Luke - లూకా సువార్త 19 | View All
Study Bible (Beta)

1. ఆయన సంచరించుచు యెరికో పట్టణములో ప్రవేశించి

1. He came to Jericho and intended to pass through the town.

2. దానిగుండా పోవుచుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడునైన జక్కయ్య అను పేరుగల ఒకడు

2. Now a man there named Zacchaeus, who was a chief tax collector and also a wealthy man,

3. యేసు ఎవరోయని చూడగోరెనుగాని, పొట్టి వాడైనందున జనులు గుంపుకూడి యుండుట వలన చూడలేకపోయెను.

3. was seeking to see who Jesus was; but he could not see him because of the crowd, for he was short in stature.

4. అప్పుడు యేసు ఆ త్రోవను రానైయుండెను గనుక అతడు ముందుగా పరుగెత్తి, ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టెక్కెను.

4. So he ran ahead and climbed a sycamore tree in order to see Jesus, who was about to pass that way.

5. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు, కన్నులెత్తి చూచి జక్కయ్యా త్వరగా దిగుము, నేడు నేను నీ యింట నుండవలసియున్నదని అతనితో చెప్పగా

5. When he reached the place, Jesus looked up and said to him, 'Zacchaeus, come down quickly, for today I must stay at your house.'

6. అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను.

6. And he came down quickly and received him with joy.

7. అందరు అది చూచి ఈయన పాపియైన మనుష్యునియొద్ద బసచేయ వెళ్లెనని చాల సణుగుకొనిరి.

7. When they all saw this, they began to grumble, saying, 'He has gone to stay at the house of a sinner.'

8. జక్కయ్య నిలువబడి ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకిచ్చుచున్నాను; నేనెవనియొద్ద నైనను అన్యాయముగా దేనినైనను తీసికొనినయెడల అతనికి నాలుగంతలు మరల చెల్లింతునని ప్రభువుతో చెప్పెను.
నిర్గమకాండము 22:1

8. But Zacchaeus stood there and said to the Lord, 'Behold, half of my possessions, Lord, I shall give to the poor, and if I have extorted anything from anyone I shall repay it four times over.'

9. అందుకు యేసు ఇతడును అబ్రాహాము కుమారుడే; ఎందుకనగా నేడు ఈ యింటికి రక్షణ వచ్చియున్నది.

9. And Jesus said to him, 'Today salvation has come to this house because this man too is a descendant of Abraham.

10. నశించినదానిని వెదకి రక్షించుటకు మనుష్యకుమారుడు వచ్చెనని అతనితో చెప్పెను.
యెహెఙ్కేలు 34:16

10. For the Son of Man has come to seek and to save what was lost.'

11. వారు ఈ మాటలు వినుచుండగా తాను యెరూషలేమునకు సమీపమున ఉండుటవలనను, దేవుని రాజ్యము వెంటనే అగుపడునని వారు తలంచుటవలనను, ఆయన మరియొక ఉపమానము చెప్పెను. ఏమనగా,

11. While they were listening to him speak, he proceeded to tell a parable because he was near Jerusalem and they thought that the kingdom of God would appear there immediately.

12. రాజ కుమారుడొక రాజ్యము సంపాదించుకొని మరల రావలెనని దూరదేశమునకు ప్రయాణమై

12. So he said, 'A nobleman went off to a distant country to obtain the kingship for himself and then to return.

13. తన దాసులను పది మందిని పిలిచి వారికి పది మినాలనిచ్చి నేను వచ్చు వరకు వ్యాపారము చేయుడని వారితో చెప్పెను.

13. He called ten of his servants and gave them ten gold coins and told them, 'Engage in trade with these until I return.'

14. అయితే అతని పట్టణస్థులతని ద్వేషించి ఇతడు మమ్ము నేలుట మా కిష్టము లేదని అతని వెనుక రాయబారము పంపిరి.

14. His fellow citizens, however, despised him and sent a delegation after him to announce, 'We do not want this man to be our king.'

15. అతడా రాజ్యము సంపాదించుకొని తిరిగి వచ్చినప్పుడు, ప్రతివాడును వ్యాపారమువలన ఏమేమి సంపాదించెనో తెలిసికొనుటకై తాను సొమ్మిచ్చిన దాసులను తనయొద్దకు పిలువుమని ఆజ్ఞాపించెను.

15. But when he returned after obtaining the kingship, he had the servants called, to whom he had given the money, to learn what they had gained by trading.

16. మొదటివాడాయన యెదుటికి వచ్చి అయ్యా, నీ మినావలన పది మినాలు లభించెనని చెప్పగా

16. The first came forward and said, 'Sir, your gold coin has earned ten additional ones.'

17. అతడు భళా, మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి గనుక పది పట్టణముల మీద అధికారివై యుండుమని వానితో చెప్పెను.

17. He replied, 'Well done, good servant! You have been faithful in this very small matter; take charge of ten cities.'

18. అంతట రెండవవాడు వచ్చి అయ్యా, నీ మినావలన అయిదు మినాలు లభించెననగా

18. Then the second came and reported, 'Your gold coin, sir, has earned five more.'

19. అతడు నీవును అయిదు పట్టణములమీద ఉండుమని అతనితో చెప్పెను.

19. And to this servant too he said, 'You, take charge of five cities.'

20. అంతట మరియొకడు వచ్చి అయ్యా, యిదిగో నీ మినా;

20. Then the other servant came and said, 'Sir, here is your gold coin; I kept it stored away in a handkerchief,

21. నీవు పెట్టనిదానిని ఎత్తికొనువాడవును, విత్తనిదానిని కోయువాడవునైన కఠినుడవు గనుక, నీకు భయపడి దీనిని రుమాలున కట్టి ఉంచితినని చెప్పెను.

21. for I was afraid of you, because you are a demanding person; you take up what you did not lay down and you harvest what you did not plant.'

22. అందుకతడు - చెడ్డ దాసుడా, నీ నోటి మాటనుబట్టియే నీకు తీర్పు తీర్చుదును; నేను పెట్టనిదానిని ఎత్తువాడను, విత్తనిదానిని కోయువాడనునైన కఠినుడనని నీకు తెలిసియుండగా

22. He said to him, 'With your own words I shall condemn you, you wicked servant. You knew I was a demanding person, taking up what I did not lay down and harvesting what I did not plant;

23. నీవెందుకు నా సొమ్ము సాహుకారులయొద్ద నుంచలేదు? అట్లు చేసి యుండినయెడల నేను వచ్చి వడ్డితో దానిని తీసికొందునే అని వానితో చెప్పి

23. why did you not put my money in a bank? Then on my return I would have collected it with interest.'

24. వీనియొద్దనుండి ఆ మినా తీసివేసి పది మినాలు గలవాని కియ్యుడని దగ్గర నిలిచినవారితో చెప్పెను.

24. And to those standing by he said, 'Take the gold coin from him and give it to the servant who has ten.'

25. వారు అయ్యా, వానికి పది మినాలు కలవే అనిరి.

25. But they said to him, 'Sir, he has ten gold coins.'

26. అందుకతడు కలిగిన ప్రతివానికిని ఇయ్యబడును, లేనివానియొద్దనుండి వానికి కలిగినదియు తీసివేయబడునని మీతో చెప్పుచున్నాను.

26. 'I tell you, to everyone who has, more will be given, but from the one who has not, even what he has will be taken away.

27. మరియు నేను తమ్మును ఏలుటకు ఇష్టములేని నా శత్రువులను ఇక్కడికి తీసికొనివచ్చి నాయెదుట సంహరించుడని చెప్పెను.

27. Now as for those enemies of mine who did not want me as their king, bring them here and slay them before me.''

28. యేసు ఈ మాటలు చెప్పి యెరూషలేమునకు వెళ్లవలెనని ముందు సాగిపోయెను.

28. After he had said this, he proceeded on his journey up to Jerusalem.

29. ఆయన ఒలీవల కొండదగ్గరనున్న బేత్పగే బేతనియ అను గ్రామముల సమీపమునకు వచ్చినప్పుడు, తన శిష్యుల నిద్దరిని పిలిచి

29. As he drew near to Bethphage and Bethany at the place called the Mount of Olives, he sent two of his disciples.

30. మీరు ఎదుటనున్న గ్రామమునకు వెళ్లుడి; అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడియున్న ఒక గాడిదపిల్ల మీకు కనబడును; దానిమీద ఏ మనుష్యుడును ఎన్నడు కూర్చుండలేదు; దానిని విప్పి తోలుకొని రండి.

30. He said, 'Go into the village opposite you, and as you enter it you will find a colt tethered on which no one has ever sat. Untie it and bring it here.

31. ఎవరైనను మీరెందుకు దీని విప్పుచున్నారని మిమ్ము నడిగినయెడల ఇది ప్రభువునకు కావలసియున్నదని అతనితో చెప్పుడని చెప్పి వారిని పంపెను.

31. And if anyone should ask you, 'Why are you untying it?' you will answer, 'The Master has need of it.''

32. పంపబడిన వారు వెళ్లి, ఆయన తమతో చెప్పినట్టే కనుగొని

32. So those who had been sent went off and found everything just as he had told them.

33. ఆ గాడిదపిల్లను విప్పుచుండగా దాని యజమానులుమీరు, గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారని వారి నడిగిరి.

33. And as they were untying the colt, its owners said to them, 'Why are you untying this colt?'

34. అందుకు వారు ఇది ప్రభువునకు కావలసియున్నదనిరి.

34. They answered, 'The Master has need of it.'

35. తరువాత వారు యేసునొద్దకు దానిని తోలుకొని వచ్చి, ఆ గాడిదపిల్ల మీద తమ బట్టలువేసి, యేసును దానిమీద ఎక్కించి,

35. So they brought it to Jesus, threw their cloaks over the colt, and helped Jesus to mount.

36. ఆయన వెళ్లుచుండగా తమ బట్టలు దారిపొడుగున పరచిరి.
2 రాజులు 9:13

36. As he rode along, the people were spreading their cloaks on the road;

37. ఒలీవలకొండనుండి దిగుచోటికి ఆయన సమీపించుచున్నప్పుడు శిష్యుల సమూహమంతయు సంతోషించుచు

37. and now as he was approaching the slope of the Mount of Olives, the whole multitude of his disciples began to praise God aloud with joy for all the mighty deeds they had seen.

38. ప్రభువు పేరట వచ్చు రాజు స్తుతింపబడునుగాక పరలోకమందు సమాధానమును సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండునుగాక అని తాము చూచిన అద్భుతములన్నిటినిగూర్చి మహా శబ్దముతో దేవుని స్తోత్రము చేయసాగిరి.
కీర్తనల గ్రంథము 118:25-26

38. They proclaimed: 'Blessed is the king who comes in the name of the Lord. Peace in heaven and glory in the highest.'

39. ఆ సమూహములో ఉన్న కొందరు పరిసయ్యులు బోధకుడా, నీ శిష్యులను గద్దింపుమని ఆయనతో చెప్పగా

39. Some of the Pharisees in the crowd said to him, 'Teacher, rebuke your disciples.'

40. ఆయన వారిని చూచివీరు ఊరకుండినయెడల ఈ రాళ్లు కేకలు వేయునని మీతో చెప్పుచున్నాననెను.

40. He said in reply, 'I tell you, if they keep silent, the stones will cry out!'

41. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై యేడ్చి

41. As he drew near, he saw the city and wept over it,

42. నీవును ఈ నీ దినమందైనను సమాధానసంబంధమైన సంగతులను తెలిసికొనినయెడల నీకెంతో మేలు; గాని యిప్పుడవి నీ కన్నులకు మరుగు చేయబడియున్నవి.
ద్వితీయోపదేశకాండము 32:29, యెషయా 6:9-10

42. saying, 'If this day you only knew what makes for peace-- but now it is hidden from your eyes.

43. (ప్రభువు) నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగకుంటివి గనుక నీ శత్రువులు నీ చుట్టు గట్టు కట్టి ముట్టడివేసి, అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి, నీలోనున్న నీ పిల్లలతో కూడ నిన్ను నేల కలిపి

43. For the days are coming upon you when your enemies will raise a palisade against you; they will encircle you and hem you in on all sides.

44. నీలో రాతిమీద రాయి నిలిచియుండ నియ్యని దినములు వచ్చునని చెప్పెను.
కీర్తనల గ్రంథము 137:9

44. They will smash you to the ground and your children within you, and they will not leave one stone upon another within you because you did not recognize the time of your visitation.'

45. ఆయన దేవాలయములో ప్రవేశించి అందులో విక్రయము చేయువారితో నా మందిరము ప్రార్థన మందిరము అని వ్రాయబడియున్నది.

45. Then Jesus entered the temple area and proceeded to drive out those who were selling things,

46. అయితే మీరు దానిని దొంగల గుహగా చేసితిరని చెప్పి వారిని వెళ్లగొట్ట నారంభించెను.
యెషయా 56:7, యిర్మియా 7:11

46. saying to them, 'It is written, 'My house shall be a house of prayer, but you have made it a den of thieves.''

47. ఆయన ప్రతిదినమును దేవాలయములో బోధించుచున్నప్పుడు, ప్రధానయాజకులును శాస్త్రులును ప్రజలలో ప్రధానులును ఆయనను నాశనముచేయ జూచుచుండిరి గాని

47. And every day he was teaching in the temple area. The chief priests, the scribes, and the leaders of the people, meanwhile, were seeking to put him to death,

48. ప్రజలందరు ఆయన వాక్యమును వినుటకు ఆయనను హత్తుకొని యుండిరి గనుక ఏమి చేయవలెనో వారికి తోచలేదు.

48. but they could find no way to accomplish their purpose because all the people were hanging on his words.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Luke - లూకా సువార్త 19 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

జాకీయస్ యొక్క మార్పిడి. (1-10) 
క్రీస్తు యొక్క సంగ్రహావలోకనం కోసం యథార్థంగా ఆరాటపడే వారు, జాకీయస్ లాగా, అడ్డంకులను అధిగమించి, ఆయనను చూసే ప్రయత్నం చేస్తారు. క్రీస్తు జాకీయస్ ఇంటిని సందర్శించమని ఆహ్వానం పంపాడు. క్రీస్తు ఎక్కడికి వెళ్లినా, అతను హృదయాలను తెరుస్తాడు మరియు తనను స్వీకరించడానికి వారిని మొగ్గు చూపుతాడు. క్రీస్తును తెలుసుకోవాలనే నిష్కపటమైన కోరిక ఉన్నవారు, క్రమంగా, ఆయన ద్వారా తెలుసుకుంటారు. క్రీస్తు పిలిచిన వారు తమను తాము తగ్గించుకొని దిగి రావాలి. ఆయనను సంతోషముగా స్వాగతించుట యుక్తమైనది, అతడు తనతో సమస్త మంచితనమును తెచ్చును. జాకీయస్ తాను నిజంగా మతం మారినట్లు బహిరంగంగా ప్రదర్శించాడు. క్రియల ద్వారా సమర్థనను కోరిన పరిసయ్యునిలా కాకుండా, దేవుని దయ ద్వారా, సత్కార్యాల ద్వారా తన విశ్వాసం మరియు పశ్చాత్తాపం యొక్క ప్రామాణికతను బహిర్గతం చేయడానికి జక్కయ్యస్ లక్ష్యంగా పెట్టుకున్నాడు. జాకీయస్ ఇప్పుడు పాపం నుండి దేవుని వైపు మళ్లినందున ఆశీర్వాదం పొందిన వ్యక్తిగా గుర్తించబడ్డాడు. పాపాలు, వారి అపరాధం మరియు వారి శక్తి నుండి రక్షించబడిన అతను ఇప్పుడు మోక్షానికి సంబంధించిన అన్ని ప్రయోజనాలను అనుభవిస్తున్నాడు. క్రీస్తు తన ఇంట్లోకి ప్రవేశించాడు మరియు క్రీస్తు ఉన్న చోట మోక్షం వస్తుంది. క్రీస్తు ఈ కోల్పోయిన లోకంలోకి వచ్చాడు, దానిని వెతకడం మరియు రక్షించడం, లేని చోట మోక్షాన్ని అందించడం. తనను వెతకని వారిని మరియు తనను కోరని వారిని ఆయన వెతుకుతాడు.

ప్రభువు మరియు అతని సేవకుల ఉపమానం. (11-27) 
ఈ ఉపమానం 1 పేతురు 4:10లో ఉన్న ప్రతిభకు సంబంధించిన ఉపమానంతో సారూప్యతను పంచుకుంటుంది. కథన నిర్మాణం ప్రతిభాపాటవాల ఉపమానానికి అనుగుణంగా ఉంటుంది, ప్రతిభ పంపిణీకి సమానమైన వ్యక్తుల జవాబుదారీతనాన్ని హైలైట్ చేస్తుంది. ఇది క్రీస్తును బహిరంగంగా వ్యతిరేకించే వారికి మాత్రమే కాకుండా తప్పుడు ప్రకటన చేసే వ్యక్తులకు కూడా పర్యవసానాలను వివరిస్తుంది. ప్రధాన వ్యత్యాసం ప్రతి వ్యక్తికి ఇచ్చిన పౌండ్ యొక్క ప్రాతినిధ్యంలో ఉంది, ఇది విన్న వారందరికీ సువార్త యొక్క ఏకరీతి బహుమతిని సూచిస్తుంది. మరోవైపు, ప్రతిభ, వివిధ స్థాయిలలో పంపిణీ చేయబడుతుంది, దేవుడు వ్యక్తులకు విభిన్న సామర్థ్యాలను మరియు ప్రయోజనాలను ప్రసాదిస్తాడని సూచిస్తుంది. ఈ వైవిధ్యం సువార్త యొక్క ఏకవచన బహుమతి యొక్క విభిన్న మెరుగుదలను అనుమతిస్తుంది.

క్రీస్తు యెరూషలేములో ప్రవేశించాడు. (28-40) 
క్రీస్తు అన్ని జీవులపై అధికారాన్ని కలిగి ఉంటాడు మరియు అతని ఇష్టానుసారం వాటిని నియమించగలడు. ప్రతి వ్యక్తి హృదయం అతని దృష్టిలో మరియు అతని నియంత్రణలో ఉంటుంది. క్రీస్తు యొక్క విజయవంతమైన విజయాలు మరియు అతని శిష్యుల ఆనందకరమైన ప్రశంసలు ఆయనకు మరియు అతని రాజ్యానికి విరోధులుగా నిలిచిన అహంకారి పరిసయ్యులను కలవరపరుస్తాయి. పరిసయ్యులు క్రీస్తును ఉద్దేశించి చేసిన ప్రశంసలను అణిచివేసేందుకు ప్రయత్నించినప్పటికీ, వారు విజయం సాధించలేరు. క్రీస్తు, గర్విష్ఠుల ధిక్కారాన్ని పట్టించుకోకుండా, వినయస్థుల ఆరాధనను స్వాగతించాడు. పరిసయ్యులు క్రీస్తు స్తుతులను నిశ్శబ్దం చేయడానికి ప్రయత్నించవచ్చు, కానీ దేవుడు రాళ్లను అబ్రాహాము యొక్క పిల్లలుగా మార్చగలడు మరియు కఠిన హృదయాలను మార్చగలడు, అతను పిల్లల నోటి నుండి కూడా ప్రశంసలను పొందగలడు. ప్రపంచాన్ని తీర్పు తీర్చడానికి ప్రభువు మహిమతో తిరిగి వచ్చినప్పుడు మానవాళిని పట్టుకునే భావోద్వేగాల గురించి ఆలోచించడం ఒక లోతైన పరిశీలన.

క్రీస్తు జెరూసలేం గురించి విలపిస్తాడు. (41-48)
తన హంతకుల కోసం ఎదురుచూస్తున్న బాధలను ముందుగానే చూసి, అతని విలువైన రక్తం త్వరలో చిందింపబడే నగరం గురించి కన్నీళ్లు పెట్టుకున్న పవిత్ర యేసును చూస్తూ, విశ్వాసులలో దేవుని పోలిక సద్భావన మరియు కరుణతో గణనీయంగా పాతుకుపోయిందని ఎవరూ గుర్తించలేరు. సత్యాలను స్వీకరించి, తమ తోటి పాపుల పట్ల నిష్కపటంగా ఉండేవారు తప్పుదారి పట్టేవారని స్పష్టమవుతోంది. యేసు యెరూషలేము గురించి ఏడ్చినప్పటికీ, చివరికి అతను దానిపై తీవ్రమైన తీర్పును అమలు చేశాడని ప్రతి వ్యక్తి గుర్తుంచుకోవాలి. పాపాత్ముని మరణంలో ఆయన సంతోషించనప్పటికీ, తన రక్షణ ప్రతిపాదనను విస్మరించే వారికి వ్యతిరేకంగా ఆయన తన గంభీరమైన హెచ్చరికలను నిస్సందేహంగా నెరవేరుస్తాడు. దేవుని కుమారుడు చిందించిన కన్నీళ్లు ఫలించలేదు లేదా పనికిమాలిన కారణాల కోసం కాదు; అవి ఆత్మల విలువ, అపరాధం యొక్క గురుత్వాకర్షణ, మరియు అది మానవాళిని ఎంత బరువుగా మరియు కించపరుస్తుందో అనే లోతైన అవగాహనకు ప్రతిస్పందనగా ఉన్నాయి. మన హృదయాలను అన్ని అపవిత్రత నుండి శుద్ధి చేయడానికి ఆయన ఆత్మను మనస్ఫూర్తిగా వెదకుదాం. ప్రతి వైపు పాపులు సత్యం మరియు మోక్షం యొక్క పదాలకు శ్రద్ధ వహించండి.



Shortcut Links
లూకా - Luke : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |