గిబియాలోని కొద్దిమంది నీచుల కారణంగా, వాళ్ళను కాపాడాలన్న బెన్యామీనువారి వెర్రి నిర్ణయం కారణంగా 65 వేలకంటే ఎక్కువమంది హతమయ్యారు (వ 21,25,35). గిబియా, ఇంకా కొన్ని ఊళ్ళు వాటిలోని వేలకొలది మందితో సహా నాశనం అయ్యాయి (37,48 వ). ఒక గోత్రం మొత్తం దాదాపు తుడిచిపెట్టుకుపోయింది. (వ 47; న్యాయాధిపతులు 21:3). దుర్మార్గాన్ని, దుర్మార్గులను, కాపాడబూనుకోవడం చాలా నష్టకరమైన విషయం గదా. ఇంత నష్టాన్ని కలుగజేయడానికి కారణం ఇది: దుర్మార్గుల్ని కాపాడుతూ ఉండేవాళ్ళు ఆ దుర్మార్గుల దోషంలో పాలు పంచుకొంటూ ఉంటారు. గనుక దేవుడు వారికి విరోధంగా పోరాడుతాడు.