John - యోహాను సువార్త 13 | View All
Study Bible (Beta)

1. తాను ఈ లోకమునుండి తండ్రియొద్దకు వెళ్లవలసిన గడియ వచ్చెనని యేసు పస్కాపండుగకు ముందే యెరిగిన వాడై, లోకములోనున్న తనవారిని ప్రేమించి, వారిని అంతమువరకు ప్రేమించెను.

1. Before the feast of Easter whan Iesus knewe that his tyme was come, that he shulde departe out of this worlde vnto ye father, as he loued his which were in the worlde, euen so loued he them vnto the ende.

2. వారు భోజనము చేయుచుండగా ఆయనను అప్పగింపవలెనని సీమోను కుమారుడగు ఇస్కరియోతు యూదా హృదయములో అపవాది ఇంతకుముందు ఆలోచన పుట్టించియుండెను గనుక

2. And after supper, whan the deuell had allready put into ye hert of Iudas Iscarioth Symons sonne, to betraye him,

3. తండ్రి తనచేతికి సమస్తము అప్పగించెననియు, తాను దేవునియొద్ద నుండి బయలుదేరి వచ్చెననియు, దేవునియొద్దకు వెళ్లవలసి యున్నదనియు యేసు ఎరిగి

3. Iesus knowinge that the father had geuen all thinges in to his handes, & that he was come from God, and wente vnto God,

4. భోజనపంక్తిలోనుండి లేచి తన పైవస్త్రము అవతల పెట్టివేసి, యొక తువాలు తీసికొని నడుమునకు కట్టుకొనెను.

4. he rose from supper, and layed asyde his vpper garmentes, and toke a towell, and gyrde it aboute him.

5. అంతట పళ్లెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును, తాను కట్టుకొనియున్న తువాలుతో తుడుచుటకును మొదలుపెట్టెను.

5. Afterwarde poured he water into a basen, and beganne to wash the disciples fete, and dryed them with the towell, yt he was gyrded withall.

6. ఇట్లు చేయుచు ఆయన సీమోను పేతురునొద్దకు వచ్చినప్పుడు అతడు ప్రభువా, నీవు నా పాదములు కడుగుదువా? అని ఆయనతో అనెను.

6. Then came he vnto Symon Peter, and ye same sayde vnto him: LORDE, shalt thou washe my fete?

7. అందుకు యేసు నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదు గాని యికమీదట తెలిసికొందువని అతనితో చెప్పగా

7. Iesus answered and sayde vnto him: What I do, thou knowest not now, but thou shalt knowe it herafter.

8. పేతురు నీవెన్నడును నా పాదములు కడుగరాదని ఆయనతో అనెను. అందుకు యేసు నేను నిన్ను కడుగనియెడల నాతో నీకు పాలు లేదనెను.

8. The sayde Peter vnto him: Thou shalt neuer wash my fete. Iesus answered him: Yf I wash ye not, thou shalt haue no parte with me.

9. సీమోను పేతురు ప్రభువా, నా పాదములు మాత్రమేగాక నా చేతులు నా తలకూడ కడుగుమని ఆయనతో చెప్పెను.

9. Symon Peter sayde vnto him: LORDE, not the fete onely, but the handes also and the heade.

10. యేసు అతని చూచి స్నానముచేసినవాడు పాదములు తప్ప మరేమియు కడుగుకొన నక్కరలేదు, అతడు కేవలము పవిత్రుడయ్యెను. మీరును పవిత్రులు కాని మీలో అందరు పవిత్రులు కారనెను.

10. Iesus sayde vnto him: He that is wasshe, nedeth not, saue to washe ye fete, but is cleane euery whytt. And ye are cleane but not all.

11. తన్ను అప్పగించువానిని ఎరిగెను గనుక మీలో అందరు పవిత్రులు కారని ఆయన చెప్పెను.

11. For he knewe his betrayer, therfore sayde he: ye are not all cleane.

12. వారి పాదములు కడిగి తన పైవస్త్రము వేసికొనిన తరువాత, ఆయన మరల కూర్చుండి నేను మీకు చేసిన పని మీకు తెలిసినదా?

12. Now whan he had wasshen their fete, and taken his clothes, he sat him downe agayne, and sayde vnto the: Wote ye what I haue done vnto you?

13. బోధకుడనియు ప్రభువనియు మీరు నన్ను పిలుచుచున్నారు; నేను బోధకుడను ప్రభువును గనుక మీరిట్లు పిలుచుట న్యాయమే.

13. Ye call me master and LORDE, and ye saye right therin, for so I am.

14. కాబట్టి ప్రభువును బోధకుడనైన నేను మీ పాదములు కడిగిన యెడల మీరును ఒకరి పాదములను ఒకరు కడుగవలసినదే.

14. Yf I then youre LORDE and master haue wasshen youre fete, ye ought also to wash one anothers fete.

15. నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలెనని మీకు మాదిరిగా ఈలాగు చేసితిని.

15. I haue geue you an ensample, that ye shulde do as I haue done vnto you.

16. దాసుడు తన యజమానునికంటె గొప్పవాడు కాడు, పంపబడినవాడు తన్ను పంపిన వానికంటె గొప్పవాడు కాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.

16. Verely verely I saye vnto you: the seruaunt is not greater then his lorde, nether is the Apostell greater then he that sent him.

17. ఈ సంగతులు మీరు ఎరుగుదురు గనుక వీటిని చేసినయెడల మీరు ధన్యులగుదురు.

17. Yf ye knowe these thinges, blessed are ye yf ye do them.

18. మిమ్మునందరిని గూర్చి నేను చెప్పలేదు; నేను ఏర్పరచుకొనినవారిని ఎరుగుదును గాని నాతో కూడ భోజనముచేయువాడు నాకు విరోధముగా తన మడమ యెత్తెను అను లేఖనము నెరవేరుటకై యీలాగు జరుగును.
కీర్తనల గ్రంథము 41:9

18. I speake not of you all, I knowe whom I haue chosen, but that the scripture might be fulfilled: He yt eateth my bred, hath lift vp his hele against me.

19. జరిగినప్పుడు నేనే ఆయననని మీరు నమ్మునట్లు అది జరుగక మునుపు మీతో చెప్పుచున్నాను.
యెషయా 43:10

19. I tell it you now, before it come, that whan it is come to passe, ye maye beleue, that I am he.

20. నేనెవని పంపుదునో వాని చేర్చుకొనువాడు నన్ను చేర్చుకొనువాడగును; నన్ను చేర్చుకొనువాడు నన్ను పంపినవానిని చేర్చుకొనువాడగు నని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను.

20. Verely verely I saye vnto you: He that receaueth whom so euer I sende, receaueth me: and he that receaueth me, receaueth him that sent me.

21. యేసు ఈ మాటలు పలికిన తరువాత ఆత్మలో కలవరపడి మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని రూఢిగా చెప్పెను

21. Whan Iesus had thus sayde, he was heuy in sprete, and testified, and sayde: Verely verely I saye vnto you: One amonge you shal betraye me.

22. ఆయన యెవరినిగూర్చి యీలాగు చెప్పెనో అని శిష్యులు సందేహపడుచు ఒకరితట్టు ఒకరు చూచుకొనుచుండగా

22. Then the disciples loked one vpon another, & were in doute, of whom he spake.

23. ఆయన శిష్యులలో యేసు ప్రేమించిన యొకడు యేసు రొమ్మున ఆనుకొనుచుండెను

23. But there was one amoge his disciples, that leaned at the table on Iesus bosome, who Iesus loued:

24. గనుక ఎవరినిగూర్చి ఆయన చెప్పెనో అది తమకు చెప్పుమని సీమోను పేతురు అతనికి సైగచేసెను.

24. to him beckened Symon Peter, that he shulde axe, who it was, of whom he spake.

25. అతడు యేసు రొమ్మున ఆనుకొనుచు ప్రభువా, వాడెవడని ఆయనను అడిగెను.

25. For the same leaued vpo Iesus brest, and sayde vnto him: LORDE, who is it?

26. అందుకు యేసు నేనొక ముక్క ముంచి యెవని కిచ్చెదనో వాడే అని చెప్పి, ఒక ముక్క ముంచి సీమోను కుమారుడగు ఇస్కరియోతు యూదాకిచ్చెను;

26. Iesus answered: It is he, vnto whom I dyppe the soppe & geue it. And he dypte in the soppe, and gaue it vnto Iudas Iscarioth Symons sonne.

27. వాడు ఆ ముక్క పుచ్చుకొనగానే సాతాను వానిలో ప్రవేశించెను. యేసు నీవు చేయుచున్నది త్వరగా చేయుమని వానితో చెప్పగా

27. And after ye soppe the deuell entred in to him. Then sayde Iesus vnto him: That thou doest, do quyckly.

28. ఆయన ఎందునిమిత్తము అతనితో ఆలాగు చెప్పెనో అది భోజనమునకు కూర్చుండినవారిలో ఎవనికిని తెలియలేదు.

28. But ye same wyst no man at the table, for what intent he sayde it vnto him.

29. డబ్బు సంచి యూదాయొద్ద ఉండెను గనుక పండుగకు తమకు కావలసినవాటిని కొనుమనియైనను, బీదలకేమైన ఇమ్మనియైనను యేసు వానితో చెప్పినట్టు కొందరనుకొనిరి.

29. Some thought (for so moch as Iudas had the bagge) that Iesus had sayde vnto him: Bye that is necessary for vs agaynst the feast: Or that he shulde geue some thinge vnto the poore.

30. వాడు ఆ ముక్క పుచ్చుకొని వెంటనే బయటికి వెళ్లెను; అప్పుడు రాత్రివేళ.

30. Whan he had receaued the soppe, he wente out immediatly, and it was night.

31. వాడు వెళ్లిన తరువాత యేసు ఇట్లనెను ఇప్పుడు మనుష్యకుమారుడు మహిమపరచబడి యున్నాడు; దేవు డును ఆయనయందు మహిమపరచబడి యున్నాడు.

31. Whan he was gone forth, Iesus sayde: Now is the sonne of ma glorified, and God is glorified in him.

32. దేవుడు ఆయనయందు మహిమపరచబడినయెడల, దేవుడు తనయందు ఆయనను మహిమపరచును; వెంటనే ఆయనను మహిమపరచును.

32. Yf God be glorified in him, the shal god glorifie him also in hiself, & straight waye shal he glorifye him.

33. పిల్లలారా, యింక కొంతకాలము మీతో కూడ ఉందును, మీరు నన్ను వెదకుదురు, నేనెక్కడికి వెళ్లుదునో అక్కడికి మీరు రాలేరని నేను యూదులతో చెప్పినప్రకారము ఇప్పుడు మీతోను చెప్పుచున్నాను.

33. Deare childre, I am yet a litle whyle with you. Ye shal seke me, and (as I sayde vnto ye Iewes) whither I go, thither can ye not come. And now I saye vnto you,

34. మీరు ఒకరి నొకరు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను; నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరి నొకరు ప్రేమింపవలెను.

34. A new comaundemet geue I you, that ye loue together as I haue loued you, yt euen so ye loue one another.

35. మీరు ఒకనియెడల ఒకడు ప్రేమగలవారైన యెడల దీనిబట్టి మీరు నా శిష్యులని అందరును తెలిసికొందురనెను.

35. By this shal euery man knowe that ye are my disciples, yf ye haue loue one to another.

36. సీమోను పేతురు - ప్రభువా, నీవెక్కడికి వెళ్లు చున్నావని ఆయనను అడుగగా యేసు నేను వెళ్లుచున్నచోటికి నీవిప్పుడు నావెంట రాలేవుగాని, తరువాత వచ్చెదవని అతనితో చెప్పెను.

36. Symon Peter sayde vnto him: LORDE, whither goest thou? Iesus answered him: Whither I go, thou canst not folowe me now, but thou shalt folowe me herafter.

37. అందుకు పేతురు ప్రభువా, నేనెందుకు ఇప్పుడు నీ వెంట రాలేను? నీకొరకు నా ప్రాణముపెట్టుదునని ఆయనతో చెప్పగా

37. Peter sayde vnto him: LORDE, why ca not I folowe the now? I wil geue my life for yi sake.

38. యేసునా కొరకు నీ ప్రాణము పెట్టుదువా? ఆయనను ఎరుగనని నీవు ముమ్మారు చెప్పకముందు కోడికూయదని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను.

38. Iesus answered him: Wilt thou geue thy life for my sake? Verely verely I saye vnto ye. The cock shal not crowe, tyll thou haue denyed me thryse.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
John - యోహాను సువార్త 13 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

క్రీస్తు శిష్యుల పాదాలను కడుగుతాడు. (1-17) 
మన ప్రభువైన యేసు ఈ లోకంలో ఆయనకు చెందిన ప్రజలను కలిగి ఉన్నాడు. అతను వాటిని చాలా ఖర్చుతో సంపాదించాడు మరియు వాటిని తన కోసం ప్రత్యేకంగా ఉంచుకున్నాడు; వారు ప్రత్యేకమైన మరియు ప్రత్యేకమైన వ్యక్తులుగా ఆయనకు తమను తాము అంకితం చేసుకుంటారు. క్రీస్తు ఎవరిని ప్రేమిస్తాడో, ఆయన అంతులేకుండా ప్రేమిస్తాడు. నిజమైన విశ్వాసులు క్రీస్తు ప్రేమ నుండి వేరు చేయబడలేరు. మన సమయం ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు కాబట్టి, మన సన్నాహాలు అస్థిరంగా ఉండేలా చూసుకుంటూ, దాని కోసం నిరంతరం సిద్ధపడాలి. దెయ్యం ప్రజల హృదయాల్లోకి ప్రవేశించే మార్గాలు మనకు తెలియవు. అయినప్పటికీ, కొన్ని పాపాలు అంతర్లీనంగా పాపాత్మకమైనవి, మరియు ప్రపంచం మరియు మాంసం నుండి వాటికి చాలా తక్కువ టెంప్టేషన్ ఉంది, అవి సాతాను నుండి నేరుగా వచ్చినట్లు స్పష్టంగా తెలుస్తుంది.
దేవుని మహిమను మరియు మన సహోదరుల శ్రేయస్సును ప్రోత్సహిస్తే మన క్రింద ఉన్న ఏ పనిని పరిగణించకూడదని బోధించడానికి యేసు తన శిష్యుల పాదాలను కడిగాడు. మనకు ఆటంకం కలిగించే దేనినైనా పక్కనపెట్టి, మనం విధికి కట్టుబడి ఉండాలి. ఆధ్యాత్మిక ప్రక్షాళన మరియు పాపం యొక్క అపవిత్రత నుండి ఆత్మను శుద్ధి చేయడం యొక్క ప్రాముఖ్యతను సూచించడానికి క్రీస్తు తన శిష్యుల పాదాలను కడుగుతాడు. మన ప్రభువైన యేసు అనేక పనులు చేసినప్పటికీ, ఆయన శిష్యులకు వెంటనే అర్థం కాకపోవచ్చు, వారు తరువాత గ్రహిస్తారు. ప్రారంభంలో ప్రతికూలంగా కనిపించే సంఘటనలలో దయ చివరికి స్పష్టంగా కనిపిస్తుంది. సువార్త యొక్క ఆఫర్‌లు చాలా ధనవంతులని లేదా శుభవార్త నిజం కావడానికి చాలా మంచిదని భావించి వాటిని తిరస్కరించడం వినయం కాదు, అవిశ్వాసం.
క్రీస్తు ద్వారా ఆధ్యాత్మికంగా శుద్ధి చేయబడిన వారికి మాత్రమే ఆయనలో వాటా ఉంటుంది. క్రీస్తు తాను అంగీకరించిన మరియు రక్షించే వారందరినీ సమర్థిస్తాడు మరియు పవిత్రం చేస్తాడు. పేతురు లొంగిపోవడమే కాక, తనను కడగమని క్రీస్తుని వేడుకున్నాడు. అతను తన చేతులు మరియు తలపై కూడా యేసు ప్రభువు యొక్క శుద్ధి చేసే కృపను తీవ్రంగా కోరుకుంటాడు. నిజమైన పవిత్రతను కోరుకునే వారు ప్రతి భాగం మరియు అధ్యాపకులు పరిశుభ్రంగా తయారవడంతో పూర్తిగా శుద్ధి కావాలని కోరుకుంటారు. తమ రక్షణ కొరకు క్రీస్తును అంగీకరించినప్పుడు నిజమైన విశ్వాసి కొట్టుకుపోతాడు. కాబట్టి, దయ ద్వారా సమర్థించబడిన స్థితిలో ఉన్నవారు అపరాధం నుండి తమను తాము శుభ్రపరచుకోవడానికి మరియు అపవిత్రమైన దేనికీ వ్యతిరేకంగా రక్షించుకోవడానికి రోజువారీ ప్రయత్నాలు చేయాలి. ఈ సాక్షాత్కారం మనల్ని మరింత జాగ్రత్తగా ఉండేలా చేస్తుంది, నిన్నటి క్షమాపణ నుండి నేటి టెంప్టేషన్‌ను ఎదుర్కొనేందుకు శక్తిని పొందుతుంది. మనలో కపట విశ్వాసులను కనిపెట్టడం ఆశ్చర్యం కలిగించకూడదు లేదా పొరపాట్లు చేయకూడదు.
ఇక్కడ క్రీస్తు పాఠం పరస్పర విధులను నొక్కి చెబుతుంది: మన సహోదరుల నుండి సహాయాన్ని స్వీకరించడం మరియు వారికి సహాయం అందించడం. మా మాస్టర్ సేవ చేయడాన్ని చూడటం ఆధిపత్యం యొక్క అనాలోచితతను హైలైట్ చేస్తుంది. తన శిష్యులు శత్రువులుగా ఉన్నప్పుడు వారిని విమోచించి, సమాధానపరచడానికి క్రీస్తును నడిపించిన అదే ప్రేమ ఇప్పటికీ ఆయనను ప్రభావితం చేస్తుంది.

జుడాస్ యొక్క ద్రోహం ముందే చెప్పబడింది. (18-30) 
మన ప్రభువు తన స్వంత బాధలు మరియు మరణం గురించి తరచుగా చర్చించాడు, కానీ జుడాస్ గురించి మాట్లాడేటప్పుడు అతని బాధ యొక్క లోతు మరింత స్పష్టంగా కనిపించింది. క్రైస్తవుల అతిక్రమణలు క్రీస్తుకు దుఃఖాన్ని కలిగిస్తాయి. జుడాస్‌పై మాత్రమే దృష్టి పెట్టకపోవడం ముఖ్యం; అతని ద్రోహం గురించిన ప్రవచనం దేవుని ఆశీర్వాదాలను పొంది కృతజ్ఞతతో ప్రతిస్పందించే వారందరికీ వర్తిస్తుంది. వారి అధికారాన్ని అణగదొక్కడం మరియు వాటి ప్రభావాన్ని నిర్మూలించాలనే ఏకైక ఉద్దేశ్యంతో లేఖనాలను పరిశీలించే అవిశ్వాసిని, లేఖనాలపై నమ్మకం ఉందని చెప్పుకునే కపటుడిని మరియు వాటి ప్రకారం జీవించడానికి నిరాకరించే వేషధారిని మరియు పనికిమాలిన పనుల కోసం క్రీస్తును విడిచిపెట్టిన మతభ్రష్టుడిని పరిగణించండి. ఈ విధంగా, మానవత్వం, దేవుని ప్రావిడెన్స్ ద్వారా అతనితో రొట్టెలు పంచుకున్న తర్వాత, వారి మడమ పైకెత్తి అతనికి వ్యతిరేకంగా మారుతుంది. జుడాస్ యేసు మరియు అతని అపొస్తలుల గురించి విసుగు చెంది వెళ్లిపోయాడు. చెడు పనులలో నిమగ్నమైన వారు కాంతి కంటే చీకటిని ఇష్టపడతారు.

క్రీస్తు శిష్యులకు ఒకరినొకరు ప్రేమించమని ఆజ్ఞాపించాడు. (31-38)
31-35
క్రీస్తు అనేక అద్భుతాల ద్వారా మహిమను పొందాడు, అయినప్పటికీ అతను తన బాధలలో తన మహిమను తన వినయ స్థితిలో అన్ని ఇతర మహిమలను అధిగమిస్తాడు. దీని ద్వారా, మానవత్వం యొక్క పాపం ద్వారా దేవునికి జరిగిన తప్పుకు సంతృప్తి అందించబడింది. మనం ప్రస్తుతం మన ప్రభువుతో పాటు ఆయన పరలోక సంతోషానికి తోడుగా ఉండలేనప్పటికీ, నిజమైన విశ్వాసం భవిష్యత్తులో మనం ఆయనను అనుసరించేలా చేస్తుంది. ఈలోగా, మనం అతని సమయం కోసం వేచి ఉండాలి మరియు అతని పనిలో నిమగ్నమై ఉండాలి.
శిష్యుల నుండి బయలుదేరే ముందు, క్రీస్తు కొత్త ఆజ్ఞను ఇవ్వాలనుకున్నాడు. వారు క్రీస్తు కొరకు ఒకరినొకరు ప్రేమించుకోవాలి, ఆయన మాదిరిని అనుసరించి, ఇతరుల శ్రేయస్సును కోరుతూ, సువార్త యొక్క కారణాన్ని భాగస్వామ్య స్ఫూర్తితో ఐక్య శరీరంగా ముందుకు తీసుకెళ్లాలి. అయినప్పటికీ, ఈ ఆజ్ఞ ఇప్పటికీ చాలా మంది విశ్వాసులకు నవలగా కనిపిస్తుంది. ప్రజలు, సాధారణంగా, క్రీస్తు పదాలలో దేనినైనా వీటిపై హైలైట్ చేస్తారు. క్రీస్తు అనుచరులు ఒకరిపట్ల ఒకరు ప్రేమను ప్రదర్శించడంలో విఫలమైతే, అది వారి చిత్తశుద్ధిపై అనుమానాలు కలిగిస్తుందని ఇది సూచిస్తుంది.

36-38
సహోదర ప్రేమపై క్రీస్తు బోధలను పీటర్ పట్టించుకోలేదు కానీ క్రీస్తు వారికి వెల్లడించకూడదని ఎంచుకున్న విషయాలపై దృష్టి పెట్టాడు. మనకు మరియు మన వారసులకు సంబంధించిన బయలుపరచబడిన సత్యాలను అర్థం చేసుకోవడం కంటే దేవునికి సంబంధించిన దాగి ఉన్న విషయాల గురించి తెలుసుకోవడానికి ఎక్కువ ఆసక్తి చూపడం ఒక సాధారణ ధోరణి. మన మనస్సాక్షికి మార్గదర్శకత్వం పొందడం కంటే ఉత్సుకతను సంతృప్తి పరచడం మరియు ఏ చర్యలు మనల్ని స్వర్గానికి దారితీస్తాయో తెలుసుకోవాలనే కోరిక తరచుగా ఉంటుంది.
స్పష్టమైన మరియు మెరుగుపరిచే విషయాల గురించి చర్చలు త్వరగా వదిలివేయబడతాయి, సందేహాస్పద వివాదాలు అనంతంగా కొనసాగుతాయి, కేవలం మాటల కలహాలుగా మారుతాయి. మనం కొన్ని పనులు చేయలేమని చెప్పినప్పుడు ప్రతికూలంగా స్పందిస్తాము, క్రీస్తు లేకుండా మనం ఏమీ చేయలేము. క్రీస్తు మన గురించి లోతైన అవగాహన కలిగి ఉన్నాడు, అతను ప్రేమించేవారికి మనలోని అంశాలను వివిధ మార్గాల్లో వెల్లడి చేస్తాడు మరియు గర్వాన్ని దూరం చేయడం ద్వారా వారిని తగ్గించాడు.
శాంతి బంధంలో ఆత్మ యొక్క ఐక్యతను కాపాడుకోవడానికి, ఒకరినొకరు నిష్కపటమైన మరియు దయగల హృదయంతో ప్రేమించటానికి మరియు మన దేవునితో వినయంగా నడుచుకోవడానికి కృషి చేద్దాం.


Shortcut Links
యోహాను - John : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |