Judges - న్యాయాధిపతులు 8 | View All

1. అప్పుడు ఎఫ్రాయిమీయులు గిద్యోనుతో నీవు మా యెడల చూపిన మర్యాద యెట్టిది? మిద్యానీయులతో యుద్ధము చేయుటకు నీవు పోయినప్పుడు మమ్ము నేల పిలువ లేదని చెప్పి అతనితో కఠినముగా కలహించిరి.

1. The men of Ephraim spoke to Gideon. They asked, 'Why have you treated us like this? Why didn't you ask us to help you when you went out to fight against Midian?' They spoke very sharply against Gideon.

2. అందు కతడు మీరు చేసినదెక్కడ నేను చేసినదెక్కడ? అబీ యెజెరు ద్రాక్షపండ్ల కోతకంటె ఎఫ్రాయిమీయుల పరిగె మంచిదికాదా? దేవుడు మిద్యానీయుల అధిపతులైన ఓరేబును జెయేబును మీచేతికి అప్పగించెను; మీరు చేసినట్లు నేను చేయగలనా? అనెను.

2. But he answered them, 'What I've done isn't anything compared to what you have done. After Ephraim's grapes have been gathered, isn't what is left over better than all of the grapes that have been gathered from Abiezer's vines?

3. అతడు ఆ మాట అన్నప్పుడు అతని మీది వారి కోపము తగ్గెను.

3. God handed Oreb and Zeeb over to you. They were Midianite leaders. So what was I able to do compared to what you did?' After Gideon had said that, they didn't feel angry with him anymore.

4. గిద్యోనును అతనితో నున్న మూడువందల మందియును అలసటగానున్నను, శత్రువులను తరుముచు యొర్దానునొద్దకు వచ్చి దాటిరి.

4. Gideon and his 300 men were very tired. But they kept on chasing their enemies. They came to the Jordan River and went across it.

5. అతడు నా వెంటనున్న జనులు అలసియున్నారు, ఆహారమునకు రొట్టెలు వారికి దయచేయుడి; మేము మిద్యాను రాజులైన జెబహును సల్మున్నాను తరుముచున్నామని సుక్కోతువారితో చెప్పగా

5. Gideon spoke to the men of Succoth. He said, 'Give my troops some bread. They are worn out. And I'm still chasing Zebah and Zalmunna. They are the kings of Midian.'

6. సుక్కోతు అధిపతులు జెబహు సల్మున్నా అను వారి చేతులు ఇప్పుడు నీ చేతికి చిక్కినవి గనుకనా మేము నీ సేనకు ఆహారము ఇయ్యవలెనని యడిగిరి.

6. But the officials of Succoth objected. They said, 'Have you already killed Zebah and Zalmunna? Have you cut their hands off and brought them back to prove it? If you haven't, why should we give bread to your troops?'

7. అందుకు గిద్యోనుహేతువు చేతను జెబహును సల్మున్నాను యెహోవా నా చేతికప్పగించిన తరువాత నూర్చు కొయ్యలతోను కంపలతోను మీ దేహములను నూర్చి వేయుదునని చెప్పెను.

7. Gideon replied, 'The Lord will hand Zebah and Zalmunna over to me. When he does, I'll tear your skin with thorns from desert bushes.'

8. అక్కడనుండి అతడు పెనూయేలునకు పోయి ఆలాగుననే వారితోను చెప్పగా సుక్కోతువారు ఉత్తరమిచ్చినట్లు పెనూయేలువారును అతని కుత్తరమిచ్చిరి గనుక అతడు

8. From there Gideon went up to Peniel. He asked its men for the same thing. But they answered as the men of Succoth had.

9. నేను క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు ఈ గోపురమును పడగొట్టెదనని పెనూయేలు వారితో చెప్పెను.

9. So he said to the men of Peniel, 'I'll be back after I've won the battle. Then I'll tear down this tower.'

10. అప్పుడు జెబహును సల్మున్నాయు వారితోకూడ వారి సేనలును, అనగా తూర్పు జనుల సేనలన్నిటిలో మిగిలిన యించు మించు పదునైదు వేలమంది మనుష్యులందరును కర్కోరులో నుండిరి. కత్తి దూయు నూట ఇరువదివేల మంది మనుష్యులు పడిపోయిరి.

10. Zebah and Zalmunna were in Karkor. They had an army of about 15,000 men. That's all that was left of the armies of the tribes from the east. About 120,000 men who carried swords had died in battle.

11. అప్పుడు గిద్యోను నోబహుకును యొగేబ్బెహకును తూర్పున గుడారములలో నివసించిన వారి మార్గమున పోయి సేన నిర్భయముగా నున్నందున ఆ సేనను హతముచేసెను.

11. Gideon went up the trail the people of the desert had made. It ran east of Nobah and Jogbehah. He attacked the army by surprise.

12. జబహు సల్మున్నాయు పారిపోయినప్పుడు అతడు వారిని తరిమి మిద్యాను ఇద్దరు రాజులైన జెబహును సల్మున్నాను పట్టుకొని ఆ సేననంతను చెదరగొట్టెను.

12. Zebah and Zalmunna ran away. They were the two kings of Midian. Gideon chased them and captured them. He destroyed their whole army.

13. యుద్ధము తీరిన తరువాత యోవాషు కుమారుడైన గిద్యోను

13. Then Gideon, the son of Joash, returned from the battle. He came back through the Pass of Heres.

14. హెరెసు ఎగువనుండి తిరిగి వచ్చి, సుక్కోతు వారిలో ఒక ¸యౌవనుని పట్టుకొని విచారింపగా అతడు సుక్కోతు అధిపతులను పెద్దలలో డెబ్బది యేడుగురు మనుష్యులను పేరు పేరుగా వివరించి చెప్పెను.

14. He caught a young man from Succoth. He asked him about the elders of the town. The young man wrote down for him the names of Succoth's 77 officials.

15. అప్పుడతడు సుక్కో తువారి యొద్దకు వచ్చి జెబహు సల్మున్నా అను వారిచేతులు నీ చేతికి చిక్కినవి గనుకనా అలసియున్న నీ సేనకు మేము ఆహారము ఇయ్యవలెను అని మీరు ఎవరివిషయము నన్ను దూషించితిరో ఆ జెబహును సల్మున్నాను చూడుడి అని చెప్పి

15. Then Gideon came and spoke to the men of Succoth. He said, 'Here are Zebah and Zalmunna. You made fun of me because of them. You said, 'Have you already killed Zebah and Zalmunna? Have you cut their hands off and brought them back to prove it? If you haven't, why should we give bread to your tired men?' '

16. ఆ ఊరిపెద్దలను పట్టుకొని నూర్చుకొయ్యలను బొమ్మజెముడును తీసికొని వాటివలన సుక్కోతువారికి బుద్ధి చెప్పెను.

16. Gideon went and got the elders of the town. Then he taught the men of Succoth a lesson. He tore their skin with thorns from desert bushes.

17. మరియు నతడు పెనూయేలు గోపురమును పడ గొట్టి ఆ ఊరివారిని చంపెను.

17. He also pulled down the tower at Peniel. He killed the men in the town.

18. అతడు మీరు తాబోరులో చంపిన మనుష్యులు ఎట్టివారని జెబహును సల్మున్నాను అడుగగా వారునీవంటివారే, వారందరును రాజకుమారులను పోలియుండిరనగా

18. Then he spoke to Zebah and Zalmunna. He asked, 'What were the men like that you killed at Tabor?' 'Men like you,' they answered. 'Each one walked as if he were a prince.'

19. అతడు వారు నా తల్లి కుమారులు నా సహోదరులు; మీరు వారిని బ్రదుకనిచ్చిన యెడల

19. Gideon replied, 'Those were my brothers. They were the sons of my own mother. You can be sure that the Lord lives. And you can be just as sure that if you had spared their lives, I wouldn't kill you.'

20. యెహోవా జీవముతోడు, మిమ్మును చంపకుందునని చెప్పి తన పెద్ద కుమారుడైన యెతెరును చూచి నీవు లేచి వారిని చంపుమని చెప్పెను. అతడు చిన్నవాడు గనుక భయపడి కత్తిని దూయలేదు.

20. Then Gideon turned to his oldest son Jether. He said, 'Kill them!' But Jether didn't pull out his sword. He was only a boy. So he was afraid.

21. అప్పుడు జెబహు పల్మున్నాలు ప్రాయము కొలది నరునికి శక్తియున్నది గనుక నీవు లేచి మామీద పడుమని చెప్పగా గిద్యోను లేచి జెబహును సల్మున్నాను చంపి వారి ఒంటెల మెడల మీదనున్న చంద్రహారములను తీసికొనెను.

21. Zebah and Zalmunna said, 'Come on. Do it yourself. 'The older the man, the stronger he is.' ' So Gideon stepped forward and killed them. Then he took the moon-shaped necklaces off the necks of their camels.

22. అప్పుడు ఇశ్రాయేలీయులు గిద్యోనుతో నీవు మిద్యా నీయుల చేతిలోనుండి మమ్మును రక్షించితివి గనుక నీవును నీ కుమారుడును నీ కుమారుని కుమారుడును మమ్మును ఏల వలెనని చెప్పిరి.

22. The people of Israel spoke to Gideon. They said, 'Rule over us. We want you, your son and your grandson to be our rulers. You have saved us from the power of Midian.'

23. అందుకు గిద్యోను నేను మిమ్మును ఏలను, నా కుమారుడును మిమ్మును ఏలరాదు, యెహోవా మిమ్మును ఏలునని చెప్పెను.

23. But Gideon told them, 'I will not rule over you. My son won't rule over you either. The Lord will rule over you.'

24. మరియగిద్యోను మీలో ప్రతి వాడు తన దోపుడు సొమ్ములోనున్న పోగులను నాకియ్య వలెనని మనవిచేయుచున్నాననెను. వారు ఇష్మాయేలీయులు గనుక వారికి పోగులుండెను.

24. He continued, 'I do ask one thing. I want each of you to give me an earring. I'm talking about the earrings you took from your enemies.' It was the practice of the people in the family line of Ishmael to wear gold earrings.

25. అందుకు వారు సంతోషముగా మేము వాటి నిచ్చెదమని చెప్పి యొక బట్టను పరచి ప్రతివాడును తన దోపుడు సొమ్ములోనుండిన పోగులను దానిమీద వేసెను.

25. The people of Israel said, 'We'll be glad to give them to you.' So they spread out a piece of clothing. Each man threw a ring on it from what he had taken.

26. మిద్యాను రాజుల ఒంటి మీదనున్న చంద్రహారములు కర్ణభూషణములు ధూమ్ర వర్ణపు బట్టలు గాకను, ఒంటెల మెడలనున్న గొలుసులు గాకను, అతడు అడిగిన బంగారు పోగుల యెత్తు వెయ్యిన్ని ఏడువందల తులముల బంగారము. గిద్యోను దానితో ఒక ఏఫోదును చేయించుకొని తన పట్టణమైన ఒఫ్రాలో దాని ఉంచెను.

26. The weight of the gold rings Gideon asked for was 43 pounds. That didn't include the moon-shaped necklaces the kings of Midian had worn. It didn't include their other necklaces or their purple clothes. And it didn't include the gold chains that had been on the necks of their camels.

27. కావున ఇశ్రాయేలీయులందరు అక్కడికి పోయి దాని ననుసరించి వ్యభిచారులైరి. అది గిద్యోనుకును అతని యింటివారికిని ఉరిగానుండెను.

27. Gideon made an object out of all of the gold. It looked like the linen apron the high priest of Israel wore. He placed it in Ophrah. That was his hometown. All of the people of Israel worshiped it there. They weren't faithful to the Lord. So the gold object became a trap to Gideon and his family.

28. మిద్యానీయులు ఇశ్రాయేలీయుల యెదుట అణపబడి అటుతరువాత తమ తలలను ఎత్తికొనలేకపోయిరి. గిద్యోను దినములలో దేశము నలువది సంవత్సరములు నిమ్మళముగా నుండెను.

28. Israel brought Midian under their control. Midian wasn't able to attack Israel anymore. So the land was at peace for 40 years. The peace lasted as long as Gideon was living.

29. తరువాత యోవాషు కుమారుడైన యెరుబ్బయలు తన యింట నివసించుటకు పోయెను.

29. Jerub-Baal, the son of Joash, went back home to live. Jerub-Baal was another name for Gideon.

30. గిద్యోనుకు అనేక భార్యలున్నందున కడుపున కనిన డెబ్బదిమంది కుమారులు అతని కుండిరి.

30. He had 70 sons of his own. That's because he had a lot of wives.

31. షెకెములోనున్న అతని ఉపపత్నియు అతనికొక కుమారుని కనగా గిద్యోను వానికి అబీమెలెకను పేరు పెట్టెను.

31. And he had a concubine who lived in Shechem. She also had a son by him. Gideon named that son Abimelech.

32. యోవాషు కుమారుడైన గిద్యోను మహా వృద్ధుడై చనిపోయి అబీయెజ్రీయుల ఒఫ్రాలోనున్న తన తండ్రియైన యోవాషు సమాధిలో పాతిపెట్టబడెను.

32. Gideon, the son of Joash, died when he was very old. His body was buried in the tomb of his father Joash in Ophrah. Ophrah was in the territory that belonged to the family line of Abiezer.

33. గిద్యోను చనిపోయిన తరువాత ఇశ్రాయేలీయులు చుట్టునుండు తమ శత్రువులచేతిలోనుండి తమ్మును విడిపించిన తమ దేవుడైన యెహోవాను జ్ఞాపకము చేసికొనక

33. As soon as Gideon had died, the people of Israel joined themselves to the gods that were named after Baal. Israel wasn't faithful to the Lord. They worshiped Baal-Berith as their god.

34. మరల బయలుల ననుసరించి వ్యభిచారులై బయల్బెరీతును తమకు దేవతగా చేసికొనిరి.

34. They forgot what the Lord their God had done for them. He had saved them from the power of their enemies who were all around them.

35. మరియు వారు గిద్యోనను యెరుబ్బయలు ఇశ్రాయేలీయులకు చేసిన ఉపకారమంతయు మరచి అతని యింటివారికి ఉపకారము చేయక పోయిరి.

35. Jerub-Baal had done many good things for the people of Israel. But they weren't kind to his family. Jerub-Baal was another name for Gideon.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Judges - న్యాయాధిపతులు 8 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

గిద్యోను ఎఫ్రాయిమీయులను శాంతింపజేస్తాడు. (1-3) 
దేవుని పేరు మీద ఎలాంటి ప్రయత్నాలైనా చేయడానికి లేదా రిస్క్ తీసుకోవడానికి నిరాకరించే వారు, మరింత ఆవేశపూరితమైన మరియు సాహసోపేతమైన స్ఫూర్తిని ప్రదర్శించే వారితో తరచుగా విమర్శలకు మరియు వాదులకు మొట్టమొదటగా ఉంటారు. అదనంగా, సవాలుతో కూడిన పనులకు దూరంగా ఉండే వారు తమ విజయాలకు గుర్తింపు రాకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేసే అవకాశం ఉంది. అసూయను అధిగమించడానికి వినయం కీలకమని నిరూపిస్తూ, గిడియాన్ నిస్వార్థతకు ఒక అద్భుతమైన నమూనాగా పనిచేస్తాడు. ఎఫ్రాయిమీయుల ఆగ్రహం మరియు అనుచితమైన భాష వారి స్థానం యొక్క బలహీనతను వెల్లడి చేసింది, ఎందుకంటే అలాంటి చిలిపిని ఆశ్రయించడం సరైన తార్కికం లేకపోవడాన్ని సూచిస్తుంది.

సుక్కోత్ మరియు పెనుయేలు గిద్యోను నుండి ఉపశమనం పొందేందుకు నిరాకరించారు. (4-12) 
గిద్యోను మనుష్యులు అలసిపోయారు కానీ నిర్ణయించుకున్నారు; వారి గత ప్రయత్నాల వల్ల అలసిపోయినప్పటికీ, వారి శత్రువులపై తమ ప్రయత్నాన్ని కొనసాగించడానికి ఆసక్తిగా ఉన్నారు. అదేవిధంగా, ఇది తరచుగా ఒక నిజమైన క్రైస్తవుని పరిస్థితిని వివరిస్తుంది: అలసిపోయినట్లు మరియు నిరుత్సాహంగా, ఇంకా పట్టుదలతో ముందుకు సాగడం. నిజమైన విశ్వాసి వారి పాపపు స్వభావానికి వ్యతిరేకంగా చేసే పట్టుదలతో మరియు విజయవంతమైన పోరాటాన్ని ప్రపంచం పూర్తిగా అర్థం చేసుకోకపోవచ్చు. అయినప్పటికీ, విశ్వాసి వారు తమ పోరాటాన్ని ప్రారంభించిన దైవిక శక్తిపై ఆధారపడతారు మరియు ఈ దైవిక సరఫరా ద్వారా మాత్రమే వారు చివరికి జయించగలరని మరియు విజయం సాధించగలరని గుర్తిస్తారు.

సుక్కోత్ మరియు పెనుయెల్ శిక్షించబడ్డారు. (13-17) 
ప్రభువు యొక్క అంకితమైన సేవకులు తరచుగా బహిరంగ శత్రువుల నుండి కపట అనుచరుల నుండి ఎక్కువ ప్రమాదకరమైన వ్యతిరేకతను ఎదుర్కొంటారు. అయితే, వారు ఇశ్రాయేలులో భాగమని చెప్పుకునే వారి ప్రవర్తన గురించి ఆందోళన చెందకూడదు, కానీ మిద్యానీయుల హృదయాన్ని కలిగి ఉన్నారు. బదులుగా, వారు అంతర్గత పోరాటాలు మరియు బాహ్య కష్టాల వల్ల బలహీనంగా భావించినప్పటికీ, వారి ఆత్మల శత్రువులను మరియు దేవుని కారణాన్ని వెంబడించడంలో పట్టుదలతో ఉండాలి. అయినప్పటికీ, తట్టుకునే శక్తిని వారు కనుగొంటారు. ఇతరులు చిన్నపాటి సహాయాన్ని అందించి, వారిని అడ్డుకోవడానికి ప్రయత్నించినప్పుడు, ప్రభువు సహాయం మరింత స్పష్టంగా కనిపిస్తుంది. గిద్యోను హెచ్చరిక వినబడనప్పుడు, తదుపరి శిక్ష న్యాయమైనది. చాలా మంది వ్యక్తులు బాధ యొక్క బాధాకరమైన అనుభవాల ద్వారా మాత్రమే నేర్చుకోవలసి వస్తుంది, దీనిని ముళ్ళు మరియు తిస్టిల్స్‌తో పోల్చవచ్చు.

గిద్యోను తన సహోదరులకు ప్రతీకారం తీర్చుకున్నాడు. (18-21)
మిద్యాను రాజులు వారి లెక్క నుండి తప్పించుకోలేకపోయారు. హత్య చేయడంలో వారి నేరాన్ని అంగీకరించిన గిడియాన్, హత్యకు గురైన వ్యక్తులకు అత్యంత సన్నిహిత బంధువుగా రక్తపు ప్రతీకారం తీర్చుకునే వ్యక్తిగా వ్యవహరించాడు. చాలా సమయం గడిచిన తర్వాత వారు తమ పనులకు పరిణామాలను ఎదుర్కొంటారని వారు ఎప్పుడూ ఊహించలేదు, కానీ ఈ జీవితంలో, హత్య చాలా అరుదుగా శిక్షించబడదు. మానవత్వం చాలాకాలంగా మరచిపోయిన పాపాలు ఇప్పటికీ దేవుని ముందు జవాబుదారీగా ఉంటాయి. ఇతరులతో పోలిస్తే తక్కువ బాధను అనుభవించి, తక్కువ అవమానంతో చనిపోవాలనే ఆశతో మాత్రమే మరణంలో ఓదార్పుని పొందడం నిరుత్సాహపరుస్తుంది. అయినప్పటికీ, చాలా మంది వ్యక్తులు భవిష్యత్తు తీర్పు మరియు దాని పర్యవసానాల గురించి ఆలోచించడం కంటే ఈ ఆందోళనలతోనే ఎక్కువగా నిమగ్నమై ఉన్నారు.

గిద్యోను ప్రభుత్వాన్ని తిరస్కరించాడు, కానీ విగ్రహారాధనకు అవకాశం ఇచ్చాడు. (22-28) 
వారిని పరిపాలించాలనే ప్రజల ప్రతిపాదనను గిడియాన్ తిరస్కరించాడు. నీతిమంతుడైన వ్యక్తి దేవునికి మాత్రమే సంబంధించిన గౌరవాలను స్వీకరించడంలో ఆనందం పొందలేడు. గిడియాన్ అత్యుత్తమ దోపిడి నుండి ఏఫోద్‌ను సృష్టించడం ద్వారా విజయాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నించాడు. అయితే, ఈ ఎఫోడ్‌కు టెరాఫిమ్‌ను జతచేసి ఉండవచ్చు, మరియు గిడియాన్ దానిని సంప్రదింపుల కోసం ఒక ఒరాకిల్‌గా ఉపయోగించాలని భావించి ఉండవచ్చు. దురదృష్టవశాత్తు, మంచి మనిషి యొక్క ఒక తప్పుడు అడుగు చాలా మందిని తప్పుడు మార్గాల్లోకి నడిపిస్తుంది. ఎఫోద్ గిద్యోనుకు ఉచ్చుగా మారింది మరియు చివరికి అతని కుటుంబం పతనానికి కారణమైంది. కళ్లకు కావల్సిన, అహంకారానికి ఆజ్యం పోసే అలంకార వస్తువులు, వాటితో అతిగా అనుబంధంగా మారిన వారికి ఎంత త్వరగా అవమానాన్ని కలిగిస్తాయో ఇది రిమైండర్‌గా పనిచేస్తుంది.

గిద్యోను మరణం, ఇజ్రాయెల్ కృతఘ్నత. (29-35)
గిద్యోను మరణానంతరం, అతని నాయకత్వంలో ఇశ్రాయేలు దేవుని ఆరాధనకు నమ్మకంగా నిలిచిన ప్రజలు, అదుపు లేకుండా పోయారు. పర్యవసానంగా, వారు బాలిమ్‌ను అనుసరించారు మరియు గిద్యోను కుటుంబం పట్ల ఎలాంటి దయను ప్రదర్శించలేదు. దేవుని పట్ల తమకున్న విధేయతను మరచిపోయిన వారు తమ స్నేహితుల పట్ల తమ విధేయతను కూడా మరచిపోవడంలో ఆశ్చర్యం లేదు. అయితే, ప్రభువు పట్ల మనకున్న కృతఘ్నతను గుర్తిస్తూ, మానవజాతి యొక్క సాధారణ కృతజ్ఞతాభావాన్ని గమనిస్తూ, మన నిరాడంబరమైన ప్రయత్నాలకు దయలేని చికిత్స ఎదురైనప్పుడు మనం ఓపికగా ఉండేందుకు ప్రయత్నించాలి. దైవిక ఉదాహరణను అనుసరించి, మనం చెడు ద్వారా జయించబడకూడదు, కానీ మంచితో చెడును అధిగమించడానికి ప్రయత్నించాలి.




Shortcut Links
న్యాయాధిపతులు - Judges : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |