Turn Off
21st Century KJV
A Conservative Version
American King James Version (1999)
American Standard Version (1901)
Amplified Bible (1965)
Apostles' Bible Complete (2004)
Bengali Bible
Bible in Basic English (1964)
Bishop's Bible
Complementary English Version (1995)
Coverdale Bible (1535)
Easy to Read Revised Version (2005)
English Jubilee 2000 Bible (2000)
English Lo Parishuddha Grandham
English Standard Version (2001)
Geneva Bible (1599)
Hebrew Names Version
Hindi Bible
Holman Christian Standard Bible (2004)
Holy Bible Revised Version (1885)
Kannada Bible
King James Version (1769)
Literal Translation of Holy Bible (2000)
Malayalam Bible
Modern King James Version (1962)
New American Bible
New American Standard Bible (1995)
New Century Version (1991)
New English Translation (2005)
New International Reader's Version (1998)
New International Version (1984) (US)
New International Version (UK)
New King James Version (1982)
New Life Version (1969)
New Living Translation (1996)
New Revised Standard Version (1989)
Restored Name KJV
Revised Standard Version (1952)
Revised Version (1881-1885)
Revised Webster Update (1995)
Rotherhams Emphasized Bible (1902)
Tamil Bible
Telugu Bible (BSI)
Telugu Bible (WBTC)
The Complete Jewish Bible (1998)
The Darby Bible (1890)
The Douay-Rheims American Bible (1899)
The Message Bible (2002)
The New Jerusalem Bible
The Webster Bible (1833)
Third Millennium Bible (1998)
Today's English Version (Good News Bible) (1992)
Today's New International Version (2005)
Tyndale Bible (1534)
Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537)
Updated Bible (2006)
Voice In Wilderness (2006)
World English Bible
Wycliffe Bible (1395)
Young's Literal Translation (1898)
Telugu Bible Verse by Verse Explanation
పరిశుద్ధ గ్రంథ వివరణ
Telugu Bible Commentary
Telugu Reference Bible
1. ఇశ్రాయేలీయులు కనాను దేశమున పొందిన స్వాస్థ్యములు ఇవి.అపో. కార్యములు 13:19
సంఖ్యాకాండము 34:16-19.
2. మోషే ద్వారా యెహోవా ఆజ్ఞాపించినట్లు యాజకుడైన ఎలియాజరును నూను కుమారుడైన యెహోషువయు ఇశ్రాయేలీయుల గోత్రములయొక్క పితరుల కుటుంబముల ప్రధానులును చీట్లు వేసి, తొమ్మిది గోత్రములవారికిని అర్ధగోత్రపువారికిని ఆ స్వాస్థ్యములను పంచిపెట్టిరి.
సంఖ్యాకాండము 26:55-56 సామెతలు 16:33. ఈ విధంగా ప్రతి గోత్రానికీ ప్రతి కుటుంబానికీ భూమిని కేటాయించినది దేవుడే అయ్యాడు. ఇది వ్యక్తిగతమైన ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేని వ్యవహారం. ఇప్పుడు కూడా దేవుడు తన జ్ఞానం చొప్పున ప్రతి విశ్వాసికీ అతడు పరమ స్ధలాలలో సేవ చేస్తుండగా ఏ ఏ ఆధ్యాత్మిక సామర్థ్యాలు ఇవ్వాలని నిర్ణయిస్తాడో అవి ఇస్తాడు (రోమీయులకు 12:6 1 కోరింథీయులకు 12:4-11). క్రీస్తు శరీరంలో, అంటే ఆయన సంఘంలో మన స్థానాన్ని కూడా దేవుడే నిర్ణయిస్తాడు (1 కోరింథీయులకు 12:14-26).
3. మోషే రెండు గోత్రములకును అర్ధగోత్రమునకును యొర్దాను అవతలి స్వాస్థ్యముల నిచ్చియుండెను. అతడు వారిలో లేవీయులకు ఏ స్వాస్థ్యము ఇయ్యలేదు
“లేవీగోత్రికులకు”– యెహోషువ 13:14.
4. యోసేపు వంశకులగు మనష్షే ఎఫ్రాయిములను రెండు గోత్రములవారు నివసించుటకు పట్టణములును వారి పశువులకును వారి మందలకును పట్టణముల సమీప భూములను మాత్రమేకాక లేవీయులకు ఆ దేశమున ఏ స్వాస్థ్యము ఇయ్యలేదు.
“ఎఫ్రాయిం”– ఆదికాండము 48:5.
5. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలీయులు చేసి దేశమును పంచుకొనిరి.
6. యూదా వంశస్థులు గిల్గాలులో యెహోషువ యొద్దకు రాగా కెనెజీయుడగు యెఫున్నె కుమారుడైన కాలేబు అతనితో ఈలాగు మనవిచేసెను కాదేషు బర్నేయలో దైవజనుడైన మోషేతో యెహోవా నన్ను గూర్చియు నిన్నుగూర్చియు చెప్పిన మాట నీ వెరుగుదువు.
సంఖ్యాకాండము 14:6-9 సంఖ్యాకాండము 14:24 సంఖ్యాకాండము 14:30 సంఖ్యాకాండము 32:11-12. ఇది 38 ఏళ్ళ క్రితం జరిగింది గాని 85 ఏళ్ళ కాలేబు మనసులో ముద్ర వేసినట్టుగా గుర్తుంది.
7. దేశమును వేగుచూచుటకు యెహోవా సేవకుడైన మోషే కాదేషు బర్నేయలోనుండి నన్ను పంపినప్పుడు నేను నలువది ఏండ్లవాడను; ఎవరికిని భయపడక నేను చూచినది చూచినట్టే అతనికి వర్తమానము తెచ్చితిని.
సంఖ్యాకాండము 13:31-32.
8. నాతోకూడ బయలుదేరి వచ్చిన నా సహోదరులు జనుల హృదయము లను కరుగచేయగా నేను నా దేవుడైన యెహోవాను నిండు మనస్సుతో అనుసరించితిని.
9. ఆ దినమున మోషే ప్రమాణము చేసి నీవు నా దేవుడైన యెహోవాను నిండు మనస్సుతో అనుసరించితివి గనుక నీవు అడుగుపెట్టిన భూమి నిశ్చయముగా నీకును నీ సంతానమునకును ఎల్లప్పుడును స్వాస్థ్యముగా ఉండుననెను.
ద్వితీయోపదేశకాండము 1:34-36.
10. యెహోవా చెప్పినట్లు యెహోవా మోషేకు ఆ మాట సెలవిచ్చినప్పటి నుండి ఇశ్రాయేలీయులు అరణ్యములో నడచిన యీ నలువది ఐదు ఏండ్లు ఆయన నన్ను సజీవునిగా కాపాడి యున్నాడు; ఇదిగో నేనిప్పుడు ఎనబదియయిదేండ్ల వాడను.
యెహోషువ నాయకత్వంలో ఇస్రాయేల్ కనానులో ప్రవేశించి ఏడు సంవత్సరాలైంది.
11. మోషే నన్ను పంపిన నాడు నాకెంత బలమో నేటివరకు నాకంత బలము. యుద్ధము చేయుటకు గాని వచ్చుచు పోవుచునుండుటకు గాని నాకెప్పటియట్లు బలమున్నది.
కాలేబు తన ఆధ్యాత్మిక ఉత్తేజాన్నీ, నమ్మకాన్నీ వృద్ధాప్యం వరకు నిలుపుకున్నాడు. అప్పుడు కూడా ఇక తేలికగా ప్రశాంతంగా జీవితాన్ని వెళ్ళబుచ్చాలని భావించలేదు. కష్ట తరమైన ప్రదేశాల్లో యెహోవాను సేవించే మరిన్ని అవకాశాల కోసం చూస్తున్నాడు. వృద్ధులైన వారందరికీ ఆదర్శం ఇది. వృద్ధులకు కూడా బైబిల్లో సందేశాలున్నాయి. కీర్తనల గ్రంథము 92:12-15 యెషయా 40:29-31 యెషయా 46:4 చూడండి. తన వారసత్వాన్ని తానే కోరుకునే హక్కు ఉన్నవారు ఇద్దరే ఇద్దరు – యెహోషువ (యెహోషువ 19:49-50), కాలేబు. ఈజిప్ట్నుండి బయటికి వచ్చినప్పుడు 20 ఏళ్ళ పైబడ్డవారి తరంలో ఇప్పటికి మిగిలి ఉన్నది ఈ ఇద్దరే.
12. కాబట్టి ఆ దినమున యెహోవా సెలవిచ్చిన యీ కొండ ప్రదేశమును నాకు దయచేయుము; అనాకీయులును ప్రాకారముగల గొప్ప పట్టణములును అక్కడ ఉన్న సంగతి ఆ దినమున నీకు వినబడెను. యెహోవా నాకు తోడైయుండిన యెడల యెహోవా సెలవిచ్చినట్లు వారి దేశమును స్వాధీనపరచుకొందును.
13. యెఫున్నె కుమారుడైన కాలేబు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను నిండు మనస్సుతో అనుసరించువాడు గనుక యెహోషువ అతని దీవించి అతనికి హెబ్రోనును స్వాస్థ్యముగా ఇచ్చెను.
14. కాబట్టి హెబ్రోను యెఫున్నె అను కెనెజీయుని కుమారుడైన కాలేబునకు నేటివరకు స్వాస్థ్యముగా నున్నది.
15. పూర్వము హెబ్రోను పేరు కిర్యతర్బా. అర్బా అనాకీయులలో గొప్పవాడు అప్పుడు దేశము యుద్ధము లేకుండ నెమ్మదిగా ఉండెను.