Turn Off
21st Century KJV
A Conservative Version
American King James Version (1999)
American Standard Version (1901)
Amplified Bible (1965)
Apostles' Bible Complete (2004)
Bengali Bible
Bible in Basic English (1964)
Bishop's Bible
Complementary English Version (1995)
Coverdale Bible (1535)
Easy to Read Revised Version (2005)
English Jubilee 2000 Bible (2000)
English Lo Parishuddha Grandham
English Standard Version (2001)
Geneva Bible (1599)
Hebrew Names Version
Hindi Bible
Holman Christian Standard Bible (2004)
Holy Bible Revised Version (1885)
Kannada Bible
King James Version (1769)
Literal Translation of Holy Bible (2000)
Malayalam Bible
Modern King James Version (1962)
New American Bible
New American Standard Bible (1995)
New Century Version (1991)
New English Translation (2005)
New International Reader's Version (1998)
New International Version (1984) (US)
New International Version (UK)
New King James Version (1982)
New Life Version (1969)
New Living Translation (1996)
New Revised Standard Version (1989)
Restored Name KJV
Revised Standard Version (1952)
Revised Version (1881-1885)
Revised Webster Update (1995)
Rotherhams Emphasized Bible (1902)
Tamil Bible
Telugu Bible (BSI)
Telugu Bible (WBTC)
The Complete Jewish Bible (1998)
The Darby Bible (1890)
The Douay-Rheims American Bible (1899)
The Message Bible (2002)
The New Jerusalem Bible
The Webster Bible (1833)
Third Millennium Bible (1998)
Today's English Version (Good News Bible) (1992)
Today's New International Version (2005)
Tyndale Bible (1534)
Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537)
Updated Bible (2006)
Voice In Wilderness (2006)
World English Bible
Wycliffe Bible (1395)
Young's Literal Translation (1898)
Telugu Bible Verse by Verse Explanation
పరిశుద్ధ గ్రంథ వివరణ
Telugu Bible Commentary
Telugu Reference Bible
1. ప్రవక్తయేగాని కలలు కనువాడేగాని నీ మధ్యలేచి నీ యెదుట సూచక క్రియనైనను మహత్కార్యమునైనను చేసిమత్తయి 24:24, మార్కు 13:22
ఆదికాండము 20:7 నోట్. కలలు వాటంతట అవే దేవుని సత్యాలు వెల్లడి చేయవు. కొన్నిసార్లు దేవుడు కలలలో తన ఉద్దేశాలు వెల్లడించవచ్చు. అయితే సైతాను ఏదో ఒక అబద్ధాన్ని కలద్వారా నేర్పించబూనుకోవచ్చు. కపట ప్రవక్తలు కూడా సూచకమైన అద్భుతాలు, వింతలు చూపించగలరు అనే విషయాన్ని గమనించండి (మత్తయి 24:24 ప్రకటన గ్రంథం 13:11-14).
2. నీవు ఎరుగని యితర దేవతలను అనుసరించి పూజిం తము రమ్మని చెప్పినయెడలప్రకటన గ్రంథం 13:14
ఇక్కడ చెపుతున్న విషయం కపట ప్రవక్త గురించి. సత్యంనుంచి ప్రజలను దూరం చేయడానికి ఇతను ప్రయత్నిస్తున్నాడు.
3. అతడు నీతో చెప్పిన సూచక క్రియగాని మహత్కార్యముగాని సంభవించినను ఆ ప్రవక్తమాటలను కలలు కనువాని మాటలను వినకూడదు. ఏలయనగా మీరు మీ దేవుడైన యెహోవాను మీ పూర్ణ హృదయము తోను మీ పూర్ణాత్మతోను ప్రేమించుచున్నారో లేదో తెలిసికొనుటకు మీ దేవుడైన యెహోవా మిమ్మును పరీక్షించుచున్నాడు.1 కోరింథీయులకు 11:19
ఆదికాండము 22:1 నోట్; ద్వితీయోపదేశకాండము 8:2 ద్వితీయోపదేశకాండము 8:16 యాకోబు 1:2-4 యాకోబు 1:12 1 పేతురు 1:6-7 1 పేతురు 4:12-13. విషమ పరీక్షలనేవి లేకుండా ఏ విశ్వాసీ ఈ లోకంలో ఉండరు.
4. మీరు మీ దేవుడైన యెహోవాకు లోబడి ఆయనకే భయపడి ఆయన ఆజ్ఞల ననుసరించి ఆయన మాట విని ఆయనను సేవించి ఆయనను హత్తుకొని యుండవలెను.
5. నీవు నడవవలెనని నీ దేవుడైన యెహోవా నీకాజ్ఞాపించిన మార్గములోనుండి నిన్ను తొలగించునట్లు ఐగుప్తుదేశములోనుండి మిమ్మును రప్పించి దాస్యగృహములోనుండి మిమ్మును విడిపించిన మీ దేవు డైన యెహోవామీద తిరుగుబాటు చేయుటకు మిమ్మును ప్రేరేపించెను గనుక ఆ ప్రవక్త కేమి ఆ కలలు కనువాని కేమి మరణశిక్ష విధింపవలెను. అట్లు నీ మధ్యనుండి ఆ చెడుతనమును పరిహరింపవలెను.
ఇలాంటి కపట ప్రవక్తకు మరణశిక్షే తగినది. ఎందుకంటే అతను ధర్మశాస్త్రంలో మొదటి ఆజ్ఞను జవదాటుతున్నాడు (నిర్గమకాండము 20:2-3 నోట్ చూడండి). ఇది అసహ్య కార్యం (వ 14).
6. నీ తల్లి కుమారుడేగాని నీ సహోదరుడేగాని నీ కుమా రుడేగాని నీ కుమార్తెయేగాని నీ కౌగిటి భార్యయేగాని నీ ప్రాణస్నేహితుడేగాని
దేవుని ధర్మశాస్త్రంలోని మొదటి ఆజ్ఞకున్న ప్రాముఖ్యత ఇక్కడ వివరంగా రాసి ఉంది. ఈ విధంగా ధర్మశాస్త్రాన్ని భంగపరచడానికి ప్రజలను ప్రేరేపించిన ఆడ లేక మగ వారిని చంపడానికి మొదటి రాయి వేయవలసిన కర్తవ్యం అలాంటివారిని కన్న తల్లి లేక తండ్రిదే (నిర్గమకాండము 19:21-25 - ధర్మశాస్త్రంపై నోట్ చూడండి). దీన్ని లూకా 15:11-24 లో ఉన్న కృపాభరితమైన దృశ్యంతో పోల్చిచూడండి.
7. భూమియొక్క యీ కొన మొదలుకొని ఆ కొనవరకు నీకు సమీపముగా నుండినను నీకు దూరముగానుండినను, నీ చుట్టునుండు జనముల దేవ తలలో నీవును నీ పితరులును ఎరుగని యితర దేవతలను పూజింతము రమ్మని రహస్యముగా నిన్ను ప్రేరేపించిన యెడల
8. వారి మాటకు సమ్మతింపకూడదు; వారిమాట వినకూడదు, వారిని కటాక్షింపకూడదు; వారియందు జాలి పడకూడదు, వారిని మాటుపరచకూడదు; అవశ్యముగా వారిని చంపవలెను.
9. చంపుటకు నీ జనులందరికి ముందు గాను నీ చెయ్యి మొదట వారిమీద పడవలెను.
10. రాళ్లతో వారిని చావగొట్టవలెను. ఏలయనగా ఐగుప్తుదేశములో నుండియు దాస్యగృహములోనుండియు నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాయొద్దనుండి వారు నిన్ను తొలగింప యత్నించెదరు.
11. అప్పుడు ఇశ్రాయేలీయులందరు విని భయపడుదురు గనుక నీ మధ్య అట్టి దుష్కార్యమేమియు ఇకను చేయకుందురు.
12. నీవు నివసించుటకు నీ దేవుడైన యెహోవా నీకిచ్చు చున్న నీ పురములలో ఏదోయొకదానియందు
నిజమైన ఏకైక దేవునికి విగ్రహ పూజ ఎంత అసహ్య కార్యమంటే ఏదైనా ఊళ్ళో ఇలాంటిది జరిగితే ఆ ఊరు మొత్తాన్నీ నాశనం చేసెయ్యాలని ఆజ్ఞ ఇచ్చాడు. ఒక్క ఊళ్ళో విగ్రహ పూజ అంటూ జరిగితే అది జాతి అంతటికీ పాకి అందరినీ భ్రష్టులనుగా చేస్తుందని దేవునికి తెలుసు. శరీరంలో ఒక్క చోట కాన్సర్ వస్తే దాన్ని వెంటనే లేకుండా చేయాలి. లేకుంటే అది శరీరాన్నంతటినీ నాశనం చేసేస్తుంది. జాతి అంతటి విషయంలో ఎలాంటి చర్య తీసుకోవాలో దేవునికి చక్కగా తెలుసు. మొత్తంగా తన ప్రజలపట్ల ఆయనకున్న ప్రేమవల్లే ఇలాంటి ఆజ్ఞలు వచ్చాయి. దేవుని ప్రేమ, పవిత్రతలకూ, ఆయన కోపానికీ ఉన్న దగ్గర సంబంధాన్ని మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఈ కృప కాలంలో కూడా క్రైస్తవులు ఊళ్ళనూ పట్టణాలనూ నాశనం చెయ్యాలని కాదు ఇక్కడి భావం. ప్రస్తుతం వారి పని వేరు (క్రీస్తు శుభవార్తను ప్రకటించడం). ఈ యుగాంతంలో దేవుడే తన కోపంతో బయలుదేరి ఇలాంటి అబద్ధ దేవుళ్ళను పూజించిన వారందరికీ తీర్పు తీరుస్తాడు (2 థెస్సలొనీకయులకు 1:6-9 2 థెస్సలొనీకయులకు 2:8-12 యూదా 1:14-15 వచనాలు; ప్రకటన 16వ అధ్యాయం; ప్రకటన గ్రంథం 21:8).
13. పనికి మాలిన కొందరు మనుష్యులు నీ మధ్య లేచి, మీరు ఎరుగని యితర దేవతలను పూజింతము రండని తమ పుర నివాసులను ప్రేరేపించిరని నీవు వినినయెడల, నీవు ఆ సంగతిని శోధించి పరీక్షించి బాగుగా విచారింపవలెను.
14. అది నిజమైనయెడల, అనగా అట్టి హేయమైనది నీ మధ్య జరిగినయెడల
15. ఆ పురనివాసులను అవశ్యముగా కత్తివాత సంహరించి, దానిని దానిలోనున్న సమస్తమును దాని పశువులను కత్తివాత నిర్మూలము చేయవలెను.
16. దాని కొల్లసొమ్మంతటిని విశాలవీధిలో చేర్చి, నీ దేవుడైన యెహోవా పేరట ఆ పురమును దాని కొల్లసొమ్మంతటిని అగ్నితో బొత్తిగా కాల్చి వేయవలెను. అది తిరిగి కట్ట బడక యెల్లప్పుడును పాడుదిబ్బయై యుండును.
17. నేడు నేను నీకాజ్ఞాపించు ఆయన ఆజ్ఞలన్నిటిని గైకొనుచు
18. నీ దేవుడైన యెహోవా దృష్టికి యథార్థమైన దాని చేయుచు, నీ దేవుడైన యెహోవా మాట వినునప్పుడు యెహోవా తన కోపాగ్నినుండి మళ్లుకొని నీయందు కని కరపడి నిన్ను కరుణించి నీ పితరులతో ప్రమాణముచేసిన రీతిని నిన్ను విస్తరింపజేయునట్లు, నిర్మూలము చేయవలసిన దానిలో కొంచెమైనను నీయొద్ద ఉంచుకొనకూడదు.