Corinthians I - 1 కొరింథీయులకు 7 | View All

1. మీరు వ్రాసిన వాటి విషయము: స్త్రీని ముట్టకుండుట పురుషునికి మేలు.

ఈ అధ్యాయంలో వివాహం గురించి పౌలు ఉపదేశం అర్థం చేసుకునేందుకు కొన్ని సత్యాలు మనకు తోడ్పడవచ్చు. దేవుడు బైబిలు నంతటినీ తన సేవకులచేత రాయించాడని పౌలు నమ్మకం (2 తిమోతికి 3:16). అందులో దేవుడు వెల్లడించిన దేనినీ వ్యతిరేకించేందుకు పౌలు సాహసించడు. అసలు పౌలు క్రొత్త ఒడంబడికలో రాసిన మాటలన్నీ కూడా దేవుడు రాయించినవే. మనుషుల మేలుకోసం దేవుడు వివాహాన్ని నియమించాడు (ఆదికాండము 2:20-24; మత్తయి 19:4-6). పౌలు తానే వివాహ సంబంధాన్ని మనోహరమైన, అర్థవంతమైన భాషలో వర్ణించాడు (ఎఫెసీయులకు 5:25-33). విశ్వాసులకు వివాహాన్ని పౌలు నిషేధించలేదు. అలా నిషేధించినవారెవరైనా ఉంటే వారు మోసపోయినవారని అతనికి తెలుసు (1 తిమోతికి 4:1-3). పెళ్ళి చేసుకొనేందుకూ చేసుకోకుండా ఉండేందుకూ విశ్వాసులకున్న స్వేచ్ఛను పౌలు గట్టిగా నొక్కి చెప్పాడు. బ్రహ్మచారిగా ఉండిపోవడం పెళ్ళైనవాడుగా ఉండడం కన్నా పవిత్ర స్థితి అని చెప్పలేదు. పెళ్ళి గురించి అడుగుతూ లేఖ రాసిన కొరింతు క్రైస్తవులకు పౌలు రాస్తున్నాడు. ఇప్పటి “కష్టదశ” కారణంగా (వ 26), “కాలం కొద్దిగానే” ఉంది గనుక (వ 29) అతడు కొన్ని విషయాలు రాస్తున్నాడు. అలాటి పరిస్థితుల్లో పెళ్ళి కాకుండా ఉన్నవారు అలానే ఉండగలిగితే (వ 8,9) ఉండడం మంచిదని అతని అభిప్రాయం. ఇక్కడ పౌలు చెప్పిన కొన్ని విషయాలు అన్ని కాలాలకూ సరిపోయేవి. మరి కొన్ని ఆ సమయంలో కొరింతులో ఉన్న పరిస్థితులకు సంబంధించినవి. మనుషులు పెళ్ళి చేసుకోవడం మంచిదని కూడా వేరే చోట పౌలు చెప్పాడు (1 తిమోతికి 5:14). హెబ్రీయులకు 13:4 తో అతడు తప్పక ఏకీభవించి ఉంటాడు.

2. అయినను జారత్వములు జరుగుచున్నందున ప్రతివానికి సొంతభార్య యుండవలెను, ప్రతి స్త్రీకి సొంతభర్త యుండవలెను.

కొరింతులో ఆ సమయంలో పెళ్ళికాని విశ్వాసులు లైంగిక అవినీతి జోలికి పోకుండా ఉండగలిగితే వివాహం చేసుకోకుండా ఉండడమే మంచిది.

3. భర్త భార్యకును ఆలాగుననే భార్య భర్తకును వారి వారి ధర్మములు నడుపవలెను.

భర్త గానీ భార్య గానీ ఈ సూత్రం పాటించకపోతే ఏ వివాహానికైనా ఇక్కట్లు తప్పవు.

4. భర్తకేగాని భార్యకు తన దేహముపైని అధికారము లేదు; ఆలాగున భార్యకే గాని భర్తకు తన దేహముపైని అధికారము లేదు.

5. ప్రార్థనచేయుటకు మీకు సావకాశము కలుగునట్లు కొంతకాలమువరకు ఉభయుల సమ్మతి చొప్పుననే తప్ప, ఒకరినొకరు ఎడబాయకుడి; మీరు మనస్సు నిలుపలేకపోయినప్పుడు సాతాను మిమ్మును శోధింపకుండునట్లు తిరిగి కలిసికొనుడి.

వారు ఎక్కువ కాలం దూరంగా ఉంటే ఇతరులతో పాపం చేసేలా ప్రేరేపించేందుకు సైతానుకు అవకాశం ఇస్తున్నట్టవుతుందేమో.

6. ఇది నా హితోపదేశమేగాని ఆజ్ఞ కాదు; మనుష్యులందరు నావలె ఉండగోరుచున్నాను.

ఇక్కడ పౌలు బహుశా వ 2ను గురించి రాస్తూ ఉండవచ్చు. పెళ్ళి చేసుకోకూడదని గానీ చేసుకోవాలని గానీ పౌలు విశ్వాసులకు ఎలాంటి ఆజ్ఞా ఇవ్వలేదు.

7. అయినను ఒకడొక విధమునను మరి యొకడు మరియొక విధమునను ప్రతి మనుష్యుడు తన కున్న కృపావరమును దేవునివలన పొందియున్నాడు.

“నాలాగే”– అంటే పెళ్ళికాని స్థితిలో (వ 8). “కృపావరం”– దేవుడు వివాహమనే కృపావరం కొందరికీ, వివాహం లేని జీవితమనే కృపావరం కొందరికి ఇస్తాడు. దేవుని వరాలన్నీ మంచివేనని నిస్సందేహంగా నమ్మవచ్చు. దేవుని కృపవల్ల కొందరికి పెళ్ళిచేసుకోవాలనే కోరిక, మరో విశ్వాసిని పెళ్ళాడే అవకాశమూ కలుగుతాయి. మరి కొందరికి దేవుని కృపవల్ల పెళ్ళి చేసుకోకుండా, లైంగిక అవినీతి లేకుండా ఉండగలిగే సామర్థ్యమూ కలుగుతుంది. మత్తయి 19:11-12 పోల్చి చూడండి.

8. నావలెనుండుట వారికి మేలని పెండ్లికానివారితోను విధవరాండ్రతోను చెప్పుచున్నాను.

9. అయితే మనస్సు నిలుపలేనియెడల పెండ్లిచేసికొనవచ్చును; కామతప్తులగుట కంటె పెండ్లిచేసికొనుట మేలు.

వాంఛలతో మరిగిపోతూ, లైంగిక దుష్‌ప్రేరణలతో అస్తమానమూ పెనుగులాడుతూ ఉండడం ఆధ్యాత్మిక జీవితానికి హానికరం. తన ప్రజలు పెళ్ళి అయినవారైనా కానివారైనా ఆధ్యాత్మికంగా క్రైస్తవ జీవితంలో విజయవంతమైనవారుగా ఉండాలని దేవుని కోరిక.

10. మరియు పెండ్లియైన వారికి నేను కాదు ప్రభువే ఆజ్ఞాపించునదేమనగా, భార్య భర్తను ఎడబాయకూడదు.

పౌలు ఇంతకుముందు (వ 6) చెప్పినది ఆజ్ఞ కాదు. విశ్వాసులకు పెళ్ళి చేసుకోవడం, చేసుకోకపోవడం విషయంలో స్వేచ్ఛ ఉంది. కానీ ఒక సారి పెళ్ళి అయిన తరువాత ఒకరినొకరు విడాకులు ఇచ్చుకోవడానికి స్వేచ్ఛ లేదు. అందువల్ల పౌలు క్రీస్తు ఉపదేశాలపై ఆధారపడిన ఆజ్ఞను ఇస్తున్నాడు – మత్తయి 5:32; మత్తయి 19:3-9; లూకా 16:18. విశ్వాసుల మధ్య వివాహం భార్య, భర్త బ్రతికి ఉన్నంతకాలం విడిపోని బంధం.

11. ఎడబాసినయెడల పెండ్లిచేసికొనకుండవలెను; లేదా, తన భర్తతో సమాధానపడవలెను. మరియు భర్త తన భార్యను పరిత్యజింపకూడదు.

“ఒకవేళ వేరైపోయినా”– భార్యాభర్తల్లో ఒకరికి వివాహ జీవితం దుర్భరంగా అనిపించి విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు. అలాంటి వ్యక్తి మళ్ళీ పెళ్ళి చేసుకోకూడదు.

12. ప్రభువు కాదు నేనే తక్కినవారితో చెప్పునదేమనగా ఏ సహోదరునికైనను అవిశ్వాసురాలైన భార్యయుండి, ఆమె అతనితో కాపురము చేయనిష్టపడిన యెడల, అతడు ఆమెను పరిత్యజింపకూడదు.

“ప్రభువు కాదు”– ఈ పరిస్థితుల గురించి యేసుప్రభువు తనకు ఏమీ నేర్పించలేదని పౌలు ఉద్దేశం కాదు. యేసు ఈ భూమిపై ఉన్నప్పుడు ఈ సంగతుల గురించి ఏమీ చెప్పలేదని దీని భావం. విశ్వాసులు విశ్వాసులనే వివాహం చేసుకోవాలని పౌలు నేర్పాడు (వ 39; 2 కోరింథీయులకు 6:14-15 మొ।।). ఇద్దరు అవిశ్వాసుల పెళ్ళి విషయం ఏమంటే, భార్య గానీ భర్త గానీ పెళ్ళి తరువాత విశ్వాసి కావచ్చు. రెండో వ్యక్తి అవిశ్వాసిగానే ఉండిపోవచ్చు. అలాంటి పరిస్థితుల్లో అనుసరించ వలసిన స్పష్టమైన ఆదేశాలను పౌలు ఇస్తున్నాడు.

13. మరియు ఏ స్త్రీకైనను అవిశ్వాసియైన భర్తయుండి, ఆమెతో కాపురముచేయ నిష్టపడినయెడల, ఆమె అతని పరిత్యజింపకూడదు.

14. అవిశ్వాసియైన భర్త భార్యనుబట్టి పరిశుద్ధ పరచబడును; అవిశ్వాసురాలైన భార్య విశ్వాసియైన భర్తనుబట్టి పరిశుద్ధపరచబడును. లేనియెడల మీ పిల్లలు అపవిత్రులైయుందురు, ఇప్పుడైతే వారు పవిత్రులు

“ప్రత్యేకమైన”అనే పదాన్ని పౌలు వాడుతున్న పద్ధతి చూడండి (గ్రీకు పదాన్ని “పవిత్రమైన” అని కూడా అనువదించవచ్చు. ఈ మాట గురించి యోహాను 17:17-19 నోట్ చూడండి). అవిశ్వాసులు విశ్వాసులను పెళ్ళి చేసుకుంటే పాపం నుంచి శుద్ధి పొంది, నైతికంగా నిర్మలంగా అవుతారని చెప్పడం లేదు. అలాంటి అవిశ్వాసి విశ్వాసిని పెళ్ళి చేసుకోని ఇతర అవిశ్వాసుల్లో ప్రత్యేకమైన వ్యక్తి. అంటే అలాంటి వ్యక్తినీ, వారికి పుట్టిన పిల్లలనూ దేవుడొక ప్రత్యేకమైన రీతిలో చూస్తాడు. దీని అర్థమేమిటో పౌలు చెప్పలేదు గానీ దేవుడు వారి విషయం అనుసరించే పద్ధతిలో నిజమైన అర్థవంతమైన తేడా ఉంటుందని మనం గట్టిగా నమ్మవచ్చు. ప్రత్యేకమైన, పవిత్రమైన అనే విషయాలపై లేవీయకాండము 20:7 నోట్ కూడా చూడండి.

15. అయితే అవిశ్వాసియైనవాడు ఎడబాసిన ఎడబాయవచ్చును; అట్టి సందర్భములలో సహోదరునికైనను సహోదరికైనను నిర్బంధము లేదు. సమాధానముగా ఉండుటకు దేవుడు మనలను పిలిచియున్నాడు.

“శాంతి”– ఒక విశ్వాసి సాధ్యమైతే అవిశ్వాసి అయిన భార్యతో లేక భర్తతో శాంతిగా జీవించాలి. అవిశ్వాసి తనను విడిచిపెట్టి వెళ్ళిపోదలచుకొంటే నెమ్మదిగా ఉండాలి. ఎలాంటి బలవంతం, నిర్బంధం ఇలాంటి విషయంలో ఉండకూడదు.

16. ఓ స్త్రీ, నీ భర్తను రక్షించెదవో లేదో నీకేమి తెలియును? ఓ పురుషుడా, నీ భార్యను రక్షించెదవో లేదో నీకేమి తెలియును?

“పాపవిముక్తి”– విశ్వాసి అయిన భార్య లేక భర్త తన పవిత్రమైన జీవితం ద్వారా, లేదా క్రీస్తుకు మంచి సాక్షిగా ఉండడం ద్వారా, ప్రార్థన, ఓర్పు ద్వారా అవిశ్వాసి అయిన తన భర్తను లేక భార్యను క్రీస్తు చెంతకు, ఆయనలో పాపవిముక్తికి నడిపించవచ్చు.

17. అయితే ప్రభువు ప్రతివానికి ఏస్థితి నియమించెనో, దేవుడు ప్రతివానిని ఏస్థితియందు పిలిచెనో, ఆ స్థితియందే నడుచుకొనవలెను; ఈ ప్రకారమే సంఘములన్నిటిలో నియమించుచున్నాను.

ఈ వచనాల్లో పౌలు వివాహం గురించీ, ఉదాహరణలుగా వాడుతున్న ఇతర జీవిత పరిస్థితుల గురించీ రాస్తున్నాడు. దేవుడు ప్రతి ఒక్కరినీ ఒక స్థితిలో ఉండేందుకు పిలిచాడు. ప్రతి ఒక్కరికీ ఒక స్థలాన్ని ఏర్పాటు చేశాడు. ప్రతి విశ్వాసి ముఖ్యంగా నేర్చుకోవలసినది ఏమిటంటే తనకోసం దేవుని సంకల్పం ఏమిటో తెలుసుకుని దానికి లోబడి ఉండడమే. జీవితంలో తానున్న స్థితిగతుల గురించి సణుగులు, అసంతృప్తి ఉండకూడదు. దేవుని సంకల్పమే తనకు మంచిదని గుర్తించి దాన్ని వినయంతో అంగీకరించాలి. పౌలు కొరింతులో ఉన్న పరిస్థితిని గురించి మాత్రమే మాట్లాడుతున్నాడని అనుకోరాదు.

18. సున్నతి పొందినవాడెవడైనను పిలువబడెనా? అతడు సున్నతి పోగొట్టుకొనవలదు; సున్నతి పొందనివాడెవడైనను పిలువబడెనా? సున్నతి పొందవలదు.

క్రీస్తులో నమ్మకం ఉంచిన యూదులు తమ యూద ధర్మ సంబంధమైన గుర్తులను చెరిపేసుకునే ప్రయత్నం చేయకూడదు. ఇతర ప్రజల్లో విశ్వాసులైనవారు తాము సున్నతి పొందాలను కోకూడదు (పొందాలని కొందరు కపట బోధకులు చెప్పారు – అపో. కార్యములు 15:1).

19. దేవుని ఆజ్ఞలను అనుసరించుటయే ముఖ్యము గాని సున్నతి పొందుటయందు ఏమియు లేదు, సున్నతి పొందక పోవుటయందు ఏమియులేదు.

శరీరంపై ఒక గుర్తు ఉండడం, లేకపోవడం దేవుని దృష్టిలో ముఖ్యమైనదేమీ కాదు. దేవుని సంకల్పం ప్రకారం జీవించడమే ముఖ్యం. గలతియులకు 6:15; రోమీయులకు 2:25-29.

20. ప్రతివాడు ఏ స్థితిలో పిలువబడెనో ఆ స్థితిలోనే యుండవలెను.

21. దాసుడవై యుండగా పిలువబడితివా? చింతపడవద్దు గాని స్వతంత్రుడవగుటకు శక్తి కలిగినయెడల, స్వతంత్రుడవగుట మరి మంచిది.

ఆ రోజుల్లో రోమ్ సామ్రాజ్యంలో బానిసత్వం సర్వ సాధారణం. బానిసల్లో అనేకమంది క్రీస్తులో నమ్మకం పెట్టుకొన్నారు. వారేం చెయ్యాలి? తమ స్థితిని ప్రశాంతంగా అంగీకరించాలి, వీలైతే స్వతంత్రత పొందాలి, క్రీస్తు తమను స్వతంత్రులుగా – అంటే పాపం, మరణం, ధర్మశాస్త్రం నుంచి విడుదల – చేశాడని గుర్తించాలి. యోహాను 8:36; గలతియులకు 5:1. మనుషులకు శారీరకంగా బానిసలు కానివారు తాము క్రీస్తుకు “బానిసల”మని గుర్తించాలి (రోమీయులకు 6:16-22). వేరే మాటల్లో చెప్పాలంటే జీవితంలో అన్ని పరిస్థితుల్లోనూ విశ్వాసులు క్రీస్తుతో తమ సంబంధం ప్రాముఖ్యమైనదని గుర్తించి ఆయనకు సేవ చేయాలి, ఘనత కలిగించాలి.

22. ప్రభువునందు పిలువబడిన దాసుడు ప్రభువువలన స్వాతంత్ర్యము పొందినవాడు. ఆ ప్రకారమే స్వతంత్రుడైయుండి పిలువబడినవాడు క్రీస్తు దాసుడు.

23. మీరు విలువపెట్టి కొనబడినవారు గనుక మనుష్యులకు దాసులు కాకుడి.

1 కోరింథీయులకు 6:20.

24. సహోదరులారా, ప్రతి మనుష్యుడును ఏస్థితిలో పిలువబడునో ఆ స్థితిలోనే దేవునితో సహవాసము కలిగి ఉండవలెను.

దీన్ని పౌలు ఇక్కడ మూడో సారి చెప్తున్నాడు. దీన్ని బట్టి దీనికున్న ప్రాముఖ్యతను గుర్తించగలం (వ 17,20). విశ్వాసులుగా మనం ఏ స్థితిలో ఉన్నప్పటికీ మనకు దేవుడు సమీపంగా ఉన్నాడని గుర్తించి ఆయన సన్నిధిలో ఉన్నట్టుగానే జీవించాలి.

25. కన్యకల విషయమై, ప్రభువుయొక్క ఆజ్ఞ నేను పొందలేదు గాని నమ్మకమైనవాడనై యుండుటకు ప్రభువు వలన కనికరము పొందినవాడనై నా తాత్పర్యము చెప్పుచున్నాను.

వ 10,12.

26. ఇప్పటి ఇబ్బందినిబట్టి పురుషుడు తానున్న స్థితిలోనే యుండుట మేలని తలంచుచున్నాను.

“కష్టదశ”– గ్రీకులో లూకా 21:23; 2 కోరింథీయులకు 6:4; 1 థెస్సలొనీకయులకు 3:7లో కూడా ఈ పదం వాడబడింది. పౌలు భావమేమంటే కొన్ని సమయాల్లో, పరిస్థితుల్లో పెళ్ళి చేసుకోకపోవడం మంచిదని.

27. భార్యకు బద్ధుడవై యుంటివా? విడుదల కోరవద్దు. భార్యలేక విడిగానుంటివా? వివాహము కోరవద్దు.

28. అయినను నీవు పెండ్లిచేసికొనినను పాపము లేదు, కన్యక పెండ్లిచేసి కొనినను ఆమెకు పాపము లేదు; అయితే అట్టివారికి శరీరసంబంధమైన శ్రమలు కలుగును; అవి మీకు కలుగకుండవలెనని కోరుచున్నాను.

29. సహోదరులారా, నేను చెప్పునదేమనగా, కాలము సంకుచితమైయున్నది గనుక ఇకమీదట భార్యలు కలిగినవారు భార్యలు లేనట్టును

“కాలం కొద్దిగానే ఉంది”(వ 29). ఇందులో పౌలు భావమేమిటో స్పష్టంగా లేదు. ఇంతకన్నా గొప్ప కష్ట కాలమే సంఘం మీదికి వస్తుందని పౌలు ముందుగా చూచి ఉండవచ్చు. యేసుప్రభువు త్వరలో తిరిగి రావచ్చని అతని తలంపు అనుకోవడానికి కూడా అవకాశం ఉంది (రోమీయులకు 13:11-12 పోల్చి చూడండి). త్వరలో బ్రహ్మాండమైన మార్పులు జరగబోతున్నాయని అతడు ఎదురు చూస్తున్నాడు (వ 31). భూమి పై అతి ప్రాముఖ్యమైన విషయం – అంటే ప్రభువుపట్ల తమ ప్రేమ, సేవ అనే విషయాల పైనే విశ్వాసులు మనసు లగ్నం చేసుకొని ఉండాలని అతని ఉద్దేశం (వ 35).

30. ఏడ్చువారు ఏడ్వనట్టును సంతోషపడువారు సంతోషపడనట్టును కొనువారు తాము కొనినది తమది కానట్టును

31. ఈ లోకము అనుభవించువారు అమితముగా అనుభవింపనట్టును ఉండవలెను; ఏలయనగా ఈ లోకపు నటన గతించుచున్నది.

32. మీరు చింతలేని వారై యుండవలెనని కోరుచున్నాను. పెండ్లికానివాడు ప్రభువును ఏలాగు సంతోషపెట్టగలనని ప్రభువు విషయమైన కార్యములను గూర్చి చింతించుచున్నాడు.

33. పెండ్లియైనవాడు భార్యను ఏలాగు సంతోషపెట్టగలనని లోకవిషయమైనవాటిని గూర్చి చింతించుచున్నాడు.

34. అటువలెనే పెండ్లికాని స్త్రీయు కన్యకయు తాము శరీరమందును ఆత్మయందును పవిత్రురాండ్రయియుండుటకు ప్రభువు విషయమైన కార్యములనుగూర్చి చింతించుచుందురు గాని పెండ్లియైనది భర్తను ఏలాగు సంతోషపెట్టగలనని లోక విషయమైనవాటిని గూర్చి చింతించుచున్నది.

35. మీకు ఉరియొడ్డవలెనని కాదుగాని మీరు యోగ్య ప్రవర్తనులై, తొందర యేమియు లేక ప్రభువు సన్నిధాన వర్తనులై యుండవలెనని యిది మీ ప్రయోజనము నిమిత్తమే చెప్పుచున్నాను.

36. అయితే ఒకని కుమార్తెకు ఈడు మించిపోయినయెడలను, ఆమెకు వివాహము చేయవలసివచ్చినయెడలను, ఆమెకు వివాహము చేయకపోవుట యోగ్యమైనది కాదని ఒకడు తలంచినయెడలను, అతడు తన యిష్టముచొప్పున పెండ్లి చేయవచ్చును; అందులో పాపము లేదు, ఆమె పెండ్లి చేసికొనవచ్చును

ఎవరికైనా పెళ్ళి చేసుకోవద్దని తాను చెప్పడం లేదన్న సంగతి స్పష్టం కావాలని పౌలు ఉద్దేశం. మారుతున్న ఆ కష్టకాలంలో కూడా విశ్వాసులకు వారికి మంచిదని తోచినదాన్ని చేసే స్వేచ్ఛ ఉంది.

37. ఎవడైనను తన కుమార్తెకు పెండ్లిచేయ నవసరములేకయుండి, అతడు స్థిరచిత్తుడును, తన ఇష్ట ప్రకారము జరుపశక్తిగలవాడునై, ఆమెను వివాహములేకుండ ఉంచవలెనని తన మనస్సులో నిశ్చయించుకొనిన యెడల బాగుగా ప్రవర్తించుచున్నాడు.

38. కాబట్టి తన కుమార్తెకు పెండ్లిచేయువాడు బాగుగా ప్రవర్తించుచున్నాడు, పెండ్లి చేయనివాడు మరి బాగుగా ప్రవర్తించుచున్నాడు.

39. భార్య తన భర్త బ్రదికియున్నంతకాలము బద్ధురాలైయుండును, భర్త మృతిపొందినయెడల ఆమె కిష్టమైనవానిని పెండ్లి చేసికొనుటకు స్వతంత్రురాలై యుండునుగాని ప్రభువునందు మాత్రమే పెండ్లిచేసికొనవలెను.

వ 10; రోమీయులకు 7:2. విశ్వాసులు విశ్వాసులనే పెళ్ళి చేసుకోవాలని పౌలు నొక్కి చెప్తున్నాడు. ప్రభువుకు చెందినవాణ్ణి అంటే అర్థం ఇదే.

40. అయితే ఆమె విధవరాలుగా ఉండినట్టయిన మరి ధన్యురాలని నా అభిప్రాయము. దేవుని ఆత్మనాకును కలిగియున్నదని తలంచుకొనుచున్నాను.

“ఎక్కువ సంతోషంగా”– పెళ్ళి చేసుకొన్నవారు ఉండేటంత సంతోషంగా పెళ్ళికానివారు ఉండడం సాధ్యమేనా? సాధ్యమే. పెళ్ళికాకుండా ఉండే జీవితం వారికి దేవుడిచ్చిన కృపావరం (వ7) అయితే మరెక్కువ సంతోషంగా ఉండవచ్చు. “దేవుని ఆత్మ”– తనతో దేవుని ఆత్మ ఉన్నాడన్న సంగతి పౌలుకు తెలుసు. ఇక్కడ తాను రాసిన రీతిగా దేవుని ఆత్మ తనచేత రాయించాడని నమ్ముకుంటున్నాడని అతని భావం.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Corinthians I - 1 కొరింథీయులకు 7 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

వివాహం గురించిన అనేక ప్రశ్నలకు అపొస్తలుడు సమాధానమిస్తాడు. (1-9) 
కొరింథీయులకు అపొస్తలుడు సలహా ఇచ్చాడు, ఆ నిర్దిష్ట సమయంలో, క్రైస్తవులు అవివాహితులుగా ఉండడం ప్రయోజనకరం. ఏది ఏమైనప్పటికీ, వివాహం మరియు దానితో సంబంధం ఉన్న ఆనందాలు దైవిక జ్ఞానం ద్వారా నిర్ణయించబడిందని అతను నొక్కి చెప్పాడు. దేవుని చట్టాన్ని ఎవరూ ఉల్లంఘించకూడదు, ఇతరులు సరైన న్యాయమూర్తులు కాకపోయినా, వారి సామర్థ్యాలు మరియు పరిస్థితులకు అనుగుణంగా ఆయనను సేవించే స్వేచ్ఛను పరిపూర్ణ మార్గదర్శకత్వం అనుమతిస్తుంది. ప్రతి వ్యక్తి తమ స్వంత నిర్ణయాలు తీసుకోవాలి, వారు ఎలా కొనసాగాలి అనే విషయంలో దేవుని నుండి మార్గదర్శకత్వం కోసం వెతుకుతారు.

వివాహితులు క్రైస్తవులు తమ అవిశ్వాస భార్యల నుండి విడిపోవడానికి ప్రయత్నించకూడదు. (10-16) 
క్రీస్తు అనుమతిస్తేనే భార్యాభర్తలు విడిపోవాలి; ఆ సమయంలో యూదులు మరియు అన్యుల మధ్య ప్రబలంగా ఉన్న విడాకులు తరచుగా చిన్న చిన్న కారణాలతో జరిగేవి. వివాహం, ఒక దైవిక సంస్థగా, దేవునిచే స్థాపించబడిన జీవితకాల నిబద్ధత. ప్రజలందరితో శాంతియుతంగా జీవించాలనే బైబిల్ సూత్రాన్ని అనుసరించి రోమీయులకు 12:18, అవిశ్వాస జీవిత భాగస్వాములతో కూడా మన సన్నిహిత సంబంధాలలో శాంతి మరియు సౌకర్యాన్ని పెంపొందించడం చాలా అవసరం. వివాహితులు ఒకరినొకరు వీలైనంత సంతృప్తికరంగా మరియు ఆనందంగా ఉండేందుకు ప్రయత్నించాలి. జీవిత భాగస్వామిని విడిచిపెట్టడానికి బదులుగా, క్రైస్తవులు ప్రగాఢమైన ప్రేమను ప్రదర్శించే అవకాశాన్ని ఉపయోగించుకోవాలి మరియు వారి భాగస్వామిని మార్చడానికి చురుకుగా పని చేయాలి. ప్రతి పరిస్థితిలో మరియు సంబంధంలో, శాంతిని కొనసాగించమని ప్రభువు మనలను పిలుస్తాడు మరియు సామరస్యాన్ని పెంపొందించే ప్రయత్నాలు సత్యం మరియు పవిత్రత యొక్క హద్దుల్లోనే చేపట్టాలి.

వ్యక్తులు, ఏదైనా స్థిర స్టేషన్‌లో, సాధారణంగా దానికి కట్టుబడి ఉండాలి. (17-24) 
క్రైస్తవ మతం యొక్క సూత్రాలు అన్ని పరిస్థితులకు విస్తరించాయి మరియు వ్యక్తులు ఏ పరిస్థితిలోనైనా సానుకూలంగా ప్రతిబింబించే జీవితాలను గడపవచ్చు. తమ ప్రస్తుత పరిస్థితిలో సంతృప్తిని పొందడం మరియు క్రీస్తు అనుచరుడికి తగిన విధంగా తమను తాము సమకూర్చుకోవడం ప్రతి క్రైస్తవునిపై విధిగా ఉంది. మన శ్రేయస్సు మరియు ఆనందం అనేది క్రీస్తుతో మనకున్న సంబంధంపై ఆధారపడి ఉంటుంది, ప్రపంచంలో మన స్థితిపై కాదు. సహజ లేదా సామాజిక బాధ్యతలను విస్మరించడానికి విశ్వాసాన్ని లేదా మతాన్ని సమర్థనగా ఉపయోగించకూడదు. బదులుగా, దైవిక ప్రావిడెన్స్ ద్వారా నిర్ణయించబడిన పరిస్థితులను శాంతియుతంగా మరియు సంతృప్తిగా స్వీకరించాలి.

అప్పటి ప్రమాదకరమైన రోజుల దృష్ట్యా, ప్రజలు ఈ ప్రపంచానికి వదులుగా కూర్చోవడం చాలా అవసరం. (25-35) 
ఆ యుగంలోని గందరగోళ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటే, అవివాహిత రాష్ట్రం ఉత్తమమైనదిగా భావించబడింది. అయితే, అపొస్తలుడు వివాహాన్ని పూర్తిగా ఖండించలేదని గమనించడం చాలా ముఖ్యం. చాలామందిని వివాహం చేసుకోకుండా నిషేధించి, వారి నిజమైన పిలుపుతో సంబంధం లేకుండా ఒంటరిగా ఉండాలనే ప్రమాణాలతో వారిని బంధించే వారు, అపొస్తలుడైన పౌలు బోధలకు పూర్తి విరుద్ధంగా ఉన్నారు. ప్రాపంచిక విషయాల పట్ల పవిత్రమైన ఉదాసీనతను పెంపొందించుకోవాలని ఆయన క్రైస్తవులందరినీ కోరాడు. సంబంధాల విషయానికొస్తే, ఆ స్థితి యొక్క సుఖాలను అతిగా పట్టుకోకూడదు. బాధల నేపథ్యంలో, వ్యక్తులు ప్రాపంచిక దుఃఖానికి లొంగిపోకూడదు; సవాలు సమయాల్లో కూడా, హృదయం ఆనందాన్ని పొందగలదు. ప్రాపంచిక ఆనందాల గురించి, ఈ ప్రపంచం మన అంతిమ విశ్రాంతి కాదని నొక్కి చెప్పబడింది. ప్రాపంచిక విజయానికి సంబంధించి, వ్యాపారంలో అభివృద్ధి చెంది, సంపదను సంపాదించేవారు తమ ఆస్తులను నిర్లిప్తతతో చూడాలి. అన్ని ప్రాపంచిక విషయాలలో, వ్యక్తులు తమ హృదయాలను చిక్కుకోకుండా కాపాడుకోవాలి, ప్రపంచాన్ని దుర్వినియోగం చేయకుండా ఉపయోగించుకోవాలి. ప్రాపంచిక విషయాలన్నీ అశాశ్వతమైనవి; అవి నిజమైన పదార్ధం లేకుండా కేవలం కనిపించేవి, వేగంగా పోతాయి. ప్రాపంచిక ప్రయోజనాలను వివేకంతో పరిగణించడం ఒక విధి అయితే, మితిమీరిన, ఆత్రుతతో కూడిన శ్రద్ధకు లొంగిపోవడం పాపం. వివాహం చేసుకోవాలా అనే ప్రశ్నను పరిష్కరించడంలో అపొస్తలుడి మార్గదర్శక సూత్రం ఏమిటంటే, ప్రతి వ్యక్తికి ఉత్తమమైన జీవన స్థితి వారి ఆత్మ యొక్క శ్రేయస్సుకు అత్యంత అనుకూలమైనది, వారిని ప్రపంచంలోని చిక్కులు మరియు ఆందోళనల నుండి విముక్తి చేస్తుంది. వ్యక్తులు తమ స్వంత జీవిత పరిస్థితుల యొక్క ప్రయోజనాలు మరియు ఆపదలను ప్రతిబింబించాలని, మునుపటి వాటిని మెరుగుపరచడానికి మరియు తరువాతి వాటిని తగ్గించడానికి కృషి చేయాలని కోరారు. జీవిత శ్రద్ధల మధ్య, ఆధ్యాత్మిక విషయాలకు మరియు దేవుని పట్ల భక్తికి సమయాన్ని కేటాయించడం చాలా అవసరం.

వివాహంలో గొప్ప వివేకాన్ని ఉపయోగించాలి; అది ప్రభువులో మాత్రమే ఉండాలి. (36-40)
పిల్లల వివాహ ఏర్పాట్ల గురించి అపొస్తలుడు ఇక్కడ మార్గదర్శకత్వం ఇస్తారని నమ్ముతారు. ఈ వివరణలో, మొత్తం సందేశం స్పష్టంగా ఉంది. పెళ్లి విషయంలో పిల్లలు తమ తల్లిదండ్రుల సలహాను వెతకాలి మరియు పాటించాలి. దీనికి విరుద్ధంగా, తల్లిదండ్రులు తమ పిల్లల ప్రాధాన్యతలను పరిగణనలోకి తీసుకోవాలి మరియు కారణం లేకుండా నిర్దేశించడం ద్వారా సంపూర్ణ అధికారాన్ని పొందకూడదు. వితంతువుల సలహాతో ప్రకరణం ముగుస్తుంది. రెండవ వివాహాలు నిషేధించబడవు, విశ్వాసం యొక్క సందర్భంలో వివాహం చేసుకోవాలనే బుద్ధిపూర్వక నిబద్ధతతో వారు ప్రవేశించినట్లయితే. మన సంబంధాల ఎంపికలు మరియు పరిస్థితులలో మార్పులలో, మన నిర్ణయాలు స్థిరంగా దేవుని పట్ల గౌరవం, దేవుని చట్టాలకు కట్టుబడి ఉండటం మరియు దేవుని ప్రొవిడెన్స్‌పై ఆధారపడటం ద్వారా ప్రభావితం చేయాలి. జీవిత పరిస్థితులలో మార్పులు జాగ్రత్తగా చర్చించిన తర్వాత మరియు అలాంటి మార్పులు మన ఆధ్యాత్మిక శ్రేయస్సుకు దోహదపడతాయనే సహేతుకమైన కారణాల ఆధారంగా మాత్రమే అనుసరించాలి.



Shortcut Links
1 కోరింథీయులకు - 1 Corinthians : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |