37. దావీదు ఆయనను ప్రభువని చెప్పుచున్నాడే, ఆయన ఏలాగు అతని కుమారుడగునని అడిగెను. సామాన్యజనులు ఆయన మాటలు సంతోషముతో వినుచుండిరి.

37. Then David himself calleth him Lord, and by what means is he then his son? And much people heard him gladly.

38. మరియు ఆయన వారికి బోధించుచు నిట్లనెను శాస్త్రులను గూర్చి జాగ్రత్తపడుడి. వారు నిలువుటంగీలు ధరించుకొని తిరుగుటను, సంతవీధులలో వందనములను

38. And he said unto(taught) them in his doctrine: beware of the scribes which love to go in long, clothing: and love salutations in the market places,

39. సమాజమందిరములలో అగ్రపీఠములను, విందులలో అగ్రస్థానములను కోరుచు

39. and the chief seats in the synagogues, and to sit in the uppermost rooms at feasts,

40. విధవరాండ్ర యిండ్లు దిగమింగుచు, మాయవేషముగా దీర్ఘప్రార్థనలు చేయుదురు. వీరు మరి విశేషముగా శిక్ష పొందుదురనెను.

40. and devour widows' houses, and (that) under a colour pray long prayers.(of long praying.) These shall have(receive) greater damnation.

41. ఆయన కానుకపెట్టె యెదుట కూర్చుండి, జనసమూహము ఆ కానుకపెట్టెలో డబ్బులు వేయుట చూచుచుండెను. ధనవంతులైన వారనేకులు అందులో విశేషముగా సొమ్ము వేయుచుండిరి.
2 రాజులు 12:9

41. And Jesus sat over against the treasury, and beheld how the people put money into the treasury. And many that were rich, cast in much.

42. ఒక బీద విధవరాలు వచ్చి రెండు కాసులు వేయగా

42. And there came a certain poor widow, and she threw in two mites, which make a farthing.

43. ఆయన తన శిష్యులను పిలిచి కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటె ఈ బీద విధవరాలు ఎక్కువ వేసెనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.

43. And he called unto him his disciples, and said unto them: Verily I say unto you, that this poor widow hath cast more in, than all they which have cast into the treasury.

44. వారందరు తమకు కలిగిన సమృద్ధిలోనుండి వేసిరి గాని, యీమె తన లేమిలో తనకు కలిగినదంతయు, అనగా తన జీవనమంతయు వేసెనని చెప్పెను.

44. For they all put(did cast) in of their superfluity: But she of her poverty, (did) cast in all that she had, even all her living.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Mark - మార్కు సువార్త 12 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

ద్రాక్షతోట మరియు వ్యవసాయదారుల ఉపమానం. (1-12) 
ఉపమానాలలో, క్రీస్తు యూదు చర్చిని పక్కన పెట్టాలనే తన ఉద్దేశ్యాన్ని వివరించాడు. చర్చి యొక్క అధికారాలను ఆస్వాదించిన వారి నుండి దేవుని నమ్మకమైన పరిచారకులు చరిత్ర అంతటా అనుభవించిన దుర్వినియోగం గురించి ఆలోచించడం నిరుత్సాహపరుస్తుంది, కానీ సంబంధిత ఆధ్యాత్మిక ఫలాలను ఉత్పత్తి చేయడంలో విఫలమైంది. చివరికి, దేవుడు తన ప్రియమైన కుమారుడిని పంపాడు మరియు తమ యజమానిని ప్రేమించే వారు ఆయనను కుమారుడు మరియు వారసుడిగా పరిగణించి, ఆయనను గౌరవిస్తారు మరియు ప్రేమిస్తారని సహేతుకంగా ఆశించవచ్చు. అయినప్పటికీ, వారు గౌరవం మరియు ప్రేమను చూపించడానికి బదులుగా, ఆయనను ద్వేషించడాన్ని ఎంచుకున్నారు. అయినప్పటికీ, క్రీస్తు యొక్క ఔన్నత్యాన్ని ప్రభువు స్వయంగా నిర్వహించాడు. మన హృదయాలలో క్రీస్తును ఉన్నతీకరించడం మరియు అక్కడ ఆయన సింహాసనాన్ని స్థాపించడం కూడా ఆయన పని. ఈ పరివర్తన సంభవించినట్లయితే, అది నిస్సందేహంగా ఒక అద్భుత దృశ్యం అవుతుంది. లేఖనాలు, అంకితమైన బోధకులు మరియు క్రీస్తు అవతారం అన్నీ మన చర్యల ద్వారా దేవునికి సరైన స్తుతిని అందించమని మనల్ని ప్రోత్సహిస్తాయి. పాపులు గర్వించదగిన మరియు ప్రాపంచిక వైఖరిని అవలంబించడంలో జాగ్రత్తగా ఉండాలి. వారు క్రీస్తు దూతలను దూషించినా లేదా చిన్నచూపు చూసినా, వారు భూమిపై జీవించి ఉన్నట్లయితే వారు తమ యజమానికి కూడా అలాగే చేసి ఉండేవారు.

నివాళి గురించి ప్రశ్న. (13-17) 
క్రీస్తు యొక్క విరోధులు తమ బాధ్యతల గురించి విచారించడానికి ఆసక్తిగా ఉన్నట్లు అనిపించింది, కానీ వారి నిజమైన ఉద్దేశ్యం ఆయనను ట్రాప్ చేయడమే, అతను ఎంచుకున్న సమస్య ఏ వైపున ఉన్నా, వారు అతనిని నిందించడానికి ఒక మార్గాన్ని కనుగొనగలరని ఊహించారు. ప్రాపంచిక రాజకీయాల గురించి చర్చలలో క్రీస్తు అనుచరులను నిమగ్నం చేయడం వారిని చిక్కుల్లో పెట్టడానికి ఒక శక్తివంతమైన మార్గం. తమ దేశం ఇప్పటికే చూపించిన సమర్పణపై వారి దృష్టిని మళ్లించడం ద్వారా యేసు ఈ ఉచ్చును నేర్పుగా తప్పించుకున్నాడు. అతని స్పందన విన్న వారందరూ అది తెలియజేసిన ప్రగాఢ జ్ఞానానికి ఆశ్చర్యపోయారు. చాలా మంది ఉపన్యాసం యొక్క పదాల వాగ్ధాటిని మెచ్చుకోవచ్చు, అయినప్పటికీ వారు తమ చర్యలకు మార్గదర్శకత్వం వహించడానికి దాని బోధనలను అనుమతించకపోవచ్చు.

పునరుత్థానం గురించి. (18-27) 
వెల్లడి చేయబడిన అన్ని మతాలకు మూలాధారంగా మరియు మూలాధారంగా పనిచేసే స్క్రిప్చర్‌పై మంచి అవగాహన కలిగి ఉండటం, తప్పులో పడకుండా అత్యంత ప్రభావవంతమైన రక్షణగా చెప్పవచ్చు. మరణానంతర జీవిత సిద్ధాంతాన్ని స్పష్టం చేయడం ద్వారా, వారి కాలంలోని సందేహాస్పద అవిశ్వాసులైన సద్దూకయ్యుల అభ్యంతరాలను యేసు సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. భార్యాభర్తల మధ్య భూసంబంధమైన సంబంధం, ఈడెన్ గార్డెన్‌లో స్థాపించబడినప్పటికీ, పరలోక రాజ్యంలో కొనసాగదు. భౌతిక రాజ్యం యొక్క వ్యవహారాల ఆధారంగా ఆధ్యాత్మిక ప్రపంచం గురించి మన అవగాహనలను రూపొందించడానికి ప్రయత్నించినప్పుడు మనం మూర్ఖపు అపోహలతో దారి తీయడంలో ఆశ్చర్యం లేదు.
ఒక వ్యక్తి శాశ్వతంగా నిర్జీవంగా ఉండవలసి వస్తే, సజీవుడైన దేవుడు అతని ఆనందానికి మూలం కాగలడని భావించడం అశాస్త్రీయం. కాబట్టి, శరీరం నుండి తాత్కాలికంగా విడిపోయినప్పటికీ, అబ్రహం యొక్క ఆత్మ ఉనికిలో ఉంది మరియు పని చేస్తూనే ఉంటుంది. పునరుత్థానం యొక్క భావనను తిరస్కరించే వారు గణనీయమైన తప్పులో ఉన్నారు మరియు సరిదిద్దాలి. శాశ్వతమైన ఆనందం మరియు అద్భుతమైన పునరుత్థానం యొక్క ఆశాజనకమైన నిరీక్షణతో ఈ అశాశ్వతమైన ప్రపంచంలో నావిగేట్ చేయడానికి మనం ప్రయత్నిద్దాం.

చట్టం యొక్క గొప్ప ఆదేశం. (28-34) 
తమ బాధ్యతలను అర్థం చేసుకోవడానికి శ్రద్ధగా కోరుకునే వారు వివేచనలో తమ మార్గదర్శిగా మరియు సరైన మార్గంలో తమ బోధకునిగా క్రీస్తును కనుగొంటారు. ఇతరులందరినీ కలుపుకొని, దేవుని పట్ల పూర్ణహృదయంతో కూడిన ప్రేమకు పిలుపునిచ్చే పరమాత్మకమైన ఆజ్ఞ అని అతను లేఖకుడికి తెలియజేసాడు. ఈ ప్రేమ ఆత్మలో పాలించినప్పుడు, అది సహజంగానే ప్రతి ఇతర కర్తవ్యాన్ని నెరవేర్చడానికి మొగ్గు చూపుతుంది. దేవునిపట్ల పూర్ణహృదయపూర్వకమైన ప్రేమ, ఆయనను సంతోషపెట్టే ప్రతిదానిలో నిమగ్నమయ్యేలా మనల్ని పురికొల్పుతుంది.
బలి అర్పణలు నైతిక చట్టానికి వ్యతిరేకంగా జరిగిన అతిక్రమణలకు ప్రాయశ్చిత్తానికి ప్రతీకగా పనిచేశాయి. వాగ్దానం చేయబడిన రక్షకునిపై నిజమైన పశ్చాత్తాపం మరియు విశ్వాసం వ్యక్తం చేయడంపై వారి సమర్థత ఆధారపడి ఉంటుంది, చివరికి నైతిక విధేయతకు దారితీసింది. ఈ పద్ధతిలో దేవుణ్ణి మరియు మన తోటి జీవులను ప్రేమించడంలో వైఫల్యం కారణంగా, దానికి విరుద్ధంగా, మనం పాపులుగా ఖండించబడ్డాము. మాకు పశ్చాత్తాపం మరియు దయ అవసరం.
క్రీస్తు లేఖరి ప్రకటనను ఆమోదించాడు మరియు ప్రోత్సాహాన్ని అందించాడు. మరింత ఆధ్యాత్మిక ఎదుగుదల కోసం లేఖకుడు సరైన మార్గంలో ఉన్నాడు. ధర్మశాస్త్రాన్ని అర్థం చేసుకోవడం పాపం, పశ్చాత్తాపం, దయ కోసం మన అవసరాన్ని గుర్తించడం మరియు క్రీస్తు ద్వారా సమర్థించబడే మార్గాన్ని అర్థం చేసుకోవడం గురించి లోతైన అవగాహనకు దారితీస్తుంది.

క్రీస్తు కుమారుడు మరియు ఇంకా డేవిడ్ ప్రభువు. (35-40) 
క్రీస్తు యొక్క గుర్తింపు మరియు పాత్రల గురించిన లేఖనాధార బోధనలకు మనం శ్రద్ధ చూపినప్పుడు, ఆయనను మన ప్రభువుగా మరియు దేవుడిగా గుర్తించి, మన ఉన్నతమైన విమోచకునిగా ఆయన నాయకత్వాన్ని అనుసరించడానికి మనం ఒత్తిడి చేయబడతాము. విద్యావంతులు మరియు ప్రముఖులు వాటిని వ్యతిరేకించినప్పటికీ, సాధారణ ప్రజలు ఈ సత్యాలను ఆనందంతో స్వీకరిస్తే, ఆనందాన్ని పొందేది సామాన్య ప్రజలే, ఇతరులు మన కరుణను పొందాలి. పాపం, దైవభక్తి యొక్క ముఖభాగంలో కప్పబడినప్పుడు, రెండు రెట్లు అతిక్రమణను ఏర్పరుస్తుంది మరియు దాని తీర్పు ఫలితంగా మరింత తీవ్రంగా ఉంటుంది.

పేద వితంతువు మెచ్చుకుంది. (41-44)
యేసు ఖజానాను గమనిస్తూనే ఉన్నాడని, ఇచ్చిన పరిమాణం మరియు అతని కారణానికి సహకరిస్తున్న వారి యొక్క అంతర్లీన ప్రేరణల గురించి పూర్తిగా తెలుసునని మనం గుర్తుంచుకోండి. అతను హృదయ సంకల్పాలను పరిశీలిస్తాడు, భిక్షను సమర్పించేటప్పుడు మన వైఖరిని అంచనా వేస్తాడు, మనం దానిని ప్రభువు కొరకు హృదయపూర్వకంగా చేస్తున్నామా లేదా ఇతరుల ముందు నీతిమంతులుగా కనిపించడం కోసమే. ఈ వితంతువు చర్యలను విమర్శించని వ్యక్తిని ఎదుర్కోవడం చాలా అరుదైన విషయం అయినప్పటికీ, ఆమెను అనుకరించే అనేక మందిని మనం కనుగొనలేము. అయినప్పటికీ, మన రక్షకుడు ఆమెను మెచ్చుకుంటూ, ఆమె తెలివిగా మరియు ధర్మబద్ధంగా ప్రవర్తించిందని ధృవీకరిస్తున్నాడు. అవిశ్వాసుల గొప్ప హావభావాలు ధిక్కారానికి గురైన రోజున తమ రక్షకుని గౌరవించటానికి తక్కువ అదృష్టవంతులు చేసే నిరాడంబరమైన ప్రయత్నాలు కూడా ప్రశంసించబడతాయి.



Shortcut Links
మార్కు - Mark : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |