Deuteronomy - ద్వితీయోపదేశకాండము 31 | View All
Study Bible (Beta)

1. మోషే ఇశ్రాయేలీయులందరితో ఈ మాటలు చెప్పుట చాలించి వారితో మరల ఇట్లనెనునేడు నేను నూట ఇరువది యేండ్లవాడనై యున్నాను.

1. moshe ishraayeleeyulandarithoo ee maatalu chepputa chaalinchi vaarithoo marala itlanenunedu nenu noota iruvadhi yendlavaadanai yunnaanu.

2. ఇకమీదట నేను వచ్చుచుపోవుచు నుండలేను, యెహోవాయొర్దాను దాటకూడదని నాతో సెలవిచ్చెను.

2. ikameedata nenu vachuchupovuchu nundalenu, yehovaa ee yordaanu daatakoodadani naathoo selavicchenu.

3. నీ దేవు డైన యెహోవా నీకు ముందుగా దాటిపోయి ఆ జనములను నీ యెదుట నుండకుండ నశింపజేయును, నీవు వారి దేశ మును స్వాధీనపరచుకొందువు. యెహోవా సెలవిచ్చి యున్నట్లు యెహోషువ నీ ముందుగా దాటిపోవును.

3. nee dhevu daina yehovaa neeku mundhugaa daatipoyi aa janamulanu nee yeduta nundakunda nashimpajeyunu, neevu vaari dhesha munu svaadheenaparachukonduvu. Yehovaa selavichi yunnatlu yehoshuva nee mundhugaa daatipovunu.

4. యెహోవా నశింపజేసిన అమోరీయుల రాజులైన సీహోను కును ఓగుకును వారి దేశమునకును ఏమి చేసెనో ఆ ప్రకా రముగానే యీ జనములకును చేయును.

4. yehovaa nashimpajesina amoreeyula raajulaina seehonu kunu ogukunu vaari dheshamunakunu emi cheseno aa prakaa ramugaane yee janamulakunu cheyunu.

5. నేను మీ కాజ్ఞాపించిన దానినంతటినిబట్టి మీరు వారికి చేయునట్లు యెహోవా నీ చేతికి వారిని అప్పగించును. నిబ్బరము గలిగి ధైర్యముగా నుండుడి

5. nenu mee kaagnaapinchina daaninanthatinibatti meeru vaariki cheyunatlu yehovaa nee chethiki vaarini appaginchunu. Nibbaramu galigi dhairyamugaa nundudi

6. భయపడకుడి, వారిని చూచి దిగులుపడకుడి, నీతో కూడ వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే; ఆయన నిన్ను విడువడు నిన్నెడ బాయడు.
హెబ్రీయులకు 13:5

6. bhayapadakudi, vaarini chuchi digulupadakudi, neethoo kooda vachuvaadu nee dhevudaina yehovaaye; aayana ninnu viduvadu ninneda baayadu.

7. మరియమోషే యెహోషువను పిలిచినీవు నిబ్బరము గలిగి ధైర్యముగా నుండుము. యెహోవా ఈ ప్రజలకిచ్చుటకు వారి పితరులతో ప్రమాణముచేసిన దేశ మునకు నీవు వీరితోకూడ పోయి దానిని వారికి స్వాధీన పరచవలెను.
హెబ్రీయులకు 4:8

7. mariyu moshe yehoshuvanu pilichineevu nibbaramu galigi dhairyamugaa nundumu. Yehovaa ee prajalakichutaku vaari pitharulathoo pramaanamuchesina dhesha munaku neevu veerithookooda poyi daanini vaariki svaadheena parachavalenu.

8. నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడై యుండును, ఆయన నిన్ను విడువడు నిన్ను ఎడబాయడు. భయ పడకుము విస్మయమొందకు మని ఇశ్రాయేలీయు లందరియెదుట అతనితో చెప్పెను.
హెబ్రీయులకు 13:5

8. nee mundhara naduchuvaadu yehovaa, aayana neeku thoodai yundunu, aayana ninnu viduvadu ninnu edabaayadu. Bhaya padakumu vismayamondaku mani ishraayeleeyu landariyeduta athanithoo cheppenu.

9. మోషే ఈ ధర్మశాస్త్రమును వ్రాసి యెహోవా నిబంధన మందసమును మోయు యాజకులైన లేవీయుల కును ఇశ్రాయేలీయుల పెద్దలందరికిని దాని నప్పగించి

9. moshe ee dharmashaastramunu vraasi yehovaa nibandhana mandasamunu moyu yaajakulaina leveeyula kunu ishraayeleeyula peddalandarikini daani nappaginchi

10. వారితో ఇట్లనెనుప్రతి యేడవ సంవత్సరాంతమున, అనగా నియమింపబడిన గడువు సంవత్సరమున

10. vaarithoo itlanenuprathi yedava samvatsaraanthamuna, anagaa niyamimpabadina gaduvu samvatsaramuna

11. నీ దేవు డైన యెహోవా ఏర్పరచుకొను స్థలమందు ఇశ్రాయేలీయు లందరు ఆయన సన్నిధిని కనబడి పర్ణశాలల పండుగను ఆచ రించునప్పుడు ఇశ్రాయేలీయులందరి యెదుట ఈ ధర్మ శాస్త్రమును ప్రకటించి వారికి వినిపింపవలెను.

11. nee dhevu daina yehovaa erparachukonu sthalamandu ishraayeleeyu landaru aayana sannidhini kanabadi parnashaalala panduganu aacha rinchunappudu ishraayeleeyulandari yeduta ee dharma shaastramunu prakatinchi vaariki vinipimpavalenu.

12. మీ దేవు డైన యెహోవాకు భయపడి యీ ధర్మశాస్త్ర వాక్యము లన్నిటిని అనుసరించి నడుచుకొనునట్లు పురుషులేమి స్త్రీలేమి పిల్లలేమి నీ పురములలోనున్న పరదేశులేమి వాటిని విని నేర్చుకొనుటకై అందరిని పోగుచేయవలెను.

12. mee dhevu daina yehovaaku bhayapadi yee dharmashaastra vaakyamu lannitini anusarinchi naduchukonunatlu purushulemi streelemi pillalemi nee puramulalonunna paradheshulemi vaatini vini nerchukonutakai andarini pogucheyavalenu.

13. ఆలాగు నేర్చుకొనినయెడల దాని నెరుగని వారి సంతతి వారు దానిని విని, మీరు స్వాధీనపరచుకొనుటకు యొర్దా నును దాటబోవుచున్న దేశమున మీరు బ్రదుకు దినము లన్నియు మీ దేవుడైన యెహోవాకు భయపడుట నేర్చు కొందురు.

13. aalaagu nerchukoninayedala daani nerugani vaari santhathi vaaru daanini vini, meeru svaadheenaparachukonutaku yordaa nunu daatabovuchunna dheshamuna meeru braduku dinamu lanniyu mee dhevudaina yehovaaku bhayapaduta nerchu konduru.

14. మరియయెహోవాచూడుము; నీ మరణదినములు సమీపించెను; నీవు యెహోషువను పిలిచి నేనతనికి ఆజ్ఞలిచ్చినట్లు ప్రత్యక్షపు గుడారములో నిలువుడని మోషేతో సెలవియ్యగా,

14. mariyu yehovaachoodumu; nee maranadhinamulu sameepinchenu; neevu yehoshuvanu pilichi nenathaniki aagnalichinatlu pratyakshapu gudaaramulo niluvudani moshethoo selaviyyagaa,

15. మోషేయు యెహోషువయు వెళ్లి ప్రత్యక్షపు గుడారములో నిలిచిరి. అచ్చట యెహోవా మేఘస్తంభములో ప్రత్యక్షమాయెను; ఆ మేఘస్తంభము ఆ గుడారపు ద్వారముపైని నిలువగా

15. mosheyu yehoshuvayu velli pratyakshapu gudaaramulo nilichiri. Acchata yehovaa meghasthambhamulo pratyakshamaayenu; aa meghasthambhamu aa gudaarapu dvaaramupaini niluvagaa

16. యెహోవా మోషేతో యిట్లనెనుఇదిగో నీవు నీ పితరు లతో పండుకొనబోవుచున్నావు. ఈ జనులు లేచి, యెవరి దేశమున తాము చేరి వారి నడుమ నుందురో ఆ జనులమధ్యను వ్యభిచారులై, ఆ అన్యుల దేవతల వెంట వెళ్లి నన్ను విడిచి, నేను వారితో చేసిన నిబంధనను మీరుదురు.

16. yehovaa moshethoo yitlanenu'idigo neevu nee pitharu lathoo pandukonabovuchunnaavu. ee janulu lechi, yevari dheshamuna thaamu cheri vaari naduma nunduro aa janulamadhyanu vyabhichaarulai, aa anyula dhevathala venta velli nannu vidichi, nenu vaarithoo chesina nibandhananu meeruduru.

17. కావున నా కోపము ఆ దినమున వారిమీద రగులు కొనును. నేను వారిని విడిచి వారికి విరోధినగుదును, వారు క్షీణించిపోవుదురు. విస్తారమైన కీడులు ఆపదలు వారికి ప్రాప్తించును. ఆ దినమున వారు, మన దేవుడు మన మధ్య నుండకపోయినందున గదా యీ కీడులు మనకు ప్రాప్తించెననుకొందురు.

17. kaavuna naa kopamu aa dinamuna vaarimeeda ragulu konunu. Nenu vaarini vidichi vaariki virodhinagudunu, vaaru ksheeninchipovuduru. Visthaaramaina keedulu aapadalu vaariki praapthinchunu. aa dinamuna vaaru, mana dhevudu mana madhya nundakapoyinanduna gadaa yee keedulu manaku praapthinchenanukonduru.

18. వారు అన్యదేవతలతట్టు తిరిగి చేసిన కీడంతటినిబట్టి ఆ దినమున నేను నిశ్చయముగా వారికి విరోధినగుదును.

18. vaaru anyadhevathalathattu thirigi chesina keedanthatinibatti aa dinamuna nenu nishchayamugaa vaariki virodhinagudunu.

19. కాబట్టి మీరు కీర్తన వ్రాసి ఇశ్రాయేలీయులకు నేర్పుడి. ఈ కీర్తన ఇశ్రాయేలీయుల మీద నాకు సాక్ష్యార్థముగా నుండునట్లు దానిని వారికి కంఠపాఠముగా చేయించుము.

19. kaabatti meeru keerthana vraasi ishraayeleeyulaku nerpudi. ee keerthana ishraayeleeyula meeda naaku saakshyaarthamugaa nundunatlu daanini vaariki kanthapaathamugaa cheyinchumu.

20. నేను వారి పితరులతో ప్రమాణము చేసినట్లు, పాలు తేనెలు ప్రవహించు దేశమున వారిని ప్రవేశపెట్టిన తరువాత, వారు తిని త్రాగి తృప్తిపొంది క్రొవ్వినవారై అన్యదేవతలతట్టు తిరిగి వాటిని పూజించి నన్ను తృణీకరించి నా నిబంధనను మీరుదురు.

20. nenu vaari pitharulathoo pramaanamu chesinatlu, paalu thenelu pravahinchu dheshamuna vaarini praveshapettina tharuvaatha, vaaru thini traagi trupthipondi krovvinavaarai anyadhevathalathattu thirigi vaatini poojinchi nannu truneekarinchi naa nibandhananu meeruduru.

21. విస్తారమైన కీడులు ఆపదలు వారికి సంభవించిన తరువాత ఈ కీర్తన వారియెదుట సాక్షిగానుండి సాక్ష్యము పలు కును. అది మరువబడక వారి సంతతి వారినోట నుండును. నేను ప్రమాణము చేసిన దేశమున వారిని ప్రవేశపెట్టక మునుపే, నేడే వారు చేయు ఆలోచన నేనెరుగుదును అనెను.

21. visthaaramaina keedulu aapadalu vaariki sambhavinchina tharuvaatha ee keerthana vaariyeduta saakshigaanundi saakshyamu palu kunu. adhi maruvabadaka vaari santhathi vaarinota nundunu. Nenu pramaanamu chesina dheshamuna vaarini praveshapettaka munupe, nede vaaru cheyu aalochana nenerugudunu anenu.

22. కాబట్టి మోషే ఆ దినమందే యీ కీర్తన వ్రాసి ఇశ్రాయేలీయులకు నేర్పెను.

22. kaabatti moshe aa dinamandhe yee keerthana vraasi ishraayeleeyulaku nerpenu.

23. మరియయెహోవా నూను కుమారుడైన యెహోషు వకు ఈలాగు సెలవిచ్చెనునీవు నిబ్బరము గలిగి ధైర్యముగా నుండుము; నేను ప్రమాణ పూర్వకముగా వారికిచ్చిన దేశమునకు ఇశ్రాయేలీయులను నీవు తోడుకొని పోవలెను, నేను నీకు తోడై యుందును.

23. mariyu yehovaa noonu kumaarudaina yehoshu vaku eelaagu selavicchenuneevu nibbaramu galigi dhairyamugaa nundumu; nenu pramaana poorvakamugaa vaarikichina dheshamunaku ishraayeleeyulanu neevu thoodukoni povalenu, nenu neeku thoodai yundunu.

24. ఈ ధర్మశాస్త్ర వాక్యములు మోషే గ్రంథమందు సాంతముగా వ్రాయుట ముగించిన తరువాత

24. ee dharmashaastra vaakyamulu moshe granthamandu saanthamugaa vraayuta muginchina tharuvaatha

25. మోషే యెహోవా నిబంధన మందసమును మోయు లేవీయులను చూచి ఆజ్ఞాపించినదేమనగామీరు ఈ ధర్మశాస్త్ర గ్రంథమును తీసికొని మీ దేవుడైన యెహోవా నిబంధన మందసపు ప్రక్కన ఉంచుడి.

25. moshe yehovaa nibandhana mandasamunu moyu leveeyulanu chuchi aagnaapinchinadhemanagaameeru ee dharmashaastra granthamunu theesikoni mee dhevudaina yehovaa nibandhana mandasapu prakkana unchudi.

26. అది అక్కడ నీమీద సాక్ష్యార్థముగా ఉండును.
యోహాను 5:45

26. adhi akkada neemeeda saakshyaarthamugaa undunu.

27. నీ తిరుగుబాటును నీ మూర్ఖ త్వమును నేనెరుగుదును. నేడు నేను ఇంక సజీవుడనై మీతో ఉండగానే, ఇదిగో మీరు యెహోవామీద తిరుగుబాటుచేసితిరి.
యోహాను 5:45

27. nee thirugubaatunu nee moorkha tvamunu nenerugudunu. Nedu nenu inka sajeevudanai meethoo undagaane, idigo meeru yehovaameeda thirugubaatuchesithiri.

28. నేను చనిపోయిన తరువాత మరి నిశ్చయముగా తిరుగుబాటు చేయుదురుకదా మీ గోత్ర ముల పెద్దలనందరిని మీ నాయకులను నాయొద్దకు పోగు చేయుడి. ఆకాశమును భూమిని వారిమీద సాక్షులుగా పెట్టి నేను ఈ మాటలను వారి వినికిడిలో చెప్పెదను.

28. nenu chanipoyina tharuvaatha mari nishchayamugaa thirugubaatu cheyudurukadaa mee gotra mula peddalanandarini mee naayakulanu naayoddhaku pogu cheyudi. aakaashamunu bhoomini vaarimeeda saakshulugaa petti nenu ee maatalanu vaari vinikidilo cheppedanu.

29. ఏలయనగా నేను మరణమైన తరువాత మీరు బొత్తిగా చెడిపోయి నేను మీకాజ్ఞా పించిన మార్గమును తప్పుదు రనియు, ఆ దినముల అంతమందు కీడు మీకు ప్రాప్తమగు ననియు నేనెరుగుదును. మీరు చేయు క్రియలవలన యెహోవాకు కోపము పుట్టించునట్లుగా ఆయన దృష్టికి కీడైనదాని చేయుదురు.

29. yelayanagaa nenu maranamaina tharuvaatha meeru botthigaa chedipoyi nenu meekaagnaa pinchina maargamunu thappudu raniyu, aa dinamula anthamandu keedu meeku praapthamagu naniyu nenerugudunu. meeru cheyu kriyalavalana yehovaaku kopamu puttinchunatlugaa aayana drushtiki keedainadaani cheyuduru.

30. అప్పుడు మోషే ఇశ్రాయేలీ యుల సర్వ సమాజముయొక్క వినికిడిలో ఈ కీర్తన మాటలు సాంతముగా పలికెను.

30. appudu moshe ishraayelee yula sarva samaajamuyokka vinikidilo ee keerthana maatalu saanthamugaa palikenu.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Deuteronomy - ద్వితీయోపదేశకాండము 31 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

మోషే ప్రజలను, జాషువాను ప్రోత్సహిస్తున్నాడు. (1-8) 
దేవుడు ఎల్లప్పుడూ వారికి తోడుగా ఉంటాడని మోషే ఇశ్రాయేలు ప్రజలకు చెప్పాడు. ఇది దేవుని అనుచరులందరికీ వర్తిస్తుందని, వారికి నిరీక్షణను మరియు విశ్వాసాన్ని ఇవ్వాలని అపొస్తలుడు బోధించాడు. ఈ సందేశం మనకోసమే, దేవుడు మనల్ని ఎప్పటికీ విడిచిపెట్టడు లేదా విడిచిపెట్టడు. హెబ్రీయులకు 13:5 జాషువా తెలివైనవాడు, ధైర్యవంతుడు మరియు శ్రద్ధగలవాడు కాబట్టి వారికి కొత్త నాయకుడు అవుతాడని మోషే ప్రజలకు చెప్పాడు. దేవుడు వారిని నడిపించడానికి జాషువాను ఎన్నుకున్నాడు, కాబట్టి వారు అతనిని విశ్వసించాలి మరియు గౌరవించాలి. ధైర్యంగా, బలంగా ఉండమని మోషే ప్రోత్సహించినందుకు జాషువా సంతోషించాడు. భగవంతుడు తమ పక్షాన ఉంటే వారు మంచి చేస్తారు కాబట్టి ధైర్యంగా ఉండాలి. వారు దెయ్యంతో పోరాడితే, అతను పారిపోతాడు. 

ప్రతి ఏడవ సంవత్సరం చదవాల్సిన చట్టం. (9-13) 
మనం బైబిల్‌ను మనమే చదివినప్పటికీ, దానిని బహిరంగంగా బిగ్గరగా చదవడం కూడా వినడం ముఖ్యం. ఈ ప్రత్యేక బైబిల్ పఠనం ప్రతి సంవత్సరం జరగాలి. ఇది మనం యేసు ద్వారా ఎలా క్షమించబడ్డామో మరియు స్వాతంత్ర్యం ఇవ్వబడ్డామో అలాగే మనం ఆయన నియమాలను పాటించాలి. పురుషులు, మహిళలు, పిల్లలు మరియు అపరిచితులతో సహా ప్రతి ఒక్కరికీ బైబిల్ చదవాలి. ప్రతి ఒక్కరూ తన వాక్యాన్ని తెలుసుకోవాలని మరియు దానిని అనుసరించాలని దేవుడు కోరుకుంటున్నాడు. బైబిల్‌లోని ఒక చిన్న భాగాన్ని కూడా సంపాదించడానికి కష్టపడాల్సిన గతంలో ఉన్న వ్యక్తులతో పోలిస్తే మన దగ్గర చాలా బైబిల్ కాపీలు ఉన్నందుకు మనం కృతజ్ఞులమై ఉండాలి. కానీ కొన్నిసార్లు ప్రజలు బైబిల్‌లోని ముఖ్యమైన పాఠాలు మరియు బోధనలను గుర్తుంచుకోవడానికి తగినంత శ్రద్ధ చూపరు. 

ఇశ్రాయేలీయుల మతభ్రష్టత్వం ముందే చెప్పింది, వారికి వ్యతిరేకంగా సాక్ష్యమివ్వడానికి ఒక పాట ఇవ్వబడింది. (14-22) 
మోషే మరియు యెహోషువ ఒక ప్రత్యేక గుడారం ప్రవేశద్వారం వద్ద దేవునిని కలవడానికి వెళ్ళారు. మోషే త్వరలోనే చనిపోతాడని దేవుడు గుర్తు చేశాడు. చనిపోవడానికి సిద్ధంగా ఉన్న వ్యక్తులు కూడా కొన్నిసార్లు దానిని గుర్తుకు తెచ్చుకోవాలి. మోషే చనిపోయిన తర్వాత, ఇశ్రాయేలీయులకు మరియు దేవునికి మధ్య తాను చేసిన ఒప్పందం విచ్ఛిన్నమవుతుందని దేవుడు మోషేతో చెప్పాడు. ఇశ్రాయేలీయులు దేవుణ్ణి అనుసరించడం మానేస్తారు, ఆపై దేవుడు వారికి సహాయం చేయడం మానేస్తాడు. దేవుడు న్యాయవంతుడు మరియు ఎవరైనా అతనితో అన్యాయంగా ప్రవర్తిస్తే, అతను వారి స్నేహితుడిగా ఉండటాన్ని ఆపవచ్చు. దేవుని హెచ్చరికల గురించి మరియు వారు ఎలా వినలేదు అనే దాని గురించి ప్రజలకు గుర్తుచేయడానికి మోషేకు ఒక పాట పాడమని చెప్పబడింది. మనం సరైన పని చేస్తున్నామో లేదో తెలుసుకోవడానికి దేవుని వాక్యం మనకు సహాయం చేస్తుంది మరియు మన తప్పుల నుండి నేర్చుకోవడంలో సహాయపడుతుంది. ప్రజలు ఏమి ఆలోచిస్తున్నారో బోధకులకు తెలియదు, కానీ దేవునికి ప్రతిదీ తెలుసు. 

చట్టం లేవీయులకు అందించబడింది. (22-30)
లేవీయులను సురక్షితంగా ఉంచడానికి మోషే ముఖ్యమైన చట్టాలను ఎలా ఇచ్చాడనేది ఈ కథ. ప్రజలకు నేర్పిన ప్రత్యేక గీతాన్ని కూడా రాశారు. తాను పోయిన తర్వాత ప్రజలు నియమాలను మరచిపోతారని మోషేకు తెలుసు, కానీ తాను చేయగలిగినంత ఉత్తమంగా చేశానని తెలుసుకుని సంతోషించాడు. వారికి మార్గనిర్దేశం చేసేందుకు దేవుడు ఎల్లప్పుడూ ఉంటాడని విశ్వసించాడు.



Shortcut Links
ద్వితీయోపదేశకాండము - Deuteronomy : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |