Corinthians I - 1 కొరింథీయులకు 9 | View All
Study Bible (Beta)

1. నేను స్వతంత్రుడను కానా? నేను అపొస్తలుడను కానా? మన ప్రభువైన యేసును నేను చూడలేదా? ప్రభువునందు నాపనికి ఫలము మీరు కారా?

8వ అధ్యాయంలో పౌలు నేర్పించిన సూత్రం ఇతర విశ్వాసుల మేలుకోసం స్వార్థాన్ని త్యాగం చెయ్యడం. ఈ అధ్యాయంలో తన ఉదాహరణనే విశ్వాసుల ఎదుట ఉంచుతున్నాడు. ఒకదాన్ని బోధిస్తూ వేరొక విధంగా ప్రవర్తించలేదు పౌలు. ఇక్కడ అనేక సార్లు తన స్వేచ్ఛ, హక్కులను గురించి మాట్లాడుతున్నాడు – వ 1,4,5,12,15,19. అయితే తన స్వేచ్ఛను, హక్కులను తనకే సంతోషం కలిగించుకునేందుకు అతడు వాడుకోలేదు గానీ ఇతరులను క్రీస్తు దగ్గరికి నడిపించడానికి, వారి నమ్మకాన్ని అభివృద్ధి చేయడానికి తాను ఎలా సహాయపడగలనా అనే ఆలోచించాడు. దేవుడు నమ్మకస్థులైన సేవకులకు వాగ్దానం చేసిన ప్రతి ఫలాలను వారిలో ఎవరైనా పొందాలంటే స్వార్థ త్యాగం, వైరాగ్యం ఒక్కటే అనుసరించవలసిన మార్గం అని చెప్పడంతో ముగించాడు. “క్రీస్తు రాయబారి”– కనీసం ఇతర విశ్వాసులకున్నంత స్వేచ్ఛ, అన్ని హక్కులయినా ఒక రాయబారికి ఉండాలని ఈ మాటలకు అర్థం. “స్వేచ్ఛ”– ఆత్మసంబంధమైన స్వేచ్ఛ, ఆహార నియమాలనుంచి విడుదల మొదలైనవాటిని గురించి మాట్లాడుతున్నాడు. “ప్రభువైన...చూడలేదా”– 1 కోరింథీయులకు 15:8; అపో. కార్యములు 9:3-5.

2. ఇతరులకు నేను అపొస్తలుడను కాకపోయినను మీమట్టుకైనను అపొస్తలుడనై యున్నాను. ప్రభువునందు నా అపొస్తలత్వమునకు ముద్రగా ఉన్నవారు మీరే కారా?

పౌలు క్రీస్తురాయబారి కాదని కొందరన్నారు. కానీ కొరింతు విశ్వాసులు అలా అనకూడదు. వారు క్రీస్తులో నమ్మకం ఉంచినది అతని ద్వారానే – 1 కోరింథీయులకు 4:15.

3. నన్ను విమర్శించువారికి నేను చెప్పుసమాధానమిదే.

పౌలు క్రీస్తురాయబారి కాదన్నవారితో అతడు చెప్పిన జవాబు వ 1,2లో ఉంది.

4. తినుటకును త్రాగుటకును మాకు అధికారము లేదా?

ఈ భాగంలో పౌలు క్రీస్తురాయబారుల హక్కుల గురించి (ఆ మాటకొస్తే క్రీస్తు తన పనిలోకి పంపిన ఏ వ్యక్తికైనా ఉండే హక్కుల గురించి) మాట్లాడుతున్నాడు. ఈ హక్కులేవంటే, తాము కోరిన వాటన్నిటినీ తిని త్రాగే హక్కు (వ 4), పెళ్ళి చేసుకుని తమ ప్రయాణాల్లో భార్యను వెంటబెట్టుకు వెళ్ళే హక్కు (వ 5), ఎవరికైతే పరిచర్య చేస్తున్నారో వారినుంచి తమ జీవనోపాధి మొత్తాన్ని పొందే హక్కు (వ 6-14). రోమీయులకు 14:14.

5. తక్కిన అపొస్తలులవలెను, ప్రభువుయొక్క సహోదరులవలెను, కేఫావలెను విశ్వాసురాలైన భార్యను వెంటబెట్టుకొని తిరుగుటకు మాకు అధికారములేదా?

“ప్రభు సోదరులు”– అపో. కార్యములు 1:14. “కేఫా”– పేతురు మరో పేరు (యోహాను 1:42). అతడు వివాహితుడు (మత్తయి 8:14). అతని ప్రయాణాల్లో అతని భార్య కూడా వెంట వెళ్ళినట్టు కనిపిస్తున్నది.

6. మరియు పని చేయకుండుటకు నేనును బర్నబాయు మాత్రమే అధికారము లేని వారమా?

అపో. కార్యములు 18:3; అపో. కార్యములు 20:34.

7. ఎవడైనను తన సొంత ఖర్చు పెట్టుకొని దండులో కొలువు చేయునా? ద్రాక్షతోటవేసి దాని ఫలము తిననివాడెవడు? మందను కాచి మంద పాలు త్రాగనివాడెవడు?

సంఘాల్లో క్రీస్తు కోసం పరిచర్య చేసేవారిని సంఘాలు పోషించడమన్నది ఎంత సహజమో తెలిపేందుకు ఈ ఉదాహరణలు వాడుతున్నాడు.

8. ఈ మాటలు లోకాచారమును బట్టి చెప్పుచున్నానా? ధర్మశాస్త్రముకూడ వీటిని చెప్పుచున్నదిగదా?

ద్వితీయోపదేశకాండము 25:4; 1 తిమోతికి 5:17-18.

9. కళ్లము త్రొక్కుచున్న యెద్దు మూతికి చిక్కము పెట్టవద్దు అని మోషే ధర్మశాస్త్రములో వ్రాయబడియున్నది. దేవుడు ఎడ్లకొరకు విచారించుచున్నాడా?
ద్వితీయోపదేశకాండము 25:4

10. కేవలము మనకొరకు దీనిని చెప్పుచున్నాడా? అవును, మనకొరకే గదా యీ మాట వ్రాయబడెను? ఏలయనగా, దున్నువాడు ఆశతో దున్నవలెను, కళ్లము త్రొక్కించువాడు పంటలో పాలుపొందుదునను ఆశతో త్రొక్కింపవలెను.

11. మీకొరకు ఆత్మసంబంధమైనవి మేము విత్తియుండగా మీవలన శరీరసంబంధమైన ఫలములు కోసికొనుట గొప్ప కార్యమా?

ఈ ఉదాహరణల భావం ఇది: “ఆధ్యాత్మిక విత్తనాలు చల్లినవారు”– క్రీస్తురాయబారులు, శుభవార్త ప్రచారకులు, సంఘకాపరులు, ఉపదేశకులు దేవుని వాక్కు అనే విత్తనాలు చల్లుతారు (లూకా 8:11). “శరీరం కోసమైనవాటిని”– అంటే వారి పోషణకు అవసరమైనవి (వ 12).

12. ఇతరులకు మీ పైని యీ అధికారములో పాలు కలిగినయెడల మాకు ఎక్కువ కలదు గదా? అయితే మేము ఈ అధికారమును వినియోగించుకొనలేదు; క్రీస్తు సువార్తకు ఏ అభ్యంతరమైనను కలుగజేయకుండుటకై అన్నిటిని సహించుచున్నాము.

పౌలు హృదయంలో పని చేసిన నియమం చూడండి. క్రీస్తు శుభవార్త నిమిత్తం ఎలాంటి హక్కునైనా, ఇతరులను నొప్పించగల ఎలాంటి చర్యలయినా వదులుకునేందుకు పౌలు సిద్ధమే. దేనినైనా సహించి ఉండేందుకు సిద్ధమే. 2 తిమోతికి 2:10 చూడండి. పౌలు మనందరికీ ఆదర్శం (1 కోరింథీయులకు 4:16; 1 కోరింథీయులకు 11:1).

13. ఆలయకృత్యములు జరిగించువారు ఆలయమువలన జీవనము చేయుచున్నారనియు, బలిపీఠమునొద్ద కనిపెట్టుకొనియుండువారు బలి పీఠముతో పాలివారై యున్నారనియు మీరెరుగరా?
లేవీయకాండము 6:16, లేవీయకాండము 6:26, సంఖ్యాకాండము 18:8, సంఖ్యాకాండము 18:31, ద్వితీయోపదేశకాండము 18:1-3

లేవీయకాండము 7:6, లేవీయకాండము 7:8-10, లేవీయకాండము 7:14, లేవీయకాండము 7:28-36 చూడండి.

14. ఆలాగున సువార్త ప్రచురించువారు సువార్తవలన జీవింపవలెనని ప్రభువునియమించియున్నాడు.

వ 11; మత్తయి 10:9-10; లూకా 10:7-8. తమ మధ్య పరిచర్య చేసే క్రీస్తు సేవకులను తమ శక్తిమేరకు పోషించడం అన్ని క్రైస్తవ సంఘాలు, సమూహాల పరమ ధర్మం. అలా చేయని సంఘమేదైనా ప్రభువుకే అవిధేయత చూపుతున్నది.

15. నేనైతే వీటిలో దేనినైనను వినియోగించుకొనలేదు; మీరు నాయెడల యీలాగున జరుపవలెనని ఈ సంగతులు వ్రాయనులేదు. ఎవడైనను నా అతిశయమును నిరర్థకము చేయుటకంటె నాకు మరణమే మేలు.

దేవుడు పౌలుకు తన రహస్య సత్యాలు అప్పగించాడు (1 కోరింథీయులకు 4:1-2). వాటిని ప్రకటించేందుకు క్రీస్తు అతణ్ణి పంపాడు (అపో. కార్యములు 20:24; గలతియులకు 2:7; ఎఫెసీయులకు 3:8). అది తనకు ఇష్టమున్నా లేకపోయినా చేయక తప్పదు. ఒకవేళ అలా చేయకపోతే అతనికెంతో “నష్టం” (వ 16. గ్రీకులో ఈ మాటకు ఏదో ఒక శిక్ష వస్తుందన్న అర్థం ఉంది). కాబట్టి శుభవార్త ప్రకటించడం తన గురించి అతిశయంగా చెప్పుకునేందుకు కారణం కాదు. కానీ అతిశయ కారణం ఒకటి ఉంది అతనికి. అదేమిటంటే, అతడు జీతం లేకుండా శుభవార్త ప్రకటించాడు. ఈ విధంగా పౌలు తన ఉద్దేశం మంచిదనీ, ఇష్టపూర్వకంగా తాను ప్రకటిస్తున్నాననీ, జీతగాడిలాగా కాదనీ రుజువు చేశాడు. తన సొంత ఖర్చులు పెట్టుకొని సైన్యంలో పని చేస్తున్న సైనికుడిలాగా (వ 7), యేసుప్రభువువంటి మంచి యజమానికి సేవ చేయడంలో ఆనందిస్తూ ఉన్నాడు. వ 18లో తన జీతం గురించి మాట్లాడుతున్నాడు – జీతం లేకుండా ఉచితంగా సేవించి తన యథార్థతను, ప్రేమను కనపరచుకోవడమే తన జీతం.

16. నేను సువార్తను ప్రకటించుచున్నను నాకు అతిశయకారణములేదు. సువార్తను ప్రకటింపవలసిన భారము నామీద మోపబడియున్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపక పోయినయెడల నాకు శ్రమ.
యిర్మియా 20:9

17. ఇది నేనిష్టపడి చేసినయెడల నాకు జీతము దొరకును. ఇష్టపడకపోయినను గృహనిర్వాహకత్వము నాకు అప్పగింపబడెను.

18. అట్లయితే నాకు జీతమేమి? నేను సువార్తను ప్రకటించునప్పుడు సువార్తయందు నాకున్న అధికారమును పూర్ణముగా వినియోగ పరచుకొనకుండ సువార్తను ఉచితముగా ప్రకటించుటయే నా జీతము.

19. నేను అందరి విషయము స్వతంత్రుడనై యున్నను ఎక్కువమందిని సంపాదించుకొనుటకై అందరికిని నన్ను నేనే దాసునిగా చేసికొంటిని.

8,9 అధ్యాయాలు క్రైస్తవ స్వేచ్ఛనూ ఆధ్యాత్మిక స్వతంత్రతనూ సరిగా ఉపయోగించుకోవడం గురించి చెప్తున్నాయి. ఇతరులను క్రీస్తులోకి తెచ్చేలా అది చేస్తుందనుకుంటే స్వేచ్ఛ స్వతంత్రతలను పూర్తిగా వదులుకోవడానికి కూడా అతడు సిద్ధమే. అంటే తన స్వేచ్ఛ కంటే ఇతరులంటేనే అతనికి; ప్రీతి. తన వ్యక్తిగతమైన ఇష్టాయిష్టాలను ఇతరులకు మేలు చేయాలన్న కోరికతో పోల్చుకుంటే ఏమీ లేనట్టుగానే ఉన్నాయి. తన ఇష్టప్రకారం చెయ్యాలన్న కోరిక కంటే ఇతరులను క్రీస్తులోకి నడిపించాలన్న కోరికే బలంగా ఉంది. తాను అందరికీ బానిసనయ్యాననీ చెప్పడంలో అతని భావమేమిటో తరువాతి వచనాల్లో ఉంది. మూడు రకాల మనుషుల గురించి పౌలు చెప్తున్నాడు – యూదులు, ఇతర ప్రజలు, అంతర్వాణి, నమ్మకం విషయాల్లో బలహీనులు.

20. యూదులను సంపాదించుకొనుటకు యూదులకు యూదునివలె ఉంటిని. ధర్మశాస్త్రమునకు లోబడినవారిని సంపాదించుకొనుటకు నేను ధర్మశాస్త్రమునకు లోబడినవాడను కాకపోయినను, ధర్మశాస్త్రమునకు లోబడినవానివలె ఉంటిని.

యూదులకు తన ఉపదేశాలు ఎక్కువ అంగీకారం అయ్యే విధంగా అతడు కొన్ని పనులు చేశాడు – క్రైస్తవ విశ్వాసానికీ, జీవిత విధానానికీ ఆ పనులు విరుద్ధమైనవి కాకపోతే. దీనికి ఉదాహరణలు అపో. కార్యములు 16:3; అపో. కార్యములు 18:18; అపో. కార్యములు 21:20-26.

21. దేవుని విషయమై ధర్మశాస్త్రము లేనివాడను కాను గాని క్రీస్తు విషయమై ధర్మశాస్త్రమునకు లోబడినవాడను. అయినను ధర్మశాస్త్రము లేనివారిని సంపాదించుకొనుటకు ధర్మశాస్త్రము లేనివారికి ధర్మశాస్త్రము లేనివానివలెఉంటిని.

రోమీయులకు 2:12. యూదులు కానివారి మధ్య పని చేస్తున్నప్పుడు యూద ధర్మానికి చెందిన శాసనాలనూ ఆచారాలనూ పక్కన పెట్టాడు. ధర్మశాస్త్రం కోరుతున్న నైతిక విలువలను కూడా నిర్లక్ష్యం చేశాడని కాదు (రోమీయులకు 8:4). తాను దేవునికి లోబడాలనీ, క్రీస్తు నేర్పించిన ఆధ్యాత్మిక సూత్రాలను పాటించాలనీ అతనికి తెలుసు.

22. బలహీనులను సంపాదించుకొనుటకు బలహీనులకు బలహీనుడనైతిని. ఏ విధముచేతనైనను కొందరిని రక్షింపవలెనని అందరికి అన్నివిధముల వాడనైయున్నాను.

“బలహీనులను”– 1 కోరింథీయులకు 8:7; రోమీయులకు 14:1. వారిని నొప్పించడం, బాధపెట్టడం జరగకుండా జాగ్రత్తగా ఉన్నాడు. వారిలో మరింత ఆధ్యాత్మిక ధోరణి కలిగించాలని తన స్వేచ్ఛనూ తన హక్కులనూ అతడు వదులుకున్నాడు. తనకు సంతోషం కలిగించడం కాక ఇతరుల మేలే అన్ని రకాల ప్రజల మధ్య కూడా అతని లక్ష్యం. రోమీయులకు 15:1-3 చూడండి.

23. మరియు నేను సువార్తలో వారితో పాలివాడనగుటకై దానికొరకే సమస్తమును చేయుచున్నాను.

పౌలుకు ప్రధానమైనది తన ఇష్టాయిష్టాలు కాదు, తన అభిలాషలు, లేక తన “హక్కులు” కాదు గాని శుభవార్తే. “పాలివాణ్ణి”– ఇలా కావడం అంటే శుభవార్తలోని దీవెనలను తానొక్కడే ఉంచుకోవడం కాకుండా అందరితో పంచుకోవడమని అర్థం.

24. పందెపు రంగమందు పరుగెత్తువారందరు పరుగెత్తుదురుగాని యొక్కడే బహుమానము పొందునని మీకు తెలియదా? అటువలె మీరు బహుమానము పొందునట్లుగా పరుగెత్తుడి.

నమ్మకమైన సేవకు దేవుడిచ్చే బహుమతులు పొందాలని ఉంటే అందుకు మార్గం ఒకటే. అది పౌలు వెళ్ళిన మార్గం. అది శుభవార్త కోసం స్వార్థత్యాగం, క్రమశిక్షణల మార్గం. మత్తయి 10:38; మత్తయి 16:24; లూకా 9:23 పోల్చి చూడండి. అలాగైతే క్రీస్తుకోసం సేవ చేయడం అన్నది పందెంలో పరుగెత్తడం వంటిదా? ఒక విధంగా చూస్తే అలాంటిదే. అపో. కార్యములు 20:24; 2 తిమోతికి 4:7; హెబ్రీయులకు 12:1 చూడండి. పరుగెత్తిన వారందరికీ బహుమతి లభించదు. పౌలు చెప్తున్న ఈ బహుమతి రక్షణ కాదు (ఇది ఉచితంగానే దొరికేది. విశ్వాసులందరికీ ఇది ఉంది, వారిలో కొందరికి మాత్రమే కాదు – ఎఫెసీయులకు 2:8-9). క్రీస్తుకోసం చేసిన సేవకు దొరికే ఏదో ప్రతిఫలం ఇది.

25. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములయందు మితముగా ఉండును. వారు క్షయమగు కిరీటమును పొందుటకును, మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము.

క్రీస్తు సేవకుల సంపాదించుకోగల కిరీటాలు కొన్ని క్రొత్త ఒడంబడిక గ్రంథంలో కనిపిస్తాయి – 1 థెస్సలొనీకయులకు 2:19; 2 తిమోతికి 4:8; యాకోబు 1:12; 1 పేతురు 5:4. క్రీడాకారులు చాలా ప్రయాసలకోర్చి, కఠినమైన శిక్షణ, అభ్యాసాలతో ఈ లోకంలో తాత్కాలికమైన బహుమతుల కోసం పాటుపడతారు. క్రీస్తుసేవకులకు కనీసం వారికున్న జ్ఞానం, నియమ నిష్ఠలు, పట్టుదల ఉండవద్దా? మనం సంపాదించుకోగల బహుమతులు శాశ్వతంగా ఉంటాయి.

26. కాబట్టి నేను గురి చూడనివానివలె పరుగెత్తు వాడనుకాను,

పౌలు తన మనసులో ఒక గురిని ఉంచుకొని పరుగెత్తాడు – ఫిలిప్పీయులకు 3:13-14. పోరాడుతున్నట్లు నటించడం కాదు, నిజంగా పోరాడాడు. గెలిచేందుకే పోరాడాడు – 2 తిమోతికి 4:7.

27. గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుట లేదు గాని ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనై పోదునేమో అని నా శరీరమును నలగగొట్టి, దానిని లోపరచుకొనుచున్నాను.

అతడు గాలిలో దెబ్బలు వేయలేదు. శరీరాన్నే దెబ్బలు కొట్టి వశపరచుకున్నాడు. తన శరీరాన్ని గాయపరచాడనీ దానికి హాని చేశాడనీ దీని అర్థం కాదు. క్రమశిక్షణ, తనను అదుపు చేసుకోవడం గురించి మాట్లాడుతున్నాడు. తన శరీర సౌఖ్యాన్ని చూచుకోకుండా అది తనకు లోబడేలా బలవంతం చేశాడు. అంటే తనను జయించాలని పోరాడుతున్న ప్రత్యర్థిగా తన శరీరాన్ని ఎంచాడన్నమాట. దాన్ని బలంగా పోరాడేదిగా పరిగణించి దాన్ని లోపరచుకోవాలని భావించినట్టున్నాడు (రోమీయులకు 7:24 పోల్చి చూడండి). తన శరీరానికి బానిస అయ్యేందుకు అతడు ఒప్పుకోలేదు గానీ క్రమశిక్షణ, తనను అదుపు చేసుకోవడం ద్వారా శరీరాన్నే తనకు బానిసగా చేసుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించాడు. భావికాలంలో కలగబోయే దేవుని మెప్పు అనే శాశ్వత బహుమానాన్ని అతడు కోరాడు. దానికోసం ఇప్పటి శరీర సుఖాన్ని, సౌకర్యాలను విసర్జించేందుకు సిద్ధమయ్యాడు. దీన్ని బట్టి చూస్తే పవిత్రమైన, ఆధ్యాత్మికమైన, ఫలవంతమైన క్రైస్తవ జీవితం గడిపేందుకు పౌలుకు ఇంతకన్నా తేలిక మార్గమేదీ తెలిసినట్టు లేదు. అతనికి అందులో పోరాటం, శరీరాన్ని లోపరచుకోవాలన్న నిశ్చయమే ఉన్నాయి. “అయోగ్యుణ్ణి”– తన పాపవిముక్తిని, రక్షణను కోల్పోతానేమోనని భయంగా ఉంది అనడం లేదు, తన బహుమతులు పోతాయేమోనని భయపడుతున్నాడు (1 కోరింథీయులకు 3:12-15; 2 తిమోతికి 2:5 పోల్చి చూడండి). శరీరం అనేది మనిషిలోని భ్రష్ట స్వభావానికి నిలయం. దాని కోరికలు, వాంఛలు తీరడమే దానికి కావాలి. అదుపులో లేని శరీరం ఒక మనిషిని తన అదుపులోకి తెస్తుంది. ఇది తిండిబోతుతనం, త్రాగుబోతుతనం, అవినీతి మొదలైనవాటికి దారి తీస్తుంది.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Corinthians I - 1 కొరింథీయులకు 9 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

అపొస్తలుడు తన అధికారాన్ని చూపిస్తాడు మరియు నిర్వహించబడే హక్కును నొక్కి చెప్పాడు. (1-14) 
ప్రజలకు సద్భావనతో పాటు విజయవంతమైన సేవలను అందిస్తున్నప్పటికీ మంత్రికి అనుచిత స్పందనలు రావడం సర్వసాధారణం. విమర్శలకు ప్రతిస్పందనగా, అపొస్తలుడు తనను తాను ఇతరుల ప్రయోజనం కోసం స్వీయ-తిరస్కరణకు ఒక ఉదాహరణగా చిత్రీకరించాడు. అతను ఇతర అపొస్తలుల మాదిరిగానే వివాహం చేసుకునే హక్కును కలిగి ఉన్నప్పటికీ, శారీరక శ్రమలో పాల్గొనకుండా చర్చిల నుండి తన భార్య మరియు సంభావ్య పిల్లలకు అవసరమైన మద్దతును కోరుతూ, అతను ఆ హక్కును వదులుకోవడానికి ఎంచుకున్నాడు. మన ఆధ్యాత్మిక శ్రేయస్సును పెంపొందించడానికి కట్టుబడి ఉన్నవారికి తగినంతగా అందించబడాలి, కానీ పాల్ తన మిషన్ యొక్క అడ్డంకిలేని విజయాన్ని నిర్ధారించడానికి తన హక్కులను వదులుకోవాలని ఎంచుకున్నాడు. మంత్రులు తమ అర్హతలను వదులుకోవడాన్ని ఎంచుకోవచ్చు, సరైన మద్దతును తిరస్కరించడం లేదా నిలిపివేయడం క్రీస్తు ఆదేశానికి విరుద్ధం, మరియు వారి మంత్రిని కొనసాగించడం ప్రజల విధి.

అతను తన క్రైస్తవ స్వేచ్ఛలోని ఈ భాగాన్ని ఇతరుల మేలు కోసం అందించాడు. (15-23) 
మంత్రి యొక్క నిజమైన కీర్తి క్రీస్తు సేవ మరియు ఆత్మల మోక్షానికి స్వీయ-తిరస్కరణలో ఉంది. ఒక పరిచారకుడు సువార్త కొరకు తన అర్హతలను ఇష్టపూర్వకంగా త్యాగం చేసినప్పుడు, అతను తన పాత్ర మరియు పిలుపు యొక్క అంచనాలకు మించి వెళ్తాడు. అపొస్తలుడు, స్వేచ్ఛగా సువార్తను ప్రకటించడంలో, ఉత్సాహం మరియు ప్రేమలో పాతుకుపోయిన నిబద్ధతను ప్రదర్శించాడు, ఫలితంగా అతని ఆత్మలో లోతైన ఓదార్పు మరియు ఆశ ఏర్పడింది. క్రీస్తు ఎత్తివేసిన ఉత్సవ చట్టానికి సంబంధించి, అతను యూదులను ప్రభావితం చేయడానికి, పక్షపాతాలను తొలగించడానికి, సువార్తను స్వీకరించడానికి వారిని ప్రోత్సహించడానికి మరియు వారిని క్రీస్తు వైపుకు నడిపించడానికి వ్యూహాత్మకంగా దానిని సమర్పించాడు.
అపొస్తలుడు క్రీస్తు నియమాలు మరియు సూత్రాలకు కట్టుబడి ఉన్నప్పటికీ, ప్రజలను గెలవడానికి చట్టబద్ధమైన పరిమితుల్లో వివిధ పరిస్థితులకు అనుగుణంగా ఉండటానికి సుముఖతను ప్రదర్శించాడు. అతని జీవితపు అన్వేషణ నిరంతరం మంచి చేయడం సాధన, మరియు దీనిని సాధించడానికి, అతను తన అధికారాలను కఠినంగా నొక్కిచెప్పలేదు. ఇది విపరీతమైన వాటి నుండి అప్రమత్తంగా ఉండటానికి మరియు క్రీస్తుపై మాత్రమే నమ్మకం ఉంచడానికి రిమైండర్‌గా పనిచేస్తుంది, మరేదైనా ఆధారపడకుండా దూరంగా ఉంటుంది. ఇతరులకు హాని కలిగించకుండా లేదా సువార్త ప్రతిష్టను దిగజార్చకుండా తప్పులు లేదా తప్పులను నివారించడానికి జాగ్రత్త వహించాలి.

అతను వాడిపోని కిరీటం దృష్టిలో ఉంచుకుని, శ్రద్ధతో మరియు శ్రద్ధతో ఇదంతా చేశాడు. (24-27)
అపొస్తలుడు తన స్వంత ప్రయాణం మరియు ఇస్త్మియన్ ఆటల అథ్లెట్లు మరియు యోధుల మధ్య సమాంతరాన్ని గీశాడు, ఇది కొరింథియన్లకు సుపరిచితమైన భావన. అయితే, క్రైస్తవ పరుగుపందెంలో, అందరూ పరుగెత్తి విజయం సాధించే అవకాశం ఉంది. ప్రతి ఒక్కరూ ఈ ఆధ్యాత్మిక కోర్సులో అత్యంత దృఢ నిశ్చయంతో కొనసాగేందుకు ఇది గణనీయమైన ప్రోత్సాహాన్ని అందిస్తుంది. ఇస్త్మియన్ ఆటలలో పాల్గొనేవారు క్రమశిక్షణతో కూడిన ఆహారాన్ని పాటించేవారు, తమను తాము కష్టాలకు గురిచేసేవారు మరియు శ్రద్ధగా వ్యాయామాలు చేసేవారు. అదేవిధంగా, వారి ఆత్మల శ్రేయస్సును వెంబడించే వారు శరీరం యొక్క ఆధిపత్యాన్ని ప్రతిఘటిస్తూ, శరీర కోరికలకు వ్యతిరేకంగా తీవ్రంగా పోరాడాలి.
అపొస్తలుడు ఈ సలహాను లక్ష్యపెట్టమని కొరింథీయులకు హృదయపూర్వకంగా సలహా ఇస్తున్నాడు, శారీరక వాంఛలకు లొంగిపోవడం, శరీరాన్ని ఆహ్లాదపరచడం మరియు దాని కోరికలు మరియు ఆకలికి లొంగిపోయే ప్రమాదాన్ని నొక్కిచెప్పాడు. ఒక అపొస్తలుడు కూడా నమ్మకంగా ఉండడానికి తన పట్ల భక్తిపూర్వక భయం అవసరం; అందువల్ల, మన స్వంత సంరక్షణకు ఇది ఎంత ఎక్కువ అవసరం! మన భూసంబంధమైన ఉనికిలో మనల్ని చుట్టుముట్టే ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉంటూ, ఈ పాఠం నుండి వినయం మరియు వివేకాన్ని గ్రహిద్దాం.



Shortcut Links
1 కోరింథీయులకు - 1 Corinthians : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |