Deuteronomy - ద్వితీయోపదేశకాండము 11 | View All
Study Bible (Beta)

1. కాబట్టి నీవు నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన విధించినవాటిని అనుసరించి ఆయన కట్టడలను విధులను ఆజ్ఞలను ఎల్లప్పుడు గైకొనవలెను.

1. Love the LORD thy God and keep his observances, his ordinances, his laws and his commandments alway.

2. నీ దేవుడైన యెహోవా చేసిన శిక్షను ఆయన మహి మను ఆయన బాహుబలమును ఆయన చాపిన చేతిని

2. And call to mind this day that which your children have neither known nor seen: even the nurture of the LORD your God, his greatness, his mighty hand and his stretched out arm:

3. ఐగుప్తులో ఐగుప్తు రాజైన ఫరోకును అతని సమస్త దేశమునకును ఆయనచేసిన సూచక క్రియలను కార్యములను

3. his miracles and his acts which he did among the Egyptians, even unto Pharao the king of Egypt and unto all his land:

4. ఆయన ఐగుప్తుదండు నకును దాని గుఱ్ఱములకును రథములకును చేసిన దానిని, వారు మిమ్మును తరుముచుండగా ఆయన ఎఱ్ఱసముద్ర జల మును వారిమీద ప్రవహింపజేసిన దానిని

4. and what he did unto the host of the Egyptians, unto their horses and chariots, how he brought the water of the red sea upon them as they chased you, and how the LORD hath brought them to nought unto this day:

5. యెహోవా నేటివరకు వారిని నశింపజేసినరీతిని, మీరు ఈ స్థలమునకు వచ్చువరకు ఎడారిలో మీకొరకు చేసిన దానిని
అపో. కార్యములు 7:5

5. and what he did unto you in the wilderness, until ye came unto this place:

6. రూబే నీయుడైన ఏలీయాబు కుమారులైన దాతాను అబీరాము లకు చేసిన పనిని, భూమి నోరు తెరచి వారిని వారి ఇండ్లను గుడారములను వారియొద్ద నున్న సమస్త జీవరాసు లను ఇశ్రాయేలీయులందరి మధ్యను మింగివేసిన రీతిని, చూడకయు ఎరుగకయునున్న మీ కుమారులతో నేను మాటలాడుట లేదని నేడు తెలిసికొనుడి.

6. and what he did unto Dathan and Abiram the sons of Eliab the son of Ruben, how the earth opened her mouth and swallowed them with their households and their tents, and all their substance that was in their possession, in the midst of Israel.

7. యెహోవా చేసిన ఆ గొప్ప కార్యమంతయు మీ కన్నులే చూచినవి గదా.

7. For your eyes have seen all the great deeds of the LORD which he did.

8. మీరు బలముగలిగి స్వాధీనపరచుకొనుటకై నది దాటి వెళ్లుచున్న ఆ దేశమందు ప్రవేశించి దాని స్వాధీన పరచుకొనునట్లును

8. Keep therefore all the commandments which I command thee this day that ye may be strong and go and conquer the land whither ye go to possess it,

9. యెహోవా వారికిని వారి సంతాన మునకును దయచేసెదనని మీ పితరులతో ప్రమాణము చేసిన దేశమున, అనగా పాలు తేనెలు ప్రవహించు దేశమున మీరు దీర్ఘాయుష్మంతులగునట్లును నేను ఈ దిన మున మీకాజ్ఞాపించు ఆజ్ఞలనన్నిటిని మీరు గైకొనవలెను.

9. and that ye may prolong your days in the land which the LORD sware unto your fathers to give unto them and to their seed, a land that floweth with milk and honey.

10. మీరు స్వాధీనపరచుకొనబోవు దేశము మీరు బయలు దేరి వచ్చిన ఐగుప్తుదేశము వంటిది కాదు. అక్కడ నీవు విత్తనములు విత్తి కూరతోటకు నీరు కట్టినట్లు నీ కాళ్లతో నీ చేలకు నీరు కట్టితివి.

10. For the land whither thou goest to possess it, is not as the land of Egypt whence thou camest out, where thou sowedest thy seed and wateredest it with thy labour as a garden of herbs:

11. మీరు నది దాటి స్వాధీన పరచుకొనుటకు వెళ్లుచున్న దేశము కొండలు లోయలు గల దేశము.

11. but the land whither ye go over to possess it, is a land of hills and valleys and drinketh water of the rain of heaven,

12. అది ఆకాశవర్షజలము త్రాగును. అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ దేవు డైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతమువరకు ఎల్లప్పుడు దానిమీద ఉండును.

12. and a land which the LORD thy God careth for. The eyes of the LORD thy God are always upon it, from the beginning of the year unto the latter end of the year.

13. కాబట్టి మీ పూర్ణహృదయముతోను మీ పూర్ణాత్మ తోను మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయనను సేవింపవలెనని నేడు నేను మీకిచ్చు ఆజ్ఞలను మీరు జాగ్రత్తగా వినినయెడల

13. If thou shalt hearken therefore unto my commandments which I command you this day, that ye love the LORD your God and serve him with all your hearts and with all your souls:

14. మీ దేశమునకు వర్షము, అనగా తొలకరివానను కడవరివానను దాని దాని కాలమున కురి పించెదను. అందువలన నీవు నీ ధాన్యమును నీ ద్రాక్షా రసమును నీ నూనెను కూర్చుకొందువు.
యాకోబు 5:7

14. then he will give rain unto your land in due season, both the first rain and the latter, and thou shalt gather in thy corn, thy wine and thine oil.

15. మరియు నీవు తిని తృప్తిపొందునట్లు నీ పశువులకొరకు నీ చేలయందు గడ్డి మొలిపించెదను.

15. And he will send grass in thy fields for thy cattle: and thou shalt eat and fill thyself.

16. మీ హృదయము మాయలలో చిక్కి త్రోవవిడిచి యితర దేవతలను పూజించి వాటికి నమస్కరింపకుండ మీరు జాగ్రత్త పడుడి.

16. But beware that your hearts deceive(disceave) you not that ye turn aside and serve strange gods and worship them,

17. లేని యెడల యెహోవా మీమీద కోపపడి ఆకాశమును మూసివేయును; అప్పుడు వాన కురియదు, భూమిపండదు, యెహోవా మీకిచ్చుచున్న ఆ మంచి దేశమున ఉండ కుండ మీరు శీఘ్రముగా నశించెదరు.

17. and then the wrath of the LORD wax hot upon you and shut up the heaven that there be no rain and that your land yield not her fruit, and that ye perish quickly from off the good land which the LORD giveth you.

18. కాబట్టి మీరు ఈ నామాటలను మీ హృదయములోను మీ మనస్సులోను ఉంచుకొని వాటిని మీ చేతులమీద సూచనలుగా కట్టు కొనవలెను. అవి మీ కన్నులనడుమ బాసికములుగా ఉండవలెను.

18. Put up therefore these my words in your hearts and in your souls, and bind them for a sign unto your hands, and let them be as papers of remembrance between your eyes,

19. నీవు నీ యింట కూర్చుండునప్పుడు త్రోవను నడుచునప్పుడు పండుకొనునప్పుడు లేచునప్పుడు వాటిని గూర్చి మాటలాడుచు వాటిని మీ పిల్లలకు నేర్పి

19. and teach them your children: so that thou talk of them when thou sittest in thine house, and when thou walkest by the way, and when thou liest down and when thou risest up:

20. నీ యింటి ద్వారబంధములమీదను నీ గవు నులమీదను వాటిని వ్రాయవలెను.

20. yea and write them upon the doorposts of thine house and upon thy gates,

21. ఆలాగు చేసిన యెడల యెహోవా మీ పితరులకిచ్చెదనని ప్రమాణము చేసిన దేశమున మీ దినములును మీ సంతతివారి దినము లును భూమికి పైగా ఆకాశము నిలుచునంతకాలము విస్తరించును.

21. that your days may be multiplied and the days of your children upon the earth which the LORD sware unto your fathers to give them, as long as the days of heaven last upon the earth.

22. మీరు మీ దేవుడైన యెహోవాను ప్రేమించి, ఆయన మార్గములన్నిటిలోను నడుచుచు, ఆయనను హత్తుకొని, మీరు చేయవలెనని నేను మికాజ్ఞా పించు ఈ ఆజ్ఞలన్నిటిని అనుసరించి జాగ్రత్తగా నడుచు కొనవలెను.

22. For if ye shall keep all these commandments which I command you, so that ye do them and love the LORD your God and walk in all his ways and cleave unto him.

23. అప్పుడు యెహోవా మీ యెదుటనుండి ఈ సమస్త జనములను వెళ్లగొట్టును; మీరు మీకంటె బలిష్ఠు లైన గొప్ప జనముల దేశములను స్వాధీనపరచుకొందురు.

23. Then will the LORD cast out all these nations (and ye shall conquer them which are) both greater and mightier than your selves.

24. మీరు అడుగుపెట్టు ప్రతి స్థలము మీది అగును; అరణ్యము మొదలుకొని లెబానోనువరకును యూఫ్రటీసునది మొదలుకొని పడమటి సముద్రమువరకును మీ సరిహద్దు వ్యాపించును.

24. All the places whereon the soles of your feet shall tread, shall be yours: even from the wilderness and from Libanon and from the river Euphrates, even unto the uttermost sea shall your coasts be.

25. ఏ మనుష్యుడును మీ యెదుట నిలువడు. తాను మీతో చెప్పినట్లు మీ దేవుడైన యెహోవా మీరు అడుగుపెట్టు దేశమంతటిమీద మీ బెదురు మీభయము పుట్టించును.

25. There shall no man be able to stand before you: the LORD your God shall cast the fear and dread of you upon all lands whither ye shall come, as he hath said unto you.

26. చూడుడి; నేడు నేను మీ యెదుట దీవెనను శాపమును పెట్టుచున్నాను.

26. Behold, I set before you this day, a blessing and a curse:

27. నేడు నేను మీకాజ్ఞాపించు మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను మీరు వినినయెడల దీవెనయు, మీరు మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను వినక

27. a blessing: if ye hearken unto the commandments of the LORD your God which I command you this day:

28. నేడు నేను మికాజ్ఞాపించు మార్గమును విడిచి మీరెరుగని యితర దేవతలను అనుస రించిన యెడల శాపమును మీకు కలుగును.

28. And a curse: if ye will not hearken unto the commandments of the LORD your God: but turn out of the way which I command you this day to go after strange gods which ye have not known.

29. కాబట్టి నీవు స్వాధీనపరచుకొనబోవు దేశమున నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చిన తరువాత గెరిజీమను కొండమీద ఆ దీవెన వచనమును, ఏబాలుకొండ మీద ఆ శాపవచనమును ప్రకటింపవలెను.
యోహాను 4:20

29. When the LORD thy God hath brought thee into the land whither thou goest to possess it, then put the blessing upon mount Garizim and the curse upon mount Ebal,

30. అవి యొర్దాను అవతల సూర్యుడు అస్తమించు మార్గము వెనుక మోరేలోని సింధూరవృక్షములకు దాపున గిల్గాలునకు ఎదురుగానున్న అరాబాలో నివసించు కనానీయుల దేశమందున్నవి గదా.

30. which are on the other side Jordan on the back side of the way toward the going down of the son in the land of the Cananites which dwell in the fields over against Gilgal beside Moreh grove.

31. మీరు చేరి మీ దేవుడైన యెహోవా మీకిచ్చు చున్న దేశమును స్వాధీన పరచుకొనుటకు ఈ యొర్దానును దాటబోవుచున్నారు. మీరు దాని స్వాధీనపరచుకొని దానిలో నివసించెదరు.

31. For ye shall go over to go and possess the land which the LORD your God giveth you, and shall conquer it and dwell therein.

32. అప్పుడు నేడు నేను మీకు నియమించుచున్న కట్టడలన్నిటిని విధులన్నిటిని మీరు అనుసరించి గైకొనవలెను.

32. Take heed therefore that ye do all the commandments and laws, which I set before you this day.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Deuteronomy - ద్వితీయోపదేశకాండము 11 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible
దేవుడు ఇశ్రాయేలు కొరకు చేసిన గొప్ప పని. (1-7) 
దేవుణ్ణి ప్రేమించడం మరియు ఆయన మనల్ని ఏమి చేయమని కోరితే అది చేయడం ముఖ్యం. మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నప్పుడు, మనం ఆయనకు లోబడాలని కోరుకుంటాం. మన విధేయత ప్రేమ ఉన్న ప్రదేశం నుండి వస్తే మాత్రమే మంచిది. 1 యోహాను 5:3 దేవుడు చేసిన కొన్ని అద్భుతమైన మరియు భయానకమైన విషయాల గురించి మోషే మాట్లాడాడు, వారు తమ కళ్లతో చూశారు. మనం చిన్నతనంలో ముఖ్యమైన విషయాలను చూసినప్పుడు, అవి చాలా కాలం పాటు మంచి వ్యక్తులుగా ఉండటానికి సహాయపడతాయి. 

వాగ్దానాలు మరియు బెదిరింపులు. (8-17) 
దేవుని నియమాలను పాటించాలా వద్దా అనేది వారే ఎంచుకోవాలని మోషే ప్రజలకు చెప్పాడు. వారు నియమాలను పాటిస్తే, వారు మంచి విషయాలతో ఆశీర్వదించబడతారు. కానీ వారు నియమాలను పాటించకపోతే, చెడు విషయాలు జరుగుతాయి మరియు వారి జీవితాలు తక్కువగా ఉంటాయి. భగవంతుడిని ప్రేమించడం మరియు సేవించడం ముఖ్యం. ప్రజలు దేవుని కంటే ఇతర వస్తువులను ఎక్కువగా ఇష్టపడటం ప్రారంభిస్తే, వారు చాలా సంతోషంగా ఉంటారు మరియు అది వారి స్వంత తప్పు అవుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి మరియు దేవుడు చెప్పేది వినండి. 

దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా అధ్యయనం చేయడం అవసరం. (18-25) 
ప్రతి ఒక్కరూ ఈ మూడు నియమాలను పాటించాలి. 
1. మనం బైబిల్లో చదివిన విషయాల్లాంటి మంచి విషయాలను మన హృదయాల్లో ఉంచుకోవాలి. ఆ విధంగా, మంచి ఎంపికలు చేసుకోవడం మరియు ఇతరుల పట్ల దయ చూపడం ఎలాగో మనకు తెలుస్తుంది. మనలో మంచి ఆలోచనలు మరియు భావాలు ఉండటం ముఖ్యం, తద్వారా మన జీవితంలో మంచి పనులు చేయవచ్చు. 2. మన జీవితాల్లో మరియు పనిలో మనకు మార్గనిర్దేశం చేయడానికి మనం ఎల్లప్పుడూ బైబిల్‌ను చూడాలి మరియు అది చెప్పేదాన్ని అనుసరించాలి. కీర్తనల గ్రంథము 119:30 మనం తరచుగా భగవంతుని గురించి, ఆయన బోధల గురించి మాట్లాడాలి. మనం పిల్లలకు భగవంతుని గురించి బాగా బోధిస్తే, అది మన దేశం విజయవంతం కావడానికి మరియు మన విశ్వాసాన్ని బలంగా ఉంచుకోవడానికి సహాయపడుతుంది. 

ఆశీర్వాదాలు మరియు శాపం బయలుదేరాయి. (26-32)
మోషే ప్రజలకు రెండు విషయాలలో ఒకటి ఎంచుకోవచ్చని చెప్పాడు: వారికి మంచి జరగడం (ఆశీర్వాదం) లేదా చెడు విషయాలు (శాపం). దీనిపై రెండు పర్వతాలపై పెద్ద ప్రకటన చేసి, నిబంధనలను ఉల్లంఘించి ఇబ్బందులకు గురిచేశారని గుర్తు చేశారు. అదృష్టవశాత్తూ, వారు యేసును అనుసరించి మంచి జీవితాన్ని గడుపితే మళ్లీ ఆశీర్వాదం పొందే మార్గం ఉంది. అయితే వారు శుభవార్తలను నిర్లక్ష్యం చేస్తే చెడు జరుగుతాయి. ఈ శుభవార్త గురించి మనం సంతోషంగా ఉండాలి మరియు మనకు ఇంకా సమయం ఉన్నప్పుడు దేవుని సందేశాన్ని వినాలి. మనం కూడా మంచి వ్యక్తులుగా ఉండేలా కృషి చేయాలి.



Shortcut Links
ద్వితీయోపదేశకాండము - Deuteronomy : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |