John - యోహాను సువార్త 14 | View All

1. మీ హృదయమును కలవరపడనియ్యకుడి; దేవునియందు విశ్వాసముంచుచున్నారు నాయందును విశ్వాసముంచుడి.

వారు ఆందోళన చెందడానికి చాలినంత కారణాలు ఉన్నాయి. వారి యజమాని వెళ్ళిపోతున్నాడు. ఆయన్ను ఎరగనని పేతురు అబద్ధాలు పలకపోతున్నాడు. ఏం జరగబోతున్నదో వారిలో ఎవరికీ తెలియదు. ఏదో వింతైన, కష్టతరమైన సంగతి జరగబోతున్నదని మాత్రం తెలుసు. అయితే ఆందోళన పడవద్దని వారికి చెప్తున్నాడు యేసు. అలా ఆందోళన లేకుండా నిబ్బరంగా ఉండడానికి ఈ అధ్యాయంలో కొన్ని కారణాలు ఇస్తున్నాడు. మొదటిదేమిటంటే ఆయన నమ్మదగినవాడు. జరుగుతున్న పరిస్థితుల గురించి ఆందోళన, చింత, కంగారులను ఆయన ప్రజలు ఎప్పుడైనా జయించదగిన మార్గం ఇదే – దేవునిలో క్రీస్తులో నమ్మకం ఉంచాలి. మత్తయి 6:25-27; ఫిలిప్పీయులకు 4:6-7; 1 పేతురు 5:7 చూడండి. అల్లకల్లోలంగా ఉన్న ఈ లోకంలో మనశ్శాంతి కావాలంటే ఇప్పటికీ క్రీస్తులో నమ్మకం ఉంచడమే మార్గం.

2. నా తండ్రి యింట అనేక నివాసములు కలవు, లేనియెడల మీతో చెప్పుదును; మీకు స్థలము సిద్ధపరచ వెళ్లుచున్నాను.

వారు ఆందోళన చెందకుండా ఉండడానికి మరో కారణం – వారికి పరలోకంలో దివ్యమైన, శాశ్వతమైన భవిష్యత్తు ఉంది. అలాంటి మహా భాగ్యం తమకోసం కాచుకుని ఉండగా ఈ కాలానికీ, ఇహలోకానికీ చెందిన పరిస్థితులు వారి మనసుల్లో భారంగా ఎందుకుండాలి? ఆయన ఎక్కడికి వెళ్తున్నాడని పేతురు అడిగాడు (యోహాను 13:36). యేసు ఇక్కడ స్పష్టంగా, సూటిగా దానికి జవాబు చెప్తున్నాడు. వారికోసం పరలోకంలో చెయ్యవలసిన పని ఆయనకు ఉంది.

3. నేను వెళ్లి మీకు స్థలము సిద్ధపరచినయెడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరల వచ్చి నాయొద్ద నుండుటకు మిమ్మును తీసికొని పోవుదును.

యోహాను 17:24; 1 థెస్సలొనీకయులకు 4:17. వారు ఎందుకు ఆందోళన చెందకుండా ఉండాలో మరో కారణం – ఆయన వెళ్ళిపోతున్నప్పటికీ మళ్ళీ తిరిగి రాబోతున్నాడు కూడా. మత్తయి 24:26-27; మత్తయి 25:31; మత్తయి 26:64; అపో. కార్యములు 1:11; 1 థెస్సలొనీకయులకు 4:16-18; ప్రకటన గ్రంథం 1:7; ప్రకటన గ్రంథం 19:11-16; ప్రకటన గ్రంథం 22:12.

4. నేను వెళ్లుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియునని చెప్పెను.

శిష్యులు తమకు మార్గం తెలియదనుకున్నారు. కానీ నిజానికి వారికి తెలుసు ఎందుకంటే ఆ మార్గమైన యేసు వారికి తెలుసు. పరలోకానికి తీసుకుపోయే మార్గానికి వారు ఇంతకు ముందే వచ్చారు. అది ఆయనపై నమ్మకం ఉంచడమే (యోహాను 1:12-13; యోహాను 3:16, యోహాను 3:36; యోహాను 5:24; యోహాను 6:47).

5. అందుకు తోమా ప్రభువా, యెక్కడికి వెళ్లుచున్నావో మాకు తెలియదే; ఆ మార్గమేలాగు తెలియునని ఆయన నడుగగా

యోహాను 20:24-25 లో ఉన్నదాన్ని బట్టి ఈ శిష్యుణ్ణి తరచుగా సందేహి అయిన తోమా అని క్రైస్తవులు పిలుస్తుంటారు. అయితే ఇతడు ముక్కుసూటిగా పోయేవాడు, ఏదీ దాచుకోనివాడు, కపటం లేనివాడు, తనకు తెలియని సంగతులు తెలుసునని నటించేవాడు కాదు, తాను నమ్మని సంగతులు నమ్ముతున్నానని చెప్పేవాడు కాదు.

6. యేసు నేనే మార్గమును, సత్యమును, జీవమును; నా ద్వారానే తప్ప యెవడును తండ్రియొద్దకు రాడు.

యేసుప్రభువు పలికిన మాటలన్నిటిలోకి ప్రసిద్ధికెక్కిన అత్యంత ప్రాముఖ్యమైన మాటల్లో ఇదొక్కటి. “మార్గాన్ని”– ఒక మార్గం కాదు; ఉన్న ఏకైక మార్గం. పరలోకానికీ, దేవుని సన్నిధికీ ఆయనొక్కడే మార్గమని నొక్కి చెప్పినది మొదట స్వయంగా ఆయనే, ఆయన శిష్యులెవరూ కాదు. ఆయనపట్ల ఆయన మాటలపట్ల ఆయన శిష్యులు నమ్మకంగా ఉండాలంటే అదే ప్రకటించాలి (యోహాను 3:36; అపో. కార్యములు 4:12; 1 తిమోతికి 2:5 పోల్చి చూడండి). చాలా మందికి యేసు చెప్పిన ఈ ఉపదేశం నచ్చదు. నచ్చకపోయినంత మాత్రాన ఇది మారుతుందా? ఆయనే సత్యం, ఆయన అబద్ధమాడడు కాబట్టి ఈ మాట మనకు నచ్చేలా చేసుకోవడం ఎంతో మంచిది. తాను దేవుని ఏకైక కుమారుణ్ణని ఆయన చెప్పాడు (యోహాను 3:16). ఆధ్యాత్మిక జీవం తనను స్వీకరిస్తేనే వస్తుందనీ (యోహాను 6:53), శాశ్వతంగా నశించిపోకుండా ఉండాలంటే మనుషులు నమ్మకం పెట్టవలసినది తన పైనే అనీ (యోహాను 8:24), దేవుని ప్రజలకు తానొక్కడే ద్వారమనీ, తానే కాపరి అనీ (యోహాను 8:24) ఆయన తానే చెప్పాడు. ఆయన ఎవరో దాన్నిబట్టీ, ఆయన చూపించిన రుజువులు, సాక్ష్యాధారాలను బట్టి ఆయన్ను నమ్ముదాం. “సత్యాన్ని”– యేసుప్రభువు ప్రత్యక్షమైన దేవుని సత్యం, సత్య దేవుని అవతారం. ఆయనలో మోసం, కపటం, చీకటి మచ్చుకైనా లేవు. నేనే సత్యాన్ని అని చెప్పిన ఆయన నేనే మార్గాన్ని అని కూడా చెప్పాడు. “జీవాన్ని”– యోహాను 11:25. భౌతిక ప్రాణం అని కాదు దీని అర్థం. మనుషులందరికీ, జీవులంతటికీ ప్రాణం తానే అని ఏదో ఒక వేదాంతాన్ని ఆయనిక్కడ చెప్పడం లేదు. ఏకైక నిజదేవుని జీవంలో తాను భాగస్వామిననీ (యోహాను 5:26), మనుషులకు శాశ్వత జీవాన్నిచ్చేది తానేనని (యోహాను 5:21; యోహాను 17:2), ఆ జీవం తనలో మాత్రమే ఉందనీ (1 యోహాను 5:11-12) చెప్తున్నాడు. నమ్మకం ద్వారా యేసుప్రభువును మన హృదయాల్లో స్వీకరిస్తే ఆయన ఏమై ఉన్నాడో అదంతా మనది అవుతుంది. అప్పుడు మనం పరలోకానికి మార్గంలో ఉంటాం, సత్యాన్ని నమ్ముతాం, జీవాన్ని కలిగి ఉంటాం. యేసును నిరాకరిస్తే దేవుణ్ణి చేరే మార్గంలో ఎన్నటికీ ఉండము, సత్యంపట్ల నమ్మకం కలగదు, శాశ్వతమైన ఆధ్యాత్మిక జీవం మనకు లభించదు, పరలోకంలో దేవుని సన్నిధికి శాంతితో చేరుకోము. సాక్షాత్తూ దేవుని కుమారుడే ఇది చెప్పాడు కాబట్టి ఇందులో ఇక సందేహమక్కరలేదు.

7. మీరు నన్ను ఎరిగియుంటే నా తండ్రిని ఎరిగియుందురు; ఇప్పటినుండి మీరాయనను ఎరుగుదురు, ఆయనను చూచియున్నారని చెప్పెను.

తానెవరో, ఏమిటో వారు నిజంగా అర్థం చేసుకుని ఉంటే తండ్రి అయిన దేవుణ్ణి కూడా వారు తెలుసుకుని ఉండేవారు. యోహాను 1:14, యోహాను 1:18; ఫిలిప్పీయులకు 2:6; లూకా 2:11 నోట్స్‌ను చూడండి. కానీ అప్పటివరకు వారి నమ్మకం, ఆధ్యాత్మిక జ్ఞానం బలహీనంగా ఉన్నాయి.

8. అప్పుడు ఫిలిప్పు ప్రభువా, తండ్రిని మాకు కనబరచుము, మాకంతే చాలునని ఆయనతో చెప్పగా

ఫిలిప్పు అడిగినది నిర్గమకాండము 33:18 లో మోషే కోరికలాగా ఉన్నదేమో – దేవుణ్ణి కళ్ళతో చూడాలని.

9. యేసు ఫిలిప్పూ, నేనింతకాలము మీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరుగవా? నన్ను చూచిన వాడు తండ్రిని చూచియున్నాడు గనుక తండ్రిని మాకు కనుపరచుమని యేల చెప్పుచున్నావు?

“తండ్రిని చూశాడు”– యోహాను 10:30; యోహాను 12:44-45; యోహాను 1:18; హెబ్రీయులకు 1:3 పోల్చి చూడండి. యేసును చూస్తే దేవుణ్ణి చూచినట్టే.

10. తండ్రి యందు నేనును నాయందు తండ్రియు ఉన్నామని నీవు నమ్ముటలేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నా యంతట నేనే చెప్పుటలేదు, తండ్రి నాయందు నివసించుచు తన క్రియలుచేయు చున్నాడు.

దేవత్వంలో తండ్రి, కుమారుల పరిపూర్ణమైన, సంపూర్ణమైన ఐక్యతను ఈ మాటలు సూచిస్తున్నాయి. యేసు ఇంతకుముందే ఉపదేశించిన సత్యాన్ని బట్టి ఫిలిప్పు దీన్ని ఇప్పటికే నమ్మి ఉండవలసింది. యేసు మాటలూ పనులూ దేవుని మాటలు, పనులే (యోహాను 7:16; యోహాను 12:49).

11. తండ్రియందు నేనును నాయందు తండ్రియు ఉన్నామని నమ్ముడి; లేదా యీ క్రియల నిమిత్తమైనను నన్ను నమ్ముడి.
నిర్గమకాండము 23:20-21

క్రీస్తు మాటలు ఫిలిప్పును తృప్తిపరచకపోతే, ఆయన చూపిన రుజువులను బట్టి అయినా నమ్మాలి. యోహాను 10:37-38 చూడండి.

12. నేను తండ్రియొద్దకు వెళ్లుచున్నాను గనుక నేను చేయు క్రియలు నాయందు విశ్వాసముంచు వాడును చేయును, వాటికంటె మరి గొప్పవియు అతడు చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.

క్రీస్తు చేసిన పనులకన్నా మించినవి ఎలాంటివి? ఆయన తన అద్భుత కార్యాల గురించి మాట్లాడుతున్నాడని అనుకునేందుకు వీలులేదు. ఎందుకంటే తరువాతి కాలంలో వారు చేసినవి ఆయన చేసినవాటికన్నా గొప్పేమీ కాదు. వారు చేసిన ఒక్క పని మాత్రం ఆయన చేసిన వాటికంటే మించినదని చెప్పవచ్చు – యూదులు, యూదేతరుల్లో అనేకమందిని నిజ దేవునివైపుకు తిప్పేందుకు వారికి శుభవార్త ప్రకటించడం (మార్కు 16:15), అన్ని జాతులవారినీ శిష్యులుగా చెయ్యడం (మత్తయి 28:19). క్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు తన పరిచర్యను చాలా కొద్ది ప్రాంతానికే పరిమితం చేసుకున్నాడు. ఆ పరిచర్య ద్వారా తనపై నిజమైన నమ్మకం కలిగినది తక్కువమందికే. ఆయన పరమ తండ్రి దగ్గరికి వెళ్ళిపోయి, తన శిష్యులు తనను మించిన పనులు చేయగలిగేలా, తన శుభవార్తను భూమి కొనలవరకు వ్యాపింపజేయగలిగేలా వారికి సామర్థ్యాన్ని కలిగించేందుకు పవిత్రాత్మను పంపించాడు.

13. మీరు నా నామమున దేనినడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దానిని చేతును.

శిష్యులు ఎందుకు ఆందోళన చెందకూడదో (వ 1) ఇది మరో కారణం. ఇది చాలా విశాలమైన పరిధి గల వాగ్దానం, గానీ దీనికి ఖచ్చితమైన షరతులున్నాయి. సఫలమైన ప్రార్థన క్రీస్తు పేరట చేసేదే. ఏ ఇతర నామం, ఏ ఇతర మధ్యవర్తీ అవసరం లేదు. ఆయన పేర చేసే ఎలాంటి ప్రార్థనకైనా ఆయన తానే జవాబిస్తాడు కాబట్టి మన ప్రార్థనలకు జవాబు కోసం పరలోకంలో గానీ భూమిపై గానీ మరెవరి సహాయమూ మనకు అవసరం లేదన్నది స్పష్టమే. ఇక్కడ “పేరు” ఆయనలోని సమస్తాన్ని, ఆయన స్వభావాన్ని, లక్షణాన్ని, అధికారాన్ని, సంకల్పాన్ని సూచిస్తున్నది. ఆయన సంకల్పం (ఆయనను గురించి మనకు తెలిసినదంతా) ఆయన ఉపదేశాల్లో వెల్లడి అయింది. అందువల్ల మన ప్రార్థన దానికి అనుగుణంగా ఉండాలి. ఆయనకు విన్నవించుకున్నవి అనేకం మనకు దొరకవు. ఎందుకంటే దీన్ని మనం పాటించము. యేసుప్రభువు ఒక గొప్ప ఉద్దేశంతో ప్రార్థనలకు జవాబులు ఇస్తాడు. పరమ తండ్రికి మహిమ కలగాలనే ఆ ఉద్దేశం. మనం కూడా అదే ఉన్నతమైన ఉద్దేశంతో మన ప్రార్థనలకు జవాబులు ఆశించాలి. మత్తయి 6:9-10 పోల్చి చూడండి. మన ఉద్దేశాలు సరైనవైతే గొప్ప విషయాల కోసం అడిగి గొప్ప ఫలితాలు చూడవచ్చు. యోహాను 15:7; 1 యోహాను 5:14-15 కూడా చూడండి. యిర్మియా 33:3; లూకా 11:5-13; లూకా 18:1-8; ఎఫెసీయులకు 6:18; హెబ్రీయులకు 4:16; యాకోబు 5:16 పోల్చి చూడండి.

14. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును.

15. మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలను గైకొందురు.

దీన్ని మూడుసార్లు చెప్పడం కనిపిస్తుంది – వ 21,23. పైన ఇచ్చిన వాగ్దానానికి తప్పకుండా ఈ వచనంతో చాలా దగ్గర సంబంధం ఉంది. ఆయన ఆజ్ఞలను నిర్లక్ష్యం చేస్తూ, వాటిప్రకారం చెయ్యకుండా ఉంటే ఆయన పేరున ప్రార్థనెలా చేస్తాం? ఆయన్ను ప్రేమిస్తున్నామని ఎలా చెప్పుకుంటాం? ప్రేమకు రుజువు మాటలు కావు, చేతలే. కన్నీళ్ళు, ఉత్తమ మనోభావాలు, ప్రేమను గురించిన జ్ఞానం కావు, విధేయతే. మనం క్రీస్తును నిజంగా ప్రేమిస్తున్నామో లేదో తెలుసుకునే విధానం ఏమిటంటే, ఆయన ఆజ్ఞలన్నిటినీ పరిశీలించి చూస్తూ మనం వాటిని పాటిస్తున్నామా లేదా అని చూచుకోవడమే. ఎలాంటి ఆజ్ఞలంటే యోహాను 13:13-17, యోహాను 13:34; మత్తయి 5:16, మత్తయి 5:23-24, మత్తయి 5:34, మత్తయి 5:39-42, మత్తయి 5:44; మత్తయి 6:1-6, మత్తయి 6:19-20, మత్తయి 6:25; మత్తయి 7:1; మత్తయి 9:38; మత్తయి 16:24; మత్తయి 18:15, మత్తయి 18:21-22; మత్తయి 19:4-6; మత్తయి 20:25-27; మత్తయి 24:42, మత్తయి 24:44; మత్తయి 28:19.

16. నేను తండ్రిని వేడుకొందును, మీయొద్ద ఎల్లప్పుడు నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను, అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకనుగ్రహించును.

క్రీస్తు శిష్యులు ఆందోళన చెందకుండా ఉండేందుకు మరో కారణం (వ 1). పరలోకంలో క్రీస్తు తన ప్రజల కోసం పరమ తండ్రిని ప్రార్థిస్తూ ఉన్నాడు. (రోమీయులకు 8:34; హెబ్రీయులకు 7:25). “ఆదరణకర్త” అని తర్జుమా చేసిన గ్రీకు పదానికి పెద్ద అర్థం ఉంది. “సహాయపడేందుకు దగ్గరికి పిలవబడినవాడు” అని దీని అర్థం. తరచుగా ఈ మాట చట్టానికి సంబంధించిన వ్యవహారాల్లో సహాయపడేవాడు, లేక ఒకరి పక్షంగా వాదించే మరో వ్యక్తి, బహుశా ఒక మధ్యవర్తి, ఒకరి గురించి విజ్ఞాపన చేసేవాడు అని కూడా అర్థం ఇస్తుంది. క్రొత్త ఒడంబడిక గ్రంథంలో వాడిన ఈ మాట నీతిన్యాయాలకూ పాపానికీ సంబంధించిన అన్ని విషయాల్లో విశ్వాసులకు సలహాలిచ్చే మిత్రుడు, వారికి బుద్ధి చెప్తూ, సహాయపడుతూ, ఓదారుస్తూ ఉండేవాడు, దేవుని ఎదుట వారికి ప్రతినిధిగా మాట్లాడేవాడు అని అర్థమిస్తున్నది. 17,26 వచనాలను బట్టి యేసుప్రభువు ఈ మాటలు చెప్తున్నది పవిత్రాత్మను గురించి అని స్పష్టంగా ఉంది. “మరో ఆదరణ కర్త”- అంటున్నాడు. అప్పటివరకూ ఆయనే వారి ఆదరణకర్త (గ్రీకు భాషలో 1 యోహాను 2:1 లో యేసుప్రభువుకు ఇదే మాట వాడబడింది. యెషయా 9:6 కూడా చూడండి). ఇప్పుడు తనలాంటి మరొకరిని పంపుతానని వాగ్దానం చేస్తున్నాడు. యోహాను 7:39; లూకా 24:49; అపో. కార్యములు 1:4-5, అపో. కార్యములు 1:8; అపో. కార్యములు 2:1-4 కూడా చూడండి. ఈ ఆదరణకర్త, విశ్వాసుల దివ్య స్నేహితుడు వారితో “ఎప్పటికీ” ఉంటాడు. వారినెన్నడూ వదిలిపోడు, చెయ్యి విడిచిపెట్టడు.

17. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు; మీరు ఆయనను ఎరుగుదురు. ఆయన మీతో కూడ నివసించును, మీలో ఉండును.

“ఈయన సత్యాత్మ”– దేవుడు సత్యస్వరూపి అయిన దేవుడు (కీర్తనల గ్రంథము 31:5; తీతుకు 1:2). యేసుప్రభువు తానే సత్యం (యోహాను 1:17; యోహాను 14:6). పవిత్రాత్మ సత్య ఆత్మ (యోహాను 15:26; యోహాను 16:13). ఆయన తత్వమే సత్యం. సత్యాన్ని ప్రేమిస్తాడు, సత్యమే పలుకుతాడు, సర్వసత్యంలోకి విశ్వాసులను నడిపిస్తాడు (యోహాను 16:13). “లోకం” అంటే అపనమ్మకంతో, పాపం, అంధకారంలో ఉన్న ఈ లోకం అని యేసు ఉద్దేశం. దైవాత్మ, దివ్యాత్మ, జీవాత్మ, పరమాత్మ వంటి పదాలను ఈ లోకం ఉపయోగించవచ్చు గానీ దానికి ఏకైక నిజ దేవుని పవిత్రాత్మ తెలియదు. ఆయన్ను అది స్వీకరించదు. యేసు శిష్యులకు ఈ పవిత్రాత్మ తెలుసు. పవిత్రాత్మ మూలంగానే వారు కొత్త జన్మ అనుభవించారు (యోహాను 1:12-13). యేసు పరిచర్యలో, తమ సేవల్లో పవిత్రాత్మ నిర్వహించిన పని వారికి తెలుసు (మత్తయి 10:1, మత్తయి 10:19-20; మత్తయి 12:28). ఆయన వారితో ఉండేవాడు. ఆయన వారిలో ఉండబోయే సమయం దగ్గర పడింది. వారి భౌతిక దేహాల్లో ఆయన నివాసం చేస్తాడు (1 కోరింథీయులకు 6:19). ఇది మనుషులందరి విషయంలో నిజం కాదు. యేసు క్రీస్తులో నమ్మకం ఉంచినవారికే ఇది జరుగుతుంది. రోమీయులకు 8:16; గలతియులకు 3:2; ఎఫెసీయులకు 4:18; యూదా 1:19 చూడండి. ప్రతి మనిషిలోనూ పుట్టుకనుంచి ఉండే ఆత్మ దైవాత్మ కాదు. అది దేవుడు సృష్టించిన ఆత్మ. ప్రతి వ్యక్తిలోనూ మిగతా వారందరికీ భిన్నంగా ఉండే ఆత్మ ఉంటుంది. దేవుని ఆత్మ శాశ్వతమైన ఆత్మ, సృజించబడని ఆత్మ. యేసు ప్రభువును తమ ప్రభువుగా, ముక్తిదాతగా స్వీకరించినవారిలో మాత్రమే నివసించేందుకు ఆ పవిత్రాత్మ వస్తాడు – గలతియులకు 3:1-5, గలతియులకు 3:14. లోకానికి ఆత్మ ఉంది గాని అది దేవుని ఆత్మ కాదు. ఎఫెసీయులకు 2:2 చూడండి. యేసు దేవుని ఆత్మ గురించి మాట్లాడుతూ ఆయన “ఉంటాడు” అంటూ వ్యక్తిగత నామవాచకం వాడడం గమనించండి. పవిత్రాత్మ అంటే కేవలం దేవునినుంచి వెలువడే ఒక దివ్య ప్రభావం కాదు. తండ్రి, కుమారుల్లాగానే ఆయనొక దైవిక వ్యక్తి. స్వభావంలోనూ, లక్షణాల్లోనూ వారితో ఐక్యంగా ఉన్నవాడు. మనం యేసును “అది” అని ఎలా అనమో దేవుని ఆత్మను కూడా “అది”, “వచ్చింది”, “ఉంది” అంటూ మాట్లాడకూడదు.

18. మిమ్మును అనాథలనుగా విడువను, మీ యొద్దకు వత్తును. కొంతకాలమైన తరువాత లోకము నన్ను మరి ఎన్నడును చూడదు;

యేసు మరణించి తిరిగి లేచిన తరువాత వారిదగ్గరికి వచ్చాడు (20,21 అధ్యాయాలు). పెంతెకొస్తు దినాన దేవుని ఆత్మ వారిమీదికి వచ్చినప్పుడు ఒక విధంగా యేసు వారిదగ్గరికి వచ్చినట్టే (రోమీయులకు 8:9 లో పవిత్రాత్మను క్రీస్తు ఆత్మ అని పౌలు అన్నాడు). అయితే ఒక వేళ ఇక్కడ ఆయన తన రెండో రాకడ గురించి చెప్తూ ఉండవచ్చు (వ 3).

19. అయితే మీరు నన్ను చూతురు. నేను జీవించుచున్నాను గనుక మీరును జీవింతురు.

ఆయన సజీవంగా లేచిన తరువాత ఆయన శిష్యులు ఆయన్ను చూశారు (యోహాను 20:20, యోహాను 20:29; 1 కోరింథీయులకు 15:5-8). తాను ఎవరినని యేసు చెప్పుకున్నాడో నిజంగా ఆయనే అనడానికీ, ఆయన ఉపదేశాలన్నీ సత్యమనడానికీ ఇది బలమైన ఆధారం. మత్తయి 28:6 నోట్ చూడండి. “మీరూ బ్రతుకుతారు”– రోమీయులకు 5:9-10; కొలొస్సయులకు 3:3-4 పోల్చి చూడండి. ఆయన శిష్యుల జీవాన్ని గురించిన ఆశాభావానికి ఆధారం ఆయన సజీవంగా లేవడంతోనే ముడిపడి ఉంది – యోహాను 5:21, యోహాను 5:26; యోహాను 6:47, యోహాను 6:54; యోహాను 11:25-26.

20. నేను నా తండ్రియందును, మీరు నాయందును, నేను మీయందును ఉన్నామని ఆ దినమున మీరెరుగుదురు.

“ఆ రోజున”– ఆయన సజీవంగా లేచిన వెంటనే వచ్చే సమయం అని అర్థం. ఆయన తమను ఎలాంటి ఐక్యతలోకి తీసుకురానున్నాడో వారప్పుడు గ్రహిస్తారు – వ 10; యోహాను 17:21-23. విశ్వాసుల్లో క్రీస్తు, ఆయనలో వారు – ఇది క్రీస్తు రాయబారి పౌలు రాసిన లేఖల్లో అంతటా కనిపించే అంశం. (రోమీయులకు 6:3-8; రోమీయులకు 8:9-11; 2 కోరింథీయులకు 13:5; గలతియులకు 2:20; ఎఫెసీయులకు 1:1).

21. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించువాడు; నన్ను ప్రేమించువాడు నా తండ్రివలన ప్రేమింపబడును; నేనును వానిని ప్రేమించి, వానికి నన్ను కనబరచుకొందునని చెప్పెను.

వ 15. తన విశ్వాసులకు తనతో, తండ్రి అయిన దేవునితో ఉన్న సంబంధాన్ని నొక్కి చెపుతున్నాడు. ఇది ప్రేమ సంబంధం. తమ విధేయత మూలంగా విశ్వాసులూ తనను తాను స్పష్టంగా వెల్లడి చేసుకోవడం ద్వారా దేవుడూ ఈ సంబంధాన్ని ప్రదర్శిస్తారు. దాన్ని అనుభవించిన వారికే అదేమిటో తెలుస్తుంది. తనపట్ల ప్రేమ విధేయతలు గల పిల్లలంటే దేవునికి ఒక ప్రత్యేకమైన ప్రేమ ఉంది. ఇది కుటుంబ సంబంధమైన ప్రేమబంధం, ప్రేమ చూపడంలో ఆనందం. లోకం పట్ల ఆయనకున్న ప్రేమకు ఇది భిన్నమైనది. అది నశించిపోయిన భ్రష్ట స్థితిలో ఉన్న లోకం పట్ల జాలి, కనికరాలతో కూడిన ప్రేమ.

22. ఇస్కరియోతు కాని యూదా ప్రభువా, నీవు లోకమునకు కాక మాకు మాత్రమే నిన్ను నీవు కనబరచుకొనుటకేమి సంభవించెనని అడుగగా

లూకా 6:16; అపో. కార్యములు 1:13. యేసు ఇస్రాయేల్‌వారి అభిషిక్తుడుగా గొప్ప మహిమతో యూద జాతికీ, లోకానికీ తనను తాను కనపరచుకుంటాడనీ, అధికారాన్ని హస్తగతం చేసుకుని పరిపాలిస్తాడనీ ఇతడు, మిగతా శిష్యులు ఆశించారు. లూకా 24:25-26 చూడండి.

23. యేసు ఒకడు నన్ను ప్రేమించిన యెడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకువచ్చి వానియొద్ద నివాసము చేతుము.

ఇక్కడ మళ్ళీ విధేయత ప్రాముఖ్యతను నొక్కి చెప్తున్నాడు – వ 15,21. ఈ సత్యాన్ని ప్రభువు ఎంత ప్రధానమైనదిగా ఎంచాడన్న సంగతి ఆ ఒకే సమయంలో దీన్ని మూడుసార్లు చెప్పడంలోనే అర్థమౌతున్నది. ఇక్కడ ఆయన చేసిన వాగ్దానం బైబిలంతటిలోకీ గొప్ప వాగ్దానాల్లో ఒకటి. తన ప్రజలతో నివాసం చేయాలన్న దేవుని కోరికను ఇది తెలుపుతున్నది. నిర్గమకాండము 25:8 నోట్‌లో రిఫరెన్సులు చూడండి. యేసుప్రభువును ప్రేమించేవారికి ఇప్పుడు ఆయన అలా చేస్తానని మాట ఇస్తున్నాడు. ఆయన్ను ప్రేమించే ప్రతి ఒక్కరి దగ్గరికీ తానూ, తండ్రి అయిన దేవుడూ ఇద్దరూ వచ్చి నివాసం చేస్తామని ఆయన చెప్తున్న మాట గమనించండి. ఇది దేవునికి మాత్రమే సాధ్యం. స్వభావరీత్యా యేసు తండ్రి అయిన దేవుని వంటివాడే. అయితే ఇక్కడ మరోసారి తనను ఒక ప్రత్యేక వ్యక్తిగా తండ్రికి వేరుగా ఉన్న విషయం సూచిస్తున్నాడు. ఫిలిప్పీయులకు 2:6; లూకా 2:11 నోట్స్‌లో ఇతర రిఫరెన్సులు ఉన్నాయి.

24. నన్ను ప్రేమింపని వాడు నా మాటలు గైకొనడు; మీరు వినుచున్న మాట నామాట కాదు, నన్ను పంపిన తండ్రిదే.

బైబిలును కేవలం చదువుతూ, బైబిలు నుంచి మంచి ప్రసంగాలు మాత్రం వింటూ క్రైస్తవులమని చెప్పుకుంటూ అసలు బైబిలు చెప్తున్నదానికి లోబడనివారి నిజ స్థితి ఏమిటో దీన్నిబట్టి మనం తెలుసుకోవచ్చు.

25. నేను మీయొద్ద ఉండగానే యీ మాటలు మీతో చెప్పితిని.

26. ఆదరణకర్త, అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటిని మీకు జ్ఞాపకము చేయును.

క్రీస్తు ఆది శిష్యులకు ఇది ప్రత్యేకమైన వాగ్దానం. యేసు ఉపదేశించినదాన్నే ఉపదేశించేలా పవిత్రాత్మ వారికి సామర్థ్యం ఇస్తాడు (దాన్ని రాయగలిగే సామర్థ్యాన్ని ఇస్తాడు కూడా – ఇలా అని ఇక్కడ రాయకపోయినా ఇది కూడా ఈ మాటల్లో ఉంది). వారు తెలుసుకోవలసినదంతా ఆయన వారికి నేర్పిస్తాడు. యేసు చెప్పినదంతా వారికి జ్ఞాపకం చేస్తాడు. దేవుని ఆత్మ విశ్వాసులందరికీ నేర్పిస్తాడన్నది కూడా నిజమే (1 కోరింథీయులకు 2:10-13; 1 యోహాను 2:27). దేవుడే ఉపదేశకుడుగా ఉండడం గురించి కీర్తనల గ్రంథము 25:4-5 చూడండి. దేవుని ఆత్మకు ఇక్కడ ఉన్న పేరును జాగ్రత్తగా గమనించండి. ఆయన “పవిత్ర” ఆత్మ, పవిత్ర దేవునితో ఐక్యతగల ఆత్మ. “పవిత్రత” గురించి నోట్స్ యోహాను 17:17-19; లేవీయకాండము 20:7. పవిత్రాత్మ అంటే తండ్రి గానీ కుమారుడు గానీ కాదని గమనించండి. తండ్రి ఆయన్ను క్రీస్తు పేరట పంపుతాడు (వ 16). త్రిత్వం గురించి మత్తయి 3:16 నోట్ చూడండి.

27. శాంతి మీ కనుగ్రహించి వెళ్లుచున్నాను; నా శాంతినే మీ కనుగ్రహించుచున్నాను; లోకమిచ్చునట్టుగా నేను మీ కనుగ్రహించుటలేదు; మీ హృదయమును కలవరపడనియ్యకుడి, వెరవనియ్యకుడి.

మనుష్యులు ఆందోళన చెందకుండా ఉండడానికి కారణం – యేసు శాంతి కర్త (యెషయా 9:6). దేవునికీ మనిషికీ మధ్య శాంతి కుదర్చాలని ఆయన వచ్చాడు (2 కోరింథీయులకు 5:19-20; కొలొస్సయులకు 1:20, కొలొస్సయులకు 1:22). ఇక్కడైతే విశ్వాసులకు తానిచ్చే మనశ్శాంతిని గురించి ఆయన మాట్లాడుతున్నాడు (యోహాను 16:33; ఫిలిప్పీయులకు 4:6-7; కొలొస్సయులకు 3:15; 2 థెస్సలొనీకయులకు 3:16). చాలామంది దేన్నైతే కోరుతూ అనుభవించలేకపోతున్నారో దాన్ని తన శిష్యులకు ఉచితంగా ఇచ్చి భయ కారణాలన్నింటినీ తొలగిస్తాడు.

28. నేను వెళ్లి మీయొద్దకు వచ్చెదనని మీతో చెప్పిన మాట మీరు వింటిరిగదా. తండ్రి నాకంటె గొప్పవాడు గనుక మీరు నన్ను ప్రేమించినయెడల నేను తండ్రియొద్దకు వెళ్లుచున్నానని మీరు సంతోషింతురు.

వారాయన్ను ప్రేమించారు. కానీ వారి ప్రేమ ఉండవలసిన రీతిలో ఉంటే వారు తమ గురించి కాక ఆయన గురించీ ఆయన నెరవేర్చడానికి వచ్చిన పని ముగింపు గురించీ ఆలోచించేవారు. తండ్రి సన్నిధిలో ఆయనకు లభించనున్న ధన్యస్థితిని బట్టి ఆనందించేవారు. యేసు తనను తండ్రి అయిన దేవునికి వేరుగా ఎలా చెప్తున్నాడో చూడండి. స్వభావం, లక్షణాలలో తండ్రి కుమారునికన్నా అధికుడే కాదు. ఎందుకంటే ఇద్దరూ ఈ విషయంలో సమాన భాగస్తులు (వ 9; యోహాను 8:24, యోహాను 8:58; యోహాను 1:1; యోహాను 10:30). అయితే హోదాలోనూ, అధికారంలోనూ తండ్రి అధికుడు యోహాను 5:19-27; యోహాను 12:49 చూడండి. చూపడం, ఇవ్వడం, పంపడం, ఆజ్ఞాపించడం తండ్రి బాధ్యత. చూడడం, పుచ్చుకోవడం, తండ్రికి విధేయుడై రావడం, ఆయన ఆజ్ఞలను నెరవేర్చడం కుమారుని బాధ్యత.

29. ఈ సంగతి సంభవించినప్పుడు, మీరు నమ్మవలెనని అది సంభవింపకముందే మీతో చెప్పుచున్నాను.

యోహాను 13:19 చూడండి.

30. ఇకను మీతో విస్తరించి మాటలాడను; ఈ లోకాధికారి వచ్చుచున్నాడు. నాతో వానికి సంబంధమేమియులేదు.

“లోక పాలకుడు”– యోహాను 12:31. యేసుప్రభువు పాపరహితుడు. సైతాను మాటకు గానీ ప్రేరణకు గానీ ఎప్పుడూ లొంగలేదు. తనది అని సైతాను అనగలిగినది యేసులో ఏమీ లేదు. ఆయన జీవితంపై సైతాను ఏవిధంగానూ ప్రభావం చూపే విధానం ఏమీ లేదు.

31. అయినను నేను తండ్రిని ప్రేమించుచున్నానని లోకము తెలిసికొనునట్లు తండ్రి నాకు ఆజ్ఞాపించినది నెరవేర్చుటకు నేనీలాగు చేయుచున్నాను. లెండి, యిక్కడనుండి వెళ్లుదము.

క్రీస్తుపై సాతానుకు కొంత పట్టు ఉన్నట్టుగానే అనిపించే సమయం త్వరలో రానున్నది. “అంధకార సమయం” (లూకా 22:53) వచ్చింది. మనుషులు యేసుపై దేవదూషణ నేరం మోపి నేరస్థుడిలాగా ఆయనకు మరణ శిక్ష అమలు జరపబోతున్నారు. అయితే ఇదంతా సైతాను ఆయనపై ఏదో పట్టు సంపాదించినందువల్ల కాదు గానీ యేసు తండ్రి సంకల్పానికి లోబడినందువల్లే (యోహాను 10:17-18). ప్రేమకు రుజువు విధేయతేనని యేసు తన శిష్యులతో చెప్పాడు (వ 15,21,23). ఇక్కడ తన సొంత జీవితంలో అందుకు ఈ రుజువు చూపిస్తున్నాడు. ఒకటి బోధించి మరొకటి చేస్తూ ఉండే అనేకమంది గురువుల్లాగా కాదు ఆయన.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
John - యోహాను సువార్త 14 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

క్రీస్తు తన శిష్యులను ఓదార్చాడు. (1-11) 
ఇక్కడ మూడు కీలక పదాలు ఉన్నాయి, ప్రతి ఒక్కటి ఉద్ఘాటన యొక్క బరువును భరించగల సామర్థ్యం కలిగి ఉంటాయి. "ఇబ్బంది"ని పరిగణించండి: బాధల క్షణాలలో, నిరాశ మరియు అశాంతిని నిరోధించండి. "హృదయం" గురించి ఆలోచించండి: మీ అంతరంగాన్ని దేవునిపై అచంచలమైన నమ్మకంతో నింపండి. "మీ" గురించి ఆలోచించండి: ఇతరులు ప్రస్తుత దుఃఖానికి లొంగిపోయినప్పటికీ, దృఢంగా నిలబడండి. క్రీస్తు శిష్యులు, ముఖ్యంగా, గందరగోళం మధ్య ప్రశాంతతను కాపాడుకోవాలి. మానసిక క్షోభకు విరుగుడు ఒక సాధారణ ప్రిస్క్రిప్షన్‌లో ఉంది: "నమ్మండి." దేవుడు మరియు మానవత్వం మధ్య మధ్యవర్తిగా క్రీస్తులో విశ్వాసాన్ని స్వీకరించడం ఓదార్పునిస్తుంది. స్వర్గం యొక్క ఆనందం విమోచించబడిన కుమారుల సమూహానికి శాశ్వత గదులతో కూడిన పితృ నివాసంతో పోల్చబడింది. క్రీస్తు, మన కోసం ఒక స్థలాన్ని సిద్ధం చేసి, మన తయారీని పూర్తి చేస్తామని హామీ ఇస్తున్నాడు. ఇనిషియేటర్ మరియు పరాకాష్టగా, అతను వాగ్దానం చేసిన నివాసానికి సంసిద్ధతకు హామీ ఇస్తాడు. క్రీస్తు తండ్రికి మరియు పరలోక రాజ్యాలకు వాహికగా పనిచేస్తాడు-దేవునిగా అవతరించి, త్యాగం ద్వారా ప్రాయశ్చిత్తం చేస్తాడు మరియు మన తరపున వాదించాడు. అతను ట్రూత్ మూర్తీభవించిన, భవిష్య వాగ్దానాలు నెరవేర్చుట; ఆయనపై నమ్మకం ద్వారా, పాపులు మార్గాన్ని కనుగొంటారు. ఆయన జీవం, ఆత్మీయంగా చనిపోయినవారిని తన జీవాన్ని ఇచ్చే ఆత్మ ద్వారా బ్రతికించాడు. దేవుని తండ్రిగా సమీపించడం వలన ఆయన ద్వారా జీవంగా పునరుజ్జీవింపబడడం మరియు సత్యంగా ఆయన ద్వారా ఉపదేశించబడడం-ఆయన ద్వారా మార్గంగా రావడం అవసరం. క్రీస్తు ద్వారా, మన ప్రార్థనలు దేవునికి ఆరోహణమవుతాయి, మరియు ఆయన ఆశీర్వాదాలు మనపైకి వస్తాయి-విశ్రాంతి కోసం దారితీసే మార్గం, కాలరహిత మార్గం. ఆయన పునరుత్థానం మరియు జీవం రెండూ. విశ్వాసం ద్వారా క్రీస్తును గ్రహించిన వారు అతనిలో తండ్రిని చూస్తారు. అతని బోధనలు దేవుణ్ణి లైట్ల తండ్రిగా వెల్లడిస్తాయి మరియు అతని అద్భుతాలు దేవుణ్ణి సర్వశక్తిమంతుడైన సృష్టికర్తగా ప్రదర్శిస్తాయి. దేవుని పవిత్రత క్రీస్తు ఉనికి యొక్క కళంకమైన స్వచ్ఛతలో ప్రసరిస్తుంది. విమోచకుని పనులు అతని మహిమను మరియు అతనిలో దేవుని ఉనికిని రెండింటినీ ప్రకాశింపజేస్తాయి కాబట్టి, క్రీస్తు ద్వారా దేవుని ప్రత్యక్షతపై విశ్వాసాన్ని స్వీకరించండి.

ఆయన తన శిష్యులను మరింత ఓదార్చేవాడు. (12-17) 
మన శ్రేయస్సుకు అనుగుణంగా మరియు మన పరిస్థితులకు సరిపోయే క్రీస్తు నామంలో మనం ఏది కోరితే, ఆయన మనకు అనుగ్రహిస్తాడు. క్రీస్తు నామంలో వెతకడం అంటే అతని యోగ్యత మరియు మధ్యవర్తిత్వం, ఆ విజ్ఞప్తిపై ఆధారపడటం. ఆత్మ యొక్క ప్రసాదం అనేది క్రీస్తు మధ్యవర్తిత్వం యొక్క ఫలితం, అతని యోగ్యత ద్వారా పొందబడింది మరియు అతని మధ్యవర్తిత్వం ద్వారా పొందబడింది. ఇక్కడ ఉపయోగించిన పదం న్యాయవాది, సలహాదారు, గైడ్ మరియు ఓదార్పు పాత్రలను తెలియజేస్తుంది. క్రీస్తు చివరి వరకు తన శిష్యులతో ఉంటాడని మరియు అతని బహుమతులు మరియు దయలు వారి హృదయాలను బలపరుస్తాయని హామీ ఇచ్చాడు. ఇక్కడ మరియు మరెక్కడా ఉపయోగించబడిన భాష, నిస్సందేహంగా ఒక ప్రత్యేక వ్యక్తిని సూచిస్తుంది మరియు పాత్ర అన్ని దైవిక పరిపూర్ణతలను కలిగి ఉంటుంది. పరిశుద్ధాత్మ యొక్క బహుమానం క్రీస్తు అనుచరులకు ఇవ్వబడుతుంది, ప్రపంచానికి కాదు-ఇది దేవుడు ఎన్నుకున్న వారి పట్ల అనుగ్రహం యొక్క అభివ్యక్తి. పవిత్రత మరియు ఆనందం యొక్క మూలంగా, పరిశుద్ధాత్మ ప్రతి విశ్వాసితో శాశ్వతంగా ఉంటాడు.

ఆయన తన శిష్యులను ఇంకా ఓదార్పునిచ్చాడు. (18-31)
18-24
క్రీస్తు తన శిష్యులను చూస్తూనే ఉంటానని హామీ ఇచ్చాడు. అతను వారిని అనాథలుగా లేదా తండ్రిలేని వారిగా విడిచిపెట్టకూడదని ప్రతిజ్ఞ చేస్తాడు, అతను భౌతికంగా విడిచిపెట్టినప్పటికీ, ఓదార్పునిచ్చే హామీ మిగిలి ఉంది: "నేను మీ వద్దకు వస్తాను." ఈ రాకడ వేగవంతమైనది-అతని పునరుత్థానంలో స్పష్టంగా కనిపిస్తుంది-మరియు కొనసాగుతున్నది, ప్రేమ యొక్క వ్యక్తీకరణలు మరియు దయ యొక్క సందర్శనలలో అతని ఆత్మ ద్వారా ప్రతిరోజూ వ్యక్తమవుతుంది. సమయం ముగింపులో ఒక ఖచ్చితమైన పరాకాష్ట వేచి ఉంది. విశ్వాసం యొక్క లెన్స్ ద్వారా క్రీస్తును గ్రహించేవారు ఆయనతో శాశ్వతమైన సహవాసం కలిగి ఉంటారు; ప్రపంచం, అయితే, ఆయన రెండవ రాకడ వరకు ఆయనను చూడదు. అయినప్పటికీ, ఆయన లేనప్పుడు, శిష్యులు ఆయనతో లోతైన సంబంధాన్ని కలిగి ఉంటారు. ఈ రహస్యాల గురించిన అవగాహన స్వర్గ రాజ్యాలలో పూర్తి స్పష్టతకు చేరుకుంటుంది, విశ్వాసులు ఆదరించడానికి అదనపు దయ. క్రీస్తు ఆజ్ఞలను స్వీకరించడం అత్యవసరం, మానసిక ధారణ మాత్రమే కాకుండా హృదయపూర్వకంగా మరియు ఆచరణాత్మకంగా పాటించాల్సిన అవసరం ఉంది. క్రీస్తు పట్ల ప్రేమకు అత్యంత బలవంతపు రుజువు ఆయన చట్టాలకు విధేయత చూపడం. క్రీస్తు ఉనికి మరియు ప్రేమ యొక్క ఆధ్యాత్మిక సూచనలు విశ్వాసులందరికీ అందించబడ్డాయి. క్రీస్తు పట్ల నిజమైన ప్రేమ ఉన్నచోట, విధేయత ఒక మార్గదర్శక శక్తిగా మారుతుంది—ఇది కృతజ్ఞతలో నాటుకుపోయిన సూత్రం. దేవుడు విధేయులైన విశ్వాసులను ప్రేమించడమే కాకుండా ఆ ప్రేమను వ్యక్తపరచడంలో, వారితో నివాసం ఏర్పరచుకోవడంలో సంతోషిస్తాడు. ఈ అధికారాలు ఎవరి విశ్వాసం ప్రేమలో చురుకుగా ఉందో మరియు యేసు పట్ల ఉన్న అభిమానం ఆయన ఆజ్ఞలను పాటించేలా వారిని పురికొల్పే వారికి ప్రత్యేకించబడింది. అలాంటి వ్యక్తులు పరిశుద్ధాత్మ యొక్క నూతన కృపలో పాలుపంచుకుంటారు.

25-27
మన ప్రయోజనం కోసం ఈ సత్యాలను అర్థం చేసుకోవడానికి, మనం పరిశుద్ధాత్మ యొక్క మార్గదర్శకత్వాన్ని వెతకాలి మరియు దానిపై ఆధారపడాలి. దీని ద్వారా, యేసు మాటలు మనకు గుర్తుకు వస్తాయి మరియు ఇతరులకు అస్పష్టంగా ఉన్న అనేక చిక్కులు స్పష్టమవుతాయి. దయ యొక్క ఆత్మ ఒక రిమైండర్‌గా పనిచేయడానికి అన్ని సెయింట్స్‌పై ప్రసాదించబడింది మరియు విశ్వాసం మరియు ప్రార్థన ద్వారా, మనం విన్న మరియు అర్థం చేసుకున్న వాటిని భద్రపరచడాన్ని మనం అప్పగించాలి. "శాంతి" అనే పదం నిజమైన మంచిని కలిగి ఉంటుంది మరియు క్రీస్తు మనకు వాగ్దానం చేసిన ప్రతి మంచిని-దేవునితో న్యాయబద్ధమైన సంబంధం యొక్క ప్రశాంతతను ఇచ్చాడు. క్రీస్తు దీనిని "తన శాంతి" అని సూచిస్తాడు, ఎందుకంటే అతను మన శాంతికి స్వరూపుడు. దేవుని శాంతి ప్రాథమికంగా పరిసయ్యులు లేదా వేషధారుల నుండి భిన్నంగా ఉంటుంది, దాని వినయం మరియు పవిత్రీకరణ ప్రభావాలలో స్పష్టంగా కనిపిస్తుంది.

28-31
క్రీస్తు తన శిష్యుల అంచనాలను వారి అత్యంత సంతోషముగా భావించిన దానికంటే ఒక స్థాయికి పెంచాడు. వారితో సమయం తక్కువగా ఉందని తెలుసుకుని సుదీర్ఘంగా మాట్లాడారు. అనారోగ్యం మరియు మరణం సమీపించినప్పుడు, మన సంభాషించే సామర్థ్యం తగ్గిపోతుంది; అందువల్ల, మంచి ఆరోగ్యంతో ఉన్నప్పుడు విలువైన సలహాను అందించడం చాలా ముఖ్యం. మానవులతోనే కాకుండా చీకటి శక్తులతో కూడా రాబోయే సంఘర్షణ గురించి క్రీస్తు ఎదురుచూడడాన్ని గమనించండి. మన పాపాల కారణంగా సాతాను మనలో కలవరానికి కారణాలను కనుగొన్నప్పటికీ, అతను క్రీస్తులో దోపిడీ చేయడానికి పాపభరితమైన పునాదిని కనుగొనలేదు. తండ్రి పట్ల మనకున్న ప్రేమకు అత్యంత బలవంతపు రుజువు ఆయన ఆజ్ఞలకు విధేయత చూపడంలో కనిపిస్తుంది. ఈ లోకానికి అధిపతియైన సాతానుపై రక్షకుని సాధించిన విజయాలలో మనం ఆనందాన్ని పొందుతాము మరియు ప్రేమ మరియు విధేయతలో అతని మాదిరిని అనుకరించడానికి కృషి చేద్దాం.


Shortcut Links
యోహాను - John : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |