Thessalonians I - 1 థెస్సలొనీకయులకు 4 | View All
Study Bible (Beta)

1. మెట్టుకు సహోదరులారా, మేము ప్రభువైన యేసు ద్వారా మీకిచ్చిన ఆజ్ఞను మీరెరుగుదురు.

“దేవుణ్ణి సంతోషపెట్టాలో”– రోమీయులకు 14:18; 2 కోరింథీయులకు 5:9; ఎఫెసీయులకు 5:10; కొలొస్సయులకు 1:10. ఏ విశ్వాసీ కూడా మరి ఏ విధంగానూ జీవించడానికి ప్రయత్నించకూడదు. కేవలం దేవుణ్ణి సంతోషపెట్టడమే మన బాధ్యత అంతా. మనం చేసే ప్రతి దానిలోనూ “ఇది దేవునికి సంతోషమేనా” అని చూచుకోవాలి.

2. కాగా మీరేలాగు నడుచుకొని దేవుని సంతోషపరచవలెనో మావలన నేర్చుకొనిన ప్రకారముగా మీరు నడుచుకొనుచున్నారు. ఈ విషయములో మీరు అంతకంతకు అభివృద్ధి నొందవలెనని మిమ్మును వేడుకొని ప్రభువైన యేసునందు హెచ్చ రించుచున్నాము.

“ప్రభువైన యేసులో”– అంటే “యేసుప్రభు అధికారం చొప్పున” అని అర్థం. తాను క్రీస్తు రాయబారి అని పౌలుకు తెలుసు (2 కోరింథీయులకు 5:20). అతడు ప్రకటించిన శుభవార్తనూ సంఘాల్లో అతడు చేసిన ఉపదేశాలనూ ఇచ్చినది క్రీస్తే – 1 థెస్సలొనీకయులకు 2:13; గలతియులకు 1:11-12. అందువల్ల పరలోక అధికారమంతటితో అతడు మాట్లాడగలిగాడు.

3. మీరు పరిశుద్ధులగుటయే, అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము.

“పవిత్రంగా”– 1 థెస్సలొనీకయులకు 3:13; 1 థెస్సలొనీకయులకు 5:23; యోహాను 17:17-19; రోమీయులకు 6:19; 2 కోరింథీయులకు 7:1; హెబ్రీయులకు 12:14; 1 పేతురు 1:15-16. “వ్యభిచారం”– 1 కోరింథీయులకు 6:18-20; గలతియులకు 5:19; ఎఫెసీయులకు 5:3; కొలొస్సయులకు 3:5.

4. మీలో ప్రతివాడును, దేవుని ఎరుగని అన్యజనులవలె కామాభిలాషయందు కాక,

“దేవుణ్ణి ఎరుగని...లేకుండా”– ఎఫెసీయులకు 4:17-20.

5. పరిశుద్ధతయందును ఘనతయందును తన తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది యెరిగియుండుటయే దేవుని చిత్తము.
జెకర్యా 14:5

“పాత్రను”– అంటే శరీరాన్ని. ఒక మనిషి శరీరం అతని ఆత్మ ఉండే పాత్ర. ఆ పాత్రను ఆ వ్యక్తి అదుపులో ఉంచుకోవాలి గానీ అదే తనను అదుపు చేసే పరిస్థితి రానియ్యకూడదు. “ఘనం”– వ్యభిచారం అపకీర్తినీ సిగ్గునూ తెస్తుంది.

6. ఈ విషయమందెవడును అతిక్రమించి తన సహోదరునికి మోసము చేయకుండవలెను; ఎందుకనగా మేము పూర్వము మీతో చెప్పి సాక్ష్యమిచ్చిన ప్రకారము ప్రభువు వీటన్నిటి విషయమై ప్రతిదండన చేయువాడు.
కీర్తనల గ్రంథము 79:6, యిర్మియా 10:25

“ఈ విషయంలో”వ్యభిచారం విషయంలో. ఈ పాపంలో పాల్గొనేవారు తమకే గాక వివాహంలో తమ భాగస్థులైన భర్తకు లేక భార్యకు కీడు చేస్తున్నారు.

7. పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచెనుగాని అపవిత్రులుగా ఉండుటకు పిలువలేదు.

“పిలిచింది...పవిత్రత కోసమే”– 1 కోరింథీయులకు 1:2; తీతుకు 2:14; హెబ్రీయులకు 3:1; 1 పేతురు 1:15.

8. కాబట్టి ఉపేక్షించువాడు మనుష్యుని ఉపేక్షింపడు గాని మీకు తన పరిశుద్ధాత్మను అనుగ్రహించిన దేవునినే ఉపేక్షించుచున్నాడు.
కీర్తనల గ్రంథము 94:1

“తన ఆత్మను”– 1 కోరింథీయులకు 6:19; గలతియులకు 4:6; ఎఫెసీయులకు 1:13; యోహాను 14:16-17. “దేవుణ్ణే”– వ 2.

9. సహోదర ప్రేమనుగూర్చి మీకు వ్రాయనక్కరలేదు; మీరు ఒకని నొకడు ప్రేమించుటకు దేవుని చేతనే నేర్పబడితిరి.
యెహెఙ్కేలు 36:27, యెహెఙ్కేలు 37:14

“సోదర ప్రేమ”– విశ్వాసులకు పరస్పరం ఉండవలసిన ప్రేమ. వారంతా ఆధ్యాత్మికంగా సోదర సోదరీలే. ఒకే పరమ తండ్రికి చెందినవారు. ఈ సత్యానికి అనుగుణంగానే వారు ప్రవర్తించాలి – యోహాను 13:34; మొ।।. “దేవుడే మీకు నేర్పాడు”– యెషయా 54:13; యోహాను 6:45; 1 యోహాను 2:27 పోల్చి చూడండి. కీర్తనల గ్రంథము 25:4-5 చూడండి.

10. ఆలాగుననే మాసిదోనియ యందంతట ఉన్న సహోదరులందరిని మీరు ప్రేమించుచున్నారు. సహోదరులారా, మీరు ప్రేమయందు మరియొక్కువగా అభివృద్ధి నొందుచుండవలెననియు,

“మాసిదోనియ”– అపో. కార్యములు 16:9. తెస్సలొనీక పట్టణం ఈ రాష్ట్రంలోనే ఉంది. “అంతకంతకు”– 1 థెస్సలొనీకయులకు 3:12; 1 థెస్సలొనీకయులకు 4:1. క్రైస్తవ జీవితం ఎఫెసీయులకు 4:12-15 నెరవేరేవరకు ఎప్పుడూ ఎదుగుతూ ఉండవలసినదే.

11. సంఘమునకు వెలుపటివారి యెడల మర్యాదగా నడుచుకొనుచు, మీకేమియు కొదువ లేకుండునట్లు మేము మీకు ఆజ్ఞాపించిన ప్రకారము మీరు పరుల జోలికి పోక,

పౌలు మనకొక మంచి ఆశయాన్ని చూపుతున్నాడు. మనం ఎక్కడ ఉండాలని దేవుడు నిశ్చయించాడో అక్కడ ఉంచాడు. ప్రతి ఒక్కరికీ చేయడానికి పని ఇచ్చాడు. ఇతరుల వ్యవహారాల్లో వేలు పెట్టకుండా మనకు మనం ఓర్పుతో ఆ పని చేసుకుంటూ పోదాం.

12. మీ సొంతకార్యములను జరుపుకొనుట యందును మీ చేతులతో పనిచేయుటయందును ఆశకలిగి యుండవలెననియు, మిమ్మును హెచ్చరించుచున్నాము.

“సొంత చేతులతో”– ఇప్పటిలాగానే అప్పుడు కూడా కొందరు చేతులతో కష్టించి పని చేయడం అనేది పరువు తక్కువ పని అనీ హీనమనీ భావించేవారు. ఈ గొప్ప క్రీస్తురాయబారి అలా భావించలేదు (1 థెస్సలొనీకయులకు 2:9; అపో. కార్యములు 18:3; అపో. కార్యములు 20:34-35). ఏ విశ్వాసీ కూడా అలా తలంచకూడదని అతని ఉద్దేశం.

13. సహోదరులారా, నిరీక్షణలేని యితరులవలె మీరు దుఃఖపడకుండు నిమిత్తము, నిద్రించుచున్నవారిని గూర్చి మీకు తెలియకుండుట మాకిష్టములేదు.

క్రీస్తు రెండో రాకడ గురించి ఇతర భవిష్యత్ వాక్కుల కోసం మత్తయి 24:27-31, మత్తయి 24:36; యోహాను 14:3; అపో. కార్యములు 1:11; 1 కోరింథీయులకు 15:23, 1 కోరింథీయులకు 15:51-54; 2 థెస్సలొనీకయులకు 1:7; 2 థెస్సలొనీకయులకు 2:1, 2 థెస్సలొనీకయులకు 2:8; హెబ్రీయులకు 9:28; 1 యోహాను 2:28; ప్రకటన గ్రంథం 1:7; ప్రకటన గ్రంథం 19:11-16; ప్రకటన గ్రంథం 22:12 చూడండి. “కన్ను మూసిన”– యోహాను 11:11, యోహాను 11:14; అపో. కార్యములు 7:60 చూడండి. “ఆశాభావం”– క్రీస్తు లేని వారికి భవిష్యత్తు గురించి ఆశాభావానికి నిజమైన ఆధారం ఏదీ లేదు (ఎఫెసీయులకు 2:12). “శోకించకూడదు”– మరణమే మనుషుల అంతం కాదనీ తిరిగి సజీవంగా లేవడం, తమకన్నా ముందు చనిపోయినవారిని కలుసుకోవడం ఉంటుందనీ విశ్వాసులు ఎరిగి ఉండాలి.

14. యేసు మృతి పొంది తిరిగి లేచెనని మనము నమ్మినయెడల, అదే ప్రకారము యేసునందు నిద్రించినవారిని దేవుడాయనతో కూడ వెంటబెట్టుకొని వచ్చును.

“చనిపోయి...లేచాడని”– మత్తయి 27:50; మత్తయి 28:6; అపో. కార్యములు 1:3; అపో. కార్యములు 2:32; రోమీయులకు 1:4; 1 కోరింథీయులకు 15:3-8. “ఆ ప్రకారమే”– దేవుడు వెల్లడించిన ఒక సంగతిని మనం నిజంగా నమ్మితే, ఆయనే వెల్లడించిన ఇతర విషయాలను కూడా నమ్మాలి. “యేసులో కన్నుమూసిన వారిని”– ఆయన వచ్చేటప్పుడు యేసుప్రభువు చనిపోయిన విశ్వాసులందరి ఆత్మలను వెంటబెట్టుకు వస్తాడు.

15. మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పునదేమనగా, ప్రభువు రాకడవరకు సజీవులమై నిలిచియుండు మనము నిద్రించినవారికంటె ముందుగా ఆయన సన్నిధి చేరము.

“ప్రభువు మాటగా”– మరి కొన్ని ఇతర సత్యాల్లాగానే యేసుప్రభువు ఈ సత్యాన్ని నేరుగా పౌలుకు వెల్లడించి ఉండవచ్చు (గలతియులకు 1:11-12). ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడే ఈ మాట తన రాయబారులందరితోనూ చెప్పాడనుకునేందుకు కూడా అవకాశం ఉంది గానీ అలా చెప్పిన సంగతి శుభవార్త పుస్తకాల్లో రాసిలేదు. “మనం”– క్రీస్తు తిరిగి వచ్చేటప్పుడు కొందరు జీవించే ఉంటారు. “మనం” అదే మాట ఉపయోగించడం ద్వారా క్రీస్తు రాకడ సమయంలో బ్రతికి ఉండేవారిలో తానూ ఉంటానని పౌలు అనుకుంటున్నాడని భావించనక్కర్లేదు. ఈ యుగమంతట్లోవున్న విశ్వాసులందరినీ దృష్టిలో పెట్టుకొని “మనం” అని రాస్తున్నాడు – క్రీస్తు రాకడ సమయానికి అనేకమంది విశ్వాసులు చనిపోయి ఉంటారు. కొందరు మాత్రం అప్పటికి జీవిస్తూ ఉంటారు. క్రీస్తు రెండో రాకడ దినం ఎప్పుడన్నది మనకులాగానే పౌలుకూ తెలియదు – 1 థెస్సలొనీకయులకు 5:1-2; మత్తయి 24:36. యేసుప్రభువు తన ప్రజలకోసం తిరిగి రావడం మహా బాధ కాలానికి (మత్తయి 24:21) ముందో తరువాతనో పౌలు ఇక్కడ ఎలాంటి సూచనా ఇవ్వడం లేదు. “ముందరివారంగా”– బ్రతికి ఉన్నవారు మరణించిన వారికంటే ముందే మార్పు చెంది ఆకాశంలోకి వెళ్ళరు.

16. ఆర్భాటముతోను, ప్రధానదూతశబ్దముతోను, దేవుని బూరతోను పరలోకమునుండి ప్రభువు దిగివచ్చును; క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు.

“ఆజ్ఞా పూర్వకమైన కేక”– ఇది చనిపోయినవారు తిరిగి లేవండి అన్న ఆజ్ఞ కావచ్చు. యోహాను 11:43-44 పోల్చి చూడండి. “ప్రధాన దూత”– మిఖాయేల్ (యూదా 1:9; దానియేలు 10:13). మిఖాయేల్ ఒక్కడే కాదు, క్రీస్తుతో అనేకమంది దేవదూతలు వస్తారు – మత్తయి 16:27; మత్తయి 25:31. “బూర శబ్దం”– 1 కోరింథీయులకు 15:52; మత్తయి 24:31 చూడండి. “పరలోకం నుంచి”– అపో. కార్యములు 1:11; అపో. కార్యములు 3:21; ప్రకటన గ్రంథం 19:11. “క్రీస్తులో...చనిపోయినవారు”– అవిశ్వాసులు ఈ సమయంలో సజీవంగా లేవడం గురించి పౌలు ఇక్కడ చెప్పడం లేదు. ప్రకటన గ్రంథం 20:4-6; ఫిలిప్పీయులకు 3:11 చూడండి.

17. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితోకూడ ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశమండలమునకు మేఘములమీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడ ఉందుము.

“ఆకాశ మండలంలో ప్రభువును ఎదుర్కొనడానికి”– మత్తయి 24:31. దీని తరువాత ఏమి జరుగుతుందో పౌలు చెప్పడం లేదు – తన ప్రజలతో ప్రభువు భూమికి తిరిగి వస్తాడో రాడో ఇక్కడ రాసి లేదు. “మేఘాలలో”– దానియేలు 7:13; మత్తయి 24:30; మత్తయి 26:64; ప్రకటన గ్రంథం 1:7. “వారితోబాటు...పైకెత్తడం”– 1 కోరింథీయులకు 15:52-53 లో ఆ సమయంలో ఏమి జరుగుతుందో పౌలు చెప్పాడు. ఫిలిప్పీయులకు 3:20-21; 1 యోహాను 3:2 కూడా చూడండి. “ఎప్పటికీ ప్రభువుతో ఉంటాం”– ప్రతి విశ్వాసీ సాగిపోయేది ఈ గొప్ప గమ్యం వైపుకే (1 థెస్సలొనీకయులకు 5:10; యోహాను 14:3; కొలొస్సయులకు 3:4; ప్రకటన గ్రంథం 21:3; మొ।।).

18. కాబట్టి మీరు ఈ మాటలచేత ఒకనినొకడు ఆదరించుకొనుడి.

“ఓదార్చుకోండి”– వ 17 చివర్లో చెప్పిన సత్యం ఈ భూమిపై విశ్వాసులకు కలిగే ప్రతి దుఃఖంలోనూ ప్రతి నిరాశ, పరీక్ష, కష్టం, హింస, బాధలోనూ గొప్ప ప్రోత్సాహం, ఆదరణ ఇస్తుంది.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Thessalonians I - 1 థెస్సలొనీకయులకు 4 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

స్వచ్ఛత మరియు పవిత్రతకు ఉపదేశాలు. (1-8) 
సువార్తలో చెప్పబడిన విశ్వాసానికి కట్టుబడి ఉండటం సరిపోదు; మన విశ్వాసాన్ని ప్రదర్శించే పనులలో మనం చురుకుగా పాల్గొనాలి. మన ప్రవర్తనకు మార్గదర్శక సూత్రాలు ప్రభువైన యేసుక్రీస్తు జారీ చేసిన ఆజ్ఞలు. వ్యక్తుల పట్ల దేవుని చిత్తం వారి పవిత్రీకరణను కలిగి ఉంటుంది, ఈ ప్రక్రియలో వారి ఆత్మలు పరిశుద్ధాత్మ ప్రభావం ద్వారా పునరుద్ధరించబడతాయి, మరియు అప్పగించిన బాధ్యతలకు అంకితభావంతో ఉంటాయి. ఈ ఆత్మ పునరుద్ధరణ మరియు పవిత్రత కోసం ప్రయత్నించడం కోసం శారీరక కోరికలు మరియు ఇంద్రియాలపై కఠినమైన నియంత్రణ అవసరం, అలాగే దుర్వినియోగానికి దారితీసే ఆలోచనలు మరియు కోరికల పట్ల అప్రమత్తత అవసరం. అపవిత్రమైన జీవితాలను గడపడానికి ప్రభువు తన కుటుంబంలోకి ఎవరినీ ఆహ్వానించడు; బదులుగా, వ్యక్తులు అతని సన్నిధిలో పవిత్రతతో కూడిన జీవితాలను నేర్చుకునేందుకు మరియు శక్తివంతం కావడానికి పిలువబడతారు. మానవుల నుండి వచ్చినందున పవిత్రత సూత్రాల యొక్క ప్రాముఖ్యతను కొట్టిపారేయడం తప్పు; ఇవి దైవిక ఆజ్ఞలు మరియు వాటిని విస్మరించడం దేవుని పట్ల ధిక్కారాన్ని చూపుతుంది.

సోదర ప్రేమ, శాంతియుత ప్రవర్తన మరియు శ్రద్ధ. (9-12) 
మనం ఇతరులలోని మంచిని గుర్తించి మెచ్చుకోవాలి, ఆ సద్గుణాలలో మరింతగా వృద్ధి చెందేలా వారిని ప్రోత్సహిస్తూ ఉండాలి. దేవునిచే యథార్థంగా ఉపదేశించబడినవారు ఒకరిపట్ల ఒకరు ప్రేమగల స్ఫూర్తిని పెంపొందించుకునేలా నడిపించబడతారు. ఆత్మ ద్వారా అందించబడిన జ్ఞానం మానవ బోధనలను అధిగమిస్తుంది, అది దైవిక మార్గదర్శకత్వంతో సరిపోలని పక్షంలో మానవ బోధన వ్యర్థం అవుతుంది. ప్రేమతో సహా ఏదైనా సద్గుణం ద్వారా ప్రత్యేకించబడిన వారు దానిని కొనసాగించడమే కాకుండా దాని పెరుగుదలను కూడా కోరుకుంటారు. శాంతియుత ప్రవర్తనతో పాటు ప్రశాంతత మరియు సంయమనంతో కూడిన ప్రవర్తనను నిర్వహించడం చాలా అవసరం. సాతాను చురుకుగా మనకు భంగం కలిగించడానికి ప్రయత్నిస్తాడు, మరియు మన హృదయాలు తరచుగా అశాంతి వైపు ధోరణిని కలిగి ఉంటాయి; అందువల్ల, ప్రశాంతత కోసం ప్రయత్నించడం చాలా ముఖ్యం. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకునే వ్యక్తులు, బిజీబాడీలుగా మారడం, అంతర్గత శాంతిని కలిగి ఉండటమే కాకుండా వారి సంఘాల్లో కలతలను సృష్టిస్తుంది. అలాంటి వ్యక్తులు తమ స్వంత బాధ్యతలపై దృష్టి పెట్టాలని మరియు వారి స్వంత పనిని శ్రద్ధగా కొనసాగించాలనే సలహాను తరచుగా నిర్లక్ష్యం చేస్తారు. క్రైస్తవ మతం మన నిర్దిష్ట పిలుపుల నుండి మాకు మినహాయింపు ఇవ్వదు; బదులుగా, అది మన విధులను నెరవేర్చడంలో శ్రమతో ఉండమని నిర్దేశిస్తుంది. సోమరితనం కారణంగా బాధ్యతలను విస్మరించడం విపత్కర పరిస్థితులకు దారి తీస్తుంది, అయితే ఒకరి పనిలో శ్రద్ధ స్వయం సమృద్ధిని మరియు ఆనందాన్ని ఇస్తుంది.

క్రీస్తు రెండవ రాకడలో వారి శరీరాల మహిమాన్వితమైన పునరుత్థానాన్ని దృష్టిలో ఉంచుకుని, దైవిక సంబంధాలు మరియు స్నేహితుల మరణం కోసం అనవసరంగా దుఃఖించకూడదు. (13-18)
ప్రభువులో గతించిన వారి ప్రియమైనవారికి ఇక్కడ ఓదార్పు ఉంది. స్నేహితుల నష్టాన్ని బాధపెట్టడం సహజమైనది మరియు అనుమతించదగినది; మేము మా స్వంత లేమిని విచారించవచ్చు, అది వారి లాభాన్ని సూచిస్తుంది అయినప్పటికీ. క్రైస్తవం మరియు దయ మన స్వాభావిక ప్రేమలను తిరస్కరించవు; మన బాధను వ్యక్తం చేయడానికి మాకు అనుమతి ఉంది. ఏది ఏమైనప్పటికీ, మెరుగైన జీవితంపై నిరీక్షణ లేని వారి నిరాశను పోలిన మన దుఃఖం మితిమీరిపోకుండా ఉండటం చాలా ముఖ్యం. మరణం ఒక రహస్యమైన దృగ్విషయంగా మిగిలిపోయింది మరియు మరణం తర్వాత స్థితి గురించి మనకున్న జ్ఞానం పరిమితం. అయినప్పటికీ, పునరుత్థానం మరియు క్రీస్తు రెండవ రాకడ సిద్ధాంతాలు మరణ భయం మరియు మన తోటి క్రైస్తవ సహచరుల నిష్క్రమణ కోసం అనవసరమైన దుఃఖానికి విరుగుడుగా పనిచేస్తాయి మరియు ఈ సిద్ధాంతాలలో, మేము తిరుగులేని హామీని కనుగొంటాము.
సాధువులందరూ తిరిగి కలుస్తారని మరియు శాశ్వతంగా కలిసి ఉండాలనే ఆశతో ఓదార్పు ఉంది. ఏది ఏమైనప్పటికీ, స్వర్గపు పరమానందం ప్రభువుతో ఉండడం, ఆయనను చూడటం, ఆయన సన్నిధిలో జీవించడం మరియు ఆయనలో శాశ్వతంగా ఆనందించడం. దుఃఖ సమయాలలో, మనము ఒకరినొకరు ఉద్ధరించుకోవాలి, ఆత్మలను తగ్గించే లేదా సంకల్పాన్ని బలహీనపరిచే చర్యలకు దూరంగా ఉండాలి. చనిపోయినవారి పునరుత్థానం మరియు వాగ్దానం చేయబడిన క్రీస్తు తిరిగి రావడం నుండి పాఠాలు ఓదార్పునిస్తాయి.
దేవుని తీర్పు పీఠం ముందు వారి రూపాన్ని ప్రస్తావిస్తూ ఒకరిని ఓదార్చడం విరుద్ధమైనదిగా అనిపించవచ్చు. ఏది ఏమైనప్పటికీ, దేవుని ఆత్మ పాప క్షమాపణకు మరియు పరిశుద్ధాత్మ ద్వారా ఆలోచనల శుద్ధికి సాక్ష్యమిచ్చినప్పుడు నిజమైన ఓదార్పు పుడుతుంది, ఇది దేవుని పట్ల నిజమైన ప్రేమను మరియు అతని పేరు యొక్క విలువైన ఘనతను ఎనేబుల్ చేస్తుంది. మన ఆత్మలు ఈ స్థితికి అనుగుణంగా ఉంటే లేదా మనం దానిని తీవ్రంగా కోరుకుంటే తప్ప మన భద్రతకు భరోసా ఉండదు.



Shortcut Links
1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians : 1 | 2 | 3 | 4 | 5 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |