Mark - మార్కు సువార్త 9 | View All

1. మరియు ఆయన ఇక్కడ నిలిచియున్న వారిలో కొందరు దేవునిరాజ్యము బలముతో వచ్చుట చూచువరకు మరణము రుచిచూడరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాననెను.

1. And he said to them, 'I tell you the truth, some who are standing here will not taste death before they see the kingdom of God come with power.'

2. ఆరుదినములైన తరువాత, యేసు పేతురును యాకోబును యోహానును మాత్రము వెంటబెట్టుకొని, యెత్తయిన యొక కొండమీదికి ఏకాంతముగా వారిని తోడుకొనిపోయి, వారియెదుట రూపాంతరము పొందెను.

2. After six days Jesus took Peter, James and John with him and led them up a high mountain, where they were all alone. There he was transfigured before them.

3. అంతలో ఆయన వస్త్రములు ప్రకాశమానమైనవియు మిగుల తెల్లనివియు ఆయెను; లోకమందు ఏ చాకలియును అంత తెల్లగా చలువచేయలేడు.

3. His clothes became dazzling white, whiter than anyone in the world could bleach them.

4. మరియమోషేయు ఏలీయాయు వారికి కనబడి యేసుతో మాటలాడుచుండిరి.

4. And there appeared before them Elijah and Moses, who were talking with Jesus.

5. అప్పుడు పేతురు బోధకుడా, మనమిక్కడ ఉండుట మంచిది; మేము నీకు ఒకటియు మోషేకు ఒకటియు ఏలీయాకు ఒకటియు మూడు పర్ణశాలలు కట్టుదుమని చెప్పెను;

5. Peter said to Jesus, 'Rabbi, it is good for us to be here. Let us put up three shelters--one for you, one for Moses and one for Elijah.'

6. వారు మిగుల భయపడిరి గనుక తాను చెప్పవలసినదేమో అతనికి తెలియలేదు.

6. (He did not know what to say, they were so frightened.)

7. మేఘమొకటి వచ్చి వారిని కమ్మగా ఈయన నా ప్రియకుమారుడు, ఈయన మాట వినుడని యొక శబ్దము ఆ మేఘములోనుండి పుట్టెను.
ద్వితీయోపదేశకాండము 18:15, కీర్తనల గ్రంథము 2:7

7. Then a cloud appeared and enveloped them, and a voice came from the cloud: 'This is my Son, whom I love. Listen to him!'

8. వెంటనే వారు చుట్టు చూచినప్పుడు, తమ యొద్దనున్న యేసు తప్ప మరి ఎవరును వారికి కనబడలేదు.

8. Suddenly, when they looked round, they no longer saw anyone with them except Jesus.

9. వారు ఆ కొండ దిగి వచ్చుచుండగా మనుష్య కుమారుడు మృతులలోనుండి లేచినప్పుడే గాని, అంతకు ముందు మీరు చూచినవాటిని ఎవనితోను చెప్పవద్దని ఆయన వారికి ఆజ్ఞాపించెను.

9. As they were coming down the mountain, Jesus gave them orders not to tell anyone what they had seen until the Son of Man had risen from the dead.

10. మృతులలోనుండి లేచుట అనగా ఏమిటో అని వారొకనితో ఒకడు తర్కించుచు ఆ మాట మనస్సున ఉంచుకొనిరి.

10. They kept the matter to themselves, discussing what 'rising from the dead' meant.

11. వారు ఏలీయా ముందుగా రావలెనని శాస్త్రులు చెప్పుచున్నారే, యిదేమని ఆయన నడిగిరి.

11. And they asked him, 'Why do the teachers of the law say that Elijah must come first?'

12. అందుకాయన ఏలీయా ముందుగా వచ్చి సమస్తమును చక్కపెట్టునను మాట నిజమే; అయినను మనుష్యకుమారుడు అనేక శ్రమలుపడి, తృణీకరింపబడవలెనని వ్రాయబడుట ఏమి?
కీర్తనల గ్రంథము 22:1-18, యెషయా 53:3, మలాకీ 4:5

12. Jesus replied, 'To be sure, Elijah does come first, and restores all things. Why then is it written that the Son of Man must suffer much and be rejected?

13. ఏలీయా వచ్చెననియు అతనిగూర్చి వ్రాయబడిన ప్రకారము వారు తమకిష్టము వచ్చినట్టు అతనియెడల చేసిరనియు మీతో చెప్పుచున్నానని వారితో అనెను.

13. But I tell you, Elijah has come, and they have done to him everything they wished, just as it is written about him.'

14. వారు శిష్యులయొద్దకు వచ్చి, వారి చుట్టు బహు జనులు కూడియుండుటయు శాస్త్రులు వారితో తర్కించుటయు చూచిరి.

14. When they came to the other disciples, they saw a large crowd around them and the teachers of the law arguing with them.

15. వెంటనే జనసమూహమంతయు ఆయనను చూచి, మిగుల విభ్రాంతినొంది ఆయనయొద్దకు పరుగెత్తి కొనివచ్చి ఆయనకు వందనముచేసిరి.

15. As soon as all the people saw Jesus, they were overwhelmed with wonder and ran to greet him.

16. అప్పుడాయనమీరు దేనిగూర్చి వారితో తర్కించుచున్నారని వారినడుగగా

16. 'What are you arguing with them about?' he asked.

17. జనసమూహములో ఒకడుబోధకుడా, మూగదయ్యము పట్టిన నా కుమారుని నీయొద్దకు తీసికొని వచ్చితిని;

17. A man in the crowd answered, 'Teacher, I brought you my son, who is possessed by a spirit that has robbed him of speech.

18. అది ఎక్కడ వానిని పట్టునో అక్కడ వానిని పడద్రోయును; అప్పుడు వాడు నురుగు కార్చుకొని, పండ్లు కొరుకుకొని మూర్ఛిల్లును; దానిని వెళ్లగొట్టుడని నీ శిష్యులను అడిగితిని గాని అది వారిచేత కాలేదని ఆయనతో చెప్పెను.

18. Whenever it seizes him, it throws him to the ground. He foams at the mouth, gnashes his teeth and becomes rigid. I asked your disciples to drive out the spirit, but they could not.'

19. అందుకాయన విశ్వాసములేని తరమువారలారా, నేను ఎంతకాలము మీతో నుందును? ఎంతవరకు మిమ్మును సహింతును? వానిని నాయొద్దకు తీసికొని రండని వారితో చెప్పగా

19. 'O unbelieving generation,' Jesus replied, 'how long shall I stay with you? How long shall I put up with you? Bring the boy to me.'

20. వారాయనయొద్దకు వానిని తీసికొని వచ్చిరి. దయ్యము ఆయనను చూడగానే, వాని విలవిల లాడించెను గనుక వాడు నేలపడి నురుగు కార్చుకొనుచు పొర్లాడుచుండెను.

20. So they brought him. When the spirit saw Jesus, it immediately threw the boy into a convulsion. He fell to the ground and rolled around, foaming at the mouth.

21. అప్పుడాయన ఇది వీనికి సంభవించి యెంతకాలమైనదని వాని తండ్రినడుగగా అతడు బాల్యమునుండియే;

21. Jesus asked the boy's father, 'How long has he been like this?' 'From childhood,' he answered.

22. అది వాని నాశనము చేయవలెనని తరచుగా అగ్నిలోను నీళ్లలోను పడద్రోయును. ఏమైనను నీవలననైతే మామీద కనికరపడి మాకు సహాయము చేయుమనెను.

22. 'It has often thrown him into fire or water to kill him. But if you can do anything, take pity on us and help us.'

23. అందుకు యేసు (నమ్ముట) నీవలననైతే, నమ్మువానికి సమస్తమును సాధ్యమేయని అతనితో చెప్పెను.

23. '`If you can'?' said Jesus. 'Everything is possible for him who believes.'

24. వెంటనే ఆ చిన్నవాని తండ్రినమ్ముచున్నాను, నాకు అపనమ్మకముండకుండ సహాయము చేయుమని బిగ్గరగా చెప్పెను.

24. Immediately the boy's father exclaimed, 'I do believe; help me overcome my unbelief!'

25. జనులు గుంపుకూడి తనయొద్దకు పరు గెత్తికొనివచ్చుట యేసు చూచి మూగవైన చెవిటి దయ్యమా, వానిని వదిలిపొమ్ము, ఇక వానిలోప్రవేశింపవద్దని నీకు ఆజ్ఞాపించుచున్నానని చెప్పి ఆ అపవిత్రాత్మను గద్దించెను.

25. When Jesus saw that a crowd was running to the scene, he rebuked the evil spirit. 'You deaf and mute spirit,' he said, 'I command you, come out of him and never enter him again.'

26. అప్పుడు అది కేకవేసి, వానినెంతో విలవిల లాడించి వదలిపోయెను. అంతట వాడు చచ్చినవానివలె ఉండెను గనుక అనేకులువాడు చనిపోయెననిరి.

26. The spirit shrieked, convulsed him violently and came out. The boy looked so much like a corpse that many said, 'He's dead.'

27. అయితే యేసు వాని చెయ్యి పట్టివాని లేవనెత్తగా వాడు నిలువబడెను.

27. But Jesus took him by the hand and lifted him to his feet, and he stood up.

28. ఆయన ఇంటిలోనికి వెళ్లిన తరువాత ఆయన శిష్యులుమే మెందుకు ఆ దయ్యమును వెళ్లగొట్టలేక పోతిమని ఏకాంతమున ఆయన నడిగిరి.

28. After Jesus had gone indoors, his disciples asked him privately, 'Why couldn't we drive it out?'

29. అందుకాయన ప్రార్థనవలననే గాని మరి దేనివలననైనను ఈ విధమైనది వదలిపోవుట అసాధ్యమని వారితో చెప్పెను.

29. He replied, 'This kind can come out only by prayer.'

30. వారక్కడనుండి బయలుదేరి గలిలయ గుండా వెళ్లుచుండిరి; అది ఎవనికిని తెలియుట ఆయనకిష్టములేక పోయెను;

30. They left that place and passed through Galilee. Jesus did not want anyone to know where they were,

31. ఏలయనగా ఆయన తన శిష్యులకు బోధించుచు మనుష్యకుమారుడు మనుష్యుల చేతికి అప్పగింపబడుచున్నాడు, వారాయనను చంపెదరు; చంపబడిన మూడు దినములకు ఆయన లేచునని వారితో చెప్పెను.

31. because he was teaching his disciples. He said to them, 'The Son of Man is going to be betrayed into the hands of men. They will kill him, and after three days he will rise.'

32. వారు ఆ మాట గ్రహింపలేదు గాని ఆయన నడుగ భయపడిరి.

32. But they did not understand what he meant and were afraid to ask him about it.

33. అంతట వారు కపెర్నహూమునకు వచ్చిరి. వారు ఎవడు గొప్పవాడని మార్గమున ఒకనితో ఒకడు వాదించిరి గనుక

33. They came to Capernaum. When he was in the house, he asked them, 'What were you arguing about on the road?'

34. ఆయన ఇంట ఉన్నప్పుడు మార్గమున మీరు ఒకరితో ఒకరు దేనినిగూర్చి వాదించుచుంటిరని వారినడుగగా

34. But they kept quiet because on the way they had argued about who was the greatest.

35. వారు ఊరకుండిరి. అప్పుడాయన కూర్చుండి పండ్రెండుమందిని పిలిచిఎవడైనను మొదటి వాడైయుండ గోరినయెడల, వాడందరిలో కడపటివాడును అందరికి పరిచారకుడునై యుండవలెనని చెప్పి

35. Sitting down, Jesus called the Twelve and said, 'If anyone wants to be first, he must be the very last, and the servant of all.'

36. యొక చిన్న బిడ్డను తీసికొని వారి మధ్యను నిలువబెట్టి, వానిని ఎత్తి కౌగిలించుకొని

36. He took a little child and had him stand among them. Taking him in his arms, he said to them,

37. ఇట్టి చిన్న బిడ్డలలో ఒకనిని నా పేరట చేర్చుకొనువాడు నన్ను చేర్చుకొనును; నన్ను చేర్చుకొనువాడు నన్ను గాక నన్ను పంపినవానిని చేర్చుకొనునని వారితో చెప్పెను.

37. 'Whoever welcomes one of these little children in my name welcomes me; and whoever welcomes me does not welcome me but the one who sent me.'

38. అంతట యోహాను బోధకుడా, ఒకడు నీ పేరట దయ్యములను వెళ్లగొట్టుట చూచితివిు; వాడు మనలను వెంబడించువాడు కాడు గనుక వానిని ఆటంకపరచితిమని చెప్పెను.

38. 'Teacher,' said John, 'we saw a man driving out demons in your name and we told him to stop, because he was not one of us.'

39. అందుకు యేసువానిని ఆటంకపరచకుడి; నాపేరట అద్భుతము చేసి నన్ను చులకనగా నిందింపగల వాడెవడును లేడు;

39. 'Do not stop him,' Jesus said. 'No-one who does a miracle in my name can in the next moment say anything bad about me,

40. మనకు విరోధికానివాడు మన పక్షముగా నున్నవాడే.

40. for whoever is not against us is for us.

41. మీరు క్రీస్తువారని నా పేరట మీకు గిన్నెడు నీళ్లు త్రాగనిచ్చువాడు, తనకు రావలసిన ఫలము పోగొట్టుకొనడని మీతోనిశ్చయముగా చెప్పుచున్నాను.

41. I tell you the truth, anyone who gives you a cup of water in my name because you belong to Christ will certainly not lose his reward.

42. నాయందు విశ్వాసముంచు ఈ చిన్నవారిలో నొకని అభ్యంతరపరచువాడెవడో, వాడు మెడకు పెద్ద తిరుగటిరాయి కట్టబడి సముద్రములో పడవేయబడుట వానికి మేలు.

42. 'And if anyone causes one of these little ones who believe in me to sin, it would be better for him to be thrown into the sea with a large millstone tied around his neck.

43. నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరచిన యెడల దానిని నరికివేయుము;

43. If your hand causes you to sin, cut it off. It is better for you to enter life maimed than with two hands to go into hell, where the fire never goes out.

44. నీవు రెండు చేతులు కలిగి నరకములోని ఆరని అగ్నిలోనికి పోవుటకంటె అంగహీనుడవై జీవములో ప్రవేశించుట మేలు.

44.

45. నీ పాదము నిన్ను అభ్యంతరపరచినయెడల దానిని నరికివేయుము;

45. And if your foot causes you to sin, cut it off. It is better for you to enter life crippled than to have two feet and be thrown into hell.

46. రెండు పాదములు కలిగి నరకములో పడవేయబడుటకంటె, కుంటివాడవై (నిత్య) జీవములో ప్రవేశించుటమేలు.

46.

47. నీకన్ను నిన్ను అభ్యంతరపరచినయెడల దాని తీసిపార వేయుము; రెండు కన్నులు కలిగి నరకములో పడవేయబడుటకంటె ఒంటికన్ను గలవాడవై దేవుని రాజ్యములో ప్రవేశించుట మేలు.

47. And if your eye causes you to sin, pluck it out. It is better for you to enter the kingdom of God with one eye than to have two eyes and be thrown into hell,

48. నరకమున వారి పురుగు చావదు;అగ్ని ఆరదు.
యెషయా 66:24

48. where '`their worm does not die, and the fire is not quenched.'

49. ప్రతివానికి ఉప్పుసారము అగ్నివలన కలుగును.

49. Everyone will be salted with fire.

50. ఉప్పు మంచిదేగాని ఉప్పు నిస్సారమైన యెడల దేనివలన మీరు దానికి సారము కలుగుజేతురు? మీలో మీరు ఉప్పుసారము గలవారై యుండి యొకరితో ఒకరు సమాధానముగా ఉండుడని చెప్పెను.

50. 'Salt is good, but if it loses its saltiness, how can you make it salty again? Have salt in yourselves, and be at peace with each other.'



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Mark - మార్కు సువార్త 9 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

రూపాంతరము. (1-13) 
క్రీస్తు రాజ్యం యొక్క ఆసన్న రాక గురించి ఇక్కడ ఒక సూచన ఉంది. క్రీస్తు రూపాంతరం సమయంలో ఆ రాజ్యం యొక్క సంగ్రహావలోకనం వెల్లడైంది. ప్రాపంచిక ఆందోళనల నుండి విడిచిపెట్టి, క్రీస్తుతో ఒంటరిగా గడపడం నిజంగా అద్భుతమైనది మరియు పరిశుద్ధులందరితో పాటు పరలోకంలో మహిమపరచబడిన క్రీస్తుతో కలిసి ఉండటం మరింత అద్భుతమైనది. అయినప్పటికీ, మనం తృప్తి స్థితిలో ఉన్నప్పుడు, మనం తరచుగా మన తోటి జీవుల అవసరాలను పట్టించుకోకుండా ఉంటాము. దేవుడు యేసును గుర్తించి, ఆయనను తన ప్రియ కుమారునిగా స్వాగతించాడు, ఆయన ద్వారా మనలను స్వాగతించడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి, మనం ఆయనను మన ప్రియమైన రక్షకునిగా గుర్తించి ఆలింగనం చేసుకోవాలి మరియు ఆయన మార్గదర్శకత్వానికి మనల్ని మనం అప్పగించుకోవాలి. ఆనందం మరియు ఓదార్పు దూరం అనిపించినప్పుడు కూడా క్రీస్తు ఆత్మతో ఉంటాడు. యేసు తన శిష్యులకు ఎలిజా గురించిన ప్రవచనం యొక్క వివరణను కూడా అందించాడు, ఇది జాన్ ది బాప్టిస్ట్ యొక్క దుర్వినియోగానికి సంబంధించినది.

ఒక దుష్టాత్మ తరిమివేయబడింది. (14-29) 
బాధపడుతున్న యువకుడి తండ్రి శిష్యుల శక్తి లేకపోవడాన్ని గురించి ఆలోచించాడు, కాని వారి విశ్వాసం లేకపోవడమే నిరాశకు కారణమని యేసు కోరుకున్నాడు. విశ్వసించిన వారికి చాలా వాగ్దానం చేయబడింది. మీరు విశ్వాసాన్ని కలిగి ఉండగలిగితే, మీ గట్టిపడిన హృదయాన్ని మృదువుగా చేసే అవకాశం ఉంది, మీ ఆధ్యాత్మిక రుగ్మతలను నయం చేయవచ్చు మరియు మీ బలహీనత ఉన్నప్పటికీ, మీరు చివరి వరకు పట్టుదలతో ఉండవచ్చు. అవిశ్వాసంతో పోరాడే వారు దానిని అధిగమించడానికి అవసరమైన కృప కోసం క్రీస్తు వైపు తిరగాలి మరియు అతని దయ సరిపోతుంది. క్రీస్తు స్వస్థత చేసినప్పుడు, అతను పూర్తిగా చేస్తాడు. అయినప్పటికీ, సాతాను చాలాకాలంగా తన ఆధీనంలో ఉన్నవారిని విడుదల చేయడానికి ఇష్టపడడు, మరియు అతను పాపిని మోసగించలేనప్పుడు లేదా నాశనం చేయలేనప్పుడు, అతను వీలైనంత ఎక్కువ భయాన్ని కలిగిస్తాడు. శిష్యులు అర్థం చేసుకోవాలి, అన్ని పనులు ఒకే విధంగా సులభంగా సాధించబడవు; కొన్ని బాధ్యతలు సాధారణ ప్రయత్నం కంటే ఎక్కువ డిమాండ్ చేస్తాయి.

అపొస్తలులు మందలించారు. (30-40) 
క్రీస్తు రాబోయే బాధల సమయం ఆసన్నమైంది. ఆయనను ఈ విధంగా ప్రవర్తించిన రాక్షసులకు అప్పగిస్తే ఆశ్చర్యం కలుగక మానదు, కానీ తమను రక్షించడానికి వచ్చిన మనుష్యకుమారుని ప్రజలు అవమానకరంగా ప్రవర్తించడం నిజంగా విశేషమైనది. క్రీస్తు తన మరణం గురించి మాట్లాడినప్పుడల్లా, అతను తన పునరుత్థానాన్ని కూడా ప్రస్తావించాడు, తద్వారా తన నుండి అవమానాన్ని తొలగించాడు మరియు అతని శిష్యుల దుఃఖాన్ని తగ్గించాడు. అవగాహన కోసం చాలా ఇబ్బంది పడుతున్నందున చాలామందికి సమాచారం లేదు. రక్షకుడు తన ప్రేమ మరియు కృపకు సంబంధించిన విషయాల గురించి స్పష్టంగా బోధిస్తున్నప్పుడు, ప్రజలు అతని బోధలను అర్థం చేసుకోవడంలో విఫలమయ్యేంతగా గ్రుడ్డితనం కలిగి ఉండటం నిరుత్సాహపరుస్తుంది. మన సంభాషణలు మరియు చర్చలకు, ముఖ్యంగా ఇతరులపై ఆధిపత్యానికి సంబంధించిన వాటికి మేము జవాబుదారీగా ఉంటాము. అత్యంత వినయం మరియు స్వీయ-తిరస్కరణను ప్రదర్శించే వారు క్రీస్తును చాలా దగ్గరగా పోలి ఉంటారు మరియు అతని వెచ్చని గుర్తింపును పొందుతారు. యేసు ఒక సంకేతం ద్వారా వారికి ఈ సందేశాన్ని తెలియజేశాడు: "ఈ బిడ్డ వంటి వ్యక్తిని స్వీకరించేవాడు నన్ను స్వీకరిస్తాడు." అనేకమంది, శిష్యులవలె, క్రీస్తు నామంలో పశ్చాత్తాపాన్ని విజయవంతంగా బోధించేవారిని త్వరగా నిశ్శబ్దం చేస్తారు, ఎందుకంటే వారు అనుసరించరు. మన ప్రభువు అపొస్తలులను మందలించాడు, అతని పేరు మీద అద్భుతాలు చేసిన వ్యక్తి తన కారణానికి హాని కలిగించలేడని వారికి గుర్తు చేశాడు. పాపులు పశ్చాత్తాపపడేలా, రక్షకునిపై విశ్వాసం ఉంచి, నిగ్రహం, నీతి మరియు దైవభక్తితో కూడిన జీవితాలను నడిపించినప్పుడు, ప్రభువు బోధకుని ద్వారా పని చేస్తున్నాడని స్పష్టమవుతుంది.

పాపానికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన నొప్పి. (41-50)
దుర్మార్గులు తరచుగా "వారి పురుగు చావదు" మరియు "అగ్ని ఎప్పుడూ చల్లారదు" అని వర్ణించబడతారు. నిస్సందేహంగా, ఈ ఎడతెగని పురుగు మనస్సాక్షి యొక్క పశ్చాత్తాపాన్ని మరియు స్వీయ ప్రతిబింబం యొక్క పదునైన బాధలను సూచిస్తుంది. నిస్సందేహంగా, క్లుప్త క్షణాలు ప్రాపంచిక సుఖాలలో మునిగి శాశ్వతమైన దుఃఖాన్ని అనుభవించడం కంటే, ఈ జీవితంలో ఎలాంటి బాధను, కష్టాలను మరియు ఆత్మనిరాకరణను భరించడం మరియు ఇకపై శాశ్వతమైన ఆనందాన్ని పొందడం చాలా ఉత్తమం. ఉప్పుతో త్యాగాలు ఎలా భద్రపరచబడతాయో, అలాగే మనం కూడా కృప యొక్క ఉప్పుతో మసాలా చేయాలి. పరిశుద్ధాత్మ మన అవినీతి కోరికలను అణచివేయాలి మరియు పాడుచేయాలి. ఉప్పు యొక్క దయను కలిగి ఉన్నవారు తమ హృదయాలలో కృప యొక్క సజీవ సూత్రాన్ని కలిగి ఉన్నారని నిరూపించాలి, ఇది ఆత్మ నుండి భ్రష్టమైన వంపులను చురుకుగా ప్రక్షాళన చేస్తుంది, లేకపోతే దేవునికి లేదా మన స్వంత మనస్సాక్షికి అసంతృప్తి కలిగించే వంపులు.



Shortcut Links
మార్కు - Mark : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |